అరటితోట ధ్వంసం కేసులో ముందడుగు
గుంటూరు: గుంటూరు జిల్లాలో అరటి తోట ధ్వంసం కేసులో ముందడుగుపడింది. లింగాయపాలెం వీఆర్వో, వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు వేశారు. లింగాయపాలెంలో రాజధానికి భూమి ఇవ్వలేదని రాజేశ్ అనే రైతు అరటి తోటను అధికారులు ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి కాపుకొచ్చిన ఏడు ఎకరాలను నేలమట్టం చేశారు.|
ఈ క్రమంలో మూడు బోర్లు, డ్రిప్ పైప్ లైన్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ విషయంలో వార్తల్లో విస్తృతంగా ప్రచురితం కావడంతో భిన్నవర్గాల నుంచి ఏపీ సర్కార్ పట్ల ఆగ్రహం పెల్లుబికింది. ఏపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పిదాన్ని సరిదిద్దుకునే చర్యలకు దిగింది. వీఆర్వో, వీఆర్ఏలపై వేటు వేసింది.