lingayapalem
-
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు 12 నుంచి గ్రామసభలు
తాడికొండ: రాజధానిలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలతో అమరావతి మెట్రోపాలిటన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటూ రాజధాని అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని నాన్ పూలింగ్ గ్రామాల ప్రజలు తమను కూడా మున్సిపాలిటీలో చేర్చాలని కోరిన నేపథ్యంలో ఆయా గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా తుళ్ళూరు మండలంలోని పూలింగ్‌కు భూములిచ్చిన 16 గ్రామాలతో పాటు నాన్ పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను కలుపుతూ 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా శుక్రవారం గ్రామసభల షెడ్యూల్ ప్రకటించారు. ఈ గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, వివరణలు సేకరించి తీర్మానం చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. తుళ్ళూరు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం ఈవోఆర్డీ సత్యకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామసభల షెడ్యూల్ 12వ తేదీ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13వ తేదీ దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14వ తేదీ వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15వ తేదీ నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి, 16వ తేదీ మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17వ తేదీ శాఖమూరు, నేలపాడు, తుళ్ళూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలకు హాజరై వారి అభిప్రాయాలను తెలపాలని ఎంపీడీవో కోరారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం 712వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 712వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహర దీక్షల్లో శుక్రవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులను మోసగించి మూడుపంటలు పండే 33 వేల ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్న చంద్రబాబు వారికి ఏం న్యాయం చేశాడో చెప్పాలన్నారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేత అనితకు బ్యాంకు నోటీసులు) రాష్ట్రంలోని 5 కోట్లమంది ప్రజల సంపదను ఒక ప్రాంతంలోనే కుమ్మరిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహా నగరాల సరసన అమరావతిని చేరుస్తానంటూ మోసపూరిత హామీలతో చంద్రబాబు 29 గ్రామాల రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించి భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
విడాకులిస్తావా? నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో పెట్టాలా?
సాక్షి, నగరంపాలెం: రెండు వేర్వేరు సంఘటనలు.. రెండింటిలోనూ ఆడ పిల్లలు పుట్టారనే ఒక్క కారణంతో భార్యలను వేధిస్తున్నారు భర్తలు. దీంతో బాధిత మహిళలు ఎస్పీ గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామానికి చెందిన జి.అన్నారావుతో అదే గ్రామానికి చెందిన సౌజన్యకు 2008లో వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. పెళ్లైన దగ్గర నుంచి అనుమానంతో భర్త వేధింపులకు గురిచేసేవాడని, చెడు వ్యసనాలకు బానిసయ్యాడని భార్య తెలిపింది. వారసుడిగా మగ పిల్లాడు కావాలని విడాకులిస్తే మరో వివాహం చేసుకుంటానని భర్త వేధించేవాడని వాపోయింది. పుట్టింటికి వెళ్లి రూ.5 లక్షలు తేవాలని లేదంటే ఇంట్లో వద్దని తరిమివేశాడని తెలిపింది. ఇంటర్నెట్లో వీడియోలు పెడతానని మరో కేసులో విడాకులు ఇవ్వకపోతే నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో పెడతానని తన భర్త వేధింపులకు గురిచేస్తున్నట్లు భార్య పేర్కొంది. ఆమె మాటల్లో.. గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తితో ప్రకాశం జిల్లాకు చెందిన తనకు 2016లో వివాహమైంది. కట్నం కింద లక్ష రూపాయలు, 5 సవర్ల బంగారం, సామాన్లు, రూ.10 లక్షలు ఖరీదు చేసే ఇంటి స్థలం రాసిచ్చాము. తమకు పాప పుట్టిన దగ్గర నుంచి భర్త, అత్త, మామ, ఆడపడుచుల నుంచి అదనపు కట్నం తేవాలని వేధింపులు చేస్తున్నారు. దీనిపై 2018లో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా 2019లో భరణం కేసు వేయగా అది పెండింగ్‌లో ఉంది. నా భర్త కొద్ది రోజులుగా సమీప బంధువుకి ఫోన్ చేసి నా ఫోన్ ట్యాప్ చేసి రికార్డు చేసినట్లు, వాటిల్లో కొన్నింటిని వాట్సాప్ సందేశాలు పంపుతున్నట్లు ఆమె తెలిపిందని బాధిత భార్య పేర్కొంది. గతంలో తాను స్నానం చేస్తుండగా భర్త రహస్యంగా ఫొటోలు, వీడియో తీశాడని ఆమె చెప్పినట్లు బాధితురాలు పేర్కొంది. భర్తకి విడాకులు ఇవ్వకపోతే నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తెలిసిన వ్యక్తుల సహయంతో రెండు సెల్ కంపెనీల ప్రతినిధుల సహాయంతో ఫోన్ ట్యాప్ చేసినట్లు తెలిసిందని పేర్కొంది. భర్తపై, అతనికి సహకరించిన ఆడపడుచు, సెల్ కంపెనీల ప్రతినిధులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె కోరింది. (రూ. 250 భోజనం ఆర్డర్.. 50 వేలు మాయం) -
లంకలోకి రావొద్దు
► సర్వే చేయటానికి మేం ఒప్పుకోం ► అధికారులపై రాజధాని రైతుల ఆగ్రహం ► సర్వే అధికారులను అడ్డుకున్న కర్షకులు ► వచ్చిన దారినే వెనుదిరిగిన అధికారులు సాక్షి, అమరావతి బ్యూరో : ‘లంకలోకి ఎన్ని పర్యాయాలు వస్తారు. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. ఇకపై లంకలోకి రావొద్దు. అందరితో సమానంగా ప్యాకేజీ ఇచ్చేలా ఉంటే రండి. ఈ లోపు లంకలో అడుగుపెడితే ఒప్పుకునేది లేదు’ అంటూ ఉద్దండ్రాయునిపాలెం రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. లింగాయపాలెం పంచాయతీ పరిధిలో లంక భూముల వద్ద కాపురం ఉంటున్న నివాసాల వివరాలు సేకరించేందుకు సోమవారం తుళ్లూరు తహసీల్దార్ సుధీర్‌బాబు, ముగ్గురు సర్వేయర్లు ఉద్దండ్రాయునిపాలెంకు చేరుకున్నారు. విషయం తెలుసుక్ను స్థానికులు వారిని అడ్డుకున్నారు. ‘ఎందుకొచ్చారు? ఇప్పటికి ఎన్ని పర్యాయాలు వచ్చి సర్వే చేసి ఉంటారు. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. లంకలో సర్వే చేయటానికి వీల్లేదు. అందరితో సమాన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం నుంచి గట్టి హామీ ఇస్తేనే లోనికి వెళ్లండి. లేకపోతే వచ్చిన దారినే వెళ్లిపోండి’ అంటూ ఎదురు తిరిగారు. అంటరానివారిలా చూస్తున్నారు..: ప్రజా రాజధాని అని చెప్పి దళితులకు చోటు లేకుండా చేయటం మంచిదేనా? అని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం లంక రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రైతుల నివాసాలకు వెళ్లి బతిమలాడారని గుర్తుచేశారు. అయితే లంక రైతులను అంటరాని వారిలా చూస్తున్నారని మండిపడ్డారు. లంకలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిపట్లా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నివాసాలకు మాత్రమే పరిహారం ఇచ్చి... చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని లెక్కలోకి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సమాన ప్యాకేజీ ఇవ్వొద్దని ఏ చట్టం చెప్పింది: దళిత రైతులకు సమాన ప్యాకేజీ ఇవ్వకూడదని ఏ చట్టం చెప్పిందని తహసీల్దార్ సుధీర్‌బాబును రైతులు నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు భూములు ఇచ్చిన వారంతా కన్నీరుపెడుతున్నారని గుర్తుచేశారు. గజం స్థలం ఇస్తే పరిహారం కింద గజం ఇస్తామని హామీ ఇచ్చి... అవసరం తీరాక మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. లంక భూముల రైతులకు సమాన ప్యాకేజీ ఇచ్చేవరకు సర్వే చేయటానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పటంతో తహసీల్దార్, సర్వేయర్లు వచ్చినదారినే వెనుదిరిగి వెళ్లిపోయారు. -
జనపథం - లింగాయపాలెం
-
వైఎస్ జగన్ వస్తున్నారని...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించేందుకు వస్తున్నారని తెలియగానే రాష్ట్ర మంత్రులు హుటాహుటిన అక్కడ వాలిపోయారు. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం లింగాయపాలెంలో స్థానికులతో భేటీ అయ్యారు. తమ సమస్యలు తీర్చాలని ఈ సందర్భంగా గ్రామస్తులు పట్టుబట్టారు. సమయం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు మంత్రులు ప్రయత్నించగా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి తమను మభ్యపెట్టేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని విధంగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మంత్రులు కంగారుపడ్డారు. కాగా, ఈ నెల 19న సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. బలవంతపు భూసేకరణ వల్ల భూములను కోల్పోతున్న రైతులకు అండగా నిలవడానికి జగన్ అక్కడ పర్యటిస్తారని వివరించారు. బాధిత రైతాంగంతో ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు. -
జగన్ ‘రాజధాని’ పర్యటనపై రాజకీయం
-
ఊళ్లు... కన్నీళ్లు
తొలి పొద్దు పొడవక ముందే తూరుపు దిక్కుని నిద్రలేపే గిత్తల గిట్టల చప్పుళ్లు.. రణగొణ ధ్వనుల చేసే యంత్రాల శబ్దాల్లో కలిసిపోబోతున్నాయి...పల్లెకు పచ్చని చీరకట్టి ప్రతి వాకిట సిరులు కురిపించే పంట పొలాలు.. కార్పొరేట్ ఉక్కు పాదాల కింద నలిగిపోబోతున్నాయి.. ఇరుగు పొరుగు ఆప్యాయపలకరింపులు, అనుబంధాలు.. పెట్టుబడిదారీ విధాన రాబంధుల రెక్కల కింద ముక్కలు కాబోతున్నాయి..అమ్మ ఒడి లాంటి కమ్మనైన సొంత ఊరి మట్టి వాసనలు.. ఫ్యాక్టరీల పొగ గొట్టాల కాలుష్య భూతంతో కలుషితం కాబోతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల నోట్లో మట్టి కొట్టి.. అక్కడి ప్రజల జీవనాన్ని ఫ్యాక్టరీల పునాదుల్లో సమాధి చేయబోతున్నాయి. సాక్షి, అమరావతి/ తుళ్లూరు రూరల్: ప్రభుత్వం కన్నతల్లి లాంటి ఊరును దూరం చేస్తోంది. తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలు త్వరలోనే కనుమరుగు కానున్నాయి. అభివృద్ధి పేరుతో పచ్చని పల్లెలను నేలమట్టం చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. విషయం తెలుసుకున్న గ్రామాల ప్రజలు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం స్టార్టప్ ఏరియాలను గుర్తించింది. కృష్ణానది ఒడ్డు నుంచి లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం పరిసర ప్రాంతాలను మూడు ఉమ్మడి ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. రెండు గ్రామాలతోపాటు ఆ ప్రాంతంలోని ఆలయాలు, ప్రార్థన మందిరాలు, చెట్లు మొత్తం 1,691 ఎకరాల విస్తీర్ణాన్ని చదునుచేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని సంకల్పిం చింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మొన్న భూములు.. నేడు నివాసాలు రాజధాని వస్తే భూముల ధరలు పెరిగి బతుకులు బాగుపడుతాయని భావించిన గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. బహుళ పంటలు పండే భూములను సమీకరణ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా వివిధ కంపెనీలు వస్తే బాగుపడుతారని పొంతనలేని హామీలు ఇచ్చి ఈ రెండు గ్రామాల్లో 3,035.32 ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుంది. పది మందికి అన్నంపెట్టే రైతుకు భూములను దూరం చేసింది. అంతటితో ఆగని ప్రభుత్వం ఏకంగా ‘గూడు’ ను కూడా కూల్చేందుకు సిద్ధమవుతోంది. ఏళ్ల క్రితం పూర్వీకులు నిర్మించిన గ్రామాన్ని, అందులోని 792 నివాసాలను కూలదోయడానికి నిర్ణయించింది. ఇప్పటికే పనుల్లేక స్థానికులు చాలా మంది వలసబాట పట్టారు. సొంత ఊరిని నమ్ముకుని కాలం బతుకుతున్న ప్రజలను ఊరికి దూరంగా పంపేయనుంది. ఊరిని వదులుకోలేక పల్లెవాసులు మౌనంగా రోదిస్తున్నారు. అవసరమైతే ఆయుధంగా మారి పోరాటం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. -
ఆ రెండూళ్లు ఇక ఉండవు
సాక్షి, అమరావతి: తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని నిర్మాణాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 29 గ్రామాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూ సమీకరణ పేరుతో 22వేల మంది రైతుల నుంచి ఇప్పటికే 33వేల ఎకరాలను లాక్కుంది. అమరావతి సీడ్ కేపిటల్లో స్టార్టప్ అభివృద్ధి చేసేందుకు తుళ్లూరు మండల పరిధిలోని 1,691 ఎకరాలను మూడు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించి నమూనాను సీఆర్డీఏ ఇటీవల విడుదలచేసింది. ఈ 1,691 ఎకరాలను పూర్తిగా చదునుచేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలి. అందులో ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాలు 45 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. రెండు గ్రామాల్లో మొత్తం జనాభా 3,057 కాగా, 792 నివాసాల్లో 850 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంకా 6 హిందూ దేవాలయాలు, 7 ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నింటినీ కూల్చేసి, చదునుచేసి ఏడీపీ, జీవీసీ,సీసీడీఎంసీఎల్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో రాజధానిని ప్రకటించటంతో గ్రామస్తులు కొందరు పాత నివాసాలను పడగొట్టి రూ.లక్షల రూపాయలు వెచ్చించి కొత్త భవనాలను నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు తమ రెండు గ్రామాలను స్టార్టప్ ఏరియాలో చేర్చారని తెలుసుకున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. -
నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు!
రాజధానికి భూములివ్వలేదని అరటి తోట ధ్వంసం విచారణ జరిపి.. పరిహారమిస్తాం రెండు నెలల తర్వాత బాధితులకు సీఆర్డీఏ లేఖ సాక్షి, హైదరాబాద్: నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు! అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారం. రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతుల పంటను ధ్వంసం చేసిన రెండు నెలల తర్వాత విచారణ జరుపుతామనడం విస్మయం కలిగిస్తోంది. రాజధాని అమరావతిలో భూ సమీకరణకు సహకరించని లింగాయపాలెం వాసులు గుండపు రాజేష్, ఆయన సోదరుడు గుండపు చంద్రశేఖర్‌కు చెందిన 7.3 ఎకరాల అరటి తోటను 2015 డిసెంబర్ 8న సీఆర్డీఏ యూనిట్-16 డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పర్యవేక్షణలో మూడు బుల్డోజర్లతో తొలగించిన విషయం తెలిసిందే. భూ సమీకరణకు అంగీకరించబోమని, పొలాన్ని సాగు చేసుకుంటామని రాజేష్ సోదరులు తేల్చిచెప్పడం వల్లే ప్రభుత్వం వారి అరటి తోటను నాశనం చేసిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పంటను నాశనం చేయడాన్ని రాజేష్ సోదరులు ప్రశ్నిస్తే.. నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో పరిహారం అందుతుందని రాజేష్ సోదరులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పంట ధ్వంసమైన పొలాన్ని అధికారుల బృందం తనిఖీ చేస్తుందని, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడానికి విచారణ చేపడుతుందని పేర్కొంటూ బాధితులకు సీఆర్డీఏ తాజాగా లేఖ రాసింది. అధికారుల బృందం ఫిబ్రవరి 9న పొలాన్ని సందర్శించనుందని పేర్కొంది. రాజేష్ సోదరుల భూమిలో తొలగించిన అరటి చెట్లు ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి. అక్కడ అరటి తోట ఉందనే ఆనవాళ్లు కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రెండు నెలల తర్వాత వస్తే నష్టపరిహారం ఎలా నిర్ణయిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, పరిహారం చెల్లించడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ వ్యవహారమే నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
లింగాయపాలెం రైతుకు వైఎస్ఆర్ సీపీ నేతల భరోసా
గుంటూరు: రాజధాని ప్రాంతంలో భూములివ్వని వారిపై ప్రభుత్వ దాష్టికానికి పరాకాష్ఠగా నిలిచిన.. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో సీఆర్డీఏ అధికారులు ధ్వంసం చేసిన అరటితోటను శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు. బాధితుడు రైతు రాజేష్‌కు వైఎస్ఆర్ సీపీ నేతలు భరోసా ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్‌లో భూమి ఇవ్వనందుకు గూడ రాజేష్ అనే రైతుకు చెందిన ఏడెకరాల అరటి తోటను అధికారులు రాత్రికి రాత్రే దున్ని జేసీబీలతో చదును చేయించారు. అధికారుల చర్యపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
అరటితోట ధ్వంసం కేసులో ముందడుగు
-
అరటితోట ధ్వంసం కేసులో ముందడుగు
గుంటూరు: గుంటూరు జిల్లాలో అరటి తోట ధ్వంసం కేసులో ముందడుగుపడింది. లింగాయపాలెం వీఆర్వో, వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు వేశారు. లింగాయపాలెంలో రాజధానికి భూమి ఇవ్వలేదని రాజేశ్ అనే రైతు అరటి తోటను అధికారులు ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి కాపుకొచ్చిన ఏడు ఎకరాలను నేలమట్టం చేశారు.| ఈ క్రమంలో మూడు బోర్లు, డ్రిప్ పైప్ లైన్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ విషయంలో వార్తల్లో విస్తృతంగా ప్రచురితం కావడంతో భిన్నవర్గాల నుంచి ఏపీ సర్కార్ పట్ల ఆగ్రహం పెల్లుబికింది. ఏపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పిదాన్ని సరిదిద్దుకునే చర్యలకు దిగింది. వీఆర్వో, వీఆర్ఏలపై వేటు వేసింది. -
40 అంతస్తుల్లో ఏపీ సచివాలయం!
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే ఏపీ సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాలకు మధ్యలో తూర్పు అభిముఖంగా ఏపీ సచివాలయాన్ని నిర్మించాలనుకుంటోంది. ఇక్కడ నిర్మించనున్న రెండు ఐకానిక్ భవనాల్లో ఒక భవనంలో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చుట్టూ రోడ్లు, గ్రీనరీ, విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఉండేలా 40 అంతస్తుల్లో ఈ భవనం ఉండాలని సీఎం ఇప్పటికే అధికారులకు చెప్పారు. ఇదిలాఉండగా ఈ భవనంలో ఒక్కో అంతస్తులో ఐదుగురేసి మంత్రుల చాంబర్లు, ఆయా శాఖల కార్యదర్శుల కార్యాలయాలు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి చివరి అంతస్తులో మాత్రం సీఎం పేషీ, భారీ కాన్పరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులు భావిస్తున్నారు. ఒక్కో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటే అధిక మొత్తంలో కార్యాలయాలను నిర్వహించుకునే వీలుంటుం దని అధికారులు చెబుతున్నారు.అధికారులు, మంత్రులకు ఒకే ఫ్లోర్ ఉండటం వల్ల పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందని ఆశిస్తున్నారు. కాగా, ఈ 40 అంతస్తుల ఆకాశహార్మ్యం కోసం మొత్తం రూ.3 వేల కోట్లకు పైగానే ఖర్చయ్యే అవకాశముందని, ఈ నిధులను కేంద్రం నుంచి రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరిగే రాజధాని అమరావతి నిర్మాణ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదం తీసుకున్న తర్వాత స్ట్రక్చరల్ కన్సల్టెన్సీని పిలిచి డి జైన్లు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిధులు చేతికందితే వచ్చే జూన్ నుంచి పనులు మొదలుపెట్టే అవకాశం ఉందంటున్నారు. -
స్పష్టత లేకుండా భూములివ్వం
-
స్పష్టత లేకుండా భూములివ్వం
* లింగాయపాలెంలో టీడీపీ నేతల్ని నిలదీసిన రైతులు * రాజధాని ఎక్కడ? ఎలా? ఏం నిర్మిస్తారు? * ఎంత భూమి? ఎలాంటి ది కావాలి? * తుళ్లూరు మండలంలోనే ఎందుకు? * మెట్ట భూముల్ని వదిలి ఏడాదికి 3 పంటలు పండే భూములు ఎందుకు తీసుకుంటున్నారు? * కౌలు రైతులు, రైతు కూలీలకు ప్యాకేజీలేవీ? * ల్యాండ్ పూలింగ్ ఎలా నమ్మాలి? * చట్టబద్ధమైన జీవోలతో రావాలని డిమాండ్ తుళ్లూరు: ప్రభుత్వానికే స్పష్టత లేకుంటే రైతులనుంచి రాజధానికోసం భూములు ఎలా తీసుకుంటారని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం రైతులు తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీశారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ నేతృత్వంలోని మంత్రివర్గ ప్రతినిధి కమిటీ గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా లింగాయపాలెంలో రైతులు తమ అభిప్రాయాలను కమిటీ ముందు ఉంచారు. రైతు అనుమోలు గాంధీ మాట్లాడుతూ... రాజధాని ఎక్కడ నిర్మిస్తారు? ఎలా నిర్మిస్తారు? ఏమేం నిర్మిస్తారు? వాటికి ఎంత భూమి కావాలి? ఎలాంటి భూమి కావాలి? తుళ్ళూరు మండలంలోనే ఎందుకు రాజధాని నిర్మించే ప్రతిపాదనలు చేస్తున్నారు? ఆనే ప్రశ్నల వర్షం గుప్పించారు. ఓవైపు అధికారులను, రైతులను, ల్యాండ్ పూలింగ్‌కు సన్నద్ధం చేస్తూ మరోవైపు రాజధాని నిర్మాణం కోసం నమూనాలు పరిశీలించేందుకు సీఎం సింగపూర్, మలేసియా పర్యటనలు చేస్తున్నారంటే ఇంతవరకు ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదనే విషయం అర్థమవుతోందన్నారు. చట్టబద్ధతలేని ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రైతులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వ్యవసాయకూలీలకు ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్యాకేజీలు కానీ, ప్రతిపాదనలు గానీ చేయలేదని ఆక్షేపించారు. చట్టబద్ధమైన జీవోలతో రైతుల వద్దకు రావాలని డిమాండ్ చేశారు. మరో రైతు మాదల భువనేశ్వరరావు మాట్లాడుతూ మెట్టప్రాంతంలో వేలాది ఎకరాల భూములు వుంటే ఏడాది మూడు పంటలు పండే భూములు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. కౌలు రైతు మోతుకూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సభకు వచ్చిన 500 మందిలో 50 మందికి మాత్రమే భూములు వున్నాయని మిగిలినవారంతా వ్యవసాయ కూలీలని చెప్పారు. ఈ భూములు లేకుంటే వారు ఏమైపోవాలని ప్రశ్నించారు. అనంతరం ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రైతుల అభిప్రాయాలు సీఎంకు వివరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 18, 19 తేదీలలో రైతులతో సమావేశ పరుస్తామని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అనంతరం వెలగపూడిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా సూరాయపాలెం, గొల్లపూడి మధ్య నుంచి తుళ్లూరు మండలంలోని వెంకటపాలెం వరకూ వేగంగా వంతెన నిర్మిస్తామని తెలిపారు. రూ.20 వేల కోట్లతో బందరు పోర్టును అభివృద్ధి చేయడంతో పాటు కంటైనర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తామని వివరించారు.