వైఎస్ జగన్ వస్తున్నారని...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించేందుకు వస్తున్నారని తెలియగానే రాష్ట్ర మంత్రులు హుటాహుటిన అక్కడ వాలిపోయారు. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం లింగాయపాలెంలో స్థానికులతో భేటీ అయ్యారు.
తమ సమస్యలు తీర్చాలని ఈ సందర్భంగా గ్రామస్తులు పట్టుబట్టారు. సమయం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు మంత్రులు ప్రయత్నించగా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి తమను మభ్యపెట్టేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని విధంగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మంత్రులు కంగారుపడ్డారు.
కాగా, ఈ నెల 19న సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. బలవంతపు భూసేకరణ వల్ల భూములను కోల్పోతున్న రైతులకు అండగా నిలవడానికి జగన్ అక్కడ పర్యటిస్తారని వివరించారు. బాధిత రైతాంగంతో ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు.