Minister Narayana
-
కలెక్టర్ గారూ.. మీకిది తగునా!
ఈ ఫొటోలో మంత్రి నారాయణ పక్కన ఉన్నది వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి. ఆయన గతంలో ప్రైవేట్ విద్యాసంస్థకు అధిపతిగా ఉండేవారు. తర్వాత విద్యాసంస్థను వదిలేసి నారాయణకు ఆప్తుడయ్యారు. ఆ క్రమంలోనే 2024 ఎన్నికల్లో పలుచోట్ల బహిరంగ సభల్లో నారాయణతో పాల్గొన్నారు. ఫొటోలు దిగారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో మాట్లాడి ఒకచోట సభను పెట్టించారు. ఈ క్రమంలో తనకున్న అనుభవంతో ప్రైవేటు విద్యాసంస్థల వారిని నారాయణకు ఓటు వేసేలా కృషి చేశారు. నారాయణ గెలుపు కోసం వాకాటి విజయకుమార్‌రెడ్డి పాంప్లెట్స్ వేయించారు. వాటిలో తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను ప్రింట్ చేయించారు. ఆయన గెలుపు కోసం బహిరంగంగా పని చేశారు. నా విజయానికి నీవు సహకరిస్తే.. నీకు రెడ్‌క్రాస్ చైర్మన్ పదవి కట్టబెడతా.. ఇలా ముందస్తుగా అనుకున్న పథకం ప్రకారమే పదవి వాకాటి విజయకుమార్‌రెడ్డిని వరించిందా అంటే అవుననే విశ్లేషకులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలని ప్రత్యక్ష రాజకీయాలు చేసిన వాకాటికి కలెక్టర్ ఆనంద్ రెడ్‌క్రాస్ ఎన్నికల్లో సహకారమందించారనేది నగ్నసత్యం. మంత్రి నారాయణ ఒత్తిడి పెట్టినంత మాత్రాన కలెక్టర్ ఒక పార్టీకి కొమ్ము కాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెడ్‌క్రాస్ అంటే సేవ చేసే సంస్థ అని ఇందులో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వారు ఉండకూడదని నిబంధనల పేరిట కలెక్టర్ ఆనంద్ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేకర్రెడ్డితో పాటు మరో నలుగురు ఎంసీ మెంబర్లకు నోటీçసులు ఇచ్చారు. వారు అందుకు తగిన వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ సంతృప్తి చెందని కలెక్టర్ రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వైఎస్సార్సీపీకి అనుకూలురంటూ ముద్రవేసి మిగతా మేనేజింగ్ కమిటీ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, మలిరెడ్డి కోటారెడ్డి, నేతాజి సుబ్బారెడ్డి తదితరులను తొలగించడమే కాకుండా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేశారు. అయితే కోర్టుకెళ్లి తిరిగి విజయాన్ని సాధించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరులు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పటికీ రెడ్‌క్రాస్ సభ్యులుగా కొనసాగుతున్నప్పటికీ వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయలేదు. చట్టబద్ధంగా గెలిచినా.. రెడ్‌క్రాస్‌లో ఉన్న 8వేల ఓట్లలో 6వేల ఓట్లు సాధించి రెడ్‌క్రాస్ చైర్మన్, ఎంసీ పదవులు దక్కించుకున్నప్పటికీ కలెక్టర్ ఆనంద్ వారిని తొలగించారు. మంత్రి అనుచరుడిగా ఉన్న వాకాటి విజయకుమార్‌రెడ్డిని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు సహకరించారు. మరి మంత్రి నారాయణతో ఫొటోలు దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, వ్యక్తిగత నంబర్ కూడా పాంప్లెట్స్‌లో ఇచ్చిన వాకాటి విజయకుమార్‌రెడ్డి మాత్రం కలెక్టర్‌కు ఎలా రాజకీయేతరుడుగా కనిపించారో తెలియడం లేదు. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. అధికారులు ఎక్కడికెళ్లినా శాశ్వతం. మరి అలాంటి అధికారులు ఒత్తిడికి తలొగ్గితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం సందేహమే. -
కూటమిలో కలకలం పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన మంత్రి నారాయణ..
-
నెల్లూరులో మంత్రి నారాయణ అనుచరుల బరితెగింపు
-
మంత్రి నారాయణకు తీవ్ర అవమానం
జిల్లాలో ఇసుక ఓపెన్ రీచ్‌ల టెండర్ల వ్యవహారం ఇద్దరు మంత్రుల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరతీసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా లాటరీ విధానంలో పారదర్శకంగా ఇసుక రీచ్‌లు కేటాయించాలని మంత్రి నారాయణ ఇచ్చిన ఆదేశాలను మరో మంత్రి ఆనం తిప్పికొట్టారు. తన ఇలాకాలో ఉండే ఇసుక రీచ్‌లపై నారాయణ పెత్తనం ఏమిటన్నట్లుగా కన్నెర్ర చేశారు. బరితెగించి బాహాటంగానే కాంట్రాక్టర్‌ను, కలెక్టర్‌ను బెదిరించిన ఆనం.. ఏకంగా సహచర మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన ఆధిపత్యంతో రీచ్‌ల కేటాయింపునే రద్దు చేయించారు. నామినేషన్ పద్ధతిలో తన అనుచరులకు కట్టబెట్టించుకున్నారు. మంత్రి నారాయణను చెల్లని నాణెం చేశారు.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య ఇసుక తుఫాన్ పెను దుమారం రేపుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నంబర్ టు మంత్రిగా చెలామణి అవుతున్న నారాయణ ఆదేశాలకే దిక్కులేకుండా పోయింది. మరో మంత్రి ఆనం కింగ్ మేకర్‌గా చక్రం తిప్పే స్థాయిలో వ్యవహరిస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో జరిగిన పరిణామాలు ఇద్దరు మంత్రుల మధ్య అగాధాన్ని సృష్టించాయి. ఇసుక టెండర్ల వ్యవహారంలో మంత్రి ఆనం తన పంతం నెగ్గించుకోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన కోటరీలో చేరిపోయారు. ఈ వ్యవహారం కలెక్టర్ ఆనంద్‌కు తలనొప్పిగా మారింది. రీచ్‌లను పంచుకునేందుకు.. జిల్లాలోని పెన్నానదిలో నాలుగు చోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరులో ఓపెన్ రీచ్‌ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల 6న టెండర్లను ఆహా్వనించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి టీడీపీ నేతలకే కట్టబెట్టేందుకు మంత్రి ఆనంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు. చివరి తేదీ వరకు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరు రోజు 16వ తేదీన ఆయా రీచ్‌లకు టీడీపీ నేతలతో పాటు బయట వ్యక్తులు మొత్తంగా 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. 69 శాతం లెస్తో తమ్ముళ్ల టెండర్లు నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90 నుంచి రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లించేది. అంతకంటే తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాకు ప్రోత్సహించినట్లే అవుతుందని భావించిన కలెక్టర్ ఆనంద్ టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించి టెండర్లు ఆహా్వనించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం రీచ్‌ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా 69 శాతం లెస్తో కేవలం రూ.36 మాత్రమే కోట్ చేశారు. టీడీపీ నేతలు లోకాస్ట్‌లో టెండర్లు వేయడంతో వారికి కేటాయిస్తే అక్రమాలకు ఆస్కారం ఉంటుందని భావించిన కలెక్టర్ ఆనంద్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్లతో సమావేశమైన మంత్రి నారాయణ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా చేయాలంటే లాటరీ విధానం ఉత్తమమని భావించి ఆ ప్రకారమే కేటాయించమని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్‌లకు అనుమతులు కేటాయించారు. ఒక్కో రీచ్‌కు ముగ్గురిని ఎంపిక చేసి ప్రథమ స్థానంలో ఉన్న వారికి రీచ్‌ను కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు. నారాయణ ఆదేశాలు 48 గంటల్లోనే రద్దు టీడీపీ ప్రభుత్వంలో నంబర్ టుగా చెలామణి అవుతున్న మంత్రి నారాయణ ఆదేశాలు 48 గంటల్లోనే రద్దు చేయించి.. తన ఆదేశాలు అమలు జరిగేలా మరో మంత్రి ఆనం చక్రం తిప్పారు. మంత్రి నారాయణ ఎవరు.. అంటూ కలెక్టర్‌పై అగ్గిమీద గుగ్గిలం కావడంతో పాటు టెండర్ల వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సీఎం కార్యాలయంలో పంచాయితీ పెట్టి లాటరీ ద్వారా చేసిన కేటాయింపులను రద్దు చేయించారు. మంత్రి నారాయణకు తీవ్ర అవమానం ఇసుక టెండర్ల వ్యవహారంలో మంత్రి నారాయణకు అవమానం జరిగిందని ఆ పారీ్టలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. టీడీపీకి ఆర్థికంగా వెన్నుముకలాంటి నారాయణ ఆదేశాలకు దిక్కేలేకుండా పోయిందని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి నారాయణ తీసుకున్న పారదర్శక నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత అడ్డుకోవడం అంటే ఆయన్ను అవమానించినట్లేనని ఆ పార్టీలోని సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కలెక్టర్ సైతం మంత్రి నారాయణ ఆదేశాలను పక్కన పెట్టడంతో జిల్లా యంత్రాంగంలో కూడా చెల్లని నాణెం అయ్యారనే చర్చ నడుస్తోంది. నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారుఇసుకను ఓపెన్ రీచ్‌లను ఓ పథకం ప్రకారం మంత్రి ఆనంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. తమ అనుచరులకు నామినేషన్ పద్ధతిలో ఒక్కొక్కరికి 5 వేల టన్నుల తవ్వేందుకు తాత్కాలిక అనుమతులు ఇప్పించేశారు. ఆదివారం నుంచి బహిరంగంగానే ఇసుక దోపిడీకి జిల్లా అధికార యంత్రాంగం గేట్లు ఎత్తి రాచబాట వేశారు. -
టీడీపీ మంత్రిపై నారాయణ స్వామి ఆగ్రహం
-
మంత్రి మద్యం టెండర్.. బట్టబయలైన మంత్రి నారాయణ ఆడియో
-
ఇదండీ ‘బాబు సర్కార్’ డొల్లతనం.. నారాయణను నిలదీసిన జనం
సాక్షి, విజయవాడ: ప్రచారార్భాటమే తప్ప.. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అసంపూర్తిగా సాగుతున్నాయి. వరదలు సంభవించి 15 రోజులైనా రోజులైనా వరద కష్టాలు వీడటంలేదు. నిన్న రాత్రి(శనివారం) కండ్రిగ సాయిబాబానగర్‌లో మంత్రి నారాయణ పర్యటనలో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. మంత్రి నారాయణను వరద బాధితులు నిలదీశారు. తమకు కనీసం మంచినీరు కూడా అందడం లేదని మండిపడ్డారు. ఎక్కడ చెత్త అక్కడే వదిలేశారని ప్రజలు నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోయిన మంత్రి నారాయణ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, సింగ్‌నగర్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సంబంధిత వార్త: మానని గాయం.. తీరని నష్టంబుడమేరు వరదకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. అందుకూ పనికిరాని వస్తువులను బాధితులు రోడ్లపై పడేస్తున్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది.బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్నారు. పాడైపోయిన విలువైన సామాగ్రితో వీధులన్నీ నిండిపోయాయి. డాబాలపైనే బాధితులు బతుకీడుస్తున్నారు. పేరుకున్న చెత్త, మురుగుతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎమ్మెల్యేలు, అధికారులు ఏమైపోయారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వికటించిన ‘నారాయణ’ మంత్రం..?
సాక్షి, విశాఖ సిటీ: జీవీఎంసీకి వచ్చిన ప్రతిసారీ మున్సిపల్ స్కూల్స్‌లో నారాయణ మెటీరియల్‌తో విద్యార్థులను చదివిస్తున్నాం.. ఈ సారి శతశాతం ఫలితాలు వస్తాయని ఊదరగొట్టిన మంత్రి నారాయణ.. ఉన్న పరువు తీసేశారు. గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు కనబరిచిన జీవీఎంసీ హైస్కూల్స్‌పై మంత్రి కార్పొరేట్ రుద్దుడు ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించేసింది. కార్పొరేషన్ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పోలిస్తే జీవీఎంసీ పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది 10 పాయింట్లు సాధించారు. ఈ సారి 100 మంది విద్యార్థులకు 10కి 10 పాయింట్లు సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యచరణను రూపొందించుకుంది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రంగ ప్రవేశం చేసి మొత్తం వ్యవస్థను మార్చేశారు. ‘మా నారాయణ స్కూల్లో కరిక్యులమ్ భిన్నంగా ఉంటుంది. దాన్ని చదివితే విద్యార్థులకు 10కి 10 పాయింట్లు గ్యారెంటీ..’ అంటూ.. ఎప్పటికప్పుడు జీవీఎంసీలో సమీక్షలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేవారు. మంత్రి ఆదేశాల్ని పాటించిన విద్యాశాఖాధికారులు దాదాపు నారాయణ స్టడీ మెటీరియల్‌నే పేరు మార్చి మున్సిల్ స్కూళ్ల విద్యార్థులతో బట్టీ పట్టించారు. 100 శాతం ఫలితాలు మాట అటుంచితే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గతేడాదితో పోలిస్తే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం తగ్గడంతో జీవీఎంసీ విద్యాశాఖ ఊపిరి పీల్చుకుంది. ఉత్తీర్ణతతో పాటు 10 పాయింట్లూ తగ్గాయి మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 27 హైస్కూల్స్ ఉన్నాయి. ఇందులో 1907 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి చదవగా.. 1903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 868 మంది బాలురు, 1035 మంది బాలికలున్నారు. వీరిలో 91.75 శాతంతో 1746 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 796 మంది బాలురు, 950 మంది బాలికలు పాసయ్యారు. 157 మంది ఫెయిల్ అయ్యారు. 2017–18 విద్యా సంవత్సరంలో 92.67 ఉత్తీర్ణత శాతం ఉండగా, ఈ ఏడాది 0.92 శాతం తగ్గింది. దీంతో పాటు గతేడాది 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించగా ఈ ఏడాది ఆ సంఖ్య కూడా తగ్గి 31కి దిగజారింది. 4 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత గతేడాది 2 పాఠశాలలు మాత్రమే 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ సారి ఆ సంఖ్య నాలుగుకి చేరింది. అనకాపల్లిజోన్ పరిధిలోని గాంధీనగరం హైస్కూల్, డా.బీఆర్ అంబేడ్కర్ హైస్కూల్, భీమిలి జోన్‌లోని డా.బీఆర్ అంబేడ్కర్ హైస్కూల్, పీఎన్ఎం హైస్కూల్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నాలుగు స్కూల్స్‌లో బాలురు, 8 స్కూల్స్‌లో బాలికలు 100 శాతం పాసయ్యారు. ఎంజీఎం హైస్కూల్ 73.33 శాతంతో అట్టడుగున నిలిచింది. 14 పాఠశాలలు 90 శాతానికి పైగా, 9 స్కూల్స్ 70 శాతానికి పైగా ఫలితాలు సాధించాయి. అయితే గతేడాది 9.8 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య 29 కాగా ఈ సారి ఏకంగా 40 మందికి చేరడం విశేషం. మంత్రి చలవతోనే బెడిసి కొట్టాయి.. 2016–17 విద్యా సంవత్సరంలో కేవలం 7గురు విద్యార్థులు మాత్రమే 10 పాయింట్లు సాధించడంతో.. 2017–18–లో 40 మంది విద్యార్థులకు ఆ సంఖ్య చేరుకోవాలని కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ తయారు చేసి, విద్యార్థులకు అందించడంతో 39 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించారు. ఈ ఏడాది మాత్రం మంత్రి నారాయణ సూచనలకనుగుణంగా బో ధన సాగడంతో ఫలితాల్లో చతికిలపడ్డామంటూ జీవీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
కొంప ముంచారు!
‘నగర టీడీపీ నేతలు నా కొంప ముంచారు.. ఓటర్లకు ఇవ్వాల్సిన నగదులో కొంత నాయకులు మింగేశారు.. మనం వేసుకున్న ప్రణాళిక విధంగా ఓటర్లకు నగదు చేరలేదు.. నేను నమ్మిన నాయకులే నాకు వెన్నుపోటు పొడిచారు.. నేతల స్వార్థంతో నా కొంప మునిగేలా ఉంది’ అని మంత్రి నారాయణ నెల్లూరు పోలింగ్ సరళిపై తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కాగా టీడీపీ నాయకులు మంత్రి నారాయణ వ్యవహార శైలిపై స్పందిస్తూ ఏరు దాటాకతెప్ప తగలేసినట్లుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికలయ్యేంత వరకు తమతో పనిచేయించుకుని, ఇప్పుడు నగదు మింగేశామని నిందలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సాక్షి, నెల్లూరు: నెల్లూరుసిటీలో ఓటర్లకు నగదు పంపిణీ విషయంలో టీడీపీ నేతలు మోసం చేసి తన కొంప ముంచారని మంత్రి నారాయణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓటింగ్ అయిపోయిన తర్వాత తమను అవమానించడం ఎంతవరకు సబబు? అని నగర టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ, టీడీపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు. ఎన్నికల అనంతరం పోలింగ్ సరళిపై అంతర్గత సమావేశంలో మంత్రి నారాయణ అయన సన్నిహితుల వద్ద నగర టీడీపీలో ఉన్న కీలక నాయకులపై చిందులు తొక్కినట్లు సమాచారం. 70 వేల మంది నగదు అందలేదని సర్వేలో వెల్లడి తన కంటే తన డబ్బును చూసి నేతలు పనిచేశారని, ఓటుకు నోటు పంపిణీలో కొందరు నాయకుల ప్రమేయం పెట్టడంతో కొంత భాగం పంపకాలు చేయకుండా నిధులు మింగేశారంటూ నేతల తీరుపై మంత్రి నారాయణ మండిపడినట్లు సమాచారం. నగర నియోజకవర్గంలో సుమారు లక్షా యాభై వేల మంది ఓటర్లకు గాను ఒక్కో ఓటర్‌కు రూ.2 వేలు వంతున పంపకాలు చేసేందుకు మంత్రి నారాయణ నగదు సమకూర్చినట్లు తెలిసింది. అయితే అందులో సుమారు 70 వేల మంది ఓటర్లకు సక్రమంగా నగదు అందలేదని మంత్రి చేయించిన అంతర్గత సర్వేలో వెల్లడి కావడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ఓటర్లకు నగదు పంపిణీ వ్యవహారంలో ఎన్నో జాగ్రతలు తీసుకుని తమ విద్యాసంస్థల ఉద్యోగుల చేత పంపిణీ చేయించాలని చూసినా కీలక నేతలు నగదు పంపిణీ వ్యవహారంలో దూరి నగదు కాజేశారని ఆయన వాపోయినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో కీలకమైన ముగ్గురు నేతలతోపాటు టీడీపీ కార్పొరేటర్లకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చానని అవి కూడా చాలదన్నట్లుగా ఓటర్లకు నగదు పంపకాల విషయంలో కూడా దూరి అందులో నగదు కూడా కాజేయడంపై ఆయన నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ కీలక నేతలను నమ్మి నట్టేట మునిగేలా ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సహకరించిన వారిపై నిందలా? ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేని మంత్రి నారాయణ ఎన్నికల బరిలో దిగినప్పుడు అన్ని విధాలా సహకరించిన తమపై నగదు కాజేశారంటూ నిందలు మోపడంపై టీడీపీ కీలక నేతలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని మంత్రి నారాయణ నమ్మకుండా ఓటుకు నోటు పంపిణీ వ్యవహారంలో ఆయన విద్యాసంస్థల ఉద్యోగుల చేత పంపకాలు చేయించుకుని తమపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలోమంత్రికి సహకరించినందుకు మమ్మల్ని దొంగలుగా ముద్రవేయడంపై వారు మండిపడుతున్నట్లు తెలిసింది. మంత్రి నారాయణ వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. -
మంత్రి నారాయణకు తోడల్లుడు ఝలక్..
సాక్షి, నెల్లూరు : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంత్రి నారాయణకు ఊహించని షాక్ తగిలింది. మంత్రి నారాయణ తోడల్లుడు రామ్మోహన్‌తో పాటు పలువురు అనుచరులు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి, నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. మంత్రి నారాయణ విధానాలు నచ్చక పలువురు పార్టీని వీడుతున్నారని.. రామ్మోహన్ రావడం వల్ల తమ పార్టీ మరింత బలపడుతుందన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్. చంద్రబాబు అసలు రూపం తెలుసుకుని వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు నగరాన్ని 5వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న మంత్రి నారాయణ.. డబ్బుతో ఓట్లు ఎందుకు కొంటున్నారని ఆయన తోడల్లుడు రామ్మోహన్ ప్రశ్నించారు. కాగా నెల్లూరు నగర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న మంత్రి నారాయణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఓటుకు నోటు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ కోటరీలో కీలక నేతగా ఉన్న నారాయణ విద్యాసంస్థల అధినేత అయిన ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో నోట్ల కట్టలు తెగ్గొట్టేశారు. కేవలం నోట్లతో ఓట్లు కొల్లగొట్టాలని నగర పరిధిలో నోట్లు వరదలా పారిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని ఆయన టీడీపీ కోటరీలో మాత్రం కీలక నేతగా ఎదిగిన నారాయణ... చంద్రబాబుకు బినామీ అని కూడా ప్రచారం ఉంది. రెండు దశాబ్దాలుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో నారాయణ తన విద్యాసంస్థల ఉద్యోగులతో సర్వేలు చేయిస్తూ... పార్టీకి భారీ విరాళాలతో ఆర్థిక వనరలు సమకూర్చేవారు. నారాయణకు రోజు రోజుకు ప్రజాదరణ తగ్గిపోతోంది. ఓటమిపై బెంగతో తన విద్యాసంస్థల ఉద్యోగులతో ఓటర్లకు నగదు చేరవేస్తూ వైఎస్సార్ సీపీ నేతలకు పట్టుబడుతున్నారు. దీంతో నగదు పంపిణీ కష్టతరం కావడంతో చివరకు విద్యార్థుల స్కూల్ బ్యాగుల ద్వారా చోటా నేతలకు నగదు చేరవేస్తున్నట్లు సమాచారం. -
‘నారాయణ’ సిబ్బందితో నగదు పంపిణీ!
నెల్లూరు (క్రైమ్): ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలకు తెరలేపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు రాబట్టుకు నేందుకు భారీ నజరానాలు ముట్టజెప్పే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ.. రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వారు బృందాలుగా విడిపోయి నగర నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత కొద్ది రోజులుగా మకాంవేసి ఓట్ల సర్వే నుంచి నగదు పంపిణీ వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఓటర్లకు కోట్లాది రూపాయల నగదు పంపిణీ వీరి ద్వారా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆదివారం ‘నారాయణ’ సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి 43వ డివిజన్లోని జెండా వీధి, కుమ్మర వీధి ప్రాంతాల్లో నగదు పంపిణీకి చర్యలు చేపట్టారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు కుమ్మర వీధిలోని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నగదు లెక్కిస్తున్న వారిని పట్టుకున్నారు. వీరిలో ఓ వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వారిలో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డితోపాటు మరో ఉద్యోగి సమ్మద్ ఇంకొకరున్నారు. ఈ విషయమై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందించారు. స్క్వాడ్ ఇన్చార్జ్ రాజేంద్రకుమార్‌సింగ్ వీరి నుంచి రూ.8.30 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పరారైన వ్యక్తి వద్ద రూ.35 లక్షలు ఉన్నట్లు సమాచారం. కాగా, టీడీపీ నేతల తప్పుడు ఆరోపణల విచారణకే సమయం కేటాయిస్తున్న నగర పోలీసులు తాయిలాల పంపిణీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా టీడీపీ నేతలు, అనుచరులు, సానుభూతిపరులు నగదు పంచుతూనో, తాయిలాలు పంచుతూనో దొరికిపోతే మాత్రం వారి వివరాలను ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. పోలీసులపై ఒత్తిడి ఇదిలా ఉంటే, టీడీపీ నేత పట్టాభిరామిరెడ్డి తన అనుయాయులను పోలీస్‌స్టేషన్‌కు పంపి తమ వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు అందుకు రంగం సిద్ధంచేశారు. నిజానికి ఎన్నికల సమయంలో వీరు నగదుతో దొరికినందున ఈ సమాచారాన్ని ముందుగా ఎన్నికల సంఘానికి తెలిపి వారి ఆదేశాలతో కేసు నమోదు చేసి నగదు మూలాలను గుర్తించాలి. కానీ, ఇక్కడ మంత్రి పలుకుబడితో.. పట్టుబడిన వారికి వెంటనే బెయిల్ ఇచ్చేలా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నోటు పంపిణీ విషయంపై సమాచారం అందుకున్న నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విచారణను నిష్పక్షపాతంగా జరిపి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ షేక్ కరీముల్లాను కోరారు. -
ఓటర్లకు ‘సైకిల్’ తాయిలాలు
ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన తెలుగుదేశం పార్టీ అధికార అంతమున ఎన్నికల వేళ అన్ని వర్గాలకు తాయిలాల వల విసురుతోంది. పథకాల పేరుతో ప్రలోభాలకు తెరలేపింది. పేదలకు అందరికీ ఇళ్లు, రైతులకు అన్నదాత సుఖీభవ, అక్కచెల్లెమ్మలకు పసుపు, కుంకుమ అంటూ తాయిలాల ఎర వేసిన ప్రభుత్వం, విద్యా సంవత్సరం ఆఖరి నెలలో ఎన్నికల కోడ్ వచ్చాక విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీకి బరితెగించి అడ్డంగా దొరికిపోయింది. సాక్షి, నెల్లూరు (టౌన్): బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 8, 9 తరగతులు చదివే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే అరకొరగా సైకిళ్లు పంపిణీ చేసిన ప్రభుత్వం నాలుగేళ్లుగా విస్మరించింది. ఈ దశలో అందరికి అన్నీ చేశామని చెప్పుకునేందుకు ఎన్నికల కోడ్‌ను బేఖాతరు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. ఎన్నికలల్లో లబ్ధి పొందేందుకు విద్యార్థులను సైతం వదలడం లేదు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆ పార్టీ నేతల అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే అమలకు నోచుకోని ఎన్నో పథకాలను లబ్ధిదారులకు అందజేశామని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ఇచ్చే సైకిళ్లతో వారి తల్లిదండ్రులను తమ బుట్టలో వేసుకుందామని తెర వెనుక చక్రం తిప్పిన మంత్రి నారాయణ, ఆ పార్టీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అవేమి లెక్క చేయని టీడీపీ నాయకులు మంగళవారం 3 ట్రక్కుల సైకిళ్లను విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ను ఉసిగొల్పారు. ఈ నేపథ్యంలో వాటిని తీసుకెళ్తుతుండగా ఓ ట్రక్కును మూలాపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. సైకిళ్లు పంపిణీపై చిన్నబజారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. 20,419 సైకిళ్ల పంపిణీకి రంగం సిద్ధం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 20,419 మంది విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. వాటిని విద్యా సంవత్సర ప్రారంభంలో పంపిణీ చేయాల్సి ఉంది. హీరో సైకిళ్లు పంపిణీ బాధ్యతను హర్యానాకు చెందిన ఓ కాం ట్రాక్టర్‌కు అప్పజెప్పింది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సైకిళ్ల పంపిణీకి తెరలేపింది. సైకిళ్లను ఫిబ్రవరి చివరి వారంలో జిల్లాకు పంపించింది. ఇప్పటి వరకు కేవలం 3 పాఠశాలల్లో 331 మంది విద్యార్థినులకు మాత్రమే అందజేశారు. 60 సైకిళ్లను సీజ్ చేసిన పోలీసులు సైకిళ్లు పంపిణీ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావించిన టీడీపీ నేతలు వెంటనే అమలుకు శ్రీకారం చుట్టారు. సదరు కాంట్రాక్టరుపై ఒత్తిడి తీసుకువచ్చి సైకిళ్లు పంపిణీ చేసేలా ఒప్పించారు. నవాబుపేట ప్రాంతంలోని బీవీఎస్ మున్సిపల్ పాఠశాలల్లో ఉన్న విడి పరికరాలను రాత్రికి రాత్రి హడావుడిగా బిగించి 3 ట్రక్కుల్లో ఇతర పాఠశాలలకు తీసుకెళ్లి విద్యార్థినులకు పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే స్థానిక మూలాపేట వద్ద ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద ట్రక్కును వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. ఆ ట్రక్కులో 60 సైకిళ్లు ఉన్నాయి. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారికి ట్రక్కును అప్పగించారు. అయితే మరో 2 ట్రక్కుల సమాచారం ఇప్పటికి తెలియలేదు. ట్రక్కును తీసుకు వచ్చిన కాంట్రాక్టర్‌పై చిన్నబజారు పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిసింది. తెర వెనుక మంత్రి నారాయణ, నేతల హస్తం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీని నిలిపివేయాలని సదరు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సైకిళ్లు విడి పరికరాల కోసం నగరంలో 3 పాఠశాలల్లో 6 గదులను వారికి అప్పగించారు. పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు ఉన్నా.. సదరు కాంట్రాక్టర్ ట్రక్కుల్లో సైకిళ్లను తరలించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయడంలో మంత్రి నారాయణ, టీడీపీ నేతల ఒత్తిడి ఉందన్న ప్రచారం జరుగుతోంది. సైకిళ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ఫొటోలు ఉన్నాయి. సైకిళ్లను పంపిణీ చేసినట్లయితే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలో సైకిళ్లను ఆయా పాఠశాలలకు పంపిణీ చేసే బాధ్యతను సదరు కాంట్రాక్టర్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నారు. అయితే సైకిళ్లతో కూడిన ట్రక్కును పట్టుకోవడంతో టీడీపీ నేతల నోటిలో వెలక్కాయ పడిన చందంగా మారింది. కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశాం సైకిళ్లు తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై చిన్న బజారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాం. ట్రక్కులో ఉన్న సైకిళ్లను పోలీసు స్టేషన్లో అప్పగించాము. వీటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం. – అలీంబాషా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి -
టీడీపీలో టికెట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో టికెట్ల చిచ్చు రేగింది. ప్రధానంగా టికెట్ ఆశిస్తున్న కీలక నేతలు, జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న నేతలు తీవ్రంగా నిరసన గళం విప్పుతున్నారు. ప్రధానంగా నెల్లూరురూరల్ నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు నగరం నుంచి మంత్రి పి.నారాయణ, సర్వేపల్లి నుంచి మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించిందని జిల్లాలో ముఖ్యులు అధికారికంగా ప్రకటించుకోవటంతో కొత్తు చిచ్చు రేగింది. నెల్లూరు నగర, రూరల్ సీటుపై ఆశలు పెంచుకున్న నగర మేయర్ అబ్ధుల్ అజీజ్‌కు మద్దతుగా ముస్లింలు రంగంలోకి దిగగా, మరోవైపు నెల్లూరు రూరల్ టికెట్ హామీతో పనిచేస్తున్న ఆనం జయకుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అది కూడా శనివారం జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన జరగనున్న క్రమంలో రాజకీయ అలజడి రేగడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ పూర్తిస్థాయిలో వేడెక్కింది. గురువారం మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమర్నాథ్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సీఎంను కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకరరెడ్డి, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిల అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆదాల నివాసంలో మంత్రి నారాయణ, ఆదాల, బీద కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటించుకోవడంతో పార్టీలో అసమ్మతి సెగలు రేగాయి. ప్రధానంగా ఆదాల శిబిరంలో కీలక నేతగా ఉన్న ఆనం జయకుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సమాచారం తెలుసుకోవడానికి ఆదాల నివాసానికి వచ్చిన క్రమంలో సమావేశం నిర్వహించి ప్రకటించుకోవటంతో మనస్థాపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దివంగత ఆనం వివేకానందరెడ్డి సోదరుడు ఆనం జయకుమార్ టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గతేడాది నుంచి నగర టీడీపీ అధ్యక్ష పగ్గాలు ఇస్తామని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. దీంతో పార్టీలో ప్రధానంగా ఆదాల క్యాంపులో కీలకంగా పనిచేస్తూ ఆయన్ను బలపర్చారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు రూరల్ టికెట్ నీకే ఇస్తామని మంత్రి నారాయణ మాజీ మంత్రి ఆదాల నివాసంలో కొన్ని నెలల క్రితం చెప్పడంతో జయకుమార్ రూరల్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆనం కుటుంబానికి రూరల్ నియోజకవర్గంలో ఉన్న వర్గాన్ని కూడగట్టి ఎన్నికలకు సన్నాహాలుగా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదాల తాను పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని గతంలో స్వయంగా ప్రకటించుకున్నారు. ఆ దిశగానే చంద్రబాబు నాయుడిని అనేక మార్లు కలిసి నియోజకవర్గాల వ్యవహారాలపై చర్చించారు. దీంతో అందరూ పార్లమెంట్‌కే అని భావించిన క్రమంలో ఆదాల తన నిర్ణయం మార్చుకోని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించటంతో పొలిటికల్ హీట్ రేగింది. మరో వైపు నగరంలో మైనార్టీలు కూడా తీవ్ర అసమ్మతి గళం విప్పారు. నగర మేయర్ అబ్ధుల్ అజీజ్ మేయర్‌గా వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందాడు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ టికోటు ఇస్తామని మంత్రి నారాయణ హామీ ఇవ్వడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు అజీజ్‌కు కూడా టీడీపీ మొండిచెయ్యి చూపింది. అజీజ్ నెల్లూరు సిటీ, లేదంటే రూరల్‌లో ఒక సీటు వస్తుందనే ధీమాతో ఉండి ఆ దిశగా హడావుడి చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ కూడా టికెట్ మీకే ఇస్తామని హామీ ఇచ్చారు. చివరకు నగర, రూరల్ అభ్యర్థుల్ని ప్రకటించటంతో నైరాశ్యంలో పడిపోయారు. దీంతో శుక్రవారం నగరంలో మైనార్టీ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తమకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని లేని పక్షంలో టీడీపీకి గట్టిగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శనివారం సీఎం పర్యటన జరగనున్న క్రమంలో పొలిటికల్ హీట్ రేగడం చర్చగా మారింది. మేయర్‌పై బీద ఆగ్రహం నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు శుక్రవారం రాత్రి నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మంత్రులు, సీనియర్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర ఈ విషయంలో చర్చిద్దామని వారిని లోపలికి పిలిచారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అజీజ్‌ను బీద తిట్టినట్లు తెలిసింది. దీంతో మేయర్ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. -
దూరం.. దుమారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో నేతల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ముఖ్యులతో చెప్పిన రోజు నుంచి మొదలైన వర్గ విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు ఎవరూ పోటీ రాకూడదని అందరినీ దూరంగా పెడుతున్న పరిస్థితి రాజకీయ దుమారం రేపుతోంది. మంత్రి రాక ముందు వరకు నగర టికెట్‌పై మేయర్ అబ్దుల్ అజీజ్‌తో సహా అనేక మంది నేతలు ఆశలు పెంచుకున్నారు. పరిస్థితి రివర్స్ కావడంతో నేతల అంతర్గత సమావేశాల్లోనూ మంత్రి తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. తాజాగా నగర ప్రథమ పౌరుడు మేయర్ అబ్దుల్ అజీజ్ ఫొటో లేకుండా రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర దూమారం రేగింది. నగరంలో ఉన్న ఏకైక మైనార్టీ నేతను నన్నే అవమానిస్తారా? అంటూ అక్కడే మేయర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, వెంటనే ముస్లిం మతపెద్దలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. నగరంలో మంత్రి నారాయణ అధికార పార్టీ సిటీ అభ్యర్థిగా బరిలో వస్తాడనే ప్రచారం మొదలైనప్పటి నుంచి నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అంతకు ముందు వరకు టికెట్ ఆశిస్తున్న నేతలు తమ గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్న నారాయణ ద్వారా తమకు టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ నగరంలో అధికార పార్టీ నేతలుగా చలామణి అయ్యారు. నగర మేయర్‌గా అబ్దుల్ అజీజ్ వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వ్యక్తి. కొద్ది రోజులకే మంత్రి నారాయణ, సీఎం తనయుడు లోకేష్ సిటీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అధికార పార్టీలోకి జంప్ చేశారు. అజీజ్‌తో పాటు టీడీపీ నగరఇన్చార్జి ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధతో పాటు మరి కొందరు నేతలు ఆశలు పెంచుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మంత్రి నారాయణ నగరంలో హడావుడి మొదలు పెట్టారు. పార్టీ ముఖ్యల సమావేశంలో నెట్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు నగరంలో ఏ అభివృద్ధి పని జరిగినా నగర మేయర్ హడావుడి అక్కడ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత నుంచి మేయర్ ప్రాధాన్యత తగ్గిపోయి మంత్రి హవా పెరిగిపోయింది. శంకుస్థాపనలు మొదలుకొని అన్ని పనుల వరకు నారాయణ అధికారుల ద్వారా చేయించడంతో నగర మేయర్ పాత్ర పూర్తిగా కనుమరుగైంది. ఈ పరిణామాలను మేయర్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం లేకపోవడంతో పాటు నీకే టికెట్ ఇస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. దీంతో నగరంలో మంత్రి వర్సెస్ మేయర్‌గా అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది. రొట్టెల పండగ మొదలుకొని.. నగరంలో నగరపాలక సంస్థ ప్రత్యేక నిధులు, జనరల్ ఫండ్‌తో నిర్వహించుకునే ప్రతి కార్యక్రమం కూడా మంత్రి తనవల్లే జరిగిందంటూ హడావుడి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బారాషహీద్ రొట్టెల పండగకు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయలేదు. పండగకు రాష్ట్ర ప్రభుత్వ హోదా ఉన్నప్పటికీ, మంత్రులు నిధులు ఇస్తామని ప్రకటించనప్పటికీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితి. ఈ క్రమంలో నగరపాలకసంస్థ జనరల్ ఫండ్‌లో నుంచి ఖర్చు పెట్టి ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు రోజున అన్ని మంత్రి నారాయణ చేశాడంటూ విస్తృతంగా ప్రచారం హోరెత్తించడంతో మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నుంచి ఇదే పరంపర కొనసాగుతూ వచ్చింది. ఇటీవల మటన్ మార్కెట్ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం మధ్యాహ్నం అని ఆహ్వానాలు ముద్రించి ఉదయం మంత్రి ఒక్కరే వచ్చి చేసి వెళ్లిపోయారు. షాదీమంజిల్ వ్యవహారం, జూనియర్ కళాశాలకు జనరల్ ఫండ్ నుంచి రూ.1.5 కోట్లు కేటాయింపులు, నవాబుపేట ఘాట్ అభివృద్ధి ఇలా అన్ని నగరపాలక సంస్థ చేసినా మంత్రి మాత్రం నేనే చేశాను అని చెప్పడం, ఆయన అనుచరగణం మంత్రికి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయండని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నగరంలో నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కదాంట్లో కూడా మేయర్ ఫొటో లేకపోవడం, అది కూడా దర్గా సమీపంలో ఉండడంతో మేయర్ అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసి ఇదేమీ పద్ధతి అంటూ అక్కడ ఉన్న నేతలను ప్రశ్నించారు. ఇది నగరంలో చర్చనీయాంశంగా మారడంతో ముస్లిం పెద్దలు మైనార్టీ నేతగా ఉన్న మేయర్‌కు అవమానం జరగడంపై మేయర్ చాంబర్లో భేటీ కావడం అధికార పార్టీలో చర్చకు దారి తీసింది. మొత్తం మీద నగరంలో అధికార పార్టీలో వార్ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. -
నారాయణా.. అంతా మీ ఇష్టమేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు కనీస విలువ లేదా.. ఎవరి మనోభావాలతో మీకు పనిలేదా.. మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇద్దరి మాట మినహా మిగిలిన వారిని కనీసం పట్టించుకోరా’ అంటూ రూరల్ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం నగరంలోని కిలారి తిరుపతినాయుడు కల్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రూరల్ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామి నాయుడు సమావేశం నిర్వహించారు. సమావేశానికి 130 మంది వరకు సీనియర్ టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలకు సంబంధం లేకుండా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరులకే అన్ని పనులు, పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు మొదలుకొని అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ వరకు ఆదాల అనుచరుడు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పార్టీ వ్యక్తులకు కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అలాగే మంత్రి నారాయణకు నియోజకవర్గంలో పట్టుమని 10 మందితో పరిచయాలు ఉండవు. అయితే ఆయన నెల్లూరు రూరల్ అభ్యర్థిని నిర్ణయిస్తారు. పనిచేసుకోమని చెబుతారు. ఇలా అయితే పాత వారందరూ పార్టీని వీడిపోవటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల్లో పాతవారికి చోటు దక్కలేదని, నీరు–చెట్టు పనులు కూడా పాతవర్గంలో ఒక్కరికీ ఇవ్వలేదని, మంత్రి నారాయణ అన్నీ అతనికి కావల్సిన వారికి, మాజీ మంత్రి ఆదాల తనకు కావల్సిన వారికే ఇస్తుంటే కార్యకర్తలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటారని ప్రశ్నించారు. మా పరిస్థితేంటి? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌ను మంత్రి నారాయణ ప్రకటించడానికి అంతా సిద్ధం చేస్తుంటే మాలాంటి వారి పరిస్థితి ఏంటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు మండిపడ్డారు. 135 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. వారిలో ఒక్కరైనా టీడీపీ కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నించారు. పింఛన్లు మొదలుకొని రేషన్ డిపోల వరకు ఒక్కదానిలో కూడా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై మొదట తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేస్తామని, అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. అలాగే సభ ముగింపు సమయంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి హాజయ్యారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు పాముల రమణయ్య, కార్పొరేటర్ మన్నెం పెంచలయ్య, నేతలు రామమూర్తి, బద్దేపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్, ఉరందుల సురేంద్రబాబు, జానా గిరిబాబు, ఎస్కే ఆసీఫ్, రాఘవప్పనాయుడు, సుబ్బరాజు, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఈ చెత్తేంది నారాయణా!
నెల్లూరు సిటీ : మున్సిపల్ మంత్రి నారాయణ సొంత జిల్లాలో ఒక కార్పొరేషన్.. ఆరు మున్సిపాలిటీలున్నాయి. ఇక్కడ రోజుకు 400 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీనిని డంపింగ్ యార్డులకు తరలిస్తుండడంతో చెత్త కొండలు గుట్టలుగా పేరుకుపోతోంది. తడి, పొడి చెత్త సేకరణ అంతంతమాత్రంగానే ఉంది. చెత్తతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. నెల్లూరు నగరంలో చెత్త తరలింపులో అధికార పార్టీ నేతలు బినామీలను ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కార్పొరేషన్ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏడు లక్షలు జనాభా ఉన్న నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. పాలకులు చెబుతున్న స్మార్ట్ సిటీ ఇలాగే ఉంటుందేమో! అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. కావలి పట్టణంలోని డంపింగ్ యార్డును మోర్లవారిపాళెంకు తరలించారు. రెండేళ్లుగా చెత్త పేరుకుపోతూనే ఉంది. దుర్వాసన వస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ వాహనాలు మరమ్మతులైనా పాలకులు పట్టించుకోవడంలేదు. నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులే లేవు. రహదారుల పక్కనే చెత్తను తరలిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాయుడుపేటలో స్వర్ణముఖినది సైతం కంపోస్టు యార్డుగా మారిపోతోంది. చిట్టమూరు మండలంలో మూడు ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గూడూరు పట్టణంలో రోజుకు 28 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే ఇష్టానుసారంగా డంప్ చేస్తున్నారు. వెంకటగిరి పట్టణంలో చెత్తసేకరణ గ్రామాల కంటే దారుణంగా తయారైంది. ప్రధాన వీధుల్లో మినహా మిగతా ప్రాంతాల్లో మూడు రోజులకోసారి చెత్తను సేకరిస్తున్నారు. పట్టణంలో ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డుకు ప్రహరీ లేకపోవడంతో గాలికి చెత్త సమీప పొలాల్లో పేరుకుపోతోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఆరేళ్ల క్రితం సీ గ్రేడ్ మున్సిపాలిటీగా మారిన ఆత్మకూరులో చెత్త సేకరణ ఆరంభశూరత్వంగా మారింది. రెండునెలల పాటు చెత్తను తరలించారు. ఆ తర్వాత అంతంతమాత్రంగానే సేకరణ జరుగుతోంది. పట్టణంలోని చెత్తను శివారు ప్రాంతాలకు తరలిస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతం. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెత్తతో విద్యుత్ తయారీకి అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాచేస్తున్నట్టు ప్రకటించింది. అందులో నెల్లూరు నగరం కూడా ఉంది. అప్పటి నెల్లూరు కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఓ ప్రైవేట్ సంస్థతో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. నెల్లూరు నగరంతోపాటు కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ చెత్తను తరలించి తద్వారా విద్యుత్ ఉత్పత్తికి చేయాలని నిర్ణయించారు. దీంతో కొన్నేళ్లుగా చెత్త సమస్యకు విముక్తి కలిగిందని ప్రజలు భావించారు. అయితే ఇప్పటికీ ఆ ఊసేలేదు. కంపోస్టు యార్డుగా స్వర్ణముఖి నాయుడుపేట పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా వ్యర్థాలను పడేస్తుండటంతో కంపోస్టు యార్డుగా తయారైంది. నదిపై ఉన్న కాజ్‌వేపై నుంచి వాహనాల్లో చెత్త నిల్వలు, భవనాలకు సంబంధించిన వ్యర్థాలను నదిలో వేస్తుండడంతో స్వర్ణముఖి నది రోజురోజుకూ రూపుకోల్పోతోంది. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కంపోస్టు యార్డు లేకపోవడంతో పట్టణవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వ్యర్థాలను నదిలో పడేస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాల్లేవు.– నాయుడుపేట టౌన్ -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పోలీస్ జులుం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాల్టీలో మంత్రి పి.నారాయణ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాలనీ సమస్యలను పరిశీలించాలని మంత్రిని కోరడానికి వచ్చిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై దౌర్జన్యం చేశారు. అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసుల తీరుపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ‘హౌస్ ఫర్ ఆల్’ గృహాలను లబ్ధిదారులకు కేటాయించేందుకు మంత్రి నారాయణ శనివారం సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలోని మన్నారుపోలూరుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నాయుడుపేటకు బయలుదేరారు. ఇదే సమయంలో వట్రపాళెం వద్ద స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మంత్రి కాన్వాయ్‌ను ఆపి, మర్యాదపూర్వకంగా మంత్రికి శాలువా కప్పారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న వట్రపాళెంలో కనీస వసతులకు దూరంగా బతుకుతున్న నిరుపేదల బాధలను చూడాలని మంత్రిని కోరారు. అది పెద్ద నేరమైనట్లు గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, స్థానిక పోలీస్ అధికారులు రెచ్చిపోయారు. డీఎస్పీ రాంబాబు ఎమ్మెల్యే కిలివేటిని పక్కకు నెట్టేశారు. అక్కడే ఉన్న పలువురు సీఐలు, ఎస్సైలు కూడా కల్పించుకుని ఎమ్మెల్యేను ఈడ్చుకెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కిలివేటితోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందోళనకు దిగారు. పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి నారాయణ స్పందిస్తూ.. ‘‘నేను రాను, నాకు వేరే షెడ్యూల్ ఉంది. నాయుడుపేటకు వెళ్లాలి, ఈ రోజు షెడ్యూల్లో వట్రపాళెం లేదు. ఊరికే విసిగించకు’’ అంటూ రుసరుసలాడారు. నాయుడుపేటలో గందరగోళం నాయుడుపేటలో ‘హౌస్ ఫర్ ఆల్’ ఇళ్లు కేటాయింపు సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. పేదలకు మేలు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మంత్రి నారాయణ తీరును ఆయన తప్పుపట్టారు. జై వైఎస్సార్ అంటూ ప్రసంగాన్ని ముగించబోయారు. అదే సమయంలో సభలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా జై వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ‘నుడా’ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే సంజీవయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కార్యకర్తలను అడ్డుకుని, బయటకు పంపేందుకు యత్నించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. -
వెన్నుపోటే!
నగర టీడీపీలో నలుగురు నేతలు.. ఆ నలుగురివీ సొంత అజెండాలు.. లాబీయింగ్‌లు.. రాజకీయ పైరవీలు.. కానీ ఆ నలుగురు నేతలు మాత్రం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఉంటే ఆయన వెంటే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారు పరోక్షంగా మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వ్యక్తిగత అజెండాతో ముందుకుసాగుతున్నారు. ఆ నలుగురికి నగర టీడీపీ టికెట్ కావాలి. అందరికీ దీనికి సంబంధించి రకరకాల హామీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అందరూ మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని తెరపైన ఆమోదిస్తున్నట్లు కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు సహకరించడంపై ఇప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. పర్యవసానంగా మంత్రి నారాయణకు సొంత పార్టీలోనే వెన్నుపోట్లు తప్పవనే ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర టికెట్ విషయాన్ని పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బరిలో ఎవరిని దింపాలన్న విషయంలో నాలుగు నెలల క్రితం వరకూ అయోమయంగా ఉన్న అధిష్టానంలో ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో నగర టీడీపీ అభ్యర్థిగా మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ బరిలో ఉంటారని ఆ పార్టీలో బలంగా ప్రచారం సాగుతోంది. మంత్రి నారాయణ సైతం తన అభ్యర్థిత్వం ఖరారు అయిందనే సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇవ్వడంతోపాటు ముఖ్యులకు తానే పోటీ చేస్తున్నానని చెప్పి ఆ మేరకు పనుల్లో మంత్రి నారాయణ బిజీగా ఉన్నారు. అయితే మంత్రినారాయణ కోటరీలో కీలక నేతలుగా ఉన్న టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ ఈ టికెట్‌పైనే ఆశలు పెంచుకున్నారు. నాలుగు నెలల క్రితం వరకు మంత్రి ద్వారానే లాబీయింగ్ పర్వం నిర్వహించారు. మంత్రి కూడా అందరికీ టికెట్ ఇప్పిస్తాననే హామీతో వారిని ఇప్పటివరకు తనతో తిప్పుకోవడంతోపాటు ఆర్థికంగా కూడా కొందరికి లబ్ధి చేకూర్చారు. ఈ పరిణామాల క్రమంలో నలుగురు నేతల ఆశలు అడియాశలయ్యేలా టికెట్ ఇప్పిస్తానన్న గాఢ్ ఫాదర్ నేరుగా బరిలో నిలవనుండడంతో వారు వ్యక్తిగత అజెండాతో ముందుకుసాగుతున్నారు. సొంత లాబీయింగ్‌పై దృష్టి సారించడంతోపాటు మంత్రి నెల్లూరు నగరంలో తమ సహకారం లేకుండా ఎలా గెలుస్తారో చూద్దాం అంటూ తమ వర్గీయుల వద్ద బహిరంగంగానే వాఖ్యానిస్తుండడం ఆ పార్టీలో కలకలం రేపింది. దీనికితోడు మంత్రి నగరంలో లేని సందర్భంలో నలుగురు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. కచ్చితంగా టిక్కెట్ వస్తుందనే ఆశ 2014 ఎన్నికల్లో టీడీపీ నగర అభ్యర్థిగా ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో మంత్రి నారాయణ ముంగమూరుకు రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో కొన్ని కాంట్రాక్ట్ పనులు, అలాగే నెల్లూరు నగరంలోనూ పలు పనులు కేటాయించారు. పనుల విలువ వందల కోట్లలో ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా మళ్లీ భారీగా పనులు శ్రీధరకృష్ణారెడ్డికి అప్పగించనున్నారు. ఈక్రమంలో శ్రీధరకృష్ణారెడ్డి తనకు సహకరించాలనేది మంత్రి షరతుగా తెలుస్తోంది. అయితే అన్ని చోట్ల ఇన్‌చార్జ్‌లకు దక్కిన విధంగానే తనకు పనులు దక్కాయే తప్ప కొత్తగా ఏమీ రాలేదని, 2014 నుంచి నగరంలో పార్టీ అభ్యున్నతి కోసం తాను పనిచేస్తున్నానని, తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ముంగమూరు భరోసాతో ఉన్నారు. మేయర్ ధీమా నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ టికెట్ హామీతోనే మంత్రి నారాయణ ద్వారా వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈక్రమంలో ముస్లిం కోటాలో తనకు టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో మంత్రికి, అబ్దుల్ అజీజ్‌కు మధ్య దూరం పెరిగింది. రొట్టెల పండగ కార్యక్రమం కోసం నగరపాలక సంస్థ నుంచి నిధులు కేటాయించడంతోపాటు అన్నీ తానై 20 రోజులపాటు అక్కడే ఉండి పనులు చూసుకున్నారు. చివరికి అన్ని పనులు మంత్రి నారాయణ చేశారని భారీగా పత్రికా ప్రకటనలు గుప్పించడంతో అబ్దుల్ అజీజ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు లోకేష్ తనకు హామీ ఇచ్చారని టికెట్ తప్పక వస్తుందని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. నుడా చైర్మన్‌కు బాలకృష్ణ ఆశీస్సులు! నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని, తప్పక అవకాశం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే తాళ్లపాక అనురాధ తనకు మహిళా కోటాలో టికెట్ వస్తుందని భరోసాతో ఉన్నారు. ఈక్రమంలో మంత్రి కోటరీ నేతలంతా అభ్యర్థులే అయితే మంత్రి కోసం నగరంలో పనిచేసేదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
మంత్రి నారాయణ మొండివైఖరి
నెల్లూరు సిటీ: మంత్రి నారాయణ మొండివైఖరితో పారిశుధ్య కార్మికులు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. 27 రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో నగరం చెత్తాచెదారాలతో నిండిపోయింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌తో మేయర్ అజీజ్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. సోమిరెడ్డి తన నివాసంలో కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపినా, మేయర్ అజీజ్ మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది. 279 జీఓపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మెట్టుదిగకపోవడం.. అటు కార్మిక సంఘాలు సైతం సమ్మె విరమించేదిలేదని తేల్చిచెప్పడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. సమస్య జఠిలం కార్పొరేషన్ పరిధిలో 877 మంది పారిశుధ్య కార్మికులు సొసైటీ కింద, 260 మంది కాంట్రాక్టర్ కింద, 350 మంది పర్మనెంట్ పద్ధతిలో ఉన్నారు. సొసైటీ కార్మికులను 279 జీఓలో ప్రైవేట్ కాంట్రాక్టర్ కింద పనిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత నెల 14 నుంచి కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. రోజూ 350 మెట్రిక్ టన్నుల చెత్తాచెదారాలు నగరంలో ఉత్పత్తవుతాయి. 27 రోజులుగా 9500 మెట్రిక్ టన్నుల చెత్తలో కార్పొరేషన్ అధికారులు అక్కడక్కడా 20 శాతాన్నే తొలగించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. రెండు దఫాల చర్చలు విఫలం కౌన్సిల్ సమావేశం అనంతరం మేయర్ శనివారం కార్మిక సంఘ నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమ్మె విరమణపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు మేయర్ ఇచ్చిన ముందస్తు అనుమతులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మేయర్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని, తాత్కాలికంగా 279 జీఓను అమలు చేయమని చెప్పారు. అయితే అనుమతులను వెనక్కి తీసుకుంటనే సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘ నాయకులు తేల్చిచెప్పారు. అనంతరం మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. 279 జీఓపై వెనక్కి తగ్గేదిలేదని, అవసరమైతే పోలీసుల బందోబస్తు మధ్య ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిద్దామని మేయర్‌కు మంత్రి చెప్పినట్లు సమాచారం. అనంతరం శనివారం రాత్రి సోమిరెడ్డి నివాసంలో కార్మిక సంఘ నాయకులతో మరో ధఫా ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే సోమిరెడ్డి నుంచి కూడా సానుకూల సమాధానం రాకపోవడంతో కార్మిక సంఘాలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారాయణ నిర్ణయమే ఫైనల్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయమే ఫైనల్ అని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మేయర్, మంత్రి సోమిరెడ్డి చర్చలు జరిపినా ఫలితం ఉండదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. మంత్రి నారాయణ మాత్రం కార్మిక సంఘాల డిమాండ్లకు వెనక్కి తగ్గడం లేదు. జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలెవరూ సొంత నిర్ణయం ప్రకటించలేకపోతున్నారు. మంత్రి నారాయణతో మేయర్ ఫోన్లో మాట్లాడిన సమయంలో 279 జీఓను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు మంత్రి నారాయణ నెల్లూరులో రెండు, మూడు రోజులు ఉండి వెళ్లిపోతారని, తాము నగరంలో ఎలా తిరగాలని టీడీపీలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులతో మాట్లాడకుండా ఇలా మొండిగా వ్యవహరిస్తే తామే నష్టపోతామని గుసగుసలాడుతున్నారు. వీరి పంతాలతో ప్రజలకే ఇబ్బందులు ఓ వైపు కార్మికులు తమ పొట్టగొట్టద్దని సమ్మె చేస్తుంటే.. మంత్రి నారాయణ మొండివైఖరి కారణంగా నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో వినాయకచవితి పండగను ఎలా చేసుకోవాలని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కూడళ్లు, వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో చెత్తాచెదారాలతో ఇబ్బందులు పడతామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ వ్యవస్థనుప్రైవేటీకరించేందుకే: కార్పొరేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. 279 జీఓ అమలైతే భవిష్యత్తులో పన్నుల భారం ప్రజలపై భారీగా పడనుంది. ప్రజలు కూడా కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నారు. – కత్తి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడుమంత్రి పట్టించుకోకపోవడందారుణం: కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నా, మంత్రి నారాయణ, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడం దారుణం. 279 జీఓకు సంబంధించి మేయర్ అజీజ్ ఇచ్చిన ముందస్తు అనుమతులను తాత్కాలికంగా వెనక్కి తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. – రూప్‌కుమార్‌యాదవ్, వైఎస్సార్సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ -
అన్నా క్యాంటీన్ల అంచనాలు పెంచి కోట్లు కొట్టేశారు
-
మంత్రి నారాయణ ఖాతాలోకి వేల కోట్లు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లుగా సమర్థవంతమైన అవినీతి పాలన నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అవినీతిని సమర్థవంతంగా పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్‌లో సుమారు 30 వేల కోట్ల అవినీతి జరిగిందని, మట్టి-నీరు పథకంలో మరో 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇసుక తవ్వకాల ద్వారా వేల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి చేసుకోమంటూ కిందస్థాయి నేతలకు అనుమతి ఇచ్చేశారని దుయ్యబట్టారు. 'సర్వశిక్షా అభియాన్‌కు కేంద్రం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. విద్యకు 30 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు. వీటిలో 8 నుంచి 9 వేల కోట్లు చేతులు మారుతున్నాయి. విద్యకు కేటాయించిన నిధులన్నీ మంత్రి నారాయణ పరమవుతున్నాయి. అంతేకాకుండా సర్వశిక్షాఅభియాన్‌లో పోస్టులు అమ్ముకుంటున్నారు. దేశంలో ఎన్ఆర్జీఎస్ కింద సంవత్సరానికి 40వేల కోట్లు కేటాయిస్తే 9వేల కోట్లు కేవలం ఏపీకి ఇస్తున్నారు. జీవో 51 ద్వారా 10 ప్రాజెక్టులను తాకట్టు పెట్టి 6500 కోట్లు తేవాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఉపాధి హామీ పథకాలుగా మారిపోయాయి' అని సోము వీర్రాజు ఆరోపించారు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, ఎల్ఈడీ బల్బులు, ఇల్లులు, 24 గంటల కరెంట్, నీరు చెట్టు, ప్రధాన మంత్రి భీమా, మరుగుదొడ్లు వంటి వాటిని కేంద్రమే భరిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవీనీతికి పాల్పడుతోంది. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయొచ్చు. బీజేపీ బలం పెరుగుతుందనే టీడీపీ నేతలు మా పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 20 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఇంత అప్పు ఉండగా మళ్లీ అప్పు తేవడానికి సిద్ధమయ్యారు. సీఎం అప్పులకు సిద్ధమౌతుంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఏంచేస్తున్నారు. పైగా సీఎం సభలకు రాకపోతే ప్రభుత్వ పథకాలు ఇవ్వమంటూ ప్రజలను బెదిరిస్తున్నా'రని సోము వీర్రాజు మండిపడ్డారు. -
చంద్రబాబు పాలనపై అధ్యయనం జరగాలి
-
టీడీపీలో గ్రూప్ వార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీరుతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. అది కూడా మంత్రి నారాయణ సమక్షంలో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ వ్యవహారం జరగటంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అపాయింట్మెంట్ ఆదాల కోరితే ఆయన కంటే ముందుగానే బీద రవిచంద్ర కుదరదని చెప్పటం, అది కూడా పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో చెప్పటం, దీనికి మంత్రి మౌనం వహించటంతో ఆదాల కినుకు వహించారు. వెంటనే పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షునికి దీనిపై ఆదాల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇది కూడా సీఎం పర్యటన నేపథ్యంలో జరగటంతో పార్టీలో హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఇద్దరు గురుశిష్యులు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత కాలంగా పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాల్లో పార్లమెంట్ ఇన్చార్జి హోదాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నగరంలో తెలుగుదేశం పార్టీ దళిత తేజం బహిరంగ సభ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై చర్చించటానికి మంత్రి పి.నారాయణ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు నగర నేతలు పలువురు పాల్గొన్నారు. సమావేశం ముగిశాక మాజీ మంత్రి ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుమూడిలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి నారాయణను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరారు. గడిచిన నాలుగేళ్లలో రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలకు పెద్దగా రాలేదు. తప్పనిసరిగా రావాలని కోరారు. దీనికి మంత్రి నారాయణ బదులివ్వటానికి ముందే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జోక్యం చేసుకోని మంత్రి నారాయణ ఎలా వస్తారు. సీఎం కార్యక్రమంహడావుడిలో ఉంటారు. పొద్దునే ఏర్పాట్లు చూసుకోవాలి. ఆయన రావటం కుదరదని ఖరాఖండిగా చెప్పాడు. అది నగర నేతలు, డివిజన్ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తల సమక్షంలో చెప్పటంతో ఆదాల తీవ్ర అసంతృప్తికి లోనై అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు. మంత్రి నారాయణ కనీసం ఒక్కమాటకు కూడా మాట్లాడలేదు. దీంతో పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వటం లేదని, తాను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా నేతలు తీరు సరిగాలేదని ఆదాల తన అనుచరుల వద్ద ఆక్రోశం వెళ్లగక్కారు. మరోవైపు వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫోన్ చేసి బీద రవిచంద్ర తీరుపై ఫిర్యాదు చేశారు. నగరంలో ఫ్లైక్సీల హడావుడి శనివారం నగరంలో జరిగే దళిత తేజం కార్యక్రమం ఫైక్సీల హడావుడి కూడా పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది. కొందరు దళిత నేతలు కూడా దీనిపై పార్టీ ముఖ్యుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నగరం అంతా దళిత తేజం ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు కానీ దానికి భిన్నంగా ఒక సామాజికవర్గం నేతలు ఫ్లెక్సీలు హడావుడి చేయటం అందులోనూ దళిత నేతలకు చోట లేకపోవటం గమనార్హం. ముఖ్యంగా గత 15 రోజులుగా దళిత తేజం విజయవంతం చేయండని పార్టీ దళిత నేతలుగా ఉన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం, పార్టీ నేతలు నెలవల సుబ్రమణ్యం, జోత్స్నలత తదితరులు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లైక్సీల్లో దళిత నేతలు కల్పించలేదు. దీనికి భిన్నంగా నగరంలో ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభి, తాళ్లపాక అనురాధ తదితర నేతలు భారీగా ఫ్లైక్సీలు ఏర్పాటు చేయటం పార్టీ అలంకరణ కమిటీకి తలనొప్పిగా మారింది. పరసా హడావుడి మరోవైపు సీఎం పర్యటన పేరుతో పరసా రత్నం హడావుడి చేశారు. శుక్రవారం పెళ్లకూరులో సమావేశం నిర్వహించి జనసమీకరణ బాధ్యత అధికారులకు అప్పగించారు. ఏపీఎం పద్మ, ఉఫాధి హామీ ఏపీఓ జ్ఞాన ప్రకాష్‌తో కలిసి ఆయన సమావేశం నిర్వహించి పొదుపు సంఘాల మహిళలు, ఉపాధి హమీ కూలీలతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసీ జనాలను తరలించాలని ఆదేశాలు జారీ చేయటం చర్చనీయాంశం అయింది. -
నారాయణ మాటలు నీటిమూటలు
నెల్లూరు(సెంట్రల్): నగరంలోని మైనార్టీలకు కోట మిట్టలో షాదీమంజిల్‌ను ఈ రంజాన్‌లోపు నిర్మి స్తామని చెప్పిన మంత్రి నారాయణ మాటలు నీటిమాటలుగా మిగిలిపోయాయని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. కోటమిట్టలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. షాదీమంజిల్‌ను అధునాతనంగా నిర్మిస్తానని జనవరిలో మంత్రి చెప్పారని, అయితే కనీసం శంకుస్థాపన చేశారానని ప్రశ్నించారు. తాము ఏది మాట్లాడినా రాజకీయం అంటారని, అయితే ఏడు నెలలుగా కనీసం పట్టించుకోరానని ప్రశ్నించారు. నగరంలోని గంజిఖానాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తాను ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలను తీసుకొచ్చానని, అయితే షాదీమంజిల్‌ను నిర్మిస్తున్నప్పుడు ఇది ఎందుకని చెప్పడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానమేదీ..? ప్రస్తుతం ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని, మైనార్టీలపై టీడీపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. చంద్రబాబు ఇక్కడ బీరాలు పలుకుతూ, ఢిల్లీలో వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ మధ్య సంబంధం కొనసాగుతుంటే, ప్రతిపక్షంపై నెపం వేయాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు. ఇతర రాష్ట్రంలోని బీజేపీకి చెందిన మంత్రి సతీమణికి టీటీడీ బోర్డులో స్థానం ఎలా కల్పించారని ప్రశ్నించారు. శ్వేతపత్రం విడుదల చేయాలి నెల్లూరులోని దర్గామిట్టలో గల దర్గా వద్ద రూ.20 కోట్లతో ఏదో చేశామని మంత్రి, టీడీపీ నాయకులు బీరాలు పలకడం కాదని, ఇప్పటి వరకు ఎంత నిధులు కచ్చితంగా వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. షాదీమంజిల్ ఉండే జెండావీధి ప్రాంతంలో ఇరుకు రోడ్డులో డివైడర్‌ను ఏర్పాటు చేయడంపై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్పొరేటర్లు ఖలీల్ అహ్మద్, ఓబిలి రవిచంద్ర, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు హంజాహుస్సేన్, మునీర్ సిద్ధిఖ్, కుంచాల శ్రీనివాసులు, నజరుల్లా, అతహర్‌బాషా, ఫజల్, అహ్మద్, ఆరిఫ్, మైనుద్దీన్, తారీఖ్ అహ్మద్, ఇంతియాజ్, మున్వర్, పఠాన్ ఫయాజ్‌ఖాన్, మున్నా, కాలేషా, ముజీర్, మంజూర్, బాబాభాయ్, షబ్బీర్, జావీద్, మస్తాన్, అలీమ్, తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి పర్యంతమైన దొంతు శారద
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీలో మున్సిపల్ ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల మితిమీరిన జోక్యంతో మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా, స్వంత్రంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపల్ చైర్ పర్సన్లుగా ఉన్న మహిళలకు కనీస గౌరవంతో పాటు పదవి ద్వారా సంక్రమించిన హక్కులను కూడా కాలరాసేలా విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. పర్యవసనంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని ఇంటికే పరిమితం అనే చందంగా అధికార పార్టీలో వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఈ పరిణమాల క్రమంలో వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద బుధవారం కన్నీటి పర్యంతమవుతూ రాజీనామా కు సిద్ధపడ్డారు. చివరకు జిల్లా ఇన్చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి ఫోన్‌చేసి బుజ్జగించటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, కావలిలో అధికార పార్టీ మహిళలు మున్సిపల్ చైర్పర్సన్లుగా కొనసాగుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా పార్టీలో మహిళా నేతల పరిస్థితి దయనీయం. పట్టణాలకు ప్రథమ మహిళలే అయినా పార్టీలోనూ, పాలనలోనూ చివరి మహిళలుగా మిగులుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సొంత జిల్లాలోనే పట్టణాల ప్రథమ మహిళలకు కనీస ప్రాధాన్యం లేకపోవటంతో పార్టీలో పరిస్థితికి నిదర్శనం. గతంలో కావలిలో పార్టీ ఇన్చార్జి బీద మస్తాన్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య మధ్య ఇదే తరహలో అధిపత్య పోరు సాగింది. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు పదవీ కాలం పూర్తి కాగానే అలేఖ్యను పదవి నుంచి తప్పుకోవాలని బీద ఒత్తిడి తేవటం, ఒప్పందంలోని అంశాలను మీరు ఏమీ పాటించకుండా ఇప్పుడు రాజీనామా చేయమని కోరటం సరికాదని ఆమె సామాజిక వర్గ మద్దతుతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారటంతో ఆమెనే కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో గూడూరు మున్సిపాలిటీలోనూ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు కొనసాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే మున్సిపల్ పాలనలో మితిమీరిన జోక్యం చేసుకుని మున్సిపల్ చైర్పర్సన్ ప్రా«ధాన్యం తగ్గిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిణమాల క్రమంలో ముగ్గురు మున్సిపల్ చైర్పర్సన్లు మంత్రి నారాయణకు మొర పెట్టుకున్నా తమకు ఎమ్మెల్యేలే ముఖ్యమని మంత్రి సృష్టం చేశారు. దీంతో కొన్ని నెలలుగా మున్సిపల్ చైర్‌పర్సన్స్ వరెస్స్ ఎమ్మెల్యేలుగా వ్యవహారం సాగుతుంది. ఈ క్రమంలో మళ్లీ వెంకటగిరిలో ముసలం మొదలై తారా స్థాయికి చేరింది. బీసీ మహిళ కావటం వల్లే వేధింపులు గురువారం వెంకటగిరి పట్టణంలో జరిగే మినీ మహానాడు వంటి కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లుపై తనకు ఎటువంటి సమాచారం లేకపోవడంపై ఆమె మనస్థాపం చెందారు. దీంతో అమె తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆమె ససేమిరా అనడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అమరనాథ్‌రెడ్డి నేరుగా ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వెంకటగిరిలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాలుగేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు భరించామని, ఇక తన వల్ల కావడం లేదంటూ ఆమె మంత్రితో ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క నిర్ణయంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పిన విధంగానే నడుచుకుంటున్నానని అయినా తనను అడుగు అడుగునా అవమానిస్తున్నారంటూ వాపోయారు. తన మాట వినాల్సిన అవసరం లేదని అధికారులు, సిబ్బందికి చెబుతుంటే ఎలా చైర్‌పర్సన్‌గా కొనసాగాలో అర్థం కావడం లేదని తెలిపారు. పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే అండతో ఆయన ముందే తనపై దూషణలకు దిగుతున్నా వారిని వారించకపోవడం వారిని పరోక్షంగా ప్రోత్సహించడం కాదా అంటూ మంత్రితో ఆమె ఫోన్లో కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన మంత్రి అమరనాథ్‌రెడ్డి తనే స్వయంగా ఎమ్మెల్యేతో మాట్లాడి సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రి నారాయణతో పాటు, మాజీ డీజీపీ సాంబశివరావు బంధువు అయిన భార్గవ్‌తో ఆమె నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. వీరి వివాహం ఆగస్టు 29న జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి సీటుకు అనుచరుల ఎసరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగర టీడీపీలో ఎత్తుగడ రాజకీయాలకు పూర్తి స్థాయిలో తెరలేచాయి. నిత్యం మంత్రి నారాయణ వెంట ఉండే కీలక అనుచరగణమే ఆయన సీటుకు ఎసరు పెట్టాయి. అదే స్థానం కోరుతూ పలువురు నేతలు కీలక లాబీయింగ్‌కు తెరతీసి సరికొత్త సమీకరణాలు తెరపైకి తెచ్చి సీటు హామీ వచ్చిందని ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే మంత్రి నారాయణ చుట్టూ ఉన్న ప్రథమ శ్రేణి నేతలు అంతా టికెట్ కోసం ప్రయత్నిస్తూ గురువుకే సున్నం పెడుతున్నారు. వీరిలో ఒకరైతే మరో అడుగు ముందుకు వేసి సీటు తనకి వస్తే ఖర్చు మంత్రిగారే పెట్టుకుంటానని చెప్పారనే ప్రచారానికి తెరతీశారు. ఈ పరిణామాల క్రమంలో మంత్రి నారాయణ జిల్లాలో మరో నియోజకవర్గం సీటుపై దృష్టి సారించి అక్కడ రాజకీయ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే నగర టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. నేతలు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత కార్యక్రమాలు మినహా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాల్లేవు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పలుమార్లు నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పినా అది ఎవరూ పట్టించుకోని పరిస్థితి. దీంతో నగర టీడీపీలో గందరగోళం నెలకొంది. పాత, కొత్త నేతల వివాదాలు, గొడవలు, ఆదిపత్య పోరు నిత్య కృత్యంగా సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే అసెంబ్లీ టికెట్ ఫైట్‌కు అధికార పార్టీలో తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలలు సమయం ఉన్నా అధికార పార్టీలో మాత్రం టికెట్ హడావుడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగరం నుంచి తాను పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించుకున్నారు. దీనికి అనుగుణంగా నగరంలో కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం వారంలో రెండు రోజుల పాటు నగరంలో పర్యటనలు నిర్వహించటం, అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్లందరినీ తనవైపు మరల్చుకోవడానికి వీలుగా అందరికీ పనులు చేయించటం, ఆయా డివిజన్లకు నిధులు కేటాయించి నేరుగా తనతోనే మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చి నగరంలో బలంగా వర్గం ఏర్పాటు చేసుకునే యత్నాలు సాగించారు. అయితే అవి కొంతమేరకే ఫలించాయి. ఈ క్రమంలో మంత్రి కోటరీలో కీలక వ్యక్తులుగా ఉన్న నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర టీడీపీ ఇన్చార్జి మంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి. టీడీపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధలు టికెట్ రేసులోకి వచ్చారు. అలాగే నుడా చైర్మన్, నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా సీటు కోసం తన లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించి హడావుడి చేస్తున్నారు. అయితే అంతిమంగా మాత్రం ఎవరు పార్టీ కార్యక్రమాలు నిర్వహించని పరిస్థితి. దీంతో నగరంలో ఆధిపత్యం విషయమై నేతల మధ్య పలుమార్లు అంతర్గత వివాదాలు రేగి మంత్రి వద్దే పంచాయితీలు జరిగాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1983లో ఆనం రామనారాయణరెడ్డి, ఆ తర్వాత 1994లో తాళ్లపాక రమేష్‌రెడ్డి మాత్రమే అధికార పార్టీ నుంచి ఇక్కడ గెలుపొందారు. 1994లో రమేష్‌రెడ్డి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దీంతో స్వతహాగానే నగరంలో పార్టీకి పట్టు తక్కువ. ఈ క్రమంలో 2014 నుంచి భారీగా వలస వచ్చిన నేతలు కూడా ఎక్కువ అయ్యారు. నేతలు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అన్న రీతిలో నగరంలో పరిస్థితి ఉంది. మైనార్టీ కోటాలో అజీజ్ హడావుడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేయర్‌గా గెలుపొందిన అబ్దుల్ అజీజ్ పార్టీ ఫిరాయించారు. ఈయన నెల్లూరు టికెట్ తనకే దక్కుతుందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ హామీతోనే పార్టీ ఫిరాయించానని, మంత్రి నారాయణతో పాటు లోకేశ్, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని చెబుతుండటంతో పాటు రెండు నెలలుగా మైనార్టీ ఆత్మీయ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించి టికెట్ డిమాండ్‌ను బలపరుచుకునేలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టికెట్ తనకే వస్తుందని బలంగా చెప్పుకుంటూ పనిచేస్తున్నారు. మరోవైపు నగర టీడీపీ ఇన్చార్జీ హోదాలో నగరంతో పాటు రాజధానిలోనూ మంత్రి సహకారంతో భారీగా కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటు మందస్తు సన్నాహాల్లో ఉన్నారు. ఇక తాళ్లపాక అనురాధ కూడా టికెట్ కోసం ఆశిస్తూ తనకి టికెట్ వస్తే పార్టీ, మంత్రి నారాయణ ఖర్చు పెడతరానే ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నుడా చైర్మన్ కోటంరెడ్డి యథావిధిగా బాలయ్య కోటాలో టికెట్ వస్తుందనే ఆశలో ఉన్నారు. నగర నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలని మంత్రి రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో నగరంలో తలనొప్పులు పడటం కష్టమనే భావనతో కొత్త నియోజకవర్గంపై దృష్టి సారించారు. మొత్తం మీద నగరం టీడీపీలో కొనసాగుతున్న టికెట్ ఫైట్ మంత్రికే తలనొప్పిగా మారటం విశేషం. -
ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ
అమరావతి: సీఆర్డీఏపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. అనంతం ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 1312 ఎకరాలను 65 సంస్థలకు కేటాయించామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో 65 సంస్థల్లో 7 సంస్థలు మాత్రమే నిర్మాణాలు చేపట్టాయని వెల్లడించారు. వచ్చే మంత్రి వర్గ సమావేశంలో విట్, ఎస్ఆర్ఎం, మాతా అమృతమయి లాంటి సంస్థలకు మరో 100 ఎకరాల చొప్పున కేటాయింపు ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. అలాగే బాబు జగజ్జీవన్ రాం స్మృతివనానికి 10 ఎకరాలు, ఇండియన్ ఆర్మీకి 4 ఎకరాలు, చండ్ర రాజేశ్వర రావు ట్రస్ట్‌కు 3 ఎకరాలు, ఇషా ఫౌండేషన్‌కు 10 ఎకరాల చొప్పున కేటాయింపులకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపిందని వ్యాఖ్యాఇనంచారు. సీఆర్డీఏ పరిధిలో భూకేటాంపులు చేసినా..పనులు ప్రారంభించని ప్రైవేటు సంస్థలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. -
నెల్లూరులో రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు
-
రాజధానిలో యూజర్ చార్జీలు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిం చేందుకు వచ్చే సంస్థలపై యూజర్ చార్జీల భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఆర్డీఏ అధికారులు ఈ ప్రతిపాదనలు చేశారు. రాజధానిలో నిర్మించబోయే పైప్‌లైన్ డక్టులు, గ్యాస్, పెట్రో స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ఈ చార్జీలు వసూలు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. యూజర్ చార్జీలను వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయ వనరులు పెంచుకోవచ్చని సూచించారు. రాజధానిలో తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ తదితర వ్యవస్థల కోసం ఏర్పాటు చేయబోయే పైప్‌లైన్ డక్టులనే వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.. అన్ని రకాల కేబుళ్లు, పైప్ లైన్లు ఈ డక్టుల ద్వారానే వెళ్లాల్సివుంటుందని, ఇవే కాకుండా గ్యాస్, పెట్రో స్టేషన్లు, జల మార్గాల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలిపారు. తొలుత అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. 203 మంజూరు చేయగా అందులో 187 క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 10 ఎకరాల్లో షాపింగ్ మాల్.. అమరావతి నగరంలో 10 ఎకరాల్లో షాపింగ్ మాల్ నిర్మించాలని, థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపింగ్ సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని సీఆర్డీఏ నిర్మించి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఏడాదిన్నరలో 38 వేల కుటుంబాలు రాజధానికి తరలివస్తాయన్న అంచనాతో వారి అవసరాల నిమిత్తం ఈ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాజధానిలోని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ హోటళ్ల ప్రతిపాదనను విజయవాడలోని మురళీ ఫారŠూచ్యన్ నిర్వాహకులు ఐటీసీతో కలిసి అభివృద్ధి చేస్తున్నారని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కోసం రూ.166 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలను భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా మహిళల ఆరోగ్య పరిరక్షణ (కేన్సర్‌పై లక్ష మందికి అవగాహన కల్పణ) కార్యక్రమానికి సంబంధించిన రెండు అవగాహన ఒప్పందాలను మెప్మా, హెల్త్ యూనివర్శిటీ, రెసిడెన్షియల్ స్కూల్స్ అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ భాగస్వామ్యంతో చేపట్టనుంది. సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వెయ్యి అపార్టుమెంట్లు నిర్మిస్తాం రూ.494 కోట్లతో రాజధానిలో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్డీఏ సమావేశం తర్వాత ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగుల కోసం వీటిని నిర్మిస్తున్నామని, నిర్మాణం పూర్తయ్యాక వేలం ద్వారా వారికి విక్రయిస్తామన్నారు. జీ+11 విధానంలో మూడు కేటగిరీల్లో ఈ అపార్టుమెంట్లు నిర్మిస్తామని ఇందుకోసం ప్రభుత్వం పది ఎకరాలు కేటాయించిందన్నారు. 1200 చదరపు అడుగుల్లో 500 అపార్టుమెంట్లు, 1500 అడుగుల్లో 300, 1800 అడుగుల్లో 200 అపార్టుమెంట్లను నిర్మిస్తామన్నారు. చదరపు అడుగును రూ.3,500కు విక్రయిస్తామని తెలిపారు. -
రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి..
సాక్షి, నెల్లూరు: రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు నారాయణ, లోకేష్ కనుసన్నల్లో రూ. 400కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ కుంభకోణంలో రూ. 100కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణం తీసుకుని.. 5వేల కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు. దీంట్లో 5 నుంచి 10 శాతం కమీషన్ మంత్రులు తీసుకుంటున్నారని కోటం రెడ్డి తెలిపారు. -
రాజధానిపై ప్రజల్లో సందేహాలున్నాయ్: సీఎం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రంతో విభేదాల వల్ల పనులు నిలిచిపోతాయనే ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని చెప్పాలని అధికారులకు సూచించారు. రాజధాని పనులను డ్రోన్ల ద్వారా వీడియో తీసి, రెండు నిమిషాల లఘుచిత్రాలు రూపొందించి ప్రతి నెలా సినిమా థియేటర్లలో, మీడియా చానళ్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. రాజధాని వ్యవహారాలపై బుధవారం సచివాలయంలో సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాజధానికి అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై 18 ఏళ్లకు రూపొందించిన ఆర్థిక ప్రణాళికను ఈ సమావేశంలో ఆమోదించారు. కాగా, మొత్తం రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.48,115 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. సీఎంను కలిసిన ఐబీ డైరెక్టర్ రాజీవ్ జైన్: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ రాజీవ్ జైన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలయిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. షెడ్యూల్లో లేకుండా జైన్ బుధవారం నేరుగా సచివాలయానికి రావడం ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇరువురు సుమారు గంటన్నర సేపు భేటీ కావడం గమనార్హం. సమావేశం వివరాలను సీఎంవో గోప్యంగా ఉంచడంపైనా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని కేంద్రానికి వివిధ వర్గాల ద్వారా ఫిర్యాదులు అందడం, కేంద్రం నుంచి అందిన నిధుల వినియోగంలోనూ పెద్ద ఎత్తున లోపాలు చోటుచేసుకున్నాయనే విమర్శలు ఉన్న నేపధ్యంలో ఐబీ భేటీ జరగడం విశేషం. ప్రధాని మోడీ దీక్షను ఎద్దేవా చేసి ఈ నెల 20న సీఎం చంద్రబాబు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తుండటంతో ఐబీ డైరెక్టర్ పర్యటన టీడీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ భేటీలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలకపాత్ర పోషించడం పరిశీలనాంశం. సీఎంతో భేటీ తర్వాత మంగళగిరిలో డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. అకస్మాత్తుగా ఐబీ డైరెక్టర్ రాష్ట్రంలో పర్యటించడంపై టీడీపీ వర్గాలు ఒకింత ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
నిప్పో స్థలం పరాధీనాన్ని అడ్డుకుంటా!
నెల్లూరు(సెంట్రల్): నగరంలోని అ త్యంత విలువైన నిప్పో స్థలాన్ని పరాధీనాన్ని అడ్డుకుని తీరుతానని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తానని గతంలో చెప్పి మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఆ స్థలంపై విచారణ చేస్తున్నామని ఎందుకు మాట మారుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆర్డీఓ, తహసీల్దార్ లిఖి త పూర్వకంగా ఇచ్చిన నిబంధనల ప్ర కారం నిప్పో ఫ్యాక్టరీని యజమానులు నడప లేకపోతే ఎటువంటి నష్ట పరి హారం చెల్లించకుండా ప్రభుత్వం స్వా« దీనం చేసుకోవచ్చుని స్పష్టంగా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు అధికారికంగా ఇచ్చిన వా టిపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం ఏమిటని మంత్రిని ప్రశ్నిం చారు. ప్రధానంగా ఉత్తరాంధ ప్రాం తానికి చెందిన మం త్రికి నిప్పో స్థలా న్ని ధారాదత్తం చేయాలని జిల్లాకు చెందిన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. మంత్రి నా రాయణ, మేయర్ అజీజ్ నిప్పో స్థలా న్ని తక్షణమే స్వాధీనం చేసుకుని, ప్రజాప్రయోజనాలకు విని యోగించాలన్నారు. దీనిపై ప్రజల్లో అనుమానాలు, గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేషన్లో మంత్రి, మేయర్ ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా తీర్మానం పెడితే అందరం సహకరిస్తామన్నారు. కాగితాలు కాల్చేశామని చెప్పడం ఏమిటి? నిప్పో స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని సమాచార చట్టం ద్వారా కలెక్టర్ కార్యాలయానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేశానని, అయితే రెండు నెలల తర్వాత నిప్పో ఫ్యాక్టరీకి సంబంధించి అన్ని ఫైల్స్‌ను కాల్చేశామని (డీ డిస్పోజల్) అని లిఖిత పూర్వకంగా కలెక్టర్ కార్యాలయం నుంచి తనకు ఇచ్చారని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పారు. అనంతరం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నానని, ఆర్డీఓ నుంచి 150 పేజీల వివరాలు పంపారన్నారు. అందులో 9,10 నిబంధనల్లో స్పష్టంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఉందన్నారు. కలెక్టర్ కార్యాలయం కాల్చేశామని చెప్పడం, ఆర్డీఓ కార్యాలయం అధి కా రులు పత్రాలు ఇవ్వడం చూస్తే కలెక్టరేట్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పోరాటాలతో సాధించాం గతంలో రూ.కోట్ల విలువ చేసే కస్తూరిదేవి స్కూల్ స్థలాన్ని కొందరు కాజేయాలని చూస్తే పోరాటం చేసి అడ్డుకున్నానన్నారు. నెల్లూరురూరల్ పరిధి లోని జాతీయ రహదారి వద్ద టోల్ గేట్ ఏర్పాటు చేస్తామంటే పో రాటం చేసి అడ్డుకున్నామని గుర్తు చే శారు. అదే విధంగా ఇస్కాన్ సిటీ ప్రాంతంలో రూ.వంద కోట్ల విలువ చేసే పా ర్కు స్థలాన్ని కాజేయాని చూస్తే అడ్డుకున్నామనే విషయాన్ని గుర్తు చేశారు. నిప్పో ఫ్యాక్టరీ స్థలం ప్రైవేటు పరం చేసే ఊరుకోమని హెచ్చరించారు. -
ఇళ్ల నిర్మాణంలో భారీ దోపిడీ
నెల్లూరు రూరల్: నగరంలోని జనార్దన్‌రెడ్డి కాలనీలో హౌస్ ఫర్ ఆల్ ఇళ్ల నిర్మాణంలో ఒక చదరపు అడుగును రూ.1900కు చేపట్టడంతో ప్రజలకు భారంగా మారిందని, తాను చదరపు అడుగును రూ.1300కే నిర్మిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, నిర్మిస్తే మంత్రి నారాయణ రాజకీయాల నుంచి తప్పుకొంటారానని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ప్రశ్నించారు. హౌస్ ఫర్ ఆల్ నిర్మాణంలో జరుగుతున్న దోపిడీపై ఎమ్మెల్యే అనిల్ బుధవారం అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి వివరించారు. బాలాజీనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయానికి వెళ్లి సీపీఎం నేతలతో చర్చించారు. అనంతరం ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఒక చదరపు అడుగు ఈ రేటు లేదని, నెల్లూరు నగరంలో ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారో అర్థం కావ డం లేదన్నారు. నగరం, రాష్ట్రంలో గా నీ, చివరికి నారాయణ సంస్థల్లో గానీ షేర్వాల్ టెక్నాలజీని ఉపయోగించలేదని, హౌస్ ఫర్ ఆల్ నిర్మాణంలో ఎందుకు ఉపయోగించారని ప్రశ్నిం చారు. షేర్వాల్ టెక్నాలజీతో కాకుం డా అపార్ట్మెంట్ పద్ధతిలో ఇళ్లను నిర్మించినా ఒక్కో ఇంటికి అడుగు రూ.600 మిగిలేదన్నారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతను తనకు అప్పగిస్తే నాణ్యతతో చదరపు అడుగును రూ.1300కే ఏడాదిలోపు నిర్మించి చూపిస్తానని చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో దోపిడీ జరుగుతోందని చర్చకు రమ్మ ంటే.. దాని గురించి మాట్లాడకుండా వైఎస్సార్‌నగర్‌లోని ఇళ్లు, రాజీవ్ స్వ గృహ ఇళ్ల నాణ్యతపై మాట్లాడుతున్నారని చెప్పారు. అప్పటి నగర, రూరల్ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం జరిగిందని, ప్రస్తుతం వారు టీడీపీలోనే ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ప్రశ్నించారు. అప్పుడు ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు, ఇటుక రాళ్లను సరఫరా చేసిన వారు మీ పక్కనే ఉన్నారని, వారిని వదిలేసి ఆ నిందలను తమపై వేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు, కార్పొరేటర్లు ఓబిలి రవి చంద్ర, ఊటుకూరు మాధవయ్య, గో గుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, నాయకులు కర్తం ప్రతాప్‌రెడ్డి, వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, దార్ల వెంకటేశ్వర్లు, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ముదిరెడ్డి లక్ష్మీరెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, రఘు, రవి, తదితరులు పాల్గొన్నారు. -
విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం!
-
విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం
సాక్షి, అమరావతి : బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదురైంది. నవ్యాంధ్ర నూతన రాజధానిలో నిర్మించే రోడ్లు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయన్ని చూపించేందుకు ఎమ్మెల్యేలను మంత్రి నారాయణ తీసుకెళ్లారు. ఆ నేతల బృందంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. అయితే ఆయన భవన సముదాయాలను పరిశీలిస్తుండగా ఇతర నేతలతో కలిసి మంత్రి నారాయణ కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాంతో విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడికి వచ్చిన నేతల్లో తానొక్కడినే ఉండిపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే కొంత సమయం అక్కడే ఉన్నారు. కారు వచ్చేంతవరకు ఎదురుచూసిన ఆయన కారు రాగానే అందులో వెళ్లిపోయారు. తాను కూడా నేతల బృందంలో ఉన్నానని భావించి నేతలు వెళ్లిపోయారని విష్ణుకుమార్ రాజు చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారా లేదా చెక్ చేసుకోకుండా మంత్రి నారాయణ సైతం ఎలా వెళ్లిపోతారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. -
మంత్రి నారాయణ సమక్షంలో...
సాక్షి, నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీలో దళితులకు ఇచ్చే ప్రాధాన్యమెంతో మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణిని నిలబెట్టే ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం గోమతినగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్ రాజానాయుడు పాల్గొన్నారు. వీరందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడే ఉన్న నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణికి మాత్రం కుర్చీ కేటాయించలేదు. దీంతో ఆమె సమావేశం జరుగుతున్నంత సేపూ నాయకుల వెనుక నిల్చొనే ఉండాల్సి వచ్చింది. మంత్రి నారాయణ తదితర టీడీపీ నేతలు చైర్పర్సన్ నిలుచుని ఉన్నా పట్టించుకోకుండా విలేకరుల సమావేశం ముగించారు. -
వన్‌మ్యాన్ షో
మంత్రి నారాయణ వన్‌మ్యాన్ షోకు తెరతీశారు. నగరంలో మేయర్‌తో సహా అధికారపార్టీ నేతలు అనేక మంది ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి జంప్ అయిన కార్పొరేటర్లు ఉన్నారు. ఏ ఒక్కరితో సంబంధం లేకుండా నగరంలో అన్ని తానై మంత్రి వ్యవహరించటం వివాదంగా మారుతోంది. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో పనుల నిర్వహించే విషయంలో నేరుగా కాంట్రాక్ట్ కంపెనీ మంత్రి నారాయణ మినహా మధ్యలో మరెవరికీ చోటు ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తనకు అడ్డు ఏమీ లేదనే రీతిలో టెండర్ కేటాయించకుండానే ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించిన అభివృద్ధి పనులను మొదలు పెట్టించారు. పర్యవసానంగా నగరంలో అసలు ఏం జరగుతుందో కూడా అధికారపార్టీ నేతలకు తెలియని పరిస్థితి. రూ.55 కోట్లతో పనులు 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఉన్న ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో నగరంలోని దళితవాడల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలని నిర్ణయించారు. రూ.75 కోట్ల నిధులకు గానూ రూ.55 కోట్లతో నగరంలోని దళితవాడల్లో 167 పనులు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి అయితే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే స్థానిక సంస్థలు వాటికి సంబంధించి అంచనాలు సిద్ధం చేసుకోవాలి. అనంతరం నివేదికలు పంపి వాటిని ఆమోదించాక టెండర్లు పిలిచి తక్కువ టెండర్ కోట్ చేసిన వారికి కేటాయిస్తారు. ఈ అయితే నిబంధనలు ఏమీ తనకు వర్తించవు అనే రీతిలో మంత్రి నారాయణ వ్యవహరించారు. నగరంలో మెత్తం 167 పనులకు సంబంధించి ఒకే ప్యాకేజ్‌గా సిద్ధం చేసి ఈ నెల 17వ తేదీన టెండర్లను ఖరారు చేశారు. అది కూడా పనులన్నీ కలిపి సింగల్ టెండర్ రూపంలో ఎన్సీసీ లిమిటెడ్ ఆఫ్ హైదరాబాద్ కంపెనీకి కట్టబెట్టారు. ఈ వ్యవహరం అంతా నెల్లూరుతో సంబంధం లేకుండా అమరావతిలోని మంత్రి నారాయణ పేషీ నుంచి జరగటం విశేషం. నగరంలో గుర్తించిన 55 ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పనులు దీనిలో భాగంగా నిర్వహించనున్నారు. అలాగే మిగిలిన రూ.20 కోట్ల నిధులతో పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు. గత ఏడాది సబ్ ప్లాన్ ని«ధులు నగరానికి రూ.42 కోట్లు మంజూరు కావటంతో పనుల పంపకాల్లో అధికారపార్టీ కార్పొరేటర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పనుల్లో ఎవరి జోక్యం లేకుం డా మంత్రి నారాయణ అన్నీ తానై చూసుకోవటంతో పాటు నేరుగా కాంట్రాక్టర్లతో మాట్లాడుకుని వారికి సహకరించాలనిని అధికారులను ఆదేశించారు. టెండర్‌కు ముందేపనుల ప్రారంభం ఇదిలా ఉంటే ఈనెల 17న టెండర్లను ఎన్సీసీ కంపెనీకి కట్టబెట్టారు. అయితే దీని కంటే 20 రోజుల మందు నుంచే నగరంలో టెండర్లకు సంబంధించిన పనులు నిర్వహించడం గమనార్హం. కనీసం ఆయా డివిజన్లలో జరిగే పనులకు సంబంధించి కార్పొరేటర్లకు కూడా తెలయని పరిస్థితి. మరోవైపు రూ.55 కోట్ల విలువైన పనులను కేటాయించటంతో పాటు కాంట్రాక్టర్ కు అదనపు లబ్ధి కూడా చేకూరేలా జీఓ జారీ చేశారు. రూ.55కోట్ల పనులకు 2.27 శాతం అదనంగా అంటే మరో రూ.2.27 కోట్లు అదనంగా ఇచ్చేలే జీఓ జారీ చేశారు. వచ్చే నెలాఖరులో సబ్‌ప్లాన్ ని«ధుల కాలం చెల్లనున్న క్రమంలో ఆఘమేఘాల మీద పనులు మొదలుపెట్టారు. నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలంటే ఎంతమేరకు నాణ్యత ఉంటుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్సీసీతో పాటు మరికొన్ని కార్పొరేట్ కంపెనీలను రంగంలోకి దింపి వారికి సబ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేలా మంత్రి వ్యవహరించారు. ఈ క్రమంలో మంగళవారం చీఫ్ ఇంజినీర్ చంద్రయ్య పనులను పరిశీలించారు. -
సిటీ కోర్టు, ఐటీ టవర్ డిజైన్లు రెడీ
సాక్షి, అమరావతి: రాజధానిలో సిటీ కోర్టు, ఐటీ టవర్ భవనాల డిజైన్లు రెడీ అయ్యాయని, ఆన్లైన్ ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు ఎంపిక చేసిన వాటినే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో వెయ్యి అపార్టుమెంట్లను ప్రభుత్వమే స్వయంగా నిర్మించి, ప్రజలకు విక్రయించనుందని నారాయణ తెలిపారు. 2, 3 బెడ్రూమ్లుగా నిర్మించే అపార్టుమెంట్లను ప్రజలకు వేలం పద్ధతిలో విక్రయిస్తామని చెప్పారు. -
ఇక టార్గెట్ కమిషనరే?
సాక్షి,అమరావతిబ్యూరో: ‘ఇక ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయి.. ఇంతవరకు నానా తిప్పలు పడి ఎంతో కొంత పోగేసుకున్నాం.. మళ్లీ ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టాలంటే మరికొంత పోగేయ్యాలి.. కమిషనర్ మాత్రం చెప్పిన పనులు చేయటం లేదు.. మంత్రి నారాయణ మాటకే ఆయన విలువనిస్తున్నాడు..ఎవరు చెప్పినా లైట్‌గా తీసుకుంటున్నాడు. ఆయన్ను మార్చకుంటే నగరపాలక సంస్థ మన గుప్పిట్లోకి రాదు.. సంపాదన ఉండదు.. పార్లమెంట్ ఇన్చార్జిగా చినబాబు ఉన్నాడు..ఆయన హవా ఉండాలంటే మనం చెప్పిన పనులకు చేవులూపాల్సిన వారైతేనే కరక్టు వెంటనే కమిషనర్‌ను మార్చేయండి.’ ఇదీ విజయవాడ నగరంలో పాలకపక్షంలోని ఓ వర్గం ప్రభుత్వ పెద్దల వద్ద తెస్తున్న ఒత్తిడి. ఇప్పటికే నగర పాలకసంస్థలో జరుగుతున్న పరిణామాలు, మేయర్ వ్యవహారంతోపాటు కమిషనర్ బదిలీ విషయంపై పార్టీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న వద్ద పలువురు కార్పొరేటర్లతోపాటు పార్టీ కీలక నేతలు అంతర్గత చర్చలు జరిపారు. మేయర్ వ్యవహారం సమసిపోయిన తరువాత కమిషనర్ బదిలీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా నిర్ణయించారు. ఇప్పటికే నారా లోకేష్ వద్ద కమిషనర్ వ్యవహారంపై పంచాయితీ పెట్టడంతో ఆయన కమిషనర్ బదిలీపై హామీ ఇచ్చినట్లు సమాచారం. అసలేం జరుగుతుందంటే.. నగర పాలక సంస్థ కమిషనర్‌గా జె.నివాస్ బాధ్యతలు చేపట్టిన నుంచి పాలకపక్ష కార్పొరేటర్ల అక్రమ దందా గురించి లోతుగా అధ్యయ నం చేశాడు. పేదల సొమ్ము పిండుకోవటమే కాకుండా బినామీల ద్వారా నగర పాలక సంస్థ ఆరగించడం, ప్రతి పనికి రేటు బట్టి వసూళ్లు చేయడం, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం.. అభివృద్ధి పనులను అడ్డుకోవడం లాంటి పనులు చేస్తున్న వైనం గుర్తించారు. వీరిని ప్రోత్సహిస్తే అవినీతి మరకలు అంటే అవకాశం ఉందని భావించిన కమిషనర్ పాలకపక్ష సభ్యులను లైట్‌గా తీసుకున్నాడు. వారు సూచించిన పనులను పక్కన పెడుతున్నాడు. డివిజన్లలో స్వ యంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అక్రమ ఆదాయం తగ్గిపోవడంతో పాలకపక్ష కార్పొరేటర్లకు ఆగ్రహం తెప్పిం చింది. కమిషనర్ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ మంత్రి నారాయణ అండదండలు కమిషనర్‌కు ఉండడంతో పాలకపక్ష సభ్యుల ఫిర్యాదును కూడా లైట్‌గా తీసుకున్నారు. తెరపైకి రంజిత్‌బాషా నగర పాలక సంస్థ కమిషనర్‌గా మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా పనిచేసే పి.రంజిత్ బాషాను పేరు తెరపైకి తెచ్చారు. డిప్యూటీ కలెక్టర్‌గా హోదాలో ఉన్న ఆయన రెండు రోజుల కిందటే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. దీంతో ఆయన్ను నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నా యి. చినబాబు ఓఎస్డీగా పనిచేసే రంజీత్బాషాకు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన్ను పంపించి తమ పనులు చక్కదిద్దుకోవా లనే ఆలోచనలో ఉన్నారు. మంత్రి నారాయణ హవా విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరపాలక సంస్థపై పెద్దగా దృష్టి సారించలేదు. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే కమిషనర్ల నియామకం జరుగుతుంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత కార్పొరేటర్ల అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్న కమిషనర్‌కు పంపించి వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. మంత్రి నారాయణ హవా పెరిగితే నగరంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పరపతి తగ్గే అవకాశం ఉందని ఆయన అనుచరవర్గం భావిస్తుంది. నగర పాలక సంస్థలో జరిగే పరిణామాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయని వెంటనే చక్కదిద్దాలంటూ చినబాబు వద్ద పంచాయితీ పెట్టారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా విజయవాడ నగర పాలక సంస్థ కీలకమవుతుందని వెంటనే రంగంలోకి దింపి కార్పొరేటర్లుకు లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకోవాలని ఆయన దృష్టిలో పెట్టారు. వారి వాదనకు ఏకీభవించిన చినబాబు త్వరలోనే మీ కోరిక తీరుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
టూరిజం హబ్‌గా సూళ్లూరుపేట
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తయారుచేసేందుకు కృషి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాలు కేంద్రంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఆదివారం మంత్రి నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంత్రులు ఫ్లెమింగో బెలూన్లను ఎగురవేశారు. –సూళ్లూరుపేట -
నీటి కొలనులో అసెంబ్లీ
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం లో అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. శనివారం రాత్రి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు టవర్ డిజైన్‌తోపాటు వజ్రం డిజైన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టవర్ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 125 ఎకరాల విస్తీర్ణంలో కొలను 250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ టవర్ డిజైన్‌ను గురించి మంత్రులకు వివరించి అభిప్రాయాలు అడిగారు. అయితే చిత్రాల్లో డిజైన్ అంత ఆకర్శణీయంగా లేదని, పెద్ద చిత్రాలను చూపించాలని మంత్రులు కోరారు. డిజైన్లపై సోషల్ మీడియాలో అప్పుడే వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. డిజైన్లపై మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పూర్తిస్థాయి స్ట్రక్చరల్ డిజైన్లు ఇచ్చేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ఫోస్టర్స్ ప్రతినిధులు చెప్పినట్లు తెలిపారు. ఈ డిజైన్లు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామన్నారు. -
మంజునాథ మాత్రమే జాప్యం చేశారు
సాక్షి, అమరావతి : కాపు రిజర్వేషన్ల తీర్మానం నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వటంలో జస్టిస్ మంజునాథ జాప్యం చేస్తున్నారని మంత్రి చెప్పారు. నలుగురు సభ్యుల్లో ముగ్గురు మాత్రమే ఇప్పటి వరకు నివేదిక ఇచ్చారని.. దీంతో మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ముందుకు వెళ్లామని మంత్రి తెలిపారు. 50 శాతం రిజర్వేషన్లు దాటితే 9వ షెడ్యూల్లో చేర్చాలి. అందుకే తీర్మానం చేసి కేంద్రానికి పంపాం అని మంత్రి వివరించారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రావనే తాము అనుకుంటున్నామని.. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కాగా, కాపు కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మంజునాథ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్ సభ్యులుగా శ్రీమంతుల సత్యనారాయణ, మల్లెల పూర్ణచంద్రరావు, సుబ్రమణ్యం ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను ఈ ముగ్గురు సభ్యులు సమర్థించారు. చైర్మన్‌గా ఉన్న జస్టిస్ మంజునాథ మాత్రం తన సిఫారసులు ఇవ్వలేదు. కమిషన్ సమష్టిగా ఏకాభిప్రాయంతో నివేదిక ఇస్తే బాగుంటుందని సీఎం చెబితే మంజునాథ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్లు.. బాబు వ్యూహం! -
‘అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని తొలగిస్తాం’
సాక్షి, అమరావతి: పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన నిన్న (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు కదా, ప్రస్తుతమున్న నిర్మాణాల పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి బదులిస్తూ నది నుంచి వంద మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనన్నారు. ఏ నిర్మాణాలు ఈ పరిధిలో ఉన్నాయో చూస్తామని, సీఎం నివాసం కూడా ఈ పరిధిలోపు ఉందో లేదో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి హరిత ట్రిబ్యునల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. పర్యావరణ అనుమతులు తీసుకునే సమయంలో రాష్ట్రప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతూ రాజధాని నిర్మాణం చేపడతామని ఒక సవివర నివేదిక(డీపీఆర్)ను సంబంధిత మంత్రిత్వశాఖకు ఇచ్చిందని, దాన్ని తూచా తప్పక పాటించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని తెలిపారు. 1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్ కంపెనీలకిస్తాం..: రాజధానిలో 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చించామని చెప్పారు. సింగపూర్‌ది కేంద్ర ప్రభుత్వం, తమది రాష్ట్రప్రభుత్వం కావడంతో ఒప్పందం అమలులో కొన్ని ఇబ్బందులున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్రం ద్వారానే చేయాలని, ఈ చిక్కుల్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్ కంపెనీలకు ఇస్తామని, వారు లేఅవుట్లు వేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వాటిని విక్రయిస్తాయన్నారు. -
ఆ భవనాలను తొలగిస్తాం
సాక్షి, విజయవాడ: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పును అనుసరించి రాజధాని అమరావతి నిర్మాణం సాగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి ఎన్జీటీ శుక్రవారం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. నదికి వంద మీటర్లలోపు ఉన్న భవనాలన్నింటినీ తొలగిస్తామని నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు ఈ పరిధిలోకి వస్తుందో, లేదో చూడాలన్నారు. సీఎం ఇల్లు వంద మీటర్లలోపు ఉంటే తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎన్జీటీ నుంచి రాజధానికి అనుమతులు రావడం సంతోషంగా ఉందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాజధానికి అడ్డంకులు తొలగి పోయాయని, పర్యావరణ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. స్టార్టప్ ఏరియాలో 1691 ఎకరాల్లో ప్లాట్లు చేసి అమ్ముతామని, దీన్ని మూడు విడతల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతి కాపిటల్ సిటీలో 1600 కిలోమీటర్ల రహదారులకు 1100 కిలోమీటర్ల టెండర్లు పూర్తి అయ్యాయని, 12 నెలల్లో రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. -
పోలీసుల అదుపులో ‘శ్రీ చైతన్య’ సిబ్బంది
-
పోలీసుల అదుపులో ‘శ్రీ చైతన్య’ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు (టౌన్): ర్యాంకర్లను ప్రలోభపెడుతున్నారన్న వ్యవహారం కార్పొరేట్ సంస్థలైన శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మధ్య అగ్గి రాజేసింది. విద్యార్థుల్ని కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల సిబ్బంది లింగాల రమేష్, ఐ.పార్థసారథిని నెల్లూరు వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదం మొదలైందిలా: నగరంలోని నారాయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న నెల్లూరు చాకలి వీధికి చెందిన రియాజ్ అహ్మద్, ఆరిఫా దంపతుల కుమారుడు ఎండీ ఫాజిల్‌ను తమ కళాశాలలో ఉచితంగా బోధిస్తామని చెప్పి శ్రీచైతన్య ఉద్యోగులు లింగాల రమేష్, ఐ.పార్థసారథిలు ఈ నెల 20 హైదరాబాద్ తీసుకెళ్లిన సంగతి విదితమే. అక్కడి అప్పయ్య సొసైటీలోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఉన్న ఫాజిల్‌ను కలిసేందుకు అతని తల్లిదండ్రులు యత్నించినా అవకాశమివ్వని నేపథ్యంలో విద్యార్థి తల్లి ఆరిఫా 25న నెల్లూరు వన్‌టౌన్‌లో స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శుక్రవారం శ్రీచైతన్య సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం వన్‌టౌన్ పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. శనివారం ఉదయానికి విద్యార్థి ఫాజిల్‌ను నెల్లూరు తీసుకురానున్నారు. రాజకీయ పలుకుబడితో ఇబ్బంది పెడుతున్నారు: రాజకీయ పలుకుబడితోనే మంత్రి నారాయణ తమ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలతో తమకు గల భాగస్వామ్యంపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తల్లిదండ్రుల అంగీకారం, పిల్లల ఇష్టంతోనే నారాయణ స్కూల్ నుంచి శ్రీచైతన్య స్కూల్‌కు ముగ్గురు విద్యార్థులను తీసుకెళ్లినట్లు తెలిపారు. నిందలు దారుణం: నెల్లూరులోని తమ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభపెట్టి హైదరాబాద్‌కు తరలించడమే కాకుండా.. శ్రీ చైతన్య విద్యాసంస్థల నిర్వాహకులు తమ సంస్థపై నిందలు వేయడం దారుణమని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కాసులు కొట్టే కాలేజీలు
సాక్షి, అమరావతి: నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు నిబంధనలకు పాతరేస్తూ దశాబ్దాల తరబడి విద్యార్ధులను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ఎడ్యుకేషనల్ ట్రస్టుల మాటున ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. చదువును వ్యాపార వస్తువుగా మార్చి ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తూ ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌తో విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. మరోపక్క ఎడ్యుకేషన్ ట్రస్టు మాటున సేవా కార్యక్రమమంటూ ఆదాయ పన్నుతో సహా ఇతర పన్నులు ఎగవేస్తున్నాయి. ఇదేదో బయటి నుంచి వినిపించే విమర్శలు కాదు. ఈ రెండు సంస్థల వ్యవహారాలపై విచారణ జరిపిన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్విభాగం తేల్చిన నిజాలు. అక్రమాలకు పాల్పడుతున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీల గుర్తింపును రద్దుచేయాలని కొద్దికాలం క్రితం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. గత ఏడాదికి సంబంధించి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని కాలేజీలను క్షుణ్నంగా తనిఖీలు చేసి ఈ నివేదిక అందించింది. ఈ రెండు సంస్థల కాలేజీలలో తనిఖీలు జరిపిన తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా రీజనల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి నివేదిక తయారు చేసింది. విజిలెన్స్ తనిఖీ నివేదికలోని ముఖ్యాంశాలు... అడుగడుగునా అక్రమాలే... లాభాపేక్షలేని విద్యా సంస్థలుగా రిజిస్టరైన నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు, కోచింగ్ ఫీజు, హాస్టల్ ఫీజు... ఇలా లక్షల్లో దండుకుంటూ విద్యార్ధులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. చారిటబుల్ ట్రస్టులుగా పేర్కొంటున్నా ఈ రెండు సొసైటీల్లో ప్రెసిడెంట్లు, సభ్యులంతా ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. సొసైటీ బైలాల్లో పేద విద్యార్ధులకు ఫ్రీ కోచింగ్ తరగతులు, కమ్యూనిటీ డెవలప్మెంటు ప్రాజెక్టులు, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, పేదలను ఆదుకొనేందుకు చేతి వృత్తుల కేంద్రాలు, బాల్వాడీ కేంద్రాలు, వయోజన విద్యాకేంద్రాల ఏర్పాటు అంటూ వల్లెవేసిన సంస్థలు ఇందులో ఏ ఒక్కటీ ఆచరించకపోగా విద్యను డబ్బులమయం చేశాయి. ⇒ ఈ రెండు సంస్థలు ఏటా ఫీజులు, ఇతరాల పేరిట రూ.వందల కోట్ల మేర వసూలు చేస్తున్నా ఇన్‌కమ్‌టాక్స్ రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేనట్లుగా చూపుతున్నాయి. ఎడ్యుకేషనల్ సొసైటీ, కమిటీల పేరిట పన్నులు ఎగవేస్తున్నాయి. ⇒ శ్రీచైతన్య విద్యాసంస్థ 2010–11, 2011–12కు సంబంధించిన ఐటీ రిటర్నులు, ఆడిట్ రిపోర్టు కాపీలను విజిలెన్సుకు అందించింది. వాటిని పరిశీలించిన విజిలెన్సు అధికారులు నివ్వెరపోయారు. ఆడిట్ రిపోర్టులో 2010–11లో రూ.200 కోట్ల మేర టర్నోవర్ ఉన్నట్లు చూపి ఆదాయపు పన్ను రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేదని చెబుతూ పన్నులను చెల్లించలేదు. పన్నుల ఎగవేత వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ⇒ విద్యా వ్యాపారంలో లాభాలకోసం కాలేజీలకు శాశ్వత అఫ్లియేషన్ కాకుండా తాత్కాలిక అఫ్లియేషన్లు తీసుకుంటున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులపై ఇంటర్ బోర్డు స్పష్టమైన నిబంధనలు విధించినా ఈ కాలేజీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజులుంటున్నాయి. లైబ్రరీ, లాబొరేటరీ లాంటి ఏర్పాట్లు మచ్చుకైనా లేకుండా ఇరుకైన గదుల్లో ప్రధాన రహదారుల పక్కన అపార్టుమెంట్లలో ఈ కాలేజీలను నెలకొల్పారు. ⇒ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల కింద పెంచిన ప్రకారం చూసినా రూ.3 వేల లోపే తీసుకోవాలి. కానీ ఈ కాలేజీలు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు పిండుతున్నాయి. హాస్టల్, ఇతర కోచింగ్‌లంటూ అదనంగా మరో 2 లక్షలకు పైగా దండుకొంటున్నాయి. ⇒ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఈ రెండు కాలేజీలు విక్రయించిన దరఖాస్తుల సమాచారం, అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల వివరాల రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. అడ్మిషన్లు పూర్తయ్యాక కంప్యూటర్ ద్వారా తీసిన కాపీలపై ఆర్ఐఓలతో సంతకాలు చేయించుకుంటున్నాయి. ⇒ ప్రైవేట్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లను రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, వికలాంగులకు 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం ఇవ్వాల్సి ఉన్నా ఈ సంస్థలు దీన్ని పాటించడం లేదు. ⇒ లాభదాయకంగా ఉండే ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండానే తప్పుడు కోడ్ నెంబర్లతో కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ⇒ ఒక భవనంలో కాలేజీకి అనుమతి పొంది వేరే చోటుకు మార్చేస్తున్నారు. కొన్ని కాలేజీలను తనిఖీ చేయగా అక్కడ రిజిస్టర్లో పేర్లున్న విద్యార్ధుల్లో కొందరు వేరేచోట చదువుతున్నట్లు గుర్తించారు. ⇒ ఎంపీసీ, బైపీసీ తరగతులు తప్పించి ఆర్ట్స్ తరగతులను ఈ కాలేజీలు నిర్వహించడం లేదు. అవి అంత లాభదాయకం కాకపోవటమే కారణం. కొన్ని చోట్ల ఆర్ట్స్ తరగతులకు అనుమతులు తీసుకొని వాటిని ఎంపీసీ, బైపీసీ సెక్షన్లుగా మార్పు చేస్తున్నాయి. ⇒ విద్యార్ధులకు ఎలాంటి వ్యాయామ విద్యను బోధించడం లేదు. అందుకు సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం లేదు. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధం. ⇒ అద్దె భవనాల్లో కాలేజీలను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక అనుమతులు పొందుతున్నాయి. ఇది కేవలం అయిదేళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆలోపు అవి సొంత భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా అద్దె భవనాల్లోనే దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి. ఫీజులపై కమిటీ వేయాలి... కార్పొరేట్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మండల, పట్టణ, తదితరాల వారీగా అధ్యయనం చేసి ఫీజులను నిర్ణయించాలి. ఆయా సంస్థలకు వస్తున్న ఆదాయం, జీతాల చెల్లింపు, ఖర్చులను బేరీజు వేసి ఫీజులను నిర్ణయించాలి. విద్యాశాఖలో వియ్యంకుల వారి సంస్థ మాటే వేదవాక్కు నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల మూలాలు ఏపీలోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పలు బ్రాంచీలు నెలకొల్పి ఫీజుల పేరిట రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ విద్యార్ధులను పీల్చిపిప్పిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నా ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోంది. నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏకంగా తన కేబినెట్ సహచరుడిగా చేసుకోవడంతో నారాయణ విద్యాసంస్థ ఆగడాలపై అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ స్వయానా వియ్యంకులు కూడా కావడంతో విద్యాశాఖలో నారాయణ సంస్థలు చెప్పిందే వేదంగా మారిపోయింది. -
వచ్చే నెల 25న రాజధాని తుది డిజైన్లు
-
వచ్చే నెల 25న రాజధాని తుది డిజైన్లు
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం తుది డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ వచ్చే నెల 25వ తేదీన మరోసారి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇందుకోసం సీఎం చంద్రబాబునాయుడు, ఆయన బృందం ప్రత్యేకంగా అక్టోబర్ 24, 25 తేదీల్లో లండన్ వెళ్లనున్నారు. ఇప్పటివరకు నార్మన్ ఫోస్టర్ సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరపగా అక్టోబర్ 24న చంద్రబాబు ఆ సంస్థ ఎండీ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సీఎం బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో సీఆర్డీఏ వ్యవహారాలపై మంత్రి నారాయణతో కలసి సమీక్ష నిర్వహించారు. రాజధాని డిజైన్లపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన లండన్ పర్యటన గురించి తెలిపారు. వచ్చే నెల 24న నార్మన్ ఫోస్టర్‌తో సమావేశం తర్వాత 25వ తేదీన తుది డిజైన్లు ఖరారు చేద్దామని అధికారులతో చెప్పారు. ఇదిలా ఉండగా సీఎం లండన్ పర్యటనకు ముందుగా అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లండన్‌లోనే నార్మన్ ఫోస్టర్ బృందం రాజధాని డిజైన్ల రూపకల్పనపై ప్రత్యేక సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సులో తన బృందంతో కలిసి పాల్గొని సలహాలిచ్చేందుకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అంగీకరించారని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. -
పెద్దల అండతో అవినీతి యాత్ర
సాక్షి, అమరావతి: అవినీతి తిమింగలం గొల్ల వెంకట రఘు బాగోతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, వెండి, హోటళ్లు, భవనాలు చూస్తూంటే సామాన్యుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అదే సమయంలో ఒక అధికారి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించే అవకాశముంటుందా అనే అనుమానాలూ కలుగుతున్నాయి. రఘు అవినీతికి విశాఖలోనే బీజం పడినట్టు తెలిసింది. విశాఖ సిటీ ప్లానర్‌గా వెళ్లిన ఆయన.. అక్కడ్నుంచి మొన్న ఏసీబీకి దొరికే వరకూ పెద్దల అండదండలతో అప్రతిహతంగా అవినీతి యాత్ర సాగించినట్టు సమాచారం. చివరకు డీటీసీపీ(టౌన్ అండ్ కంట్రీ ప్లానర్ డైరెక్టర్) పోస్టు తెచ్చుకోవడం కోసం కూడా డబ్బును మంచినీళ్లలా వెదజల్లినట్టు తెలిసింది. ఐఏఎస్ పేరు చెప్పి రెచ్చిపోయారు.. రఘు విశాఖ సిటీ ప్లానర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఐఏఎస్ అధికారి సమీర్‌శర్మ జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. ఇక్కడే సమీర్‌శర్మతో రఘుకు బాగా చనువు ఏర్పడింది. అదే సమయంలో ఓ ప్రైవేటు లైసెన్స్డ్ ఇంజనీర్ ఒకరు రఘుకు పరిచయమయ్యారు. ఈ ఇంజనీర్ దగ్గర ప్లాన్ గీయించుకుంటే చాలు.. రఘు ఇంకేమీ పట్టించుకోకుండా అనుమతి ఇచ్చేసేవారు. దీనికి కమిషనర్ స్థాయిలో సైతం క్షణాల్లో అనుమతులు వచ్చేవి. ఆ సమయంలో విశాఖలోని 80 శాతం మంది.. ఈ లైసెన్స్డ్ ఇంజనీర్ వద్దకే వెళ్లేవారు. వీరిద్దరి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్ల రఘు రూ.కోట్లకు కోట్లు సంపాదించారు. సమీర్‌శర్మ కమిషనర్‌గా ఉన్నంత కాలం రఘుకు తిరుగు లేకుండా పోయింది. విశాఖలో ఏ మూల నిర్మాణాలు జరిగినా, వెంచర్లు వేసినా, భవంతులు నిర్మించినా, అపార్ట్మెంట్లు కట్టినా రఘుకు చిటికెలో తెలిసేది. నిర్మాణదారులెవరైనా సరే రఘును కలసి మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. లేకుంటే వారి ప్రాజెక్టు మూలన పడిపోతుంది. కాగా, రఘుతో సమీర్‌శర్మకు ఉన్న చనువు వల్ల ఆయన కూతురు సుమేధా శర్మ సబూరి సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సమీర్ శర్మ షిర్డీ సాయిబాబా భక్తుడు. ఈ నేపథ్యంలోనే షిర్డీలో ప్రధాన రహదారికి పక్కన సూరజ్‌కుంజ్ అనే గెస్ట్‌హౌస్‌ను రఘు నిర్మించారు. ఆ తర్వాత సమీర్‌శర్మ విశాఖ నుంచి బదిలీపై వెళ్లారు. అనంతర కాలంలో సుమేధా శర్మ.. సబూరి సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డీటీసీపీ పదవి తెచ్చుకోవడంలోనూ.. రాష్ట్ర విభజన వరకు తిమ్మారెడ్డి డీటీసీపీగా ఉండేవారు. ఆ పోస్టును సాధించుకోవడంలో రఘు కృతకృత్యులయ్యారు. ఇంతలోనే సీఆర్డీఏ ఏర్పాటు కావడం, లే అవుట్లకు అనుమతులివ్వడం వంటివి ఆయనకు వరంగా మారాయి. టౌన్ ప్లానింగ్ వ్యవస్థకు రఘుయే అధికారి కాబట్టి.. ఇక అవినీతి యాత్రకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తిమ్మారెడ్డి ఆ తర్వాత ఏపీ పోస్టింగ్ తెచ్చుకున్నా.. ఆయన డీటీసీపీగా రాకుండా రఘు అడ్డుకున్నారు. ఈనెలాఖరున పదవీ విరమణ చేస్తుండటంతో.. రఘు ఇక పదోన్నతుల వసూళ్లకు తెరతీశారు. దాదాపు 54 మందికి పదోన్నతులిచ్చారు. విజయవాడ అయితే రూ.15 లక్షలు, విశాఖ అయితే మరికొంత ఎక్కువ.. ఇలా చోటును బట్టి రేటును ఫిక్స్ చేశారు. విజయవాడ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా ఉన్న ఓ వ్యక్తి ఈ వసూళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. బినామీ బంధం ఇక్కడే బలపడింది.. రఘుతో పాటు శివప్రసాద్, గాయత్రి పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. గాయత్రి తల్లి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ చనిపోయింది. కారుణ్య నియామకంలో భాగంగా గాయత్రికి ఉద్యోగం వచ్చింది. అప్పట్లో రఘు విజయవాడలో పనిచేసేవారు. ఇక్కడే వీళ్లిద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఈ క్రమంలో గాయత్రి భర్త శివప్రసాద్ ఉద్యోగం కూడా పర్మినెంట్ అయినట్టు తెలిసింది. విచిత్రమేమంటే రఘు సంపాదించిన ఆస్తులు.. ఆయన భార్య కంటే గాయత్రి పేరు మీదే ఎక్కువగా ఉన్నాయి. జీహెచ్ఎంసీలోనూ కొనసాగిన రఘు హవా.. విశాఖ నుంచి రఘు ఆ తర్వాత హైదరాబాద్ బదిలీ అయ్యారు. అక్కడా తన హవా కొనసాగించారు. అప్పట్లో కొందరు నేతలతో సంబంధాలు నెరిపి.. భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారు. బహుళ అంతస్తులను ఎక్కడ నిర్మిస్తున్నారు? వాటి లోటుపాట్లు ఏమిటి? వంటివి తెలుసుకొని.. వెంటనే ఆయా నేతలకు సమాచారమివ్వడం, వారితో సెటిల్మెంట్లు, అనుమతు లు.. ఇలా క్షణాల్లో వ్యవహారాలను చక్కబెట్టేవారు. తన కన్నా పైస్థాయి అధికారులున్నా కూడా రఘు లెక్క చేసే వారు కాదు. సమీర్ శర్మ వంటి ఉన్నతస్థాయి అధికారి అండదండలు ఉండటం వల్లే రఘు ఈ విధంగా చెలరేగిపోయారనే ప్రచారం ఉద్యోగ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అంత సంబంధం లేకపోతే సమీర్ కూతురు సుమేధా రఘు సంస్థలో పెట్టుబడులు ఎందుకు పెడుతుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సమీర్‌తో పాటు మరికొందరు అధికారులు, నేతలూ అండదండలు అందించినట్టు తెలిసింది. మంత్రి నారాయణ సైతం.. గతంలో ఉన్న డీటీసీపీ తిమ్మారెడ్డి స్థానంలో రఘును తెచ్చుకున్నారం టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఆర్డీఏలో తాను చెప్పినవన్నీ చేసారనే ఉద్దేశంతోనే రఘుకు మంత్రి నారాయణ ఆ పోస్టు ఇప్పించారన్న ఆరోపణలున్నాయి. పలుమార్లు రఘుపై ఫిర్యాదులు వచ్చినా ఐఏఎస్ అధికారులతో పాటు మంత్రులూ చూసీ చూడనట్టు వ్యవహరించారని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి. పదోన్నతులు ఆపేయండి పదోన్నతులు కల్పిస్తూ రఘు ఇచ్చిన ఆదేశాలపై ఆరోపణలు రావడంతో.. వెంటనే వాటిని నిలిపిపేయాలని మంత్రి నారాయణ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, పదోన్నతులు అమలు చేయాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒత్తిడి తెస్తున్నారని అధికారులు చెప్పగా.. అయినా కూడా రఘు ఆమోదముద్ర వేసిన పదోన్నతులు అమలు చేయొద్దని మంత్రి సూచించారు. -
బాహుబలి సెట్టింగుల వంటివే కావాలి
రాజధాని డిజైన్లపై రాజమౌళికి మంత్రి నారాయణ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: బాహుబలి సినిమా సెట్టింగ్‌ల తరహాలోనే.. రాజధానిలో భవనాల కోసం కూడా సలహాలివ్వాలని సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన సీఎం వెంటనే రాజమౌళిని కలసి సలహాలు తీసుకోవాలని ఇటీవల మంత్రి నారాయణను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి నారాయణ, శ్రీధర్‌లు.. అపాయింట్మెంట్ తీసుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో రాజమౌళితో భేటీ అయ్యారు. వారిచ్చిన డిజైన్లు చూసిన రాజమౌళి తన అభిప్రాయాలను చెప్పి, మరోసారి కలుద్దామని పంపించినట్లు తెలిసింది. -
కాపులపై అరాచకశక్తుల ముద్ర
-
కాపులపై అరాచకశక్తుల ముద్ర: నారాయణ
సాక్షి, అమరావతి: తుని ఘటనతో కాపులంటే అరాచకశక్తులుగా ముద్రపడిం దని రాష్ట్ర మంత్రి పి.నారాయణ అన్నారు. ముద్రగడ పాదయాత్ర విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. ముద్రగడ ‘చలో అమరావతి’ పాదయాత్ర సందర్భంగా అల్లర్లకు అరాచకశక్తులు యత్నిస్తున్నట్టు నిఘా సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం అప్రమత్తమైందని, పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని, మూడు లేదా ఆరు నెలల్లో నివేదిక అందుతుందని చెప్పారు. కాపు రిజర్వేషన్ల కోసం 35 ఏళ్లు ఆగినవాళ్లు కొద్ది నెలలు ఆగలేరా? అని ప్రశ్నించారు. -
నుడాలో ముసలం
►వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న పెంచలరెడ్డి ►నెల రోజులుగా నడిచిన హైడ్రామా ►చైర్మన్ అనుచరగణం హడావుడితో ఆందోళన ►మంత్రి నారాయణపై ఒత్తిడి తెచ్చి మరీ పదవికి దూరం ►వైస్ చైర్మన్‌గా కమిషనర్ ఢిల్లీరావు నియామకం ►జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ నెల్లూరు : నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా)లో అప్పుడే ముసలం మొదలైంది. కనీసం కార్యాలయం కూడా ఏర్పాటు కాక ముందే కీలక అధికారి వైస్ చైర్మన్ తప్పుకోవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా పూర్తిస్థాయిలో నుడా పట్టాలు ఎక్కకముందే జరుగుతున్న పరిణామాలను చూసి అధికారి తనవల్ల కాదంటూ వైదొలగారు. అది కూడా మంత్రి నారాయణను ఒప్పించి మరీ వైస్ చైర్మన్ పదవికి దూరమయ్యారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే చైర్మన్‌తో బేధాభిప్రాయాలు వల్లే తప్పుకున్నాడని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. గత ఏడాది నవంబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా)ని ఏర్పాటు చేస్తూ జీఓను వెలువరించింది. నెల్లూరు నగరం, గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు. అలాగే 21 మండలాల పరిధిలో ఉన్న 156 గ్రామాలను నుడా పరిధిలో చేర్చారు. మొదటి నుంచి పెంచలరెడ్డి పర్యవేక్షణ నుడా కార్యాచరణను నుడా వైస్ చైర్మన్‌గా నియమితులైన చల్లా పెంచలరెడ్డి మొదటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. నుడాకు పరిపాలన భవనం, అవసరమైన సిబ్బంది, ఇతర అంశాలపై దృష్టి సారించారు. మున్సిపల్ శాఖ నుంచి కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై నుడాకు తీసుకొచ్చి మొదట కార్యకలాపాలు మొదలుపెట్టాలని భావించారు. ఆ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు కూడా పరిస్థితిని నివేదించారు. అలాగే తాత్కాలిక కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే చివరి వారంలో నుడాకు పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని నియమించి మరో ఆరుగురు సభ్యులతో బోర్డును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు మిగిలిన సభ్యులు అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా పెంచలరెడ్డే పర్యవేక్షించారు. వాస్తవానికి రాష్ట్రంలోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ హోదా ఉండే ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. అయితే నుడా కొత్తగా ఆవిర్భవించటంతో పూర్తి అనుభవం ఉన్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి పెంచలరెడ్డిని నియమించారు. సదరు అధికారి మంత్రి నారాయణకు అత్యంత నమ్మకస్తుడు కావటంతో మంత్రి ఓఎస్డీ బాధ్యతలతో పాటు వైస్ చైర్మన్‌గాను పనిచేశారు. ఈ క్రమంలో ఆయన తప్పుకోవటంపై అధికార పార్టీలోనే భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు, కావలి నుంచి తడ వరకు తమ పరిధిలో ఉంటుందని కొందరు అప్పుడే రియల్టర్లు, ఇతరుల వద్ద హడావుడి చేస్తున్నట్లు సమాచారం. చైర్మన్, పాలకవర్గం రాకతో.. ఇదిలా ఉంటే పాలకవర్గం రావటంతో కొంత ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా చైర్మన్ అనుచరగణం హడావుడికి వైస్‌చైర్మన్ కొంత ఇబ్బంది పడుతున్నారు. సర్వీసులో రిమార్కులు లేకుండా ఉన్న తనకు అనవసరమైన ఇబ్బందులు వస్తాయనే యోచనతో వైస్‌చైర్మన్ పదవి నుంచి తప్పించమని మంత్రి నారాయణను కోరినట్లు తెలిసింది. అయితే మంత్రి కొనసాగమని, ఇబ్బందులు ఉంటే పరిష్కరిద్దామని చెప్పినప్పటికీ కొందరితో మంత్రిపై ఒత్తిడి తెచ్చి మరీ తప్పుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిత్రం నగరపాలక సంస్థ కమిషనర్ ఢిల్లీరావును నుడా వైస్ చైర్మన్‌గా నియమించారు. -
241 ఎకరాల్లో శాఖమూరు పార్కు
4 జోన్లుగా విభజన.. సంక్రాంతికి పూర్తి: మంత్రి నారాయణ వెల్లడి సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో అన్ని హంగులతో అత్యాధునికంగా 241 ఎకరాల్లో నాలుగు జోన్లుగా శాఖమూరు పార్కును రూపొందించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్ మెట్ సంస్థ శాఖమూరు పార్కు డిజైన్‌ను రూపొందించి ఇచ్చినట్లు తెలిపారు. మొదటి జోన్ 85 ఎకరాలు, రెండో జోన్ 34, మూడో జోన్ 49, నాలుగో జోన్ అంబేడ్కర్ పార్కుతో కలిపి 73 ఎకరాలు ఉంటుందని వివరించారు. మొదటి జోన్లో 46 ఎకరాలలో ఏర్పాటు చేసే అమ్యూజ్మెంట్ పార్కులో వాటర్ వరల్డ్‌తోపాటు క్రాఫ్ట్ బజార్ ఉంటాయని తెలిపారు. రెండో జోన్‌ను పూర్తిగా చిన్నారులకు కేటాయించారని, సాహస క్రీడలు, చిల్డ్రన్ అడ్వెంచర్, అవుట్ డోర్ జిమ్ ఉంటాయన్నారు. మూడో జోన్లో ఫ్లవర్ గార్డెన్, డక్ పాండ్ ఉంటుందని తెలిపారు. నాలుగో జోన్లో కల్చరల్ మ్యూజియం, అంబేడ్కర్ పార్కు, ఇండోర్ అథ్లెటిక్ సెంటర్, స్పోర్ట్స్ క్లబ్, ఫైవ్ స్టార్ హోటల్ వంటివి ఉంటాయన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి వచ్చే సంక్రాంతి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సీఎం సూచన మేరకు ఈ పార్కుకు ‘గాంధీ మెమోరియల్’ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
లీకేజీలు చాలా చిన్నవిషయం
-
లీకేజీలు చాలా చిన్నవిషయం: మంత్రి నారాయణ
అమరావతి: ఏపీ సచివాలయంలో తాజా లీకేజీలపై మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించారు. లీకేజీలు చాలా చిన్న విషయమని.. భూతద్ధంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. స్లాబ్ పై ఉన్న డక్ షీట్ బయటకు రావడం వల్లే నీళ్లు లీకయ్యాయని మంత్రి తెలిపారు. మనం కట్టుకున్నఇళ్లలో కూడా మొదట్లో చాలా లోపాలుంటాయని.. అయితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వర్షం తగ్గగానే మరమ్మత్తులు చేస్తామన్నారు. లోపాలను రెండేళ్లపాటు నిర్మాణ సంస్థలే సరిచేస్తాయని ఆయన తెలిపారు. కాగా మంగళవారం సచివాలయంలో బయటపడ్డ లీక్ లపై మంత్రి నారాయణను మీడియా ప్రశ్నించింది. అయితే మొదట ఆ విషయం తనకు తెలియదని నారాయణ తోసిపుచ్చడం గమనార్హం. -
'హైకోర్టు డిజైన్లపై ప్రజంటేషన్ ఇస్తాం'
అమరావతి: హైకోర్టు డిజైన్లపై ప్రధాన న్యాయమూర్తికి గురువారం ప్రజేంటేషన్ ఇస్తామని ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం మరోసారి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సచివాలయం డిజైన్లపై గురువారం జీఏడీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 250 ఎకరాల పరిధిలో అసెంబ్లీ, సచివాలయం భవనాలు నిర్మాణం జరగనుందన్నారు. సెప్టెంబర్ 15 నాటికి అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఇంటీరియర్స్‌తో కలిపి తుది డిజైన్లను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు అందజేస్తారని ఆయన తెలిపారు. -
గృహ నిర్మాణాలపై మంత్రి నారాయణ సమీక్ష
అమరావతి: గృహ నిర్మాణాలపై ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ పేదలకు లక్షా 93 వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. సొంత స్థలం ఉన్నవారికి రూ. రెండున్నర లక్షలు, భూమి లేనివారికి రూ. మూడు లక్షలు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. జీ ప్లస్ 3 విధానంలో మూడు రకాలుగా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. షెర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. -
వలస నేతలతో పార్టీ కట్టు తప్పుతోంది
-
వలస నేతలతో పార్టీ కట్టు తప్పుతోంది
- పార్టీలో క్రమశిక్షణ లేదు.. మావాళ్లు గీత దాటుతున్నారు - ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే సమస్య - మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు..అలాంటి పార్టీలో నేడు క్రమశిక్షణ లోపిస్తోంది.. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు. సమస్యంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి వల్లే. వారిని కలుపుకొని పార్టీలో ఉన్న పాతతరం, యువతరం ముందుకెళ్లలేక పోతోంది. లక్ష్మణరేఖ దాటుతున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీలోని క్రమశిక్షణా రాహిత్యాన్ని నర్మగర్భంగా అంగీకరించారు. అన్నీ సెట్‌రైట్ చేస్తా.. అందుకే తెలంగాణా పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నా... అక్కడి వారికి సమయం కేటాయించలేకపోతున్నా.. అని చెప్పుకొచ్చారు. మహానాడు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణాలో ఒకలా.. ఆంధ్రాలో మరోలా బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన స్పందిస్తూ.... ఇలాంటి అంశాలపై అంతర్గతంగా తాము చర్చించుకుంటామని,, ప్రతి విషయంలోనూ రోడ్డెక్కి మాట్లాడలేమని తెలిపారు. జీవీఎంసీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల న్నీ ఒకేసారి జరుగుతాయని స్పష్టంచేశారు. వచ్చే ఏడాదిలోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి చేస్తామని, ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నిరుద్యోగభృతి విధానంపై అధ్యయనం చేస్తున్నామని, ఏ దేశంలో మంచి చేయూతనిస్తున్నారో గమనించి దాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 90 లక్షల మంది వ్యూయర్స్ ట్విటర్స్, ఫేస్బుక్లో మహానాడు చూశారన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణా పార్టీ శాఖల అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్. రమణ పాల్గొన్నారు. భావి తరాలకు నా కానుక అమరావతి భావితరాలకు తానిచ్చే కానుకే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజారాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు తనకు రెండు కళ్లు లాంటివన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడు మూడో రోజయిన సోమవారం ‘ప్రజారాజధాని అమరావతి’పై పెట్టిన తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని ఐదు ముఖ్యమైన రాజధాని నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ఆయన నూతన రాజధాని కోసం పడుతున్న ఇక్కట్లను, చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, శాసనసభ, శాసనమండలిని కేవలం ఏడాదిలోగా పూర్తి చేశామన్నారు. హైదరాబాద్‌ను తాను ఎలా అభివృద్ధి చేసిందీ, ఆ సమయంలో తాను ఎలా కష్టపడిందీ ఏకరవు పెట్టారు. ఇప్పుడు కూడా తాను అన్ని అవరోధాలను అధిగమించి రాజధానిని నిర్మిస్తానని, శంకుస్థాపనే బ్రహ్మాండంగా జరిగిందని, అన్ని ప్రార్థనా మందిరాల నుంచి ఆశీర్వచనాలు తెప్పించామని తెలిపారు. బలోపేతమాన రాజధానిని నిర్మించేందుకు ఎంత కష్టమైనా పడతానని, తన అనుభవాన్ని పూర్తిగా రంగరించి ముందుకు సాగుతానని చెప్పారు. రాజధానికి రైతులు సుమారు రూ.40వేల కోట్ల విలువైన 33,388 ఎకరాల భూమిని ఇచ్చారని, వారందరికీ వేలవేల దండాలు చెప్పాలన్నారు. వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మూడు ప్రణాళికలు తయారు చేశామని, కేపిటల్ సిటీ, కేపిటల్ రీజియన్ కాన్సెప్ట్, సీడ్ కేపిటల్ ఏరియాలుగా విభజించామని తెలిపారు. లండన్‌కు చెందిన నార్మన్ అసోసియేట్స్ ఇస్తున్న ఐకానిక్ బిల్డింగ్ డిజైన్స్ దాదాపు పూర్తి కావొచ్చాయని చెప్పారు. అమరావతి అంటే తెలుగు జాతి గుర్తుకువచ్చేలా డిజైన్ చేస్తున్నట్టు వివరించారు. ఈ తీర్మానాన్ని మంత్రి నారాయణ ప్రవేశపెట్టగా శ్రావణ్‌కుమార్ మద్దతిచ్చారు. చంద్రబాబు మాట్లాడిన అనంతరం తీర్మానాన్ని ఆమోదించినట్టు ప్రకటించారు. -
ఈ పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు
మంత్రి నారాయణకు సీఎం దంపతుల పరామర్శ నెల్లూరు రూరల్: మంత్రి నారాయణ కొడుకు నిషిత్ అకాల మరణం తనను కలచి వేసిందని, ఈ పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి శనివారం వచ్చి ఆయనను పరామర్శించారు. నిషిత్ చిత్రపటానికి పూలమాల వేసి వారు నివాళులర్పించారు. నారాయణ కుటుంబ సభ్యులతో సీఎం కొంతసేపు గడిపారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం దురదృష్టకరం, బాధాకరమన్నారు. మంత్రి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఉంటే, నారాయణ విద్యాసంస్థలను నిషిత్ సమర్థంగా నడిపేవాడన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో కొడుకు మృతిచెందడం నారాయణకు తీరని లోటన్నారు. ఈ విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. నారాయణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రబాబు హెలికాప్టర్లో విజయవాడకు వెళ్లిపోయారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఢిల్లీలో ఆ ఆరు గంటలు...
- ఎవరికీ అందుబాటులో లేని చంద్రబాబు - రహస్యంగా కొందరు ప్రముఖులతో భేటీ సాక్షి, న్యూఢిల్లీ/ అమరావతి: అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని గంటలపాటు ఎవరికీ అందుబాటులో లేకుండా అదృశ్యమయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు బృందం అక్కడి నుంచి నేరుగా విజయవాడ రావాల్సి వుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్టుగా 3.15కు ఒకసారి, ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వెళుతున్నట్టు 3.55కు ఒకసారి మీడియాకు అధికార వర్గాల ద్వారా సమాచారం అందించారు. కానీ రాత్రి తొమ్మిది గంటల వరకూ సీఎం ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మీడియాను నమ్మించారు. అయితే ఆయన రహస్యంగా ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ నగరం చేరుకుని కొందరు ప్రముఖులతో భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాత్రి 8.35 వరకు తన రహస్య మంతనాలు ముగించుకున్న ముఖ్యమంత్రి తిరిగి తొమ్మిది గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఢిల్లీలో ఎక్కడికెళ్లారు, ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. సాయంత్రానికే రాష్ట్రానికి చేరుకుంటారని షెడ్యూలులో ఉన్నా.. దాన్ని పక్కనపెట్టి అత్యవసరంగా, రహస్యంగా మంతనాలు జరపడం ఆసక్తి కలిగించింది. చంద్రబాబు రాత్రి 9.30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. శనివారం విజయవాడ నుంచి నెల్లూరు వెళ్లి మంత్రి నారాయణ, ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. -
కన్నీటి పర్యంతమైన మంత్రి నారాయణ
-
నారాయణను ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. వైఎస్ జగన్ గురువారం మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా నిషిత్ మృతిపట్ల ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు అతని అంత్యక్రియలు నెల్లూరులో నిర్వహించారు. -
నిషిత్ అంత్యక్రియలు పూర్తి
నెల్లూరు : రోడ్డు ప్రమాదంలో కొడుకును పోగొట్టుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రమాదం జరిగిన రాత్రి తన కుమారుడు నిషిత్‌తో ఫోన్లో మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కుమారుడికి ఫోన్ చేశారు. ’నాన్న నిషీ ఎక్కడున్నావ్... టైమ్ పదకొండు అవుతోంది, ఇంకా ఇంటికి వెళ్లలేదా?. భోజనం చేశావా? జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. రెండురోజుల్లో తిరిగి వచ్చేస్తాను. నువ్వు కారు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త’ అంటూ ఫోన్లో మాట్లాడారు. అవే తన కొడుకుతో మంత్రి మాట్లాడిన చివరి మాటలు. ...మరికొద్ది గంటల్లోనే కుమారుడి మరణవార్త వినాల్సి వచ్చింది. తన స్నేహితుడు రవిచంద్రతో కలిసి వెళుతున్న నిషిత్ కారు అతివేగంగా మెట్రో ఫిల్లర్‌ను ఢీకొట్టిన విషయంత తెలిసిందే. ఈ దుర్ఘటనలో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు దుర్మరణం చెందారు. మరోవైపు కుమారుడి మరణవార్త విన్న మంత్రి నారాయణ హుటాహుటీన లండన్ నుంచి గురువారువారం తెల్లవారుజామున నెల్లూరు చేరుకున్నారు. నిషిత్ మృతదేహాన్ని చూసి ఆయన భోరున విలపించారు. పెన్నానది తీరంలోని బోడిగాడి తోట శ్మశాన వాటికలో నిషిత్ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు చితికి మంత్రి నారాయణ నిప్పంటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు నెల్లూరులో నారాయణ కళాశాల నుంచి నిషిత్ అంతిమ యాత్ర కొనసాగింది. -
స్పీడ్ కిల్స్!
► సిటీలో వాహనాల సరాసరి వేగం: గంటకు 18 కి.మీ ► నిశిత్ నారాయణ నడుపుతున్న కారు స్పీడు: గంటకు 205 కి.మీ... ► మెర్సిడెస్ బెంజ్ జీ 63 ఏఎంజీ మోడల్ వాహనం గరిష్ట వేగం: గంటకు 230 కి.మీ ► అతివేగం..ర్యాష్ డ్రైవింగ్లతోనే ప్రమాదాలు ► నగరంలో ఏటా వేల కేసులు నమోదు ► నగర రోడ్లకు–వాహనాలకు పొంతనే లేదు ► అడ్డుకోవడానికి అవసరమైన నిబంధనలు కరవు సిటీబ్యూరో: వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిశిత్ నారాయణ బుధవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తేలింది. ఈనేపథ్యంలో నగరంలో వాహనాల వేగంపై మరోసారి చర్చ తలెత్తింది. కేవలం ఈ సమయాల్లో, ఈ మార్గాల్లోనే కాదు... సిటీలో ఎక్కడ చూసినా ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్డ్రైవింగ్స్ కనిపిస్తాయి. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారు సైతం 20–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉంటున్నారు. అదో ప్యాషన్‌గా మారిపోయి... స్పీడ్ థ్రిల్స్... బట్ కిల్స్ అనే నానుడిని పోలీసు, ఆర్టీఏ విభాగాలు నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ హైఎండ్ వాహనాల్లో/వాహనాలపై, వీలున్నంత వేగంగా దూసుకుపోవడం కొందరు వాహనచోదకులకు నిత్యకృత్యమైంది. అధికారులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రమాదం కలిగించేవి, ఎదుటి వారికి ప్రమాదాన్ని చేకూర్చేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదకరమైనవి. ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్‌డ్రైవింగ్ ఉల్లంఘనలు మూడో కోవకు చెందుతాయి. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా వాహనచోదకుడినే కాదు అనేక సందర్భాల్లో ఏ పాపం ఎరుగని ఎదుటి వారినీ మింగేస్తాయి. అయినప్పటికీ రద్దీ రోడ్లలోనూ విచ్చలవిడి స్పీడుతో, విన్యాసాలతో దూసుకుపోయే యువత ఎందరో ఉంటున్నారు. రాత్రి వేళల్లో, విశాలంగా... ఖాళీగా కనిపిస్తున్న రోడ్లపై వీరి విషయం ఇక చెప్పక్కర్లేదు. ఆ రెంటికీ పొంతనే ఉండదు... నగరంలోని రోడ్ల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం తదితర అంశాలపైనే ఇక్కడ పరిగెత్తే వాహనాలు ఆధారపడి ఉంటాయి. అయితే సిటీలో సరాసరి వేగం గరిష్టంగా గంటకు 18 కి.మీగా ఉంటే...ఇక్కడ అందుబాటులో ఉంటున్న, దిగుమతి చేసుకుంటున్న వాహనాల గరిష్టం వేగం గంటలకు 200 కిమీ కంటే ఎక్కువే ఉంటోంది. ఇదే అనేక సందర్భాల్లో ప్రమాదాలకు హేతువుగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిరోధించే చట్టాలు, నిబంధనలు అంటూ మచ్చుకైనా కనిపించవు. సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ స్థాయిలో మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ చేడుతున్న దాఖలాలు లేవు. ఇవన్నీ సైతం పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ‘బెల్ట్’ అంటే నిర్లక్ష్యం... ద్విచక్ర వాహనచోదకుడికి హెల్మెట్ ఎలానో.. తేలికపాటి వాహనం నడిపే వారికి సీటుబెల్ట్ అలానే తప్పనిసరి. అయితే వీటిని ధరించి కార్లు నడుపుతున్న వారి సంఖ్య ఉండాల్సిన స్థాయిలో ఉండట్లేదు. నిబంధనల ప్రకారం తేలికపాటి వాహనాలను డ్రైవ్ చేసే వారు మాత్రమే కాదు.. వాటిలో ప్రయాణించే వారు సైతం సీటుబెల్టులు ధరించాల్సిందే. కానీ పాటిస్తున్న దాఖలాలు తక్కువే. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లో జరిగిన నిశిత్ నారాయణ ప్రమాదంలో ప్రాణనష్టానికి సీటుబెల్ట్ వాడకపోవడమే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టకేలకు మేల్కొన్న పోలీసులు... సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇటీవలే రేసింగ్స్, ర్యాష్డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీరిని కట్టడి చేయడానికి ‘ఆర్ఆర్ డ్రైవ్’ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. వీటిలో చిక్కిన వారికి జరిమానాతో సరిపెట్టకుండా వాహనాలు స్వాధీనం చేసుకోవడం, కౌన్సిలింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. -
మాటే శాసనం
► మేం చెప్పినట్లే... అధికారులు వినాలి ► కలెక్టర్, ఎస్పీ మొదలు అధికారులందరూ మా కనుసన్నల్లో నడవాలి ► ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జులకు కోట్లాది రూపాయల పనులివ్వాలి ► మంత్రి నారాయణను టీడీపీ నేతల డిమాండ్ ► అన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన మంత్రి ► అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానన్ననారాయణ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘మా నియోజకవర్గంలో మేమే రాజులం. ఎమ్మెల్యే అయినా, నియోజకవర్గ ఇన్చార్జి అయినా మేం చెప్పినట్లే నడవాలి.. మాకు తెలియకుండా మా నియోజకవర్గంలో ఏ చిన్న పనీ చేయడానికి వీల్లేదు. అధికారులు మేం చెప్పినట్లే వినాలి, బదిలీలు మేం చెప్పినట్లే జరగాలి, నీరు–చెట్టుతో పాటు వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల పనులు ఇవ్వాలి. అలా అయితేనే మేం పని చేస్తాం, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పోటీ పడాలంటే మేం చెప్పిందల్లా చేయాలంటూ’ జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు మంత్రి నారాయణకు స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. సమావేశానికి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి శిద్దా రాఘవరావు హాజరుకాలేదు. తొలుత ఆయా నియోజకవర్గ పార్టీ పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు, మెజార్టీపై మంత్రి ఆరా తీశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కొనేందుకు గట్టిగా పనిచేయాలని మంత్రి చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు మంత్రి ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. ఎస్పీ త్రివిక్రమవర్మ తాము చెప్పినట్లు వినడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా డీఎస్పీల మొదలు ఎస్సైల స్థాయి వరకు తాము చెప్పినట్లు వినే పోలీస్ అధికారులనే నియమించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు తమ మాటే వినేలా ఆదేశించాలని వారు కోరారు. బదిలీలు తాము చెప్పినట్లే చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అన్ని నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల పనులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా చెక్‌డ్యామ్‌లు, నీరు–చెట్టు పనులు, లింక్‌రోడ్లు, పెద్ద ఎత్తున మంజూరు చేయాలని కోరారు. కార్యకర్తలకు పనులివ్వకపోతే ఎన్నికల్లో పని చేసే పరిస్థితి లేదని వారు తేల్చి చెప్పారు. తమ వర్గీయులకు పింఛన్లు పెద్ద ఎత్తున మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాడని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఇటీవల గిద్దలూరుకు చెందిన నలుగురు అధికార పార్టీ కౌన్సిలర్లను ప్రతిపక్ష పార్టీలో మాజీ ఎమ్మెల్యే సహకరించాడని ముత్తుముల అన్నా రాంబాబుపై మొదటి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో తాము విచారించి వివరాలు తెలుసుకుంటామని మంత్రి సమాధానమిచ్చారు. తాగునీటి సరఫరాకు మరిన్ని నిధులు కేటాయించాలని నేతలు కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు మొక్కుబడిగా నిధులివ్వడంతో పాటు పనులు నత్తనడకన సాగుతుండటంపై ప్రతిపక్ష పార్టీతో పాటు స్వపక్షం వారే విమర్శిస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. కాబోయే రెండేళ్లలో తాము చెప్పినట్లు అధికారులు పనులు చేయకపోతే పార్టీ మనుగడ సాగించటం కష్టమని నేతలు మంత్రికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో పాటు జిల్లా అధికారులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి తొలుత సమావేశం నిర్వహించాలని వారు కోరారు. సమస్యలను ముఖ్యమంత్రికి తెలపడంతో పాటు త్వరలోనే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. -
తెలుగు మీడియం దండగ: మంత్రి నారాయణ
కర్నూలు : దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు కీర్తిస్తే... ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖమంత్రి నారాయణ మాత్రం తెలుగు మీడియం దండగ అని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగు మీడియంలో చదవితే ర్యాంకులు రావంటూ చెప్పుకొచ్చారు. అయిదువేల లోపు ర్యాంకు వచ్చే వాళ్లలో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థులు ఉండరని కొత్త భాష్యం చెప్పారు. ఇంగ్లీష్ మీడియం అయితేనే ర్యాంకులు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేశామన్నారు. నంద్యాలలో మున్సిపల్ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుపై జేసీ సంచలన వాఖ్యలు
-
తాగునీటి సమస్యను తీర్చండి
– మునిన్సపల్ శాఖ మంత్రికి ఎమ్మెల్యే గౌరు చరిత విన్నపం కల్లూరు (రూరల్): పాణ్యం నియోజకవర్గంలోని 14 వార్డుల్లో తాగునీటి సమస్యను తీర్చాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు. శనివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వచ్చిన మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కర్నూలుకు ప్రతి రోజూ మంచినీటిని సరఫరా చేస్తూ.. పాణ్యం నియోజకవర్గంలోని 14 వార్డులకు మూడు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తూ వివక్ష చూపుతున్నారన్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అర్ధరాత్రి ఏ సమయంలో నీటిని సరఫరా చేస్తున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కర్నూలు ప్రజలు ఇంటి, నీటి పన్నులు సక్రమంగా ఎలా చెల్లిస్తున్నారో అదే విధంగా పాణ్యం నియోజకవర్గంలోని ప్రజలు కూడా చెల్లిస్తున్నారని వివరించారు. మంచినీటి సరఫరా విషయంలో వివక్ష చూపొద్దని, ప్రజలు కన్నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
రిజర్వాయర్లు, వాగులకు 2,226 ఎకరాలు
భూసేకరణకు ప్రభుత్వం అనుమతి సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిపాదిస్తున్న మూడు రిజర్వాయర్లు, వాగుల విస్తరణకు అవసరమైన 2,226 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీఆర్డీఏ కార్యకలాపాలపై సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించా రు. కొండవీటి వాగు సుందరీకరణ, వరద మళ్లింపుపై నెదర్లాండ్‌కు చెందిన బ్లూ కన్సల్టెంట్ ఆర్కాడిస్ ఇచ్చిన సవివర నివేదికకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కొండవీటి వాగు వెడల్పునకు 885 ఎకరాలు, పాలవాగు వెడల్పునకు 433 ఎకరాలు, గ్రావిటీ కాలువలు వెడల్పు చేయడానికి 218 ఎకరాలు.. మొత్తం 1,536 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని నివేదికలో పేర్కొనట్లు స్పష్టం చేశారు. ఈ భూసేకరణను వెంటనే పూర్తిచేసి, ఈ వాగులకు సంబంధించి పనులను వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. బైపాస్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం అందంగా కనిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని పక్కనే కృష్ణా నదిలో ఉన్న ఏడు ద్వీపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో చేపట్టిన ఏడు ముఖ్యమైన రహదారుల నిర్మాణ పనులు నిర్దిష్ట వ్యవధిలో పూర్తి కావాలంటే తగిన యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. -
సీబీఐ విచారణకు సిద్ధమా.?
-
సీబీఐ విచారణకు సిద్ధమా?
ప్రశ్నపత్రాల లీకేజీలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ - సీబీఐ అయితేనే మంత్రి నారాయణ పాత్ర బట్టబయలవుతుంది సాక్షి, అమరావతి: ‘పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ విచారణకు సిద్ధమా? సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సాక్షి ఆధారాలను సీబీఐకి ఇచ్చి.. విచారణకు పూర్తిగా సహకరిస్తుంది. తప్పులను కట్టడి చేయాలనే తపన ఉండాల్సిన ముఖ్యమంత్రి.. వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి మంత్రులను రక్షించడానికి యత్నిస్తున్నారు. దమ్మూ ధైర్యం ఉంటే మా సవాల్‌ను స్వీకరించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. శాసనసభలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. నాలుగు సార్లు వాయిదా అనంతరం మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది. ప్రశ్నాపత్రాల లీకేజీపై మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేసిన అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి సీఎం చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజులు అడుగడుగునా అడ్డుతగిలేందుకు వారికీ అవకాశమిచ్చారు.. వారు వ్యక్తిగత దూషణలకు దిగుతూ కవ్వించినా జగన్ సంయమనం కోల్పోలేదు. లీకేజీ వ్యవహారంపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ.. సీఎం వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలను విసురుతూ.. ప్రభుత్వ తీరును కడిగిపారేశారు.వివిధ అంశాలను ఎత్తిచూపుతూ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను.. సీఎం చంద్రబాబు తనపై చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన జగన్ ‘‘చంద్రబాబు తరచూ నా చదువులు గురించి మాట్లాడుతారు.. నీ మాదిరిగా నేను వచ్చిరాని ఇంగ్లీషు మాట్లాడలేను.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను.. పదో తరగతిలో.. ఇంటర్మీడియట్లో.. డిగ్రీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను. నీ మాదిరిగా ఎంఫిల్ చేయకుండానే చేసినట్లు చెప్పుకోను. నీ మాదిరిగా పీహెచ్డీ డీస్‌కంటిన్యూ చేయలేదు.. ప్రపంచంలో ఇంత దరిద్రమైన ఇంగ్లీషు ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే మాట్లాడగలరని పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.. నీ ఇంగ్లీషు ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసుకో.. ప్రజలను నమ్మించలేకపోతే గందరగోళానికి గురిచేయడమే చంద్రబాబు వ్యక్తిత్వం.’’ అని ఘాటుగా స్పందించారు. -
వాళ్లు మంత్రులు కాదు, వ్యాపారులు
-
వాళ్లు మంత్రులు కాదు, వ్యాపారులు: రాచమల్లు
అమరావతి: కార్పొరేట్ సంస్థల నిర్వాహకులను మంత్రులుగా నియమిస్తే పాలన కూడా వ్యాపార పరంగానే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ గెలుపుకు రూ.700 కోట్లు వరకు ఖర్చు చేశారని, అప్పుడు చేసిన ఖర్చును రెండింతలు సంపాదించేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదో తరగతి పరీక్షా పత్రాలు మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్ధలో లీక్ అయితే, దానిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా విద్యార్ధుల భవిష్యత్‌ను టీడీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తూ ఈ ప్రశ్న పత్రాల లీకేజిపై విచారణ చేస్తుండగానే ఇతర పేపర్లు కూడా లీకు అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రాచమల్లు ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజిపై ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు గంటా, నారాయణలు వేర్వేరుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 6.50 లక్షల విద్యార్ధుల సమస్యలపై సభలో చర్చించేందుకు ప్రయత్నిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం చేస్తోందని ఆరోపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నారాయణను మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయాలి
కడప ఎడ్యుకేషన్: మంత్రి నారాయణవి విద్యాసంస్థలు కావని, ఆవి కారాగారాలని పిల్లల ప్రాణాలను హరించే చెరశాలలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ మంత్రి నారాయణపై ధ్వజమెత్తారు. కడప నగరంలో మంగళవారం వైఎస్సాఆర్ స్టూడెంట్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా ఆధ్వర్యంలో సంధ్య సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు మంత్రి నారాయణ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించి అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక క్లాస్రూముకు 60 మంది ఉండాల్సి ఉంటే నారాయణ కళాశాలల్లో మాత్రం వందమందికి పైగా ఉంటున్నారన్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నా విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. ఎంతమంది విద్యార్థులు చనిపోయినా నారాయణ విద్యాసంస్థల అధిపతి మంత్రి నారాయణపై చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రపదవి నుంచి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు. తిరుపతిలో మనోజ్‌కుమార్, సాయిచరణ్నాయక్లు చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కేసుమాత్రం ముందుకు సాగడం లేదన్నారు. అసలు వారివి హత్యలా లేక ఆత్మహత్యలా అనేవి ప్రశ్నలుగా మిగిలిపోయాయన్నారు. ఇదే సమస్య ఓ సాధారణ కళాశాలలో జరిగితే ఇలాగే ప్రభుత్వం వ్యవహరించేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క తిరుపతిలోనే కాదు కడప, నెల్లూరు. గుంటూరు. కర్నూల్‌తోపాటు రాష్ట్రం మొత్తం మీదే ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. నారాయణ ధనదాహానికి పసిమొగ్గలు నేలరాలుతున్నారని అందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల కేసులో న్యాయం చేయాలని అడిగిన వైఎస్సార్ విద్యార్థిసంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. విద్యార్థుల భవిషత్తు కోసం మేము జైలు కెళ్లడానికైనా సిద్ధమన్నారు. కానీ తల్లితండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించి పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్ నాయకులు మాసిన్, గంగాధర్, విజయ్, రహీమ్, శ్రీనాద్తోపాటు పలువురు పాల్గొన్నారు. -
అక్కడ మా విద్యార్థులుండరు కదా!
పది ప్రశ్నపత్రాల లీకేజీపై మంత్రి నారాయణ వింత వాదన సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యాసంస్థల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలుండటంతో ఈ విషయాన్ని ఎలా కప్పిపుచ్చాలో తెలియక మంత్రులు సతమతమవుతున్నారు. ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇస్తున్నారు. మొదట అసలు ప్రశ్నపత్రం లీక్ కాలేదని దబాయించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనంతరం వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వస్తే మంత్రి నారాయణకేం సంబంధం అంటూ వితండవాదం చేస్తున్నారు. మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల్లో మా విద్యార్థులు పరీక్ష రాయరు కదా.. అక్కడ ప్రశ్నపత్రం లీకైతే మాకేం సంబంధం? అని చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తామని, ఇప్పటికే విచారణ జరిపించాం.. అంటూ రకరకాల సమాధానాలు ఇస్తున్నారు. లీకేజీ వ్యవహారంపై నారాయణ, పల్లె మంగళవారం మీడియా పాయింట్లో మాట్లాడారు. -
లీకేజీపై సర్కార్ దొంగాట
టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీపై పచ్చి అబద్ధాలు ⇒ నారాయణ, గంటా, చంద్రబాబు విరుద్ధ ప్రకటనలు ⇒ కప్పదాట్లు.. గడియకో సమాధానం.. ⇒ ఆధారాలున్నాయి... చూపిస్తానంటున్నా జగన్‌ను పట్టించుకోని స్పీకర్ ⇒ ప్రతిపక్షనేతకు రెండు నిమిషాలు కూడా మైక్ ఇవ్వని వైనం.. ⇒ లీకేజీపై 30న సీఎం ప్రకటన చేస్తారని చెప్పిన యనమల, కోడెల ⇒ షెడ్యూలులో లేని బిల్లులు హడావిడిగా సభ ముందుకు.. ⇒ ప్రతిపక్షం వాకౌట్ చేయగానే లీకేజీలపై సీఎం ప్రకటన.. ⇒ ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడుతూ లీకేజీలపై మమ.. ⇒ నారాయణను కాపాడేందుకు అడుగడుగునా తాపత్రయం.. ⇒ ముఖ్యమంత్రి తొండి ప్రకటనలో ‘సాక్షి’పైనా అభాండాలు.. (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే అది లీకేజీ అవుతుంది. కానీ నెల్లూరులో పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత పేపర్ బయటకు వచ్చింది.’’ – ఢిల్లీలో మంత్రి గంటా శ్రీనివాసరావు ‘‘అసలు ప్రశ్నాపత్రాల లీకేజీయే లేదు. లీకేజీ జరిగిన చోట నారాయణ విద్యార్థులు లేరు. ఇదంతా ఓ దుష్ప్రచారం.’’ – అమరావతిలో మంత్రి నారాయణ ‘‘లీకేజీయే కానీ ఇది మాల్‌ప్రాక్టీస్ కిందకొస్తుంది. నెల్లూరులోని నారాయణ హైస్కూల్లో వాచ్‌మన్ ప్రవీణ్ ఈనెల 25న ఉదయం 9.25 గంటలకు సెల్‌ఫోన్ ద్వారా పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి వ్యాట్సప్‌లో పంపాడు.’’ (పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.) – అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న దొంగాటకు ప్రభుత్వంలోని ముగ్గురు కీలకమైన వ్యక్తులు చేసిన ఈ మూడు ప్రకటనలు అద్దం పడతాయి. ప్రశ్నాపత్రాల లీకేజీయే జరగలేదని ఒక మంత్రి, జరిగింది గానీ పరీక్ష ప్రారంభమైన తర్వాత జరిగిందని మరో మంత్రి, కాదు కాదు పరీక్ష ప్రారంభానికి ముందే పేపర్ లీకయ్యిందని ముఖ్యమంత్రి.. ఇలా ముగ్గురూ మూడు రకాల ప్రకటనలు చేసి సమస్యను తప్పుదోవ పట్టించడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మంగళవారం శాసనసభను స్తంభింపజేసింది. వాయిదాతీర్మానాన్ని అంగీ కరించకపోవడంతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభ రెండుసార్లు వాయిదాపడింది. దాదాపు మూడున్నర గంటల సేపు ఈ అంశంపై సభ దద్దరిల్లిపో యింది. ప్రభుత్వ పరీక్షల అధికారి ఇచ్చిన నివేదిక సహా తన వద్ద ఉన్న ఆధారాల గురించి వివరిస్తానని ప్రతిపక్షనేత వైఎస్జగన్ ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ అనుమతించలేదు. ప్రశ్నప్రతాల లీకేజీలపై ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే అన్ని విషయాలూ బయటకొస్తా యని విలేకరులతో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్షం ఆందోళనలతో కంగుతిన్న అధికారపక్షం.. హడావిడిగా వేసిన ఎత్తుగడలు వికటించి చివరకు కన్నంలో చిక్కిన దొంగలా దొరికిపో యింది. గడియకో సమాధానం, కప్పదాట్లు చూసినవారికి ఈ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం తత్తరపాటు స్పష్టంగా అర్ధమైపో యింది. ఇందులో ఇద్దరు కీలక మంత్రులకు ప్రత్యక్షంగా ప్రమేయముండడం, అందులో ఒకరు సీఎంకు మరీ కావలసిన వ్యక్తి కావడంతో ప్రభుత్వం అదిరిపడింది. ఒక మంత్రిని కాపాడడం కోసం సీఎం సహా అందరూ అనేక రకాలుగా ప్రయత్నిస్తుం డడం చూసి జనం నివ్వెరపోతున్నారు. మంగళవా రం సభలోనూ, సభ వెలుపలా చోటుచేసుకు న్న పరిణామాలు ఓమారు గమనిస్తే... ప్రతిపక్షనేతకు రెండు నిమిషాలివ్వలేదు... ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య స్పీకర్ సభను రెండు సార్లు వాయిదావేశారు. విపక్షనేతకు మాట్లాడేందుకు రెండునిమిషా లు కూడా అవకాశం దక్కలేదు. అత్యంత ప్రాధాన్యత గలిగిన, లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కనీసం 344 నిబంధన కింద స్వల్పకాలిక చర్చకన్నా అనుమతివ్వాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రభుత్వానికి పంపిన రోజువారీ నివేదికలో నెల్లూరులోని ‘నారాయణ’ హై స్కూల్ ప్రస్తావన ఉంది. ఆ స్కూల్ నుంచి పరీక్షాపత్రం లీకయినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి నుంచి వచ్చిన నివేదిక కూడా ఉంది. ఆ విషయాలనే సభకు వివరిస్తానని, తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని ప్రతిపక్షనేత పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో చంద్రబాబు ఈనెల 30న ప్రశ్నపత్రాల లీకేజీపై ఒక ప్రకటన చేస్తారని ఆర్ధిక మంత్రి యనమల సభలో వెల్లడించారు. అదే విషయాన్ని స్పీకర్ పునరుద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయాన్ని వదిలేసి షెడ్యూలులో లేని ద్రవ్య వినిమయ బిల్లు, 2013 భూసేకరణ చట్టం సవరణ బిల్లు, చుక్కల భూములకు సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులను ఈరోజే ఆమోదింప చేయాల్సి ఉందంటూ ప్రభుత్వం వితండ వాదానికి దిగింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఏకపక్షంగా బిల్లులు ఆమోదింపచేసుకోవడంతో పాటు ద్రవ్యవినిమయ బిల్లునూ ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ప్రకటన 30న అని చెప్పి.. ప్రశ్నాపత్రాల లీకేజీపై ముఖ్యమంత్రి 30న ప్రకటన చేస్తారని ఆర్థిక మంత్రి యనమల, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇద్దరూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ లీకేజీ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వం.. షెడ్యూలులో లేకపోయినా బిల్లులను ముందుకు తేవడం, ద్రవ్య వినిమయబిల్లునూ ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షం వాకౌట్ చేసింది. ప్రతిపక్షం లేకుండానే ద్రవ్యవినిమయబిల్లును మమ అనిపించేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టి సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పడం సభా సంప్రదాయం. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి కల్పించుకొని దాదాపు గంటసేపు ప్రసంగించారు. పనిలో పనిగా 30 న చేస్తామని చెప్పిన లీకేజీ ప్రకటనను సభలో చదివి ఇక ఆ అంశం ముగిసినట్లేనని అనిపించారు. లీకేజీలపై 30న సీఎం ప్రకటన ఉంటుందని అధికార పక్షం, స్పీకర్ చెప్పినా ప్రతిపక్షసభ్యులు వాకౌట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి లీకేజీలపై ప్రకటన చేయడంపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. లీకేజీలపై ఆత్మరక్షణలో పడిపోయిన ప్రభుత్వం ఎలాగోలా గట్టెక్కడం కోసమే సభలో ప్రతిపక్షం లేని సమయంలో ప్రకటన చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక అంశంపై సభలో చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, దానిపై ఏవైనా వివరణలు ఉంటే సమాధానమివ్వడం సాంప్రదాయం. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇలా తప్పించుకునేటట్లుగా దొంగాట ఆడుతుండడం అనేక సందర్భాలలో బైటపడుతోంది. ఏ విషయమైనా ఏకపక్షంగా తామే మాట్లాడడం, ప్రతిపక్షానికి కనీసం మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా గొంతునొక్కడం అడుగడుగునా కనిపిస్తోంది. నారాయణను కాపాడాలన్న తాపత్రయం మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు స్వయానా వియ్యంకుడు కావడం, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులు సమకూర్చిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ను రక్షించేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నారని అర్ధమౌతోంది. మరోవైపు ఆయన చంద్రబాబు బినామీ అన్న వాదనలూ ఉన్నాయి. ద్రవ్య వినిమయబిల్లుపై అకస్మాత్తుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రసంగించడం, ప్రశ్నాపత్రాల లీకేజీలపై 30న చేస్తారనుకున్న ప్రకటన ఈరోజే చేసేయడం చూస్తే ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రహసనంలో ఇరుక్కుపోయిన మంత్రి నారాయణను ఎలాగైనా రక్షించాలన్న తాపత్రయంతోనే ముఖ్యమంత్రి ముందే ప్రకటన చేశారని, ప్రతిపక్షానికి మరో అవకాశం లేకుండా చేయాలన్న ఎత్తుగడ ఇందులో ఇమిడి ఉందని విశ్లేషకులంటున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై నిబంధనలకు విరుద్ధంగా సీఎం సుదీర్ఘ ప్రసంగం చేయడంతో చివరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసేదేమీ లేక ‘‘శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై సీఎం మాట్లాడ్డం జరగదు. కానీ ఇక్కడ మా సీఎం మాట్లాడారు. శాసనసభ చరిత్రలో ఇలా ఇదివరకెన్నడూ జరగలేదు. సీఎం మాట్లాడారు కనుక ఇక నేను చెప్పేందుకేముంటుంది’’ అంటూ ఒక నిట్టూర్పు విడిచి బిల్లును ఆమోదించాలని కోరడంతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. రాష్ట్ర శాసనసభ జరుగుతున్న తీరుపట్ల ముఖ్యంగా ద్రవ్యవినిమయ బిల్లు సందర్భంగా సభలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పలువురు నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన సభావ్యవహారాలను తామిదివరకెన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. గంటలకొద్దీ సమయాన్ని వృధా చేయడానికి, ప్రతిపక్షనేతపై తీవ్ర విమర్శలు చేయడానికి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షానికి రెండు నిముషాలు కూడా ఇవ్వకుండా అడ్డుపడే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రధానప్రతిపక్షం లేకుండానే ఆమోదింపచేసుకున్న తీరు మునుపెన్నడూ ఎరగని పరిణామమని విమర్శిస్తున్నారు. తొండి ప్రకటనలో ‘సాక్షి’పై వ్యాఖ్యలు.. సభలో ప్రతిపక్షం లేని సమయంలో.. ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఏక పక్షంగా ఓ తొండి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి అందులో ‘సాక్షి’ పైనా అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా మారింది. ప్రశ్నపత్రాన్ని 10.25 గంటలకు ‘సాక్షి’ టీవీ విలేకరి ఒకరు వ్యాట్సప్‌లో నెల్లూరు డీఈవోకు పంపారని.. సాక్షి టీవీ విలేకరికే ఆ ప్రశ్నపత్రం ఎలా వచ్చిందని.. ఇందులో ఏదో కుట్ర ఉందంటూ ‘సాక్షి’ మీడియాపై బాబు తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. అదే పశ్నపత్రాన్ని నెల్లూరు సాక్షి టీవీ విలేకరి 10.25 గంటలకు డీఈవోకు వాట్సాప్‌లో పంపారని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతా యని చెప్పారు. సాక్షి విలేకరి వాట్సాప్‌లో ఆ ప్రశ్నపత్రాన్ని డీఈవోకు పంపారని చెప్పిన చంద్రబాబు.. ఒకవేళ తప్పు చేసినవారైతే అలా ఎందుకు చేస్తారన్న చిన్న లాజిక్ మిస్ అయ్యారు. తప్పు జరుగుతోంది సరిదిద్దండి అంటూ జిల్లా విద్యాశాఖాధికారికి ఓ ఆధారాన్ని పంపిన విలేకరిపై అభాండాలు వేయం చూస్తేనే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎలా ఆలోచిస్తున్నారో.. దోషులను కాపాడడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. -
మాటకు మాట
-
ఆరని ఎన్నికల చిచ్చు
⇒ సీఎంకు జిల్లా నేతల ఫిర్యాదులు ⇒ పట్టాభి తీరుపై సమాచార సేకరణకు దిగిన పార్టీ హై కమాండ్ ⇒ రంగంలోకి ఎస్వీయూ విద్యార్థి బృందాలు ⇒ పట్టాభి మీద కోపంతోనే వేల ఓట్లు చెల్లకుండా చేశారని సీఎంకు వివరించిన నేతలు ⇒ కోటంరెడ్డి, జెడ్ఎస్, విజయ భాస్కర్రెడ్డిలో ఎవరిని నిలిపినా గెలిచే వారని మంత్రి నిర్ణయంపై ఫిర్యాదు సాక్షి ప్రతినిధి – నెల్లూరు : స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీలో రగిలిన గొడవలు ఆగడం లేదు. ఈ వ్యవహారంపై శనివారం సీఎం చంద్రబాబు నాయుడు మూడు గంటల పాటు నిర్వహించిన సమీక్షలో ఆయన చెప్పింది విని వచ్చిన నేతలు ఆ తర్వాత ఫిర్యాదుల పర్వం ప్రారంభించారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల అభ్యర్థుల ఎంపికే సరిగా జరగలేదని కొందరు నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. పట్టభద్రుల అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వ్యవహార తీరు, ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం గురించి పార్టీ అధిష్టానం ఇప్పుడు సమాచార సేకరణలో పడింది. చేతులు కాలాక.. తూర్పు రాయలసీమ పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై ఈ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేసిఉంటే బాగుండేదనే అభిప్రాయం హై కమాండ్‌కు కలిగింది. 14,450 ఓట్లు చెల్లకుండా పోవడం, ఈ బ్యాలెట్లలో చాలా వాటిపై అభ్యర్థి గురించి చాలా తీవ్రమైన విమర్శలు రాయడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. కనీసం డిగ్రీ చదివిన వారు ఓటు ఎలా వేయాలో తెలియకుండా ఉండరని, ఈ ఓట్లు అభ్యర్థి మీద కోపంతో వేసినవేనని పార్టీ నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. అభ్యర్థి మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చింది ? ఆయన వ్యవహార తీరు ఎలా ఉంటుంది ? ఓటమికి దారి తీసిన కారణలేమిటి? అనే విషయాలపై జిల్లా ప్రజల అభిప్రాయాలు తీసుకునే పని ప్రారంభించింది. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందాలు ఈ పని ప్రారంభించాయి. ఇదిలా ఉంటే పట్టాభిని పార్టీ నాయకులు, శ్రేణులు కూడా సొంతం చేసుకోలేక పోయాయని.. అయినా పార్టీ నాయకులు పనిచేయడం వల్లే గట్టి పోటీ ఇవ్వగలిగామని జిల్లా పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. పట్టాభికి బదులు నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి , కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ డాక్టర్ జెడ్ శివప్రసాద్‌ను పోటీ చేయించి ఉంటే వీరిని పార్టీ శ్రేణులన్నీ సొంత మనుషులుగా భావించి పనిచేసేవని జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు చంద్రబాబుకు వివరించారు. అలా కాకపోయినా మంత్రి నారాయణ తన మనిషినే పోటీ చేయించాలని నిర్ణయించుకున్నప్పుడు పట్టాభి కంటే ఆయన సోదరుడు విజయభాస్కర్‌రెడ్డిని పోటీ చేయించి ఉన్నా గెలిచే వారని చెప్పారు. పట్టాభి మీద ఉన్న వ్యతిరేకత వల్లే 14,500 ఓట్లు చెల్లకుండా పోయాయని, ఇందులో కనీసం 12 వేల ఓట్లు తమవేనని మరో నాయకుడు సీఎం, లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లారని సమాచారం. ఇకపోతే ఉపాధ్యాయ స్థానానికి కూడా చివరి నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేయడం, వాసుదేవనాయుడు చిత్తూరు జిల్లాలో తప్ప నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉపాధ్యాయ వర్గానికి పరిచయం ఉన్న వ్యక్తి కాకపోవడం మైనస్ అయ్యిందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను నేరుగా కలవక పోవడం పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యంకు లాభించిందనే లెక్కలు వేస్తున్నారు. వారే వెన్నుపోటు దారులు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 150 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవాల్సి ఉన్నా 87 ఓట్లతో గెలవడంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. శిబిరంలోని ఓటర్ల నుంచే సుమారు 50 మంది వైఎస్సార్ సీపీకి ఓటేశారని పార్టీ నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగింది? ఎవరెవరు క్రాస్ ఓటింగ్ చేశారనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు, పార్టీ బృందాల ద్వారా సీఎం సమాచారం తెప్పించే పనిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన వాకాటి నారాయణరెడ్డితో పాటు పలువురు నాయకులతో సీఎం ఈ విషయం గురించి మాట్లాడారు. ఇదే అవకాశంగా తీసుకుని టీడీపీ ముఖ్య నేతలు ప్రత్యర్థులపై ఫిర్యాదులు ప్రారంభించారని తెలిసింది. సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల్లో తన మీద కోపంతో కొందరు క్రాస్ ఓటింగ్ చేయించారని వాకాటి ఇప్పటికే ఫిర్యాదు చేశారని తెలిసింది. ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరగడానికి కారణాలు ఏమిటో విచారణ జరిపించాలని జిల్లాముఖ్యుడొకరు సీఎంకు విన్నవించారు. ఈ వివాదంపై ఎవరికి వారు సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫిర్యాదులు చేసినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
ఎంపికే కొంప ముంచింది
► ముఖ్యమంత్రి వద్ద ఎమ్మెల్సీ పంచాయితీ ► అభ్యర్థిగా వేమిరెడ్డి ఎంపిక ఏకపక్షం ► ఆయనకు పార్టీ ముఖ్యనేతల ఆమోదం లేదు ► ఓటమికి మంత్రి నారాయణే కారణం ► అనర్హుడిని అభ్యర్థిగా నిలపడంతోనే ఈ పరిస్థితి ► గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎన్నికల్లోనూ టీడీపీకి భంగపాటు ► చంద్రబాబు వద్ద అధికార పార్టీ నేతల ఆవేదన ►విజయవాడలో సీఎంను కలిసి ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష వైఖరే పార్టీ కొంపముంచిందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. మున్సిపల్ శాఖమంత్రి నారాయణ మాటలు విని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ఎంపిక చేయడంతోనే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏమాత్రం పరిచయం, ప్రచారం లేని వాసుదేవనాయుడిని ఎంపిక చేయడం ఓటమికి కారణమని పచ్చనేతలు బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లేసేందుకు ఓటర్లు విముఖత చూపడంతోపాటు అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీలో విబేధాలు టీడీపీ అభ్యర్థుల ఓటమికి కారణమన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇంచార్జి మంత్రినీ పట్టించుకోక..: మూడు జిల్లాల పరిధిలో అభ్యర్థిని నిలుపుతున్నామని తెలిసినా మంత్రి నారాయణ ఏకపక్షంగా వేమిరెడ్డి అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ విషయం ఆయా జిల్లాలకు చెందిన అధికారపార్టీ ముఖ్య నేతలకు ఏమాత్రం చెప్పలేదు. సాక్షాత్తూ నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావుకు సైతం ఈ విషయం చెప్పలేదు. దీనిని పార్టీ ముఖ్యనేతలు సైతం జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు చంద్రబాబు ఒత్తిడితో ఎన్నికల ప్రచారానికి దిగినా ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారానికి కూడా అందుబాటులోకి రాలేదు. పరిచయ సమావేశాలకు సైతం వారు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా పట్టభద్రుల స్థానం అభ్యర్థి వేమిరెడ్డి మంత్రి నారాయణ అనుచరుడినన్న దర్పంతో ఓటర్లతో పాటు అధికారపార్టీ జిల్లా నేతలను సైతం ఖాతరు చేయలేదు. కేవలం విద్యాసంస్థలలో మాత్రమే ప్రచారం సాగించారు. కొందరు అధికారుల అండతో బోగస్ ఓట్లు నమోదు చేయించుకొని గెలుపు ఖాయమని ప్రచారం సాగించారు. దీంతో ఓటర్లలో మరింత ఆగ్రహం నెలకొంది. పైగా తమను ఏమాత్రం పట్టించుకోక పోవడంతో అధికారపార్టీ కేడర్ చాలావరకు ఎన్నికకు దూరమైంది. ఇక మంత్రి నారాయణపై అక్కసుతో కొందరు టీడీపీ నేతలు మిన్నకుండి పోయారు. పర్యవసానంగా అధికారపార్టీ అభ్యర్థులకు ఓటమి తప్పలేదు. ఇదే విషయాన్ని బుధవారం అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. పరిచయ కార్యక్రమాలకూ దూరం..: నారాయణ విద్యాసంస్థలపై అక్కసుతో మిగిలిన విద్యాసంస్థలు ఎన్నికల్లో వేమిరెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారని కొందరు నేతలు ముఖ్యమంత్రికి విన్నవించారు. మూడు జిల్లాల పరిధిలో అభ్యర్ధిని నిలిపేటపుడు అన్ని జిల్లాల ముఖ్య నేతలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణ సూచన మేరకు ఏకపక్షంగా అభ్యర్థిని నిలపడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మరికొందరు చెప్పారు. తనగెలుపు ఖరారైందని వేమిరెడ్డి ప్రచారం చేసుకోవడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలను కలిసి ఓట్ల అడగలేదని, పరిచయ కార్యక్రమాలకు సైతం వేమిరెడ్డి హాజరు కాలేదని పార్టీ ముఖ్యనేతలు ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారు. -
నన్ను దెబ్బ కొట్టేందుకే వెన్ను పోటు
- ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఓటమిపై ఫిర్యాదుకు సిద్ధమైన మంత్రి నారాయణ - ఓటమికి నారాయణే పూర్తి బాధ్యుడని ఎదురు దాడికి సిద్ధమైన మరో వర్గం - అన్నీ ఆయనే చూసుకుని నెపం తమ మీదకు వేస్తే ఎలా అని మండిపాటు - హై కమాండ్‌కు ఫిర్యాదులు చేసుకోవడానికి సిద్ధమైన వైరి వర్గాలు - రెండు స్థానాల ఓటమిపై చంద్రబాబు, లోకేష్ అసహనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా తెలుగుదేశం పార్టీలో అగ్గి రాజేశాయి. తన ప్రాబల్యాన్ని దెబ్బ కొట్టడానికి పార్టీలోని ఒక సామాజికవర్గం వెన్నుపోటు పొడిచిందని మంత్రి నారాయణ సీఎం చంద్రబాబునాయుడుకు తన వాదన వినిపించడానికి సిద్ధమయ్యారు. మంత్రి నారాయణ ఒంటెత్తు పోకడ, మితిమీరిన విశ్వాసం, చంద్రబాబు నాయుడు వద్ద తాను ఏం చెబితే అది జరుగుతుందనే వ్యవహార తీరు కొంప ముంచాయని ఒక వర్గం ఎదురు దాడికి సిద్ధమైంది. స్థానిక సంస్థల కోటాలో సమష్టిగా పనిచేసి విజయం సాధించామనీ, పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల విషయంలో అన్నీ తానై వ్యవహరించిన మంత్రే ఈ ఓటమికి బాధ్యుడని మరో వర్గం హై కమాండ్‌కు తమ వాదన వినిపించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. పార్టీ నేతలు పట్టించుకోలేదు పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల శాసన మండలి ఎన్నికలను మూడు జిల్లాల్లో పార్టీ నేతలు పట్టించుకోలేదని మంత్రి నారాయణ మద్దతుదారులు చెబుతున్నారు. జిల్లా మంత్రిగా ఇక్కడా, ఇన్చార్జి మంత్రిగా చిత్తూరు జిల్లాలోను నారాయణ కష్టపడి పనిచేశారనీ, కానీ మిగిలిన వారు సహాయ నిరాకరణ చేశారని వాదిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి శిద్ధా రాఘవరావు కూడా ఈ ఎన్నికల గురించి సీరియస్‌గా తీసుకోక పోవడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందనే మంత్రి మద్దతుదారులు వాదిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, వారిని గెలిపించే బాధ్యతను సీఎం చంద్రబాబునాయుడు మంత్రి నారాయణకు ఇవ్వడం వల్లే పార్టీలోని ఒక సామాజిక వర్గంలోని నేతలంతా చేతులెత్తేసి పనిచేసినట్లు నటించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలకు మంత్రి పనికి రారని చూపించడానికే అంతా కలిసి ఈ రకంగా దెబ్బకొట్టారని మంత్రి మద్దతుదారులైన నాయకులు సమీక్షించుకుంటున్నారు. మంత్రి వ్యవహారతీరు వల్లే ఈ ఎన్నికల్లో అధికారంలో ఉండీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వారు అంటున్నారు. ఈ ఫలితాలు సీఎం దగ్గర మంత్రి నారాయణ పరపతి, పలుకుబడికి గండి కొట్టడం ఖాయమని ఈ వర్గం భావిస్తోంది. నారాయణే బాధ్యుడు తూర్పు రాయలసీమ, పట్టభద్రుల నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ నిర్వహణ వరకు అన్నీ మంత్రి నారాయణ ఇష్ట్రపకారమే జరిగినందువల్ల ఈ రెండు స్థానాల్లో ఓటమికి కూడా ఆయనే బాధ్యుడని మంత్రి వ్యతిరేకవర్గం వాదిస్తోంది. పార్టీలో సభ్యత్వం కూడా లేని పట్టాభిని కేవలం తనకు కావాల్సిన వ్యక్తి అని అభ్యర్థిని చేయించారని ఆ వర్గం చెబుతోంది. నె ల్లూరు జిల్లాలో కాస్త చదువుకున్న వ్యక్తికి పట్టాభి అంటే ఏమిటి? ఆయన వ్యవహార తీరు ఎలా ఉంటుందనే విషయం తెలుసుననీ, అలాంటప్పుడు ఎలా ఓట్లు పడతాయనే వాదన ఈ వర్గం లేవదీసింది. పార్టీ వైపు నుంచి ఎన్నికల నిర్వహణకు కొన్ని బృందాలు పనిచేస్తుంటే, నారాయణ సంస్థల ఉద్యోగులు సమాంతరంగా మరో విధానంలో పనిచేశారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల పనుల్లో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారని వారు చెబుతున్నారు. మూడు జిల్లాల్లో పోలింగ్ బూత్‌ల ఖర్చులకు నియోజక వర్గానికి రూ 5 లక్షల చొప్పున అది కూడా చివరి రోజు ఇచ్చారని, ఓటర్లు , పార్టీ శ్రేణులు ఎంతో ఆశించాయని వారు అంటున్నారు. నారాయణ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏ ఇతర విద్యా సంస్థను బతకనివ్వడం లేదనీ, ఈ అంశం కూడా పట్టాభి, వాసుదేవనాయుడు ఓటమిలో కీలకంగా పనిచేసిందని వారు అంచనా వేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు రెండు సార్లు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని దేశాయ్శెట్టి హనుమంతరావు పోటీ చేసి ఓడిపోయారనీ, ఈ సారి ఆయన దగ్గర డబ్బులు లేవనే కారణంతో టికెట్ ఇవ్వకపోవడం కాపు సామాజికవర్గంలో వ్యతిరేక తెచ్చిందని మంత్రి వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. ఈసారి దేశాయ్ శెట్టికి టికెట్ ఇచ్చి ఉంటే విజయం సాధించి ఉండే వారనీ, మంత్రి ఏకపక్షంగా పట్టాభిని, సీఎం జిల్లాకు చెందిన వాసుదేవనాయుడును ఎంపిక చేయించారని వారు చెబుతున్నారు. తాము వేలాది ఓట్లు చేర్పించామని నారాయణే స్వయంగా ప్రకటించారనీ, ఆ ఓట్లు ఎందుకు పడలేదని వారు వాదిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేసినందువల్లే పీడీఎఫ్ అభ్యర్థులు విఠపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డికి తమ అభ్యర్థులు ఆ మాత్రమైనా పోటీ ఇవ్వగలిగారని మంత్రి వ్యతిరేక వర్గం వాదిస్తోంది. బాబు, లోకేష్ ఆరా తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలు రెండు ఓడిపోవడంపై సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మూడు జిల్లాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలను ఆరా తీశారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణలో తమ ప్రమేయం లేకుండా చేసి ఇప్పుడు తమను తప్పు పడితే ఎలా అని చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు అభిప్రాయం కుండబద్ధలు కొట్టారని తెలిసింది. మొత్తం మీద ఈ రెండు స్థానాలు కోల్పోవడంపై చంద్రబాబు, లోకేష్ తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. -
పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్
-
పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్
అనంతపురం : జిల్లాలో పదో తరగతి తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంపై మరవకముందే మళ్లీ పేపర్ లీక్ అయింది. కదిరి నారాయణ కాలేజీలో హిందీ ప్రశ్నాపత్రం లీక్ అయిన ఘటన కలకలం రేపింది. కళాశాల సిబ్బంది ప్రశ్నాపత్రాన్ని ముందే పరిశీలించి ఆన్సర్ షీట్లను కూడా తయారు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న హిందీ పరీక్షలో విద్యార్థలకు ఆ ఆన్సర్ షీట్లే పంపిణీ చేశారు. సమాధానాలతో సహా బిట్ పేపర్లను విద్యార్థులకు అందించారు. ఇప్పటికే మడకశిరలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నలుగురు నారాయణ స్కూల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. . కాగా, నారాయణ పాఠశాల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సంబంధించింది కావడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. -
పోలీసుల అదుపులో ‘నారాయణ’ సిబ్బంది
టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీపై విచారణ హిందూపురం అర్బన్: అనంతపురం జిల్లాలో పదో తరగతి తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. ప్రశ్నప్రతం లీకేజీలో హిందూపురంలోని నారాయణ స్కూల్ సిబ్బంది హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవ హారంలో మడకశిరలో నలుగురిని అరెస్టు చేశారు. ఇదే కేసులో ఎంజీఎం ప్రభుత్వ పాఠశాల ఉర్దూ టీచర్‌ను ప్రశ్నిస్తున్నారు. చిలమత్తూరు ప్రైవేట్ ట్యూటర్ ఇలియాజ్ అహ్మద్ సెల్‌ఫోన్‌కు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో అందడం.. అతని నుంచి పలువురి సెల్ఫోన్లకు చేరిన విషయం తెల్సిందే. కాగా, నారాయణ పాఠశాల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సంబంధించింది కావడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నెల్లూరు(సెంట్రల్) ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్న మంత్రి నారాయణ పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓట్లు మీద ఆశ పెట్టుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి దాదాపుగా 6,500 బోగస్ ఓట్లు తొలగించాక తిరిగి ఓటర్ల జాబితాలో దొంగ చిరునామాతో 2033 ఓట్లు ఏ విధంగా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణచైతన్య కళాశాల పేరుతో 255, నారాయణ మెడికల్ కళాశాల పేరుతో 365 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. ఒకరి పేరు మీద ఉండాల్సిన ఓట్లు వేరొకరి పేరుమీద ఉండడమే కాకుండా చిరునామా కూడా పూర్తిగా మార్చి ఉన్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాగాన్ని అడుగడుగునా ప్రభావితం చేస్తూ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొందరు మంత్రులు స్వయంగా ఆయా శాఖల్లో ఉన్న అధికారులను పిలిచి తన అభ్యర్థికి ఓటేయాలని చెపుతూ ఓటర్లను భయపెడుతున్నారన్నారు. అదే విధంగా అధికార పార్టీ నాయకులు ఓటర్లకు మొబైల్ఫోన్లు , నగదు ఇచ్చి ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ విషయాలపై అధికారులు దృష్టి సారించి దొంగ ఓట్లకు కళ్లెం వేయాలన్నారు. అడ్డదారులను అడ్డుకుంటాం – సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ నెల్లూరు రూరల్ : తూర్పురాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జిల్లా మంత్రి నారాయణ, అ పార్టీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చింతారెడ్డిపాళెంలోని నారాయణ హాస్పిటల్ ఎదుట టీడీపీ అక్రమాలకు నిరసనగా మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నారాయణ మెడికల్ కళాశాలలో ఓటర్లకు సెల్ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోహన్‌రావు, రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు, మూలంరమేష్, గోగుల శ్రీనివాసులు, నరహరి, సతీష్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బరి నుంచి తప్పించారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మహిళపై టీడీపీ మంత్రాంగం ఫలించింది. తీవ్రమైన ఒత్తిడి నడుమ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలచిన చదలవాడ సుచరిత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుకే మద్దతు అంటూ విచారవదనంతో తెలిపారు. పార్టీ అభ్యర్థిత్వం ఆశించి.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాని కి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి భార్య సుచరిత టీడీపీ మద్దతుతో పోటీకి దిగాలని భావించారు. టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో మూడు నెలల ముందు నుంచే ఆమె ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగట్టడానికి రంగంలోకి దిగారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలతో మూడు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం మద్దతు సంపాదించి మిత్రపక్షం కోటాలో బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఈ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో వాసుదేవనాయుడుని అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సుచరితను పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేసింది. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, సుచరిత భర్త చదలవాడ కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.శ్రీనివాసులుకు ఈ బాధ్యత అప్పగించారు. వ్యూహాత్మకంగా ముందడుగు తెలుగుదేశం అధిష్టానం వాసుదేవనాయుడుని అభ్యర్థిగా ప్రకటించడంతో ఒత్తిడి వస్తుందని ఊహించిన సుచరిత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. సుచరిత తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో నిలిచినా పెద్దగా ప్రభావం చూపలేరని తెలుగుదేశం నాయకులు మొదట భావించారు. అయితే ఈ స్థానానికి చతుర్ముఖ పోటీ నెలకొనడం, పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యంకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతు తెలపడం, ఏపీటీఎఫ్ నాయకుడు మాదాల వెంకటకృష్ణయ్య గట్టి పోటీ ఇస్తుండటంతో సుచరితను ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని తెలుగుదేశం నాయకత్వం నిర్ణయించింది. నాలుగు గంటల పాటు చర్చోపచర్చలు ఎన్నికల ఏర్పాట్లపై తన మద్దతుదారులతో చర్చించడానికి మంగళవారం నెల్లూరుకు వచ్చిన సుచరితను మంత్రి నారాయణ, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య కలిశారు. పోటీ నుంచి తప్పుకుని టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని ఆమె తొలుత తిరస్కరించారు. అధికారపార్టీపై తిరుగుబాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆమెను హెచ్చరించారని తెలిసింది. ఇప్పటికైనా మించిపోలేదని, పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి మద్దతిస్తున్న సంఘాలన్నీ టీడీపీ అభ్యర్థికి పనిచేయాలని పత్రికా ప్రకటన ఇవ్వాలని సుచరితకు వారు సూచించినట్లు సమాచారం. తాను మద్దతు అడిగితే ఏమాత్రం పట్టించుకోని పార్టీ నాయకత్వం చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవాలని ఎలా అడుగుతుందని సుచరిత మంత్రిని ఎదురు ప్రశ్నించారని తెలిసింది. తనకు మద్దతు ఇస్తున్న సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతానని సుతిమెత్తగా తిరస్కరించారని సమాచారం. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక గంటల కొద్దీ చర్చించినా వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో మంత్రి నారాయణ, వర్ల రామయ్య చివరకు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. చెప్పినట్లు వినకపోతే చదలవాడ విద్యాసంస్థలను మూసి వేయిస్తామని, రాజకీయంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు.. బరి నుంచి తప్పుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆగ్రహించినట్లు తెలిసింది. చంద్రబాబుకు ఫోన్ చేసి సుచరితతో మాట్లాడించినట్లు, చివరకు సుచరిత బరి నుంచి తప్పుకునేలా ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఎట్టకేలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తాను పోటీ నుంచి తప్పుకుని టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మంత్రి నారాయణ, వర్ల రామయ్యలతో కలిసి సుచరిత విచారవదనంతో విలేకరులకు తెలిపారు. -
ప్రచారానికి తెర.. ప్రలోభాలతో ఎర
ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థులు నెల్లూరు(సెంట్రల్) : తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు దాదాపు రెండు నెలలు హోరెత్తించారు. ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రచారం నిర్వహించారు. దీంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పీడీఎఫ్ తరఫున యండవల్లి శ్రీనివాసులురెడ్డి.. టీడీపీ ఉపాధ్యాయ అభ్యర్థిగా వాసుదేవనాయుడు, పీడీఎఫ్ తరఫున విఠపు బాలసుబ్రహణ్యంలతో పాటు పట్టభద్రుల స్థానానికి 14 మంది, ఉపాధ్యాయ స్థానానికి తొమ్మిది మంది ఈ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది.మొదలైన వ్యూహాలు ప్రచారంలో ఓటర్ల వద్దకు వెళ్లి మద్దతు కోరిన అభ్యర్థులు మంగళవారం రాత్రి నుంచి ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అభ్యర్థి తరఫున మంత్రి నారాయణ అంతా తానై వ్యవహరిస్తున్నారు. మంత్రి నారాయణతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసులు, రావెల కిషోర్‌బాబు, సిద్దా రాఘవరావు, కామినేని శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి తరఫున రహస్య సమావేశాలు నిర్వహించి పరోక్షంగా ప్రచారం నిర్వహించారు. అధికార తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇప్పటికే అనేక అడ్డదారులు తొక్కుతోందని పీడీఎఫ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో గురువారం జరిగే ఎన్నికలలో ఎవరి అదృష్టం ఎంతో తేలిపోనుంది. -
పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు
టీడీపీ జిల్లా నాయకులపై చంద్రబాబు ఫైర్ ⇒ అధికారంలో ఉన్నా తిరుగుబాట్లు ఎందుకు వస్తున్నాయని నిలదీత ⇒ అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశామా అని అంతర్మథనం ⇒ అభ్యర్థులు ముగ్గురూ దూసుకుపోలేక పోతున్నారని సీఎం అసహనం ⇒ సునాయసంగా గెలిచే వాతావరణాన్ని నాశనం చేశారని మండిపాటు ⇒ మూడూ గెలవకపోతే మీ సంగతి చూస్తానని ఆగ్రహం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : స్థానిక సంస్థల, పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశామా..? అని తెలుగుదేశంపార్టీ హైకమాండ్ అంతర్మథనంలో పడింది. పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతోపాటు తిరుగుబాట్లు కూడా చోటు చేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. నల్లేరు మీద నడకే అనుకున్న మూడు ఎమ్మెల్సీల స్థానాల్లో ఎదురీదాల్సిన పరిస్థితులు ఎదురుకావడంతో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ నేరుగా రంగంలోకి దిగారు. శనివారం వారు మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డితో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధిపత్యాన్ని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు, పార్టీకోసం పనిచేసేవారిని తొక్కేయడం లాంటి చర్యల కారణంగా జిల్లాలో పార్టీ పరువు పోయే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు, లోకేష్ జిల్లా నాయకుల మీద మండిపడ్డారు. స్థానిక సంస్థల అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మొదటి స్థానం వచ్చినా మంత్రి నారాయణ గెలుపు బాధ్యతలు తీసుకుంటానని ముందుకు రావడంతోనే వాకాటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని, ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల్లో కూడా మూడు స్థానాల్లో ఎదురీత తప్పదనే సమాచారం వచ్చిందని, ఇంత మంది నాయకులు ఉండి పార్టీకి ఈ గతి పట్టించారని అసహనం వ్యక్తం చేశారు. నాయకులు విఫలం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో 158 మంది ఓటర్లు మెజార్టీ ఉన్నా వైఎస్సార్సీపీ దూకుడు తట్టుకోలేకపోతున్నారని పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఓటర్లను నిలుపుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి బిట్–1 ఎంపీటీసీ ఎస్కే ముర్తుజా హుసేన్ శనివారం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరుతున్నా పసిగట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ముగ్గురు అభ్యర్థుల మధ్య ఏమాత్రం సమన్వయం లేదని, ఎవరిపాటికి వారు ప్రచార ఆర్భాటం చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడంలేదని చంద్రబాబు నాయకుల మీద మండిపడ్డారు. ఎంపీటీసీ సభ్యులు, పట్టభద్రుల ఓటర్లకు అభ్యర్థులు ఖర్చులకు కూడా డబ్బులు సర్దుబాటు చేయడంలేదని ఫిర్యాదులు వచ్చాయని, ఇలా అయితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారని నాయకులకు చంద్రబాబు తల అంటారు. కోవూరు నియోజకవర్గంలో ప్రారంభమైన తిరుగుబాట్లు సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాలకు కూడా వ్యాపించాయని సోమవారం నాటికి ఈ పరిస్థితులన్నీ సర్దుబాటు చేయకపోతే తానే నెల్లూరుకు వచ్చి కూర్చుంటానని హెచ్చరించారు. మీరంతా కలసి పార్టీని ఏ గతి పట్టించాలనుకుంటున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పి పెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీని ముంచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మూడు ఎన్నికలు ఒకేసారి జరుగుతుండడంతో సమన్వయం లోపించిందని, దీనికి తోడు ఎవరికి వారు ఇది తమకు సంబంధంలేని ఎన్నికలు అనే భావంలో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. చేతిలో అధికారం ఉండి అధికారులను ఉపయోగిం చుకునే అవకాశం ఉన్నా ఎందుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రశ్నించారు. శుక్రవారం ఆత్మకూరులో నిర్వహించిన అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి గూటూరు కన్న బాబు మద్దతుదారులైన ఎంపీటీసీ సభ్యులు డుమ్మా కొట్టడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందని నిలదీశారు. చంద్రబాబు సీరియస్ కోవూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, గూడూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన అనేక మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని, అదే జరిగితే అందరి సంగతి తేలుస్తానని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలదేనని, సమస్యలు ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు. మంత్రి నారాయణ ఉపాధ్యాయులు, పట్టభధ్రుల ఎన్నికలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఏం చేసైనా సరే మూడు స్థానాల్లో గెలవకపోతే ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మీద పడుతుందనే విషయం గుర్తించుకుని పనిచేయాలని హెచ్చరించారు. అభ్యర్థులు ముగ్గురు ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లా నాయకులకు వివరించారు. ప్రతిరోజూ ఉదయం నాయకులందరితో సీఎం, తాను మాట్లాడుతామని లోకేష్ చెప్పారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి: కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం
ఒంగోలు టౌన్: శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సుజాతశర్మ స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో స్టాండింగ్ కమిటీ సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో ఎన్నికల ఫిర్యాదుల విభాగం (టోల్ ఫ్రీ నంబర్ 1077) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంసీసీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే ప్రసారాలను సంబంధిత కమిటీ పరిశీలిస్తోందన్నారు. ఓటర్లకు బల్క్ ఎస్ఎంఎస్లు పంపినా ఎన్నికల ఉల్లంఘన కిందకు వస్తోందన్నారు. మార్చి 9వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయని, దానికి 48 గంటల ముందు నుంచే మద్యం విక్రయాలు చేయరాదని పేర్కొన్నారు. గిద్దలూరులో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు...: గిద్దలూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని వైఎస్ఆర్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్ క్రాంతికుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులు అధికారులను వెంటపెట్టుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. తమ మాట వినకపోతే బదిలీ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఒంగోలులోని గుంటూరురోడ్డులో గల ఫంక్షన్ హాలులో మంత్రులు అధికారులను పిలిపించుకున్నారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ మంత్రుల వెంట నిఘా బృందాలు వీడియోగ్రఫీ చేస్తున్నాయని, నిర్దిష్టమైన వివరాలతో ఫిర్యాదుచేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రి నారాయణ సమీక్ష నిజం కాదా?: ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో టీడీపీ కార్యాలయ ఇన్చార్జి దాసరి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలపై సీపీఎం నేత జీవీ కొండారెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అధికారపార్టీపై లేనిపోని ఆరోపణలు చేయవద్దని దాసరి వెంకటేశ్వర్లు అనడంపై కొండారెడ్డి స్పందిస్తూ మంత్రి నారాయణ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లడం, అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించడం నిజం కాదా..? అని నిలదీశారు. జేసీ హరిజవహర్‌లాల్ జోక్యం చేసుకుంటూ మంత్రి నారాయణ అధికారులతో సమీక్షపై విచారిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఏ దేవదానం, డీఆర్ఓ ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రయాదవ్, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి డొక్కా యర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఓటర్లపై కొండపి ఎమ్మెల్యే వత్తిడి తెస్తున్నారు...: కొండపి నియోజకవర్గ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ అక్కడి ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చీరాలలోని భారతి కాలేజీ స్టాఫ్ మీటింగ్ పెట్టుకుని ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. బా«ధ్యులకు డబ్బు చేరిన తర్వాత చెక్‌పోస్టులను అలర్ట్ చేశారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
నాయుడుపేట: నాయుడుపేట డీఎస్ఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశంలో పురపాలక శాఖమంత్రి నారాయణ సాక్షిగా టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల నాయకులతో ఏర్పాటు చేసిన టీడీపీ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణతో పాటు పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరి సమక్షంలోనే మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్యపై సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, జలదంకి మధుసూదన్‌రెడ్డిలు ఆగ్రహంతో ఊగిపోయారు. పరసా తీరును పలుమార్లు మంత్రి నారాయణ, బీదల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీని బలోపేతం చేసుకుంటూ అధికార పార్టీ పెట్టే ఆగడాలను తట్టుకుని ముందుకెళ్లామన్నారు. పార్టీకి ఆహర్నిశలు పనిచేసి పలు విజయాలలో కీలకంగా వ్యవహరించిన తమపై పరసా పెంచి పోషిస్తున్న ఇసుక మాఫియా వర్గం, ఆయన కింద పనిచేసే మరో వర్గం నిత్యం దాడులకు తెగబడుతూ, ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు పెడతామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మాటలు విన్న నారాయణ, రవిచంద్రలు నోరు మెదపకుండా ఉండిపోయారు. మధ్యలో వాకాటి నారాయణరెడ్డి జోక్యం చేసుకోవడంతో కొందరు నాయకులు మధుసూదన్‌రెడ్డి చేతులు పట్టుకుని, పార్టీ సమీక్ష సమావేశంలో వర్గ విభేదాలను ప్రస్తావించడం సరికాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై వేదికపైనున్న పరసా ఎలాంటి ప్రత్యారోపణలు చేయక పోవడం విశేషం. ఇదిలా ఉండగా టీడీపీ సీనియర్ నాయకుడు, గుంటూరు లక్ష్మయ్య తనకు వేదికపై తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని, ఎన్నికల సమయంలో సమావేశాలకు మాత్రమే పిలుస్తున్నారని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, ఎంపీపీ తుపాకుల కన్నెమ్మ, నాయుడుపేట చైర్పర్సన్ మైలారి శోభారాణి, జెడ్పీటీసీ శ్రీరామ్‌ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్‌రెడ్డి, గూడూరు రఘునాథరెడ్డి, ఎన్డీసీసీబీ డైరెక్టర్ కలికి మాధవరెడ్డి, పరంధామిరెడ్డి, పరసా వెంకటరమణయ్య, ఎంపీటీసీలు పనబాక భూలక్ష్మి, బల్లి యేసుదాసు తదితరులు ఉన్నారు. -
నేనే లోకల్
నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో త్రిముఖపోటీ నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సంస్థాగత ఎన్నికలకు ముగ్గురు నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తనకు మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ఆశిస్తుండగా, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. అయితే ఇపుడు అనూహ్యంగా ఆనం రామనారాయణరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్టీలో మరింత పట్టు కోసమే ఇటీవల కాంగ్రెస్‌పార్టీ నుంచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న ఆనం సోదరులు పార్టీలో తమకు ప్రాధాన్యత పెంచుకునేందుకు తగిన పదవి కోసం వేచిచూశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజవర్గ ఇన్చార్జిగా చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారు. దీంతో ఇప్పటికే ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు కొందరు అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే తెలుగుదేశంలోని ఓ వర్గం ఆనం వివేకాందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే సహించేది లేదని పార్టీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆనం వివేకాందరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. కానీ తన బదులు ఆనం రామనారాయణరెడ్డికి అవకాశం కల్పించాలంటూ సోదరుడితో కలిసి ప్రయత్నించారు. ఆనం సోదరులు సోమవారం విజయవాడలో మంత్రి నారాయణను కలిసి గంటపాటు చర్చించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామనారాయణరెడ్డి పేరును ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తుంది. ఆయన కూడా సముఖత వ్యక్తం చేశారని.. మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం, పార్టీని బలోపేతం చేస్తారన నమ్మకంతో ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చే దిశగా అధిష్టానం సైతం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే వాకాటి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం తమకే దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. -
టీడీపీలో పీటముడి
సాక్షిప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో పీటముడి పడింది. స్థానిక సమస్యల కోటా కింద సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి అవకాశం దక్కుతుందని భావిస్తున్న తరుణంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్లు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టాన వర్గం అనేక రకాల సమీకరణాలను సరిచూస్తూ కసరత్తు ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డిని శాసనమండలి డెప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు పార్టీలోకి ఆహ్వానించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న నారాయణరెడ్డి పార్టీ మారి టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డికి మద్దతు ఇచ్చారు. అప్పట్లో ఎలాంటి షరతు లేకుండా తాను పార్టీలోకి వచ్చినందు వల్ల మరోసారి తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని నారాయణరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఇప్పటికే అనేక సార్లు తమ కోరికను విన్నవించారు. నారాయణరెడ్డికే అవకాశం దక్కవచ్చని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు భావిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికకు సమయం దగ్గర పడటంతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఈ పదవికి పోటీలో నిలిచారు. 2014 ఎన్నికల సమయంలో తాను కూడా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు పార్టీలోకి చేరి ఎంపీగా పోటీ చేశానని ఆదాల హైకమాండ్ దృష్టికి తీసుకుని పోయారు. ఆ ఎన్నికలలో ఓడినా తనను రాజ్యసభకు పంపుతానని అప్పట్లో హామీ ఇచ్చినందు వల్ల రాజ్యసభకు బదులు శాసనమండలికి అవకాశం కల్పించాలని ఆదాల డిమాండ్ చేస్తున్నారు. కాగా, నెల్లూరులో పార్టీని బలోపేతం చేయడం కోసం సీఎం ఆహ్వానం మేరకు తాము పార్టీలోకి వచ్చామని.. నగరంలో తమ రాజకీయ ప్రాధాన్యత, పార్టీపటిష్టత కోసం ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని ఆనం వివేకానందరెడ్డి కోరుతున్నారు. ఈ విషయం గురించి వివేకా ఇప్పటికే మంత్రి నారాయణ మద్దతు కోసం ప్రయత్నించారు. ఇటీవల ఆయన నెల్లూరులో మంత్రి క్యాంప్ ఆఫీసుకు వెళ్ళి సుమారు అరగంట సేపు ఈ విషయంపై చర్చించారు. తన మనసులో కోరికను చంద్రబాబునాయుడు చెవిలో కూడా వేశారు. ఎమ్మెల్సీ స్థానాన్ని వాకాటి మాత్రమే కోరుతున్నందు వల్ల ఈ ఎంపికలో పోటీ ఉండదని భావించిన సీఎం చంద్రబాబునాయుడుకు ఇదో పెద్ద సమస్యగా మారింది. టికెట్ ఆశిస్తున్న ముగ్గురిని తామే పార్టీలోకి ఆహ్వానించినందు వలన ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలో తేల్చుకోలేక పోతున్నారు. అభ్యర్థి ఎంపిక గురించి చంద్రబాబు మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలతో ప్రాథమికంగా చర్చించారు. వారం పదిరోజుల్లో స్థానిక సంస్థల అభ్యర్థులతో పాటు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
మంత్రి వర్సెస్ మేయర్
► నెల్లూరు టీడీపీలో రగడ ► ఏం నేను మైనార్టీననా తక్కువ చేస్తున్నావ్? ► నిధులేమైనా నీ కార్పొరేట్ కాలేజీ ఆస్తులనుకున్నావా? ► నన్ను అసమర్థుడు, డమ్మీ అంటూ గేలి చేస్తావా? ► నెల్లూరు కార్పొరేషన్‌కు నేనే బాస్‌ని ► మంత్రి నారాయణకు మేయర్ అజీజ్ ఫోన్లో ఘాటైన సమాధానం సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీలో మంత్రుల తీరు ఆ పార్టీలోని నేతలకే తీవ్ర తలనొప్పులు తెస్తోందని మరోసారి రుజువైంది. గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జానీమూన్ ఆ జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తీరుపై ఇటీవలే ధ్వజమెత్తారు. తాజాగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అజీజ్ కూడా ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణపై అంతే స్థాయిలో విరుచుకుపడ్డారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నెల్లూరు కార్పొరేషన్‌కు సుమారు రూ.60 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వాటి పంపకాల గురించి సూచనలు చేసేందుకు మంత్రి సోమవారం నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్, మేయర్ అజీజ్, కార్పొరేషన్ కమిషనర్ రామిరెడ్డి, మంత్రి ఒఎస్డీ పెంచల్రెడ్డిలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో 40 శాతం నగర పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ కృష్ణారెడ్డి, మరో 40 శాతం నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదించిన పనులకు కేటాయించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. దీనిపై అజీజ్ ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. ఏం ప్రభుత్వ నిధులేమైనా నీ కార్పొరేట్ కాలేజీల ఆస్తులనుకున్నావా... ఇష్టానుసారం పంచేయడానికి? అని నిలదీశారు. ‘ఓ పొలిటికల్ స్కాప్ర్(మాజీ ఎమ్మెల్యే)ను తెచ్చి నా ఎదురుగా కూర్చో పెట్టావు. నన్ను మెంటల్, అసమర్థుడు అని అంటావా? నేనేమీ డమ్మీని కాను. నెల్లూరు కార్పొరేషన్‌కు నేను మేయర్‌ని, నేనే బాస్‌ని. ఆత్మకూరు మునిసిపాలిటీ బాధ్యతలు ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించారుగా. అక్కడ కూడా ఇదే విధంగా చేస్తున్నారా? ఆయన రెడ్డిగారని వారి జోలికి వెళ్లరా? నేను మైనార్టీని కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటున్నారా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారని తెలిసింది. సహనం కోల్పోయి మంత్రిని ఉద్దేశించి పరుష పదాలను కూడా వాడారని సమాచారం. దీంతో.. పార్టీ నాయకుడు లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వెళుతున్నా, తిరిగి వచ్చాక మళ్లీ మాట్లాడతానంటూ మంత్రి ఫోన్ పెట్టేశారని సమాచారం. పది రోజుల కిందట కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపుపై మంత్రి నారాయణ చర్చించేందుకు సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకల్లా సమావేశానికి హాజరు కావాలని మేయర్ అజీజ్‌తో పాటు అధికారులు, ఇతర నాయకులను కోరారు. ఆ సమయానికి మేయర్ తప్ప తక్కిన వారు హాజరయ్యారు. పలుసార్లు ప్రయత్నించిన తరువాత 11 గంటల సమయంలో మేయర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. నన్ను మీరు జీరో చేయాలని చూస్తున్నారు... కానీ ఏమీ చేయలేరని అందరి సమక్షంలోనే మంత్రిని ఉద్దేశించి మేయర్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
వైఎస్ జగన్ వస్తున్నారని...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించేందుకు వస్తున్నారని తెలియగానే రాష్ట్ర మంత్రులు హుటాహుటిన అక్కడ వాలిపోయారు. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం లింగాయపాలెంలో స్థానికులతో భేటీ అయ్యారు. తమ సమస్యలు తీర్చాలని ఈ సందర్భంగా గ్రామస్తులు పట్టుబట్టారు. సమయం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు మంత్రులు ప్రయత్నించగా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి తమను మభ్యపెట్టేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని విధంగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మంత్రులు కంగారుపడ్డారు. కాగా, ఈ నెల 19న సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. బలవంతపు భూసేకరణ వల్ల భూములను కోల్పోతున్న రైతులకు అండగా నిలవడానికి జగన్ అక్కడ పర్యటిస్తారని వివరించారు. బాధిత రైతాంగంతో ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు. -
జగన్ ‘రాజధాని’ పర్యటనపై రాజకీయం
-
నేనింతే!
కురుగొండ్ల మరో వివాదం ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే కండలేరు గేట్లు ఎత్తివేత అధికారుల అత్యవసర సమావేశం నీటి విడుదల నిలిపివేత ఈ ఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలకు ఆదేశం ఎమ్మెల్యే తీరుపై అధికారుల ఆందోళన మంత్రి నారాయణ జోక్యంతో సోమవారం సాయంత్రం నీటి విడుదల సాక్షి ప్రతినిధి - నెల్లూరు: తరచూ వివాదాల్లో ఉండే వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ తన సహజ ధోరణి కారణంగా ఆదివారం మరో వివాదానికి తెర లేపారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు లేకుండానే కండలేరు జలాశయం నుంచి సారుుగంగ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు సీరియస్ అయ్యారు. రిజర్వాయర్ ఈఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వెంటకగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని తెలుగుగంగ కాలువల కింద రైతులు సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వర్షాలు వస్తాయనే ఆశతో ఇంతకాలం ఎదురు చూసిన రైతులు తమ పంటల ప్రాణాలు కాపాడు కోవడానికి కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కండలేరు జలాశయంలోని నీరు తాగునీటి అవసరాలకే సరిపోని పరిస్థితులు ఉన్నందు వల్ల సాగుకు ఇవ్వలేమని జిల్లా ప్రజాప్రతినిధులతో ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. రైతులు పంటలు వేయకుండా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. రైతులు మాత్రం తాము సాగు చేసిన పంటలను బతికించుకోవడానికి కండలేరు జలాశయం నుంచి నీటిని ఇవ్వాల్సిందేననే డిమాండ్ మరింత పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రైతుల పక్షాన ఆందోళనకు దిగారు. 10వ తేదీలోగా సాగునీరు విడుదల చేయక పోతే 11వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఆగమేఘాలపై రంగంలోకి. రైతుల ఆందోళనలను సీరియస్‌గా తీసుకోని ఎమ్మెల్యే రామకృష్ణ, ఈఈ మీద చర్యలకు ఆదేశం ఎమ్మెల్యే నేరుగా వెళ్లి డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినా ఎందుకు తెలుసుకోలేక పోయారనే కారణంపై కండలేరు జలాశయం ఈఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ ఎస్ఈని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే అత్యుత్సాహం తమ తలకు తెచ్చిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆమరణ దీక్ష ప్రకటనతో ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. బొమ్మిరెడ్డి ఆమరణ దీక్షకు దిగితే రైతులు రోడ్డెక్కుతారని, రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయంతో ఆదివారం నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ, మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడి కండలేరు నుంచి నీటి విడుదలకు సరేననిపించారు. మంత్రుల మౌఖిక అంగీకారంతో రామకృష్ణ నేరుగా కండలేరు డ్యాం వద్దకు వెళ్లి సంబంధిత అధికారులెవరూ లేకుండానే గేట్లకు సంబంధించిన స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఎమ్మెల్యే నీరు విడుదల చేయడంపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందారు. ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమై విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో నీటి విడుదలను ఆపివేశారు. రామకృష్ణ చర్యలపై మంత్రి అసహనం కండలేరు నుంచి పంట సాగుకు నీటిని విడుదల చేరుుస్తానని తాను చెప్పడంతోనే ఎమ్మెల్యే రామకృష్ణ నేరుగా డ్యాం దగ్గరకు వెళ్లి గేట్లు ఎత్తేయడం పట్ల మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. సోమవారం ఆయన కలెక్టర్ ముత్యాలరాజు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి పంట సాగుకు నీరు విడుదల చేయడానికి అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశంతో ఇరిగేషన్ అధికారులు సోమవారం సాయంత్రం మరోసారి నీటిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణరుుంచారు. ఈ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగానే చేరుుంచారు. -
రెండోరోజూ నిరసనలే
సాక్షి ప్రతినిధి – నెల్లూరు: జిల్లాలో మంగళవారం రెండో రోజు జరిగిన జన్మభూమి సభల్లో సమస్యల పరిష్కారం కోసం జనం అధికారులను నిలదీశారు. రేషన్ కార్డులు, పింఛన్లు, పక్కా ఇళ్ల సమస్యలపై జనం వేసిన ప్రశ్నలకు అధికార పార్టీ నేతలు, అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేక పోయారు. నెల్లూరులో సీపీఎం, బీజేపీ నేతలు జన్మభూమి సభలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు బందోబస్తు నడుమ రెండో రోజు జన్మభూమి సభలు ముగిశాయి. ► నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ పడారుపల్లిలో ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమ సభను సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి సందేశం వినిపించి సభ ప్రారంభించిన కొద్ది సేపటికే సీపీఎం నాయకుడు పాట్ల శీనయ్య ఆధ్వర్యంలో సీపీఎం, డీవైఎఫ్ఐ నాయకులు అక్కడికి చేరుకున్నారు. సభ నిర్వహిస్తున్న కార్పొరేషన్ డీఈ రఘురామ్‌ను ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిలదీశారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకు ఇంతవరకు పరిష్కారం లేదని, మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపట్టడం బాధాకరమని సీపీఎం నాయకులు జన్మభూమి సభలో అధికారులను నిలదీశారు. ► నెల్లూరు రూరల్ నియోజక వర్గం గాంధీనగర్ 30వ డివిజన్ జన్మభూమి కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు మల్లిఖార్జున, హరికృష్ణ, పెంచలబాబు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నియోజక వర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. జన్మభూమి కార్యక్రమం పచ్చ చొక్కొ నాయకులకే పరిమితమైందని, మిత్రపక్షమైన బీజేపీ నాయకులను చిన్నచూపు చూడటం తగదన్నారు. పరిస్థితి చక్కదిద్దుతామని బీద రవిచంద్ర, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు బీజేవైఎం నాయకులకు హామీ ఇచ్చారు. ► మర్రిపాడు మండలం కంప సముద్రం గ్రామంలో జన్మభూమి రసాభాసగా ముగిసింది. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత గ్రామమైన కంపసముద్రంలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభంకాగానే గతంలో ఇచ్చిన అర్జీలకు దిక్కులేదంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. రెవెన్యూ అధికారులు అడంగల్‌లో పేర్లు మార్పులు చేశారని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకోవడంతో రెండు వర్గాల వారు గొడవకు దిగారు. దీంతో జన్మభూమి సభ రసాభాసగా మారింది. ► కావలి 7వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అభివృద్ధి పనులు జరగలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జన్మభూమి కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశారు. ► టీపీ గూడూరులో జన్మభూమి సభలో ప్రజలు అధికారులను నిలదీశారు. మూడేళ్లుగా రేషన్ కార్డుల కోసం తిరుగుతున్నా మంజూరుచేయలేదని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ► తడ మండలం చేనుగుంటలో జన్మభూమి వేనాటి రామచంద్రారెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, పరసారత్నం వచ్చారు. వైఎస్సార్ సీపీ నేత చిల్లకూరు ప్రసాద్‌రెడ్డి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుండగా నాయకులు మైక్ లాక్కున్నారు. దీంతో జనం నిరసన వ్యక్తం చేశారు. ► వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం, యరగాటిపల్లిలో జరిగిన జన్మభూమి సభల్లో రేషన్ కార్డులు, పింఛన్లు, పక్కా గృహాలు మంజూరు చేయడం లేదని జనం అధికారులను నిలదీశారు. ► దుత్తలూరు మండలం సోమలరేగడ, నందిపాడు గ్రామాల్లో జన్మభూమి సభలకు హాజరైన ప్రజలు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించలేదని మహిళలు అధికారులను నిలదీశారు. యంత్రాలతో ఉపాధి పనులు చేయిస్తూ తమ కడుపులు కొడుతున్నారని అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ప్రకటన సరే.. ఉత్తర్వులేవీ?
- బాణసంచా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు కోసం వెలువడని జీఓ - జిల్లా నిధుల నుంచి తక్షణ సాయం అందించిన కలెక్టర్ - ఇది చంద్రన్న బీమా పరిహారమని ప్రకటించిన మంత్రి నారాయణ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట వద్ద అనధికారిక బాణసంచా తయారీ కేంద్రంలో గత నెల 31వ తేదీ సంభవించిన పేలుడులో మృతులకు పరిహారం పంపిణీలో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. మృతుల కుటుంబాల దయనీయ పరిస్థితి చూసిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూడకుండా జిల్లా నిధుల నుంచి సాయం అందించారు. నూతన సంవత్సర వేడుకలకు ఒక రోజు ముందు నెల్లూరు నగరంలో జరిగిన పేలుడు జిల్లా వాసులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో నాగరాజు (40), లక్ష్మయ్య (35) అక్కడిక్కడే మృతి చెందగా, ఒకరి ఆచూకీ తెలియలేదు. 13 మందిని విషమ పరిస్థితుల్లోను, ఒకరిని కొంత మేరకు గాయాలతో నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. సాయం అందజేతకు ఉత్తర్వులేవీ? పై సంఘటన జరిగిన రోజే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బాధితులకు తక్షణ సాయం కింద ఈ మొత్తం చెల్లించడానికి అవసరమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు స్పందించి మృతుల కుటుంబాలకు ఆదివారం రూ.5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయించారు. చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ ఈ మొత్తం చంద్రన్న బీమా నుంచి పంపిణీ చేశామని ప్రకటించారు. అయితే బీమా మొత్తం చెల్లింపునకు కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో కార్మిక శాఖ అధికారులు అంతిమ సంస్కారాల కోసం కొంత మొత్తాన్ని మాత్రమే అందించారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇండ్ల పోలయ్య,(35) శ్రీకాంత్ (16) ఆదివారం కన్ను మూశారు. శనివారం నాటి ఘటనలో ఆచూకీ లేకుండా పోయిన జి. రమేష్ (18) కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఆనవాళ్లు లభించాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు వైద్యానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించినా, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటనేది పాలకులు పట్టించుకోలేదు. శ్రీకాంత్, పోలయ్య కుటుంబా లకు కూడా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించడానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి సోమవారం కూడా జీఓ విడుదల కాలేదు. దీంతో ఈ కుటుంబాలకు కూడా జిల్లా నిధుల నుంచే రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మృ తుల కుటుంబాలను ఏదో ఒక నిధి నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించామనీ, ప్రభుత్వం ఏ నిధుల నుంచి దీన్ని సర్దుబాటు చేస్తుందో చూడాల్సి ఉందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. 17 కుటుంబాలకు సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషాదకర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వేగంగా స్పందించక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
జన్మభూమి సభలకు స్పందన కరువు
- రేషన్ కార్డుల కోతపై జనం నిరసన - గత జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలు ఏమయ్యాయని ప్రశ్నించిన జనం - ఉపాధి పనులకు బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమం మొదటి రోజు అనేక చోట్ల జనంలేక వెలవెల బోయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీనేతలు అధికారులతో కలసి సభలు నిర్వహించారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకు దిక్కులేకపోవడం, రేషన్ కార్డుల మంజూరులో కోత పడటంతో జనం అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు 23వ డివిజన్లో జరిగిన సభను బీజేపీ కార్పొరేటర్ అపర్ణ బహిష్కరించారు. మంత్రి నారాయణ నెల్లూరు కార్పొరేషన్లో జన్మభూమి సభలు ప్రారంభించారు. కలెక్టర్ రేవు ముత్యాలరాజు, సంయుక్త కలెక్టర్ ఇంతియాజ్, మేయర్ అజీజ్ ఈ సభల్లో పాల్గొన్నారు. ► కావలి పట్ణణం 4వ వార్డులో జరిగిన జన్మభూమి సభలో చైర్పర్సన్ అలేఖ్యతో పాటు ఆమె భర్త శ్రీ కాంత్ కూడా వేదికనెక్కారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డు అందించడానికి ఒక మహిళను వేదిక మీదకు పిలిచారు. దీన్ని జీర్ణించుకోలేని చైర్పర్సన్ భర్త శ్రీకాంత్ ఆ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ వ్యవహార తీరుపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ► దుత్తలూరు మండలం తిమ్మాపురం, రెడ్లదిన్నె గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని కూలీలు అధికారులను నిలదీశారు. రెడ్ల దిన్నె గ్రామంలో మూత పడిన పాఠశాలను తెరిపించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ► కలిగిరి మండలం వీర్నకొల్లులో తమ గ్రామానికి సిమెంటురోడ్లు వేయాలని ప్రజలు అధికారులను నిలదీశారు. తెల్లపాడు గ్రామంలో ఉపాధి పనులు చూపడంలేదని కూలీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ► కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నెలో శ్మశాన స్థలం ఆక్రమణకు గురైనా పట్టించుకోలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. ► సర్వేపల్లిలో 850 మంది తెల్లరేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే 250 మాత్రమే మంజూరు కావడంపట్ల ప్రజలు అధికారులను నిలదీశారు. ► వాకాడులో జన్మభూమి సభకు జనం రాక వెలవెలబోయింది. అధికారులే ప్రభుత్వ పథకాలు గురించి మాట్లాడుకొని వెళ్లిపోయారు. ► నెల్లూరు సిటీలోని 23వ డివిజన్లో జరిగిన జన్మభూమి సభను బీజేపీ కార్పొరేటర్ ఎర్రబోలు అపర్ణ బహిష్కరించారు. గత జన్మభూమిలో అధికారుల దృష్టికి తీసుకుపోయిన సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ► బుచ్చిరెడ్డి పాళెం మండలం చెల్లాయపాలెంలో నిర్వహించిన జన్మభూమి సభలో వేదిక మీద అధికార పార్టీ నేతలే ఆశీనులు కావడంతో విశ్రాంత ఉద్యోగి పి. భాస్కర్‌రావు ఎంపీడీవో నరసింహారావును నిలదీశారు. ఇది అధికారిక సభా లేక టీడీపీ సభా అని ప్రశ్నించారు. గతంలో చెప్పిన సమస్యలు ఇంత వరకు పరిష్కారం కాకుండా అధికారులు మళ్లీ జన్మభూమి సభలకు ఎందుకు వచ్చారని జనం నిలదీశారు. ► పొదలకూరు మండలం ఇనుకుర్తి, దుగ్గుంట గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చనే అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ► వింజమూరు మండలం చాకలికొండ సభలో వేలి ముద్రలు పడలేదని తమకు రేషన్ సరుకులు నిలిపివేశారని ప్రజలు అధికారులను నిలదీశారు. ► సీతారామపురం మండలం బాలా యపల్లిలో జరిగిన గ్రామ సభలో ఎంపీపీ జనార్దన్‌రెడ్డి అధికారుల వైఖరి మీద ధ్వజమెత్తారు.గత జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలకు సంబంధించి పనులు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గుణశేఖర్ వద్ద వందల కోట్ల అక్రమాస్తులు!
తిరుపతి: మంత్రి నారాయణకు సన్నిహితుడైన డాక్టర్ గుణశేఖర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు గుణశేఖర్‌కు వందల కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే సుమారు 400 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులున్నట్టు గుర్తించినట్టు సమాచారం. కాగా ఐటీ అధికారులు వివరాలను గోప్యంగా ఉంచారు. మంత్రి నారాయణకు గుణశేఖర్ బినామీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీటీడీ ఏడీ బిల్డింగ్ పక్కన బహుళ అంతస్తుల భవనాన్ని గుణశేఖర్ కొనుగోలు చేశాడు. ఐటీ అధికారులపై మంత్రి నారాయణ ఒత్తిడి తెస్తున్నారని అనుమానిస్తున్నారు. -
తనిఖీలు కొనసాగింపు
నారాయణ సన్నిహితుడి వద్ద భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం తిరుపతి రూరల్/ ఆత్మకూరు రూరల్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సన్నిహితుడు డాక్టర్ గుణశేఖర్ యాదవ్ ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనీఖీలు బుధవారం కూడా కొనసాగాయి. మంగళవారం తిరుపతిలోని గుణశేఖర్ ఇంటిలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు , గుణశేఖర్‌ను వెంటబెట్టుకుని బుధవారం ఆత్మకూరు వెళ్లిన ఐటీ అధికారులు భారీ స్థాయిలో ఆస్తులకు సంబంధించిన రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు దాదాపు రూ.60 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలిసింది. ఇంకా ఆస్తుల మదింపు కొనసాగుతోందని ఓ అధికారి పేర్కొన్నారు. ఆత్మకూరు సిండికేట్ ఫార్మర్స్ సొసైటీలోని గుణశేఖర్ యాదవ్ భార్య శ్రీలక్ష్మి, ఆమె తండ్రి పల్లంరెడ్డి వెంకట సుబ్బారెడ్డిలకు చెందిన లాకర్‌ను ఐటీ అధికారులు తెరిపించారు. డాక్యుమెంట్లను బ్యాంకు అధికారుల అనుమతితో సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. అలాగే బెంగళూరులో మంత్రి నారాయణ కళాశాలల సీఈవోగా పనిచేస్తున్న ప్రమీలకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయండి
మంత్రి పి.నారాయణ నెల్లూరు(పొగతోట) : వార్దా తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ అ«ధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్‌లో హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షంతో మెట్టప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందన్నారు. వర్షాలకు 600 విద్యుత్ పోల్స్ దెబ్బతిన్నాయన్నారు. సబ్స్టేషన్లకు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. డాక్టర్లు పీహెచ్‌సీలల్లో అందుబాటులో ఉండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తెలిపారు. ఆన్లైన్లో తప్పనిసరి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మంజూరైన ప్రతిపనిని ఆన్లైన్లో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఆన్లైన్లో పెట్టిన తర్వాతే ఆర్థిక పరమైన అనుమతులు వస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్ నిధులను కార్పొరేషన్, మున్సిపాలిటీలకు అత్యధికంగా కేటాయించడం జరిగిందని, చైర్మన్లు సమావేశాలు ఏర్పాటుచేసి పనుల నివేదికలను సిద్ధ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ ఏ మహమ్మద్ ఇంతియాజ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా తీర్చిదిద్దాలి నెల్లూరు(పొగతోట) : అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదాద్దాలని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌హాలులో మున్సిపల్ కమిషనర్లు, సీడీపీపీఓలు, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కిలోమీటరు పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఒకే భవనంలోకి తీసుకువచ్చే ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి కావాలని ఆదేశించారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. -
మేయర్‌పై మంత్రి గుర్రు
► సీడీఎంఏకు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఆదేశాలు ►వాయువేగంతో జీఓ విడుదల నెల్లూరు : మేయర్ అజీజ్ వ్యవహారం మంత్రి నారాయణకు ఆగ్రహం తెచ్చింది. కార్పొరేషన్ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లును తాను సొంత నిర్ణయం ద్వారా బదిలీ చేయించిన అనంతరం అజీజ్ చిన్నబాబు లోకేష్‌ను సంప్రదించడంతో మంత్రి అసహనంగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో మేయర్ అజీజ్ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు, కమిషనర్ బదిలీ నిలిచిపోయిందని మేయర్ వర్గీయులు ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం పలు పత్రికల్లో మేయర్ అజీజ్ ప్రయత్నాలు ఫలించాయని కథనాలు రావడంతో మంత్రి నారాయణకు కోపం వచ్చింది. తాను బదిలీ చేసిన తర్వాత కూడా మేయర్ అజీజ్ తన నిర్ణయానికి వ్యతిరేకంగా పావులు కదపడంతో తనకు పార్టీలో చులకనభావం వస్తుందనే ఉద్దేశంతో కమిషనర్ బదిలీని యథావిధిగా చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. జీఓ జారీ గత నెల 29వ తేదీ రాత్రి కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేయర్ అజీజ్ కమిషనర్ బదిలీని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వారం రోజుల పాటు నడిచిన నాటకీయ పరిణామాలకు సోమవారం ఫుల్స్టాప్ పడింది. సీడీఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికలా వల్లవన్కు వెంటనే కమిషనర్ సీడీఎంఏకు రిపోర్ట్ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించినట్లు సమాచారం. దీంతో సోమవారం మధ్యాహ్నం హుటాహుటిన కమిషనర్ వెంకటేశ్వర్లును సీడీఎంఏకు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా కార్పొరేషన్‌కు ఉత్తర్వులిచ్చారు. అయితే ప్రస్తుతం కమిషనర్ సెలవులో ఉన్నారు. ఇన్చార్జి కమిషనర్‌గా జేసీ ఇంతియాజ్ కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ అవడంతో, నూతన కమిషనర్ హరీష్ బాధ్యతలను స్వీకరించేంత వరకు జాయింట్‌కలెక్టర్ ఇంతియాజ్ ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. సీడీఎంఏ నుంచి వచ్చిన జీఓలో ఈ మేరకు పేర్కొన్నారు. మరోవైపు మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ మధ్య వార్ ఇంతటితో ఆగుతుందా, లేక కొనసాగుతుందాననే అంశం అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. -
నెల్లూరులో గురుశిష్యుల వార్!
► కమిషనర్ బదిలీ ఆపడానికి మేయర్ అజీజ్ ప్రయత్నం ► ససేమిరా అంటున్న మంత్రి నారాయణ నెల్లూరు : కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ వ్యవహారంలో మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌ల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు తీవ్రమయ్యాయి. కమిషనర్ బదిలీని నిలుపు చేయించాలని మేయర్ రంగంలోకి దిగారు. కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేయడంలో భాగంగా కమిషనర్‌ను సాగనంపాల్సిందేనని మంత్రి పట్టుదలతో ఉన్నారు. దీంతో గురుశిష్యుల మధ్య వార్ మొదలైంది. కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాలు, అభివృద్ధి పనులను వేగంగా నడిపించడంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విఫలమయ్యారని మంత్రి నారాయణ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. సొంత జిల్లాలోని సొంత కార్పొరేషన్నే గాడిలో పెట్టలేకపోతే మున్సిపల్‌శాఖ మంత్రిగా రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను ఎలా గాడిలో పెట్టగలనని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారంలో మంత్రి నేరుగా జోక్యం చేసుకున్నారు. కార్పొరేషన్లో తనకు తెలియకుండా ఏ పని జరగరాదని అధికారులను ఆదేశించారు. అధికారపార్టీకి చెందిన మేయర్‌గా తానుండగా మంత్రి నేరుగా జోక్యం చేసుకోవడం పట్ల మేయర్ అజీజ్ అసహనంతో ఉన్నారు. ఇటీవల జరిగిన రొట్టెల పండగ వివాదాన్ని కారణంగా చూపి మంత్రి నారాయణ కమిషనర్‌ను బదిలీ చేయించారు. సొంత పార్టీకి చెందిన తనకు ముందుగా చెప్పకుండా ఉన్నఫళంగా కమిషనర్‌ను బదిలీ చేయడంపట్ల మేయర్ లోలోన రగిలిపోతున్నారు. రొట్టెల పండగ సందర్భంగా చేసిన కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు, ఎస్సీ సబ్‌ప్లాన్ టెండర్లకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం కొంత కాలంపాటు కమిషనర్ కొనసాగాల్సిందేనని మేయర్ పట్టుబట్టారు. సొంతపార్టీకి చెందిన కార్పొరేటర్లు, పార్టీకి సంబంధించి డివిజన్ ఇన్చార్జ ల మంచి కోసమే తాను ఈ డిమాండ్ చేస్తున్నట్లు అజీజ్ తన మద్దతుదారుల వద్ద చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ సూచించిన రెవెన్యూ అధికారి హరీష్‌ను కమిషనర్‌గా నియమిస్తే తమ మాట చెల్లుబాటు కాదనే అభిప్రాయం మేయర్‌తో పాటు అధికారపార్టీకి కార్పొరేటర్లలో కూడా ఉంది. ఈ కారణంతోనే మేయర్ అజీజ్ కమిషనర్ బదిలీని ఎలాగైనా నిలపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి ద్వారా మంత్రితో రాయబారాలు కూడా సాగించారు. అయితే కమిషనర్ బదిలీని నిలుపుదల చేయడానికి మంత్రి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ బదిలీ తాత్కాలికంగా ఆగుతుందా.. లేక నేడో రేపో కొత్త కమిషనర్ బాధ్యతలు స్వీకరించేందుకు అనుగుణంగా రెవెన్యూశాఖ నుంచి ఆయనను రిలీవ్ చేస్తారా అనే అంశం కార్పొరేషన్ వర్గాల్లోనూ, తెలుగుదేశంపా ర్టీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. -
నారాయణే గెలిపించుకుంటారు
–పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్తి పట్టాభి ఎంపికపై కత్తులు నూరుతున్న మూడు జిల్లాల సీనియర్లు –ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం తెర మీదకు పరసారత్నం తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారాయణ ఆసుపత్రి సీఈవోగా పనిచేసిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ఎంపిక చేయడంపై నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారు. తమతో సంబంధం లేకుండానే ఉపాధ్యాయ స్థానానికి కూడా మంత్రి నారాయణే అభ్యర్థిని ఎంపిక చేయించుకుని ఇద్దరినీ ఆయనే గెలిపించుకుంటారులే అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ స్థానానికి మాజీ మంత్రి పరసారత్నం పేరు మంత్రి నారాయణ తెర మీదకు తెచ్చారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందువల్ల ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు చెందిన రెండు ఎమ్మెల్సీలు గెలవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు టార్గెట్లు పెట్టి ఓటర్ల నమోదు చేయించారు. వీరితో సంబంధం లేకుండా మంత్రి నారాయణ మూడు జిల్లాల పరిధిలోని తన కళాశాలల్లోని ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారు. వీరితో పాటు తమ సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులను వీలైనంత మందిని ఓటర్లుగా చేర్పించారు. నెల్లూరు జిల్లా నుంచి తాను మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తుండటం, చిత్తూరు జిల్లాకు ఇన్చార్జి మంత్రి అయినందున రెండు స్థానాలకు తాను అనుకున్న వ్యక్తులే అభ్యర్థులు కావాలని వ్యూహ రచన చేశారు. ఇందులో భాగంగానే పట్టభద్రుల స్థానానికి తమ ఆసుపత్రి సీఈవోగా పనిచేసిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పట్టుబట్టి అభ్యర్థిగా ఎంపిక చేయించుకున్నారు. రగులుతున్న సీనియర్లు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక గురించి పార్టీ నాయకత్వం తమతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని మూడు జిల్లాల్లోని ముఖ్య నాయకులు భావించారు. అయితే పార్టీ నాయకత్వం మంత్రి నారాయణకు పెద్ద పీట వేస్తూ ఆయన సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగిని ఏక పక్షంగా ఎంపిక చేయడం మీద మూడు జిల్లాల్లోని సీనియర్ నాయకులు లోలోన రగిలిపోతున్నారు. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడిన వారు చాలా మంది ఉండగా, కేవలం డబ్బు, మంత్రి ఆశీస్సులనే ప్రాతిపదికగా తీసుకుని వేమిరెడ్డిని ఎలా ఎంపిక చేస్తారని పార్టీ అంతర్గత చర్చల్లో తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకోవడం వేమిరెడ్డికి కత్తిమీద సాములా మారనుంది. పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నందువల్ల తాము పనిచేస్తామని నాయకులు చెప్పినా ఓటింగ్ దగ్గర కొచ్చే సరికి చేతులెత్తేస్తే వేమిరెడ్డికి ఇబ్బందులు తప్పక పోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల ఓట్లతో అభ్యర్థులు గెలుస్తారనుకోవడం అవివేకమని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు. తెర మీదకు పరసా ఉపాధ్యాయ స్థానానికి అభ్యర్థిని పోటీకి దింపాలా? లేక స్వతంత్ర అభ్యర్థికి గానీ, బీజేపీ అనుబంధసంఘమైన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరపున తామే ఒకరిని బరిలోకి దింపాలా అనే విషయం గురించి టీడీపీ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పరసారత్నం పేరు మంత్రి నారాయణ తెర మీదకు తెస్తున్నారు. పరసారత్నం కళాశాల, యూనివర్సిటీ విద్య తిరుపతిలోనే చదవడం, ఆ జిల్లా వాసులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో సీపీఎం తరపున పోటీకి దిగుతున్న విఠపు బాలసుబ్రమణ్యంను ఢీ కొనగలరని మంత్రి నారాయణ ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సతీమణి సుచరిత కూడా ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిత్వం కోరుతున్నారు. గురువారం తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తన అభ్యర్థిత్వం పరిశీలించాలని వినతిపత్రం ఇచ్చారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ ద్వారా పార్టీ సీనియర్లకు ముకుతాడు వేయించి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని గెలిపించేలా పనిచేయించాలని మంత్రి నారాయణ మంత్రాంగం చేస్తున్నారు. శుక్రవారం జరిగే నెల్లూరు జిల్లా పార్టీ సమన్వయ సమావేశంలో లోకేష్ ఈ విషయం గురించి పార్టీ సీనియర్లకు గట్టిగా చెప్పే అవకాశం ఉందని మంత్రి మద్దతుదారులు చెబుతున్నారు. -
మార్చి 31కి పెన్నా బ్యారేజ్ పూర్తి
మంత్రి నారాయణ నెల్లూరు(పొగతోట): నెల్లూరు పెన్నా బ్యారేజ్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి 31 లోపు పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ సంబంధిత అ«ధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో ఇరిగేషన్, వ్యవసాయం, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నెల్లూరు బ్యారేజ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 51 గేట్లు ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. సంఘం బ్యారేజ్ పనులు నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజ్ పనులు పూర్తి చేయాలన్నారు. ప్యాకేజ్ పనులు పూర్తి చేయడం వలన జిల్లాలో 2.50 లక్షలకుపైగా అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. ప్యాకేజ్ పనులు నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. నిమ్మ, బత్తాయి, కూరగాయాల సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యటక రంగం అభివృద్ధికి నిర్ధేశించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పింఛన్ల పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధానం జిల్లాలో విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఎంఎల్సీ బీదా రవిచంద్ర మాట్లాడారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వరసుందరం, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, హర్టికల్చర్ ఏడీలు అనురాధా, ఉమాదేవి, ఇరిగేషన్, టూరిజం అధికారి నాగభూషణం, డీఆర్డీఏ తదితర అధికారులు పాల్గొన్నారు. -
బీపీఎస్ సొమ్మంతా కార్పొరేషన్‌కు..
విజయవాడ సెంట్రల్ : బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం కింద వసూలైన రూ.49 కోట్లను నగరపాలక సంస్థకే కేటాయిస్తూ మునిసిపల్ మంత్రి పి.నారాయణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వివిధ పద్దుల ద్వారా కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం విషయమై మేయర్ కోనేరు శ్రీధర్ సెక్రటేరియెట్‌లో మంత్రిని కలిశారు. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని బీపీఎస్ నిధులు మొత్తం విడుదల చేయాల్సిందిగా కోరారు. నిబంధనల ప్రకారం బీపీఎస్‌లో 50 శాతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెల్లించాల్సి ఉంది. మేయర్ విజ్ఞప్తి మేరకు పూర్తి సొమ్మును నగరపాలకసంస్థకు కేటాయిస్తూ మంత్రి జీవో విడుదల చేశారు. ఆన్లైన్ బిల్డింగ్ప్లాన్ల ద్వారా వసూలైన రూ.42 కోట్లు విడుదల చేయాల్సిందిగా మేయర్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సురేష్, టౌన్‌అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ జీవి.రఘు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వి.నాగమణిని మేయర్ కలిసి నగరపాలక సంస్థ స్థితిగతులపై వివరించారు. కో ఆప్షన్‌సభ్యులు సిద్ధెం నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
కావలి : పట్టణంలోని ఉదయగిరి రోడ్డుపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి పి.నారాయణ గురువారం రాత్రి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత 6వ వార్డులో సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. బాలికల హాస్టల్ భవనాల ప్రారంభం ఆలస్యంగా జరిగింది. రెడ్‌క్రాస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నేమాల సుకుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, జిల్లా జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు, కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
'సోమిరెడ్డికి దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలి'
నెల్లూరు: మంత్రి నారాయణను పదవి నుంచి తొలగించేందుకు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. నిత్యం మంత్రి నారాయణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలపై సోమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి అవినీతి అక్రమాలపై నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమిరెడ్డికి దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని కాకాని గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం
మంత్రి నారాయణ సూళ్లూరుపేట: తెలుగుదేశం పార్టీ అవిర్భావంతోనే రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి రాజ్యాధికారం వచ్చిందని, వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెలుగులోకి వచ్చారని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక టీవీఆర్‌ఆర్ కల్యాణ మండపంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షతన బీసీ గర్జన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ వాకాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అన్నీ కార్పొరేషన్లు మూసివేసి కుర్చీలు లేకుండా చేశారని చెప్పారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరసా వెంకటరత్నయ్య, ఆనం జయకుమార్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, కొండేపాటి గంగాప్రసాద్, వేనాటి పరంధామిరెడ్డి, ఇసనాక హర్షవర్థన్‌రెడ్డి, నూనె మల్లికార్జున్ యాదవ్, కిలారి వెంకటస్వామినాయుదు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్త్రీ స్వశక్తి భవనాన్ని ప్రారంభయం పట్టణంలోని కళాక్షేత్రంలో ఇటీవల సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన స్త్రీ స్వశక్తి భవనాన్ని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటిలో చెత్తతరలించేందుకు ఇటీవలే కొనుగోలు చేసిన ట్రాక్టర్లును కూడా వారు ప్రారంభించారు. చైర్పర్సన్ నూలేటి విజయలక్ష్మీ, వైఎస్ చైర్మన్ గరిక ఈశ్వరమ్మ, కమిషనర్ పాయసం వెంకటేశ్వర్లు, నాయుడుపేట ఆర్డీవో శీనానాయక్ ఉన్నారు. స్థానిక చెంగాళమ్మ ను మంత్రి నారాయణ దర్శించుకున్నారు. వేనాటి ఇంట ఆర్భటంగా విందు దొరవారిసత్రం: జెడ్పీ ఫోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి ఇచ్చిన విందుకు ఆదివారం మావిళ్లపాడు గ్రామానికి మంత్రి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పారిశ్రకవేత్త కొండేపాటి గంగప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పరసావెంకటరత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, పలువురు నాయకులు హాజరైయ్యారు. మంత్రి నారాయణ పర్యాట గత వారంలోనే ఖరారు అయింది. ఈ క్రమంలో దొరవారిసత్రంలోని జడ్పీ ప్రహారీ, అదనపు పాఠశాల భవనం, వ్యవసాయ శాఖు చెందిన భవనం తదితరవి మంత్రిచే ప్రారంభించే విధంగా స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు విజేత, సూళ్లూరుపేట చెంగాళమ్మ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ ముప్పాళ్ల వెంటేశ్వర్లురెడ్డి ప్లాన్ చేశారు. కాని తెలుగు దేశం మండల పార్టీ అధ్యక్షులు వేనాటి సురేష్‌రెడ్డి, మండల నాయకులను సంప్రదించకుండానే ప్రారంభం కార్యక్రమాలు ఏలా నిర్ణయిస్తారని కొందరు నాయకలు మంత్రి దృష్టికి తీసుకుపోయినందునే ఉన్నట్లు ఉండి దొరవారిసత్రంలోని ప్రారంభం కార్యక్రమాలు నిలిచిపోయినట్లు విమర్శలు వినిపించాయి. దానికి తోడు ఎప్పుడూ లేని విధంగా వేనాటి ఇంటి ఎంతో ఆర్భటంగా సూళ్లూరుపేట నియోజక వర్గ స్థాయిలో అందరి నాయకులను, మంత్రి నారాయణను ఆహ్వానించి వింధు ఇవ్వడం వెనుక అర్ధం ఏమిటని కొందరు అధికార పార్టీనాయకులే చెవులు కొరుక్కున్నారు. తొలుత వేనాటి ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్సీ వాకాటి, పారిశ్రామికవేత్త గంగప్రసాద్ మరి కొందరు నాయకులు మంత్రి రాక ముందే వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలకు తావిచింది. మొత్తానికి వేనాటి వింధు పలువురి మధ్య చర్చనీయమాంసంగా మారింది. -
సీఎం ఆదేశాల మేరకే భూసమీకరణ
మచిలీపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే మచిలీపట్నంలో భూసమీకరణ చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని అమరావతిలో 33 వేల ఎకరాల భూమిని సమీకరించామని రోడ్లు, గ్రీనరీ, సచివాలయం తదితరాలకు భూమిని కేటాయిస్తే మిగిలింది 6 వేల ఎకరాలు మాత్రమే అని చెప్పారు. మచిలీపట్నంలోనూ 33 వేల ఎకరాల భూమిని సమీకరిస్తున్నారనే భయం రైతుల్లో ఉందని, పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభించిన రోజే 1370 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రావటం అభినందనీయమని పేర్కొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ భూములు కోల్పోతామనే భయం నుంచి రైతులు భయటపడాలన్నారు. ఏ రైతు కంట కన్నీరు రానివ్వం.. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కంట కన్నీరు రాకుండా భూసమీకరణ చేస్తామని చెప్పారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంత భవిష్యత్తు కోసం రైతులు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ పీతా రవిచంద్ర, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మాట్లాడుతూ రైతుల భాగస్వామ్యంతోనే పోర్టు, పరిశ్రమల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి కోసం వలసపోతున్న జనం ఇన్చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ మచిలీపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవటంతో ఉపాధి కోసం ఇక్కడి ప్రజలు వలస పోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మచిలీపట్నంలో పోర్టు నిర్మాణంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎంఏడీఏ కార్యాలయం వద్దకు మంత్రులు, టీడీపీ నాయకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. -
మురికివాడలను పీపీపీ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
తిరుపతి స్కావెంజర్ కాలనీలో మొదటి ప్రాజెక్టు ప్రారంభం మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు(మినిబైపాస్): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మురికివాడలను అత్యంత సౌకర్యవంతమైన కాలనీలుగా మార్చే ప్రక్రియకు త్వరలో శ్రీకారంచుట్టనున్నామని మంత్రి నారాయణ శుక్రవారం నెల్లూరులో వెల్లడించారు. స్థానిక బారాషాహిద్ దర్గాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఏరియాలను అభివృద్ధి చేయడం కన్నా ఇదివరకే ఉన్న స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేయడం సులభమన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మురికివాడలను పీపీపీ మోడల్‌గా తీర్చిదిద్దుతామని, తొలి ప్రయత్నంగా తిరుపతిలోని స్కావెంజర్ కాలనీని అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతమైన కాలనీగా మార్చనున్నామని మంత్రి తెలిపారు. తిరుపతిలో ఉన్న స్లమ్ మున్సిపల్ పరిధిలో ఉందని, మొదటగా వారికి కావల్సిన సౌకర్యాలు కల్పించి, 6 అంతస్తుల మిద్దెలను ఏర్పాటు చేసి స్లమ్ ఏరియాలో ఉన్న వారందిరికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని తెలిపారు. ముంబై కార్పొరేషన్లో ఏ విధంగా అయితే పీపీపీ మోడల్ ఇళ్లను నిర్మించారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. నవంబరు ఆఖరులోపు టెండర్లను పిలుస్తామన్నారు. తిరుపతిలో ఐదున్నర ఎకారాల స్థలంలో అభివృద్ధి చేస్తున్నామని, నెల్లూరులో కూడా ఐదున్నర ఎకరాల స్థలం కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని అన్నారు. బిల్డర్ల సహాయంతో నిర్మిస్తామని, ఒక్క పైసా కూడా స్లమ్‌లో ఉన్న వారు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నూనె మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
జనవరి నుంచి రాజధాని భవనాల నిర్మాణం
సాక్షి ఫొటో ఫీచర్ కథనంపై మంత్రి నారాయణ సాక్షి, అమరావతి: వచ్చే జనవరి నుంచి రాజధానిలో ప్రధాన భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాని వైనంపై సోమవారం సాక్షిలో ప్రచురితమైన ఫొటో ఫీచర్ కథనంపై ఆయన స్పందించి ప్రకటన విడుదల చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం అనుకున్న సమయానికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. రాజధానిలో కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యామా? లేక అద్భుతమైన పురోగతి సాధించామా? అనే విషయం ప్రజలందరికీ తెలుసని, అమరావతి నిర్మాణంలో వైఎస్సార్సీపీ ఇష్టానుసారం విమర్శలు చేస్తోందన్నారు. ఆరు నెలల్లో ఆరు లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించామని, సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులందరికీ ప్లాట్లు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్ చివరి నాటికి ఇది పూర్తవుతుందన్నారు. -
రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి
మంతి నారాయణ నెల్లూరు, సిటీ: ఐదు రోజులు పాటు జరిగే రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో సోమవారం పోలీస్, ఇరిగేషన్, మత్స్యశాఖ, కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. పండగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి దర్గాకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చూడాలన్నారు. గంధమహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రొట్టెల పండగకు సీయం చంద్రబాబునాయుడు రూ.5 కోట్లు మంజూరు చేశారని, స్వర్ణాలచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుని వినియోగిస్తామన్నారు. 4 లైన్ రోడ్డును త్వరతిగతిన ప్రారంభించండి నగరంలోని పాతచెక్‌పోస్ట్ నుంచి నాలుగోమైలు రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మించేందుకు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జేసీ ఇంతియాజ్, మేయర్ అజీజ్, కమిషనర్ కె వెంకటేశ్వర్లు, టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, చాట్లనరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల కాలాన్ని నష్టపరిచారు
డీఈఓ రామలింగంపై మంత్రి నారాయణ ఆగ్రహం ఫౌండేషన్ కోర్సుల నిర్వహణపై చిత్తూరు, నెల్లూరు జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్ నెల్లూరు, సిటీ: ఫౌండేషన్ కోర్సులను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటే, మీరు విద్యార్థుల విలువైన కాలాన్ని నష్టపరుస్తున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చిత్తూరు, నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో ఫౌండేషన్ కోర్సులు నిర్వహణ ఏవిధంగా ఉందని మువ్వా రామలింగాన్ని మంత్రి ప్రశ్నించారు. మువ్వా మాట్లాడుతూ 10వ తరగతి మినహాయించి కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో మంత్రి నారాయణ మువ్వా పై తీవ్రంగా మండిపడ్డారు. ‘నేను చెప్పింది మీరు చేయాలి, మీ సొంత నిర్ణయాలు వద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేడ్లు ముఖ్యం కాదని, ఫౌండేషన్ కోర్సులు ద్వారా విద్యార్థులకు ఉపయోగం ఉంటుందన్నారు. నీవు డీఈఓగా వచ్చి రెండు నెలలు గడుస్తుంది, ఈ రెండు నెలలు ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించకుండా ఉండడంతో విద్యార్థులు విలువైన కాలాన్ని నష్టపోయారన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దిక్ జెయిన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, చిత్తూరు డీఈఓ నాగేశ్వరరావుతో ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాను రెండు జిల్లాలకు ఇన్చార్జి మంత్రినని, రెండు జిల్లాల్లో ఫౌండేషన్ కోర్సులు పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సులు రెండు జిల్లాల్లో ప్రారంభించాలన్నారు. ఈ క్రమంలో చిత్తూరు డీఈఓను ఎంత మంది విద్యార్థులతో కోర్సును మొదలుపెడుతారని మంత్రి ప్రశ్నించారు. చిత్తూరు డీఈఓ మాట్లాడుతూ 3వేల మందితో మొదలుపెడతానని సమాధానం ఇచ్చారు. దీంతో మంత్రి 3వేల మందితో మొదలుపెట్టేందుకు జిల్లా కలెక్టర్, మంత్రి మీతో మాట్లాడాలా అని మండిపడ్డారు. రెండు జిల్లాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవే విద్యార్థులు 30శాతం మందితో ఈనెల 14వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలన్నారు. ఫౌండేషన్ కోర్సుకు అవసరమయ్యే మెటీరియల్ కూడా సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. -
ఫౌండేషన్ కోర్సుతో ఉత్తమ ఫలితాలు
విజయవాడ (భవానీపురం): మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కెరీర్ ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టిందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. కెరీర్ ఫౌండేషన్ కోర్సు అమలు విధానంపై మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 1997 వరకు రాష్ట్రం నుంచి ఐఐటికి ఏటా 100 మంది మాత్రమే ఎంపికయ్యేవారని, ప్రస్తుతం 100 ర్యాంకులలో 50 ర్యాంకులు మన రాష్ట్రం విద్యార్థులు సాధిస్తున్నారని తెలిపారు. 2018 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఎక్కువ ర్యాంకులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం రానున్న రోజుల్లో మున్సిపల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ అభిప్రాయాలను తెలిపేందుకు వేదికపైకి వచ్చిన ప్రతి విద్యార్థితో మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్, పురపాలక పాలన సంచాలకుడు కన్నబాబు, మేయర్ కోనేరు శ్రీధర్, మెప్మా ఎండీ చినతాతయ్య, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కృష్ణ కపర్ధి, తదితరులు పాల్గొన్నారు. -
భక్తులే వీఐపీలు
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు(బృందావనం): శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులే వీఐపీలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో శనివారం రాత్రి సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులే వీఐపీలని, వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులు, నాయకులను కోరారు. ఆలయ పరిసరాల్లో నాయకులు, వారి అనుయాయులు భారీఎత్తున ఫ్లెక్సీలు పెట్టడం విరమించుకోవాలని సూచించారు. ఆలయం రూరల్ పరిధిలో ఉన్నందున ప్రొటోకాల్ ప్రకారం తనకు అగ్రతాంబూలం దక్కుతుందని, అయితే మహిళలు, చంటిబిడ్డల తల్లులు.. ఇతర సందర్శకులకు ఇక్కట్లు కలగకుండా ఉండేందుకు తాను ప్రొటోకాల్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. సామన్యుడిలా క్యూలైన్లోనే అమ్మవారి దర్శనం చేసుకుంటానని తెలిపారు. గంటల తరబడి వేచిచూసే యాతన నుంచి భక్తులను తప్పించేందుకు తన బాటలోనే ప్రముఖులు పయనించాలని కోటంరెడ్డి కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి నారాయణ ఫ్లెక్సీల విషయంలో ఎమ్మెల్యే అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా ఆలయ పరిసరాల్లో ఏసీ స్టేడియం నుంచి కరెంటాఫీస్ సెంటర్ వరకు రాజకీయనాయకులకు చెందిన ఫ్లెక్సీల ఏర్పాటు జరగదన్నారు. కాగా, అక్టోబరు 1 నుంచి 11 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కోటంరెడ్డి సూచించారు. ఇటీవలికాలంలో ఆలయగోపురంపై అగంతకుడు ఎక్కడం, అగ్నిప్రమాదం సంభవించడం లాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం అరిష్టమన్నారు. ప్రధానంగా ఆలయ నిర్వాహకుల తీరుతెన్నులు, ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిలో మార్పులు రావాల్సి ఉందన్నారు. క్యూలైన్ల ఏర్పాటు, దర్శనం తదితర విషయాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విస్తృత ఏర్పాట్లు: మంత్రి నారాయణ 42వ శరన్నతరాత్రి ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కృష్ణ పుష్కరాలు, వెంకటగిరి పోలేరమ్మ జాతర, బారాషహీద్‌దర్గా రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో అధికారులను సమన్వయం చేసి అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేస్తామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలకు చెందిన అ«ధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, భక్తులకు శానిటేషన్ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ వివరించారు. ఇదిలా ఉండగా, ఆలయ కార్యనిర్వహణాధికారిగా కోదండరామిరెడ్డి పనికిరాడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఈఓ తీరువల్ల భక్తులు ఎన్నో అవస్థలుపడ్డారని విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు ఆనం జయకుమార్‌రెడ్డి, రాజానాయుడు, నూనె మల్లికార్జునయాదవ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత దసరా శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
జిల్లాలో 11 టూరిజం ప్రాజెక్టులు
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నెల్లూరు, సిటీ : జిల్లాలో 11 టూరిజం ప్రాజెక్ట్‌లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ల నిర్మాణాన్ని గురువారం తెల్లవారుజామున ఆయన పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు వస్తుంటారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గోదావరి, కృష్ణా పుష్కరాలకు చేసిన ఏర్పాట్లును రొట్టెల పండుగకు కూడా చేస్తామన్నారు. జిల్లాకు రూ.60.37 కోట్లు స్వదేశీ దర్శన్‌లో భాగంగా కేటాయించడం జరిగిందన్నారు. అందులో రూ.2.62 కోట్లు స్వర్ణాల చెరువు కోసం కేటాయించారని చెప్పారు. అక్టోబర్ 8వ తేదీ నాటికి ఘాట్ల నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. ఆయన వెంట నగర మేయర్ అజీజ్, టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు పాల్గొన్నారు. -
'33 పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మిస్తాం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 33 పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షా 93 వేల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడారు. లక్షా 20 వేల ఇళ్లను అపార్ట్మెంట్ల మోడల్లో నిర్మిస్తామన్నారు. 73 వేల ఇళ్లను లబ్ధిదారులు రుణాలను వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలని చెప్పారు. 18 నెలల్లో ఈ నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. -
‘మకి’కి మరో అవకాశం
*వారంలో డిజైన్లు మార్చి ఇవ్వాలన్న సీఆర్డీఏ *అవీ బాగా లేకపోతే మరో కంపెనీకి అవకాశం *20లోపు డిజైన్లపై నిర్ణయం: మంత్రి నారాయణ *జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు అమరావతి: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయం డిజైన్లకు సంబంధించి జపాన్ కంపెనీ మకి అసోసియేట్స్‌కు మరో అవకాశం ఇవ్వాలని సీఆర్డీఏ నిర్ణయించింది. వారంలోపు కొత్త డిజైన్లు ఇవ్వాలని కోరింది. ఆ డిజైన్లూ ప్రభుత్వానికి నచ్చని పక్షంలో డిజైన్ల పోటీలో రెండో స్థానంలో నిలిచిన లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్ కంపెనీని ఆహ్వానించే యోచనలో ప్రభుత్వ పెద్దలున్నారు. మలేసియాకు చెందిన హారిస్ ఇంటర్నేషనల్ ఇచ్చిన డిజైన్లతోపాటు దేశంలోని సీపీ ఖురేజా అసోసియేట్స్, హపీజ్ కాంట్రాక్టర్ డిజైన్లను కూడా పరిశీలించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ భవన సముదాయంలోని హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియెట్ తదితర భవనాల డిజైన్ల కోసం నిర్వహించిన పోటీలో మకి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ ఇచ్చిన డిజైన్లపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రత్యామ్నాయంగా ఇతర విదేశీ కంపెనీలతోపాటు దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో సంప్రదింపులు జరుపుతోంది. కానీ జపాన్ సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మకిని వదులుకోవడానికి సంశయిస్తోంది. చివరిగా డిజైన్లు మార్చి ఇవ్వాలని ఇటీవల సీఆర్డీఏ మకికి తెలిపింది. మూడు, నాలుగు రోజుల్లో మకి మార్చిన డిజైన్లను సీఆర్డీఏకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20లోపు డిజైన్లపై ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెబుతున్నారు. వచ్చే వారం నుంచి వెలగపూడి నుంచే పాలన కాగా, వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన మంత్రి నారాయణ.. వచ్చే జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ చివరినాటికి డిజైన్లు పూర్తవుతాయన్నారు. వచ్చే వారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన ప్రారంభం అవుతుందని తెలిపారు. సచివాలయం పరిధిలోని 49 ఎకరాల విస్తీర్ణంలో గ్రీనరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆ పనులను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఎనిమిది గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నేలపాడు రైతులు కొందరు రోడ్ల సౌకర్యాలు లేవని అడిగారని, త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం 4,600 నివాస గృహాలు తొలగించాల్సి ఉందని, అయితే ప్లాన్‌లో కొంత మార్పులు చేయటంతో 350 ఇళ్లకు కుదించినట్లు తెలియజేశారు. వారికి సీఆర్డీఏ ప్యాకేజీ తయారు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన కార్యక్రమం రద్దయినట్లు తెలిపారు. -
'వారం రోజుల్లో తాత్కాలిక సచివాలయం నుంచే విధులు'
-
'వారం రోజుల్లో తాత్కాలిక సచివాలయం నుంచే విధులు'
విజయవాడ: వారం రోజుల్లో తాత్కాలిక సచివాలయం నుంచే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి సీఎం కూడా తాత్కాలిక సచివాలయం నుంచే పాలన సాగిస్తారని తెలిపారు. అలాగే శుక్రవారం నుంచి 8 గ్రామాల్లో ప్లాట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. రాజధానికి సంబంధించిన డిజైన్లు డిసెంబరు వరకు ఫైనల్ చేస్తామని, జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అన్నారు. మాకి సంస్థ ఇచ్చిన డిజైన్లపై విమర్శలు రావడంతో రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. -
సింగపూర్‌కు మంత్రి నారాయణ
సాక్షి, హైదరాబాద్: పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ రెండ్రోజుల పర్యటనకు సింగపూర్ వెళుతున్నారు. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 4, 5 తేదీల్లో ఆయన సింగపూర్‌లో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధులతో సాధారణ సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. తాజాగా స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యాలు వేయడం, దీనిపై తీవ్ర వివాదం నేపథ్యంలో నారాయణ సింగపూర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. -
474 కోట్లు ఎలా సంపాదించారు?
మంత్రి నారాయణకు ఉండవల్లి సూటిప్రశ్న సాక్షి, రాజమహేంద్రవరం: రాజధాని అమరావతి నిర్మాణంలో జరుగుతున్న తప్పులపై వివిధ రంగాల నిపుణుల కమిటీ పంపిన సమాచారాన్ని తాను విలేకర వద్ద ప్రస్తావిస్తే.. సమాధానం చెప్పకుండా మంత్రి నారాయణ తనపై ఎదురుదాడి చేయడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో తన ఆస్తులు రూ. 474.70 కోట్లని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ ఆస్తులు ఏ వ్యాపారం చేసి సంపాదించారు? విద్యాసంస్థలను నారాయణ సొసైటీ పేరిట నడుపుతున్నారు.ఆ చట్ట ప్రకారం ఆ ఆస్తు లు సొంతానికి వాడుకునే హక్కు లేదు. మంత్రి తన సొంత ఖాతాకు సొసైటీ నగదు బదలాయించుకున్నారా? లేక సీఎం చంద్రబాబుతో కలసి వ్యాపారం చేశారా? సొసైటీ చట్ట ప్రకారం విద్యాసంస్థలను లాభాపేక్ష లేకుండా నడపాలి. సొసైటీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తే నేరం. రూ. 474.70 కోట్లు ఎలా సంపాదించారో 15 రోజుల్లోపు వెల్లడించాలి. లేదంటే ఈ విషయంపై చట్టపరంగా ముందుకెళతాను. దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళతాను. అప్పుడు నేను ఉండవల్లినా? ఊసరవెల్లినా? చెబుతాను’’ అని నారాయణపై మండిపడ్డారు. పారదర్శకత అంటే అదేనా ‘‘రాజధాని భూ సేకరణ నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అవినీతి జరుగుతూంటే బాబు ప్రతి రోజూ పారదర్శకతంటూ ఊదరగొడుతున్నారు. పారదర్శకతంటే పార పట్టుకు తిరగడమా?’’ అని ఎద్దేవా చేశారు. విజయవాడ, గుంటూరుల్లో రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా పట్టించుకోలేదన్నారు. శివరామకృష్ణన్ చంద్రబాబు తీరుపై రాసిన మూడు పేజీల లేఖ ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైందని తెలిపారు. -
'నారాయణకు రూ. 474 కోట్లు ఎక్కడివి'
-
నారాయణకు రూ. 474 కోట్లు ఎక్కడివి: ఉండవల్లి
రాష్ట్ర మంత్రి నారాయణ ఆస్తుల చిట్టాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయట పెట్టారు. తనకు సొంతంగా రూ. 474 కోట్ల ఆస్తులు ఉన్నట్లు స్వయంగా నారాయణ ప్రకటించారని, ఆ డబ్బు ఎలా సంపాదించారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. దొంగ సొమ్ము దాచుకోడానికి సింగపూర్ మంచి ప్రాంతమని, ప్రపంచంలో స్విట్జర్లాండ్ అందుకు మొదటి స్థానంలో ఉండగా సింగపూర్ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. అందుకే చంద్రబాబు పదే పదే సింగపూర్ వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అవతలివాళ్ల వైపు ఒకవేలు చూపిస్తే, మనవైపు నాలుగువేళ్లు చూపిస్తాయన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. తాను ప్రకటించిన రూ. 474 కోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో నారాయణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ముందుగా అకౌంటు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి కుడి, ఎడమ చేతులు మీరేనని అంతా అంటారని, ఆ లెక్కన అమరావతి స్కాంకు కూడా సూత్రధారి నారాయణే అవుతారని ఉండవల్లి ఆరోపించారు. పది పదిహేను రోజుల్లోగా నారాయణ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టప్రకారం ఏదైనా విషయం తెలిసి అధికారులకు చెప్పకపోవడం కూడా శిక్షార్హమే అవుతుందన్నారు. పారదర్శకంగా ఉన్నట్లు చెబుతూ ఉంటారని, పార పట్టుకుని తిరగడమే పారదర్శకతా అని ప్రశ్నించారు. ఇక మఖ్యమంత్రి కూడా పదే పదే తాను నిప్పు అంటారని, మీరెంత నిప్పో రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే అంతా చూశారని ఎద్దేవా చేశారు. పోనీ అది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ ఎవరికో ఆ వేషం వేసి పంపారని చెబుతారేమో చెప్పాలన్నారు. ఈ రెండేళ్లలో పుష్కరాలు తప్ప ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మనం ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తే 'నారాయణ' అంటూ ప్రారంభిస్తాం కాబట్టి, ఈ ఆస్తుల వివరాలు వెల్లడించడం కూడా నారాయణే మొదలుపెట్టాలని అన్నారు. ఇది ఆయనకు అశుభం కాకుండా చూసుకోవాలన్నారు. తప్పుడు మనుషులు నడిపే స్కూళ్లకు ఎవరూ పిల్లలను పంపరని, అందువల్ల ఆయన తన క్రెడిబులిటీని నిరూపించుకోవాలని చెప్పారు. ఏ వ్యాపారం చేసి ఇంత మొత్తం సంపాదించారో చెప్పాలన్నారు. తాను డాక్యుమెంట్ల ఆధారంగానే అన్నీ చెప్పానని.. మీ వ్యాపారాలేంటో, వాటికి ఆధారాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు వేల కోట్ల నిధులు ఉండొచ్చు గానీ, ఆ సొసైటీలను నడిపేవారికి వేలకోట్లు ఉండటానికి వీలుండదని అన్నారు. వీళ్లంతా సొసైటీ డబ్బులను సొంత డబ్బులా వాడేసుకుంటున్నారని తెలిపారు. సొసైట చట్ట ప్రకారం లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలు నడపాలని తెలిపారు. ఇక ఏపీ రాజధాని నిర్మాణం గురించి కూడా ఉండవల్లి తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఏ నివేదిక ఆధారంగా అమరావతిలో రాజధాని కడుతున్నారని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో చెప్పగలరా అని అడిగారు. కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవజ్ఞుడైన శివరామకృష్ణన్‌తో పాటు చాలామంది నిపుణులు ఆ కమిటీలో ఉన్నారన్నారు. కానీ దాన్ని కాదని చంద్రబాబు మాత్రం రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడం కోసం నారాయణ, జీఎంఆర్, బీవీ రాజు, గల్లా జయదేవ్, సుజనా చౌదరిలతో ఓ కమిటీ వేశారని అన్నారు. వీళ్లంతా కోట్ల కోట్ల రూపాయలున్న పెద్ద వ్యాపారవేత్తలని, అమరావతితో వ్యాపారం చేద్దామనే శివరామకృష్ణన్ కమిటీ కాదని ఈ కమిటీ వేశారని మండిపడ్డారు. చనిపోయేముందు శివరామకృష్ణన్ ఓ లేఖ రాశారని, అది ప్రముఖ జాతీయ పత్రికల్లో వచ్చిందని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు చేస్తున్న పనివల్ల కొత్తగా ఏర్పడే రాష్ట్రం నాశనం అయిపోయే ప్రమాదం ఉందని అందులో చెప్పారన్నారు. రాజధాని ఎక్కడ కట్టాలో స్పష్టంగా చెప్పకపోయినా.. ఎక్కడ కట్టకూడదో మాత్రం చెప్పారని గుర్తుచేశారు. కృష్ణా-గుంటూరు మధ్య అమరావతి వద్ద కట్టొద్దని స్పష్టంగా చెప్పినా, అక్కడే కడుతున్నారని, అదేంటని అడిగినందుకు తాను ఊసరవెల్లి అయిపోయానంటున్నారుని ఆవేదన వ్యక్తం చేశారు. -
దుర్గాఘాట్‌లో మంత్రి నారాయణ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం దుర్గాఘాట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రితో పాటు నగర మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేషన్ కమిషనర్ వీరపాండియన్ ఉన్నారు. నీటిలో పువ్వులు, ఇతర పూజ సామగ్రి కనిపించడంతో వెంటనే వాటిని తొలగించాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కమిషనర్‌కు సూచించారు. ఘాట్‌లో పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు, యువకులే కనిపించడంతో వారితో కాసేపు ముచ్చటించారు. -
భక్తులకు ఏ లోటు రాకూడదు
విజయవాడ సెంట్రల్ : పుష్కరనగర్లకు వచ్చే భక్తులకు రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ మంత్రి పి.నారాయణ సూచించారు. మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్‌తో కలిసి మంగళవారం రాత్రి బస్టాండ్ సమీపంలోని పుష్కరనగర్‌ను మంత్రి పరిశీలించారు. పుష్కరనగర్లలో వసతులకు లోటు రానీయొద్దని చెప్పారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పుష్కరసెల్ నుంచి తాను ఎప్పటికప్పుడు ఘాట్లు, పుష్కరనగర్లలో ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. భోజన, వసతి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటివరకు నగరంలోని పుష్కరనగర్లలో ఏర్పాటుచేసిన వసతుల గురించి మేయర్ వివరించారు. ఈఈలు ధనుంజయ, టి.రంగారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మంత్రివర్గంలో నేరస్తులా?
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు మహిళలను వేధించిన కేసుల్లో ఉండటం, దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి ఒకరు ఉండటం దారుణమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ ఒక నివేదికలో ఈ విషయాలను వెల్లడించిందని తెలిపారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చెన్నాయుడుపై మహిళలపై అఘాయిత్యం చేసిన కేసులున్నాయన్నారు. రాజధాని అమరావతి చుట్టూ భూములు కొనుగోలు చేసి, చంద్రబాబు బినామీగా వ్యవహరిస్తున్న పి.నారాయణ దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి అని ఏడీఆర్ సంస్థ వెల్లడించిందని భూమన తెలిపారు. చంద్రబాబు కాదు.. గాడ్సేబాబు విజయవాడలో గాంధీజీ విగ్రహాన్ని కూల్చి వేసి, ఇబ్రహీంపట్నం వద్ద బుడమేరులో పారేయడం దారుణమని, దీనిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని భూమన అన్నారు. జాతిపితకు చంద్రబాబు ఇస్తున్న గౌరవం దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు.బాబు, గాడ్సే కన్నా హీనుడని ఆయన మామ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.గాంధీ విగ్రహాన్ని కూల్చేడం చూస్తే ఆయనను చంద్రబాబు కాదు, గాడ్సేబాబు అనాలా? అని ప్రశ్నించారు. -
'మంత్రి నారాయణ చంద్రబాబు బినామీ'
హైదరాబాద్: దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి నారారాయణ చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారని ఏడీఆర్ నివేదిక బయటపెట్టిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతి చుట్టుపక్కల భూములను కొనేయడం ద్వారా భూ దందాకు తెర తీసి వేల కోట్లకు నారాయణ పడగలెత్తారని ఆరోపించారు. నారాయణ.. చంద్రబాబు బినామీ అని పునరుద్ఘాటించారు. రాజధాని భూ దందాపై సీబీఐ దర్యాప్తు చేయించాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతిని భూమన గుర్తు చేశారు. అవినీతి, భూ దందా, మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తించడంలో చంద్రబాబు దూసుకుపోతున్నారని దుయ్యబట్టారు. పుష్కర ఆహ్వానాలపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు లేదని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించి తీరు అభ్యంతకరమన్నారు. బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విజయవాడలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గాడ్సే కంటే తన అల్లుడు హీనుడని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. జాతిపితకు ఇంత అవమానం జరిగినా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదన్నారు. గాడ్సే బాబు అని పిలవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని భూమన ధ్వజమెత్తారు. -
'మంత్రి నారాయణ చంద్రబాబు బినామీ'
-
నారాయణ.. ‘నారాయణ’!
మంత్రి ఫోన్‌తో నిలిచిపోయిన టాస్క్‌ఫోర్స్ తనిఖీలు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే నిలిపివేత అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే.. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు నిల్ సాక్షి, గుంటూరు: హలో... ఎక్కడున్నారు.. ఎక్కడున్నా సరే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేసి వెనక్కి రండి.. ఇది ఫోన్లో డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) నుంచి రెస్క్యూటీమ్ అధికారులకు వచ్చిన ఆదేశాలు. ఆరంభ శూరత్వంలో తమకు సాటి లేరని రాష్ట్రప్రభుత్వ పెద్దలు మరోసారి నిరూపించుకున్నారు. నెల్లూరు తరహాలో గుంటూరు నగరంలో ఎక్కడికక్కడ ఆన్లైన్లో ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటాం... ఇందుకోసం నాలుగు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామంటూ ప్రగల్భాలు పలికిన మంత్రి నారాయణ, రాష్ట్ర పట్టణప్రణాళికాధికారులు నగరంలోని టీడీపీ నాయకుల ముందు తమ ఆదేశాలు ఏమాత్రం చెల్లవని అంగీకరించక తప్పలేదు. పరిశీలన ఊసే లేదు.. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి కొంతమంది అధికారులను ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ టీమ్‌లో సభ్యులుగా నియమించింది. టాస్క్‌పోర్స్ బృందం బుధవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు న గరంలో 200 చదరపు మీటర్లు కలిగిన భవన నిర్మాణాలను మొదటి విడతగా దాదాపు 200 ఇళ్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగాయా? నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజు చెల్లించినదీ, లేనిదీ తదితర అంశాలను టాస్క్‌పోర్స్ సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేయకుంటే వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 7.30 గంటలకే నాలుగు టీమ్‌లు బయలుదేరి నగరంలోని నాలుగువైపులకు వెళ్లాయి. మధ్యాహ్నం వరకు తనిఖీలు చేశారు. అయితే అనుకోకుండా డీటీసీపీ నుంచి ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో రెస్క్యూ టీమ్‌లోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనిఖీలు నిలిపివేసి వారివారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఎన్నికలు వస్తున్నాయనే.. వాస్తవానికి వందల సంఖ్యలో భవనాలను ఈ తనిఖీల్లో కూల్చివేయడం, లేదా నోటీసులు అందించడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంది. నగరంలో తనిఖీలు ప్రారంభించిన వెంటనే టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా టీడీపీ నాయకులు, వారికి కావాల్సిన వారే బిల్డర్లుగా ఉండటంతో వారు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఇంకేముంది నగరంలో మరో మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని, ఇటువంటి సమయంలో భవనాల జోలికి వస్తే పార్టీకి తీరని నష్టం ఏర్పడుతుందంటూ ప్రజాప్రతినిధులపై వత్తిడి తీసుకువచ్చారు. నగరంలో ఉన్న మంత్రి పుల్లారావు దృష్టికి ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన మంత్రి నారాయణ దష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. నగరపాలకసంస్థ ఎన్నికల దృష్ట్యా రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేయాలని, ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత చూడవచ్చంటూ వత్తిడి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి నారాయణ రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేయాలని డీటీసీపీకి ఆదేశాలు జారీచేయడంతో ఆయన రెస్క్యూటీమ్ అధికారులకు ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏది ఏమైనా నగరపాలకసంస్థ ఎన్నికలను అడ్డుపెట్టుకొని నగరంలో అ«నధికార భవనాలపై చర్యలకు టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారు. దీంతో ఏ నగరంలో లేని విధంగా అక్రమ కట్టడాలకు అడ్డగా గుంటూరు నగరం మారుతోంది. -
ఇక నేనెందుకు?
నగరపాలనలో మంత్రి పెత్తనంపై మేయర్ అసహనం సాక్షి ప్రతినిధి నెల్లూరు : ‘కార్పొరేషన్లో పరిపాలన మొత్తం మీ చేతుల్లోకి తీసుకుంటే నేనుండటమెందుకు.. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. రాజీనామా చేసేస్తా.. ’ అని మేయర్ అబ్దుల్ అజీజ్ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణతో తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతకాలంగా మంత్రి నారాయణతో మేయర్ అజీజ్‌కు ఏర్పడిన అభిప్రాయ భేదాలు, అంతర్గత గొడవలుగా మారాయి. ఒకరి వ్యవహార తీరుపై మరొకరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల కార్పొరేషన్లో ఏసీబీ దాడులు జరిగిన అనంతరం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న గొడవలు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహించారు. సొంత జిల్లాలోనే కార్పొరేషన్‌ను సక్రమంగా నడిపించలేకపోతే రాష్ట్రం మొత్తాన్ని ఎలా నడిపిస్తారని మంత్రి నారాయణ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్ పనితీరు పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నారాయణ దీన్ని అవకాశంగా తీసుకొని కార్పొరేషన్ మీద తన పట్టు పెంచుకోవడానికి పావులు కదిపారు. మేయర్ అజీజ్‌ను డమ్మీ చేస్తూ కార్పొరేషన్లో జరిగే ప్రతి వ్యవహారం తనకు తెలియాలని, తనతో సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కమిషనర్‌తో పాటు ఇతర అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మేయర్‌ను ఏమాత్రం లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత కోసం మంత్రి నారాయణ మేయర్‌కు తెలియకుండానే ప్రత్యేక బృందాలను పంపారు. మేయర్‌కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆ బృందాలు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు దిగడంతో పెద్ద దుమారం రేపింది. మేయర్ చేతకానితనంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా విమర్శలు చేశారు. పరిపాలన వ్యవహారంలో భాగంగా కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లను లాటరీ పద్ధతిలో ఇటీవల బదిలీ చేశారు. సుదీర్ఘకాలం ఒకేచోట ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అధికారపార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు మింగుడు పడలేదు. తన సోదరుడు మాల్యాద్రిని బదిలీ చేయడం టీడీపీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ బదిలీ ఆపాలని మేయర్ మీద ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేకపోయింది. దీంతో తన రాజకీయ గురువు ఆనం వివేకానందరెడ్డి ద్వారా మంత్రి నారాయణ మీద ఒత్తిడి తెచ్చి ఆయనను తిరిగి పాత స్థానానికే బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేయడం అజీజ్‌కు ఆగ్రహం తెప్పించింది. అలాగే టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురిని తనకు తెలియకుండా సస్పెండ్ చేయడం అజీజ్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ సస్పెన్షన్లు ఆపివేయాలని కొత్తగా వచ్చిన వారిని వదిలేసి పాతవారిని మాత్రమే సాగనంపుదామని మేయర్ మంత్రి నారాయణ మీద తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేకపోయింది. ఈ వ్యవహారాలన్నింటిపై ఆందోళనతో ఉన్న అజీజ్ శనివారం సాయంత్రం మంత్రి నారాయణకు ఫోన్ చేశారు. కార్పొరేషన్ వ్యవహారాలన్నీ తనకు తెలియకుండా జరిగిపోతుంటే తానెందుకు పదవిలో ఉండాలని అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రి మేయర్ అజీజ్‌కు తెగేసి చెప్పారని తెలిసింది. ఈ వ్యవహారం నడుస్తుండగానే టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ బదిలీ గురించి మేయర్‌కు ఫోన్ చేశారు. కార్పొరేషన్లో అన్నీ తనకు తెలిసే జరుగుతున్నాయా.. మంత్రిని అడిగి బదిలీ చేయించుకోండని అజీజ్ ముంగమూరు మీద కోపం ప్రదర్శించారు. దీంతో శ్రీధరకృష్ణారెడ్డి తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలిసింది. కార్పొరేషన్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ రాజకీయ పరిణామాలు తెలుగుదేశంపార్టీలోనూ, కార్పొరేషన్ ఉద్యోగుల్లోనూ హాట్‌టాపిక్‌గా మారాయి. మంత్రితో విభేదాలు లేవు: మేయర్ అజీజ్ తనకు మంత్రి నారాయణతో ఎలాంటి విభేదాలు లేవని మేయర్ అబ్దుల్ అజీజ్ సాక్షి ప్రతినిధికి చెప్పారు. తాను రాజీనామా చేస్తానని మంత్రికి చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తినంత మాత్రాన విభేదాలున్నట్లుగా పరిగణించకూడదని మేయర్ పేర్కొన్నారు. -
మంత్రిది ఉన్మాద పాలన
ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఆగ్రహం నెల్లూరు సిటీ: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాలన ఉన్మాది పాలనను తలపిస్తోందని నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరులతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై వేటేశారని ఆరోపించారు. ఐదేళ్లుగా టౌన్‌ప్లానింగ్ అధికారుల కారణంగా కార్పొరేషన్ భ్రష్టుపట్టిందని, ప్రక్షాళన చేసేందుకే సస్పెండ్ చేశారని చెప్పారని, అయితే ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ ఆర్నెల్లు, ఏడాది క్రితం వచ్చిన వారేనని చెప్పారు. మంత్రి ఉన్మాద నిర్ణయాలతో తప్పులు చేయనివారు బలికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సమ్మర్ స్టోరేజీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై విచారణ జరుపుతామన్న మంత్రి ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు. చేతనైతే కార్పొరేషన్‌కు నిధులు తీసుకురావాలని హితవు పలికారు. జిల్లాలో సీనియర్ నేతలను కాదని నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయన ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నారాయణను సాగనంపి, మంచి మంత్రిని ఎన్నుకోవాలని సూచించారు. కార్పొరేషన్‌లోని అన్ని వ్యవహారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మేయర్ షాడో హోటల్లో దందా దేశంలో ఎక్కడా ఏడుగురు ఉద్యోగులపై విచారణ కూడా లేకుండా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆరోపించారు. మేయర్ షాడో హోటల్లో దందా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దందా చేసే వారిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని నిరూపించగలరానని ప్రశ్నించారు. ముందుగా మంత్రి వద్ద నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ ఆక్రమణలు చేసినట్లు నిరూపిస్తానని, మంత్రి నారాయణ రాజీనామా చేస్తారానని సవాల్ విసిరారు. తాను నిరూపించలేకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసయాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, పుల్లారెడ్డి, సత్తార్, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ నెల్లూరు(బారకాసు): మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అటవీశాఖలోని సామాజిక వన విభాగం, టెరిటోరియల్ సంయుక్తంగా నిర్వహించిన 67వ వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం వీఆర్సీ మైదానంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఒక్కొక్కరు ఏడాదికి ఆరు మొక్కలు చొప్పున నాటాలన్నారు. జిల్లాలో మొదట విడతగా ఐదు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి 20 వేల మొక్కలను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మొక్కలు నాటడంతో సరిపోదని వాటిని కనీసం రెండేళ్లపాటు సంరక్షించినప్పుడే దాని ప్రతిఫలం లభిస్తుందన్నారు. ఈసందర్భంగా అటవీశాఖాధికారులు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రి నారాయణ బహుమతులు ప్రదానం చేశారు. అలాగే మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామంటూ మంత్రి నారాయణ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందుగా నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మైదానం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయ ఆవరణలో మంత్రి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ అబ్దుల్అజీజ్, టీడీపీ నాయకులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, చాట్ల నరసింహరావు, అనురాధ, రంగమయూర్‌రెడ్డి, అన్చూరు వాణి, జ్యోత్సS్నలత, జేసీ ఇంతియాజ్, డీఎఫ్ఓ చాణక్యరాజు పాల్గొన్నారు. -
ఈనెల 29లోగా తాత్కాలిక సచివాలయం పూర్తి
-
‘రెండో’ ముహూర్తం వాయిదా
- సోమవారం ఉదయం ఉద్యోగుల తరలింపునకు అన్ని ఏర్పాట్లు - వెళ్లొద్దంటూ ఆదివారం రాత్రి సీఎస్ ఆదేశం - వెలగపూడిలో కార్యాలయం పనులు పూర్తికాకపోవడమే కారణం - బుధవారానికి వాయిదా వేశామన్న మంత్రి నారాయణ సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి శాఖలు, ఉద్యోగుల రెండో దఫా తరలింపునకు ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం వాయిదా పడింది. సోమవారం హైదరాబాద్ నుంచి రహదారులు-భవనాలు శాఖతో పాటు విజిలెన్స్ కమిషన్ తరలి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాలు సిద్ధం కాకపోవడంతోనే వారి తరలింపును వాయిదా వేశారు. నిజానికి ఈ నెల ఆరో తేదీనే వెలగపూడిలోని ఐదో భవనం తొలి అంతస్థులోకి ఆ రెండు శాఖలు వెళ్లాల్సి ఉంది. అప్పటికి ఆ భవనంలోని తొలి అంతస్థు పూర్తికాకపోవడంతో 11వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం ఉదయం ఉద్యోగులను తరలించడానికి బస్సులు ఏర్పాటు కూడా చేశారు. అయితే ఆదివారం రాత్రి 10:30 గంటలకు రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరలింపును వాయిదా వేసుకోవాలని రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్ అధికారులకు ఫోన్లో సూచించారు. దీంతో వెంటనే ఆయా శాఖల అధికారులు ఉద్యోగులకు ఫోన్లు చేసి వాయిదా సమాచారం ఇచ్చారు. మంత్రుల చర్చలు..: ఐదో భవనం మొదటి అంతస్థులో సోమవారం ప్రారంభించాలని భావించిన శాఖలను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. వాయిదా పై ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు మంత్రులు, అధికారులు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఐదవ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇంకా పనులు పూర్తికాకముందే మొదటి అంతస్థుని సోమవారం ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మంత్రి నారాయణ రోడ్లు, భవనాలు, రవాణా శాఖ కార్యాలయాలను ప్రారంభించాలని మంత్రి శిద్ధా రాఘవరావుపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. పనులు పూర్తి కాకుండా ప్రారంభిస్తే పరువు పోతుందని సన్నిహితుల వద్ద మంత్రి శిద్ధా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సోమవారం ప్రారంభించాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏదో ఒక గదిని సిద్ధం చేసి ఇస్తామని మంత్రి నారాయణ చెప్పినా.. తాను వచ్చేది లేదని శిద్ధా తేల్చి చెప్పినట్లు తెలిసింది. సోమవారం ఉదయం ప్రారంభిస్తామని నారాయణ మీడియాకు సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటికే వాయిదా వేసినట్లు ప్రకటించారు. -
ఫైబర్‌గ్రిడ్ టెక్నాలజీతో ప్రధాన రహదారి
మంత్రి నారాయణ వెల్లడి తుళ్లూరు : జపాన్‌కు చెందిన బయోటెక్స్ ఫైబర్‌గ్రిడ్ టెక్నాలజీతో తాత్కాలిక సచివాలయం ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టబోతున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్కాపురం నుంచి సచివాలయం వరకు 20 రోజుల్లో 1.65 కి.మీ. రహదారి నిర్మించేందుకు రోడ్లు భవనాల శాఖను ఆదేశించామన్నారు. మంచి రోజులు లేని కారణంగా సోమవారం పలు ప్రభుత్వ శాఖల భవనాలు ప్రారంభించలేదని వివరించారు. ఈ నెల 13వ తేదీన ఐదో బ్లాక్‌లో మొదటి అంతస్తు, రెండో బ్లాక్‌ను ప్రభుత్వ శాఖలకు అందజేయనున్నట్లు చెప్పారు. అదే రోజు ఏఏ శాఖలు వస్తాయనే విషయంలో స్పష్టత ఇస్తామని తెలిపారు. -
పరువు సర్వే
► అవినీతి అంశం నుంచి జనం దృష్టి మళ్లించేందుకు ► అక్రమ కట్టడాల సర్వే ► తొలిరోజే 110 భవనాలు గుర్తించినట్లు ప్రకటన ► నెల్లూరులో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ బృందాల హడావుడి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని అధికార పార్టీ నేతలే బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో టీడీపీకి వచ్చిన చెడ్డపేరు నుంచి జనం దృష్టి మరల్చడానికి మంత్రి నారాయణ అక్రమ నిర్మాణాల కూల్చి వేత మంత్రం వేశారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ రఘు నేతృత్వంలో సోమవారం ఆరు బృందాలు నగరంలో హడావుడి చేశాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరును ఆదర్శ (మోడల్) కార్పొరేషన్‌గా తయారు చేస్తానని మున్సిపల్ శాఖమంత్రి నారాయణ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తున్నారు. కార్పొరేషన్లో అవినీతి రహిత పాలన అందిస్తామని, అవినీతిని సహించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలో చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక భవన నిర్మాణ అనుమతి కోసం అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ లంచం సొమ్ము తనకు కాదనీ, కమిషనర్‌కు ఇవ్వడానికి తీసుకున్నానని ఏసీపీ ఇచ్చిన వాంగ్మూలం రాజకీయ మలుపు తీసుకుంది. మేయర్ అజీజ్‌కు పాలన చేతకాదనీ, ఆయన అవినీతిలో మునిగిపోయారని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆనమే అనీ, ఆయన హయాంలోనే కార్పొరేషన్‌ను నిలువునా దోచేశారని మేయర్ అజీజ్ ఎదురు దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని అధికార పార్టీ నాయకులే ఆరోపించడంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చింది. నెల్లూరులో టీడీపీని బలంగా తయారు చేయాలని ఏ పార్టీ నుంచైనా, ఏ స్థాయి నాయకుడినైనా వల విసిరి చేర్చుకుంటున్న తరుణంలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడటం అధికార పార్టీకి చెప్పలేనంత చెడ్డపేరు తెచ్చింది. నిఘా వర్గాలు ఇదే విషయం సీఎంకు నివేదించాయి. దీంతో మంత్రి నారాయణమీద సీఎం అసహనం వ్యక్తం చేశారు. సొంత కార్పొరేషన్నే గాడిలో పెట్టలేని వ్యక్తివి రాష్ర్టమంతా ఎలా పర్యవేక్షిస్తావని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. దీంతో మంత్రి నారాయణ రంగంలోకి దిగి కార్పొరేషన్లో జరిగే ప్రతి చిన్న వ్యవహారం తనకు తెలియాలనీ, మేయర్, కమిషనర్ సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట ఏ నాయకుడు బహిరంగంగా ఆరోపణలు చేయొద్దని గట్టిగా మందలించారు. జనం దృష్టి మళ్లించడానికే.. ప్రభుత్వానికి, పార్టీకి వచ్చిన చెడ్డపేరు నుంచి జనం దృష్టి మళ్లించడానికి నెల్లూరులో ఏదో చేయబోతున్నట్లు మంత్రి నారాయణ అక్రమ భవనాల కూల్చివేత అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇందుకోసం ఆరు బృందాలను పంపి అక్రమ భవనాల సర్వేకు శ్రీకారం చుట్టించారు. 2014 డిసెంబరులోపు అనుమతి లేకుండా నిర్మించి ఆ లోపు బీపీఎస్ పథకంలో దరఖాస్తు చేసుకుని ఉన్నవి మాత్రమే ఇప్పుడు సక్రమమైనవిగా గుర్తిస్తారు. ఆ తర్వాత అనుమతి లేకుండా నిర్మించినవీ, కార్పొరేషన్ అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలన్నీ అక్రమ కట్టడాల జాబితాలోకే వస్తాయి. తొలిరోజే నగరంలో ఇలాంటివి 110 ఉన్నట్లు గుర్తించారు. వీరికి నోటీసులు జారీ చేసి అక్రమ కట్టడాలను కూల్చి వేయిస్తామనీ, ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వాటిని కూడా నేలమట్టం చేస్తామని అధికారులు ప్రకటించారు. సర్వే పేరుతో మరో రెండు మూడు రోజులు హడావుడి చేయనున్నారు. అయితే వీరు గుర్తించిన అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయడం సాధ్యమయ్యే పనేనా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నగరం నడిబొడ్డున కాలువను ఆక్రమించి ఖరీదైన హోటల్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఖరీదైన లాడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది అక్రమమా? సక్రమమా? అనే విషయం అధికారులు, అధికార పార్టీ నాయకులందరికీ తెలుసు. ఇలాంటి నిర్మాణాలు నగరంలో లెక్కకు మించి ఉన్నాయి. ఇలాంటి వాటిని కూలదోసే ధైర్యం చేయగలుగుతారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాలువ గట్ల మీద ఉండే పేదల గుడిసెలు తొలగించి కార్పొరేషన్‌ను క్లీన్ చేశామని చెప్పుకుని ప్రజల్లో పార్టీకి పోయిన పరపతి మళ్లీ సంపాదించుకోవడం కోసం నడుపుతున్న వ్యవహారంగా టీడీపీ నాయకులే చెబుతున్నారు. -
ఎమ్మెల్యే vs మున్సిపల్ చైర్పర్సన్
►కురుగొండ్లపై పోరుకు సిద్ధమైన మున్సిపల్‌చైర్ పర్సన్ ► ప్రతి విషయంలో చేయి పెడితే తానెందుకుంటూ అసంతృప్తి ► ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు కాదని ఎదురు దాడి ► రామకృష్ణపై సీఎంకు ఫిర్యాదుచేయాలని నిర్ణయం ► నారాయణకు మరో తలనొప్పిగా వెంకటగిరి వ్యవహారం నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లో ఏసీబీ దాడుల అనంతర పరిణామాలతో తలబొప్పి కట్టిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఇది మరో తలనొప్పిగా మారనుంది. 2014లో వెంకటగిరి మున్సిపల్ ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్లకు ప్రతిష్టాత్మకమై కూర్చుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతోందనే అభిప్రాయం ప్రజలకు కలిగితే తన ఓటమి తప్పదని ఆందోళన చెందారు. చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎమ్మెల్యే మరింత కంగారు పడ్డారు. కౌన్సిలర్లు, ఇతర ఖర్చులు భరించి చైర్పర్సన్ పదవి కోసం ముందుకొచ్చే వారి కోసం భూతద్దం వేసి వెదికారు. అప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేని దొంతు బాలకృష్ణ కుటుంబానికి ఎర వేశారు. స్థితిమంతుడు కావడంతో పాటు ఆయన సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉండటంతో ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని ముగ్గులోకి దించారు. మెజారిటీ కౌన్సిలర్లు గెలిస్తే బాలకృష్ణ సతీమణి దొంతు శారదను చైర్‌పర్సన్‌ను చేసే ఒప్పందంతో వారిని రంగప్రవేశం చేయించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ కౌన్సిల్ స్థానాలు గెలవడంతో మాట ప్రకారం శారదను చైర్‌పర్సన్‌గా చేశారు. మరో సామాజిక వర్గానికి చెందిన బీరం రాజేశ్వరరావును వైస్ చైర్మన్‌ను చేశారు. పట్టు పోతుందని భయం చైర్పర్సన్ శారద విద్యావంతురాలు కావడంతో మున్సిపాలిటీ పాలనపై మెల్లగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణం మీద ఈ కుటుంబం పట్టు పెరిగితే తన పలుకుబడి తగ్గిపోతుందనే భయంతో ఎమ్మెల్యే రామకృష్ణ చైర్పర్సన్ ఎన్నిక జరిగిన మూడు నెలల నుంచే తన మార్కు రాజకీయం చేయడం ప్రారంభించారు. తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేయించుకున్నారు. తనకు తెలియకుండా మున్సిపాలిటీలో ఏ చిన్న పని కూడా జరగరాదని కమిషనర్‌కు హుకుం జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీలో పావలా పని జరగాలన్నా ఎమ్మెల్యే అనుమతి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అధికారులెవరూ చైర్పర్సన్ మాట లెక్క చేయని స్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే వైస్ చైర్మన్‌ను ప్రోత్సహిస్తూ చైర్‌పర్సన్‌కు విలువ లేకుండా చేసే విధంగా పావులు కదుపుతూ వచ్చారు. మున్సిపాలిటీలో ప్రతి చిన్న విషయంలో ఎమ్మెల్యే చేయి పెడుతుంటే ఇక తాను చైర్‌పర్సన్‌గా ఉండటం ఎందుకని శారద బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. రామకృష్ణ తనను కేవలం ఉత్సవ విగ్రహంలా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, తనకు కల్పిస్తున్న ఇబ్బందులను శారద గతంలో మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను కట్టడి చేయకపోతే తాను పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని గట్టిగానే వివరించారు. మంత్రి ఆదేశం మేరకు కొంత కాలం పాటు ఎమ్మెల్యే మున్సిపాలిటీ వ్యవహారాల్లో నేరుగా తల దూర్చకుండా వైస్ చైర్మన్ ద్వారా రాజకీయం నడుపుతూ వచ్చారు. కథ మళ్లీ మొదటికొచ్చింది ఆరు నెలల నుంచి ఎమ్మెల్యే రామకృష్ణ మళ్లీ పాత పద్ధతికి వచ్చారు. తనకు తెలియకుండా ఏ పనీ చేయరాదని కమిషనర్‌తో పాటు కింది స్థాయి సిబ్బందిని సైతం ఆదేశించారు. ఉద్యోగులకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనుల్లో ఆయన చెప్పందే ఎవరూ అడుగు కూడా ముందుకు వేయని పరిస్థితి ఏర్పడింది. తమను పట్టుబట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు అవమాన పరుస్తున్నారని చైర్పర్సన్ తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. బాగా చదువుకున్న తనకు మున్సిపాలిటీ వ్యవహరాలను చూసుకోగలనని, ఎమ్మెల్యేను గౌరవించి ఆయన చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటాను గానీ ఆయన చేతిలో రబ్బరు స్టాంప్‌గా మారలేనని ఆమె పార్టీ ముఖ్య నాయకులతో అసంతృప్తి వెళ్లగక్కారని సమాచారం. మంత్రి నారాయణకు చెప్పినా ఎమ్మెల్యే మారలేదని, అలాంటప్పుడు తాము పార్టీలో, పదవిలో ఎందుకు ఉండాలని వారు యోచిస్తున్నారు. సమస్యను నేరుగా సీఎం చంద్రబాబుకు వివరించి అప్పటికీ ప్రయోజనం లేకపోతే తమ దారి తాము చూసుకోవాలని చైర్పర్సన్ భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్లో ఏసీబీ దాడుల అనంతరం టీడీపీలో ఏర్పడిన పరిణామాలు మంత్రి నారాయణకు తలబొప్పి కట్టించాయి. ఈ పరిస్థితిలో మరో మున్సిపాలిటీలో పార్టీ నేతల మధ్య గొడవలు రేగి సీఎం దగ్గరకు వెళితే మంత్రి మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. -
నాకు తెలియాలి!
► కార్పొరేషన్ వ్యవహారాలపై మేయర్, కమిషనర్‌కు మంత్రి నారాయణ ఆదేశం ► మంత్రిపై సీఎం అసహనం నేపథ్యంలో టెలి కాన్ఫరెన్స్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇక మీదట ఏ నిర్ణయాలైనా నాకు చెప్పే తీసుకోవాలని మంత్రి నారాయణ మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుకు స్పష్టం చేశారు. ఒక వైపు సొంత పార్టీ నేతల అవినీతి ఆరోపణలు, మరో వైపు ఏసీబీ దాడులతో జిల్లాలో పార్టీ పరువు పోయిందనీ, సొంత కార్పొరేషన్లోనే పరిస్థితి అదుపులో పెట్టక పోతే రాష్ట్రం మొత్తం ఎలా పాలన సాగిస్తావని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నారాయణ శుక్రవారం విజయవాడ నుంచి మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో ఒక ఇంటి నిర్మాణ అనుమతి కోసం అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) మునిరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ లంచాల్లో కమిషనర్ నుంచి కింది స్థాయి వరకు అందరికీ వాటాలు ఉన్నట్లు ఏసీపీ ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వివాదం కాస్తా మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి బహిరంగ యుద్ధానికి దారి తీసింది. నగరంలో ముస్లిం మైనారిటీలు సైతం వీధికెక్కి వివేకా మీద విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంతో జిల్లాలో పార్టీ పరువు బజారున పడింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబుదృష్టికి వెళ్లింది. జిల్లాలో పార్టీ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు, అవినీతి వ్యవహారాల వల్ల జనంలో మరింత పలుచబడి పోతుందని మంత్రి నారాయణమీద సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు మూడు రోజుల కిందటే టీడీపీ వర్గాల్లో చర్చ నడిచింది. రాజధాని వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ సంబంధిత శాఖ మంత్రిగా సొంత కార్పొరేషన్నే అదుపులో పెట్టలేక పోతే ఎలా అని మంత్రి మీద చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నారాయణ చేతిలోకి కార్పొరేషన్ నెల్లూరులో తాజా పరిణామాలు, సీఎం చంద్రబాబు స్పందన నేపథ్యంలో కార్పొరేషన్ వ్యహారాలను తన చేతిలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు. శుక్రవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్పొరేషన్లో ఇక మీదట ఏ నిర్ణయాలైనా తనకు చెప్పే తీసుకోవాలని ఇద్దరినీ ఆదేశించారు. కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడినా మీ ఇద్దరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సిబ్బంది, అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు గుర్తిస్తే అక్కడికక్కడే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. నెల్లూరును మోడల్ కార్పొరేషన్‌గా తయారు చేయాలని తాను ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఇబ్బందిగా తయారైందని అజీజ్, వివేకా మీద అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. అవినీతిని కట్టడి చేయకపోతే రాజకీయంగా దెబ్బతింటామని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, డెరైక్టర్ కన్నబాబు టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
ఆనం vs అజీజ్
► అవినీతికి మారుపేరైనా ఆనంవివేకానందరెడ్డి అవినీతి గురించి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉంది - మేయర్ అబ్దుల్ అజీజ్ ► నెల్లూరు కార్పొరేషన్ పాలనను మేయర్ అబ్దుల్ అజీజ్ భ్రష్టు పట్టించారు- మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ► పందులు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటాయని వివేకా విమర్శ ►ముస్లిం మేయర్ కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని వివేకాపై అజీజ్ ఎదురుదాడి ►సొంత కార్పొరేషన్లో అవినీతితో నారాయణకు తలనొప్పి ► నేతలిద్దరి ఆరోపణలతో పార్టీకి నష్టమని చంద్రబాబుకు బీద ఫిర్యాదు నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థలో ఆదివారం జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడులు తెలుగుదేశం పార్టీలో రాజకీయ దుమారాన్ని రాజేశాయి. ఇంత కాలం గుంభనంగా ఉన్న మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సోమవారం నువ్వు అవినీతి పరుడివంటే నువ్వే అవినీతి పరుడివని ఆరోపణలు చేసుకున్నారు. ‘పందులకు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటుంది’ అని వివేకానందరెడ్డి పరోక్షంగా అజీజ్ మీద అవినీతి దాడి చేశారు. నువ్వేం నెల్లూర్ కానవాబ్, నెల్లూర్‌కా సుల్తాన్ అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదని తీవ్రమైన విమర్శలు చేశారు. ఆనం వివేకా తనను పందితో పోల్చి మతాన్ని కించపరచారని అజీజ్ మతం కార్డు విసిరారు. ముస్లిం మైనారిటీ మేయర్ కావడాన్ని వివేకా జీర్ణించుకోలేక పోతున్నారని ఎదురుదాడికి దిగారు. నెల్లూరు నగర పాలక సంస్థలో ప్రతి పనికీ ఒక ధర నిర్ణయించారనీ, రెండేళ్లుగా ఈ వ్యవహారం శృతి మించిందని టీడీపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. మేయర్‌కు పాలన మీద పట్టు లేక పోవడం, మేయర్, ఆయన సోదరుడు జలీల్ దందాల కారణంగా అధికారులు సైతం ఎవరికి దొరికనంత వారు దోచేస్తున్నారని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీలోకి తమ రాకను అడ్డుకునే ప్రయత్నం చేసిన మేయర్ అజీజ్ కథ చూడాలని ఆనం కుటుంబీకులు సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కొంత కాలం కిందటి వరకు ఒకరి మీద ఒకరు పరోక్షంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో మంత్రి నారాయణకు అజీజ్‌కు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి నారాయణ మేయర్ మీద బహిరంగంగా విమర్శలు చేశారు. ఆ మరుసటి రోజే ఆనం రంగమయూర్‌రెడ్డి మేయర్ మీద బహిరంగ విమర్శలకు దిగారు. అజీజ్ పాలనలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలో అన్ని కొర్పొరేషన్లకంటే వెనుకపడిందని ఆరోపించారు. రంగ మయూర్ ఆరోపణలపై గుర్రుగా ఉన్న అజీజ్ అప్పట్లోనే ఘాటుగా స్పందించాలనుకుని ఆగిపోయారు. కార్పొరేషన్ మీద పట్టు సాధించలేకపోతే టీడీపీలోని తన వ్యతిరేకులు తొక్కేస్తారనే భయంతో అజీజ్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తాను చెప్పినట్లే వినాలనే ఒత్తిడి పెంచారు. తనను వ్యతిరేకిస్తున్న పెద్ద నాయకులతో పొసగని వారందరినీ తన గూట్లోకి తెచ్చుకునేందుకు చాపకింద నీరుగా పావులు కదుపుతున్నారు. సమయం, సందర్భం చూసి అజీజ్‌ను దెబ్బకొట్టాలని ఆనంతోపాటు టీడీపీలోని మిగిలిన కొందరు నేతలు ఎదురు చూస్తున్నారు. వివేకా వర్సెస్ అజీజ్ కార్పొరేషన్ పై ఏసీబీ దాడుల నేపథ్యంలో సోమవారం వివేకానందరెడ్డి మేయర్ అజీజ్ మీద నేరుగా దాడికి దిగారు. అజీజ్ అవినీతి వల్ల మంత్రి నారాయణ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందనీ, జిల్లాలో టీడీపీకి కూడా చెడ్డపేరు వచ్చిందని తెలివిగా ఈ వ్యవహారాన్ని మంత్రికి, పార్టీకి చుట్టేశారు. ఇదే విధంగా ఉంటే సీఎం కౌన్సిల్‌ను రద్దు చేసే పరిస్థితి వస్తుందని పరోక్షంగా మేయర్‌ను హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ మేయర్‌ను, ఆయన తమ్మున్ని బుక్ చేయలేక సిబ్బందిని బుక్ చేశారనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా వ్యాఖ్యల్ని తొలుత తేలిగ్గా తీసుకున్న అజీజ్ ఆయన విమర్శలు చేస్తూనే ఉంటారు అని వ్యాఖ్యానించి వదిలేశారు. సాయంత్రం టీడీపీ నగర అధ్యక్షుడు, వివేకా రాజకీయ విరోధి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కార్పొరేషన్ కార్యాలయానికి పిలిపిం చుకుని చర్చించారు. వివేకాకు ఇప్పుడే గట్టిగా సమాధానం చెప్పకపోతే మరింత రెచ్చిపోతారని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విలేకరుల సమావేశం పెట్టి అజీజ్, కోటంరెడ్డి ఇద్దరూ వివేకా మీద విరుచుకుపడ్డారు.‘‘ మేయర్ భానుశ్రీ హయాంలో వివేకా కార్పొరేషన్లో చేయని అవినీతి లేదని, కార్పొరేషన్ ఏమైనా వివేకా జాగీరా, మీరు, మీ తాబేదార్లే మేయర్‌గా ఉండాలా? ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి మేయర్ అయితే ఓర్వలేక పోతున్నావు? నువ్వు టీడీపీని బాగు చేయడానికి వచ్చావా? నాశనం చేయడానికి వచ్చావా’’ అని తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేశారు. నీ పదేళ్ల హయాంలో కార్పొరేషన్లో జరిగిన అవినీతి మీద విజిలెన్స్ విచారణ జరిపించి నీ అవినీతి బండారం బయటపెడతానని మేయర్ హెచ్చరించారు. ఆనం వైఎస్సార్సీపీ వారితో కలిసి పోయి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణకు తలనొప్పే నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి విజృంభిస్తోందని సొంత పార్టీ వారే చెప్పడం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు తలనొప్పి తెచ్చేలా ఉంది. కార్పొరేషన్లో జరుగుతున్న వ్యవహారాలపై ఇప్పటికే జనం అసంతృప్తిగా ఉన్నారు.చంద్రబాబు దృష్టికి వివాదం నెల్లూరుకార్పొరేషన్ అవినీతి వ్యవహారాలపై మేయర్, మాజీ ఎమ్మెల్యే చేసుకున్న బహిరంగ ఆరోపణలను జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారని తెలిసింది. -
అమరావతిలో డ్రోన్లతో నిఘా
- అమరావతిలో పటిష్ట భద్రత: సీఎం వెల్లడి - తాత్కాలిక సచివాలయ పనుల్ని పరిశీలించిన బాబు అమరావతి/విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తామన్నారు. అంతేగాక నాలుగు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. తాత్కాలిక సచివాలయం నుంచి అత్యాధునిక టెక్నాలజీతో పాలన కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుతం స్మార్ట్‌పల్స్ సర్వే చేస్తున్నట్టు, అది పూర్తై ఎటువంటి సర్టిఫికెట్లు కావాలన్నా వెంటనే పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఉద్యోగులు తరలిరావాల్సిందే.. ‘‘రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదు. అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతిలోని తాత్కాలిక రాజధానికి తరలిరావాల్సిందే. ఇక్కడినుంచే పాలన జరగాలి’ అని సీఎం అన్నారు. ఈనెల 27 నుంచి అమరావతి నుంచే మొత్తం పాలన సాగాలని చెబుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అందులో భాగంగా పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. 22న మరోసారి తాత్కాలిక సచివాలయ పనుల్ని పరిశీలించి యాక్షన్‌ప్లాన్ ప్రకటిస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ వచ్చేంతవరకు అమరావతి ప్రాంతంలో ఉన్నరోడ్లనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. వెంటనే నిధులివ్వకపోతే కష్టం :శ్రీధరన్ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు వెంటనే నిధులివ్వకపోతే కష్టమని రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. నిధులు విడుదల చేస్తే పనులు మొదలు పెడతామని అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో శ్రీధరన్ నిధుల సమస్యను లేవనెత్తినట్లు సమాచారం. దీంతో సీఎం తొలి విడతగా రూ.150 కోట్లు విడుదల చేస్తామని, భూసేకరణ చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబును ఆదేశించారు. 26 నుంచి చంద్రబాబు చైనా పర్యటన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు హాజరు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకూ చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొంటారు. 25వ తేదీ రాత్రి ఢిల్లీ మీదుగా చైనా వెళతారు. తిరిగి 30న విజయవాడకుచేరుకుంటారు. చైనాలో పర్యటించే బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, వ్యక్తిగత కార్యదర్శి పి. శ్రీనివాస్, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, సమాచార కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, పలు పత్రికలు, చానళ్ల ప్రతినిధులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. చైనా పర్యటనలో పలువురు వ్యాపార, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. -
'జరిగే పరిణామాలకు చిరంజీవి బాధ్యత వహిస్తాడా?'
విజయవాడ : ముద్రగడ పురుగుల మందు తాగితే జరిగే పరిణామాలకు చిరంజీవి బాధ్యత వహిస్తాడా అని మంత్రి నారాయణ ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి సీఎం చంద్రబాబుకు లేఖ రాయడంపై నారాయణ విజయవాడలో స్పందించారు. రైళ్లు తగులబెట్టి అమాయకులను భయభ్రాంతులకు గురిచేసిన వారిని శిక్షించాలా? వద్దా అని ప్రశ్నించారు. మీరు పార్టీ పెట్టారు, శాసన సభ్యుడయ్యారు. రాజ్యసభ సభ్యుడయ్యారు. ఏనాడైనా కాపుల గురించి పట్టించుకున్నారా?.. అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మీరు కాపులను బీసీల్లో చేర్చడానికి కనీస ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని కాపులు ఇప్పుడు గుర్తుకు రావడంలో ఆంతర్యం ఏమిటన్నారు. -
పదేళ్లు జెండాలు మోసినా పదవులివ్వరా?
► మినీ మహానాడులో టీడీపీ నేతల ఆవేదన ► మన బలమేంటో అందరికీ తెలుసన్న బీద ► కొత్త వారు ఇంకా వస్తారనీ వారితో కలిసి పని చేయాల్సిందేనని వెల్లడి ► జిల్లాలో మూడు బలమైన సామాజికవర్గాలు వైఎస్సార్ సీపీతో ఉన్నాయి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పార్టీ అధికారంలో లేని పదేళ్లు జెండాలు మోసిన వారికి ఇప్పుడు గుర్తింపు ఇవ్వాలి. ఎన్నికల ముందు, తర్వాత వచ్చిన వాళ్లు పదవులు తన్నుకుపోతోంటే పార్టీనే నమ్ముకుని ఉన్న వారు పల్లకి మోసే బోయీలుగానే ఉండి పోవాల్సి వస్తోంది. ఇది అన్యాయం. పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులనే నామినేటెడ్ పోస్టుల్లో నియమించాలని టీడీపీ ముఖ్య నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాక్షిగా తమ ఆవేదన, ఆందోళన వెళ్ల గక్కారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో మన బలమెంతో, ఎన్ని స్థానాలు గెలిచామో అందరికీ తెలుసు. వైఎస్సార్ సీపీ నుంచి 8 మంది జెడ్పీటీసీలను తెచ్చినా జెడ్పీ గెలవలేకపోయాం. తలకిందులు పెట్టి కాళ్లు పైకి పెట్టినా నెల్లూరు కార్పొరేషన్ గెలవలేక పోయాం. జిల్లాలో మూడు ప్రధాన సామాజిక వర్గాలు టీడీపీకి వ్యతిరేంకగా ఉన్నాయి. కాబట్టి ఇతర పార్టీల నుంచి నాయకులను తెస్తాం. పాత వారంతా సర్దుకు పోవాల్సిందేనని జిల్లా పార్టీ అధ్యక్ష్యుడు బీద రవిచంద్ర తెగేసి చెప్పారు. కస్తూరి దేవి గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా మినీ మహానాడులో పదవుల విషయంలో తమ పరిస్థితి దారుణంగా ఉందని ఒక మోస్తరు నేతలు సైతం ఆవేదన వెల్లబోసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జరిగిన అభివృద్ధి, లోటుపాట్లు చర్చించుకుని, పార్టీ, ప్రభుత్వ పరంగా జిల్లాకు చేయాల్సిన అంశాలపై తీర్మానాలు చేయడం కోసం మినీమహానాడు నిర్వహించారు. ఈ మహానాడులో ప్రతిపాదనలు, వాటిపై చర్చలు, తీర్మానాల విషయాలను వదిలేసి నాయకులు రాజకీయ ప్రసంగాలు చేశారు. కార్యకర్తల తీవ్ర అసంతృప్తి పార్టీ కష్ట కాలంలో జెండా మోసిన కార్యకర్తలకు ఇప్పుడు పదవులు దక్కడం లేదని మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావు, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ ఇన్చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి కోసం పాత వారిని బలి చేయొద్దని అంతా కలసి పదవులు పంచుకోవాలని సూచించారు. నెల్లూరు నగరం, రూరల్ నియోజక వర్గాల్లో పార్టీలో ఐదు గ్రూపులు ఉన్నాయనీ, అంతా కలసి పనిచేయకుండా తొలి నుంచి పార్టీ కోసం పల్లకి మోస్తున్న కార్యకర్తలకు అన్యాయం చేయరాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా నాయకులకు సూచించారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన మేయర్ అబ్దుల్ అజీజ్, ఆనం వివేకానందరెడ్డిలను దృష్టిలో పెట్టుకుని నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శలు చేశారు. మొత్తం మీద పదవులు రాని పార్టీ నేతలు తమ గోడు వెల్లబోసుకోవడానికి ఈ వేదికను వాడుకున్నారు. కలసి పనిచేయాల్సిందే జిల్లాలో పదిహేనేళ్లుగా పార్టీ పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లో జిల్లాలో మూడేసీట్లు గెలిచామని, నిజంగా అంత బలమే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర అసంతృప్త నాయకులను నిలదీశారు. కావలిలో కూడా ఎమ్మెల్యే, మున్సిపాలిటీ ఓడిపోయామన్నారు. నెల్లూరు నగరంలో మేయర్ సీటు గెవలలేకపోయినందువల్లే అజీజ్‌ను చేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి గెలుచుకోవాలని మంత్రి నారాయణ వైఎస్సార్ సీపీ నుంచి 8 మంది జెడ్పీటీసీలను తెచ్చినా ఉపయోగం లేక పోయిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2019లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయనీ, అందుకే ఎన్నికల ముందు, తర్వాత కూడా ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుంటూనే ఉన్నామన్నారు. -
మంత్రి నారాయణ X సీఆర్డీఏ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) వ్యవహారాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, కమిషనర్ శ్రీకాంత్ నడుమ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. గత కొద్ది కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం మంత్రి నారాయణ కొద్ది రోజుల క్రితం రాసిన లేఖ ఆజ్యం పోసినట్లై భగ్గుమంది. రాజధాని ప్రాంత గ్రామాల్లో సభలు నిర్వహణ, చెక్కుల పంపిణీ విషయాల్లో వీరి మధ్య మొదలైన మనస్పర్థలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. తాజాగా సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తాత్కాలిక సచివాలయం వద్దకు విధిగా వెళ్లాలని, రోజులో కనీసం పదిగంటలైనా నిర్మాణ ప్రాంతంలో పర్యవేక్షించాలని మంత్రి లేఖ రాయడంతో వ్యవహారం భగ్గుమంది. మంత్రి రాసిన లేఖ వ్యంగ్యంగా ఉందని, కమిషనర్ శ్రీకాంత్ మనస్తాపానికి గురయ్యారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రి లేఖపై కమిషనర్ శ్రీకాంత్ నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే విషయం చాలా సాధారణమైందని, దీనిపై రాద్ధాంతం అనవసరమని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు. అయితే వారి మధ్య ఇప్పటికే భేదాభిప్రాయాలు ఉన్న నేపధ్యంలో ప్రాధాన్యత చోటుచేసుకుంది. కాగా రాజధాని వ్యవహారాలైన సచివాలయం టెండర్లు, అధికారుల విదేశీ పర్యటనలతో పలు ఆరోపణలు మంత్రిపై వెల్లువెత్తుతున్నాయి. గతంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా మంత్రి నారాయణ విషయంలో కినుకు వహించారు. రెవెన్యూ వ్యవహారాల్లో మంత్రి నారాయణ జోక్యాన్ని పలు సందర్భాల్లో కేఈ తప్పుపట్టారు. ఇప్పుడు అధికార వర్గాలతోనూ మంత్రి నారాయణ తీరుపై విసృ్తత చర్చ జరుగుతోంది. -
10 నుంచి లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లు
మంత్రి నారాయణ వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: జూన్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 23 వరకు రాజధాని రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరించారు. లాటరీ తీసిన వెంటనే ఏ రైతుకు ఎక్కడ ప్లాటు కేటాయిస్తారనే విషయాన్ని తెలిపేందుకు జియో కో-ఆర్డినేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. తమకు రావాల్సిన ప్లాట్లకు సంబంధించి రైతులు 9.18ఎ, 9.18బి ఫారాల ద్వారా ఆప్షన్లు సమర్పించే గడువు శుక్రవారంతో ముగుస్తున్నా రైతుల కోసం ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. భూసమీకరణ ప్యాకేజీ కింద మెట్ట రైతులకు అదనంగా 50 గజాలు ఇచ్చేందుకు ఈ సమావేశం ఆమోదించినట్లు చెప్పారు. రాజధాని గ్రామాల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ ఇండెక్స్ ఏరియా) నిబంధనల సవరణకూ సమావేశం ఆమోదం తెలిపిందని, ఇదే విధానాన్ని సీఆర్డీఏ పరిధి అంతటికీ వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.