నారాయణ సన్నిహితుడి వద్ద భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం
తిరుపతి రూరల్/ ఆత్మకూరు రూరల్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సన్నిహితుడు డాక్టర్ గుణశేఖర్ యాదవ్ ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనీఖీలు బుధవారం కూడా కొనసాగాయి. మంగళవారం తిరుపతిలోని గుణశేఖర్ ఇంటిలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు , గుణశేఖర్‌ను వెంటబెట్టుకుని బుధవారం ఆత్మకూరు వెళ్లిన ఐటీ అధికారులు భారీ స్థాయిలో ఆస్తులకు సంబంధించిన రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు దాదాపు రూ.60 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలిసింది. ఇంకా ఆస్తుల మదింపు కొనసాగుతోందని ఓ అధికారి పేర్కొన్నారు.
ఆత్మకూరు సిండికేట్ ఫార్మర్స్ సొసైటీలోని గుణశేఖర్ యాదవ్ భార్య శ్రీలక్ష్మి, ఆమె తండ్రి పల్లంరెడ్డి వెంకట సుబ్బారెడ్డిలకు చెందిన లాకర్‌ను ఐటీ అధికారులు తెరిపించారు. డాక్యుమెంట్లను బ్యాంకు అధికారుల అనుమతితో సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. అలాగే బెంగళూరులో మంత్రి నారాయణ కళాశాలల సీఈవోగా పనిచేస్తున్న ప్రమీలకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు.
తనిఖీలు కొనసాగింపు
Published Thu, Dec 29 2016 1:36 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement