దుర్గాఘాట్‌లో మంత్రి నారాయణ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం దుర్గాఘాట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రితో పాటు నగర మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేషన్ కమిషనర్ వీరపాండియన్ ఉన్నారు. నీటిలో పువ్వులు, ఇతర పూజ సామగ్రి కనిపించడంతో వెంటనే వాటిని తొలగించాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కమిషనర్‌కు సూచించారు. ఘాట్‌లో పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు, యువకులే కనిపించడంతో వారితో కాసేపు ముచ్చటించారు.