krishana puskaralu
-
కంటికి రెప్పలా..!
ఘాట్లలో క్లీనింగ్ పుష్కర నగర్లో నిరంతర కాపలా సేవల్లో ఫైర్ సిబ్బంది సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల్లో అగ్నిమాపక సిబ్బంది విస్తృత సేవలందిస్తున్నారు. ఘాట్లను నిరంతరం కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. ప్రతి ఘాటులోను ఫైర్ సిబ్బంది క్లీనింVŠ లోనూ, వీవీఐపీల ప్రోటోకాల్, పుష్కర నగర్ల్లో యాత్రికుల భద్రత పరంగా తమవంతు సేవలు అందిస్తున్నారు. పోలీసుల్లా ఘాట్ల పరిధిలో భక్తులను సూచనలు, సలహాలు అందిస్తూ వయసు మీరిన వారికి చేదోడుగా,తప్పిపోయిన పిల్లల విషయంలో చేయూత నిస్తూ సేవలు అందిస్తున్నారు. పర్యాటకశాఖ ఏర్పాటు చేసినా బోటు షికారులో ఘాట్లలో భక్తులకు ఏలాంటి ప్రమాదాలు లేకుండా ఫైర్ రెస్కూ్య టీం పర్యవేక్షిస్తోంది. విధుల్లో 1050 మంది సిబ్బంది.. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పుష్కర సేవల్లో 1050 మంది ఫైర్‌సిబ్బంది నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫైర్ స్టేషన్ల నుంచి సిబ్బంది, అ«ధికార యంత్రాంగాన్ని పుష్కర సేవలకు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఘాట్ల క్లీనింగ్‌లో వీరి పాత్ర కీలకంగా ఉంది. శానిటేషన్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ 40 ఫోర్టబుల్ పంపులతో పరిశుభ్రత చేస్తున్నారు. గంట, గంటకు పంపులతో శుభ్రం చే స్తుండడంతో ఘాట్లలో పరిశుభ్రత తాండవిస్తుండడంతో భక్తులు ఆనందంగా వెళ్తున్నారు. పుష్కరాలకు ఐదు రోజుల ముందు నుంచే వీరు ఘాట్ల శుభ్రత విషయంలో శ్రద్ధ పెట్టారు. నిరంతర నిఘా.. పోలీసులు భక్తుల భద్రత విషయంలో కాపలా ఉంటే ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాల బారినపడకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 45 పుష్కర నగర్ల్లో 30 వాహనాలను వుంచారు. పుష్కర నగర్ ఏర్పాటు చేయకముందే వీరు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని నిబంధనల మేర విద్యుత్ సదుపాయం కల్పించారు. రాత్రి సమయాల్లో నిద్రించే సమయాల్లో ఏలా వ్యవహరించాలి అనే దానిపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక వీవీఐపీల ప్రోటోకాల్ ,హెలిప్యాడ్ వద్ద వీరి పాత్ర కీలకంగా ఉంది. ఘాట్ల పరిధిలో ¿¶ క్తుల భద్రత విషయంలో రెస్కూ్య టీంలు పనిచేస్తున్నాయి. మొత్తం 8 బోట్లు ద్వారా ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ కాపలా కాస్తున్నారు. ఫెర్రి ఘాట్‌లో 1, దుర్గాఘాట్ లో 2, అమరావతిలో 2, పున్నమి ఘాట్ లో 2, భవానీ ఘాట్‌లో 1 వంతున బోట్లుల్లో కాపలా కాస్తున్నారు. మరో రెండు అదనంగా ఉన్నాయి. ఏక్కడ భక్తులు ప్రమాదం జరిగినా వెంటనే ఆ రెస్కూ్యటీంలు వారిని వెంటనే రక్షించి వైద్య శిబిరాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు తరహాలో సేవలు.. పోలీసు తరహాలో ఫైర్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.ప్రతి ఘాట్ లో ఓ స్టేషన్ అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ వుంటుంది అలాగే ప్రధాన ఘాట్లలో జిల్లా ఫైర్ అధికారి పర్యవేక్షణ చేస్తున్నారు. ఘాట్ల వద్దకాపలాతో పాటు వయస్సు మీరిన వారిని ఆసరాగా నిలచి స్నానలకు తీసుకెళ్లడం, చిన్నారులు తప్పిపోకుండా ట్యాగింగ్ వేయించడం, అనారోగ్యంగా ఉన్న ఉన్నవారిని వైద్య శిబిరాలకు తరలించండం ఇలాంటి సేవల్లో వీరు భాగస్వాములు అవుతున్నారు. -
రద్దీకి తగినట్లు ఏర్పాట్లు
విజయవాడ (రైల్వేస్టేçÙన్): స్టేషన్లో పుష్కర ప్రయాణికుల రద్దీని సీనియర్ డీ.సీ.ఎం షిఫాలి శనివారం పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. తూర్పుముఖద్వారం1, 2ల వద్దనున్న బుకింగ్ కౌంటర్లు, ఏ.టి.వి.ఎంలను ఆమె పరిశీలించారు. రానున్న 2 రోజుల్లో రద్దీ మరింత పెరగనుండంటంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. 1వ నెంబరు ప్లాట్‌ఫాం వద్ద టికెట్ జారీకి ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను ఆమె పరిశీలించారు. -
దుర్గాఘాట్‌లో మంత్రి నారాయణ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం దుర్గాఘాట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రితో పాటు నగర మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేషన్ కమిషనర్ వీరపాండియన్ ఉన్నారు. నీటిలో పువ్వులు, ఇతర పూజ సామగ్రి కనిపించడంతో వెంటనే వాటిని తొలగించాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కమిషనర్‌కు సూచించారు. ఘాట్‌లో పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు, యువకులే కనిపించడంతో వారితో కాసేపు ముచ్చటించారు. -
తూచ్...నాన్ వెజ్ అమ్ముకోవచ్చు
►మాంసం విక్రేతలకు ‘పచ్చ’జెండా ►తమ్ముళ్ల డీల్ సెట్ విజయవాడ సెంట్రల్ : నగరంలో మాంసం విక్రయాల నిషేధానికి అధికారులు చెల్లుచీటి ఇచ్చేశారు. పవిత్ర కృష్ణా పుష్కరాలు అయినప్పటికీ మాసం అమ్ముకోవచ్చు. కబేళా కూడా పనిచేస్తోందంటూ కమిషనర్ జి.వీరపాండియన్ బుధవారం ప్రకటించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో చేపలు మాంసపు ఉత్పత్తుల విక్రయాలను 9 నుంచి 25వ తేదీ వరకు నిషేధిస్తున్నామని ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే వ్యాపారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని మొన్న హెచ్చరించారు. రెండు రోజులు గడిచే సరికి తూచ్...అన్నారు. దీని వెనుక పెద్ద కథే నడిచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కథ ఇదీ మాంసం విక్రయాల నిషేధం నగరంలోని స్టార్ హోటల్ నిర్వాహకులకు మింగుడుపడలేదు. కృష్ణాపుష్కరాలకు మద్యం, మాంసం భారీఎత్తున విక్రయాలు జరుగుతాయని, ఇలాంటి సమయంలో నిషేధం విధిస్తే తమ ఆదాయం ఏం కానూ? అని టీడీపీ ప్రజాప్రతి నిధుల వద్ద పంచాయితీ పెట్టారు. ఎంపీ కార్యాలయంలో సర్వం తానై వ్యవహరించే ఓ చోట నేత రంగంలోకి దిగాడు. స్టార్ హోటళ్ల నిర్వాహకులతోపాటు చిన్న చితకా హోటళ్ల యజమానులు, మాంసం దుకాణ విక్రయదారులతో రాయ‘బేరాలు’ సాగించాడు. మంగళవారం రాత్రి డీల్ కుదిరింది. తెల్లవారే సరికి ఓ మంత్రి కమిషనర్‌తో మాట్లాడేశారు. మాంసం లేకపోతే హోటళ్ల యజమానులు ఇబ్బంది పడతామంటున్నారు, వదిలేయమంటూ మంత్రి కమిషనర్ కు ఆదేశాలిచ్చారు. మాంసం విక్రయాలపై నిషేధం శుభ్రంగా అటకెక్కింది. కబేళా యథావిధిగా పనిచేస్తోందని, వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ చెబుతున్నారు. పారిశుధ్యానికి విఘాతం కల్గిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరికల కొసమెరుపు విసిరారు. మంత్రి పేషీ హడావుడి సిటీలో చికెన్, మటన్, చేపలు ఇతరత్రా మాంసం రోజుకు సగటున 20 టన్నులు విక్రయం జరుగుతోందని అంచనా. సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వ్యాపారం సాగుతోంది. వేడుకలు, ఫంక్షన్ల సీజన్లో 50 శాతం అదనంగా వ్యాపారం ఉంటోంది. ఈక్రమంలో నాన్ వెజ్ విక్రయాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించగానే ఓ మంత్రి పీఏ నగరపాలక సంస్థ అధికారులకు ఫోన్ చేసి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో సార్ అడగమన్నారంటూ వివరాలు సేకరిం చారు. రెండు రోజుల్లో రంగంలోకి దిగిన తెలుగు తమ్ముళ్లు డీల్ సెట్ చేసేశారు. -
పుష్కర వేళ.. ఇలా వెళ్దాం
బృహత్తర కార్యక్రమానికి మరో రోజులో తొలి అడుగు పడనుంది. మన రాష్ట్రమే కాదు.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు.. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి కోట్లాదిమంది భక్తులు కృష్ణమ్మ పుష్కర స్నానమాచరించి పునీతమవ్వాలని ఇప్పటికే బయల్దేరి ఉంటారు. కానీ, విజయవాడ నగరంలో ఇంకా జరుగుతున్న పుష్కరాలు, పలు అభివృద్ధి పనుల నేపథ్యంలో కొంతమేర రూట్‌మ్యాప్‌లో గజిబిజికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి కోసం.. వాహనాలు ఎక్కడ దిగాలి? ఘాట్‌కు ఎలా చేరుకోవాలి? వంటి వివరాలతో ప్రత్యేక కథనం. శాటిలైట్ బస్స్టేషన్లు : 6 – ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం – వైవీరావు ఎస్టేట్ – జాకీర్ హుస్సేన్ కళాశాల (ఇబ్రహీంపట్నం) – వీటీపీఎస్ ఏ కాలనీ గ్రౌండ్ – కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల – పెదకాకాని శాటిలైట్ రైల్వేస్టేషన్లు : 4 – రాయనపాడు – గుణదల – మధురానగర్ – కృష్ణా కెనాల్ శాటిలైట్ బస్, రైల్వేస్టేషన్ల వద్ద పుష్కర నగర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సకల సౌకర్యాలూ ఉంటాయి. అక్కడి నుంచి ఘాట్ల వద్దకు ఉచిత ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. పార్కింగ్ ప్రదేశాలు : 121 ఉచిత బస్సులు : 740 గుంటూరు వైపు నుంచి.. – అమరావతి, ధ్యానబుద్ధ ఘాట్ : గుంటూరు నగరం.. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చే యాత్రికులు అమరావతి ఘాట్‌కు చేరుకోవచ్చు. ఇక్కడే ధ్యానబుద్ధ ఘాట్ కూడా ఉంది. గుంటూరు నుంచి నేరుగా అమరావతిలోని గుంటూరు రోడ్డు లేదా విజయవాడ రోడ్డు లేదా సత్తెనపల్లి రోడ్డులో ఏర్పాటుచేసిన పుష్కర నగర్‌కు చేరుకోవచ్చు. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఏర్పాటుచేసిన బస్సుల్లో ఘాట్ల వద్దకు చేరుకోవచ్చు. సుమారు 1.5 కిలోమీటరు దూరంలో ఉండే ఈ ఘాట్లకు నడుచుకుని అయినా వెళ్లవచ్చు. – సీతానగరం ఘాట్ : గుంటూరు నగరం.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చెన్నై నుంచి వచ్చేవారు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న సీతానగరం ఘాట్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ 8 పుష్కరనగర్లు ఏర్పాటు చేశారు. పాత జాతీయరహదారిలో 3, జాతీయ రహదారిపై 3, కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద ఒకటి, మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఒకటి పుష్కర ఘాట్‌ను సిద్ధం చేశారు. ప్రైవేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో ఉండవల్లి సెంటర్ చేరుకోవాలి. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న పుష్కర ఘాట్‌కు నడిచే వెళ్లాలి. హైదరాబాద్ నుంచి.. ముక్త్యాల ఘాట్ : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ముక్త్యాల భవానీ ఘాట్‌కు వెళ్లాలంటే 65వ నంబర్ జాతీయ రహదారిలోని షేర్‌మహ్మద్‌పేట అడ్డరోడ్డు నుంచి 13 కిలోమీటర్ల దూరంలోని ముక్త్యాల భవానీ ఘాట్‌కు వెళ్లాలి. వెళ్లే దారిలో సీమ పందుల పెంపక కేంద్రం సమీపంలో పుష్కర నగర్ ఏర్పాటు చేశారు. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఘాట్‌కు చేరుకోవచ్చు. వేదాద్రి ఘాట్ : వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఘాట్‌కు వెళ్లాలంటే చిల్లకల్లు నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. గౌరవరం నుంచి వేదాద్రి 10 కిలోమీటర్లు. 65వ నంబర్ జాతీయ రహదారి కొణకంచి అడ్డరోడ్డు నుంచి 13 కిలోమీటర్లు వెళ్లాలి. భక్తులు సులభంగా తెలుసుకునేందుకు ప్రధాన సెంటర్లలో రూట్ మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. పవిత్ర సంగమం ఘాట్ : కృష్ణా, గోదావరి నదులు కలిసే చోటు పవిత్ర సంగమం ఘాట్. పుష్కరాలకు హైదరాబాద్.. ఆపై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఎక్కువగా స్నానాలు చేసే అవకాశం ఉంది. ఈ ఘాట్ వద్ద స్నానాలు చేయాలనుకునే భక్తులు ప్రయివేట్ వాహనాల్లో వస్తే ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ దగ్గర ఆగాల్సి ఉంటుంది. అక్కడే పుష్కర నగర్ ఉంటుంది. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఘాట్ మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే హైదరాబాద్.. ఆపై ప్రాంతాల భక్తులు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో జాకీర్ హుస్సేన్ కాలేజీ వరకూ చేరుకోవాలి. అక్కడే పుష్కర నగర్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఘాట్‌కు ఆర్టీసీ ఉచిత సర్వీసుల్లో చేరుకోవచ్చు. ఇక మైలవరం, భద్రచలం కొండపల్లి నుంచి వచ్చే వాహనాలు వీటీపీఎస్ ప్లే గ్రౌండ్లో ఏర్పాటుచేసిన పుష్కర నగర్ వద్ద ఆగాల్సి ఉంటుంది. భవానీ, పున్నమి ఘాట్లు : హైదరాబాద్.. ఆపై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భవానీ, పున్నమి ఘాట్లలో పుష్కర స్నానం చేయాలనుకుంటే.. ప్రయివేట్ వాహనమైనా, ఆర్టీసీ బస్సు అయినా భవానీపురం దర్గా వద్ద ఏర్పాటుచేసిన పుష్కర నగర్ వద్ద ఆగాలి. అక్కడి నుంచి నడుచుకుని ఈ రెండు ఘాట్లకూ చేరుకోవచ్చు. దుర్గాఘాట్ : బెజవాడ దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రికి సమీపంలో ఉన్న దుర్గాఘాట్‌లో పుణ్యస్నానం చేయాలనుకునే దూరప్రాంతపు భక్తులు భవానీపురం దర్గా వద్ద అయినా దిగవచ్చు. లేదంటే విజయవాడలోని వైఎస్సార్ కాలనీ సమీపంలోని వైవీ రావు ఎస్టేట్ వద్ద ఏర్పాటుచేసిన పుష్కర నగర్లో దిగవచ్చు. అక్కడి నుంచి దుర్గాఘాట్‌తో పాటు భవానీ, పున్నమి ఘాట్‌కు ఉచిత బస్సులు నడుస్తాయి. హంసలదీవి కృష్ణా సాగర సంగమం : హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నుంచి వచ్చేవారు హంసలదీవిలోని కృష్ణా సాగర సంగమ ప్రాంతంలో పుణ్యస్నానం చేయాలనుకుంటే.. ఆర్టీసీ బస్సులను ఆశ్రయించవచ్చు. విజయవాడ నుంచి అవనిగడ్డకు నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అవనిగడ్డ నుంచి కోడూరు.. ఉల్లిపాలెం మీదుగా హంసలదీవి రావాలి. అక్కడి నుంచి సముద్రతీరంలో డాల్ఫిన్ భవనం వద్ద పుష్కర నగర్ ఉంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా సాగర సంగమ ప్రాంతానికి చేరుకోవచ్చు. ప్రయివేట్ వాహనాలైతే కోడూరు నుంచి దింటిమెరక గ్రామం.. పాలకాయతిప్ప నుంచి సముద్రం తీరంలోని పుష్కర నగర్‌కు చేరుకోవచ్చు. భారీ వాహనాల మళ్లింపు ఇలా.. – విజయవాడ నుంచి రోజూ విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై వెళ్లే భారీ వాహనాల కోసం పుష్కరాల 12 రోజులూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను కంచికచర్ల, ఇబ్రహీంపట్నం నుంచి మళ్లిస్తారు. కంచికచర్ల మీదుగా జుజ్జూరు, జమలాపురం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ చేరుకోవచ్చు. ఇబ్రహీంపట్నం మీదుగా కొండపల్లి, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్‌కు చేరవేస్తారు. – విశాఖ నుంచి చెన్నై, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి రూటు మారుస్తారు. 740 ఆర్టీసీ ఉచిత సర్వీసులు కృష్ణా పుష్కరాలకు విజయవాడలో 740 ఉచిత సిటీ బస్సులు నడుపుతున్నారు. శాటిలైట్ బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పుష్కర పార్కింగ్ ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి మూడు నిమిషాలకు ఒక ఉచిత బస్సు ఉంటుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని శాటిలైట్ బస్‌స్టేషన్ వరకూ వస్తాయి. అక్కడి నుంచి నగరంలోని ఆరు ఘాట్లకు వెళ్లడానికి వీలుగా 100 ఉచిత బస్సుల్ని ఏర్పాటుచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు వైవీ రావు ఎస్టేట్‌లోని శాటిలైట్ బస్‌స్టేషన్ వద్ద ఆగుతాయి. అక్కడి నుంచి ఘాట్లకు 65 బస్సులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ గ్రౌండ్లో ఉన్న శాటిలైట్ బస్‌స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి ఘాట్లకు 45 ఉచిత బస్సులు నడుస్తాయి. తిరువూరు, భద్రాచలం నుంచి వచ్చే బస్సులు వీటీపీఎస్ కాలనీలో శాటిలైట్ స్టేషన్లో ఆగుతాయి. అక్కడి నుంచి 10 ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని పుష్కర ఘాట్లకు మూడువేల బస్సులు నడుపుతున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ సిటీ బస్‌స్టేషన్‌గా నడుస్తుంది. -
భక్తులకు ఏ లోటు రాకూడదు
విజయవాడ సెంట్రల్ : పుష్కరనగర్లకు వచ్చే భక్తులకు రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ మంత్రి పి.నారాయణ సూచించారు. మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్‌తో కలిసి మంగళవారం రాత్రి బస్టాండ్ సమీపంలోని పుష్కరనగర్‌ను మంత్రి పరిశీలించారు. పుష్కరనగర్లలో వసతులకు లోటు రానీయొద్దని చెప్పారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పుష్కరసెల్ నుంచి తాను ఎప్పటికప్పుడు ఘాట్లు, పుష్కరనగర్లలో ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. భోజన, వసతి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటివరకు నగరంలోని పుష్కరనగర్లలో ఏర్పాటుచేసిన వసతుల గురించి మేయర్ వివరించారు. ఈఈలు ధనుంజయ, టి.రంగారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
మేయర్ చాంబర్లో సీఎం మకాం
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలను సీఎం చంద్రబాబు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచే పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం కౌన్సిల్ హాల్లో మేయర్ పోడియం వద్ద ప్రత్యేక వేదిక నిర్మిస్తున్నారు. కౌన్సిల్ హాల్ సమీపంలోని టౌన్‌ప్లానింగ్ ఆన్లైన్ విభాగం, సెక్రటరీ సెల్‌ను ఖాళీ చేయించారు. ఉన్నతాధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సోఫాలు, కుర్చీలు, మైక్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీన యుద్ధప్రాతిపదికన ప్రారంభమైన పనులు 10వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. తొలుత మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసే అద్దాల మందిరం నుంచి సీఎం పర్యవేక్షణ ఉండాలని భావించారు. అధికారులతో సమీక్షలు, ప్రెస్మీట్లు అన్నీ అక్కడే నిర్వహిస్తారు. ఆ ప్రాంతంలో సీఎం మకాం పెడితే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని పోలీస్ శాఖ సూచించింది. ఈ క్రమంలో వేదికను నగరపాలక సంస్థ కార్యాలయానికి మార్చారు. 12 రోజులూ కార్పొరేషన్లోనే.. పుష్కరాలు జరిగే 12 రోజులూ సీఎం కార్పొరేషన్ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తారు. సీఎం ఉండేందుకు అనువుగా మేయర్ చాంబర్లో వసతుల కల్పన చేపట్టారు. మంత్రులు, ముఖ్య అధికారులతో ఆంతరంగిక చర్చలన్నింటినీ సీఎం మేయర్ చాంబర్లోనే నిర్వహిస్తారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలను కౌన్సిల్ హాల్లో నిర్వహిస్తారు. సీఎం, ఇతర అధికారులు రాకపోకలు సాగించేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని పడమర వైపు ఉన్న కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్, యూసీడీ (అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్) షెడ్‌ను కూల్చివేశారు. పడమర వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్, పక్కన కొత్తగా ఏర్పాటుచేస్తున్న గేటు నుంచి అధికారుల వాహనాలు కార్యాలయంలోకి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇక్కడే మీడియా పాయింట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ హాల్ చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి రంగులు వేసి విద్యుత్ కాంతులు అమరుస్తున్నారు. -
కృష్ణా పుష్కర ప్రత్యేక సంచిక విడుదల
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : పుష్కరాలను పురస్కరించుకుని కనకదుర్గప్రభ ధర్మ ప్రచార మాసపత్రిక కృష్ణా పుష్కర ప్రత్యేక సంచికను రూపొందించింది. బ్రాహ్మణవీధిలోని దుర్గగుడి పరిపాలనా భవనంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈవో సూర్యకుమారి ఈ సంచికను ఆవిష్కరించారు. కృష్ణా పుష్కర వైభవం, కృష్ణా పుష్కరాలు–మన కర్తవ్యం, సర్వపాప హరిణి కృష్ణవేణి, పుష్కరాల ప్రాశస్త్యం, పుష్కర వైశిష్ట్యం, పుష్కర స్నాన విధానం.. వంటి ఆధ్యాత్మిక రచనలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య, పర్యవేక్షకుడు ఈవీ సుబ్బారావు, సంపాదకుడు కె.గంగాధర్, కో–ఆర్డినేటర్ సైదా తదితరులు పాల్గొన్నారు. -
మల్లీశ్వరి ఘాట్‌ను మరిచారా?
విజయవాడ(భవానీపురం) : మల్లీశ్వరి ఘాట్‌లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గట్టు వెనుక ప్రాంతంలో అనాదిగా ఉన్నవి రెండు ఘాట్లే. అవి భవానీ, మల్లీశ్వరి ఘాట్లు. మల్లీశ్వరి ఘాట్‌ను గతంలో పున్నమి ఘాట్‌గా కూడా పిలిచేవారు. అయితే కృష్ణా పుష్కరాల సందర్భంగా పర్యాటక శాఖకు చెందిన హరిత బరంపార్క్(పున్నమి హోటల్)లో ఏర్పాటుచేస్తున్న పుష్కర ‡ఘాట్‌కు పున్నమి ఘాట్‌గా నామకరణం చేశారు. గతంలో ఎప్పుడూ ఇక్కడ ఘాట్ ఏర్పాటుచేయలేదు. వీఐపీల కోసం ఏర్పాటుచేస్తున్న ఈ ఘాట్‌కు మల్లీశ్వరి ఘాట్‌ను కలుపుతూ మొత్తాన్ని పున్నమి ఘాట్‌గా అధికారులు నిర్ణయించారు. అయితే బరంపార్క్‌లోని పున్నమి ఘాట్ పనులే పూర్తికాలేదు. మరోవైపు మల్లీశ్వరి ఘాట్‌ను పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. ప్రజాప్రతినిధులు పున్నమి ఘాట్‌పైనే దృష్టిపెట్టారు. ఈ ఘాట్‌ను పట్టించుకోలేదు. అన్నీ అడ్డంకులే.. మల్లీశ్వరి ఘాట్ పనులు పూర్తికాకపోవడానికి ఇక్కడ అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలోని అన్ని ఘాట్ల పనులకు అవసరమైన ఇసుకను ఇక్కడి నుంచే రవాణా చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన కాంక్రీట్ ప్లాంట్ నుంచే అన్ని ఘాట్లకు కాంక్రీట్ సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి ఇతర ఘాట్లకు ఇసుక, కాంక్రీట్ తీసుకువెళ్లేందుకు లారీలు, టిప్పర్లు రాకపోకలతో ఘాట్ మొత్తం అధ్వానంగా మారింది. కరకట్ట రహదారి నుంచి ఈ ఘాట్‌కు వచ్చే దారి కూడా ఇప్పటివరకు నిర్మించలేదు. ఘాట్‌కు వచ్చే మార్గం పక్కనే పర్యాటక శాఖకు చెందిన హౌస్ బోట్లు తయారుచేస్తున్నారు. 30 శాతం పనులే ఈ ఘట్లో కేవలం 30 శాతం పనులే పూర్తయ్యాయి. మిగిలిన 70 శాతం పనులు పుష్కరాలలోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. షీట్æఫైలింగ్, దానికిపైన మెట్లు, దానిపైన కాంక్రీట్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయలేదు. షీట్‌ఫైలింగ్ కోసం తీసిన గోతులు అలాగే ఉన్నాయి. మట్టి తవ్వకాలు, ఐరన్ బుట్టల తయారీ పనులు జరుగుతూనే ఉన్నాయి. పున్నమిఘాట్‌కు ఈ ఘాట్‌కు మధ్యలోనే పిండప్రదాన షెడ్లు నిర్మించారు. పున్నమి ఘాట్ వీఐపీలకే పరిమితమైతే ఈ ఘాట్‌లో సాధారణ భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉండేది. పుష్కరాల ప్రారంభ సమయానికి ఈ ఘాట్‌లోకి భక్తులను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. -
ఘాట్‌కో గండం
కొల్లిపర : పుష్కరఘాట్ల వద్ద ప్రమాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పిడపర్రు లాకుల వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణంలో మట్టి, ఇసుక వాడారు. అప్రోచ్ రోడ్డు పక్కనే ఉన్న రేపల్లె బ్యాంకు కెనాల్ స్లూయిస్ బాగా పల్లంగా ఉండటంతో ఇది భయపెడుతోంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణం వెంట బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మున్నంగి వద్ద అప్రోచ్ రోడ్డు మున్నంగి పుష్కర ఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వారు. ఎక్కువ లోతుగా తవ్వకాలు జరపటంతో రోడ్డు వెంట పల్లంగా మారింది. ఒక వేళ పట్టుజారిందా గోతిలో పడాల్సిందే. ఇక్కడ అప్రోచ్‌రోడ్డు వెంట సైడ్ వాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వల్లభాపురం ఘాట్‌కు బారికేడ్లు తప్పనిసరి? భక్తులు స్నానాలు చేసే చోట తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వల్లభాపురం తిరుపతమ్మ గుడి వద్ద భక్తుల స్నానాల కోసం అక్కడ ఉన్న ర్యాంప్ వద్ద రెండు పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారు. ఒక ఘాట్ ర్యాంపునకు ఎదురుగా, మరో ఘాట్ ర్యాంపునకు ఎడమవైపు ఉంది. ఆ రెండింటి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. రెండు ఘాట్ల వద్ద రెండున్నర అడుగుల మేర మాత్రమే సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో భక్తులు స్నానమాచరిస్తారు. కావున బారికేడ్లు తప్పనిసరి. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద గుండం వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న ఘాట్‌కు సమీపంలో గుండం ఉంది. అక్కడ అధికారులు నిర్దేశించిన ఘాట్ ప్రాంతంలోనే స్నానం చేయడం మంచిది. గుండం వద్దకు భక్తులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇక్కడ కచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. జారుడు బల్లగా పుష్కర ‡ఘాట్ వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న పుష్కరఘాట్ జారుడు బల్లగా కనిపిస్తుంది. పుష్కరాల సమయంలో వర్షం వస్తే భక్తులకు ఇబ్బందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భద్రతా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీతానగరంలో.. సీతానగరం(తాడేపల్లి రూరల్): స్థానిక కృష్ణా రివర్ బెడ్లో ఉన్న రిటైనింగ్ వాల్, పుష్కరఘాట్ల వద్ద స్వాగతద్వారం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి పుష్కరఘాట్ల వరకు 800 మీటర్లపైన ఉన్న రిటైనింగ్ వాల్ ఇప్పటికే రెండుచోట్ల కూలింది. మరో నాలుగు చోట్ల కూలేందుకు సిద్ధంగా ఉంది. భారీ వర్షం కురిస్తే విజయకీలాద్రి పర్వతంపై నుంచి వచ్చే వర్షపునీరు ఈ వాల్లోకి ప్రవేశిస్తాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ గోడల్లోకి నీరు చేరితే ప్రమాదమేనని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. పుష్కరఘాట్ల వద్ద గతంలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి స్వాగతద్వారం పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతోంది. నాలుగో ఘాట్‌లో భక్తుల సేద తీర్చేందుకు గతంలో షెడ్డును ఏర్పాటు చేశారు. ఈ షెడ్డు పైకప్పు లేచి ప్రమాదభరితంగా మారింది.