కృష్ణా పుష్కర ప్రత్యేక సంచిక విడుదల | puskara gzine releged | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కర ప్రత్యేక సంచిక విడుదల

Published Sat, Aug 6 2016 11:11 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

కృష్ణా పుష్కర ప్రత్యేక సంచిక విడుదల - Sakshi

కృష్ణా పుష్కర ప్రత్యేక సంచిక విడుదల

విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
 పుష్కరాలను పురస్కరించుకుని కనకదుర్గప్రభ ధర్మ ప్రచార మాసపత్రిక  కృష్ణా పుష్కర ప్రత్యేక సంచికను రూపొందించింది. బ్రాహ్మణవీధిలోని దుర్గగుడి పరిపాలనా భవనంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈవో సూర్యకుమారి ఈ సంచికను ఆవిష్కరించారు. కృష్ణా పుష్కర వైభవం, కృష్ణా పుష్కరాలు–మన కర్తవ్యం, సర్వపాప హరిణి కృష్ణవేణి, పుష్కరాల ప్రాశస్త్యం, పుష్కర వైశిష్ట్యం, పుష్కర స్నాన విధానం.. వంటి ఆధ్యాత్మిక రచనలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య, పర్యవేక్షకుడు ఈవీ సుబ్బారావు, సంపాదకుడు కె.గంగాధర్, కో–ఆర్డినేటర్‌ సైదా తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement