
సాక్షి,తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావు ఆదివారం(జూన్16) బాధత్యలు స్వీకరించారు.
సంప్రదాయం ప్రకారం ఆయన ముందుగా వరాహస్వామిని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు ఛార్జ్ ఇచ్చారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. జేఈవోలు తీర్థప్రసాదాలు అందించారు.