కంటికి రెప్పలా..!
కంటికి రెప్పలా..!
Published Mon, Aug 15 2016 8:38 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM
ఘాట్లలో క్లీనింగ్
పుష్కర నగర్‌లో నిరంతర కాపలా
సేవల్లో ఫైర్ సిబ్బంది
సాక్షి, అమరావతి :
కృష్ణా పుష్కరాల్లో అగ్నిమాపక సిబ్బంది విస్తృత సేవలందిస్తున్నారు. ఘాట్లను నిరంతరం కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. ప్రతి ఘాటులోను ఫైర్ సిబ్బంది క్లీనింVŠ లోనూ, వీవీఐపీల ప్రోటోకాల్, పుష్కర నగర్‌ల్లో యాత్రికుల భద్రత పరంగా తమవంతు సేవలు అందిస్తున్నారు. పోలీసుల్లా ఘాట్ల పరిధిలో భక్తులను సూచనలు, సలహాలు అందిస్తూ వయసు మీరిన వారికి చేదోడుగా,తప్పిపోయిన పిల్లల విషయంలో చేయూత నిస్తూ సేవలు అందిస్తున్నారు. పర్యాటకశాఖ ఏర్పాటు చేసినా బోటు షికారులో ఘాట్లలో భక్తులకు ఏలాంటి ప్రమాదాలు లేకుండా ఫైర్ రెస్కూ్య టీం పర్యవేక్షిస్తోంది.
విధుల్లో 1050 మంది సిబ్బంది..
కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పుష్కర సేవల్లో 1050 మంది ఫైర్‌సిబ్బంది నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫైర్ స్టేషన్ల నుంచి సిబ్బంది, అ«ధికార యంత్రాంగాన్ని పుష్కర సేవలకు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఘాట్ల క్లీనింగ్‌లో వీరి పాత్ర కీలకంగా ఉంది. శానిటేషన్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ 40 ఫోర్టబుల్ పంపులతో పరిశుభ్రత చేస్తున్నారు. గంట, గంటకు పంపులతో శుభ్రం చే స్తుండడంతో ఘాట్లలో పరిశుభ్రత తాండవిస్తుండడంతో భక్తులు ఆనందంగా వెళ్తున్నారు. పుష్కరాలకు ఐదు రోజుల ముందు నుంచే వీరు ఘాట్ల శుభ్రత విషయంలో శ్రద్ధ పెట్టారు.
నిరంతర నిఘా..
పోలీసులు భక్తుల భద్రత విషయంలో కాపలా ఉంటే ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాల బారినపడకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 45 పుష్కర నగర్‌ల్లో 30 వాహనాలను వుంచారు. పుష్కర నగర్ ఏర్పాటు చేయకముందే వీరు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని నిబంధనల మేర విద్యుత్ సదుపాయం కల్పించారు. రాత్రి సమయాల్లో నిద్రించే సమయాల్లో ఏలా వ్యవహరించాలి అనే దానిపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక వీవీఐపీల ప్రోటోకాల్ ,హెలిప్యాడ్ వద్ద వీరి పాత్ర కీలకంగా ఉంది. ఘాట్ల పరిధిలో ¿¶ క్తుల భద్రత విషయంలో రెస్కూ్య టీంలు పనిచేస్తున్నాయి. మొత్తం 8 బోట్లు ద్వారా ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ కాపలా కాస్తున్నారు. ఫెర్రి ఘాట్‌లో 1, దుర్గాఘాట్ లో 2, అమరావతిలో 2, పున్నమి ఘాట్ లో 2, భవానీ ఘాట్‌లో 1 వంతున బోట్లుల్లో కాపలా కాస్తున్నారు. మరో రెండు అదనంగా ఉన్నాయి. ఏక్కడ భక్తులు ప్రమాదం జరిగినా వెంటనే ఆ రెస్కూ్యటీంలు వారిని వెంటనే రక్షించి వైద్య శిబిరాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసు తరహాలో సేవలు..
పోలీసు తరహాలో ఫైర్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.ప్రతి ఘాట్ లో ఓ స్టేషన్ అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ వుంటుంది అలాగే ప్రధాన ఘాట్లలో జిల్లా ఫైర్ అధికారి పర్యవేక్షణ చేస్తున్నారు. ఘాట్ల వద్దకాపలాతో పాటు వయస్సు మీరిన వారిని ఆసరాగా నిలచి స్నానలకు తీసుకెళ్లడం, చిన్నారులు తప్పిపోకుండా ట్యాగింగ్ వేయించడం, అనారోగ్యంగా ఉన్న ఉన్నవారిని వైద్య శిబిరాలకు తరలించండం ఇలాంటి సేవల్లో వీరు భాగస్వాములు అవుతున్నారు.
Advertisement
Advertisement