వారం రోజుల్లో తాత్కాలిక సచివాలయం నుంచే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
విజయవాడ: వారం రోజుల్లో తాత్కాలిక సచివాలయం నుంచే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి సీఎం కూడా తాత్కాలిక సచివాలయం నుంచే పాలన సాగిస్తారని తెలిపారు. అలాగే శుక్రవారం నుంచి 8 గ్రామాల్లో ప్లాట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.
రాజధానికి సంబంధించిన డిజైన్లు డిసెంబరు వరకు ఫైనల్ చేస్తామని, జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అన్నారు. మాకి సంస్థ ఇచ్చిన డిజైన్లపై విమర్శలు రావడంతో రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు.