Temporary Secretariat
-
తాత్కాలిక సచివాలయానికి సీఎస్
సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపు నేపథ్యంలో బీఆర్ కేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం విధులకు హాజరయ్యారు. ఆయనతో పాటు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా తదితరులు తమకు కేటాయించిన చాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు. తాత్కాలిక సచివాలయం ఏర్పాటు పనులతో పాటు తన చాంబర్లో కొనసాగుతున్న పనులను సీఎస్ పరిశీలించారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు సాగేలా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. కాగా, మంగళవారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచి విధులు నిర్వర్తించాలనే సీఎం ఆదేశాల నేపథ్యంలో.. పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఫైళ్లకు సంబంధించిన మూటలతో బీఆర్కేఆర్ భవన్‌కు తరలిరావడం కనిపించింది. జపాన్ బృందంతో జయేశ్ భేటీ తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటైన తన కార్యాలయాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ప్రారంభించారు. తన చాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం.. జపాన్‌కు చెందిన డెన్షో కంపెనీ ప్రతినిధులతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జపాన్‌లోని ఒసాకా కేంద్రంగా పనిచేస్తున్న డెన్షోకు షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌లోనూ అనుబంధ కంపెనీలు ఉన్నాయి. బేరింగ్ ఉత్పత్తులను వివిధ దేశాలకు సరఫరా చేసే డెన్షో ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించిన చర్చలు జరగలేదని, సాధారణ భేటీ మాత్రమేనని జయేశ్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
వాన కురుస్తుంది....గాలి విరుస్తుంది!!
అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంతా డొల్లేనని మరోసారి రుజువైంది. స్వల్ప వర్షానికే పలుమార్లు చిల్లుపడ్డ కుండల్లా అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం మారింది. తాజాగా బుధవారం కేవలం అరగంటపాటు వీచిన ఈదురుగాలులకు అమరావతి చిగురుటాకులా వణికిపోయింది. ఉధృతంగా వీచిన గాలులకు సచివాలయంలోని టెంట్లు, స్మార్ట్ పోల్ నేలకొరిగాయి. ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సచివాలయంలోని భవనాలకు పైన వేసిన రేకులు గాలి ధాటికి ఎగిరిపోయాయి. కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేకుండా నిర్మించిన భవనాలపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి బ్యూరో మంత్రుల చాంబర్లు.. చిల్లులు పడ్డ కుండలే.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ప్రపంచం గర్వించదగ్గ సచివాలయాన్ని నిర్మించామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఇప్పటికే బట్టబయలైంది. గతంలో రెండుసార్లు కురిసిన వర్షానికి సచివాలయంలోని 4, 5 బ్లాకుల్లో ఉన్న మంత్రుల చాంబర్లలో చిల్లులు పడ్డ కుండలా నీరు కారింది. బ్లాకుల్లో సీలింగ్ ఊడి పడి.. ఫర్నీచర్ తడిసిపోయి.. ఏసీల్లోకి వర్షపు నీరు చేరడంతో సిబ్బంది విధులకు సైతం ఆటంకం ఏర్పడింది. నిర్మాణ సంస్థపై చర్యలేవి? అతి తక్కువ కాలంలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నారాయణ చెబుతూ వస్తున్నారు. అయితే.. వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలోని బ్లాకులకు చిల్లులు పడటంతో నిర్మాణాల్లోని డొల్లతనం రుజువైంది. వందల కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణం ఇలా కళ్లెదుటే స్వల్ప వర్షానికే కారుతూ ఉండడాన్ని చూస్తూ అక్కడి అధికారులే పెదవి విరుస్తున్నారు. 2017లో తొలిసారి చిల్లులు పడినప్పటి నుంచి ఇప్పటివరకు సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వం.. నిర్మాణ సంస్థపై చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజధాని గ్రామాల రోడ్లు బురదమయం రాజధానిలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కొన్ని గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం గమనార్హం. చిన్నపాటి వర్షానికే రాజధాని గ్రామాల రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు ఇళ్లలోకి చేరుతోంది. గతేడాది కురిసిన వర్షానికి రాయపూడిలోని ముస్లిం కాలనీ నీటమునిగింది. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే ప్రతిపక్ష నేత జగన్ చాంబర్లో ఊడిపడిన సీలింగ్‌ను శుభ్రం చేస్తున్న సిబ్బంది (ఫైల్) హైకోర్టు నిర్మాణంలోనూ అంతే.. ఆగమేఘాల మీద తాత్కాలిక హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సరైన భద్రతా, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. మంగళవారం కురిసిన వర్షానికి హైకోర్టు భవనంపైన ఏర్పాటు చేసిన ఇనుప షీట్లు గాలికి కొట్టుకుపోయాయి. గోడలకు అమర్చిన టైల్స్ విరిగిపోయాయి. సమీపంలోని అన్న క్యాంటీన్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. గాలికి ఎగిరిపడిన రేకులు తగలడంతో అక్కడే పనిచేస్తున్న మహిళా కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో హైకోర్టుకు సెలవులు కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హైకోర్టు పనివేళల్లో జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికంగా పనిచేస్తున్న కూలీలు చెబుతున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే నష్టం వాటిల్లిందని అధికారులు కూడా స్పష్టం చేశారు. కమీషన్ల కక్కుర్తితోనే లీకులు సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలతోపాటు తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనుల అంచనాలను ప్రభుత్వం పెంచుతూ పోయింది. సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసింది. హైకోర్టుకు తొలుత రూ.98 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టగా ఆ మొత్తాన్ని రూ.150 కోట్లకు పెంచింది. కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం భారీగా పెంచిందని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలకు ప్రస్తుత సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పాటించకుండా, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2017లో ప్రతిపక్ష నేత చాంబర్లోకి నీరు 2017, జూన్‌లో కురిసిన వర్షానికి సచివాలయం నిర్మాణంలో డొల్లతనం మొదటిసారిగా బయటపడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి సచివాలయం చిల్లులు పడ్డ కుండలా కారడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్లో లీకేజీతో భారీగా నీరు చేరింది. చాంబర్లో సీలింగ్ ఊడిపడడంతో ఫర్నీచర్, ఫైళ్లు తడిసిముద్దయ్యాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి వర్షపు నీరు కారడంతో అక్కడి సిబ్బంది ఆ నీటిని బకెట్లతో ఎత్తి బయటపోశారు. ఈ ఘటన తర్వాత నిర్మాణాల్లోని లోపాలు బయటపడ్డాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేసింది. -
గాలివాన బీభత్సం.. అమరావతి అస్తవ్యస్తం
సాక్షి నెట్వర్క్: భారీ వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. బలమైన గాలులతో కూడిన వర్షం రావడంతో రాజధానిలో నిర్మాణ దశలో ఉన్న భవనాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. తాత్కాలిక సచివాలయం వద్ద రూ.25 లక్షల వ్యయంతో ఇటీవలే ఏర్పాటు చేసిన స్మార్ట్‌పోల్ గాలుల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సచివాలయంలోని బ్లాకులపై ఏర్పాటు చేసిన రేకులు ఎగిరిపోయాయి. సచివాలయం ప్రవేశ మార్గం వద్ద పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు నేలకూలాయి. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పోల్స్ కూడా నేలకొరిగాయి. కేవలం పది నిమిషాల పాటు కురిసిన గాలివానకే తాత్కాలిక సచివాలయం వద్ద భారీగా ఆస్తినష్టం వాటిల్లడం గమనార్హం. గతంలో వర్షాలకు తాత్కాలిక సచివాలయంలోని వివిధ బ్లాకుల్లో నీరు కారడమే కాకుండా పెచ్చులూడి కింద పడిన సంగతి తెలిసిందే. గాలి వానకు హైకోర్టు ప్రాంగణంలోని పడిపోయిన సందర్శకుల షెడ్లు తాత్కాలిక హైకోర్టు వద్ద భయానక వాతావరణం రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు వద్ద గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. గాలి తీవ్రతకు ప్రధాన ద్వారం వద్ద పెద్ద గాజు తలుపు పగిలిపోయింది. హైకోర్టు ఎదురుగా వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిపై ఉన్న రేకులన్నీ ఎగిరిపోయాయి. హైకోర్టు పైన చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఇనుప షీట్లు కూడా గాలికి కొట్టుకుపోయాయి. హైకోర్టు గోడలకు అమర్చిన రాజస్థాన్ టైల్స్ ముక్కలు ముక్కలయ్యాయి. హైకోర్టు సమీపంలోని అన్న క్యాంటీన్ అద్దాలు విరిగిపోయాయి. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో న్యాయవాదులెవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మహిళకు తీవ్ర గాయాలు గాలి తీవ్రతకు తాత్కాలిక హైకోర్టు వద్ద ఇనుప రేకులు గాల్లోకి ఎగిరాయి. అక్కడ పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళపై ఇనుప రేకు పడడంతో తీవ్రంగా గాయపడింది. తలకు సైతం బలమైన గాయం కావడంతో రక్తస్రావమైంది. బాధితురాలిని పోలీసులు ‘108’ వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమణమ్మ తలకు వైద్యులు 8 కుట్లు వేశారు. కృష్ణా జిల్లాలో తెగిపోయిన కరెంటు తీగలు గాలివాన ధాటికి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరులో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వణుకూరు–మద్దూరు గ్రామాల మధ్యలో రోడ్డుపై హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పెనమలూరు పల్లిపేటలో చెట్లు విరిగిపడడంతో ట్రాన్స్ఫారం నేలకూలింది. గోసాల నెహ్రూనగర్ వద్ద భారీ వృక్షం బందరు రోడ్డుపై పడిపోవడంతో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోరంకిలో తాటిచెట్లు విద్యుత్ లైన్లపై పడటంతో కరెంటు తీగలు తెగిపోయాయి. స్తంభాలు పడిపోయాయి. చెట్టు కూలిపోయి వ్యక్తి మృతి కృష్ణా జిల్లాలో పెదపులిపాక గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్(56) అనే వ్యక్తి పశువులను మేపడానికి ఉంగరం కరకట్ట వద్దకు వెళ్లాడు. భీకర గాలులకు చెట్టు కూలి అతడిపై పడిపోయింది. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడి, మృతి చెందాడు. గుంటూరు జిల్లాలో పండ్ల తోటలు ధ్వంసం అకాల వర్షం కారణంగా గుంటూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల ప్రజలు అవస్థలు పడ్డారు. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లో అరటి, మామిడి, సపోటా తోటలకు నష్టం వాటిల్లింది. మంగళగిరి నియోజకవర్గంలో వడగళ్ల వాన కురిసింది. పసుపు పంట వర్షం నీటికి తడిసిపోయింది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో పిడుగు పడి గొర్రెల కాపరి కావలి దానయ్య(20) మృతి చెందాడు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో పులిపాటి శ్రీనివాసరావుకు చెందిన గేదె పిడుగుపాటుకు గురై మృత్యువాత పడింది. కొల్లిపర, తెనాలి మండలాల్లో వందలాది ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వేమూరు నియోజకవర్గంలో పెరవలిపాలెంలో అరటి తోటలు నేలకూలాయి. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం వేమవరంలో స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే కార్మికులు నివాసం ఉంటున్న షెడ్లపై చెట్టు విరిగిపడడంతో మహిళకు గాయాలయ్యాయి. ఈదురుగాలులకు పూరిల్లు, గుడిసెలు, రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి. ‘పశ్చిమ’ ఏజెన్సీలో ఈదురు గాలులు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలుల వీచాయి. భారీ వర్షం కురిసింది. పోలవరం మండలంలోని వాడపల్లి నుంచి కొత్తూరు వరకు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. తల్లవరం, గాజులగొంది గ్రామాల్లో అరటి తోటలు పడిపోయాయి. కళ్లాల్లో మొక్కజొన్న పంట తడిచిపోయి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. గాజులగొంది గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగి పడిపోవడంతో మూలెం రామయ్యకు చెందిన ఎద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈదురుగాలుల వల్ల పలు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. -
మిగిలింది 40 రోజులే..
సాక్షి, అమరావతి: హైకోర్టు తాత్కాలిక భవనాలు డిసెంబర్ రెండో వారానికల్లా అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. సివిల్ పనులు పూర్తి కావడానికే నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఫినిషింగ్, మౌలిక వసతులకు ఎంత లేదన్నా మరో రెండు నెలలు పడుతుందని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే 3 నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 15వ తేదీ నాటికే హైకోర్టు తాత్కాలిక భవనాలను సిద్ధం చేస్తామని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టుకు సైతం నివేదించింది. తాత్కాలిక భవనంలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తే న్యాయమూర్తుల నివాసానికి అద్దె భవనాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీంతో డిసెంబర్ 15 తర్వాత హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో న్యాయవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 7 నెలలుగా కొనసాగుతున్న పనులు రాజధాని పరిపాలనా నగరానికి అర కిలోమీటరు దూరంలో నేలపూడి వద్ద హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+2 (జీ+5 ఫౌండేషన్) నిర్మించే బాధ్యతను ఈ ఏడాది మార్చిలో రూ.98 కోట్లకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. అయితే ఏడు నెలల క్రితం పనులు ప్రారంభమైనా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంటీరియర్, ప్రధాన భవనాలకు లిఫ్టులు, అదనపు మౌలిక వసతులు, ప్రహరీ గోడ, ప్రవేశ మార్గాలు, అంతర్గత రోడ్లు, పార్కింగ్, మురుగునీటి పారుదల వ్యవస్థ తదితర పనులను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. ఇటీవలే రూ.56 కోట్ల అంచనాతో ఈ పనుల కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులు కూడా ఎల్ అండ్ టీకి అప్పగించే అవకాశాలున్నా లాంఛనాలన్నీ పూర్తై పనులు మొదలయ్యేసరికి ఇంకా సమయం పట్టే పరిస్థితి ఉంది. మిగిలిన సివిల్ పనులు, టెండర్లు ఖరారు కాని మౌలిక వసతుల పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చెబుతున్న గడువు 40 రోజులు మాత్రమే. అయితే ఈ గడువు లోపు పనులు పూర్తై తాత్కాలిక భవనం అందుబాటులోకి రావడం కష్టమని, కనీసం రెండు నెలలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయంలా చేస్తారా? మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 15 నాటికి ఈ భవనాన్ని సిద్ధం చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించారు. దీంతో తాత్కాలిక సచివాలయం మాదిరిగా హడావుడిగా చేస్తే ఈ పనులు కూడా నాసిరకంగా జరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయం నీరుగారుతోంది. వానలకు మంత్రుల ఛాంబర్లు తడిసిపోవడం, డ్రెయిన్లు పొంగడం, గోడలు పగుళ్లివ్వడం, ప్రణాళికా లోపంతో గోడలను పగలగొట్టి మళ్లీ కట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత ఛాంబర్లో పైకప్పు పెచ్చులూడి వర్షపు నీరు కారడం తెలిసిందే. ఇవన్నీ ప్రభుత్వం హడావుడిగా, నాసిరకంగా పనులు చేయించడం వల్లేనని నిపుణులు గతంలోనే స్పష్టం చేశారు. -
రాజధాని శాశ్వత భవనాల వ్యయం రెట్టింపు
సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయం తరహాలోనే రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణ వ్యయం కూడా భారీ స్థాయికి చేరుకుంది. తాత్కాలిక సచివాలయం పేరుతో ఇప్పటికే భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆడిట్ నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేయడం తెలిసిందే. ఈ పనులను టెండర్ నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎక్సెస్‌తో కాంట్రాక్టర్లకు అప్పగించారని ఆడిట్ నివేదికలో పేర్కొంది. చిన్నపాటి వాన కురిస్తేనే తాత్కాలిక సచివాలయంలోని కార్యాలయాల్లోకి వర్షం నీరు వచ్చేలా నిర్మించిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకే శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలభవనాల నిర్మాణ టెండర్లను సర్కారు అప్పగించడం గమనార్హం. శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ఐదు టవర్లలో 30 లక్షల చదరపు అడుగుల్లో రూ.1,200 కోట్లతో నిర్మించాలని తొలుత నిర్ణయించారు. అయితే టెండర్ల దగ్గరకు వచ్చే సరికి ఇది 69 లక్షల చదరపు అడుగులకు పెరిగిపోయింది. ఐదు టవర్లలో నిర్మాణం చేపట్టేందుకు మూడు ప్యాకేజీలుగా విభజిస్తూ టెండర్లను ఆహ్వానించారు. తొలి ప్యాకేజీ కింద ఐదో టవర్‌లో సాధారణ పరిపాలనశాఖ భవనాల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్‌ను రూ.592.41 కోట్లతో ఎన్సీసీ సంస్థకు అప్పగించారు. రెండో ప్యాకేజీలో మూడు, నాలుగు టవర్ల పనులను రూ.749.90 కోట్లతో ఎల్ అండ్ టీకి అప్పగించారు. ఒకటి, రెండో టవర్లకు మూడో ప్యాకేజీ కింద టెండర్లను ఆహ్వానించి రూ.932.46 కోట్లకు షాపూర్జీ పల్లోంజీకి అప్పగించారు. మొత్తం ఐదు టవర్లలో శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల నిర్మాణ వ్యయాన్ని రూ.2,274.77 కోట్లుగా పేర్కొన్నారు. తొలుత 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలను చేపట్టాలని భావించి తరువాత 69 లక్షల చదరపు అడుగులకు ఎందుకు పెంచారో అర్థం కావడం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. విభిన్న సదుపాయాల పేరుతో ఇంటిగ్రేటెడ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారని, ఇందులోనే అన్ని రకాల వసతుల కల్పనకు ఆస్కారం ఉన్నప్పటికీ కొత్తగా ఐదు టవర్లలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,060 కోట్ల అంచనాతో మరో టెండర్‌ను ఆహ్వానించారని ఆ ఉన్నతాధికారి తెలిపారు. పేరుకు మాత్రమే టెండర్లను ఆహ్వానించి ఎవరూ ముందుకు రాలేదంటూ రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన ఆ పనులను కూడా ఐదు టవర్లు నిర్మించే సంస్థలకే పందేరం చేయనున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. రెట్టింపు దాటిన కన్సల్టెంట్ ఫీజు ఐదు టవర్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కోసం తొలుత 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.1,200 కోట్ల అంచనాతో టెండర్‌ను ఆహ్వానించగా ప్రాజెక్టు వ్యయంలో 0.89 శాతం ఇచ్చేందుకు సీఆర్డీఏ ‘ఈజీఐఎస్’ను ఎంపిక చేసింది. తొలుత అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం ప్రకారం ఈజీఎస్ కన్సల్టెంట్‌కు రూ.10.68 కోట్లు ఫీజు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.2,274.77 కోట్లకు పెరిగిపోవడంతో ఫీజుతో పాటు జీఎస్టీ కలిపి కన్సల్టెంట్‌కు రూ.23.90 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. -
రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు
-
తాత్కాలిక సచివాలయంలో దోచేశారు..
6 భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం 94ను ఉల్లంఘించారు. – కాగ్ సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణాల్లో భారీగా దోపిడీ జరిగినట్లు సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తేల్చిచెప్పింది. కాంట్రాక్టర్లకు అంతులేని ప్రయోజనం కలిగించారని, తద్వారా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ‘కాగ్’ ఆడిట్లో స్పష్టం చేసింది. సర్వే, ఇన్వెస్టిగేషన్ లేకుండానే సాంకేతిక అనుమ తులు ఇచ్చారని తప్పుపట్టింది. తాత్కాలిక సచివాలయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేస్తోందన్న ఆరోపణలు మొదటినుంచే వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనం కలిగించడంతోపాటు టెండర్ నిబంధనలన్నింటికీ తిలోదకాలు ఇచ్చారని, ఇంజనీరింగ్– ప్రొక్యూర్మెంట్– కనస్ట్రక్షన్(ఈపీసీ) విధానానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ‘కాగ్’ స్పష్టం చేయడం గమనార్హం. ఈపీసీ నిబంధనలకు తిలోదకాలు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వ్యవహారాలపై ‘కాగ్’ తొలిసారిగా 2017–18లో ఆడిట్ నిర్వహించింది. సర్కారు సాగించిన ఆక్రమాలను కడిగిపారేసింది. ‘కాగ్’ బహిర్గతం చేసిన అక్రమాలకు, సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వం నోరెల్లబెట్టింది. ప్రధానంగా తాత్కాలిక సచివాలయం పేరుతో 6 భవనాల నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లలో చోటుచేసుకున్న అక్రమాలను, కాంట్రాక్టు సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కల్పించిన తీరును ఆడిట్ నివేదికలో ‘కాగ్’ సోదాహరణంగా వివరించింది. 6 భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం 94ను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. భారీగా అధిక ధరలకు(ఎక్సెస్) టెండర్లను ఖరారు చేయడంపై ‘కాగ్’ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ–ప్రొక్యూర్మెంట్లో తొలుత అప్లోడ్ చేసిన అంతర్గత అంచనా వ్యయాన్ని(ఐబీఎం) ఆ తరువాత పెంచేయడాన్ని తప్పుపట్టింది. ఈపీసీ విధానంలో టెండర్లను 5 శాతం కంటే ఎక్సెస్‌కు ఖరారు చేయరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. 5 శాతం ఎక్సెస్‌కు టెండర్లు వస్తే వాటిని రద్దుచేసి రెండోసారి టెండర్లను ఆహ్వానించాలనే ఈపీసీలోని ప్రాథమిక నిబంధనలకే తిలోదకాలు ఇచ్చారని కాగ్ వెల్లడించింది. తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణాల అంచనా వ్యయాలను కాంట్రాక్టర్లకు 14 శాతం మేర లాభం వచ్చేలా రూపొందించారని కాగ్ తెలిపింది. కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలకు విరుద్ధంగా 5 శాతానికి మించి ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలతో సంప్రదింపులను జరిపారని పేర్కొంది. రద్దు చేయాల్సింది పోయి చర్చలా? తాత్కాలిక సచివాలయంలోని 6 బ్లాకులను రెండేసి బ్లాకులుగా కలిపి 3 ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించారు. ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థలు అంతర్గత అంచనా వ్యయంపై ఏకంగా 62 శాతం నుంచి 85 శాతం వరకు ఎక్సెస్‌కు టెండర్లను దాఖలు చేశాయి. టెండర్లను రద్దు చేయాల్సింది పోయి ఆ రెండు సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపుల జరపడాన్ని కాగ్ తప్పుపట్టింది. సంప్రదింపుల తరువాత కూడా ఈ రెండు సంస్థలకు 16.24 శాతం నుంచి 24.75 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలకు బిల్లుల చెల్లింపులోనూ నిబంధనల మేరకు ప్రభుత్వం వ్యవహరించలేదని కాగ్ వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ శాతం మేర బిల్లులు చెల్లించారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ కమిషనర్ కాంట్రాక్టర్లకు రూ.40.80 కోట్ల అదనపు ప్రయోజనం కలిగేలా టెండర్లను ఖరారు చేసినట్లు కాగ్ తేటతెల్లం చేసింది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపింది. -
మంత్రుల చాంబర్లలోకి మళ్లీ వాన!
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ప్రపంచం గర్వించే రీతిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని మంత్రుల బ్లాకులు చిల్లులు పడ్డ కుండల్లా కారాయి. సోమవారం పలువురు మంత్రుల బ్లాకుల్లో సీలింగ్ ఊడి పడడంతో వాన నీటికి ఫర్నీచర్ తడిసిపోయింది. తాత్కాలిక సచివాలయంలోని 4, 5వ బ్లాకుల్లో ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్రెడ్డి, దేవినేని ఉమ చాంబర్లలో సీలింగ్ ఊడిపడటంతోపాటు ఏసీల్లోకి వర్షపు నీరు చేరింది. సీలింగ్ నుంచి వర్షపు నీరు కారడంతో సిబ్బంది విధులకు ఆటంకం ఏర్పడింది. హౌస్ కీపింగ్ సిబ్బంది ఆగమేఘాల మీద పేషీల్లోని నీటిని తొలగించారు. అసెంబ్లీ భవనంలోనూ పలు చోట్ల సీలింగ్ ఊడిపోయి వర్షపు నీరు చేరుతోంది. వర్షం కురిస్తే కారడమే... అతి తక్కువ వ్యవధిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తరచూ గొప్పలు చెబుతూ వస్తున్నారు. అయితే వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలోని బ్లాకులు ధారాళంగా లీకేజీ కావడం నిర్మాణాల్లోని డొల్లతనాన్ని రుజువు చేస్తోంది. రూ. వందల కోట్లతో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలు నీరుగారడంపై అధికారులు పెదవి విరుస్తున్నారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా నిర్మాణాలు చేపట్టిన సంస్థపై సర్కారు చర్యలు చేపట్టకుండా ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. గతేడాది ప్రతిపక్షనేత చాంబర్లోకి వాన నీళ్లు.. 2017 జూన్‌లో కురిసిన వర్షాలకు సచివాలయం నిర్మాణంలోని డొల్లతనం మొదటిసారిగా బయటపడింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేటాయించిన చాంబర్లోకి లీకేజీ వల్ల ధారాళంగా నీరు చేరింది. చాంబర్లో సీలింగ్ ఊడిపడడంతో ఫర్నీచర్, ఫైళ్లు తడిసిముద్దయ్యాయి. ఏసీ, రూఫ్ లైట్ల నుంచి వర్షపు నీరు కారడంతో సిబ్బంది బకెట్లతో తోడారు. ఈ ఘటన తర్వాత నిర్మాణాల్లో లోపాలపై సమగ్రంగా విచారిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేసింది. మొదటి నుంచి అనుమానాలే... తాత్కాలిక సచివాలయం పనులు ప్రారంభమైన నాటి నుంచి నిర్మాణంలో లోపాలపై నిపుణులు సందేహాలు వెలిబుచ్చుతూనే ఉన్నారు. నల్లరేగడి భూమిలో నిర్మాణాలు చేపట్టాలంటే పునాదులు పట్టిష్టంగా ఉండాలని గట్టిగా సూచించారు. ఎంత హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలో ఏదో ఒక బ్లాక్ కారుతోంది. తాత్కాలిక సచివాలయం ఆవరణలో వర్షపు నీరు భారీగా నిల్వ ఉంటోంది. కమీషన్ల దాహంతోనే లీకులు... సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఒక్కో చదరపు అడుగుకు తొలుత రూ. మూడు వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం తర్వాత వివిధ కారణాలు చూపిస్తూ ఈ మొత్తాన్ని నాలుగు రెట్లకు పెంచింది. చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చుతో చేపట్టిన భవనాలు చిన్న వర్షానికే కారుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై, కేరళలలో మాదిరిగా కుండపోత వర్షం పడితే తాత్కాలిక సచివాలయం భవనాల పరిస్థితిని తలుచుకుంటేనే భయమేస్తోందని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కోసం నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం భారీగా పెంచినట్లు చేస్తున్న ఆరోపణలకు ప్రస్తుత సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పాటించకుండా, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో తరచూ చాంబర్లు కారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబర్ 31లోగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం తాత్కాలిక సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు, ఈ–ఆఫీస్ అంశాలపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల్లో నవంబర్ 15లోగా, జిల్లా కార్యాలయాల్లో నవంబర్ 30లోగా.. డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో డిసెంబర్ 31లోగా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు. -
అక్టోబర్ 2 నుంచి ప్రధానమంత్రి చంద్రన్న బీమా
సాక్షి, అమరావతి: అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత చంద్రన్న బీమా పథకానికి ‘ప్రధానమంత్రి చంద్రన్న బీమా’గా పేరు మార్చినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. 02–10–2017 నుంచి 31–05–2018 వరకు రెండో విడత పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పథకంలో భాగంగా 2.20 కోట్ల అసంఘటిత కార్మికుల తరఫున 8 నెలల ప్రీమియంకు గాను రూ.235 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 70 ఏళ్లు దాటిన పాలసీదారులను చంద్రన్న బీమా పథకం నుంచి తొలగించి, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వివరాలకు కాల్‌సెంటర్‌కు (నంబర్ 155214) ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. -
సచివాలయం మళ్లీ నీరు గారింది!
-
సచివాలయం మళ్లీ నీరుగారింది!
- పలు చాంబర్లలో లీకైన వాన నీరు - ఊడిపడిన ఫాల్స్ సీలింగ్ కప్పులు - తోడిపోస్తున్న మోటార్లు - భయాందోళనలో ఉద్యోగులు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చుతో వెలగ పూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం వర్షపు నీటితో తడిసిముద్దయింది. రెండు నెలల క్రితం తొలకరి జల్లులకే తాత్కాలిక అసెంబ్లీ భవనంలో నీరుగారితే, పలు గోడలకు పగుళ్లతో ఇటీవలే ఆ భవనంలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పుడు చిన్న వర్షానికే తాత్కాలిక సచివాలయంలో నీరుగారడమే కాకుండా పెచ్చులు ఊడిపడ టంతో సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంగళవారం కురిసిన వర్షానికి మూడు, నాలుగు బ్లాకుల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున వర్షపు నీరు లీకయ్యింది. పిల్లర్లు, కిటికీల నుంచి కూడా వర్షపు నీరు లోపలికి వచ్చింది. నాల్గో బ్లాకులోని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా చాంబర్లు, పేషీలు వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి. రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేష న్ చాంబర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉద్యోగుల భయాందోళన.. మంత్రి గంటా, రెవెన్యూ చాంబర్లలో వర్షానికి ఫాల్స్ సీలింగ్ కప్పులు ఊడిపడుతుండటంతో ఉద్యోగస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. నాల్గో బ్లాకులోని కింది అంతస్తు గోడలు, పిల్లర్ల వెంబడి వర్షపు నీరు ధారాపాతంగా వస్తుండంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఊడిన పైకప్పులను కాంట్రాక్టు సంస్థ సిబ్బంది తొలగించారు. కారుతున్న నీటిని హౌస్‌కీపింగ్ సిబ్బంది బక్కెట్లతో తోడి పోశారు. మూడో బ్లాకులోని క్యాంటీన్లో కూడా వర్షపు నీరు కారింది. అక్కడ నేలంతా తడిసిముద్ద కావడంతో సిబ్బంది, సందర్శకులు ఆహారపదార్థాలు తినడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే సచివాల యంలోకి చేరిన నీటిని ఎప్పటికప్పుడు మోటార్లతో తోడి బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోపాలు ఏమీ లేవు సచివాలయంలోకి వర్షపు నీరు చేరుతోందని మీడియాలో వార్తలు చూసి మంత్రి నారాయణ సచివాలయానికి హడావుడిగా వచ్చారు. వర్షపు నీటితో తడిసి ముద్దయిన పలు చాంబర్లను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న సమస్య అని, భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు. భవనం పైన ఉన్న డక్‌షీట్ బయటకు రావడం వల్ల వర్షపు నీరు లోపలికి చేరిందన్నారు. లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్కే సాక్షి, హైదరాబాద్: ఏపీ తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం లీకేజీ వెనకాల చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన ప్యాకేజీ ఎంతో బయటపెట్టాలని, లీకేజీ ఘటనలపై సీబీఐ విచారణ వేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మీకు ఏ ప్యాకేజీ అందకపోతే కేవలం చదరపు అడుగుకు రూ.10 వేలు చొప్పున మీ కాంట్రాక్టర్లకు ఇష్టమొచ్చినట్టు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. లీకేజీ చిన్న విషయమని, దాన్ని పెద్దగా చూపించవద్దంటూ మంత్రి నారాయణ మాట్లాడడం దారుణమని తెలిపారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ప్రజలకు తెలియాలంటే కచ్చితంగా దీనిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొద్దిపాటి వర్షానికే ఇలా జరిగితే రేపు వచ్చే తుఫాన్ లకు బిల్డింగ్‌లుంటాయా, గాలిలో ఎగిరిపోతాయా అన్న సందేహం ప్రజలకు కలుగుతుందని ఆర్కే చెప్పారు. లీకేజీ ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడాలని, భవన నిర్మాణం చేపట్టిన వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. -
లీకేజీపై మాయనాటకం
రూ.1,000 కోట్ల నిర్మాణం.. అంతా డొల్ల! కప్పిపుచ్చుకునేందుకు తంటాలు.. బుధవారం మధ్యాహ్నం వరకూ మౌన ముద్ర - ఆ తర్వాత ఇదంతా ప్రతిపక్షం కుట్రేనని కొత్త వాదన - కేవలం అసెంబ్లీ లీకులపైనే సీఐడీ విచారణ - సచివాలయం లీకేజీపై నోరు మెదపని ప్రభుత్వ పెద్దలు - 24 గంటల్లో నాలుగు రకాలుగా బుకాయింపు సాక్షి, అమరావతి: వెయ్యి కోట్ల రూపాయలతో వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు డొల్లేనని తేలిపోవడంతో దాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది. ప్రపంచ స్థాయి నిర్మాణమంటూ ఊదరగొట్టినా అందులో నాణ్యత నేతి బీర చందమేనని చిన్నపాటి వర్షం రుజువు చేయడంతో ప్రతిపక్షంపై ఎదురు దాడికి దిగింది. అసలు నిజాలు, వైఫల్యాలు బయటకు రాకుండా మభ్య పెట్టేందుకు మంత్రులు, టీడీపీ నేతలను రంగంలోకి దించి ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రేనని ఆరోపణలు గుప్పిస్తోంది. వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి కట్టిన భవనాల్లో తప్పెక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకునేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వ్యతిరేక ప్రచారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షంపై నింద వేసినట్లే సచివాలయం, అసెంబ్లీ నాణ్యత లోపాలు బయటపడకుండా మళ్లీ అదే పంథాను అనుసరించింది. ప్రపంచ స్థాయి రాజధానిని చిన్నపాటి వర్షం కకావికలం చేయడంతో ఏం చేయాలో పాలుపోక 24 గంటలపాటు మౌనముద్ర దాల్చిన ప్రభుత్వ పెద్దలు బుధవారం మధ్యాహ్నానికి ఎదురుదాడికి వ్యూహం సిద్ధం చేసుకుని బయటకు వచ్చారు. అప్పటికే సోషల్ మీడియా ద్వారా తాత్కాలిక సచివాలయం అసలు రంగు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోవడంతో ఎదోలా దృష్టి మరల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఏసీ పైపు లైనును కట్ చేసి జగన్మోహన్రెడ్డి చాంబర్లోకి నీరు వెళ్లేలా కుట్ర పన్నిందని ఎదురుదాడిని మొదలు పెట్టింది. మీడియాను ఎందుకు అనుమతించలేదు? అంతా పారదర్శకంగా ఉందని చెబుతున్న ప్రభుత్వం.. బుధవారం మధ్యాహ్నం వరకు మీడియాను ఎందుకు అసెంబ్లీలోకి అనుమతించలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. జగన్మోహన్రెడ్డి చాంబర్లో సీలింగ్ విరిగి పడిన, ధారలా వర్షం నీరు పడుతున్న, బకెట్లతో సిబ్బంది బయటకు తోడిపోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఎవరినీ లోనికి పంపలేదు. బుధవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి మీడియాను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా అడ్డుకున్నారు. అయితే స్పీకర్ వచ్చిన తర్వాత లోనికి తీసుకెళ్లి కేవలం జగన్ చాంబర్ పైభాగాన ఉన్న ప్రాంతాన్నే చూపడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం అవుతూనే ఉంది. ఉదయం నుంచి మీడియాను లోనికి పంపకుండా ఇంటిలిజెన్స్ చీఫ్, సీఆర్డీఏ ఉన్నతాధికారులు మంత్రాంగం నడిపారు. బయటకు ఏం చెప్పాలనే దానిపై ఒక కథ సిద్ధం చేసుకుని స్పీకర్ వచ్చిన తర్వాత ఆయన నోటితో ఏసీ పైపు లైను లీకైందన్న విషయాన్ని బయట పెట్టించారు. ఎలక్ట్రికల్ కాండ్యూట్ ద్వారా నీరు వచ్చింది అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత గదికి ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపు ద్వారా నీరు వచ్చింది. జగన్ చాంబర్లో విద్యుత్ పనుల కోసం ఒక పైపును దించడం వల్ల పైకప్పులో నుంచి ఆ పైపు ద్వారా కూడా నీరు వచ్చింది. దాన్ని ఇంజినీరింగ్ అధికారులు వెంటనే సరి చేశారు. 4వ బ్లాక్ ఒక సెక్షన్లో కిటికీ తెరిచి ఉండడం వల్ల ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం వల్ల జల్లుతో నీరు వచ్చింది. – చెరుకూరి శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ (మంగళవారం రాత్రి) కిటికీల్లోంచి జల్లు వల్లే నీరొచ్చింది ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గదిలో కిటికీల్లోంచి వర్షపు జల్లు లోపలకు వచ్చింది. అసెంబ్లీ భవనంలో ఎలాంటి లీకేజీలు జరగలేదు. – విజయరాజు, అసెంబ్లీ కార్యదర్శి (బుధవారం ఉదయం) ఏసీ పైపును ఎవరో కట్ చేశారు అసెంబ్లీ భవనంపైన ఏసీ పైపు కట్ అవడం వల్లే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చాంబర్లోకి నీరు వెళ్లింది. ఎవరో కావాలని ఈ పైపును కట్ చేశారు. అన్ని పైపులు బాగానే ఉండగా ఒక్క ఈ పైపునే ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? – స్పీకర్ కోడెల శివప్రసాదరావు, (బుధవారం మధ్యాహ్నం) ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర కావాలని అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి చాంబర్‌కు వెళ్లే ఏసీ పైపును కట్ చేయించి రాద్ధాంతం చేస్తున్నారు. రాజధానిలో ఏదో జరిగి పోయిందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా చేస్తున్నారు. నవ నిర్మాణ దీక్ష విజయవంతమవడంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. – మంత్రులు నారాయణ, నక్కా ఆనంద్‌బాబు (బుధవారం సాయంత్రం) ఆ లీకేజీపై మాట్లాడరా? జగన్మోహన్రెడ్డి చాంబర్లోకి నీరు వచ్చిన విషయంపై ఎదురుదాడి మొదలు పెట్టిన మంత్రులు సచివాలయంలో రెండు, నాలుగు బ్లాకుల్లోకి నీరు ఎలా వచ్చిందనే విషయంపై మాత్రం నోరు మెదపడం లేదు. అసెంబ్లీ లీకేజీపై స్పీకర్ ద్వారా సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేయించి సచివాలయంలో నెలకొన్న అదే పరిస్థితిపై కావాలని మాట దాట వేస్తోంది. దీన్నిబట్టే ప్రభుత్వ వాదన తప్పని స్పష్టమవుతోంది. వాస్తవానికి సచివాలయం నిర్మాణం మొదలైనప్పటి నుంచి నాణ్యతపై అనుమానాలు ఉన్నా యి. -
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు.
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు కూల్చివేతలు జరగగా, తాజాగా సీఆర్డీఏ అధికారులు బుధవారం క్యాంటీన్‌ను కూల్చివేశారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు క్యాంటీన్ కూల్చివేయడాన్ని క్యాంటిన్ నిర్వహకులు తప్పుబట్టారు. మంత్రి నారాయణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహించేందుకు మూడేళ్లు లీజుకు ఇచ్చారని, రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాక...ఇప్పుడు కూల్చివేతలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాల్లో సచివాలయంలో పలు బ్లాక్‌లను కూల్చి అధికారులు మళ్లీ కట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఆర్డీఏ అధికారులు మాత్రం కూల్చివేతలపై పెదవి విప్పడం లేదు. కాగా వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఇప్పటికే పలుసార్లు మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
‘తాత్కాలికం’ ఖర్చు రూ.515 కోట్లు
⇒ వెలగపూడిలో సిద్ధమైన అసెంబ్లీ, శాసన మండలి భవనం ⇒ అసెంబ్లీ హాల్లో సభ్యులకు 231 సీట్లు, మండలిలో 90 సీట్లు ⇒ సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం వెల్లడి సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి రూ.515.19 కోట్లు ఖర్చు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం తెలిపింది. 45 ఎకరాల విస్తీర్ణంలో ఆరు భవనాల సివిల్ పనుల కోసం రూ.200.98 కోట్లు, విద్యుత్, ఏసీ, ఫర్నీచర్ వంటి పనుల కు రూ.314.21 కోట్లు వినియోగించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1, 2 భవనాల నిర్మాణానికి రూ.67.02 కోట్లు, 3, 4 భవనాల నిర్మాణానికి రూ.66.98 కోట్లు, 5, 6 భవనాల నిర్మాణానికి రూ.66.98 కోట్లు వినియోగించినట్లు తెలిపింది. భవన సముదాయంలో మౌలిక వసతులకు రూ.113.38 కోట్లు, 1, 2 భవనాల్లో ఎలక్ట్రికల్, లైటింగ్, ఏసీ, ఫర్నీచర్, ఆడియో, వీడియో వ్యవస్థ, బీఎంఎస్, ఐబీఎంఎస్, కాన్ఫరెన్స్ హాల్ కోసం రూ.66.15 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. 3, 4, 5, 6 భవనాల్లో ఇవే పనులకు రూ.134.68 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఆరు భవనాల్లోనూ పబ్లిక్ అడ్రస్ వ్యవస్థ ఉంటుందని, ముఖ్యమంత్రి భవనం నుంచి అన్ని భవనాలకు స్పీకర్ల ద్వారా ఒకేసారి సందేశం పంపే ఏర్పాటు ఉన్నట్లు తెలిపింది. భవన సముదాయంలో అంతర్గత రోడ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్, ఎక్స్టర్నల్ లైటింగ్, 12 కిలోమీటర్ల నీటి పైపులైను, ట్రీట్మెంట్ ప్లాంట్, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు వివరించింది. హంగులతో అసెంబ్లీ సచివాలయ సముదాయంలో నిర్మించిన శాసనసభ, శాసనమండలి భవనాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దినట్లు సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం పేర్కొంది. అసెంబ్లీ హాల్లో సభ్యులకు 231 సీట్లు, శాసన మండలిలో సభ్యులకు 90 సీట్లతోపాటు స్పీకర్ పోడియాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేసినట్లు వివరించింది. నిర్మాణ సమయంలో సగటున రోజుకు 2,400 మంది కార్మికులు, 130 మంది ఇంజనీర్లు పనిచేశారని తెలియజేసింది. -
టెంపరరీ సచివాలయం నిర్మాణంలో కొత్త ట్విస్ట్
-
పనిచేద్దామని వస్తే.. ఇన్ని కష్టాలా?
* తాత్కాలిక సచివాలయంలో విధులు లేవు.. వెతలే! * ఇద్దరు కలిస్తే సమస్యలపైనే చర్చ * ఫోన్లలో ఇక్కట్ల జర్నీ గురించి ఏకరువు * వసతి, ప్రయాణం, భోజనం అన్నీ బాదుడే * ఆవేదనలో ఉద్యోగులు సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయానికి తరలివచ్చిన ఉద్యోగులు ఇక్కడ సౌకర్యాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నో సమస్యలున్నా సర్దుకుని మరీ ఇష్టంగా చేసేందుకు వచ్చినా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. సర్కారు వైఫల్యాలతో తలదాచుకోవడం దగ్గర్నుంచి ప్రయాణం, కూర్చోవడానికి చాంబర్, సీటు, భోజనం, మరుగుదొడ్డి ఇలా అన్ని విషయాల్లోనూ వారి ఇక్కట్లు వర్ణనాతీతం. విధులు చేసేందుకు కూడా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో కార్యాలయంలో భోజన విరామం, ప్రయాణ సమయాల్లో సహా ఎక్కడ ఇద్దరు ఉద్యోగులు కలిసినా తమ ఇబ్బందులను వెళ్లబోసుకుంటున్నారు. కలిసి ఉన్న ఉద్యోగులు తమ ఇబ్బందులు పరస్పరం చెప్పుకొంటుంటే హైదరాబాద్‌లోని తమ వారికి ఫోన్లు చేసి తమ కష్టాల జర్నీ గురించి చెప్పుకోవడం గమనార్హం. ఇక్కడ అన్ని ఏర్పాట్లూ చేశామని, కచ్చితంగా వచ్చి పనిచేయాలని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన మాటలు నమ్మి వచ్చి అవస్థలు పడుతున్నామని పలువురు ఉద్యోగులు తమ వారికి వివరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర్నుంచి వెలగపూడి సచివాలయానికి చేరుకునే వరకు తమ జర్నీ అంతా అవస్థలమయమేనని వాపోతున్నారు. చుక్కలు చూపుతున్న ఇంటి అద్దెలు... సచివాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం రెయిన్‌ట్రీ పార్కులో వసతి కల్పించింది. పురుషులకు ఇళ్లు వెదుక్కోవడం ఇబ్బందికరంగా మారింది. రాజధాని ప్రాంతంలో అద్దెలు చుక్కలను చూపిస్తున్నాయి. అందులోను బ్యాచిలర్స్‌కు అద్దెకు ఇచ్చేది లేదని తెగేసి చెబుతుండటంతో మరీ ఇబ్బందికరంగా మారింది. పిల్లల చదువులు, అయినవారి ఉద్యోగాలను వదిలి ఫ్యామిలీని హైదరాబాద్ నుంచి తీసుకురావటం ఇబ్బందికరం కావటంతో కొందరు ఒంటరిగానే ఇక్కడికి వచ్చారు. అలాగని పెళ్లైన బ్యాచిలర్లకు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇళ్లు దొరికే పరిస్థితి లేదు. ఇళ్లు దొరకక మిత్రుని ఇంట్లో తలదాచుకున్నానని ఒకరు, బంధువుల ఇంటికి వెళ్లానని మరొకరు, బస్టాండ్ డార్మెట్రీలో పడుకున్నానని మరొకరు తలదాచుకోవడానికి పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు. వసతి ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఖర్చులు తడిసిమోపెడు... విధి నిర్వహణకు వెళ్లాలంటే విజయవాడ నుంచి బస్సుకు వెళ్లేందుకు రూ.23, వచ్చేందుకు రూ.23 చార్జీల మోత తప్పడంలేదు. అదే గుంటూరు నుంచి వచ్చి పోయేందుకు రూ.60కి పైమాటే. భోజనానికి రూ.50 నుంచి రూ.70 ఖర్చుపెట్టాల్సిందే. ఇలా రోజువారీ ప్రయాణ, భోజన, వసతి ఏర్పాట్లకు అవుతున్న ఖర్చులను తలుచుకుని ఉద్యోగులు గుండెలు బాదుకుంటున్నారు. తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెడితే వారి విధులు కష్టంతో కాకుండా ఇష్టంతో చేసే పరిస్థితి ఉంటుందని పలువురు చెబుతున్నారు. సీఎం దృష్టికి మహిళా ఉద్యోగుల సమస్యలు – రాజకుమారి హామీ తక్కువ సమయంలోనే సచివాలయాన్ని నిర్మించి ఇక్కడ విధులకు ఉద్యోగులను తీసుకురావడంతో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హామీ ఇచ్చారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మహిళా ఉద్యోగులకు మంగళవారం పండ్లు, కనకదుర్గమ్మ కుంకుమ, లలితా సహస్రనామం పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల సమస్యతో తాము పడుతున్న ఇబ్బందులను పలువురు మహిళా ఉద్యోగులు రాజకుమారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పురుషులు, మహిళలకు ఒకేచోట మరుగుదొడ్లు ఉండటం, అవీ తగినన్ని లేకపోవడం, ఫ్యాన్లు, ఏసీలు సరిగ్గా లేకపోవడం తదితర సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఉదయం సచివాలయానికి వచ్చి రాత్రి ఇంటికి వెళ్లే ఉద్యోగులు కనీసం కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరకులు కొనుగోలు చేసుకునేందుకు కూడా వీలులేని పరిస్థితి ఉందని చెప్పారు. వారి కోసం సచివాలయ ప్రాంతంలోనే రైతు బజార్, సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని సీఎంను కోరతానని అన్నారు. లేకుంటే వారం రోజుల్లో తానే ఏర్పాటు చేస్తానని రాజకుమారి వెల్లడించారు. పోలీసుల పడిగాపులు.. సచివాలయంలో ఉద్యోగులు విధులకు తరలిరావడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా నుంచి కనీసం 50 మందికి తగ్గకుండా కానిస్టేబుళ్లను సచివాలయ ప్రాంతానికి విధులకు తరలించారు. విజయవాడ, గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయం చేరుకునే దారి పొడవునా పోలీసులు గస్తీ కాశారు. వెలగపూడి సచివాలయ ప్రాంతంలోనూ పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సచివాలయ ప్రాంతంలో తాత్కాలిక గుడారాలు వేసుకున్న పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించారు. మండే ఎండలోను, దుమ్ము, ధూళిలోను పోలీసులకు పడిగాపులు తప్పలేదు. -
తాత్కాలిక సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
-
వెలగపూడిలో 3 నుంచి పూర్తి స్థాయి విధులు
* భవనాలు, అంతస్తులు, గదుల వారీగా శాఖలకు కేటాయింపు * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్/అమరావతి: ఏళ్ల తరబడి హైదరాబాద్ సచివాలయంతో పెనవేసుకున్న అనుబంధం వచ్చే నెల 3వ తేదీ నుంచి తెగిపోతోంది. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తూ వెలగపూడి సచివాలయంలో పనిచేసేందుకు వెళ్లిపోతున్న ఉద్యోగులు.. ఇందులో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అక్టోబర్ 3 నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పూర్తి స్థాయి విధులు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ జీవో జారీ చేశారు. ఈ జీవోతోపాటు వెలగపూడి సచివాలయ భవనాల్లో శాఖల వారీగా గదులను అధికారులకు కేటాయించారు. వివరాలివీ.. ఒకటో భవనం గ్రౌండ్ ఫ్లోర్: సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం గ్రౌండ్ ఫ్లోర్: మున్సిపల్, హోం, ఇంధన-మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం తొలి అంతస్తు: ఆర్థిక, ప్రణాళికా శాఖల అధికారులు, ఉద్యోగులు మూడో భవనం గ్రౌండ్ ఫ్లోర్: టెలికం, ప్లే స్కూలు, మీ-సేవ, పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ, అసోసియేషన్స్, ఐటీ డేటా సెంటర్, ఎన్ఐసీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, ఏపీటీఎస్, లైబ్రరీలు మూడో భవనం తొలి అంతస్తు: బీసీ, మైనార్టీ, సాంఘిక, గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ, యువజన సర్వీసు శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వ్యవసాయ, పశుసంవర్థక, అటవీ పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం తొలి అంతస్తు: ఉన్నత విద్య, ఐటీ, మాధ్యమిక విద్య, జలవనరులు, ఆర్ఎస్ఏడీ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, కార్మిక, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం తొలి అంతస్తు: రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, డిప్యూటీ పే అండ్ అకౌంట్ ఆఫీస్ అధికారులు, ఉద్యోగులు -
కేంద్రమే పోలవరం ప్రాజెక్టును అప్పగించింది
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయిస్తే త్వరగా పూర్తవుతాయని కేంద్రం తమకు అప్పగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తాత్కాలిక సచివాలయంలో గురువారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పనులు చేయించమంటే... నేనేదో కాంట్రాక్టర్‌ను నిర్ణయించానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారని ఆక్షేపించారు. దేశంలోనే మొదటిసారిగా అధునాతనమైన యంత్రాల ద్వారా పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. కిలోమీటరు వెడల్పున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 50 లక్షల క్యూసెక్కుల జలాలు వదులుతామని తెలిపారు.ప్రతి సోమవారం ‘పోలవారం’గా మారుతుందని, పనులు పర్యవేక్షించేందుకు తాను ప్రతి సోమవారం వెళతానని ఆయన తెలిపారు. ఏమి లాభమో చెప్పండి? ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయనే ప్రచారంలో నిజం లేదని చంద్రబాబు చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక రాయితీల కారణంగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పటం వట్టి గాలి మాటలన్నారు. హోదావల్ల ఏమి లాభమో చెప్పండి? అని ప్రశ్నిం చారు. 2015-16 సంవత్సరానికి దేశంలో ఆర్బీఐ 954 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెడితే అందులో ఆంధ్రప్రదేశ్‌కు 15.8 శాతం పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దసరాకు తాత్కాలిక సచివాలయంలో తన కార్యాలయం ప్రారంభిస్తానని సీఎం తెలిపారు. డిసెంబరు నాటికి అసెంబ్లీ, శాసన మండలి భవనాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ‘సాక్షి’పై విమర్శలు..: సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం తాత్కాలిక సచివాలయంలో విలేకరులతో మాట్లాడు తూ సాక్షి కథనంపై అక్కసు వెళ్లగక్కారు. ‘నేను అవినీతి పరుడినంట. రూ.52 వేల కోట్లు స్విస్‌చాలెంజ్‌లో తిన్నానంట. తప్పుడు రాతలు రాస్తున్నారు’ అంటూ విమర్శించారు. వెసులుబాటు కోసమే ప్యాకేజీ: సీఎం సాక్షి,విజయవాడ: ప్రత్యేక హోదాకు సమానమైన స్థాయిలో నిధులిస్తామని కేంద్రం చెప్పడంతో.. రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుందన్న భావనతో ప్యాకేజీకి అంగీకరించానని చంద్రబాబు చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), ఆయన కుమారుడు అవినాష్, కాంగ్రెస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కడియాలు బుచ్చిబాబులు గురువారం విజయవాడ గుణదల బిషప్ గ్రాసీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన సభలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. -
'వారం రోజుల్లో తాత్కాలిక సచివాలయం నుంచే విధులు'
-
'వారం రోజుల్లో తాత్కాలిక సచివాలయం నుంచే విధులు'
విజయవాడ: వారం రోజుల్లో తాత్కాలిక సచివాలయం నుంచే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి సీఎం కూడా తాత్కాలిక సచివాలయం నుంచే పాలన సాగిస్తారని తెలిపారు. అలాగే శుక్రవారం నుంచి 8 గ్రామాల్లో ప్లాట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. రాజధానికి సంబంధించిన డిజైన్లు డిసెంబరు వరకు ఫైనల్ చేస్తామని, జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అన్నారు. మాకి సంస్థ ఇచ్చిన డిజైన్లపై విమర్శలు రావడంతో రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. -
వెలగపూడి ‘గూడు’పుఠాణి!
-
వెలగపూడి ‘గూడు’పుఠాణి!
♦ హడావుడిగా కట్టి.. రహస్యంగా కూల్చేశారు ♦ ఇరుకు గదులు, వాస్తుపై మంత్రుల ఫిర్యాదులు ♦ కట్టిన గదులు రహస్యంగా కూల్చివేత ♦ భారీ సెక్యూరిటీ.. గేట్లకు తాళాలు... ♦ అసలే ‘తాత్కాలికం..’ దానికేబోలెడు వ్యయం ♦ మార్పులతో మరింత వృథా ఖర్చు.. ♦ తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ఇప్పట్లో లేనట్లే... సాక్షి, అమరావతి: అది అసలే తాత్కాలిక సచివాలయం... దానికే రూ.700 కోట్ల ఖర్చు. అది కూడా హడావుడిగా నిర్మాణం.. అంతా లోపాల మయం. దాంతో అది ఎవరికీ పనికిరాకుండా పోయింది. గదులు ఇరుకుగా ఉన్నాయని, వాస్తుదోషాలున్నాయని మంత్రులు చేస్తున్న ఫిర్యాదులతో ముఖ్యమంత్రి తలబొప్పికట్టింది. అందుకే భారీ మార్పులకు తెరతీశారు. సచివాలయంలోని 2, 3, 4, 5 భవనాల్లో మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులను కూలదోస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసం లోనికి ఎవరినీ రానివ్వకుండా బయట తాళాలువేశారు. భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేశారు. ఈ మార్పులు చేర్పులకు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కానున్నది. తాత్కాలిక సచివాలయం కోసం ఇన్ని మార్పులు చేయడం, ఇంత పెద్ద ఎత్తున వృథా చేయడం చూసి అధికారులు విస్తుపోతున్నారు. మంత్రుల అసహనం.. ఫిర్యాదులు.. తమకు కేటాయించిన గదులు ఇరుకుగా ఉన్నాయని మంత్రి నారాయణ వద్ద యనమల అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల తరువాత సచివాలయాన్ని సందర్శించిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన గదులలో మార్పులు చేయాల్సిందిగా మంత్రి నారాయణకు ఫోన్లో సూచించినట్లు తెలిసింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు కూడా తమ పేషీలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో భారీ మార్పులు హడావుడిగా చేపట్టిన నిర్మాణాల్లో లోటుపాట్లు ఉన్నాయని మంత్రులు, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేయటంతో మార్పులు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కృష్ణా పుష్కరాల్లో అంతా బిజీగా ఉంటారు కనుక కూల్చివేసి తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయమని సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం రెండవ భవనంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. అన్ని భవనాలకంటే ముందుగా ప్రారంభించిన ఐదవ భవనంలో పెద్ద ఎత్తున మార్పులకు తెరతీశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఐదవ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులన్నింటినీ పగులగొట్టారు. ప్రతి మంత్రికి 225 అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఉండేలా మార్పులు చేపట్టారు. దీంతో రెండు గదులు కలిపి ఒక మంత్రికి కేటాయించేందుకు మధ్యలో ఉన్న గోడను పగులగొడుతున్నారు. తాత్కాలిక సచివాలయంలో ఎక్కడెక్కడ గోడలు పగులగొట్టాలో ఇంజనీర్లు మార్క్చేశారు. ఆ గోడలపై ‘టోటల్ రిమూవ్డ్’ అంటూ పేపర్‌పై రాసి అంటించారు. గోడలు కూల్చిన ప్రాంతంలో డోర్లు, వాష్‌బేషిన్, బాత్ రూంలు ఎక్కడెక్కడ ఉండాలో మార్కర్‌తో రాశారు. ఇంజనీర్లు సూచించిన చోట్ల గోడలను కార్మికులు పగులగొడుతున్నారు. ఇవన్నీ బయటకు తెలియకుండా ఉండేందుకు ఆయా భవనాలకు తాళాలు వేసి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎవరినీ లోనికి పంపొద్దని గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గోడలు కూల్చి తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చుచేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భవనాలకు ఇప్పుడు చేస్తున్న భారీ మార్పులు చూస్తుంటే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ పాలన ఇప్పుడే ప్రారంభమయ్యే అవకాశమే లేదని తేలిపోయింది. ప్రభుత్వ హడావుడి నిర్ణయాలతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. -
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మార్పులు
-
వెలగపూడి సచివాలయంలో మార్పులు
అమరావతి: వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మరోసారి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సచివాలయంలో రెండో బ్లాక్‌తో పాటు అయిదో బ్లాక్‌లోని మంత్రుల పేషీలను కార్మికులు పగులగొడుతున్నారు. రెండో బ్లాకులో ముగ్గురు మంత్రులు, ఐదో బ్లాకులో ముగ్గురు మంత్రులకు పేషీలను కేటాయించారు. అయితే ఇవి ఇరుకుగా ఉన్నాయంటూ మంత్రులు పేషీలను తిరస్కరించారు. దీంతో గోడలు కూల్చివేసి పేషీల విస్తీరణం పెంచుతున్నారు. దీంతో ఇదివరకే ప్రారంభించిన పేషీల్లో మార్పులు చేస్తున్నారు. గోడలు కూల్చివేసి పేషీల విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. పేషీల్లో వాస్తు లోపాలు ఉన్నాయని, దానికి అనుగుణంగానే పలు పేషీల గోడలను అధికారులు పగులగొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పేషీల ప్రారంభోత్సవాలు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రతి మంత్రికి అదనంగా 200 అడుగుల కార్యాలయాలు కేటాయిస్తున్నారు. దీనివల్ల సచివాలయ నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. -
సచివాలయం నిర్మాణ పనుల్లో ప్రమాదం
-
తాత్కాలిక సచివాలయంలో కూలిన గోడ
సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలోని మొదటి భవనం మొదటి అంతస్తులో సైడ్ గోడ కూలి జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు కూలీలు గాయపడ్డారు. మొదటి అంతస్తు చివరి భాగం కుడి వైపున అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం సిమెంట్ ఇటుకలతో గోడ నిర్మిస్తుండగా ఉన్నట్లుండి కూలింది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న దేవేందర్‌పై ఇటుకలు పడటంతో వెన్నెముక, కాలు విరిగింది. రామచంద్ర ఓకై కాలు, చెయ్యి విరగడంతో పాటు తలకు తీవ్రగాయమైంది. ధర్మేంద్ర, జాయరాం, కిషోర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. కాగా, తాత్కాలిక సచివాలయం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిర్మాణ పనుల కోసం పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. మే నెలలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందడంతో పని ఒత్తిడి పెరిగిందని, భద్రత లేదని కూలీలంతా ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మరో కూలీ మృతి చెందాడు. ఈ ప్రాంతం లూజ్ సాయిల్ కావడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మందడం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోపిరెడ్డి భవనం కుంగిపోవడం కలకలం రేపింది. ఆ తర్వాత తాత్కాలిక సచివాలయం రెండవ భవనం గ్రౌండ్‌ఫ్లోర్ కింది భాగం కుంగింది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి మరమ్మతులు చేశారు. -
వెలగపూడికి శాఖల తరలింపు మళ్లీ వాయిదా
విజయవాడ: వెలగపూడికి రెండో విడత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 5, 15వ తేదీల్లో శాఖలను తరలించాలనుకున్న ముహూర్తం మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. 19న ఐదుగురు మంత్రుల ఛాంబర్లు, 6 శాఖల కార్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 19న నాలుగో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌ను ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు అప్పగించనున్నారు. ఇదే తేదీన రెవిన్యూ, పౌరసరఫరాలు, సహకర శాఖ, విపత్తు నిర్వహణ, అటవీ శాఖల కార్యాలయాలను ప్రారంభించనున్నారు. -
ముహూర్తం మారింది
29న 5వ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్ ప్రారంభం సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయం నుంచి పాలనా కార్యకలాపాల ముహూర్తం మారింది. ఈ నెల 27 నుంచి పాలన ప్రారంభిస్తామని గతంలో చెప్పడం తెలిసిందే. అనుకున్న సమయంలో..పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తాన్ని సీఎం మార్చారు. మరో రెండురోజులు వాయిదా వేశారు. ఈ నెల 29న ఐదవ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభిస్తామని, అదేరోజు పాలన మొదలుపెడతామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనుల్ని ఆయన శనివారం పరిశీలించారు. ఐదో బ్లాక్‌ను పరిశీలించి.. పనుల పురోగతి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జూలై 6న ఐదవ బ్లాక్‌లోని మొదటి అంతస్తు, 15న 2, 3, 4 బ్లాక్ల్లోని గ్రౌండ్‌ఫ్లోర్లు, 21వ తేదీ 2, 3, 4 బ్లాక్ల్లోని మొదటి అంతస్తులను ప్రారంభించి పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కుంగిన బ్లాక్‌ను పరిశీలించకుండానే వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వద్ద రెండో బ్లాక్‌లోని కుంగిన ఫ్లోర్‌ను పరిశీలించకుండానే ముఖ్యమంత్రి అక్కడ నుంచి వెనుదిరిగారు. కుంగిన నిర్మాణంపై ప్రముఖంగా పత్రికలు రాయటం, ప్రసారం చేయడంపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అయితే దాన్ని తాజాగా ‘‘ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్నచిన్న పొరబాట్లు సహజం. అదేదో జరిగిందని భూతద్దంలో చూపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకోవటం పొరబాటు. ఏదైనా ఉంటే చెబితే సరిచేసుకుంటాం’’ అని అన్నారు. అలా అంటూనే ఆయన సాక్షిపైన, ప్రతిపక్షపార్టీపైన అక్కసును వెళ్లగక్కారు. శనివారం పనులు పరిశీలించిన సీఎం కుంగిన రెండో బ్లాక్‌లోని ఫ్లోర్‌ను పరిశీలించకుండానే వెనుదిరిగి వెళ్లిపోవటం గమనార్హం. -
ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహించాలి: ఆర్కే
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో నేల కుంగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... రాజధానిలో మొన్న ఇళ్ళు కుంగాయి. నేడు తాత్కాలిక సచివాలయం ప్లోరింగ్ కుంగింది. నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఈ భూమి రాజధానికి పనికిరాదు అని చెప్పినా స్వార్ధం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి మాటలను పెడ చెవిన పెట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కనీసం బాబు చదివి ఉన్నా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పంతాలకు పోకుండా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేయాలి.' అని డిమాండ్ చేశారు. కాగా సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో గురువారంనాడు మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. -
అమరావతిలో కలకలం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం పనుల్లో కలకలం రేగింది. సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కొంతమేర నేల కుంగిపోయింది. మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రులకు, ప్రిన్సిపాల్ కార్యదర్శలకు కేటాయించనున్న బ్లాకులో నిర్మాణ లోపాలు బయట పడడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి జూన్ 27కల్లా వెలగపూడికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించడంతో తాత్కాలిక సచివాలయం పనులు హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తమకు కొంత సమయం కావాలని ఉద్యోగులు కోరినా చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులు వచ్చి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరుకు తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి చేయాలని భావించారు. కాగా ఈ వార్తల్ని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లికార్జున ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదు అమరావతి రాజధాని నగర పరిధిలో తుళ్లూరు మండలం వెలగపూడి దగ్గర నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్సు ప్రాంతంలో నేల కుంగినట్టు సాక్షి టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న వార్తలో వాస్తవం లేదని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ డాక్టర్ ఎ. మల్లికార్జున తెలిపారు. నిర్మాణ పనులు చేపట్టే ముందుగానే సాయిల్ టెస్టింగ్ చేసి అనుకూలమైన చోటే పనులు చేపట్టామన్నారు. రెండో బ్లాకులో ఫ్లోరింగ్ దెబ్బతిన్నదని సాక్షి చానల్ ఇచ్చిన వార్త అవాస్తవమన్నారు. నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మల్లికార్జున పేర్కొన్నారు. నేల కుంగడంతో మళ్లీ పనులు చేస్తున్నట్టు ఇచ్చిన వార్తలోనూ వాస్తవం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ భవనాల కాంప్లెక్సులో ఎక్కడా నేల కుంగలేదన్నారు. కొత్తగా ఎటువంటి పనులు ప్రారంభించలేదని, లూజ్ సాయిల్ వల్లే అలా జరిగి ఉండవచ్చని అనుమానం సరికాదన్నారు. -
చెడ్డపనులు చేయాలన్నది హ్యూమన్ సైకాలజీ: బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదని, తాత్కాలిక రాజధాని నగరానికి రావాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలో పర్యటించి.. అక్కడ కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతికి రావల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ వచ్చేంతవరకు ఉన్న రోడ్లనే అభివృద్ధి చేస్తామని, సీసీ టీవీ కెమెరాలతో శాంతి భద్రతలను పటిష్ఠంగా కాపాడతామని ఆయన అన్నారు. ఏవైనా ఫంక్షన్ జరిగినా నాలుగు డ్రోన్స్‌తో నిఘా పెడతామన్నారు. మూడోనేత్రం ప్రతి ఒక్కరినీ వాచ్ చేస్తుందని చెప్పారు. అవకాశం ఉంటే చెడ్డపనులు చేయాలన్నది హ్యూమన్ సైకాలజీ అని చెప్పారు. డబ్బు తేలిగ్గా సంపాదించాలని కూడా అనుకుంటారని, ఈ విషయంలో ప్రపంచంలో మనుషులంతా ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అనేక దేశాల్లో సిస్టమ్స్ అందరినీ పనిచేయిస్తున్నాయని, ఇక్కడ మాత్రం సిస్టమ్స్ ఇష్టానుసారం చేసేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. జూన్ 27 తర్వాత అమరావతి నుంచే మొత్తం పాలన సాగాలని ఎప్పటినుంచో చెబుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ సదుపాయాలు ఏం కల్పిస్తున్నారో, అసలు పిల్లల భవిష్యత్తు ఏంటో ఏమీ తెలియకుండా ఎలా వెళ్లాలని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో పదేళ్ల పాటు ఉండే అవకాశం ఉన్నా, ఇప్పటికిప్పుడే తాత్కాలిక ఏర్పాట్లతో అక్కడకు వెళ్లడం ఎందుకన్న విమర్శలు వినవస్తున్నాయి. -
'మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు'
హైదరాబాద్: తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తే అమరావతికి వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని సచివాలయ ఉద్యోగులు తేల్చిచెప్పారు. అంతేకాక స్థానికత, హెచ్ఆర్, రోడ్ మ్యాప్ పై వెంటనే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లో సచివాలయ ఉద్యోగులు కృష్ణయ్య, వెంకట్ రాంరెడ్డి, భావన తదితరులు మీడియాతో మాట్లాడారు. కనీస మౌలిక వసతులు కల్పించకుండా వెళ్లమంటే ఎలా? అని వారు ప్రశ్నించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అయోమయం సృష్టిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు వాపోయారు. కాగా, వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సౌకర్యాలు లేవని హైదరాబాద్ లో ఉంటే కుదరదని ఏపీ సచివాలయ ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
సచివాలయం తరలింపుపై గందరగోళం
విజయవాడ: రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయంపై మరో గందరగోళ నిర్ణయం. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం అదనపు భవనాల టెండర్లను రద్దుచేస్తున్నట్లు ఏపీ సర్కారు శనివారం రాత్రి ప్రకటించింది. అదే సమయంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో అద్దె భవనాల్లో హెచ్ వోడీల కార్యాలయాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. జూన్ 27 నాటికి ఉద్యోగులందరినీ ఏపీ రాజధానికి తరలించాలని భీష్మించుకున్న బాబు సర్కార్.. అద్దె భవనాల్లో హెచ్ వోడీ, సిబ్బందికి కార్యాలయాలు ఏర్పాటుచేసి, ఇప్పటికే వెలగపూడిలో నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విజయవాడ, గుంటూరుల్లో అద్దె భవనాలను గుర్తించామని, ఉద్యోగుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు. నిజానికి తాత్కాలిక సచివాలయ నిర్మాణం కంటే ముందే అద్దె భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ అంతలోనే మనసుమార్చుకుని ఎల్ ఎండ్ టీ సంస్థకు భారీ టెండర్లు కట్టబెట్టి వెలగపూడిలో తాత్కాలిక భవనాల పనులు ప్రారంభించారు. 45 ఎకరాల స్థలంలో నిర్మితం అవుతోన్న తాత్కాలిక భవనాలకుతోడు మరికొన్ని అదనపు భవనాలకూ టెండర్లు పిలిచారు. అయితే వెలగపూడిలో కనీస సౌకర్యాలు లేనందున అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులెవ్వరూ ముందుకురావడంలేదు. దీంతో తాత్కాలిక భవనాల టెండర్లు రద్దుచేయడంతోపాటు, అద్దెభవనాలవైపు మొగ్గుచూపింది సర్కారు. లోటు బడ్జెట్ లోనూ దుబారా ఖర్చులకు ఏమాత్రం వెనుకాడనంటోన్న బాబు ప్రభుత్వం.. తాజా అనాలోచిన నిర్ణయంవల్ల ప్రజలపై మరో రూ.300 కోట్ల భారాన్ని మోపనుంది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల స్పందనలు తెలియాల్సిఉంది. -
ఏపీ సెక్రటేరియట్ పనులు వేగవంతం
హైదరాబాద్ : వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయానికి వెళ్లి పనిచేసే రోజు దగ్గరపడుతుండటంతో ఉద్యోగులు, కార్యాలయాల తరలింపు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో పరిపాలన పరంగా ఏ కేటగిరీ ఉద్యోగులను ఎంత మందిని ఉంచాలి, ఎవరికి మినహాయింపు ఇవ్వాలనే అంశాలపై సీఎస్ శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మరో పక్క వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేసే రోజులు, సమయానికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఫైలును రూపొందించింది. ఏడాది పాటు వెలగపూడి సచివాలయంలో వారానికి ఐదు రోజులు పనిదినాలను అమలు చేయాలని ఫైలులో పేర్కొంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పనిదినాలు ఏడాది పాటు అమలుకు ఆదేశాలను జారీ చేయాలని నిర్ణయించారు. అలాగే పనివేళల్లో కూడా మార్పులు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయాల పనివేళలు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకుగా ఉంది. అయితే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకుగా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించారు. ఉన్నతాధికారుల సమీక్షలో వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా శనివారం తరలింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని సీఎస్ నిర్ణయించారు. -
తాత్కాలిక సచివాలయం ప్రారంభం
► తాత్కాలిక సచివాలయంలోని ఒక గదిలోకి సీఎం ► తెల్లవారుజామున సభలో మంత్రుల పొగడ్తల హంగామా ► తొలి సంతకం ఫైలు పైనా హడావుడి తాత్కాలిక సచివాలయ శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో స్పీకర్ కోడెల, మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి, రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్, ఉద్యోగ సంఘ నేత అశోక్‌బాబు తదితరులు సచివాలయానికి ముందస్తు ప్రారంభోత్సవం సాక్షి, విజయవాడ బ్యూరో : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం చేశారు. ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగో బ్లాకులోని ఒక గదిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల తర్వాత ఆరు నెలల దాకా ముహూర్తాలు లేవనే కారణంతో నిర్మాణం సగంలో ఉండగానే ఈ ముందస్తు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆఘమేఘాల మీద సిద్ధం చేసిన గదిలోకి శాస్త్రోక్తంగా పూజలు జరిపి ముఖ్యమంత్రి ప్రవేశించారు. ఆ గదిలో ఉత్తరాభిముఖంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుని మంత్రులు, ఉన్నతాధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు శాలువాలు, పూల బొకేలతో అభినందించారు. సీఎం ఒక్కరే హాజరు... ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా వస్తారని అందరూ భావించినా ఆయన ఒక్కరే రావడం విశేషం. గృహ ప్రవేశం కార్యక్రమాలను దంపతులు కలిసి నిర్వహించాల్సివుండగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే ఆ పని పూర్తి చేశారు. ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సభలో రైతుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు అందరితోనూ చంద్రబాబు మాట్లాడించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే సభకు అధ్యక్షత వహించగా రాజధానికి భూములిచ్చిన ఇద్దరు రైతులు, స్థానిక ఎంపీపీ పద్మలత, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ శ్రీకాంత్, ఎన్జీఓల సంఘం నేత అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడారు. మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు, పుల్లారావు చంద్రబాబును ఆకాశానికెత్తే రీతిలో పొగడ్తలతో ముంచెత్తేశారు. పల్లె రఘునాథ్‌రెడ్డి ఏకంగా చంద్రబాబును ఇంద్రుడితో పోల్చుతూ అప్పట్లో దేవుడైన ఇంద్రుడు అమరావతిని నిర్మించగా ఇప్పుడు చంద్రబాబు ఈ అమరావతిని నిర్మిస్తున్నాడని ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సైతం చంద్రబాబును పొగడటానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు సభ జరిగింది. తెల్లవారుజామున సభ పెట్టడమే విచిత్రమైతే అందులోనూ మంత్రులు, అధికారుల పొగడ్తలు మరీ శృతిమించడంతో హాజరైన రైతులు విసుగు చెందారు. తొలి ఫైలు.. హైరానా! సచివాలయంలో ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రితో తొలి ఫైలుపై సంతకం చేసే విషయంలో అధికారులు హైరానా పడ్డారు. తొలుత ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్ ఒక ఫైలును తీసుకురాగా దాన్ని చదివిన ముఖ్యమంత్రి సంతకం చేయడానికి నిరాకరించారు. దీంతో ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి రాజమౌళి రెండో విడత రుణమాఫీ సొమ్ము రూ.3,200 కోట్లు విడుదల చేసే దస్త్రాన్ని అప్పటికప్పుడు స్వదస్తూరితో సిద్ధం చేశారు. అందులోనూ ముఖ్యమంత్రి మళ్లీ మార్పులు చేయడంతో రాజమౌళి మళ్లీ స్వదస్తూరితో మరో కాగితాన్ని సిద్ధం చేసి తీసుకురాగా దానిపై చంద్రబాబు సంతకం చేశారు. -
తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన
వెలగపూడిలో భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు జూన్ 15లోగా నిర్మాణం పూర్తి.. ఉద్యోగుల తరలింపు సాక్షి, విజయవాడ బ్యూరో: గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతం వెలగపూడి గ్రామంలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే తాత్కాలిక సచివాలయానికి బుధవారం ఉదయం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జూన్ 15వ తేదీలోగా దీని నిర్మాణం పూర్తి చేసి ఉద్యోగులను ఇక్కడికి తరలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతి నగరం నుంచే పరిపాలన సాగుతుందన్నారు. రాష్ట్రం లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన ఉంటుందన్నారు. భవనాన్ని 8 అంతస్తుల్లో నిర్మించేందుకు నిర్ణయించామనీ, రాజధాని నిర్మాణం పూర్తయ్యాక ఇక్కడ పనిచేసే ఉద్యోగులను వారివారి కార్యాలయాలకు పంపి ఈ భవనాన్ని ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తామన్నారు. తనతో పాటు మంత్రులు విజయవాడలో, అధికార యంత్రాంగం హైదరాబాద్‌లో ఉంటే పరిపాలన సజావుగా జరగదన్నారు. అలాగని ఉన్నపళంగా ఉద్యోగులు, ఉన్నతాధికారులందరినీ ఒకేసారి విజయవాడ రమ్మనడం కూడా సరికాదన్నారు. వీరందరి కోసం రాజధాని తొలి నిర్మాణంగా రూ.200 కోట్లతో ప్రభుత్వ భవన సముదాయాన్ని నిర్మించతలపెట్టామని చంద్రబాబు చెప్పారు. ఇది తాత్కాలిక సచివాలయం కాదని, శాశ్వత భవన సముదాయమన్నారు. భావితరాల భవిష్యత్తుకు వేదిక వెలగపూడిలో నిర్మిస్తున్న భవనం భావితరాల భవిష్యత్తుకు వేదికని బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దేశ విదేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో రూ.4.70 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఎంవోయూలు కుదుర్చుకున్నారని చెప్పారు. కొంతమంది రాష్ట్ర అభివృద్ధిని చూసి భరించలేక పోతున్నారని విమర్శించారు. అభివృద్ధికి సహకరించే మనసు లేకపోతే గమ్మునుండాలన్నారు. రాజధాని రైతులకు ఏవైతే హామీలిచ్చామో వాటన్నిటినీ అమలు చేస్తామని సీఎం అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే 15 వేల మంది ఉద్యోగుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని గుంటూరు, విజయవాడకు చెందిన స్థానికులు ఇళ్ల అద్దెలను గణనీయంగా పెంచవద్దంటూ విజ్ఞప్తి చేశారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ కొత్త భవనం భవిష్యత్తులో వివిధ అవసరాలకు వినియోగించుకునేలా ఉంటుందన్నారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుధ్ధప్రసాద్,మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పైడికొండల మాణిక్యాలరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి,తదితరులు ప్రసంగించారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం.. పవిత్ర స్థలాల నుంచి తెచ్చిన మట్టి, జలాలను చల్లిన అనంతరం మోకరిల్లి నమస్కరించారు. అంతా తాత్కాలికమే.. తాత్కాలిక సచివాలయానికి రూ.200 కోట్లు వెచ్చించనుండటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం రెండు, మూడు ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వం చివరకు తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. టెండర్లు ఆహ్వానించింది. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు 12 శాతం ఎక్సెస్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టింది. మార్కెట్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేలు ఖర్చవుతుంటే, తాజాగా చదరపు అడుగుకు రూ.3,500 వెచ్చించేందుకు సిద్ధమయ్యింది. పట్టిసీమ, పోలవరం, గోదావరి ప ష్కరాల పనులకు, ప్రత్యేక విమానాల్లో పర్యటనలకు బాబు ప్రభుత్వం వందల కోట్ల ను దుబారా చేస్తుండటంపై ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం మాట మార్చింది. నిన్నటివరకు తాత్కాలిక సచివాలయం అన్న చంద్రబాబు.. శంకుస్థాపన సందర్భంగా శాశ్వత భవన సముదాయమం టూ చెప్పుకొచ్చారు. అదే అయితే తాత్కాలికమని ఎందుకు చెప్పారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శాశ్వత సముదాయానికి హ డావుడి శంకుస్థాపన దేనికన్న ప్రశ్నా తలెత్తుతోంది. -
తాత్కాలికంగా 15 వేల ఇళ్లు కావాలి
తాత్కాలిక సచివాలయం ప్రాంతంలో ఉద్యోగుల కోసం తాత్కాలికంగా 15 వేల ఇళ్లు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇక్కడకు ఉన్నపళంగా అన్నీ వదులుకుని రావాలంటే కష్టమే గానీ.. చరిత్రను కూడా మనం గుర్తుంచుకో వాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ఇప్పటికే మనం చాలా నష్టపోయామని.. అప్పట్లో ఉద్యోగులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని.. అయినా విభజన చేయడం, చేసిన తీరు అందరికీ బాధ కలిగించిందని చెప్పారు. అక్కడి నుంచే మనకు కష్టాలు మొదలయ్యాయన్నారు. 2019లో కూడా ఏపీకి లోటుబడ్జెట్టే ఉంటుందని ఆయన చెప్పారు. అయితే అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నామని, దానికి సింగపూర్ ప్రభుత్వం కూడా ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని చెప్పారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో కూడా అందరూ అమరావతి గురించే మాట్లాడుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం నుంచి పరిపాలన సజావుగా సాగితే ప్రజలకు అన్నివిధాలా లాభం వస్తుందని అన్నారు. ఈ బాధ్యత ఉద్యోగుల మీద కూడా ఉందని.. మనమంతా కలిసి పనిచేయాలని చెప్పారు. -
తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన
తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికి బుధవారం ఉదయం 8.23 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకువును స్థాపించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మందడం-మల్కాపురం గ్రామాల మధ్య వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో 196 సర్వే నంబరు నుంచి 216 సర్వేనంబర్లలోని భూముల్లో తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 45 ఎకరాల భూమిలో.. 28.4 ఎకరాల్లో భవన నిర్మాణాలు, 17 ఎకరాల్లో పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయనున్నారు. 197 సర్వేనంబరు భూమిలో సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు. తాత్కాలిక సచివాలయాన్ని సకల హంగులతో నిర్మించనున్నారు. 6 భవనాలపైనా పోలార్ ప్యానళ్లను ఏర్పాటుచేసి, సచివాలయానికి అవసరమయ్యే విద్యుత్‌నంతటినీ సమకూర్చాలని సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. సుమారు 5 వేల మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ భవనాలకు ప్రత్యేకంగా నీటిసరఫరా వ్యవస్థను, మురుగునీటి శుద్ధిప్లాంటును నెలకొల్పుతున్నారు. -
నేడు ఏపీ తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన
ఉదయం 8.23కి తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు వెలగపూడిలో 197 సర్వే నంబరులో ఎంపిక తాడికొండ/సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు ఉదయం 8.23 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. మందడం-మల్కాపురం గ్రామాల మధ్య వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో 196 సర్వే నంబరు నుంచి 216 సర్వేనంబర్లలోని భూముల్లో తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. దీనిలో 204, 209 సర్వే నంబర్లకు సంబంధించి ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో మొత్తం 45 ఎకరాల భూమిలో.. 28.4 ఎకరాల్లో భవన నిర్మాణాలు, 17 ఎకరాల్లో పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయనున్నారు. 197 సర్వేనంబరు భూమిలో సీఎం బుధవారం శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన ప్రాంతాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట సీఎం భద్రతాధికారి జోషి, సీఆర్డీఏ అదనపు కమిషనర్, జేసీ చెరుకూరి శ్రీధర్ తదితరులున్నారు. సకల హంగులతో నిర్మాణం: తాత్కాలిక సచివాలయాన్ని సకల హంగులతో నిర్మించనున్నారు. 6 భవనాలపైనా సౌర ఫలకాల్ని అమర్చి సచివాలయానికి అవసరమయ్యే విద్యుత్‌నంతటినీ సమకూర్చాలని సీఆర్డీఏ ప్రణాళిక రూపొం దించింది. సముదాయంలో భారీఎత్తున పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సుమారు ఐదువేల మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ భవనాలకు ప్రత్యేకంగా నీటిసరఫరా వ్యవస్థను, మురుగునీటి శుద్ధిప్లాంటును నెలకొల్పుతున్నారు. ఈ ఆరు భవనాలను కాంక్రీట్‌తోనే నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
17న సచివాలయానికి శంకుస్థాపన
♦ ఉదయం 8.23 గంటలకు ముహూర్తం ♦ తాత్కాలిక సెక్రటేరియెట్ నిర్మాణానికి అధిక మొత్తం టెండర్లకు కేబినెట్ ఆమోద ముద్ర సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి అంచనా వ్యయాన్ని 12 శాతానికి పెంచి, టెండర్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎక్సెస్ టెండర్లకు ఆమోదముద్ర వేసిన మరుక్షణమే శంకుస్థాపన నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నెల 17వ తేదీన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. సీఎం అధ్యక్షతన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, నారాయణ మీడియాకు వివరించారు. ► తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం. చదరపు అడుగుకు రూ.3,350 చొప్పున నిర్మాణ పనులు ఆ కంపెనీలకు అప్పగింత. 12 శాతం అదనంగా రూ.180 కోట్ల అంచనా వ్యయం రూ.201 కోట్లకు పెంపు. ► ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు భవనాల నిర్మాణం జూన్ 15లోగా పూర్తయ్యేలా చర్యలు. ఈ భవనాల నిర్మాణానికి ఈ నెల 17వ తేదీ ఉదయం 8 గంటల 23 నిమిషాలకు శంకుస్థాపన. తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాలకు రూ.60 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.25 కోట్లు మంజూరు. ► సియాచిన్‌లో మృతి చెందిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం. అతడి కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం. ► ఇబ్బందుల్లో ఉన్న 35 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో రాయితీ. ఒక్కో యూనిట్‌కు రూ.1.50 పైసలు రిబేట్ ఇవ్వడానికి అంగీకారం. + అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిష్ట్రేషన్ చట్ట సవరణకు నిర్ణయం.+ క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.500 కంటే ఎక్కువకు కోట్ చేసిన టెండర్లన్నీ రద్దు. వీటన్నింటికీ మళ్లీ షార్ట్ టెండర్లు పిలిచి అవి ఖరారయ్యే వరకూ డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి. + తూర్పుగోదావరి జిల్లా ఏటిపాక, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, అందుకవసరమైన 44 పోస్టుల మంజూరు. ►కర్నూలు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వ భూముల కేటాయింపు. -
'వందల కోట్ల దోపిడీకి బాబు తెర తీశారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం టెండర్లలో ప్రభుత్వం నిబంధనలను తుంగలోకి తొక్కిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాత్కాలిక సచివాలయం పేరుతో వందల కోట్ల దోపిడీకి చంద్రబాబు తెర తీశారని ఆయన ఆదివారమిక్కడ విమర్శించారు. కాగా తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ ఎల్ అండ్ టీ..సచివాయంలో నాలుగు భవనాలు...అలాగే షాపుర్జీ పల్లోంజీ సంస్థ రెండు భవనాలు నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్నాయి. చదరపు అడుగుకు రూ.3,350కి నిర్మించేందుకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.350 అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా నోటిఫికేషన్ ప్రకారం చదరపు అడుగు రూ.3వేలుగా ప్రభుత్వం నిర్థారించగా, 5 శాతానికి మించి ఎక్కువ చెల్లించకూడదనే నిబంధన ఉన్నా సర్కార్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. chandrababu naidu, ysrcp mla alla ramakrishna reddy, మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ తాత్కాలిక సచివాలయం -
ఎల్&టీకి 4,షాపుర్జీ పల్లోంజీకి 2..
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి టెండర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సీఆర్డీఏ సలహామండలితో సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పలు కంపెనీలు అధికమొత్తంలో టెండర్లు దక్కించుకున్నాయి. నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ ఎల్ అండ్ టీ..సచివాయంలో నాలుగు భవనాలు...అలాగే షాపుర్జీ పల్లోంజీ సంస్థ రెండు భవనాలు నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్నాయి. చదరపు అడుగుకు రూ.3,350కి నిర్మించేందుకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.350 అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా నోటిఫికేషన్ ప్రకారం చదరపు అడుగు రూ.3వేలుగా ప్రభుత్వం నిర్థారించగా, 5 శాతానికి మించి ఎక్కువ చెల్లించకూడదనే నిబంధన ఉన్నా సర్కార్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. కాగా ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 180 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా మంగళగిరి మండంలోని వెలగపుడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టనుంది. 26 ఎకరాల స్థలంలో ఏపీ తాత్కాలిక సచివాయలం నిర్మాణం జరగనుంది. -
అసలే తాత్కాలికం.. అందులోనూ 24% అదనం
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ టెండర్లు 24 శాతం ఎక్సెస్‌కు ఖరారయ్యేలా ఉన్నాయి. పన్నులు, అదనపు మొత్తం కలిపి 24 శాతం చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. ఎల్అండ్టీకి రెండు ప్యాకేజిలు, షాపుర్జీ అండ్ పల్లోంజి సంస్థకు ఒక ప్యాకేజి అప్పగించాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత అధిక మొత్తం కోట్ చేసినందున రీ టెండర్లకు వెళ్తామని అధికారులు ప్రకటించారు. అయితే, రీటెండర్లకు వెళ్లొద్దని.. ఈ సంస్థలతోనే ఒప్పందాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు బుధవారం సమావేశం కానున్నారు. -
ఇలాగైతే కట్టలేం..
♦ తాత్కాలిక సచివాలయంపై చేతులెత్తేసిన నిర్మాణ సంస్థలు! ♦ 4 నెలల్లో పూర్తి చేయడం కష్టమంటున్న కంపెనీలు ♦ 12న శంకుస్థాపన అనుమానమే సాక్షి, విజయవాడ బ్యూరో: తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి బ్రేకు పడేలా ఉంది. తాము నిర్దేశించిన రేటుకే నిర్మాణాన్ని చేపట్టాలని, పైగా నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతుండడంతో నిర్మాణ సంస్థలు వెనకడుగు వేసినట్లు సమాచారం. దీంతో ఈ నెల 12న తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం కోసం ఆరు భవనాల నిర్మాణానికి సంబంధించిన మూడు ప్యాకేజీలకు గానూ రెండు ప్యాకేజీల్లో ఎల్ అండ్ టీ, ఒక ప్యాకేజీలో షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఎల్1గా నిలిచాయి. సీఆర్డీఏ చదరపు అడుగును రూ.3 వేలతో నిర్మించాలని నిర్దేశించగా.. ఈ సంస్థలు రూ.4 వేల నుంచి రూ.4,500కి (35% వరకు ఎక్సెస్) కోట్ చేశాయి. నిబంధనల ప్రకారం ఐదు శాతం ఎక్సెస్‌కే టెండర్లను ఆమోదించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిర్మాణ సంస్థలు కోట్ చేసిన మేరకు టెండర్లను ఆమోదిస్తే నిర్మాణ వ్యయం రూ.60 కోట్లు పెరిగి రూ.240 కోట్లకు చేరుతుంది. రూ.60 కోట్లు పెంచే పరిస్థితి లేదంటున్న ప్రభుత్వం.. టెండర్లో నిర్దేశించిన రేటుకే నిర్మాణాన్ని చేపట్టాలని, పైగా టెండర్లో పేర్కొన్నట్టుగా ఆరు నెలల్లో కాకుండా నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వం పేర్కొన్న రేటుకు నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేయలేమని కంపెనీలు తేల్చిచెప్పినట్లు తెలిసింది. ‘టెండర్లో ఆరు నెలలని పేర్కొన్నా.. జూన్‌లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పబట్టే మేము ఎక్సెస్ కోట్ చేశాం. చదరపు అడుగుకు రూ.3 వేల చొప్పున నాలుగు నెలల్లో వెలగపూడి లాంటి చోట్ల నిర్మించడం కష్టం. నాలుగు నెలల్లో పూర్తి చేయాలంటే యంత్రాలు, నిర్మాణ సామగ్రి, కార్మికులకు రెండు రెట్ల అదనపు ఖర్చు అవుతుంది. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో అయితే లేబర్‌కు ఇబ్బంది ఉండదు కానీ వెలగపూడికి వారిని తీసుకెళ్లాలంటే చాలా ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది..’ అని ఆ సంస్థలు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఆ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నప్పటికీ వారు అంగీకరించే పరిస్థితి లేదని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ టెండర్లు!: అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఈ సంస్థలు వెనుతిరిగితే మళ్లీ రీ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. తొలిసారే నిర్మాణ సంస్థలేవీ ముందుకు రాకపోవడంతో ఈ రెండింటినీ ఒప్పించి టెండర్లు వేయించారు. ఇప్పుడు అవి వెనక్కిపోతే వేరే వి వచ్చే పరిస్థితి లేదని సీఆర్డీఏ వర్గాలంటున్నాయి. అలాగని అధిక రేటును ఆమోదించడమూ కష్టమేనంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
180 కోట్లతో తాత్కాలిక సచివాలయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 180 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా మంగళగిరి మండంలోని వెలగపుడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేయాలని ప్రకటించింది. సెప్టెంబర్ కల్లా నిర్మాణం పూర్తి చేయాలని నిబంధనలను విధించింది. సుమారు 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. 26 ఎకరాల స్థలంలో ఏపీ తాత్కాలిక సచివాయలం నిర్మించనున్నట్లు సీఆర్డీఏ బృందం వివరించింది.