అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత చంద్రన్న బీమా పథకానికి ‘ప్రధానమంత్రి చంద్రన్న బీమా’గా పేరు మార్చినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు.
పథకంలో భాగంగా 2.20 కోట్ల అసంఘటిత కార్మికుల తరఫున 8 నెలల ప్రీమియంకు గాను రూ.235 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 70 ఏళ్లు దాటిన పాలసీదారులను చంద్రన్న బీమా పథకం నుంచి తొలగించి, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వివరాలకు కాల్‌సెంటర్‌కు (నంబర్ 155214) ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు.