
అసలే తాత్కాలికం.. అందులోనూ 24% అదనం
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ టెండర్లు 24 శాతం ఎక్సెస్‌కు ఖరారయ్యేలా ఉన్నాయి. పన్నులు, అదనపు మొత్తం కలిపి 24 శాతం చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. ఎల్అండ్‌టీకి రెండు ప్యాకేజిలు, షాపుర్‌జీ అండ్ పల్లోంజి సంస్థకు ఒక ప్యాకేజి అప్పగించాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత అధిక మొత్తం కోట్ చేసినందున రీ టెండర్లకు వెళ్తామని అధికారులు ప్రకటించారు.
అయితే, రీటెండర్లకు వెళ్లొద్దని.. ఈ సంస్థలతోనే ఒప్పందాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు బుధవారం సమావేశం కానున్నారు.