విజయవాడ: వెలగపూడికి రెండో విడత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 5, 15వ తేదీల్లో శాఖలను తరలించాలనుకున్న ముహూర్తం మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. 19న ఐదుగురు మంత్రుల ఛాంబర్లు, 6 శాఖల కార్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ నెల 19న నాలుగో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌ను ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు అప్పగించనున్నారు. ఇదే తేదీన రెవిన్యూ, పౌరసరఫరాలు, సహకర శాఖ, విపత్తు నిర్వహణ, అటవీ శాఖల కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
వెలగపూడికి శాఖల తరలింపు మళ్లీ వాయిదా
Published Sat, Jul 2 2016 8:30 PM | Last Updated on Sat, Aug 18 2018 8:10 PM
Advertisement
Advertisement