
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబర్ 31లోగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం తాత్కాలిక సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు, ఈ–ఆఫీస్ అంశాలపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల్లో నవంబర్ 15లోగా, జిల్లా కార్యాలయాల్లో నవంబర్ 30లోగా.. డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో డిసెంబర్ 31లోగా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు.