CS Dinesh Kumar
-
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్–సీఈవో) రామ్ ప్రకాశ్ సిసోడియాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితమే ఐఏఎస్ సీనియర్ అధికారి అయిన సిసోడియాను రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్‌గా నియమించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. సిసోడియా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తాజా ఉత్తర్వులతో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటారు. -
అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబర్ 31లోగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం తాత్కాలిక సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు, ఈ–ఆఫీస్ అంశాలపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల్లో నవంబర్ 15లోగా, జిల్లా కార్యాలయాల్లో నవంబర్ 30లోగా.. డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో డిసెంబర్ 31లోగా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు. -
పేదల ఆహార సమస్య మీకు పట్టదా?
రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఏర్పాటుచేయకపోవడంపై మండిపడ్డ సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్‌లో నియామకాలు త్వరితగతిన పూర్తిచేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల ఆహార సమస్య మీకు పట్టదా? అంటూ మండిపడింది. కరువు రాష్ట్రాల్లో రైతులకు ప్రభుత్వాల నుంచి ఉపశమనం లభించడం లేదంటూ స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎన్.వి.రమణతో కూడిన ధర్మాసనం కొంతకాలంగా విచారణ జరుపుతోంది. జాతీయ ఆహార భద్రత చట్టానికి లోబడి రాష్ట్రాల్లో వీలైనంత త్వరగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని, కమిషన్‌లో నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలని మార్చి 22న ధర్మాసనం 10 రాష్ట్రాలను ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలు వివరాలతో ఏప్రిల్ 26న ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్) స్వయంగా హాజరు కావాలంది. ఈ మేరకు బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా ఆయా రాష్ట్రాల సీఎస్‌లను ధర్మాసనం వివరాలు అడిగింది. ఐదు రాష్ట్రాలు నియామకాలు చేపట్టకపోవడం తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలలోగా పూర్తి చేయాలి.. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్‌కుమార్ విచారణకు హాజరయ్యారు. ఏపీ తరఫున న్యాయవాది గుంటూరు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్‌లో నియామకాలు చేపట్టేందుకు సెలక్షన్ కమిటీ వేశామని, మూడు నెలల్లో నియామకాలు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మదన్ బి.లోకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నియామకాలను నెలలోగా పూర్తిచేయాలని జస్టిస్ ఎన్.వి.రమణ ఏపీ సీఎస్‌ను ఆదేశించారు.