వెలగపూడి సచివాలయంలో మార్పులు | Minister's chambers being renovated again in velagapudi | Sakshi
Sakshi News home page

వెలగపూడి సచివాలయంలో మార్పులు

Published Sat, Aug 20 2016 10:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

Minister's chambers being renovated again in velagapudi

అమరావతి: వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మరోసారి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సచివాలయంలో రెండో బ్లాక్తో పాటు అయిదో బ్లాక్లోని మంత్రుల పేషీలను కార్మికులు పగులగొడుతున్నారు. రెండో బ్లాకులో ముగ్గురు మంత్రులు, ఐదో బ్లాకులో ముగ్గురు మంత్రులకు పేషీలను కేటాయించారు. అయితే ఇవి ఇరుకుగా ఉన్నాయంటూ మంత్రులు పేషీలను తిరస్కరించారు. దీంతో గోడలు కూల్చివేసి పేషీల విస్తీరణం పెంచుతున్నారు.

దీంతో ఇదివరకే ప్రారంభించిన పేషీల్లో మార్పులు చేస్తున్నారు. గోడలు కూల్చివేసి పేషీల విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. పేషీల్లో వాస్తు లోపాలు ఉన్నాయని, దానికి అనుగుణంగానే పలు పేషీల గోడలను అధికారులు పగులగొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పేషీల ప్రారంభోత్సవాలు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రతి మంత్రికి అదనంగా 200 అడుగుల కార్యాలయాలు కేటాయిస్తున్నారు. దీనివల్ల సచివాలయ నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement