ministers chambers
-
చాంబర్లు పరిశీలించిన మంత్రులు
సాక్షి, అమరావతి : కొత్త మంత్రివర్గంలో కొలువుతీరిన అమాత్యులకు చాంబర్ల (పేషీ) ఏర్పాటుకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. దీంతో పలువురు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లను పరిశీలించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం మూడు, ఐదు బ్లాక్‌లను పరిశీలించారు. జీఏడీ అధికారులతో చర్చించి తన చాంబర్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న (ఆదివారం) తన సతీమణి ఝూన్సీతో కలిసి ఏపీ సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌ను పరిశీలించారు. రెండవ బ్లాక్‌లోని మున్సిపల్ శాఖ మంత్రి పేషీని పరిశీలించిన ఆయన పేషీకి అవసరం అయిన మార్పులు సూచించారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా పరిశీలించారు. అలాగే దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అనుచరులు ఆయనకు కేటాయించిన పేషీని పరిశీలించారు. నాలుగో బ్లాక్‌లోని విద్యాశాఖ పేషీని ఆయనకు కేటాయించాలని జీఏడీ అధికారులను కోరారు. ఇక విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబ సభ్యులు వచ్చి విద్యాశాఖ మంత్రి చాంబర్‌ను పరిశీలించారు. -
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు.
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు కూల్చివేతలు జరగగా, తాజాగా సీఆర్డీఏ అధికారులు బుధవారం క్యాంటీన్‌ను కూల్చివేశారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు క్యాంటీన్ కూల్చివేయడాన్ని క్యాంటిన్ నిర్వహకులు తప్పుబట్టారు. మంత్రి నారాయణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహించేందుకు మూడేళ్లు లీజుకు ఇచ్చారని, రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాక...ఇప్పుడు కూల్చివేతలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాల్లో సచివాలయంలో పలు బ్లాక్‌లను కూల్చి అధికారులు మళ్లీ కట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఆర్డీఏ అధికారులు మాత్రం కూల్చివేతలపై పెదవి విప్పడం లేదు. కాగా వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఇప్పటికే పలుసార్లు మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మార్పులు
-
వెలగపూడి సచివాలయంలో మార్పులు
అమరావతి: వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మరోసారి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సచివాలయంలో రెండో బ్లాక్‌తో పాటు అయిదో బ్లాక్‌లోని మంత్రుల పేషీలను కార్మికులు పగులగొడుతున్నారు. రెండో బ్లాకులో ముగ్గురు మంత్రులు, ఐదో బ్లాకులో ముగ్గురు మంత్రులకు పేషీలను కేటాయించారు. అయితే ఇవి ఇరుకుగా ఉన్నాయంటూ మంత్రులు పేషీలను తిరస్కరించారు. దీంతో గోడలు కూల్చివేసి పేషీల విస్తీరణం పెంచుతున్నారు. దీంతో ఇదివరకే ప్రారంభించిన పేషీల్లో మార్పులు చేస్తున్నారు. గోడలు కూల్చివేసి పేషీల విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. పేషీల్లో వాస్తు లోపాలు ఉన్నాయని, దానికి అనుగుణంగానే పలు పేషీల గోడలను అధికారులు పగులగొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పేషీల ప్రారంభోత్సవాలు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రతి మంత్రికి అదనంగా 200 అడుగుల కార్యాలయాలు కేటాయిస్తున్నారు. దీనివల్ల సచివాలయ నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. -
'తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయండి'
-
'తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయండి'
హైదరాబాద్ : మాజీ మంత్రులు తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఈనెల 7వ తేదీలోగా తాజా మాజీ మంత్రులు అంతా ఛాంబర్లు ఖాళీ చేయాలని సూచించింది. అలాగే ఆయా శాఖల అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చింది. కాగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేశారని సమాచారం అందగానే మంత్రుల కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది (పర్సనల్ సెక్రటరీలు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, పర్సనల్ అసిస్టెంట్లు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు) తమ వ్యక్తిగత సరంజామాను సర్దుకుని వెళ్లిపోయిన విషయం తెలిసిందే.