
'తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయండి'
హైదరాబాద్ : మాజీ మంత్రులు తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఈనెల 7వ తేదీలోగా తాజా మాజీ మంత్రులు అంతా ఛాంబర్లు ఖాళీ చేయాలని సూచించింది. అలాగే ఆయా శాఖల అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చింది.
కాగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేశారని సమాచారం అందగానే మంత్రుల కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది (పర్సనల్ సెక్రటరీలు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, పర్సనల్ అసిస్టెంట్లు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు) తమ వ్యక్తిగత సరంజామాను సర్దుకుని వెళ్లిపోయిన విషయం తెలిసిందే.