chambers
-
ఒడిశా రహస్య గదుల్లో రూ.329 కోట్లు.. ఐటీ అధికారులు స్పష్టం
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులపై ఆదాయపన్ను శాఖ స్పందించింది. ఒడిశాలో శిథిలావస్థలో ఉన్న రహస్య భవనాల నుంచి రూ.329 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విలువైన పత్రాలు, డిజిటల్ సమాచారాన్ని స్థాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. నేరాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని అధారాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన ఆస్తులపై వరుస దాడులు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్ వారానికి పైగా కొనసాగింది. దాదాపు మూడు రాష్ట్రాల్లో 10 జిల్లాల్లో 30కి పైగా ప్రదేశాల్లో దర్యాప్తు చేపట్టింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఐటి అధికారులు పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి 40కి పైగా యంత్రాలను మోహరించారు. ధీరజ్ సాహు జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపికైన కాంగ్రెస్ ఎంపీ. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
కేంద్ర ఆర్థికమంత్రితో ఏపీ చాంబర్స్ ప్రతినిధుల భేటీ
లబ్బీపేట (విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన పలు అంశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం సమావేశమైన వారు పలు అంశాలపై చర్చించారు. మూడు పారిశ్రామిక కారిడార్లలో ప్రతిపాదించిన ఆరు ఇండస్ట్రీయల్ నోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, రాష్ట్రం కోసం ప్రతిపాదించిన మూడు మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కుల వేగవంతమైన అభివృద్ధి, ఫోర్ట్ లీడ్ ఎకానమీ అభివృద్ధికి తోడ్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్‌రేటింగ్, సిబిల్ స్కోర్లను సులభతరం చేయడం, ఆలస్యమైన చెల్లింపుల సమస్య, ఎంఎస్ఎంఈ నుంచి తప్పనిసరి సేకరణ వంటి అంశాలను పరిష్కరించాలని సూచించారు. విజయవాడ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని పునరుద్ధరించి, సర్వీసులు పెంచాలని, ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలతో కార్గో సౌకర్యాలను అందించాలని ఆమెను కోరారు. విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు ప్రతిపాదిత వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా అనేక విషయాలు చర్చించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ బి రాజశేఖర్, సీఐఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్, ఆల్ ఇండియా మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు వెలగపూడి సాంబశివరావు, ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాయన వెంకట్రావు, క్రెడాయ్ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు రమణరావు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, కోవే ఏపీ చాప్టర్ అధ్యక్షురాలు రాధిక ఉన్నారు. -
Secretariat : నూతన సచివాలయంలో చాంబర్లను స్వీకరించిన మంత్రులు ( ఫొటోలు)
-
Secretariat : నూతన సచివాలయంలో చాంబర్లను స్వీకరించిన మంత్రులు ( ఫొటోలు)
-
‘తొలి కేబినెట్ భేటీ బాగా జరిగింది’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం చాలా బాగా జరిగిందని పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా భేటీ సాగిందని తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, ముఖ్యమంత్రి ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. కేబినెట్ సమావేశానికి వచ్చిన మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మునూరు జయరాం, మాలగుండ్ల శంకరనారాయణ.. సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని బాధ్యతలు తీసుకుంటామని తెలిపారు. చాంబర్స్ కేటాయింపుపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: ఏపీ మంత్రులకు పేషీలు కేటాయింపు) -
కూల్చేద్దాం.. కట్టేద్దాం..!
* నేడు కొట్టేది యనమల టెంకాయ్ ఒక్కటే... * సచివాలయంలో ప్రవేశానికి మిగతా మంత్రులు ససేమిరా.. * ఇరుకు చాంబర్లలో పని చేయలేం * మార్పులు చేసేదాకా అడుగుపెట్టబోమని స్పష్టీకరణ * చాంబర్లను కూల్చి, పునర్నిర్మించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులంతా సొంత రాష్ట్రంలోనే పని చేయాలంటూ ప్రభుత్వం గుంటూరు జిల్లా వెలగపూడిలో హడావుడిగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంపై ఉద్యోగులే కాదు, మంత్రులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లు ఇరుకిరుగ్గా ఉన్నాయని, అందులో పనిచేయలేమని పలువురు మంత్రులు తేల్చిచెప్పారు. ఆ చాంబర్లలో కనీసం ఐదుగురు కూడా కూర్చునే పరిస్థితి లేదని మండిపడుతున్నారు. తమకు పెద్ద చాంబర్లను కేటాయించే వరకూ సచివాలయంలో అడుగుపెట్టబోమని స్పష్టంచేశారు. బుధవారం జరగాల్సిన సచివాలయ ప్రవేశ ముహూర్తాలను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల చాంబర్లను కూల్చివేసి, మరింత పెద్దగా పునర్నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్థిక మంత్రి యనమల కు కేటాయించిన చాంబర్ మాత్రమే కాస్త విశాలంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం ఆయన ఒక్కరే సచివాలయ ప్రవేశం చేయనున్నారు. యనమల కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తారని అధికారులు తెలిపారు. నేడే చివరి ముహూర్తం: సచివాలయంలో ప్రవేశానికి ప్రభుత్వం బుధవారాన్ని చివరి ముహూర్తంగా నిర్ణయిం చింది. హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉద్యోగులంతా ప్రభుత్వ ఆదే శాల మేరకు వెలగపూడి సచివాలయంలో కొబ్బరికాయలు కొట్టి వచ్చేందుకు మంగళవారం బయల్దేరి వెళ్లారు. అదే ముహూర్తంలో ఆయా శాఖల మంత్రులూ సచివాలయంలోని తమ చాంబర్లలో ప్రవేశించాల్సి ఉంది. అయితే, సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లను చూసి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా, ప్రత్తిపాటి, కొల్లు రవీంద్ర తదితరులు అసంతృప్తికి గురయ్యారు. మంత్రుల ఫిర్యాదుపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ స్పందించారు. మంత్రుల చాంబర్లను మరింతగా విస్తరించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ఆర్కిటెక్చర్ ప్రకారం మంత్రుల చాంబర్లను పెద్దవిగా చేయాలని అధికారులు నిర్ణయించారు. మార్పులకు రెండు నెలల సమయం ప్రస్తుతం ఒక్కో భవనంలో ఐదుగురు మంత్రుల చాంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ చాంబర్లను కూల్చివేసి, మరింత ఎక్కువ చదరపు గజాల్లో పునర్నిర్మించనున్నారు. ఐదు చాంబర్లను కలిపేసి మూడేసి చాంబర్లుగా మార్చనున్నారు. ఈ మార్పులు చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణా పుష్కరాలు ముగిసిన తరువాత చాంబర్లలో మార్పుల అనంతరమే వెలగపూడి సచివాలయంలో అడుగుపెట్టాలని మంత్రులు నిర్ణయించారు. సర్కారు ఉద్యోగుల విముఖత తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు పూర్తికాక ముందే హైదరాబాద్ నుంచి శాఖల తరలింపునకు ప్రభుత్వం జూన్ 29వ తేదీ నుంచి పలు ముహూర్తాలు నిర్ణయించింది. గత ముహూర్తాల్లో వెళ్లిన ఉద్యోగులు వెలగపూడి సచివాలయంలో కనీసం టాయిలెట్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, కూర్చొని పనిచేసే వాతావరణం లేకపోవడంతో కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. ఆర్థిక, రెవెన్యూతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు బుధవారం వెలగపూడి సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. వారు అక్కడ కొబ్బరికాయ కొట్టి తిరిగి హైదరాబాద్‌కు చేరకుంటారు. -
ఈ గదులు చాలడం లేదు: మంత్రులు
హైదరాబాద్: సచివాలయంలో తమ పేషీలకు కేటాయించిన చాంబర్లు ఏమాత్రం సరిపోవడంలేదని పలువురు తెలంగాణ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అగ్గిపెట్టెల్లాంటి చాంబర్లు, గదుల్లో కార్యకలాపాల నిర్వహణ కష్టసాధ్యమవుతోందని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో పేషీలో ఓఎస్డీ, పీఎస్, పీఏలతోపాటు పదిమందికిపైగా సిబ్బంది ఉన్నా ఒకే ఒక్క గదిని కేటాయించారని, దీనివల్ల ఫైళ్ల నిర్వహణ ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. గతంలో ఓఎస్డీ, పీఎస్‌లకు ప్రత్యేక చాంబర్‌ను కేటాయించేవారని, ఈసారి మాత్రం వారిద్దరితోపాటు అందరికీ కలిపి ఒకే గదిని కేటాయిస్తే ఫైళ్ల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. అదనపు గదులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, డాక్టర్ టి.రాజయ్య, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు జీఏడీ అధికారుల నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. -
మంత్రుల చాంబర్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో భవనాలను కేటాయిం పును అధికారులు వేగిరం చేశారు. ఏపీకి కేటాయించిన భవనాల్లో మంత్రుల చాంబర్ల కోసం అదనంగా గదులు కేటాయించారు. నార్త్ హెచ్ బ్లాక్‌లోని రెండో అంతస్తులో పశ్చిమ భాగంలోని అన్ని గదులనూ కేటాయించారు. ఇదే బ్లాక్ లోని 301 నుంచి 306, 335-340, 321-325, 314, 317-319 నంబరు గదులను, జే బ్లాక్‌లోని 407, 408, 409-424, ఏడో అంతస్తులోని 707, 708, 710, 730, 731, ఎనిమిదో అంతస్తులోని 817-821, ఎల్ బ్లాక్‌లోని ఏడో అంతస్తులో 703-711 నంబర్ల గదులను మంత్రులు, వారి సహాయకుల కోసం కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. -
'తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయండి'
-
'తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయండి'
హైదరాబాద్ : మాజీ మంత్రులు తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఈనెల 7వ తేదీలోగా తాజా మాజీ మంత్రులు అంతా ఛాంబర్లు ఖాళీ చేయాలని సూచించింది. అలాగే ఆయా శాఖల అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చింది. కాగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేశారని సమాచారం అందగానే మంత్రుల కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది (పర్సనల్ సెక్రటరీలు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, పర్సనల్ అసిస్టెంట్లు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు) తమ వ్యక్తిగత సరంజామాను సర్దుకుని వెళ్లిపోయిన విషయం తెలిసిందే.