ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులపై ఆదాయపన్ను శాఖ స్పందించింది. ఒడిశాలో శిథిలావస్థలో ఉన్న రహస్య భవనాల నుంచి రూ.329 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విలువైన పత్రాలు, డిజిటల్ సమాచారాన్ని స్థాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. నేరాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని అధారాలు లభ్యమైనట్లు వెల్లడించారు.
ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన ఆస్తులపై వరుస దాడులు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 6న ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్ వారానికి పైగా కొనసాగింది. దాదాపు మూడు రాష్ట్రాల్లో 10 జిల్లాల్లో 30కి పైగా ప్రదేశాల్లో దర్యాప్తు చేపట్టింది.
ఈ దాడుల్లో 100 మందికి పైగా ఐటి అధికారులు పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి 40కి పైగా యంత్రాలను మోహరించారు. ధీరజ్ సాహు జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపికైన కాంగ్రెస్ ఎంపీ.
ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment