
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం చాలా బాగా జరిగిందని పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అన్నారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం చాలా బాగా జరిగిందని పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా భేటీ సాగిందని తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, ముఖ్యమంత్రి ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు.
కేబినెట్ సమావేశానికి వచ్చిన మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మునూరు జయరాం, మాలగుండ్ల శంకరనారాయణ.. సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని బాధ్యతలు తీసుకుంటామని తెలిపారు. చాంబర్స్ కేటాయింపుపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: ఏపీ మంత్రులకు పేషీలు కేటాయింపు)