narrow chambers
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు.
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు కూల్చివేతలు జరగగా, తాజాగా సీఆర్డీఏ అధికారులు బుధవారం క్యాంటీన్‌ను కూల్చివేశారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు క్యాంటీన్ కూల్చివేయడాన్ని క్యాంటిన్ నిర్వహకులు తప్పుబట్టారు. మంత్రి నారాయణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహించేందుకు మూడేళ్లు లీజుకు ఇచ్చారని, రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాక...ఇప్పుడు కూల్చివేతలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాల్లో సచివాలయంలో పలు బ్లాక్‌లను కూల్చి అధికారులు మళ్లీ కట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఆర్డీఏ అధికారులు మాత్రం కూల్చివేతలపై పెదవి విప్పడం లేదు. కాగా వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఇప్పటికే పలుసార్లు మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మార్పులు
-
వెలగపూడి సచివాలయంలో మార్పులు
అమరావతి: వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మరోసారి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సచివాలయంలో రెండో బ్లాక్‌తో పాటు అయిదో బ్లాక్‌లోని మంత్రుల పేషీలను కార్మికులు పగులగొడుతున్నారు. రెండో బ్లాకులో ముగ్గురు మంత్రులు, ఐదో బ్లాకులో ముగ్గురు మంత్రులకు పేషీలను కేటాయించారు. అయితే ఇవి ఇరుకుగా ఉన్నాయంటూ మంత్రులు పేషీలను తిరస్కరించారు. దీంతో గోడలు కూల్చివేసి పేషీల విస్తీరణం పెంచుతున్నారు. దీంతో ఇదివరకే ప్రారంభించిన పేషీల్లో మార్పులు చేస్తున్నారు. గోడలు కూల్చివేసి పేషీల విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. పేషీల్లో వాస్తు లోపాలు ఉన్నాయని, దానికి అనుగుణంగానే పలు పేషీల గోడలను అధికారులు పగులగొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పేషీల ప్రారంభోత్సవాలు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రతి మంత్రికి అదనంగా 200 అడుగుల కార్యాలయాలు కేటాయిస్తున్నారు. దీనివల్ల సచివాలయ నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది.