ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చుతో వెలగ పూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం వర్షపు నీటితో తడిసిముద్దయింది. రెండు నెలల క్రితం తొలకరి జల్లులకే తాత్కాలిక అసెంబ్లీ భవనంలో నీరుగారితే, పలు గోడలకు పగుళ్లతో ఇటీవలే ఆ భవనంలో లోపాలు మరోసారి బయటపడ్డాయి.