ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం టెండర్లలో ప్రభుత్వం నిబంధనలను తుంగలోకి తొక్కిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం టెండర్లలో ప్రభుత్వం నిబంధనలను తుంగలోకి తొక్కిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాత్కాలిక సచివాలయం పేరుతో వందల కోట్ల దోపిడీకి చంద్రబాబు తెర తీశారని ఆయన ఆదివారమిక్కడ విమర్శించారు. కాగా తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ ఎల్ అండ్ టీ..సచివాయంలో నాలుగు భవనాలు...అలాగే షాపుర్జీ పల్లోంజీ సంస్థ రెండు భవనాలు నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్నాయి.
చదరపు అడుగుకు రూ.3,350కి నిర్మించేందుకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.350 అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా నోటిఫికేషన్ ప్రకారం చదరపు అడుగు రూ.3వేలుగా ప్రభుత్వం నిర్థారించగా, 5 శాతానికి మించి ఎక్కువ చెల్లించకూడదనే నిబంధన ఉన్నా సర్కార్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
chandrababu naidu, ysrcp mla alla ramakrishna reddy, మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ తాత్కాలిక సచివాలయం