వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం | Sharmila aim is to split YSRCP vote bank | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం

Published Thu, May 2 2024 5:47 AM | Last Updated on Thu, May 2 2024 5:56 AM

Sharmila aim is to split YSRCP vote bank

పాడేరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణ

చంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండా

ఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనం

పాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత వంతల సుబ్బారావుకు

ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపు

పాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌గా వంతల పోటీ

పోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిల

వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి 

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు చీల్చి, చంద్రబాబుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు స్పష్టమైంది. పాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి వంతల సుబ్బారావును విరమింపజేయడానికి షర్మిల చేసిన ప్రయత్నం షర్మిల ఎల్లో రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వైఎస్సార్‌సీపీ ఓట్లు కోసమే బుల్లిబాబుకి టికెట్‌ ఇచ్చామంటూ సుబ్బారావుతో షర్మిల మాట్లాడిన ఆడియో లీకవడంతో అడ్డంగా దొరికిపోయారు.

పాడేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా షర్మిల తొలుత వంతల సుబ్బారావును ఎంపిక చేశారు. ఇటీవల పాడేరులో జరిగిన సభలో కూడా సుబ్బారావే అభ్యర్థి అని ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి బుల్లిబాబు కాంగ్రెస్‌లోకి రావడంతో షర్మిల ప్లేటు ఫిరాయించారు. సుబ్బారావును కాదని బుల్లిబాబుకు టికెట్‌ ఇచ్చారు. దీంతో వంతల సుబ్బారావు రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీంతో షర్మిల సుబ్బారావుతో ఫోన్‌లో మాట్లాడారు. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు చీల్చేందుకే బుల్లిబాబుకి టికెట్‌ ఇస్తున్నామనీ..  పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. రెబల్‌గా బరిలో ఉంటే పార్టీలోకి మళ్లీ రాలేరంటూ హెచ్చరించారు. మీ సభలకంటే నా సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారంటూ సుబ్బారావు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న ఆడియోలో ఏముందంటే..

షర్మిల: నమస్తే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్ట్స్‌ టైమ్‌ తప్పకుండా ఆపర్చ్యూనిటీ ఇస్తాం. పార్టీలో సముచితమైన స్థానం, గౌరవమిస్తాను. మీరు నా సొంత అన్న లెక్క అన్నా. అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా. నేనైతే మీకియ్యాలనే అనుకున్నానన్నా. కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సీపీఎంకు ఇచ్చేశారు. ఈ సీటు బల్లిబాబుకు ఇమ్మన్నారు. మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో.. నా టీమ్‌ ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చెయ్యడం కూడా కరెక్ట్‌ కాదు కదా మీరు. అది వాస్తవం కాదు కదా అన్నా..
సుబ్బారావు: నేనేమీ ప్రచారం చెయ్యలేదు. నేనైతే ఎక్కడా మీ గురించి కానీ, పార్టీ గురించి కానీ ప్రచారం చెయ్యలేదు.

షర్మిల: సరే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్‌ కావద్దు. నెక్ట్స్‌టైమ్‌ తప్పకుండా అవకాశం ఉంటుంది. కమ్‌ బ్యాక్‌.
సుబ్బారావు: ఇంత అన్యాయం ఏంటి మేడం. ఏ రోజూ జెండా మోయని వాడికీ, పార్టీలో లేనివాడికీ ఇచ్చెయ్యడం వల్ల నాకు బాధ ఉంది. మరొక్క విషయం.. మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చెయ్యకపోయినా బాగుండేది. మీరు ప్రకటన చెయ్యడం వల్ల నేను డిసప్పాయింట్‌ అయ్యాను. మా వాళ్లు కూడా ఫీలయ్యారు.

షర్మిల: అన్నా.. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము. రెండూ కలిసొస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా.
సుబ్బారావు: నేనిప్పుడు చూశాను.. మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది. మొన్న నా జనాల్ని చూస్తే.. మీకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది వచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకుండా. వీడియోలు పెట్టమంటే పెడతాను. చూడండి. నేను ఓటు బ్యాంకు ఉన్నవాడిని. కానీ.. గ్రౌండ్‌ లెవల్‌లో రిపోర్ట్‌ లేదు అని అన్నారు. నా రిపోర్ట్‌ ఏంటో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చూడండి. నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను.

షర్మిల: అన్నా.. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఇంక కాంగ్రెస్‌ పార్టీ గురించి మర్చిపోండి.
సుబ్బారావు: మర్చిపోవాలంటే.. మర్చిపోతానిక.

షర్మిల: మర్చిపోండి.. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మళ్లీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్‌గా పోటీ చేసినాక, కాంగ్రెస్‌ పార్టీకి డ్యామేజ్‌ చేసినాక మళ్లా మీరు కాంగ్రెస్‌లోకి రాలేరు.
సుబ్బారావు: నా భవిష్యత్తే డ్యామేజ్‌ అయ్యింది. నాకింకేముంది మరి.

షర్మిల: అదే అన్నా.. ఇప్పుడు ఆలోచించుకోండి. మళ్లీ మీకు కాంగ్రెస్‌ పార్టీ అవసరము అని వెనక్కొస్తే మీకిక్కడ స్థానం ఉండదు.
సుబ్బారావు: మంచిదే కదా.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement