మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
-
రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ
నెల్లూరు(బారకాసు):
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అటవీశాఖలోని సామాజిక వన విభాగం, టెరిటోరియల్ సంయుక్తంగా నిర్వహించిన 67వ వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం వీఆర్సీ మైదానంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఒక్కొక్కరు ఏడాదికి ఆరు మొక్కలు చొప్పున నాటాలన్నారు. జిల్లాలో మొదట విడతగా ఐదు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి 20 వేల మొక్కలను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మొక్కలు నాటడంతో సరిపోదని వాటిని కనీసం రెండేళ్లపాటు సంరక్షించినప్పుడే దాని ప్రతిఫలం లభిస్తుందన్నారు. ఈసందర్భంగా అటవీశాఖాధికారులు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రి నారాయణ బహుమతులు ప్రదానం చేశారు. అలాగే మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామంటూ మంత్రి నారాయణ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందుగా నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మైదానం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయ ఆవరణలో మంత్రి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ అబ్దుల్‌అజీజ్, టీడీపీ నాయకులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, చాట్ల నరసింహరావు, అనురాధ, రంగమయూర్‌రెడ్డి, అన్చూరు వాణి, జ్యోత్సS్నలత, జేసీ ఇంతియాజ్, డీఎఫ్‌ఓ చాణక్యరాజు పాల్గొన్నారు.