టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం
సూళ్లూరుపేట: తెలుగుదేశం పార్టీ అవిర్భావంతోనే రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి రాజ్యాధికారం వచ్చిందని, వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెలుగులోకి వచ్చారని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక టీవీఆర్‌ఆర్ కల్యాణ మండపంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షతన బీసీ గర్జన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ వాకాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అన్నీ కార్పొరేషన్లు మూసివేసి కుర్చీలు లేకుండా చేశారని చెప్పారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరసా వెంకటరత్నయ్య, ఆనం జయకుమార్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, కొండేపాటి గంగాప్రసాద్, వేనాటి పరంధామిరెడ్డి, ఇసనాక హర్షవర్థన్‌రెడ్డి, నూనె మల్లికార్జున్ యాదవ్, కిలారి వెంకటస్వామినాయుదు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
స్త్రీ స్వశక్తి భవనాన్ని ప్రారంభయం
పట్టణంలోని కళాక్షేత్రంలో ఇటీవల సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన స్త్రీ స్వశక్తి భవనాన్ని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటిలో చెత్తతరలించేందుకు ఇటీవలే కొనుగోలు చేసిన ట్రాక్టర్లును కూడా వారు ప్రారంభించారు. చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మీ, వైఎస్ చైర్మన్ గరిక ఈశ్వరమ్మ, కమిషనర్ పాయసం వెంకటేశ్వర్లు, నాయుడుపేట ఆర్డీవో శీనానాయక్ ఉన్నారు. స్థానిక చెంగాళమ్మ ను మంత్రి నారాయణ దర్శించుకున్నారు.
వేనాటి ఇంట ఆర్భటంగా విందు
దొరవారిసత్రం: జెడ్పీ ఫోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి ఇచ్చిన విందుకు ఆదివారం మావిళ్లపాడు గ్రామానికి మంత్రి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పారిశ్రకవేత్త కొండేపాటి గంగప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పరసావెంకటరత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, పలువురు నాయకులు హాజరైయ్యారు. మంత్రి నారాయణ పర్యాట గత వారంలోనే ఖరారు అయింది. ఈ క్రమంలో దొరవారిసత్రంలోని జడ్పీ ప్రహారీ, అదనపు పాఠశాల భవనం, వ్యవసాయ శాఖు చెందిన భవనం తదితరవి మంత్రిచే ప్రారంభించే విధంగా స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు విజేత, సూళ్లూరుపేట చెంగాళమ్మ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ ముప్పాళ్ల వెంటేశ్వర్లురెడ్డి ప్లాన్ చేశారు. కాని తెలుగు దేశం మండల పార్టీ అధ్యక్షులు వేనాటి సురేష్‌రెడ్డి, మండల నాయకులను సంప్రదించకుండానే ప్రారంభం కార్యక్రమాలు ఏలా నిర్ణయిస్తారని కొందరు నాయకలు మంత్రి దృష్టికి తీసుకుపోయినందునే ఉన్నట్లు ఉండి దొరవారిసత్రంలోని ప్రారంభం కార్యక్రమాలు నిలిచిపోయినట్లు విమర్శలు వినిపించాయి. దానికి తోడు ఎప్పుడూ లేని విధంగా వేనాటి ఇంటి ఎంతో ఆర్భటంగా సూళ్లూరుపేట నియోజక వర్గ స్థాయిలో అందరి నాయకులను, మంత్రి నారాయణను ఆహ్వానించి వింధు ఇవ్వడం వెనుక అర్ధం ఏమిటని కొందరు అధికార పార్టీనాయకులే చెవులు కొరుక్కున్నారు. తొలుత వేనాటి ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్సీ వాకాటి, పారిశ్రామికవేత్త గంగప్రసాద్ మరి కొందరు నాయకులు మంత్రి రాక ముందే వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలకు తావిచింది. మొత్తానికి వేనాటి వింధు పలువురి మధ్య చర్చనీయమాంసంగా మారింది.