
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తయారుచేసేందుకు కృషి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాలు కేంద్రంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఆదివారం మంత్రి నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంత్రులు ఫ్లెమింగో బెలూన్లను ఎగురవేశారు.
–సూళ్లూరుపేట
Comments
Please login to add a commentAdd a comment