విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం | BJP MLA Vishnu Kumar Raju Gets Insulted | Sakshi
Sakshi News home page

విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం

Published Wed, Apr 4 2018 7:05 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

BJP MLA Vishnu Kumar Raju Gets Insulted - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

సాక్షి, అమరావతి : బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదురైంది. నవ్యాంధ్ర నూతన రాజధానిలో నిర్మించే రోడ్లు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయన్ని చూపించేందుకు ఎమ్మెల్యేలను మంత్రి నారాయణ తీసుకెళ్లారు. ఆ నేతల బృందంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. అయితే ఆయన భవన సముదాయాలను పరిశీలిస్తుండగా ఇతర నేతలతో కలిసి మంత్రి నారాయణ కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాంతో విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది.

అక్కడికి వచ్చిన నేతల్లో తానొక్కడినే ఉండిపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే కొంత సమయం అక్కడే ఉన్నారు. కారు వచ్చేంతవరకు ఎదురుచూసిన ఆయన కారు రాగానే అందులో వెళ్లిపోయారు. తాను కూడా నేతల బృందంలో ఉన్నానని భావించి నేతలు వెళ్లిపోయారని విష్ణుకుమార్ రాజు చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారా లేదా చెక్ చేసుకోకుండా మంత్రి నారాయణ సైతం ఎలా వెళ్లిపోతారన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement