
బీజేపీ వ్యవహారాల ఇంచార్జి వి.మురళీధరన్, ఏపీ సీఎం చంద్రబాబు
ఒకే బెడ్‌పై ఇద్దరిని పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారని, అవసరమైనన్ని బెడ్‌లు ఏర్పాటుచేయకపోవడం టీడీపీ సర్కార్ వైఫల్యమేనన్నారు.
అమరావతి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం అయ్యారని బీజేపీ జాతీయ కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు, ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో అవినీతి తీవ్రస్థాయిలో జరుగుతోందని ఆరోపించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో బెడ్‌పై నుంచి పడి బాలింత మరణించడం టీడీపీ అసమర్థతకు నిదర్శమన్నారు.
ఒకే బెడ్‌పై ఇద్దరిని పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారని, అవసరమైనన్ని బెడ్‌లు ఏర్పాటుచేయకపోవడం టీడీపీ సర్కార్ వైఫల్యమేనన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఏపీ ప్రభుత్వం పాకులాడుతోందన్నారు. పార్లమెంటులో టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం అభాసుపాలైందని వ్యాఖ్యానించారు.