తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ వద్ద స్పష్టత లేదని బిజెపీ
గుంటూరు : తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ వద్ద స్పష్టత లేదని బిజెపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ బాబు ఆరోపించారు. పచ్చని భూములను రియల్ ఎస్టేట్ మాఫీయా చేతుల్లో ఉండాలనుకోవటం సరికాదని ఆయన సోమవారమిక్కడ అన్నారు.
ఏపీ సర్కార్ మొండి వైఖరి అవలంభిస్తే బాధితుల తరపున న్యాయపోరాటం చేస్తామని శ్యాంకిషోర్ బాబు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ అని చెప్పి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. రైతు సాధికారిత సంస్థకు ఇస్తామన్న రూ.5వేల కోట్ల...విషయాన్ని ప్రజలకు వివరించాలని శ్యాంకిషోర్ బాబు డిమాండ్ చేశారు.