టీడీపీపై విష్ణుకుమార్‌ రాజు మండిపాటు | Center Gives Green Signal To Visaka Railway Zone Said By BJP MLA Vishnu Kumar Raju | Sakshi
Sakshi News home page

రైల్వే జోన్‌కు కేంద్రం కట్టుబడి ఉంది: బీజేపీ

Published Wed, Aug 1 2018 1:34 PM | Last Updated on Wed, Aug 1 2018 2:03 PM

Center Gives Green Signal To Visaka Railway Zone Said By BJP MLA Vishnu Kumar Raju - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు(పాత చిత్రం)

సాక్షి, గన్నవరం : విశాఖపట్నం రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీలను ఏపీకి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు అన్నారు. బీజేపీ కోర్‌ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల జూన్‌ 13న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను బీజేపీ నేతలు కలవడం జరిగిందని, త్వరలో విశాఖ రైల్వే జోన్‌ అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయ భూమి చూపిస్తే పోర్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. పోలవరానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే పెడుతుందని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం కడప ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌ గురించి ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మీరు ధర్నాలు చేయదలచుకుంటే ఏపీలో జరిగే అవినీతి, ఇసుక మాఫియా, లంచగొండితనంపై చేయాలని అన్ని పార్టీలకు సూచించారు. 

బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్, సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షులు కన్నాతో పాటు సమావేశంలో పాల్గొన్న 16 మంది కోర్ కమిటి సభ్యులు, ఇతర బీజేపీ ముఖ్యులు హాజరయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఎవరేం చేయాలో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమావేశానికి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభం హారిబాబు గైర్హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement