railway zone
-
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ కేంద్రగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్‌గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం.కేంద్ర క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలుస్కిల్ ఇండియా పథకం 2025 వరకూ పొడిగింపురూ. 8,800 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వంజాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీకాలం పొడిగింపు2028 మార్చి 31 వరకూ పొడిగించిన కేంద్రం -
విశాఖకు ద్రోహం.. ఒడిశాకు పట్టం
-
బాబు మళ్లీ ఫెయిల్..
-
రైల్వేజోన్.. మళ్లీ మొండిచెయ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని హామీగా ఉన్న విశాఖపట్నం రైల్వేజోన్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటుచేస్తామన్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుపై లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్లో కనీస ప్రస్తావన కూడా లేదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా సీఎం చంద్రబాబు విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ సాధనలో పూర్తిగా విఫలమయ్యారు. 2014–19 మధ్య వైఫల్యాలను పునరావృతం చేస్తూ మరోసారి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం చొరవచూపడం లేదన్నది స్పష్టమవుతోంది. రైల్వేజోన్ ఊసేలేదు..2024–25 వార్షిక బడ్జెట్లో అంతర్భాగంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించింది. గత బడ్జెట్లలో జోన్ ఏర్పాటు ప్రక్రియను సూత్రప్రాయంగా ప్రారంభించామని చెప్పిన కేంద్రం ఆచరణలో వచ్చేసరికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ రూపొందించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఒత్తిడితో విశాఖలో కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల రూ.170 కోట్లు కూడా కేటాయించింది. ఆరిలోవలో రైల్వేకు భూముల కేటాయింపు కూడా గత ప్రభుత్వంలో జరిగింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం టీడీపీ ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందున ఈసారి రైల్వేజోన్‌పై స్పష్టత వస్తుందేమోనన్న రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లుజల్లింది. అసలు బడ్జెట్ ప్రసంగంలో రైల్వేజోన్ గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం విస్మయం కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులైన రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హస్తినలో డిమాండ్ చేయనేలేదు. ఒడిశాలో బీజేపీ ప్రయోజనాల కోసమేనా?ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. నిజానికి.. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి వస్తున్న వాల్తేర్ డివిజన్‌ను ఏకంగా రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకే వీలైనంత వరకు విశాఖ రైల్వేజోన్ అంశాన్ని సాగదీస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా దీనిపై కేంద్రాన్ని నిలదీయకపోవడం రాష్ట్రానికి శాపంగా పరిణమిస్తోంది. ‘బ్లూ బుక్’ వస్తేనే..ఇక కేంద్ర బడ్జెట్లో రైల్వేశాఖకు కేటాయింపులపై సమగ్ర వివరాలతో ‘బ్లూ బుక్’ రైల్వే కార్యాలయానికి చేరితేగానీ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కేటాయింపులు ఏమిటన్న దానిపై స్పష్టతరాదు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రాష్ట్రానికి రూ.9 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఏయే ప్రాజెక్టులకు ఎంతమేర కేటాయింపులు చేశారన్నది మంగళవారం బడ్జెట్లో పేర్కొంది. కానీ, బ్లూ బుక్ వస్తేగానీ అందులోని వివరాలు తెలియవు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, కొత్త లైన్ల కోసం సర్వేలు, కొత్త ఆర్వోబీల నిర్మాణం, ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు, కొత్త రైళ్ల కేటాయింపులు మొదలైన అంశాలపై అప్పుడే స్పష్టత వస్తుంది. -
విశాఖ రైల్వేజోన్ పట్టాలెక్కేనా!?
సాక్షి, అమరావతి: పదేళ్లుగా వేధిస్తున్న రాష్ట్ర విభజన గాయాలకు ఈసారైనా కాస్త సాంత్వన కలుగుతుందా? విశాఖపట్నం రైల్వేజోన్ పట్టాలు ఎక్కుతుందా? 2014–18 మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా రైల్వే ప్రాజెక్టులను సాధించలేని చంద్రబాబు ఇప్పుడైనా తీసుకొస్తారా? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు సాధిస్తాయా!?.. ..ఇదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్. కేంద్ర ఆరి్థకమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రాష్ట్రానికి రైల్వే కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టాలెక్కని దశాబ్దాల డిమాండ్.. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల డిమాండ్. అహేతుకంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏపీకి సాంత్వన కలిగించేందుకు 2014లో విభజన చట్టంలో ప్రత్యేక రైల్వేజోన్ హామీనిచి్చంది. ఆ తర్వాత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వేజోన్ అంశం నత్తనడకను తలపిస్తోంది. దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామన్నారుగానీ ఇప్పటివరకు మళ్లీ ఆ ఊసెత్తలేదు. పైగా.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం రైల్వేజోన్ గురించి పట్టించుకోనేలేదు. ఇక 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీని గురించి గట్టిగా పట్టుబట్టింది. కీలక ప్రతిపాదనలతో కూడిన నివేదికను అప్పట్లో కేంద్రానికి ప్రత్యేకంగా సమరి్పంచింది. దీంతో విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వేజోన్ కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల రూ.170 కోట్లు సైతం మోదీ సర్కారు కేటాయించింది. కానీ, రైల్వేజోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. మరోవైపు.. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటునకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైల్వేశాఖకు భూమి కూడా కేటాయించింది. కానీ, ఆ భూమిపై అనవసర రాద్ధాంతం చేస్తూ కేంద్రం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోంది. అవసరమైతే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి కేటాయిస్తామని చెప్పినా సరే కేంద్రం నుంచి స్పందన శూన్యం. కీలక ప్రాజెక్టులపై వరాల జల్లు కురిసేనా? రాష్ట్రంలో పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంగా నత్తనడకన సాగుతున్న ఈ ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రభుత్వం తగినన్ని నిధులు రాబడుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర నుంచి భారీగా నిధుల కేటాయింపునకు నిరీక్షిస్తున్న కీలక రైల్వే ప్రాజెక్టులివే.. » బెంగళూరు–కడప రైల్వేలైన్ » విజయవాడ–గూడూరు మూడో రైల్వేలైన్ » నడికుడి–శ్రీకాళహస్తి లైన్ » నరసాపురం–కోటిపల్లి లైన్ » డోన్–అంకోలా లైన్ » విజయవాడ–ఖరగ్‌పూర్, విజయవాడ– నాగ్‌పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు » రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ » కొత్త ఆర్వోబీల నిర్మాణం రైల్వే ప్రాజెక్టు ఊసెత్తని బాబు, పవన్.. ఇక కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాజెక్టుల సాధనపై ఇప్పటివరకు దృష్టిసారించనేలేదు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నెలరోజుల్లోనే నాలుగుసార్లు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలిసినా సరే ఆయన రైల్వే ప్రాజెక్టుల గురించి కేంద్రం వద్ద ప్రస్తావించలేదు. మరోవైపు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అయితే సరేసరి. టీడీపీ, జనసేన ఎంపీలు రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లలేదు. నిజానికి.. విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటు చేయాలంటే.. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను కొలిక్కి తెచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ఆచరణలోకి తీసుకురావాలి. కానీ, ఆ దిశగా చంద్రబాబు, పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమేలేదు. -
రైల్వే జోన్ పై కొత్త రాజకీయం
-
జాప్యం చేసిందెవరు...జవాబు చెప్పాల్సిందెవరు ?
-
భూ సమస్య పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెపం
-
విశాఖ రైల్వే జోన్ ఆలస్యానికి అసలు కారణం
-
విశాఖపట్నం రైల్వేజోన్‌కు ఓకే.. రూ.106 కోట్లు మంజూరు
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో విశాఖలో ఘనంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురు అందింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణానికి రైల్వే బోర్డు నుంచి గురువారం అనుమతులు మంజూరయినట్లు రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీ విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన విశాఖ వచ్చారు. జోన్‌కు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో రైల్వే బోర్డ్ చైర్మన్, సీఈవో వీకే త్రిపాఠీ సైతం కేంద్ర మంత్రితో విశాఖ చేరుకున్నారు. వారికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రూప్ నారాయణ్, వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా జోనల్ ప్రధాన కార్యాలయం నిర్మించనున్న వైర్ లెస్ కాలనీని మంత్రి శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ వైర్లెస్ కాలనీలో ప్రతిపాదిత ఎస్‌సిఓఆర్ జోనల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.106 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
రైల్వే జోన్ విషయంలో తప్పుడు రాతలు రాస్తున్నారు : ఎంపీ జీవీఎల్
-
రైల్వే జోన్ పై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు మానుకోవాలి
-
‘కేంద్రం విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి’: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు హాజరయ్యారు. కాగా, అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లాము. గత మూడు దశబ్దాలలో రాని వరదలు ఇప్పుడు వచ్చాయి. వరద ముంపు జిల్లాలకు కేంద్రం నష్ట పరిహారం ఇవ్వాలి. దీనిపై పార్లమెంట్లో చర్చించాలి. ఏపీ విభజన చట్టంలోని అన్ని అంశాలు నెరవేర్చాలి. విశాఖ రైల్వే జోన్‌పై కాలయాపన ఎందుకు చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ సాధనకు కృషి చేస్తాము. భోగాపురం విమానాశ్రయం అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. జీఎస్టీ నష్టపరిహారం కాల పరిమితి మరో అయిదేళ్లు పెంచాలి’’ అని కోరినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే -
3 డివిజన్లు.. 54,500 మంది ఉద్యోగులు
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేర్చేందుకు రైల్వే అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించిన డీపీఆర్ ఆధారిత తుది ప్రక్రియ చివరి దశకు చేరుకుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త జోన్లో 54,500 మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని డీపీఆర్‌లో పొందుపరిచిన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపైనా కసరత్తులు జరుగుతున్నాయి. కొత్త జోన్ ఏర్పాటైతే.. ప్రస్తుతం ఉన్న వనరుల ఆధారంగా వార్షికాదాయం సుమారు రూ.15 వేల కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. సిబ్బంది సర్దుబాటు విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను సమర్థంగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా జోన్ ఏర్పాటు అయినప్పుడు 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులతో విధులు మొదలు పెట్టేవారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచుతుంటారు. కానీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు మాత్రం 65,800 అవసరం అని డీపీఆర్‌లో పొందుపరిచారు. అయితే కార్యకలాపాలు ప్రారంభమైన సమయంలో మాత్రం 54,500 మంది అవసరమని నిర్ధారించారు. వాల్తేరు డివిజన్ కార్యాలయంలో 17,985 మంది, వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయంలో 930 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లలో కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆదాయం పెరిగే అవకాశం కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ని రైల్వే బోర్డు అధికారులు స్టడీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు జోన్లో ఉండనున్నాయి. జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఎలా మొదలు పెట్టాలి? ఉద్యోగుల సర్దుబాటు ఎలా నిర్వహించాలి? డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి? జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు మొదలైన అంశాలపై కసరత్తులు జరుగుతున్నాయి. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్ కేంద్రంగా కొత్తగా నడపాల్సిన రైళ్లు, తదితర అంశాల్ని క్రోడీకరిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. మూడు డివిజన్ల నుంచి వచ్చే ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకొని ఈ జోన్ నుంచి వార్షికాదాయం 2018–19 గణాంకాల ప్రకారం రూ.12,200 కోట్లు(డీపీఆర్ తయారు చేసినప్పుడు)గా గణించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రూ.15 వేల కోట్లు సమకూరే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. జోన్ స్వరూపమిదీ.. జోన్ : సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జోన్ పరిధిలో డివిజన్లు : విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రూట్ లెంగ్త్ : 3,496 కి.మీ రన్నింగ్ ట్రాక్ లెంగ్త్ : 5,437 కి.మీ సరకు రవాణా : 86.7 మిలియన్ టన్నులు రాకపోకలు సాగించే ప్రయాణికులు : 192.5 మిలియన్లు జోన్ పరిధిలో ఉన్న పోర్టులు : విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ మేజర్ స్టేషన్లు : విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి జంక్షన్లు : 26 ఏ–1,ఏ,బీ కేటగిరీ స్టేషన్లు : 46 సీ,డీ,ఈ,ఎఫ్ కేటగిరీ స్టేషన్లు : 141 పాసింజర్ హాల్ట్ స్టేషన్లు : సుమారు 170 వైఫై సౌకర్యం ఉన్న స్టేషన్లు : 61 స్టేషన్లు జోన్ నుంచి నడిచే రైళ్లు : సుమారు 500 జోన్ పరిధిలో ఉన్న మెకానికల్ వర్క్‌షాపులు : తిరుపతి, రాయనపాడు, వడ్లపూడి (త్వరలో ఏర్పాటు కానుంది) కోచ్ మెయింటెనెన్స్ డిపోలు : విశాఖపట్నం, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం విజయవాడ, గుంటూరు, తిరుపతి, గుంతకల్లు డీజిల్ లోకో షెడ్లు : విశాఖపట్నం, గూటీ, గుంతకల్లు, విజయవాడ ఎలక్ట్రికల్ లోకోషెడ్లు : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు రైల్వే హాస్పిటల్స్ : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రాయనపాడు, గుంటూరు -
మ్యాగజైన్ స్టోరీ 19 February 2022
-
రైల్వే జోన్‌పై ముఖం చాటేసిన కేంద్రం
సాక్షి,అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ► కేంద్ర బడ్జెట్లో విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం విస్మయం కలిగిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు జోన్‌కు సంబంధించిన డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. ► రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. అయినప్పటికీ పెద్దగా కేటాయింపులు లేవు. పూర్తి వివరాలతో బ్లూ బుక్ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులకే ఏ మేరకు నిధులు కేటాయించారన్నది స్పష్టం కాదు. ► వాస్తవానికి 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. ► కానీ గత రెండు బడ్జెట్లలోనూ రైల్వే జోన్‌పై కేంద్రం మొండిచేయి చూపించింది. గత బడ్జెట్లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది. ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. ► రైల్వే శాఖ ద్వంద్వ వైఖరి రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశంలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ► ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినందున విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం రాష్ట్రానికి కాస్త ఊరట నిచ్చింది. అయినప్పటికి మరోసారి మోసపూరిత వైఖరే అవలంబించింది. -
AP: రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్ రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తెలిపారు. కాగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.4,157 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. పీజీ వైద్యుల కొరతను పరిష్కరించాలి కాగా, పీజీ మెడికల్‌కు సంబంధించి భారత్, నేపాల్ మధ్య ఎంవోయూ కుదిరితే దేశంలో పీజీ వైద్యుల కొరత చాలా వరకు పరిష్కారమవుతుందని మిథున్‌రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. శుక్రవారం వారిద్దరూ కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. ఎరువుల కేటాయింపులు ఏపీ రైతుల అవసరాలకు సరిపోవట్లేదని, అందువల్ల ఏపీకి కేటాయింపులు పెంచాలని విన్నవించారు. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పరిష్కారం కనుగొనాలి రాజ్యసభలో విజయసాయిరెడ్డి వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణం శాస్త్రీయ పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. వాయు కాలుష్యంపై శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ సభ్యుల తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలో రెండు దశాబ్దాలుగా గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతోందన్నారు. ఇందుకు దారి తీస్తున్న కారణాలేమిటో విశ్లేషించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.639 కోట్లతో క్లీన్ ఎయిర్ ఏపీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. విద్యుత్ వాహనాల తయారీ రంగంలో 2024 నాటికి రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తద్వారా 60 వేల ఉద్యోగాల కల్పనతోపాటు ఏటా 10 లక్షల విద్యుత్ వాహనాల తయారీకి ప్రణాళిక చేసిందన్నారు. కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ దంపతులకు విజయసాయిరెడ్డి, ఎంపీ వంగా గీత ఘన నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని కామ్రాజ్ మార్గ్‌లో ఉంచిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక పార్థివ దేహాల వద్ద శుక్రవారం పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. -
'విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం'
న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నాయకులు పీవీ మిధున్ రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (అబద్ధాలు, వితండవాదంతో కథనాలు: సజ్జల) -
‘జోన్’ పట్టాలెక్కించండి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం పార్లమెంట్‌లోని రైల్వే మంత్రి కార్యాలయంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఎంపీల బృందంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనూరాధ ఉన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ► ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి రెండేళ్లు దాటినా ఇప్పటికీ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి రూ.13వేల కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యధిక లాభసాటి జోన్‌గా రాణిస్తుంది. ► రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ కీలకం. దేశంలోని కొన్ని రైల్వే జోన్ల కంటే కూడా వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం ఆర్జిస్తోంది. నానాటికీ పురోగమిస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుంది. వాల్తేరు డివిజన్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను విశాఖలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ► విశాఖ –అరకు మధ్య నడిచే రైలుకు అదనంగా 5 విస్టాడోమ్ కోచ్‌లను కేటాయించాలి. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఉన్న ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ ఆవరణలో కంటైనర్ తయారీ విభాగాన్ని నెలకొల్పాలి ► రాష్ట్రానికి చెందిన ఉద్యోగార్ధులు ఆర్ఆర్బీ పరీక్షలు రాసేందుకు సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ► నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కర్నూలులో కోచ్ వర్క్‌షాప్ నెలకొల్పాలి. విజయవాడ–విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలి. తిరుపతి–పాకాల–చిత్తూరు–కాట్పాడి మధ్య డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలి. ► విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని రైల్వే భూముల్లో మూడు దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న 800 నిరుపేద కుటుంబాలు ఇళ్ల క్రమబద్ధీకరణకు సహకరించాలి. ఆ భూమికి బదులు గా అజిత్‌సింగ్‌నగర్ రైల్వే స్థలానికి సమీపంలోనే ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్‌కు రూ.1,144.35 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రధానమైన నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,144.35 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.2,500 కోట్లు కాగా, ఈ ఏడాది కేటాయింపులతో ప్రాజెక్టు పూర్తి కానుంది. దేశ వ్యాప్తంగా రైల్వే 56 ప్రాజెక్టులను ప్రకటించగా.. అందులో ఏపీకి సంబంధించి విజయవాడ–భీమవరం, గుడివాడ–మచిలీపట్నం, నరసాపురం–నిడదవోలు బ్రాంచ్ లైన్ల మధ్య గల 221 కిలోమీటర్ల రైలు మార్గాన్ని చేర్చింది. ఈ ఏడాది జూలై నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుని బడ్జెట్లో రూ.1,200 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఈ మార్గంలో 106 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయింది. బడ్జెట్ కేటాయింపుల్ని రైల్వే బోర్డు బుధవారం పింక్ బుక్‌లో చేర్చింది. వీటికి కేటాయింపుల్లేవ్ భద్రాచలం–కొవ్వూరు,గూడూరు–దుగరాజపట్నం, కంభం–ప్రొద్దుటూరు, కొండపల్లి–కొత్తగూడెం, అమరావతి న్యూ రైల్వే లైన్లకు ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం గమనార్హం. పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, యార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించింది. విశాఖ రైల్వే జోన్‌కు రూ.40 లక్షలే మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖ కేంద్రంగా రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై ఇంకా చిన్నచూపే కొనసాగుతోంది. జోన్ నిర్మాణానికి రూ.పెద్ద మొత్తంలో నిధులు అవసరమని రైల్వే బోర్డు ప్రతిపాదించినప్పటికీ బడ్జెట్లో మాత్రం రూ.లక్షల్లో మాత్రమే కేటాయింపులు చేస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ బడ్జెట్లో కచ్చితంగా రైల్వే జోన్ అంశం ప్రస్తావనకు వస్తుందని.. పూర్తిస్థాయి నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. కానీ, బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రస్తావన తీసుకు రాలేదు. కేటాయింపుల పరంగా చూస్తే ఈ జోన్‌కు కేవలం రూ.40 లక్షలు విదిల్చారు. దక్షిణ కోస్తా జోన్ నిర్మాణానికి రూ.169 కోట్లు అవసరమని బోర్డు నియమించిన ఓఎస్డీ తన డీపీఆర్‌లో పేర్కొన్నారు. కానీ, గత బడ్జెట్లో కేవలం రూ.3 కోట్లు మాత్రమే విడుదల చేసిన కేంద్రం.. ఈ బడ్జెట్లో మరింత కోత విధించి రూ.40 లక్షలు మాత్రమే కేటాయించింది. 2022 మార్చిలోపు 56 రైల్వే ప్రాజెక్టులు పూర్తి సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాలు పెంచడంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా దేశవ్యాప్తంగా 56 ప్రాజెక్టులను పూర్తిచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ దిశగా రూ.2,15,058 కోట్ల మేర మూల ధన వ్యయాన్ని వెచ్చించనుంది. ఇందుకోసం సాధారణ బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.1,07,100 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయడంతో పాటు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులపై ఏకకాలంలో పనిచేయడంపై దృష్టి పెట్టనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరణ, టెర్మినల్ వసతులు, రైళ్ల వేగం పెంచడం, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపరచడం, ప్రయాణికుల సౌకర్యాలు, ఆర్వోబీ, ఆర్యూబీల ద్వారా భద్రత పనులు చేపట్టడంపై 2021–22 వార్షిక ప్రణాళిక ప్రధానంగా దృష్టిపెట్టనుంది. అలాగే, కొత్త రైల్వే లైన్లకు రూ.40,932 కోట్లు, డబ్లింగ్‌కు రూ.26,116 కోట్లు, ట్రాఫిక్ సౌకర్యాలకు రూ 5,263 కోట్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీల కోసం రూ.7,122 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. కాగా.. ట్రాఫిక్ సౌకర్యాల కేటాయింపులు 156 శాతం పెరిగాయని, కొత్త రైల్వే లైన్ల కేటాయింపులు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 52 శాతం పెరిగాయని రైల్వేశాఖ పేర్కొంది. ప్రజల సౌలభ్యం కోసం 1200కి పైగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జ్ (ఆర్యూబీ)లను, సబ్‌వేలను ఈ ఏడాది పూర్తిచేయడానికి సిద్ధమైనట్లు వెల్లడించింది. -
విశాఖ రైల్వే జోన్ లాభదాయకమే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్) రైల్వే జోన్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రైల్వే బోర్డుకు చేరింది. వాల్తేరు డివిజన్లోని ఏ ఒక్క ఉద్యోగినీ కదల్చనవసరం లేకుండా.. ఏడాదికి రూ.13 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చేలా ఓఎస్డీ ధనుంజయులు డీపీఆర్‌ను రూపొందించి రైల్వే బోర్డుకు అందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆ నివేదిక ప్రతులను ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులకు, వివిధ విభాగాలకు అందించింది. వారి నుంచి రెండు వారాల్లో అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనుంది. వీటన్నింటినీ క్రోడీకరించి తుది నివేదిక సిద్ధం చేస్తారు. అనంతరం కేంద్ర కేబినెట్లో ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత జోన్ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించాలని నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతా సక్రమంగా సాగితే.. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ సేవలు ప్రారంభం కానున్నాయి. డీపీఆర్‌లో ముఖ్యాంశాలివీ - జోన్ కేంద్రంతో పాటు వాల్తేరు డివిజన్‌ను విభజించి, కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌ను రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. దీంతోపాటు ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వ్యయంతో అదనపు హంగులు సమకూర్చాలి - జోన్ ప్రధాన కార్యాలయానికి రూ.100 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది - జోన్ ఏర్పడితే రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది - వాల్తేరు డివిజన్‌ను విభజించి.. రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి.. మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేయాల్సి ఉంటుంది - వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాల్ని జోన్ తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా చేయాలి. ఏడాదిలోపు పూర్తి సదుపాయాలతో జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మించవచ్చు. - రాష్ట్రాల సరిహద్దుల్ని పరిగణనలోకి తీసుకోకుండా జోన్ హద్దుల నిర్ణయం - విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్‌తో కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో 50 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు - వాల్తేరు డివిజన్లో 18 వేల మంది ఉద్యోగులుండగా.. వీరిలో 930 మంది డీఆర్ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్ వస్తే.. జోన్ కార్యాలయంలో 1,250 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. అదనంగా ఉద్యోగులు అవసరం కాగా.. కేవలం 930 మందికి ఆప్షన్లు ఇస్తే సరిపోతుంది. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది విశాఖ కేంద్రంగా ఉన్న జోన్లోనే పనిచేస్తారు - వాల్తేరు నుంచి కొత్త డివిజన్‌కు వెళ్తే.. ఉద్యోగులు కొత్త జోన్ పరిధిలోకే వస్తారు. వారి సీనియారిటీలో ఏ మాత్రం మార్పు లేకుండా ప్రమోషన్లు పొందేలా విధివిధానాలు - వాల్తేరు డివిజనల్ రైల్వే ఆస్పత్రిని ఆధునికీకరించి అత్యాధునిక వైద్య సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేయాలి - రాయగడ డివిజన్ ఏర్పాటు అంశాన్ని కూడా డీపీఆర్‌లో ప్రధానంగా పొందుపరిచారు - డివిజన్లోని డీజిల్, ఎలక్ట్రికల్ లోకో షెడ్లు, మెకానికల్ వర్క్ షాపులు, కోచ్ మెయింటెనెన్స్‌లను అప్‌గ్రేడ్ చేయాలి - జోన్ తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిధిలో 5 రైళ్లు, ఇతర ప్రాంతాలకు మరో 5 కలిపి మొత్తం 10 సర్వీసులు ప్రారంభించాలని భావిస్తున్నారు. -
దక్షిణ కోస్తా ఓఎస్డీగా శ్రీనివాస్ నియామకం
ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా శ్రీనివాస్‌ను నియమించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. శ్రీనివాస్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ బ్లూ ప్రింట్ తయారు చేయనున్నారు. ఉద్యోగుల బదిలీ, విశాఖలో జోన్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, డీపీఆర్ తయారీ తదితర అంశాలను ఓఎస్డీ శ్రీనివాస్ పర్యవేక్షించనున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ పర్సనల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. -
‘జోన్ ఇవ్వడం బాబుకు ఇష్టం లేదేమో’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ఢిల్లీలో గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. మా ఉద్దేశాలు ప్రశ్నించే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశాలేంటో బయటకు చెప్పాలని హితవు పలికారు. వారం రోజుల క్రితం కూడా జోన్ ఇవ్వాలంటూ బాబు లేఖ రాశారని.. ఇచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఇలా విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇవ్వనంతకాలం మాపై విష ప్రచారం చేశారని ఆరోపించారు. అసలు విశాఖ జోన్ ఇవ్వడం చంద్రబాబు అండ్ పార్టీకి ఇష్టం లేదేమోనని సందేహం వ్యక్తం చేశారు. అందుకే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా(సౌత్ కోస్ట్)జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. -
ఏ ఒక్క రోజైనా కేంద్రాన్ని నిలదీశారా?
-
రాక రాక వచ్చి కాక పుట్టించి...!
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల తరబడి ఉద్యమాల ఫలితంగా వచ్చిన రైల్వే జోన్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. రాదనుకున్న జోన్ వచ్చినందుకు కొన్ని వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కానీ ప్రయోజనం లేకుండా ఇచ్చారంటూ మరికొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విశాఖకు రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్లో సగభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్లో విలీనం చేశారు. దీంతో వందల ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కనుమరుగైపోనుంది. అంతేకాదు.. వాల్తేరు డివిజన్‌కు రూ.7 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే (కొత్తవలస–కిరండోల్) లైన్‌ను కూడా విశాఖ రైల్వే జోన్ పరిధిలో కాకుండా రాయగడ డివిజన్‌కు కేటాయించడం విశాఖ, ఉత్తరాంధ్ర వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కేకే లైన్లో ముడి ఇనుము, బొగ్గు తదితర ఖనిజాల రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని తీసుకొచ్చే డివిజన్ జోన్లో చేర్చకపోవడం వల్ల ప్రయోజనం శూన్యమని ప్రజాసంఘాలు, వామపక్షాలు, నిరుద్యోగ జేఏసీలు మండిపడుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆదాయం తూర్పు కోస్తా రైల్వేకి, నిర్వహణ భారం, ఇతర వ్యయం విశాఖ జోన్‌పైన పడుతుందని చెబుతున్నారు. జోన్ వచ్చినా నిరుద్యోగులకు మేలు చేకూర్చే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విశాఖ జోన్ విశాఖకు వచ్చే అవకాశం లేదన్న వార్తలు కూడా నిరుద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. విశాఖ రైల్వే జోన్లో విధిగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పలువురు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టింది. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించింది. మరోవైపు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక నేతృత్వంలో గురువారం నగరంలో అఖిలపక్ష నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్త జోన్‌వల్ల ఉత్తరాంధ్రకు మేలు చేకూరాలే తప్ప నష్టం వాటిల్లరాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలోనూ రైల్వే జోన్ ఏర్పాటు తీరుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే ఏ డివిజన్‌కు వచ్చే ఆదాయమైనా అంతిమంగా రైల్వేలకే వెళ్తుంది తప్ప స్థానిక సంస్థలకు గాని వచ్చే అవకాశం ఉండదని, అందువల్ల పరిధులపై ఆందోళనలు చేయడం అర్థరహితమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద రాకరాక వచ్చిన రైల్వే జోన్‌పై మరోసారి కాక పుట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ ఇవ్వాలి డాబాగార్డెన్స్(విశాఖదక్షిణ): వాల్తేర్ డివిజన్‌తో కూడుకున్న రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, 125 ఏళ్ల ఘన చరిత్ర గల వాల్తేర్ డివిజన్‌కు చరిత్ర లేకుండా చేస్తే ఉద్యమిస్తామని..ప్రతిఘటిస్తామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించి..ఉత్తరాంధ్రను మాత్రం తూర్పుకోస్తా రైల్వేలోనే ఉంచాలన్న ప్రకటనను నిరసిస్తూ ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కన్యదానం చేసి కాపురం చేయడానికి వీల్లేదన్నట్టు రైల్వేజోన్ ప్రకటన ఉందని ఎద్దేవా చేశారు. జోన్ ప్రకటించి 126 ఏళ్ల చరిత్ర గల వాల్తేర్ డివిజన్‌కు చరిత్ర లేకుండా చేశారని మండిపడ్డారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించి ఉత్తరాంధ్రను మాత్రం తూర్పుకోస్తా రైల్వేలోనే ఉంచాలని భావిస్తుందని, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేర్ డివిజన్లోని విశాఖ రైల్వేస్టేషన్(సెక్షన్)ను మాత్రమే కొత్త జోన్లో విలీనం చేయడానికి ప్రతిపాదన చేశారని తెలిపారు. అదే జరిగితే శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ జిల్లాలోని కొంత ప్రాంతం శాశ్వతంగా నష్టపోతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనను ఉత్తరాంధ్ర ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. డివిజనల్ హెడ్‌క్వార్టర్ లేకుండా జోన్ ఏంటని ప్రశ్నించారు. రేపు నిరసన గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేర్ డివిజన్లోని విశాఖ రైల్వేస్టేషన్(సెక్షన్)ను మాత్రమే కొత్త రోజన్‌లో విలీనం చేయడానికి చేసిన ప్రతిపాదనను నిరసిస్తూ శనివారం అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నట్టు సమావేశంలో తీర్మానించారు. రైల్వే యూనియన్లు కూడా ఆందోళన బాట పట్టనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వేజోన్ సాధన సమితి కన్వీనర్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నగర కార్యదర్శి బి.గంగారావు, లోక్‌సత్తా పార్టీ నాయకుడు మూర్తి, జనసేన పార్టీ నాయకుడు కోన తాతారావు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పేడాడ రమణకుమారి, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఏయూ విద్యార్థి నాయకుడు సమయం హేమంత్‌కుమార్ పాల్గొన్నారు. ఉనికి కాపాడండి.. డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు కావడం ఆంధ్రరాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, అయితే 125 ఏళ్ల చరిత్ర గల వాల్తేర్ డివిజన్ ఉనికి ప్రశ్నార్థకం చేస్తూ జోన్ ప్రకటించడం ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని ఎన్ఎఫ్ఐఆర్ ఉపాధ్యక్షుడు కె.ఎస్.మూర్తి, తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఎక్స్ డివిజనల్ కో–ఆర్డినేటర్ పీఆర్ఎమ్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిపాదిత కొత్త జోన్లో విలీనం కానున్న ప్రస్తుత వాల్తేర్ డివిజన్లోని కార్మికులు రానున్న కాలంలో పదోన్నతలు, సీనియార్టీ వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, డివిజన్ స్థాయి అధికారులను కలవడానికి సుదూర ప్రయాణం చేసి విజయవాడ వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన ఈ ప్రాంత కార్మికుల్లో ఉందన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే డివిజన్‌ను కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైల్వే కార్మికుల్లో ఉన్న ఆందోళన తొలగించాలని మూర్తి డిమాండ్ చేశారు. తీవ్ర అన్యాయం తాటిచెట్లపాలెం(విశాఖఉత్తర):విశాఖ రైల్వే జోన్ ప్రకటించి తీవ్ర అన్యాయం చేశారని ఏపీజేఏసీ నేత జేటీ రామారావు ఆరోపించారు. జోన్ ప్రకటన విషయంలో గురువారం రాత్రి సరైన అవగాహన లేక నాయకులు సంబరాలు చేసుకున్నారు. కానీ వాల్తేర్ డివిజన్‌ను ముక్కలు చేసి ఇచ్చే డివిజన్ వల్ల ప్రయోజనం లేదన్నారు. ఈమేరకు గురువారం రైల్వే స్టేషన్ ఎదుట ఆం దోళన నిర్వహించారు. ప్రధానంగా కేకే లైన్ లేని జోన్ వలన నష్టమే ఎక్కువన్నారు. పార్లమెంట్లో రైల్వే జోన్ ప్రకటించేవరకు పోరాటం చేస్తామన్నారు. 36గంటల డెడ్‌లైన్ కేంద్రానికి ఇచ్చామన్నారు. ఈ లోగా పూర్తిస్థాయి రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లుగా జోన్ విషయం మాట్లాడని తెలుగుదేశం నేడు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందని, ఈ రోజు జోన్ ఇలా ముక్కలవడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని తెలిపారు. కార్యక్రమంలో కె.దానయ్య, పౌరహక్కుల ప్రజాసంఘం నాయకుడు పలుకూరి వసంతరావు, మాజీ రైల్వే కార్మి కుడు కె.రామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఉద్యమాల ఫలితమే ‘రైల్వేజోన్’
-
విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్
-
విశాఖకు రైల్వే జోన్
-
అభివృద్ధి కూతపెట్టేనా?
గుంతకల్లు రైల్వే జోన్ ఈ ప్రాంత వాసుల కల. రాష్ట్ర విభజన తర్వాత గుంతకల్లు జోన్ కోసం ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న (శుక్రవారం) ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ‘అనంత’ వాసులంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రైల్వే అధికారులు కూడా డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. అయితే కేంద్రం ఎన్నింటిని పరిగణలోకి తీసుకుంటుంది...ఏ మేరకు నిధులు విడుదల చేస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అనంతపురం, గుంతకల్లు : రానున్న రోజుల్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయాల పెంపు, ట్రాక్ భద్రత, రైల్వే ఉద్యోగులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై గుంతకల్లు డివిజన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గుంతకల్లు డివిజన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే రూ. వందల కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. అయితే రైల్వే శాఖ మాత్రం అవసరమైన ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించి త్వరితగతిన పనులు పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ప్రాజెక్ట్‌లకు నిధుల కేటాయింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 1.19 ఎకరాల్లో రైల్వే వాణిజ్య సముదాయం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే వాణిజ్య సముదాయం ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నారు. గుంతకల్లులోని రైల్వే క్రీడా మైదానం ఆనుకొని ఉన్న 1.19 ఎకరాల విస్తీర్ణంలో ఈ వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఎల్సీ గేట్ల మూసివేతకు శ్రీకారం ఇప్పటికే దాదాపు 116 కాపలా లేని ఎల్సీ గేట్లు ఎత్తివేసి భారతీయ రైల్వేలో గుంతకల్లు డివిజన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదే తరహాలో ప్రమాదరహిత రైల్వే డివిజన్‌గా గుంతకల్లును తీర్చిదిద్దడంలో భాగంగా కాపలా ఎల్సీ గేట్లు (మ్యాన్డ్ ఎల్సీ గేట్లు) మూసివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. డివిజన్ పరిధిలోని 30 ప్రాంతాల్లో మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయనీ, ఇందుకు గాను రూ.300 కోట్లు వెచ్చించనున్నారు. అదే విధంగా ట్రాక్భద్రతకు రూ. 157 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులతో డివిజన్ వ్యాప్తంగా అవసరమైన 31 ప్రదేశాల్లో స్లీపర్స్, రెయిల్స్ ఏర్పాటు పనులు చేపట్టాలని భావించారు. డివిజన్ పరిధిలో 1,438 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌లున్నాయి. రైల్ ప్లైఓవర్‌కు ప్రతిపాదనలు గుంతకల్లు జంక్షన్ సమీపంలోని మల్లప్పగేటు నుంచి నంచర్ల వరకు రైల్ ఫ్లై ఓవర్ ఏర్పాటుకు డివిజన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్లై ఓవర్ మధ్య దూరం ఎంత? ఎంతమేర నిధులు అవసరమువుతాయి? ఈ ప్లై ఓవర్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే బోర్డుకు వివరించారు. అదేవిధంగా గుంతకల్లు జంక్షన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారాలను, 3, 4 ప్లాట్ఫారాలతో కలిపేందుకు కూడా ప్రతిపాదనలు పంపారు. ఉద్యోగులకు సౌకర్యాల కల్పనకు వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగుల కుటుంబాలకు కనీస సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేసే చర్యలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని పది ప్రాంతాల్లో నూతనంగా స్టాఫ్ క్వార్టర్స్ ఏర్పాటు, పాత క్వార్టర్ల మరమ్మతులకు రూ.54 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. గుంతకల్లు, తిరుపతి, రేణిగుంట, ధర్మవరం, డోన్, ముద్దనూరు, కడపలో టీటీఈ విశ్రాంత గదుల ఏర్పాటుకు, రాయచూరులో 60 పడకలతో రన్నింగ్ రూం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. భద్రతా చర్యల్లో భాగంగా రాయచూరులోని గూడ్స్ షెడ్‌ను యర్మరస్ తరలించేందుకు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. గుత్తి, అనంతపురం రైల్వేస్టేషన్లరూపురేఖలు మారేనా? ♦ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రైల్వేకు సంబంధించి గుత్తి, అనంతపురం, తాడిపత్రి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో ముఖ్యంగా.. రూ.15 కోట్లతో అనంతపురం రైల్వేస్టేషన్ పశ్చిమ భాగాన నూతన భవనం ఏర్పాటుకు అనుమతులు కోరారు. ♦ ప్లాట్ఫారం–1 ఆధునికీకరణకు రూ. 8.65 కోట్లలు కేటాయించాలని కోరారు. ♦ గుత్తి రైల్వే జంక్షన్లో ఉన్న 2 ప్లాట్‌ఫారాలకు అదనంగా మరికొన్ని నిర్మించేందుకు, ♦ గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం, స్టేషన్ ప్రాంగణం అభివృద్ధికి రూ.2.37 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ♦ ప్రయాణికుల సౌకర్యార్థం గుత్తి జంక్షన్లో రూ.66 లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు నివేదిక ఇచ్చారు. ♦ తాడిపత్రి రైల్వేస్టేషన్ అభివృద్ధి కోటి రూపాయలతో అంచనాలు. ♦ డివిజన్ పరిధిలోని చిత్తూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ 2.35 కోట్లు కేటాయించాలని కోరారు. ♦ రేణిగుంటకు రూ 1.60 కోట్లు, శ్రీకాళహస్తికి రూ 2.47 కోట్లు, రాయచూరు స్టేషన్ అభివృద్ధికి రూ 1.26 కోట్లతో ప్రతిపాదనలు. ♦ ధర్మవరం, డోన్, ఆదోని, మంత్రాలయంరోడ్డు రైల్వేస్టేషన్లలో ట్రైన్ ఇండికేషన్ బోర్డుల ఏర్పాటుకు రూ 3.75 కోట్లతో ప్రతిపాదనలు. ♦ తిరుపతి రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్‌ఫారాల కోసం రూ.76 కోట్లతో ప్రతిపాదనలు. ♦ తిరుపతి – వెస్ట్ తిరుపతి మధ్య ప్రత్యేక రైల్వే లైన్ కోసం రూ 19కోట్లు. ఈ పనుల్లో భాగంగా భూ సేకరణకు రూ.43 కోట్లు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రత, మౌలిక వసతులకు పెద్దపీట ప్రయాణికుల భద్రత, మౌలిక వసతుల కల్పన, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సిబ్బంది వసతి సదుపాయాలకు ప్రతిపాదనలు పంపాం. ఎంపీ, డీఆర్‌యూసీసీ సూచనలు, స్థానికుల వినతుల మేరకు కొత్త రైళ్లకూ ప్రతిపాదనలు పంపాం. డివిజన్లోని మేజర్ ప్రాజెక్టులంటికీ జోనల్ స్థాయి అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించాం. – విజయప్రతాప్‌సింగ్, డీఆర్ఎం -
టీడీపీపై విష్ణుకుమార్ రాజు మండిపాటు
సాక్షి, గన్నవరం : విశాఖపట్నం రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీలను ఏపీకి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల జూన్ 13న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ నేతలు కలవడం జరిగిందని, త్వరలో విశాఖ రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయ భూమి చూపిస్తే పోర్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. పోలవరానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే పెడుతుందని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం కడప ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ గురించి ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మీరు ధర్నాలు చేయదలచుకుంటే ఏపీలో జరిగే అవినీతి, ఇసుక మాఫియా, లంచగొండితనంపై చేయాలని అన్ని పార్టీలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్, సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షులు కన్నాతో పాటు సమావేశంలో పాల్గొన్న 16 మంది కోర్ కమిటి సభ్యులు, ఇతర బీజేపీ ముఖ్యులు హాజరయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఎవరేం చేయాలో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమావేశానికి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభం హారిబాబు గైర్హాజరయ్యారు. -
రైల్వేజోన్ పేరిట టీడీపీ డ్రామాలు
-
టైం దగ్గర పడింది.. త్వరలోనే చరమగీతం
సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన కడప ఉక్కు కోసం సంతకాల సేకరణ చేపట్టిన గజపతి రాజు, విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. జిల్లాకు గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తామని చెప్పి మోసగించారని, యూనివర్సిటీ గిరజనుల హక్కు అని, వాటిపై పోరాడాలని అనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. విభజన సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ అమలు కాలేదని ఈ విషయంపై అశోక్ గజపతి రాజు ఎందుకు పోరాటం చేయడం లేదని శ్రీనివాసరావు నిలదీశారు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉందని, కేంద్రంలో భాగస్వామిగా ఉండి పదవులు అనుభవించిన ఎంపీ సంతకాల సేకరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. జిల్లాకు లబ్ధి చేకూర్చే అంశాలను విస్మరించిన ఎంపీకి కడప ఉక్కు పరిశ్రమకై పోరాడే అర్హత లేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు గాజులు చేయిస్తానని చెప్పినట్లు, ఓటు వేసి గెలిపించిన జిల్లా ప్రజలకు న్యాయం చేయలేని అశోక్ గజపతి రాజు.. కడప ఉక్కు పరిశ్రమ కోస పోరాడటం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసరావు తెలిన్నారు. టీడీపీ పాలనకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని, రానున్న ఎన్నికల్లో గజపతి రాజుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
టీడిపీ నేతల దీక్ష అభాసుపాలు
-
విశాఖలో జూనియర్ ఆర్టిస్టుల నిరసన
-
రైల్వేజోన్, ప్రత్యేక హోదా కోసం రక్తదానం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వేజోన్, ప్రత్యేక హోదా సాధనకోసం రక్తదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. విభజన హామీలతో సహా ఉత్తరాంధ్రకు ఆర్ధిక ప్యాకేజీ హామీ అమలు కోసం ఈ నెల 30న ఉదయం 9 గంటలకు విశాఖపట్నం రైల్వే హాస్పిటల్ లో రక్త దానం కార్యక్రమం చేబడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుదామని ఆయన పిలుపునిచ్చారు. -
టీడీపీ ఎంపీల డ్రామా బట్టబయలు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాలు మరోసారి బయటపడ్డాయి. ఏపీ రైల్వేజోన్ కోసం తనను కలవలేదని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీడీపీ ఎంపీలను తాను కలవలేదని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం సాయంత్రం ఎంపీలందరినీ కలుస్తుంటానని, టీడీపీ ఎంపీలెవరూ తనను అపాయింట్మెంట్ అడగలేదని చెప్పారు. పరిశీలనలో ఉంది ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని లేదని, కేవలం పరిశీలించాలని మాత్రమే పెట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రైల్వేజోన్ పరిశీలనలో ఉందని.. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాలను పర్యవసనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జోన్‌పై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఒడిశా ఎంపీలతో అలా అనలేదు ‘ఏపీకి రైల్వేజోన్ ఇవ్వడం లేదని బీజేడీ ఎంపీలతో చెప్పలేదు. ఒడిశా ఎంపీలు వారి రాష్ట్రంలో మూడు కొత్త డివిజన్లు అడిగారు. అవి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పాను. ఏపీలో రైల్వేజోన్ ఏర్పాటు చేయలేమని ఒడిశా ఎంపీలతో చెప్పలేదు. వారు మీడియాతో అలా చెప్పితే అబద్ధాలు ఆడుతున్నట్టేన’ని పియూష్ గోయల్ పేర్కొన్నారు. -
బీజేపీ రైలు నాలుగేళ్లు లేటు అంటూ టీడీపీ ప్రదర్శన
-
ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వండి..
► రైల్వే బోర్డు చైర్మన్‌కు ఎంపీల వినతి ► నగరంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఏకే మిట్టల్ అల్లిపురం (విశాఖ దక్షిణం): విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ ఎంపీలు కంభంపాటి హరిబాబు, ముత్తం శెట్టి శ్రీనివాసరావులు రైల్వే బోర్డు చైర్మన్ ఏ.కె.మిట్టల్‌కు వినతిపత్రం సమర్పించారు. జోన్ ప్రాధాన్యం, సాధ్యాసాధ్యాలపై చైర్మన్‌తో వీరు చర్చించారు. జోన్ ఏర్పాటుకు వనరుల విశ్లేషణకు క్షేత్ర స్థాయి పరిశీలనకు రైల్వే బోర్డు చైర్మన్ శుక్రవారం నగరానికి వచ్చారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో మధ్యాహ్నం 12.45 గం టలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు తూర్పు కోస్తా రైల్వే, జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్, డీఆర్ఎం ముఖుల్ శరన్ మాథుర్, ఏడీఆర్ఎం అజయ్ అరోరాలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వాల్తేరు డివిజనల్లో గల రైల్వే భూములు, ఆస్తులు, జోన్ ఏర్పాట్లలోని సాంకేతిక సమస్యల గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం ఎంపీలు కంభంపాటి హరిబా బు, ముత్తం శెట్టి శ్రీని వాసులు రైల్వే బోర్డు చైర్మన్‌తో ప్రత్యేకంగా బేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ఎంపీలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఆయనకు అందజేశారు. తుని–కొత్తవలస రైల్వే లైన్‌కు ప్రతిపాదనలు అందజేత అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తుని–కొత్తవలస నూత న రైల్వే లైన్ ఏర్పాటు ప్రతిపాదనలను రైల్వే బోర్డు చైర్మన్‌కు అందజేశారు. దీనిపై ఇప్పటికి చేసిన రెండు సర్వే రిపోర్టులను ఆయనకు వివరించారు. తుని నుంచి దిగువ పోలవరం, చెర్లపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, చోడవరం, కొలగొట్ల, దేవరాపల్లి, కోరువాడ మీదుగా కొత్తవలస జంక్షన్‌కు 145.93 కి.మీ దూరంతో ఒక ప్రతిపాదన, తుని, దిగువ పోలవరం, చెర్లపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, వడ్డాది, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి ,కోరువాడ మీదుగా కొత్తవలస జంక్షన్‌కు 153.11 కి.మీ.లతో మరో ప్రత్యేక లైన్‌కు ప్రతిపాదనలను చైర్మన్‌కు అందజేశారు. స్టేషన్లలో సమస్యలపై వినతి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వివిధ స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రైల్వే బోర్డు చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు. అనకాపల్లి స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని, లిఫ్టులు, ఎస్కలేటర్లు, బ్యాటరీ కార్ట్, వీల్ చైర్లు, జనరేటర్, వైఫై, 2, 3 ప్లాట్ ఫారాల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రతిపాదనలపై అనుమతులు ఇప్పటికే వచ్చాయని, పనులు మొదలు పెట్టాలని కోరారు. అదే విధంగా యలమంచిలి స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు హల్ట్ ఏర్పాటు, పే అండ్ యూస్ టాయిలెట్లు, తాడి రైల్వే స్టేషన్లో టాయిలెట్లు, సీసీ రోడ్లు ఏర్పాటు, బయ్యవరం రైల్వే స్టేషన్లో లోడింగ్ అన్‌లోడింగ్‌కు అప్రోచ్‌రోడ్డు నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరించాలని చైర్మన్‌కు విన్నవించారు. -
రైల్వే బోర్డుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం
-
రైల్వే బోర్డుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం
విజయవాడ: దక్షిణ మధ్య రైల్వే బోర్డుపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ జరుగుతున్న సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం రాయపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రైల్వేమంత్రి చెప్పినా అధికారులు లెక్కచేడయం లేదని, వారు ప్రధానికన్నా పవర్ఫుల్ అని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న పనులు కూడా అధికారులు చేయడం లేదని, ఇలా అయితే ప్రజలు తమను చెప్పుతో కొడతారని ఆయన అన్నారు. గుంటూరు-తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్లు నుంచి సాగుతునే ఉన్నాయని అన్నారు. అలాగే గుంటూరు-చెన్నై డే ట్రయిన్ అడిగానని, దానిపై కూడా స్పందన లేదన్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ ...అధికారుల వల్లే రాలేదని విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం బోర్డు అధికారులకు ఇష్టం లేదని అన్నారు. అసలు ముందు రైల్వే జోన్‌ను ప్రకటిస్తే...తర్వాత చిన్నగా విశాఖకు తరలించవచ్చన్నారు. తాను మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినా తాను మాట్లాడతానని రాయపాటి అన్నారు. చంద్రబాబు పదిసార్లు ప్రధానిని కలిసినా రైల్వే జోన్ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై సీఎంకానీ, పార్టీ నేతలు కానీ ఆలోచించడం లేదని, కొద్దిరోజులు ఆగితే రైల్వేజోన్‌ను కూడా మర్చిపోవడమే అని అన్నారు. ప్రతి ఏటా సమావేశాలు పెట్టి విందు భోజనాలతో సరిపెడుతున్నారన్నారు. -
జీవీఎంసీ ఎన్నికలపై న్యాయ పోరాటం
⇒ఆత్మగౌరవ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన ⇒సహకరించిన అందరికీ కృతజ్ఞతలు ⇒జగన్ నాయకత్వంలో జోన్ పోరాటం మరింత ఉధృతం ⇒విశాఖను వాడుకుంటున్న చంద్రబాబు ⇒ఎంపీ అవంతి వ్యాఖ్యలు హాస్యాస్పదం ⇒వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ఐదున్నరేళ్లయినా జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించలేదంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో ఎంతగా భయపడుతుందో అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అన్ని ఎన్నికలు కలిపి 2019లో పెడతామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. జీవీఎంసీ ఎన్నికలపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. రైల్వేజోన్ సాధనలో ప్రజలను భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతో అనకాపల్లి నుంచి భీమిలి వరకు 11 రోజుల పాటు పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. దాదాపు 8 నియోజకవర్గాలు, 62 వార్డులు, విలీన గ్రామ పంచాయతీల్లో ఈ యాత్ర కొనసాగిందని, అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఈ యాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు. పోరాటం ఉధృతం చేయాలని ప్రజలు కోరారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ పోరాటానికి మద్దతు తెలిపిన వామపక్షాలు, లోక్‌సత్తా, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ తదితర అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు, పలు అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖకు చంద్రబాబు చేసిందేమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్ల కాలంలో దాదాపు 40 సార్లుపైగానే విశాఖ వచ్చారని, ఈ ప్రాంతానికి బాబు చేసిందని శూన్యమేనని ఆయనకు ఓట్లేసిన ప్రజలే చెబుతున్నారని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబుకు విశాఖను వాడుకోవడమే తప్పా.. అభివృద్ధి చేయాలనే ఉద్దేశం లేదన్నారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్, సింహాచలం భూ సమస్య, రోడ్డున పడిన తగరపువలస జ్యూట్ కార్మికులు, తదితర సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలకే విశాఖ కావాలా అంటూ మండిపడ్డారు. ఆత్మగౌరవ యాత్రపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. యాత్ర చేపట్టాల్సింది గల్లీలో కాదు.. ఢిల్లీలో అని ఎంపీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రైల్వేజోన్ సాధన కోసం ఏం చేశారని ఎంపీని ప్రశ్నించారు. బతుకుదెరువు, రాజకీయాల కోసం ఇక్కడకు వచ్చిన వారికి విశాఖపట్నం గల్లీలాగే కనబడుతుందన్నారు. విశాఖలో ఏ అభివృద్ధి చేయని కారణంగానే జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, బొల్లవరపు జాన్‌వెస్లీ, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు శ్రీకాంత్‌రాజ్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్ ఆలీ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకుడు బద్రీనాథ్, సాంస్కృతిక విభాగం ప్రతినిధి రాధా, జిల్లా కమిటీ ప్రతినిధి సుంకరి గిరిబాబు పాల్గొన్నారు. -
రైల్వేజోన్ సాధించే వరకూ పోరాటం ఆగదు
-
రైల్వేజోన్ సాధించే వరకూ పోరాటం ఆగదు
ఆత్మగౌరవ యాత్ర ముగింపు సభలో వైఎస్సార్సీపీ నేతలు సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడే ధైర్యం రాష్ట్ర టీడీపీ, బీజేపీ నాయకులకు లేదని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖకు రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆదివారం ముగిసింది. గత నెల 30న అనకాపల్లిలో ప్రారంభమైన ఈ యాత్రలో అమర్నాథ్ 201 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చివరి రోజు ఆదివారం తగరపువలస జంక్షన్లో జరిగిన భారీ బహిరంగ సభలో మి«థున్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక జోన్, ప్యాకేజీ తెస్తాం.. పరిశ్రమలు తెస్తామని ఇక్కడ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రైల్వేజోన్ వస్తే ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. మూడేళ్లయినా పట్టించుకోకపోవడం దారుణం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏడాదిలో రైల్వేజోన్ తీసుకురాకపోతే రాజీనామా చేస్తామన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మూడేళ ్లయినా పట్టించుకోకపోవడం దారుణ మన్నారు. కేంద్రంలో అధికార పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ హరిబాబు సైతం రైల్వేజోన్ విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక రైల్వే జోన్ పోరాటం ఇక్కడితో ఆగదని, జోన్ సాధించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని గుడివాడ అమర్నా«థ్ స్పష్టంచేశారు. 11 రోజుల యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. -
ఆత్మగౌరవయాత్రకు తరగని ఆదరణ
ఉత్తర,దక్షిణ నియోజకవర్గాల్లో కొనసాగింపు విశాఖపట్నం : రైల్వే జోన్ కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా గుడివాడ అమర్నాథ్కు నగరవాసులు బ్రహ్మరథం పడుతున్నారు. నీ సంకల్పం గొప్పది.. ఎలాగైనా రైల్వేజోన్ సాధించి తీరువావ్.. అంటూ పాదయాత్ర పొడవునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. దారిపొడవునా మహిళలు ఎదురేగి స్వాగతం పలుకుతూ మంగళహారతులిస్తూ దీవిస్తున్నారు. రైల్వేజోన్ కోసం అమర్నాథ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర బుధవారం ఏడో రోజుకు చేరుకుంది. ఏడోరోజు 21.50 కి.మీ మేర నడిచిన అమర్ ఇప్పటివరకు 106 కి.మీ. మేర పాదయాత్రను పూర్తి చేయగలిగారు. తొలుత ఉదయం తాటిచెట్లపాలెం 80 అడుగుల రోడ్డు వద్ద బసచేసిన చోట దళితుల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తర కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరాగా అమర్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవధానుల అజశర్మతో పాటు పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజశర్మ మాట్లాడుతూ హోదా మాదిరిగానే రైల్వే జోన్ ఎగ్గొట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన తెలుగుదేశం పట్టించుకోవడం లేదన్నారు. రైల్వేజోన్‌తో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 80 అడుగుల రోడ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తాటిచెట్లపాలెం మెయిన్‌రోడ్, మహారాణి పార్లర్, జగ్గారావు వంతెన, సంఘం ఆఫీస్, శంకరమఠం రోడ్, దుర్గాగణపతి ఆలయం, బీవీకే కళాశాల, డైమాండ్ పార్కు, దొండపర్తి జంక్షన్, రైల్వే న్యూ కాలనీ, రైల్వే స్టేషన్ సర్కిల్, అల్లిపురం బజారు మీదుగా మనోరమ థియేటర్ ఎదురుగా కల్యాణ మండపం వరకు సాగింది. అక్కడ భోజన విరామం అనంతరం తిరిగి సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర దుర్గలమ్మగుడి, డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా జగదాంబ, అక్కడ నుంచి çహోటల్ దసపల్లా, పూర్ణామార్కెట్, పోస్టాఫీస్, వెలంపేట, ఎవీఎస్ కళాశాల, కలెక్టరేట్, జెడ్పీ సెంటర్ ఆంకోసా ఆడిటోరియం, పందిమెట్ట, గ్రీన్‌పార్కు హోటల్, సెవన్‌హిల్స్, రామ్‌నగర్ మార్కెట్ మీదుగా వేమన మందిరం వరకు సాగింది. బుధవారం పూర్తిగా సామాన్య, మధ్యతరగతి ప్రజలుండే ప్రాంతాల్లో సాగిన పాదయాత్రకు ఆయా ప్రాంతాల ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించింది. అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల్లో నివాసం ఉంటున్న వారు సైతం పాదయాత్రకు ఎదురేగి స్వాగతం పలుకుతూ విశాఖకు జోన్ రావాలంటూ తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. అమర్నా«థ్ కూడా పలుచోట్ల ప్రజలనుద్దేశించి తన ప్రాణాలనైనా ఫణంగా పెట్టి జోన్‌ను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. విభజన హామీల్లో ఇచ్చిన జోన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలుడుతున్నాయని కో ఆర్డినేటర్లు తైనాల విజయకుమార్, కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పాదయాత్రలో పార్టీ కో ఆర్డినేటర్ బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు,సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, శ్రీకాంత్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, పార్టీ నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫరూఖి, నగర అధికార ప్రతినిధి మూర్తియాదవ్, ఎస్సీసెల్ నగరాధ్యక్షుడు బోని శివరామకృష్ణ, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బీఎల్ కాంతారావు,యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
అడుగడుగునా నీరాజనం
⇒ఆత్మగౌరవ యాత్రకు బ్రహ్మరథం ⇒నగరంలో అనూహ్యస్పందన ⇒అమర్‌కు మంగళహారతులు ⇒వామపక్షాల సంఘీభావం విశాఖపట్నం : రైల్వేజోన్ సాధన కోసం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్రకు పార్టీలకతీతంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. సింహాచలంలోని స్వామి వారి కల్యాణమండపం నుంచి మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఆరో రోజు పాదయాత్ర ప్రారంభించిన అమర్ తొలుత గోశాల మీదుగా తొలి పావంచ వద్దకు చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరిగి గోశాల నుంచి శ్రీనివాసనగర్, ప్రహ్లాదపురం, విరాట్‌నగర్ మీదుగా గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్‌కు చేరుకున్న పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడ నుంచి గోపాలపట్నం మెయిన్‌రోడ్డు, బాజీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం మీదుగా ఎన్ఎడీ జంక్షన్‌కు పాదయాత్ర చేరుకుంది. అక్కడ వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి జాతీయ రహదారిపై మర్రిపాలెం వుడా లేవుట్ వరకు పాదయాత్ర సాగింది. అక్కడ భోజన విరామ సమయంలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ యాత్రకు సంఘీభావం తెలిపారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మర్రిపాలెం లేఅవుట్ నుంచి అమర్ పాదయాత్ర ప్రారంభించారు. బీపీసీఎల్–పెట్రోల్ బంక్, బీఆర్టీఎస్ రోడ్డు, బంగారమ్మ గుడి, కేఎస్ఆర్ కాంప్లెక్స్, మాధవధార మెయిన్‌రోడ్, మురళీనగర్ జంక్షన్ వద్ద వామపక్ష నేతలు సుధాకర్, రాంగోపాల్, సనపల ఆంజనేయులు, అమ్మలమ్మ, బొడ్డేపల్లి పాపా రావు తదితరులు సంఘీభావం తెలిపారు. తిరిగి ప్రారం¿¶భమైన పాదయాత్ర మురళీనగర్ మెయిన్‌రోడ్, కప్పరాడ కొండ, బర్మాకాలనీ, ఐటీఐల మీదుగా ఊర్వశి జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ నుంచి కంచరపాలెం, రైల్వే క్వార్టర్స్, తాటిచెట్లపాలెం మీదుగా రాత్రి 8 గంటలకు 80 అడుగుల రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోవడంతో ఆరో రోజు పాదయాత్ర ముగిసింది. మంగళవారం 18.70 కిలోమీటర్ల మేర అమర్ పాదయాత్ర చేయగా.. ఇప్పటివరకు 84.10 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. పాదయాత్ర సాగిన దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు ఎదురేగి స్వాగతం పలుకుతూ మంగళ హారతులు పట్టారు. పలు చోట్ల అమర్‌పై పూల వర్షం కురిపించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్రాధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు కోలా గురువులు, పెట్ల ఉమాశంకర గణేష్, అదీప్‌రాజు, బొడ్డేడ ప్రసాద్, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కంపా హనోక్, రొంగలి జగన్నాథం, జాన్‌వెస్లీ, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, రవిరెడ్డి, పక్కి దివాకర్, సుంకరగిరిబాబు, కొండా రాజీవ్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖరయాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పామేటి బాబ్జీ, బి.శ్యామ్‌కుమార్, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి బి.ఎల్.కాంతారావు, నగర ప్రధాన కార్యదర్శి సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమం నా కోసం కాదు.. భావితరాల భవిష్యత్ కోసమే ఈ ఉద్యమం. శారదా నది తీరంలో మొదలైన ఈ ఆత్మగౌరవ యాత్ర గోస ్తని నది తీరం వరకు కొనసాగుతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని మాత్రమే కోరుతున్నాం. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు రైల్వేజోన్‌పై తమ అధిష్టానాలపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్మనకుండా ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బాబు నిప్పు కాదు.. ఉప్పు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడితే తాను నిజాయితీపరుడినని గొప్పలు చెప్పుకుంటారు. ఆయన నిప్పు కాదు.. ఉప్పు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఓట్లు సంపాదించి ఎమ్మెల్యేలైనవారు చంద్రబాబు ప్రలోభాల కు.. ఆయన ఇచ్చిన నోట్ల కట్టలకు దాసోహమై పార్టీ ఫిరాయించారు. వారికి మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బాబు వస్తే జాబన్నారు. కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి వచ్చింది. గిరిజనులకు కేబినెట్లో చోటు కల్పించకపోవడం చూస్తుంటే వారి పట్ల ఆయనకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతోంది. – గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే రైల్వేజోన్ కోసం అలుపెరగని ఉద్యమం రైల్వేజోన్ కోసం గడిచిన మూడేళ్లుగా ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మా త్రమే. అమర్నాథ్ ప్రా ణాలను సైతం లెక్కచేయకుండా గతేడాది ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ ఏడాది మండుటెండలో పాదయాత్ర చేస్తున్నారు. – బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే -
అలుపెరుగని పయనం
⇒ఐదోరోజు దిగ్విజయంగా సాగిన ఆత్మగౌరవయాత్ర ⇒అన్ని ప్రాంతాల్లోనూ తరగని ప్రజాదరణ ⇒రైల్వేజోన్ ఇవ్వాల్సిందేనని నినాదాల హోరు రోజులు గడుస్తున్నాయి.. ప్రాంతాలు మారుతున్నాయి.. కానీ లక్ష్యం మారలేదు.. పట్టుదల అసలే సడలలేదు.. ఆత్మగౌరవయాత్రకు లభిస్తున్న జనస్పందననే జోష్‌గా మార్చుకొని.. ద్విగుణీకృతోత్సాహంతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.. పాదయాత్రికుడు అమర్‌కు వెన్నుదన్నుగా.. సంఘీభావంగా పార్టీ నాయకులు, శ్రేణులు నిలుస్తున్నారు.. ఆయన అడుగులో అడుగేస్తూ ముందుకు సాగుతుంటే ఆత్మగౌరవయాత్ర సాగిన మార్గం పొడవునా మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు జయజయధ్వనాలతో రైల్వేజోన్ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. మద్దతు ప్రకటిస్తున్నారు. వారి నినాదాల హోరు మధ్య ఐదోరోజు ఆత్మగౌరవ యాత్ర షీలానగర్ నుంచి సింహాచలం గోశాల వరకు దిగ్విజయంగా సాగింది. విశాఖపట్నం : రైల్వే జోన్ సాధనకై వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తలపెట్టిన ఆత్మగౌరవ యాత్ర నిర్విఘ్నంగా సాగుతోంది. అడుగడుగునా అమర్‌కు జనం హారతులు పడుతున్నారు. ఐదో రోజైన సోమవారం ఉదయం గవర జగ్గయ్యపాలెంలో నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు పలువురు నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి అమర్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జిల్లా నుంచి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్నారు. సత్తమ్మతల్లి జంక్షన్, సత్తివానిపాలెం, కోట నరవ, నరవ వరకు పాదయాత్ర చేసి భోజన విరామం తీసుకున్నారు. తిరిగి సాయంత్రం కొత్తపాలెం జంక్షన్, కొత్తపాలెం బ్రిడ్జి, గోపాలపట్నం మెయిన్ రోడ్డు, శ్రీరాంనగర్ మీదుగా ఆర్.ఆర్.వి.పురం జంక్షన్, నాయుడు తోట నుంచి వేపగుంట వరకూ పాదయాత్ర చేపట్టి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు ఆయన రాకకోసం అప్పటికే అక్కడ ఎదురు చూశారు. వారినుద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు ఆర్ఆర్వి పురంలో పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి చల్లాయమ్మ ఎదురువచ్చి అమర్‌కు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. వేపగుంట నుంచి ముందుకు కదిలిన అమర్ గోశాల, గవర్నమెంట్ హాస్పటల్ వద్దకు చేరుకున్నారు. సమీపంలోని స్వామి కల్యాణమండపంలో అమర్నాథ్ రాత్రి బస చేశారు. పాదయాత్రలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు అదీప్‌రాజు, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, కరణం ధర్మశ్రీ,, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు, రాష్ట్ర బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్, రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, రొంగలి జగన్నాథం, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ బయ్యవరపు రాధ, కార్యదర్శి పొట్నూరు విజయకుమార్, రూరల్ జిల్లా ప్రచార కార్యదర్శి పోతల ప్రసాద్, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి సేనాపతి అప్పారావు, భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, నగర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శ్రీదేవివర్మ, నగర మహిళా కార్యదర్శి యువశ్రీ, నగర మహిళా అధికార ప్రతినిధి మళ్ల ధనలత పాల్గొన్నారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉందా? వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొన్న చంద్రబాబుకు నీతి నిజాయితీ ఉందా అని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. రైల్వే జోన్ కోసం అమర్నా«థ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్రకు ఉత్తరాంధ్ర మొత్తం మద్దతు పలుకుతోందన్నారు. విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉన్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాలాగే రైల్వే జోన్‌ను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు.. అమలుకాని హామీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. అడ్డదారిలో వెళితే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడో ముఖ్యమంత్రి ఆయ్యేవారన్నారు. అలాంటి వంచనలు, అడ్డదారులు చంద్రబాబుకు మాత్రమే తెలుసునన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అడ్డదారిలో తమ పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబును జనం ఛీదరించుకుంటున్నారన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్న జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. -
సమష్టి పోరాటంతో రైల్వేజోన్
⇒వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ⇒సాగరతీరంలో బీచ్‌వాక్ ⇒రైల్వేజోన్ ఆవశ్యకతపై వాకర్స్‌కు అవగాహన బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): ఏళ్ల తరబడి రైల్వే జోన్ విషయంలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నా రు. రైల్వే జోన్ కోరుతూ ఈ నెల 30 నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం సాగర తీరంలో పార్టీ నాయకులతో ఆయన బీచ్ వాక్ చేపట్టారు. ‘ఈస్ట్‌కోస్ట్ హటావో వాల్తేర్ బచావ్’ అంటూ నినాదాలు చేస్తూ వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్ వరకు ఈ వాక్ సాగింది. ప్రత్యేక రైల్వే జోన్ ఆవశ్యకతను వాకర్స్‌కు వివరిస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే జోన్‌పై చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణకి నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఈ నెల 30 నుంచి 11 రోజుల పాటు పాదయాత్ర చేపడతారని చెప్పారు. అనంతరం గుడివాడ అమర్నా«థ్ మాట్లాడుతూ విభజన చట్టంలో ఆరు నెలల సమయంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని పొందిపరిచినా, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఎంత కాలం ప్రజలను మోసగిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వెంకయ్య మాయమాటలు చెప్పడం తప్ప, విశాఖకు ఒరిగిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీచ్ వాక్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కోలా గురువులు, తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, కొండేటì æచిట్టిబాబు(పి.గన్నవరం), రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, మిండగుదిటి మోహన్, గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, పార్టీ సీనియర్ నాయకులు విజయకుమార్‌రాజు, పార్టీ 20వ అధ్యక్షుడు పితాల వాసు, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే జోన్ సాధించే వరకూ పోరాటం
-
రైల్వే జోన్ సాధించే వరకూ పోరాటం
► చంద్రబాబు, వెంకయ్యల స్వప్రయోజనాల కోసం ఏపీకి అన్యాయం ► వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజం ► ఆత్మగౌరవ యాత్ర జయప్రదం చేయాలని గాజువాకలో ప్రచారం గాజువాక : విశాఖ కేంద్రంగా విశాఖ, గుంతకల్, గుంటూరులతో కూడిన రైల్వేజోన్‌ను సాధించేవరకూ తమ పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యు డు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఈనెల 30 నుంచి చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ గాజువాకలో శుక్రవారం నిర్వహించిన పాదయాత్రను విజయసాయిరెడ్డి ప్రారంభించారు. బీసీ రోడ్‌లోని వైఎస్ విగ్రహం వద్ద ప్రారంభమైన పాదయాత్ర గాజువాక మెయిన్రోడ్మీదుగా పాతగాజువాక జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు విద్యా సంస్థలు, రైల్వే జోన్‌తోపాటు పలు రాయితీలను ఇవ్వాలని నిర్ణయించారన్నారు. అద్దె భవనాల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నామంటూ కంటితుడుపు చర్యలతో సరిపెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తమ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ఎలాంటి హక్కులు సాధించలేదని, రాష్ట్రానికి సహజంగా రావాల్సిన నిధులను కూడా తాము సాధించేశామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా దాని ఊసే ఎత్తడంలేదన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం జగన్ మోహన్‌రెడ్డి వివిధ పోరాటాలు సాగిస్తున్నారన్నారు. రైల్వే జోన్ కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. రెండోదశ పోరాటంలో భాగంగా ఈనెల 30 నుంచి ఆత్మగౌరవ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జోన్‌ను సాధించడం కోసం ప్రజలను సిద్ధం చేయడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నామన్నారు. అనకాపల్లి నుంచి భీమిలి వరకు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్రను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, నాయకులు గరికిన గౌరి, ఉరుకూటి అప్పారావు, బొడ్డు నర్సింహపాత్రుడు (కేబుల్ మూర్తి), మార్టుపూడి పరదేశి, రాజాన వెంకటరావు, నక్క వెంకట రమణ, రాజాన రామారావు, ఎస్.శ్రీనివాస్‌గౌడ్, రాజ్‌కుమార్ ఆచార్య, తిప్పల వంశీరెడ్డి, ఎన్నేటి రమణ, రావాడ శివ, ధర్మాల శ్రీను, చిత్రాడ వెంకట రమణ, పల్లా చినతల్లి, రెడ్డి జగన్నాథం, ఈగలపాటి యువశ్రీ, మారిశెట్టి మల్లెపూలు, పల్లా పెంటరావు, గంగాభాయి, పూర్ణానందశర్మ, షౌకత్ ఆలీ, బోగాది సన్ని, తిప్పల దేవన్‌రెడ్డి, కటికల కల్పన, బొడ్డ గోవింద్, రోజారాణి, ప్రగడ వేణుబాబు, ఎన్.ఎస్.ఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలు తప్పిన రైల్వే జోన్!
ఆంధ్రకు ఓకే.. కానీ విశాఖకే డౌటు కేంద్రం వైఖరిని పరోక్షంగా వెల్లడించిన బీజేపీ జాతీయ నేత విలేకరుల సమావేశంలో విశాఖ ప్రస్తావనపై మౌనం గుచ్చి గుచ్చి అడిగినా సమాధానం దాటవేత ఎమ్మెల్సీ ప్రచారంలోనూ వ్యూహాత్మకంగా విస్మరణ విశాఖ రైల్వే డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలన్నది ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక.. ఉద్యమాలకు ఊపిరులూదిన దశాబ్దాల డిమాండ్.. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టంలోనూ నాటి కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.. కానీ ఎన్నికలు జరిగి కొత్తగా అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇంకా ‘పరిశీలన’ పేరుతోనే కాలక్షేపం చేస్తున్నాయి..దీనిపై ఐక్యంగా ఒత్తిడి తేవాల్సిందిపోయి.. కొందరు టీడీపీ ఎంపీలు విజయవాడ లేదా గుంటూరులో జోన్ ఏర్పాటు చేయాలని కొత్త పల్లవి అందుకున్నారు.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సైతం స్పష్టత ఇవ్వకుండా.. జోన్ ఆంధ్రకు వస్తుందని వక్కాణించారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా జోన్ డిమాండ్ గురించి లేశమాత్రంగానైనా ప్రస్తావించడం లేదు.. ఇవన్నీ చూస్తే.. విశాఖ రైల్వే జోన్ పట్టాలు తప్పిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఈ జోన్ మంజూరును రెండున్నరేళ్లుగా అదిగో.. ఇదిగో.. అంటూ వాయిదాలేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం చివరకు తన వైఖరిని ఆ పార్టీ నేతలు పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలన్న నిర్ణయం జరిగిందని.. త్వరలోనే రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటన చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని జరిగిన విలేకర ఆయన మాట్లాడుతూ కేంద్రం వైఖరిని తేటతెల్లం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జోన్ ప్రకటన తేదీ వెలువడుతుందని చెప్పారు. కానీ విశాఖకే ఇస్తారా లేదా అన్నదానిపై మౌనం వహించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పీవీ మాధవ్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం బీజేపీ శ్రేణులు విశాఖ కేంద్రంగా శ్రమిస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావులతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక్కడే తిష్టవేసి ప్రచార వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. అందులో భాగంగానే మురళీధరరావు వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో చేస్తోందని, త్వరలో ఏపీకి రైల్వే జోన్ కూడా ఇచ్చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే జోన్ ఏపీకా? విశాఖకా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. పదేపదే నిలదీయగా ఆయన పక్కనే కూర్చున్న విశాఖ ఎంపీ హరిబాబు జోక్యం చేసుకుని విభజన చట్టానికి అనుగుణంగా నిర్ణయం జరుగుతుందని దాటేవేశారు. ఈ నెల 9న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అందువల్ల ఈ సమయంలో రైల్వే జోన్ విశాఖకు రాదని తేలితే పట్టభద్రుల ఓట్లు ఎక్కడ దక్కకుండా పోతాయోనన్న భయం బీజేపీ నేతలను వెంటాడుతోంది. అందువల్లే రైల్వే జోన్‌ను ఎమ్మెల్సీ ఎన్నికలయ్యే దాకా ప్రకటన చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ నాయకులు రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేకుండా, దానికి ప్రాధాన్యమివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర సాధారణ బడ్జెట్లోనూ రైల్వే జోన్ గురించి ప్రస్తావించని విషయం తెలిసిందే. అయినప్పటికీ విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులకు ఎక్కడో పిసరంత ఆశ ఇన్నాళ్లూ సజీవంగా ఉంది. కానీ తాజాగా బీజేపీ జాతీయ నేత మురళీధరరావు నోట వచ్చిన మాటతో ఆఖరి ఆశలు కూడా గల్లంతైపోయినట్టయింది. ఇక విశాఖకు రైల్వే జోన్ రాదని దాదాపు స్పష్టమైపోయింది. ఇదే విషయం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. రైల్వే జోన్ విశాఖలో కాకుండా విజయవాడలో ఏర్పాటు చేస్తారన్న ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. ఇప్పుడు అదే నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. -
రైల్వే జోన్ కోసం మహాసంకల్పం
అనకాపల్లి నుంచి భీమిలి వరకూ 250 కిలోమీటర్లు.. వచ్చే నెల 9 నుంచి ప్రారంభం విశాఖపట్నం : సామాన్యుడి గుండె చప్పుడు వినేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేసిన మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో.. నాయకుడంటే జనం గుండెల్లో నిలిచేవాడేనని ఆయన చెప్పిన మాటల స్ఫూర్తితో.. విశాఖ ప్రజల చిరకాల కల అయిన రైల్వే జోన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో బృహత్తర యజ్ఞానికి అంకురార్పణ చేయనుంది. ప్రజల కష్టాలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం కన్ను తెరిపించడం కోసం అనకాపల్లి న జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాదయాత్ర చేయనున్నారు. వచ్చే నెల 9వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ పాదయాత్రను ప్రారంభించి 250 కిలోమీటర్లు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దశాబ్దాల కల కోసం.. దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న విశాఖ వాసులు నేటికీ రైల్వే జోన్ జాడ లేకపోవడంతో నిరాశలో ఉన్నారు. జోన్ వస్తే యువతకు ఉపాధి లభించడంతోపాటు కుటుంబాలు బాగుపడతాయన్న వారి ఆశలకు వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్కరే బాసటగా నిలిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా రు. తమ నాయకుడిని ఆదర్శంగా తీసుకుని, ఆయన సూచనల మేర కు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్ గతేడాది ఏప్రిల్ 14న రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశారు. విశాఖ ప్రజలతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆ ప్రభంజనాన్ని తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం దీక్షను భగ్నం చేస్తే.. నేనున్నానంటూ ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి వెంటనే విశాఖ వచ్చి అమర్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోరాటం ఇక్కడితో ఆగిపోదని, మరింత ఉధృతం చేద్దామని చెప్పి వెళ్లారు. ఆ మాటలే నేటి పాదయాత్ర ఆలోచనకు అంకురార్పణ చేశాయి -
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
– రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన అనంతపురం ఎడ్యుకేషన్ : గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సమాఖ్య, రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా బయలుదేరి టవర్‌క్లాక్ మీదుగా రైల్వేస్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ జోన్‌కు గుంతకల్లు అన్ని విధాలా అనుకూలం అన్నారు. అలాగే అనంతపురం రైల్వే స్టేషనల్లో అన్ని రైళ్లూ ఆపాలన్నారు. సామాన్యులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం స్టేషన్ మాస్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి కన్వీనర్ వై.రాజశేఖర్‌రెడ్డి, విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఎస్.సీమకృష్ణ, నాయకులు భార్గవ, కుమార్‌నాయక్, భగ్గీ, రవినాయక్, మల్లికార్జున, శ్రీనివాస్, హరికృష్ణ పాల్గొన్నారు. -
గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలి
అనంతపురం రూరల్ : గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి, విద్యార్థి సమాఖ్య నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కృష్ణానాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతవాసులే రాష్ట్రాన్ని పాలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. భౌగోళికంగా గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటిస్తే ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకూ అతితక్కువ సమయంలో వెళ్లగలిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని అప్పటి బ్రిటీష్ ఇంజనీర్లు సైతం ధృవీకరించారని గుర్తు చేశారు. అయినప్పటికీ పాలకులు తమ స్వార్థం కోసం విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం ప్రయత్నించడం అన్యాయమన్నారు. మన పాలకుల పుణ్యమా అని రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, కడప ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణారావు, నాగార్జున రెడ్డి, బండి నారాయణస్వామి, ఎస్కేయూ ప్రొఫెసర్ సదాశివారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
'రైల్వే జోన్ విశాఖ కేంద్రంగానే వస్తుంది'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే బాగుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విశాఖలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేశ్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగానే వస్తుందని అన్నారు. దీనిపై తాము ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని సురేశ్‌రెడ్డి తెలిపారు. -
గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి (ఆర్వీఎస్) రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని జోన్‌ను గుంతకల్లుకు కేటాయించాలనే డిమాండ్‌తో అక్టోబర్ 1న గుత్తి నుంచి గుంతకల్లు వరకు నిర్వహించే పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల గేటు ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గుంతకల్లు జోన్ ఏర్పాటుకై చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. -
కేంద్రంలో చక్రం తిప్పేస్తున్నానని...
రైల్వేజోన్ ఉద్యమంపై వెంకయ్య వెటకారం దాని వెనుక మర్మమేమిటి పోలవరానికి, రైల్వేజోన్‌కు ఏమైనా సంబంధం ఉందా? దాన్ని సాకుగా చూపి జోన్‌ను త్యాగం చేయమనడమేమిటి మరోసారి ఉత్తరాంధ్రకు అన్యాయం జరగనుందా కేంద్రం లీకుల వెనుక అర్థం అదేనా..??? నాటి కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఘనమైన చారిత్రక ఉనికి.. వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర అనడంలోనే కుట్ర ఉందన్న చరిత్రకారుల వాదనలకు బలం చేకూరేలా నేటి టీడీపీ, బీజేపీ పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆశ.. శ్వాసగా మారిన రైల్వేజోన్ డిమాండ్‌ను చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారు. జోన్ విజయవాడకిస్తే ఏంటి.. అది మన రాష్ట్రంలో లేదా? అని ఓ టీడీపీ ఎంపీ లైట్ తీసుకుంటే.. బీజేపీ పెద్దాయన వెంకయ్య ఏకంగా వ్యంగ్య భాషణమే చేశారు. నాలుగు రోజుల కిందట నగరానికి వచ్చిన ఆయన రైల్వేజోన్ ఉద్యమాన్ని కేవలం పనీపాటా లేనివాళ్లు చేసే రాద్ధాంతంగా కొట్టిపారేశారు. కనీసం విశాఖకు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని మాట మాత్రంగా కూడా చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. ఇక సీఎం చంద్రబాబు యథావిధిగా విశాఖకే రైల్వేజోన్ ఇప్పించేందుకు కృషి చేస్తామని పాతపాటే పాడుతున్నా ప్రత్యేక హోదా విషయంలో జరిగిన నాటకీయ పరిణామాలు చూసి ఆయన మాటల విశ్వసనీయతపై ఉద్యమకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేజోన్ వ్యవహారంపై అసలేం జరుగుతోంది?.. ఈ డిమాండ్‌ను ఎటు తిప్పి ఎటు తీసుకువెళ్లాలని పాల కులు చూస్తున్నారో.. ఈ వారం విశాఖతీరంలో అవలోకిద్దాం.. కేంద్రంలో చక్రం తిప్పేస్తున్నానని, పాతికమంది కేంద్ర మంత్రులను ఇంటికి పిలిపించి మాట్లాడగలనని వెంకయ్య పదే పదే చెప్పుకుంటారు. ఇటీవలి బీజేపీ కార్యకర్తల సమావేశంలోనూ ఈ మాట నొక్కి చెప్పారు. గడ్కరీని ఏమోయ్ అంటే.. ఆయన వెంకయ్యాజీ... అని అంటారని సెలవిచ్చారు. మరి ఇంత పట్టున్న వెంకయ్య రైల్వేజోన్ విశాఖకే వస్తుంది.. ఎక్కడికీ పోదు.. ఆందోళన వద్దు.. అని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నదే అంతపట్టని ప్రశ్న. ఆయనగారి అసహనమే.. రైల్వేజోన్ వేరేచోటకు తరలిపోతోందా అన్న సందేహాలను మరింత పెంచింది. బీజేపీలోని ఓ వర్గం ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్న వాస్తవమేమిటంటే.. రైల్వేజోన్ విజయవాడకు ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపుతోందట! బోడిగుండుకు.. మోకాలికీ ముడివేయడంటే ఇదేనేమో. రైల్వేజోన్‌కు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ముడిపెట్టిందట. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాలకు ముంపు ముప్పు ఉందని ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు రైల్వేజోన్‌ను విశాఖకు ఇవ్వకుండా యథాతధంగా వాల్తేరు డివిజన్‌ను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ జోన్లోనే ఉండనిస్తే.. పోలవరం నిర్మాణానికి అడ్డు చెప్పకుండా ఆ రెండు రాష్ట్రాలను ఒప్పిస్తామని కేంద్రం చెబుతోందట. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామని హామీనిచ్చిన రైల్వేజోన్‌ను విజయవాడ, గుంటూరు మధ్యలో నెలకొల్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉందట. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీరు విశాఖ పారిశ్రామిక రంగానికి అవసరం కాబట్టి.. ఆ మేరకు రైల్వేజోన్‌ను త్యాగం చేయాలని విశాఖ నేతలకు కేంద్రం సూచిస్తోందట!.. రాష్ట్రానికి రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు రెండూ రావాలంటే విశాఖ(వాల్తేరు) రైల్వే డివిజన్‌ను ఒడిశాకు వదులుకోక తప్పదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర పెద్దలు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని.. అయితే ఇప్పటికిప్పుడు ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. బీజేపీ నేతల్లో ఈ చర్చే ఇప్పుడు జోరుగా నడుస్తోంది. భావేద్వోగ సమస్యలకు, న్యాయపరమైన డిమాండ్లకు ఎక్కడైనా ఇలా ముడిపెడతారా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఈస్ట్‌కోస్ట్ జోన్లో బంగారు బాతుగుడ్డులాంటి వాల్తేరు డివిజన్‌ను వదులుకునేందుకు ఒడిశా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ఆ రాష్ట్రాన్నే సాకుగా చూపి ఇన్నేళ్లుగా దగా చేసిన విశాఖను మరోసారి పోలవరం పేరుతో మోసం చేసేందుకు పాలకులు పెద్ద కుట్రకు తెరలేపారని ఉద్యమకారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్.. జూన్ 2014.. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యవిజయం సాధించిన ఊపుతో బీజేపీ నేతలు విశాఖలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం చేశారు. ఆ సందర్భంగా వెంకయ్య భావోద్వేగంతో ప్రసంగించారు. ‘నా రాజకీయ జీవితానికి విశాఖలోనే పునాది పడింది. విశాఖను ఎప్పటికీ మరిచిపోలేను. నగరంతో ఎంతో అనుబంధం ఉంది.. ఇక్కడి ప్రజల డిమాండ్ రైల్వేజోన్‌తో సహా సమస్యలన్నీ పరిష్కరిస్తాను’ అని వాగ్దానం చేశారు. తాజా సీన్.. సెప్టెంబర్ 2016.. అదే వెంకయ్యగారు నాలుగు రోజుల కిందట నగరానికి విచ్చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ‘ఏం తమాషాగా ఉందా.. రైల్వేజోన్‌పై ఉద్యమమేంటి.. పనీపాటా లేని వాళ్లు ఏవో చేసేస్తే సరిపోతుందా.. జోన్ విశాఖకో.. విజయవాడకో..సుబ్బారావుకో.. అప్పారావుకో.. ఎవరికివ్వాలో ఇంకా కేంద్రం ఏమీ ప్రకటించకుండానే ఏమిటీ రాద్ధాంతం’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ విశాఖకే వస్తుందన్నభరోసా ఎందుకివ్వడం లేదు? బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడైన విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు వైఎస్సార్ జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ వివాదంపై ఇక్కడ పుంఖానుపుంఖాలుగా పత్రికలకు లేఖలు పంపిస్తారు. కానీ తనను పార్లమెంటుకు పంపిన విశాఖ ప్రజల చిరకాల డిమాండ్ రైల్వేజోన్‌పై మాత్రం ఏమీ మాట్లాడరు. కనీసం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికైనా సభావేదిక నుంచి రైల్వేజోన్‌పై బహిరంగంగా విజ్ఞప్తి చేయరు. అది ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగ సమస్యగా మారిందని ప్రజల సమక్షంలోనే ఆయన దృష్టికి తీసుకువెళ్లరు. రైల్వేజోన్ ఉద్యమం పనీపాటాలేని వాళ్లు చేస్తున్న రాద్ధాంతంగా వెంకయ్య తీసిపారేసిన ప్పుడైనా.. ఇక్కడి ప్రజలది న్యాయమైన డిమాండ్ సార్.. అని చెప్పలేరు. పోనీ బహిరంగంగా కాకున్నా అంతర్గత సంభాషణల్లోనైనా ఆయన దృష్టికి తీసుకువెళ్లగలరా?.. అంటే అనుమానమే. అందుకే హరిబాబు సహా బీజేపీ నేతలు వెంకయ్య వెళ్లిన తర్వాత రైల్వేజోన్‌పై స్పష్టత లేని ప్రకటనలే చేస్తున్నారు. మావంతు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారే తప్ప జోన్ విశాఖకే వస్తుందని మాత్రం చెప్పే సాహసం చేయడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వేజోన్ ఏమవుతుంది.. కేంద్రం లీకులు ఇస్తున్నట్లు విజయవాడకే తరలిపోతుందా.. లేక ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌కు కేంద్రం తలొగ్గుతుందా.. అన్నది కాలమే నిర్ణయించాలి. -
విశాఖలో రైల్వే జోన్‌పై ఆందోళనలు
-
'విజయవాడలో రైల్వే జోన్ ఒప్పుకోం'
విశాఖపట్నం: విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఒప్పుకునే ప్రసక్తి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్ నాథ్ అన్నారు. విశాఖపట్నంలోనే రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం తాను గతంలో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే శాఖమంత్రి సురేశ్ ప్రభు కూడా విశాఖపట్నంలోనే రైల్వే జోన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారని, పలు పత్రికల్లో కూడా ఈ విషయం వచ్చిందని అన్నారు. ఈ రోజు మాత్రం కేంద్రంలోని బీజేపీ నేతలు, టీడీపీ పార్లమెంటరీ సభ్యులు మాట్లాడే మాటలు చూస్తుంటే అనుమానించాల్సి వస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో విశాఖలోనే రైల్వే జోన్ పెట్టాలని డిమాండ్ చేశారు. -
విజయవాడలో రైల్వే జోన్ ఒప్పుకోం
-
హోదా లేదు.. సాయమే..
- ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు న్యాయపరమైన అడ్డంకులు: సుజనా వెల్లడి - ఏటా రూ.3 వేల కోట్ల వరకు సాయం ఉండొచ్చు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్న మాట నిజమేనని కేంద్రమంత్రి వైఎస్ చౌదరి (సుజనాచౌదరి) చెప్పారు. హోదా లేకుండానే.. ప్రత్యేక హోదా ఉంటే ఎంత సాయం అందుతుందో ఆ మేరకు నిధులు అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. గురువారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, రాయపాటి సాంబశివరావు, మాల్యాద్రి శ్రీరాంతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సాధారణంగా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం వాటా 70 శాతం, రాష్ట్రం వాటా 30 శాతం ఉండేది. ప్రస్తుతం అది 60ః40గా ఉంది. అదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు 90ః10 నిష్పత్తిలో గ్రాంట్లు ఉండేవి. అంటే ప్రత్యేక హోదా లేకపోతే కేంద్ర వాటాలో 30 శాతం వాటా మనకు తగ్గుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంపై ఎంత భారం పడుతుందో అంతమేర నిధులు ఇవ్వాలని, హోదా లేకుండానే సాయం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎంతమేర ఉంటుందన్నది వాళ్లు లెక్క కడుతున్నారు. ఏటా రూ. 2,500 కోట్ల నుంచి రూ. 3 వేల కోట్ల వరకు ఉంటుందని మా అంచనా. ప్రత్యేక హోదా ఇవ్వటంలేదని స్పష్టమైనట్టేనా అన్న ప్రశ్నకు.. ‘ప్రత్యేక హోదాపై మీరు కోటిసార్లు అడిగినా స్పష్టత ఇదే. అది చట్టంలో లేదు. అది మన డిమాండ్ మాత్రమే..’ అని చెప్పారు. మెరుగ్గానే ఇస్తున్నట్టు.. ప్రత్యేక హోదా ద్వారా అనేక ప్రాజెక్టులు, రాయితీలు, తద్వారా పరిశ్రమలకు పెట్టుబడులు లభించేవి కదా? అన్న ప్రశ్నకు.. ‘14వ ఆర్థిక సంఘం వచ్చాక కేంద్ర పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు కేటాయింపులు 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగాయి. బడ్జెటరీ కేటాయింపులు మారిపోయాయి. ఇప్పుడు వాళ్లు చెబుతున్నట్టుగా ఇస్తే.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కంటే మనకు మెరుగ్గానే ఇస్తున్నట్టు లెక్క..’ అని సుజనాచౌదరి పేర్కొన్నారు. రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం ఒప్పుకుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు ఆరేళ్ల పాటు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. ఎక్కువే ఉండొచ్చు : రైల్వేలైన్లు, రహదారులు, ఇవన్నీ కలిపి రూ.1,10,000 కోట్ల ప్యాకేజీ ఉంటుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘వాటన్నింటినీ గణిస్తే ఎక్కువే ఉండొచ్చు..’ అని సుజనా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏమేం చేశారు, ఇంకా ఏమేం చేయాలనే స్టేట్మెంట్ తయారు చేస్తున్నారని చెప్పారు.పోలవరం ప్రాజెక్టుకు 11వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా భరించాలనే నిబంధన అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. రైల్వేజోన్ అంశం ఇంకా చర్చల్లోనే ఉందన్నారు. కడప స్టీలు ప్లాంటును ప్రస్తావిస్తూ మరో కమిటీ వేశారనీ, ప్రత్యామ్నాయ పద్ధతిలో అమలుచేస్తామన్నారు. పోర్టులు, విమానాశ్రాయాలు అభివృద్ధి చేస్తారన్నారు. -
ఏపీకి రైల్వే జోన్ ప్రకటించాలి
-
‘వాతావరణం’ అనుకూలించ లేదట!
అందుకే రైల్వే మంత్రి రాలేదట.. రైల్వే జోన్ ప్రకటనపై సరికొత్త ఎత్తుగడ మరోసారి విశాఖ వాసులకు దగా విశాఖపట్నం: చిన్నపాటి వర్షం వస్తే చాలు.. చిన్నపిల్లలు దానిని ఆసరాగా తీసుకుని బడికె ళ్లడం మానేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి రైల్వే జోన్‌పై ప్రకటన నుంచి తప్పించుకోవడానికి ఆ వర్షాన్నే ఆసరాగా చేసుకున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే జోన్‌పై ప్రకటన చేస్తారంటూ నానా హంగామా చేశారు. ఆయన విశాఖ రావడమే తరువాయి అన్నంతగా ప్రచారం సాగించారు. దీంతో తమ చిరకాల కల నిజంగా సాకారమవుతుందని విశాఖ వాసులు తెగ సంబరపడ్డారు. ఇంతలో 24 గంటలైనా గడవక ముందే వారి పర్యటన రద్దయిపోయింది. అందుకు వర్షాలు, వాతావరణం అడ్డుపడ్డాయన్నమాట! పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్రలో తేలికపాటి వానలే కురుస్తున్నాయి. ఆవర్తనమంటే అల్పపీడనం కన్నా బలహీనంగా ప్రభావం చూపుతుంది. ఈదురుగాలులు, పెనుగాలులకూ ఆస్కారమివ్వదు. ప్రశాంత వాతావరణంతో వానలు కురుస్తాయి తప్ప ఎలాంటి అనర్థాలకు తావివ్వదు. భారీ వర్షాలూ కురవవు. విమాన సర్వీసులూ రద్దు కావు.. కాలేదు. కానీ బంగాళాఖాతంలో ఆవర్తనంతో తలెత్తిన వాతావరణ పరిస్థితుల వల్ల ఈనెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభుల విశాఖ పర్యటన రద్దయినట్టు అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వాస్తవానికి విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనీ తేటతెల్లమయింది. ఇంతలో సాక్షాత్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొత్తగా మన రాష్ట్రం నుంచే రాజ్యసభకు ఎన్నికవడంతో రైల్వే జోన్‌కు మోక్షం కలుగుతుందని అంతా ఆశపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, టీడీపీ నేతలు సురేష్ ప్రభు విశాఖ వస్తున్నారని, జోన్‌పై ఆయన ఇక్కడే అనుకూల ప్రకటన చేస్తారని ఊదరగొట్టారు. పత్రికలు, టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఈసారి నెపాన్ని వర్షం, వాతావరణంలపైకి నెట్టేసి రైల్వే మంత్రి తన పర్యటనను రద్దు చేసుకుని తప్పించుకున్నారు. రైల్వే జోన్ ఆశలపై నీళ్లు చల్లారు. విశాఖ వాసుల్ని మరోసారి దగా చేశారు. మోకాలికీ, బోడి గుండుకూ ముడిపెట్టారన్న సామెతను నిజం చేస్తున్నారంటూ జనం నిట్టూరుస్తున్నారు. -
రైల్వే జోన్‌పై పోరాటం కొనసాగుతుంది
విశాఖపట్నం: విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంగళవారం ఆయన్ను కేజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. విశాఖలో రైల్వే జోన్ కోసం ఐదు రోజుల పాటు నిరవధిక దీక్ష చేసిన విషయం తెలిసిందే. -
దీక్షాభగ్నంపై వైఎస్సార్సీపీ నిరసనలు
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ దీక్షాభగ్నంపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఇంఛార్జ్ అదీప్ రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనకాపల్లి జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొడ్డేటి ప్రసాద్, విశాఖ టౌన్ కన్వీనర్ జానకీ రామరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. స్టీల్ ప్లాంట్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ కోసం అమర్నాథ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. -
విశాఖ రైల్వే జోన్‌పై అఖిలపక్ష భేటీ
విశాఖ: విశాఖ రైల్వే జోన్‌పై సోమవారం అఖిలపక్ష నాయకులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ కార్యాలయం వద్ద భేటీయ్యారు. ఈ సమావేశమానంతరం అఖిలపక్షం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ప్రజా న్యాయవాద సంఘాలు హజరయ్యారు. రైల్వే జోన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ భేటీలో నాయకులు చర్చించనున్నారు. -
రైల్వేజోన్ పట్టని టీడీపీ
కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం శోచనీయం : ఉమ్మారెడ్డి సాక్షి, విశాఖపట్నం: కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ కోసం ఒత్తిడి తీసుకురాకపోవడం శోచనీయమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఒడిశాలో రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ ఇవ్వకుండా అన్యాయం చేస్తోందన్నారు. రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అమర్నాథ్కు సంఘీభావం తెలపడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు వస్తారన్నారు. ఇలా ఉండగా శనివారం రాత్రి కేజీహెచ్ వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ విజయ్‌లు దీక్షా శిబిరానికి వచ్చి అమర్నాథ్కు వైద్య పరీక్షలు చేశారు. బీపీ 110/70, ఆక్సిజన్ 97, బ్లడ్ షుగర్ 82 మిల్లీగ్రాములు, హార్ట్‌బీట్ 111 ఉందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
సమర స్ఫూర్తి
రైల్వేజోన్ సాధనే ఏకైక లక్ష్యం అమర్నాథ్ నిరవధిక దీక్ష {పారంభం పార్టీలు, ప్రజా సంఘాల సంఘీభావం భారీ ర్యాలీలో హోరెత్తిన జోన్ నినాదాలు పాలకుల నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహ జ్వాలలు ఫోన్ చేసి భరోసా ఇచ్చిన వై.ఎస్.జగన్ భానుడి భగభగలను తలదన్నేలా ఉద్యమస్ఫూర్తి రగిలింది.. రైల్వే జోన్ కోసం నేను సైతం.. అంటూ నినదించింది. ఉక్కు సంకల్పం.. సమర దీక్షగా మారింది. పోరాడితే పోయేదేం లేదు.. రైల్వే జోన్ సాధించడం తప్ప.. అన్నట్లు వేల గొంతుకలు ఒక్కటై జోన్ దీక్షకు జై కొట్టాయి. పదం పదం కలిపి ర్యాలీగా అడుగులు కదిపి దీక్షాస్థలికి చేరుకున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాల దీప్తి.. దివంగత మహానేత వైఎస్ పోరాట స్ఫూర్తి.. సీఎస్ రావులాంటి పెద్దల ఆశీస్సులు తోడుండగా అమర్నాథ్ నిరవధిక దీక్షకు అంకురార్పణ జరిగింది. రాజకీయాలకతీతంగా సంఘీభావం కొండంత అండగా నిలిచింది. విశాఖపట్నం మండుటెండ మంటపెడుతున్నా లెక్క చేయకుండా రైల్వే జోన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విశాఖకు రైల్వేజోన్ సాధనే ఏకైక లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గురువారం ప్రారంభించిన నిరవధిక దీక్షకు ఉత్తరాంధ్ర నుంచి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంటరాగా అమర్నాథ్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి వేలాదిమందితో భారీ ర్యాలీగా జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షా వేదికకు చేరుకున్నారు. రిటైర్డ్ ఐఈఎస్ అధికారి సీఎస్ రావు ఆశీర్వాదం తీసుకుని ఉదయం 11గంటలకు అమర్నాథ్ దీక్ష చేపట్టారు. సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమర్నాథ్కు ఫోన్ చేసి మరీ దీక్షకు పార్టీ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఈ దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, వి.కళావతి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డిశాంతి తదితరులు కూడా హాజరై మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్ ప్రసాద్, గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్. నర్సింగరావు, లోక్‌సత్తా భీశెట్టి బాబ్జీలతోపాటు పలు ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక, జర్నలిస్టు సంఘాలు, ఎన్జీవోలు కూడా ఈ దీక్షకు పూర్తి సంఘీభావం తెలపడం విశేషం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ముప్పేట దాడి విశాఖ రైల్వేజోన్ ప్రకటించకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతున్న టీడీపీ, బీజేపీలపై ఈ దీక్షలో వక్తలు విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి లోపానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంపై ఉన్న శ్రద్ధ సీఎం చంద్రబాబుకు రైల్వేజోన్ సాధన మీద లేదని మండిపడ్డారు. దీక్షకు సంఘీభావం ప్రకటించమని కోరినప్పటికీ టీడీపీ, బీజేపీలు ఎందుకు ముఖం చాటేశాయని పలువురు వక్తలు నిలదీశారు. గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షకు భారీ సంఖ్యలో వివిధ పార్టీల నేతలు, ఇతర వర్గాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, ఉమాశంకర్ గణేష్, రాష్ట్ర గిడ్డంగులు సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, శ్రీకాంత్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోకు, రాష్ట్ర పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ మహిళా విభాగం ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వరుదు కల్యాణి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉషాకిరణ్, షరీఫ్, వాసు, బోని శివరామకృష్ణ, బదరీనాథ్, రాధ, తిప్పల వంశీ, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు, పార్టీ నేతలు రొంగలి జగన్నాథం, అల్ఫా కృష్ణ, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, నిర్మలా రెడ్డి, పరదేశీ, హేమంత్కుమార్లతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా బీసీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, నగర కార్యదర్శి గంగారామ్, సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్, లోక్‌సత్తా భీశెట్టి బాబ్జీ, రైల్వే శ్రామిక యూనియర్ జోనల్ అధ్యక్షుడు చలసాని గాంధీ, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ శివశంకర్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వర్మ తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. -
రైల్వే జోన్ సాధించే వరకు పోరాటం
♦ కేంద్రం కళ్లు తెరిపిస్తాం: వైఎస్సార్సీపీ నేత బొత్స ♦ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన గుడివాడ అమర్నాథ్ సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ రాష్ట్ర ప్రగతికి జీవనాడి అయిన విశాఖ రైల్వేజోన్‌ను సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్‌నూ చేర్చారని, విశాఖలో జోన్ ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని, కానీ కేంద్రం దాన్ని అమలు చే యకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద తెన్నేటి విశ్వనాథం ప్రాంగణంలో గురువారం ఉదయం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అంతకుముందు డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి అమర్నాథ్, పార్టీ నేతలతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ అమర్నాథ్ దీక్షతో కేంద్రం కళ్లు తెరుస్తుందని, రైల్వే జోన్ సాధించి తీరుతామని చెప్పారు. జోన్ కోసం బీజేపీ, టీడీపీలు కూడా కలసి రావాలని, లేదంటే జోన్ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. రైల్వే జోన్ ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ, చంద్రబాబులు చెప్పారనీ, రెండేళ్లవుతున్నా హామీ నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను సాధించుకున్న స్ఫూర్తితోనే విశాఖ రైల్వేజోన్‌ను సాధిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేద్దాం: వైఎస్ జగన్ ‘రైల్వేజోన్ కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు పూర్తిగా ఉంది. పార్టీ యావత్తూ నీ వెంట నిలుస్తుంది. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేద్దాం..’ అని గుడివాడ అమర్నాథ్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అమర్నాథ్తో గురువారం ఆయన ఫోన్లో మాట్లాడారు. దీక్షకు మద్దతుగా రాష్ట్ర పార్టీ తరఫున ఎంపీల బృందాన్ని పంపుతామని చెప్పారు. విశాఖపట్నం రైల్వేజోన్ సాధనే పార్టీ ధ్యేయమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని జగన్ సూచించారు. -
ఏపీలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం
కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి ఉంగుటూరు: ఏపీలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు.ఈమేరకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు వివరించారు. విజయవాడ చాప్టర్ ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. రైల్వే జోన్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ, విభజన చట్టంలోని 35 అంశాలను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు.విశాఖలో 200 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెంకయ్యతో సుజనా రహస్య మంతనాలు: మారిషస్ బ్యాంకు రుణాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుజనాచౌదరి శనివారం వెంకయ్యనాయుడిని కలసి రహస్య మంతనాలు జరిపారు. అరెస్టు నుంచి బయటపడేందుకే ఈ మంతనాలు జరిపినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ట్రస్ట్‌లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నా హాజరుకాకపోవడంతోపాటు మీడియాకు కూడా కనిపించకుండా వెళ్లడం గమనార్హం! -
వైఎస్సార్ సీపీ పోరుబాట
రైల్వే జోన్ కోసం చాన్నాళ్ల నుంచి ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ ఆందోళనను తీవ్రతరం చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖలో ఈ నెల 14 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నారు. అమర్నాథ్ దీక్షకు ఆ పార్టీ అధిష్టానం కూడా మద్దతు తెలిపింది. అలాగే ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. దీనిపై అమర్నాథ్ అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని జిల్లాపరిషత్ వద్ద ఉన్న అంకోసా హాలులో అఖి లపక్ష నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ ఆవశ్యకతను ఈ సమావేశంలో వివరించనున్నారు. జోన్ కోసం ఇంకేమి చేయాలన్న దానిపై చర్చించనున్నారు. రైల్వేజోన్ కోసం ఈ తరహా సమావేశం జరగడం ఇదే తొలిసారి. -
సమరమే..
రైల్వే జోన్ కోసం ఆందోళన ఉధృతం నేడు వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశం 14 నుంచి నిరవధిక దీక్షకు ‘గుడివాడ’ సిద్ధం విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే అ తిపెద్ద్ద డివిజన్ వాల్తే రు. రైల్వే జోన్ మొత్తమ్మీద వచ్చే ఆదాయంలో సగానికి పైగా ఈ డివిజన్ నుంచే వస్తోంది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా ద్వారా వాల్తేరు డివిజన్‌కు దాదాపు రూ.7 వేల కోట్ల రాబడి సమకూరుతోంది. ఒక్క సాధారణ టిక్కెట్ల ద్వారానే రోజుకు రూ.25 లక్షలు తెస్తోంది. అయినా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యమే చూపుతోంది. ఏళ్ల తరబడి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా మునుపటి, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలోనూ వాల్తేరు జోన్ ఏర్పాటు అంశాన్ని పేర్కొనడంతో 2015, 2016 రైల్వే బడ్జెట్లలో ప్రకటిస్తారని ఆశించినా ఫలితం లేదు. వాల్తేరు డివిజన్ రైల్వేకి ఆదాయాన్ని తెచ్చే బంగారు బాతుగుడ్డులా మారడంతో దీనిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఎంపీలే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీలు చిక్కినప్పుడలా జోన్ ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తోందంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు నానా హడావుడీ చేసేస్తున్నారు. చివరికి మొండి చేయే చూపిస్తున్నారు. విశాఖపట్నం డివిజన్‌ను ప్రత్యేక జోన్ చేయడానికి అర్హతలు లేవా? అంటే మిగతా జోన్లకంటే ఎక్కువ అవకాశాలు, అర్హతలు దీనికే ఉన్నాయి. కానీ విశాఖకంటే తక్కువ వనరులు, డివిజన్లున్న ఇతర రాష్ట్రాల్లో రైల్వే జోన్లు ఏర్పాటు చేసేశారు. పైగా ఏ కమిటీలు వేయకుండానే ఆయా రాష్ట్రాల్లో జోన్లు ఏర్పాటవగా, విశాఖ జోన్ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ఓ కమిటీ వేసి కాలయాపన చేస్తూ వస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్, బిలాస్పూర్ డివిజన్లున్నాయి. కానీ అక్కడ బిలాస్పూర్ డివిజన్ ఇచ్చారు. తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లుండగా హైదరాబాద్ జోన్ ఏర్పాటు చేశారు. కర్నాటకలో హుబ్లి, మైసూర్, బెంగళూరు డివిజన్లతో హుబ్లి జోన్ ఇచ్చారు. ఒడిశాలో సంబల్పూర్, ఖుర్దా డివిజన్లకు భువనేశ్వర్‌లో జోన్ ఏర్పాటు చేశారు. కానీ విశాఖకు విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో కలిపి నాలుగు డివిజన్లున్నా జోన్‌కు నోచుకోవడం లేదు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా ఆదాయం ఏటా సుమారు 12 వేల కోట్లు. ఇందులో సగానికి పైగా అంటే రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12-14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ పాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోర్టు ట్రస్టు, మరొక ప్రయివేటు పోర్టు, అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి ఇక్కడే ఉన్నాయి. ఇన్ని ఉన్నా లేనివల్లా అధికార పార్టీ నేతల్లో చిత్తశుద్ధి.. ఉద్యమస్ఫూర్తి. అర్ధ శతాబ్దం నుంచి... విశాఖపట్నానికి జోన్ ఏర్పాటు డిమాండ్ ఈనాటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల క్రితం అప్పటి లోక్‌సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం తొలిసారిగా పార్లమెంటులో జోన్ డిమాండ్‌ను లేవనెత్తారు. అప్పట్నుంచి జోన్ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా అవేమీ కేంద్రం చెవికెక్కడం లేదు. యూపీఏ ప్రభుత్వం 2013 మార్చిలో విశాఖకు రైల్వే జోన్‌పై ఓ కమిటీ వేసింది. ఆ నివేదికపై అతీగతీ లేదు. 2003కి ముందు దేశంలో 9 జోన్లుండేవి. అవి కాలక్రమంలో 17 జోన్లకు పెరిగాయి. కానీ వాటికేమీ కమిటీలు వేయలేదు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో అవి ఏర్పడిపోయాయి. కానీ విశాఖకు జోన్ విషయానికి వచ్చేసరికి ఏటేటా ఏవేవో పితలాటకాలతో వాయిదా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 3, ముంబైలో రెండు జోన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జోన్ కూడా లేదు. అయినా విశాఖకు జోన్ ఇవ్వడం లేదు. జోన్‌తో ప్రయోజనాలివీ.. విశాఖకు జోన్ వస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. కొత్తగా రైల్వే లైన్లు వస్తాయి. కొత్త ప్రాజెక్టులూ మంజూరవుతాయి.రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) సెంటరు ఏర్పాటవుతుంది. దీనిద్వారా ‘సి’ తరగతి ఉద్యోగాల నియామకాలకు వీలుంటుంది.రైల్వే రిక్రూట్మెంట్ సెంటరు కూడా వస్తుంది. దీంతో నాలుగు తరగతి (సి) నియామకాలు జరుపుకోవచ్చు.జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటవుతుంది. దీంతో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్తగా రెండు, మూడు వేల క్వార్టర్ల నిర్మాణం జరుగుతుంది.డిమాండ్ ఉన్న ప్రాంతాలకు రైల్వే బోర్డుతో పనిలేకుండా కొత్త రైళ్లను వేసుకోవచ్చు. దీంతో కొత్త రైళ్ల కోసం బోర్డుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.లోకల్ ట్రైన్లకు కూడా నడుపుకోవచ్చు. విశాఖలో ప్లాట్‌ఫారాల సంఖ్య పెరుగుతుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు పెరుగుతాయి. జోనల్ హాస్పిటల్ ఏర్పాటవుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, అంతకు మించి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. -
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాల్సిందే
యలమంచిలి: విభజన కారణంగా అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. యలమంచిలి జిల్లా పరిషత్ విశ్రాంతి గృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. చట్టాలను ఉల్లంఘించడమే పనిగా రాష్ట్రంలో అధికారపార్టీ అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటులో ఎడతెగని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వేజోన్ సాధించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయాలకతీతంగా పోరాడుతుందన్నారు. అంబేద్కర్ జయంతిలోగా కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విశాఖజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారన్నారు. విశాఖ, అనకాపల్లి ఎంపీలు రైల్వేజోన్ కోసం కృషి చేయడం లేదన్నారు. కాగ్ నివేదిక ఆధారంగా ప్రకటనలు, కేటాయింపులకే పరిమితమైన వివిధ శాఖల నిధులు వెనక్కి మళ్లిన వైనాన్ని గణాంకాలతో వివరించారు. జన్మభూమి కమిటీలు దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ఉచిత ఇసుకపై నిర్ధిష్ట విధానం లేదని.. గత ప్రభుత్వ హయాంలో క్యుబిక్మీటర్ ఇసుక రూ.60 ఉంటే, దానిని రూ.500కు పెంచి రెండేళ్లపాటు టీడీపీ నేతలు దోపిడీ చేశారని అన్నారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలను నెరవేర్చాల్సిన చంద్రబాబు ప్రకటనలకే పరిమితమవుతున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో గుడివాడ అమర్నాథ్, ప్రగడ నాగేశ్వరరావు, కొయ్య ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, బొద్దపు ఎర్రయ్యదొర, పలివెల అమృతవల్లి, బెజవాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
బాబు అసమర్థత వల్లే..
దక్కని ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ రావడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. రైల్వే ప్రత్యేక జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా నిర్వహించింది. ధర్నానుద్దేశించి అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలేవీ నెరవేరలేదన్నారు. విశాఖకు రైల్వే జోన్‌పై విశాఖ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిస్తే పూర్తవడానికి 300 ఏళ్లు పడుతుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి సాయం చేయకపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. తనతో పాటు కొడుకు స్వలాభం కోసం రూ.2200 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారన్నారు. రాష్ట్రానికి నిధులిస్తే పట్టిసీమలా దోచుకుంటారని కేంద్రానికి తెలిసిపోయినందునే నిధులివ్వడం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తుందన్న ఆలోచనలో కేంద్రం ఉందన్నారు. రాజధాని పేరుతో సీఎం కోట్లు కొల్లగొడుతున్నారని సాక్షి దినపత్రిక సాక్ష్యాధారాలతో నిరూపించిందన్నారు. ఆ సొమ్ముతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తున్నారన్నారు. అమరావతి భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించుకుని సీఎం నిజాయతీ చాటుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ అమరావతి భూముల్లో 25 వేల ఎకరాలు చంద్రబాబు భజనపరులైన లింగమనేని, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, నారాయణలకు దోచిపెట్టారని ఆరోపించారు. డబ్బున్న వారు కొనుక్కోవడం తప్పేమిటంటూ సీఎం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేస్తే అనర్హులవుతారన్నారు. వెళ్లిన వారు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చేస్తోందంటూ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు పదవులకు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. రూ.13 వేలకోట్లు ఖర్చయ్యే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.లక్ష కేటాయించడం సిగ్గుచేటన్నారు. సీఎం, అతని తనయుడు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అమరావతి భూములను దోచుకోవడానికి రాబందుల్లా వాలారన్నారు. మాజీ ఎమ్మెల్యే, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ మాట్లాడుతూ రైల్వే, సాధారణ బడ్జెట్లలో విశాఖకు ఇచ్చిన నిధులను చూసి సీఎం, ఎంపీలు సిగ్గుపడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ హుద్‌హుద్ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన నిధులేంచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే విశాఖ ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ధర్నా అనంతరం డీఆర్వో చంద్రశేఖరరెడ్డికి వినతిపత్రం అందించారు. ధర్నాలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కర్రి సీతారాం, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, రొంగలి జగన్నాథం, రాష్ట్ర కార్యదర్శి కంపా హనోకు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర అనుబంధ సంఘాల అధ్యక్షులు బర్కత్‌ఆలీ, బోని శివరామకృష్ణ, బయ్యవరపు రాధ, సిరతల శ్రీనివాస్, యువజన నాయకులు బి.కాంతారావు, తుల్లి చంద్రశేఖర్‌యాదవ్, ఆళ్ల గణేష్, మాసిపోగు రాజు, రాష్ట్ర ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి అల్లంపల్లి రాజబాబు పాల్గొన్నారు. -
'ప్రత్యేక హోదా కోసం 12న ఛలో ఢిల్లీ'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో గురువారం ఆయన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ....ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడం లేదన్నారు. ప్రత్యేకహోదా కోసం చేసిన సంతకాల సేకరణ ఉద్యమంపై రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలసి 'ప్రత్యేకహోదా కోసం ఛలో ఢిల్లీ' పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ నెల 12న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీలను కలసి సంతకాల వివరాలను అందిస్తామని రఘువీరా పేర్కొన్నారు. సోనియా, రాహుల్‌ను కలిసిన వారిలో కేవీపీ, జైరాం రమేష్, సుబ్బరామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
'సుజనా కంపెనీలతో నాకెలాంటి సంబంధం లేదు'
ఢిల్లీ: సుజనా కంపెనీలతో తనకెలాంటి సంబంధం లేదని కేంద్ర సహయ మంత్రి సుజనా చౌదరి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... కోర్టు సమన్లు తనకే కాదని, ప్రధాని మోదీకి కూడా వస్తుంటాయన్నారు. ఆరోపణలు వస్తే ఆ కంపెనీలనే అడగాలని సుజనా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు పెంచాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని... ప్రస్తుత రైల్వే బడ్జెట్లో విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించే అవకాశముందన్నారు. మారిషస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సుజనాకు చెందిన కంపెనీ చెల్లించలేదని బ్యాంకు ఇప్పటికే కోర్టుకు ఎక్కింది. మార్చి ఐదో తేదీన విచారణకు హాజరుకావాలని సుజనాకు కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. -
'24 గంటల్లో ఆ ఎంపీలు రాజీనామా చేయాలి'
-
ఏపీ సెంటిమెంట్‌ను గుర్తించాం..
త్వరలోనే శుభవార్త వింటారు రైల్వే జోన్‌పై కేంద్రమంత్రి సురేష్‌ప్రభు విశాఖపట్నం: ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇది మీకే కాదు నాకూ సెంటిమెంటే. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదే‘‘రైల్వే జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్‌ను మేం గుర్తించాం. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.శ్ శుభవార్తను వింటుందని ఆశిస్తున్నా’’ అని రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖపట్నంలో బీజేపీ బుధవారం ‘జన్‌కల్యాణ్ పర్వ్’ పేరిట సభ నిర్వహించింది. దీనికి సురేష్‌ప్రభు హాజరై ప్రసంగించారు. సభలో తొలుత ప్రసంగించిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించాలని విన్నవించారు. సభకు హాజరైనవా రు సైతం రైల్వేజోన్‌కోసం డిమాండ్ చేశారు. సురేష్ ప్రభు మాత్రం రైల్వేజోన్ విషయంలో స్పష్టమైన ప్రకటనగానీ, హామీగానీ ఇవ్వలేదు. ‘నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. మేం ఇచ్చిన హామీలన్నింటినీ ఐదేళ్లలో పూర్తిచేస్తాం. అనంతరమే మళ్లీ తీర్పుకోసం ప్రజల వద్దకు వస్తాం’ అని ఆయన అన్నా రు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ మనసులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఏపీని అభివృద్ధిలోనూ సూపర్ నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం కృషిచేస్తోంది’’ అని చెప్పారు. అగ్రగామిగా భారతీయ రైల్వేలు రాబోయే 15ఏళ్లలో రూ.8.50 లక్షల కోట్లతో భారతీయ రైల్వేరంగాన్ని ఆధునీకరించి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని సురేష్‌ప్రభు చెప్పారు. -
రైల్వే జోన్‌పై నాన్చుడు
- నిర్దిష్ట హామీ ఇవ్వని కేంద్రమంత్రి - మంత్రి వైఖరిపై సందేహాలు - నిరాశ పర్చిన సురేష్ ప్రభు పర్యటన విశాఖపట్నం సిటీ : రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ దిశగా స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేత వైఖరి అవలంభించారు. చూస్తున్నాం...పరిశీలిస్తున్నాం అని చెప్పి తప్పించుకున్నారు. విశాఖలో బుధవారం బీజేపీ సభలో పాల్గొన్న ఆ యన్ను రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, రైల్వే జోన్ ప్రకటించాలని కోరారు. వీరి విన్నపాల తర్వాత ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు గానీ ఇస్తామని సూటిగా ప్రకటించలేదు. విజయవాడ-గుంటూరు, గుంతకల్లులలో కూడా రైల్వే జోన్ కోసం అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జోన్‌పై మంత్రి మాటలు సందేహాలకు తావిస్తున్నాయి. జోన్ స్వరూపంపై కూడా రైల్వే మంత్రి నేరుగా స్పందించలేదు. అత్యధిక ఆదాయాన్నిచ్చే కేకే లైన్‌ను వదులుకునేది లేదని ఒడిశా పట్టుబడుతోంది. కేకే లైన్ లేని వాల్తేరు డి విజన్ ఆర్ధికంగా నిలదొక్కుకోలేదు. అందుకే ప్రస్తుత వాల్తేరు డివిజన్‌తో పాటు రాష్ట్ర పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ అంశంలో కూడా మంత్రి సురేష్ ప్రభు స్పష్టత ఇవ్వకపోవడంపై రైల్వే వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో ఆర్ఆర్బి పరీక్షా కేంద్రం డిమాండ్‌ను కూడా మంత్రి పట్టించుకోలేదు. మొత్తం మీద రైల్వేమంత్రి పర్యటన ఉత్తరాంధ్ర వాసులకు కొంత నిరాశే మిగిలింది. పోర్టు కాలుష్య సమస్య పరిష్కారానికి కూడా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. తగినన్ని రైల్వే రేక్‌లు లేకపోవడం వల్ల పోర్టులోని బొగ్గు, ఇనుప ఖనిజం రవాణా ఆలస్యమవుతోందని పలువురు మంత్రికి వివరించారు. విశాఖ పోర్టుకు రైల్వే రేక్ కేటాయింపులు పెంచాలని కోరారు. దీనిపై మంత్రి హామీ ఇవ్వలేదు. రైల్వే శాఖ రేక్‌ల సంఖ్య పెంచలేమని తేల్చిచెప్పారు. ప్రైవేట్ కంపెనీలే రేక్‌లను నిర్మించుకుని రవాణా చేసుకునే వెసులబాటు కల్పిస్తామన్నారు. జోన్‌పై నిరాశ పరిచారని శ్రామిక్ యూనియన్ మహిళా విభాగం అధ్యక్షురాలు షలీల్ ఆవేదన వ్యక్తంచేశారు. స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఓబీసీ రైల్వే ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు పెదిరెడ్ల రాజశేఖర్ వ్యాఖ్యానించారు. -
‘ప్రభు’ కరుణిస్తారా..!
నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి సురేష్ ప్రభు నత్తనడకన శ్రీకాళహస్తి-నడిగుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలు తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఊపు రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజానీకం పెట్టుకున్న కొండంత ఆశలు మంత్రి సురేష్‌ప్రభు సాకారం చేస్తారా.. గత రైల్వే మంత్రుల తరహాలోనే నీళ్లు చల్లుతారా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. విభజన నేపథ్యంలో రాష్ట్ర రైల్వే శాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన శ్రీకాళహ స్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖ నిబంధనలను సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను కేంద్రం ఏమేరకు అంగీకరిస్తున్నదనేది నేడు తేలిపోనుంది. తిరుపతి గాంధీరోడ్డు: నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు గురువారం లోక్‌సభలో పూర్తిస్థాయి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కానీ జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇందులో ప్రధానమైన రైలు మార్గాల పరిస్థితి అంతంత మాత్రమే. ఇది జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతకంగా మారింది. అపార ఖనిజ సంపదకు.. వ్యవసాయ ఉత్పత్తులకు.. పర్యాటక రంగానికి పెట్టింది పేరైన జిల్లా అభివృద్ధిలో మాత్రం అథమస్థానంలో ఉండడానికి ప్రధాన కారణం రైలు మార్గాలు సక్రమంగా లేకపోవడమేనని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పశ్చిమ మండలాల్లో పారిశ్రామిభివృద్ధికి బాటలు వేసేలా కడప, మదనపల్లి, బంగారుపేట, బెంగళూరు రైల్వే మార్గాన్ని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ప్రతిపాదించారు. తూర్పు మండల సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా శ్రీకాళహస్తి, నడికుడి మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. వాటా నిధుల కేటాయింపునకు సాకుగా.. నిధుల లభ్యత లేదనే సాకుచూపి ఆరెండు రైల్వే మార్గాలను మంజూరు చేసేందుకు అప్పట్లో రైల్వే శాఖ అంగీకరించలేదు. దీంతో ఆ మార్గాలకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అప్పట్లో వైఎస్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2008-09 రైల్వే బడ్జెట్లో ఆరెండు మార్గాలను మం జూరు చేసింది. 2008-09, 2009-10 బడ్జెట్లో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ఆరెండు రైల్వే మార్గాలకు రాష్ట్రప్రభుత్వం చెల్లించిన వాటా నిధులు ఇచ్చారు. ఫలితంగా కడప -బెంగళూరు, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గాల పనులను కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం కడప- బెంగళూరు రైల్వే మార్గం పనులు 129 కోట్ల రూపాయల వ్యయంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21.59 కిలోమీటర్ల మేర సాగుతోంది. శ్రీకాళహస్తి -నడికుడి రైల్వే మార్గం సర్వే పనులు 2010 నాటికి పూర్తయ్యాయి. పనులు మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఐదేళ్లల్లో పూర్తి కావాల్సిన ఈ బడ్జెట్లో ఎన్నటికీ పూర్తవుతుందో రైల్వే శాఖ ఒక అంచనాకు రాలేక పోతోంది. దీనికి ప్రధాన కారణం వైఎస్ హఠాత్తు మరణం తర్వాత శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలకు రాష్ట్రం ప్రభుత్వం తనవాటా నిధులను విడుదల చేయకపోవడమే ఇదే సాకుగా చూపి రైల్వే శాఖ కూడా ఆ మార్గాలకు నిధులు కేటాయించడం లేదు. ఈ నేపథ్యంలో సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖే నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరడం గమనార్హం. డివిజన్ పోయి జోన్ వచ్చే .. గుంతకల్లు డివిజన్, గుంటూరు డివిజన్లలో కొన్ని భాగాలు వేరు చేసి తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు రాజకీయ పారిశ్రామిక వర్గాల ప్రతిపాదనలు కూడా పంపాయి. గురువారం రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వస్తుందో రాదో చూడాల్సి వుంది. రైళ్ల సంఖ్య పెరగాలి తిరుపతి నుంచి షిరిడీ, విశాఖ, సికింద్రాబాద్‌లకు దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ముంబయి- హౌరా, అహ్మదాబాద్, ఢిల్లీలకు గరీబ్థ్ ్రరై లు ప్రతిపాదనలు చాలా కాలంగా పెండిం గ్లో ఉన్నాయి. వీటిని మంజూరు చేయాలి. తిరుపతి నుంచి బెంగళూరు, చెన్నై, మదురై, త్రివేండ్రం, ఢిల్లీ, విశాఖ, కోల్‌కతా తదితర ప్రధాన నగరాలకు, పారిశ్రామిక కేంద్రాలకు, పుణ్యక్షేత్రాలకు రైళ్ల సంఖ్య పెంచాలి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి తిరుపతి రైల్వే స్టేషన్లో యుద్ధప్రాతిపదికన అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి. తిరుపతి-కాట్పాడి మధ్య రెండు లేన్ల మార్గాన్ని తిరుపతి నుంచి ధర్మవరం మీదుగా సికింద్రాబాద్, ముంబ యి రైలు మార్గాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పెంచాలి. ఉద్యోగుల కోర్కెలు తిరుపతిలో రైల్వే ఆసుపత్రి, ఉద్యోగుల పిల్లల కోసం వైద్య కళాశాల స్థాపించాలి. రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలి. పెరిగిన రైళ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఉద్యోగాలను నియమించాలి.రైల్వే భద్రతా విభాగంలో 2లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. హెచ్ఆర్ఏ 20 శాతం చెల్లించాలి, ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించాలి. -
బడ్జెట్ రైలు బెజవాడలో ఆగేనా?
కొత్త రైల్వే జోన్ కోసం ఎదురుచూపులు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై ఆశలు ప్రతిపాదనలపై ‘ప్రభు’ కరుణించేనా? నేడు పార్లమెంట్‌కు రానున్న రైల్వే బడ్జెట్ రైల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ ఈసారైనా జిల్లాపై వరాల జల్లు కురిపించేనా.. అని జిల్లావాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వాల్తేర్ డివిజన్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలిపి కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుంది. శాటిలైట్ స్టేషన్‌గా కొండపల్లి అభివృద్ధి, పుష్కరాల పనులకు నిధులు, విజయవాడ స్టేషన్లో సౌకర్యాల మెరుగుదల, స్పీడ్, అదనపు రైళ్ల మంజూరు వంటి అంశాలకు బడ్జెట్లో చోటు దక్కేనా అనేది వేచిచూడాలి. -
రైల్వే జోన్‌కోసం అవిశ్రాంతపోరు
రైల్వే జోన్ సాధించే వరకు నిద్రపోం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ డీఆర్ఎం కార్యాలయం వద్ద మహాధర్నా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధనకు వైఎస్సార్సీపీ నడుం బిగించింది. బడ్జెట్ ఘడియలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులు ఉద్యమించాయి. జోన్ సాధించడంలో ఎంపీలు విఫలమవుతున్నారంటూ తూర్పారబట్టాయి. దొండపర్తిలోని డిఆర్ఎం కార్యాలయం ఎదుట మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అమర్నాథ్ సారథ్యం వహించారు. భారీగా కార్యకర్తలు తరలివచ్చిన ఈ నిరసన కార్యక్రమంలో అమర్నాథ్ నేతల వైఫల్యంపై గళమెత్తారు. తూర్పు కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజనుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపారు. పూర్తి వివక్షతకు గురవుతున్న ఈ ప్రాంతానికి బడ్జెట్లో న్యాయం జరగకపోతే సహించేది లేదని హెచ్చరించారు. జోన్ సాధించేవరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని ప్రతిన పూనారు. విశాఖపట్నం సిటీ: రైల్వే జోన్ విశాఖకు తెస్తామనే దమ్మూ ధైర్యం ఉత్తరాంధ్రలోని ఒక్క ఎంపీకి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ విమర్శించారు. రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డీఆర్ఎం కార్యాలయం వద్ద మంగళవారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహా ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విశాఖ నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా సంబల్పూర్, కుర్దా డివిజన్లకు పట్టుకుపోయి ఒడిశా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. వాల్తేరు రైల్వే ఆర్జిస్తున్న ఆదాయంలో రూపాయి కూడా ఉత్తరాంధ్రకు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగావకాశాల్లోనూ తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల రిక్రూట్ అయిన 140 అసిస్టెంట్ లోకోపెలైట్(డ్రైవర్) ఉద్యోగాల్లో ఒడిశా, బీహారీలే ఎలా నింపారో రైల్వే అధికారులే చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లి పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కోసం రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభును కలిసి రైల్వే జోన్ ప్రకటించాలని కోరినప్పుడు మీ సీఎం చంద్రబాబు అడగలేదని చెప్పడంతో అవాక్కయ్యామన్నారు. ఉత్తరాంధ్ర ఎంపీలు చేతగాని వారేనని, అందుకే ఉత్తరాంధ్రకు రైల్వే ప్రాజెక్టులు రావడం లేదని అమరనాథ్ అన్నారు. 1989 నుంచీ విశాఖ ఎంపీలుగా ఇతర ప్రాంతీయులే విజయం సాధిస్తున్నారని, అందుకే వారంతా తమతమ ప్రాంతాల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడున్న టీడీపీ ఎంపీలంతా రైల్వే జోన్‌ను విజయవాడకు తరలించుకుపోదామని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు, ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ రైల్వే జోన్ సాధిస్తామంటూ ప్రగల్బాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు ఇప్పుడు మాట మార్చేశారని ఆరోపించారు. జోన్‌ను సాధించే వరకూ వైఎస్సార్సీపీ నిద్రపోదన్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు విశాఖ జిల్లాను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ప్రజల కష్టాలపై దృష్టి పెట్టే తీరిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులంటే మరీ దారుణంగా చూస్తున్నారన్నారు. ప్రజల మనోభావాలను ఏ మాత్రం గౌరవించడం లేదని దుయ్యబట్టారు. పార్టీ చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ జోన్ పట్ల ఎంపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. ఏపీటీఎస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు విశాఖకు రాకపోతేనే మంచిదన్నారు. మంత్రి వర్గ సమావేశం కోసం ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఈ పచ్చని అహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నామని మొదలెట్టిన మూడు రోజులకే హుద్‌హుద్ తుపాను వచ్చి పచ్చదనం మొత్తం తుడుచుకుపోయిందన్నారు. ఆ తర్వాత ఐటీ సెజ్‌కు వచ్చి తీరం కోసం పొగిడారని ఆ వెంటనే తీరం ఉగ్రరూపం దాల్చి బీచ్‌రోడ్డును కోరేసిందన్నారు. అలా ఆయన దేనిపై కన్నేస్తే అది మటాష్ అయిపోతుందని, అందుకే విశాఖకు రాకపోవడం మంచిదని సూచించారు. పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ అరకు ప్రాంతాన్ని దత్తత తీసుకున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకూ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ నుంచి ఢిల్లీకి, బెజవాడ మీదుగా వారణాసికి రైళ్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ మాట్లాడుతూ 9 నెలలుగా మభ్యపెడుతూనే పాలకులు కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులు మాట్లాడుతూ మ్యానిఫెస్టోలతో మోసం చేసిన పార్టీలను నమ్మకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుడ్ల రమణి, జియ్యాని శ్రీధ ర్, సేనాపతి అప్పారావు, కంపా హానోక్, నేతలు శ్రీకాంత్ రాజు, రవి రెడ్డి, సనపల త్రినాధ స్వామి, కాంతారావు, పక్కి దివాకర్, విల్లూరి భాస్కరరావు, శ్రీ దేవి వర్మ, ఆర్వీ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్ఎం అనిల్‌కుమార్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. -
'విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి'
-
'విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి'
విశాఖ : వాల్తేర్ రైల్వే డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా కేటాయించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన పట్టనుంది. ఈనెల 24న డీఆర్ఎం కార్యాలయం వద్ద వైఎఆస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ వాల్తేర్ జోన్‌కు రావాల్సిన చాలా రైళ్లు ఒడిశాకు తరలిపోతున్నాయన్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను కూడా విజయనగరం తరలించే యోచనలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయినా విశాఖ రైల్వేవైపు దృష్టి పెట్టకపోవడం సర్కారు వైఫల్యమేనన్నారు. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు కావలసిన 750 ఎకరాల భూములు కూడా ఉన్నాయని, జోన్ ఏర్పాటుకు, ఉద్యోగుల భర్తీ, తెలుగు ప్రజల పట్ల కేంద్రం వివపక్ష చూపిస్తోందన్నారు. విశాఖ ప్లాట్‌ఫారంపై ప్రయాణికులకు కావల్సిన కనీస సదుపాయాలు కూడా లేవని గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. Waltair Division, railway zone, ysrcp, gudiwada amarnath, వాల్తేర్ డివిజన్, ప్రత్యేక రైల్వేజోన్, వైఎస్ఆర్ సీపీ, గుడివాడ అమర్నాథ్ -
బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్!
విశాఖపట్నం: సీఎం చంద్రబాబు దత్తత తీసుకున్న విశాఖ జిల్లా అరుకులో కాఫీ ఉత్పత్తిని అంతర్జాతీయ బ్రాండ్‌గా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సదరు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం విశాఖపట్నంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మిషన్ పద్దతిలో గిరిజనులకు శిక్షణ ఇచ్చి.... వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేయడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. కాఫీ సాగుకు కాఫీ బోర్డు మాజీ అధ్యక్షుడు గోపాలరావును ఇంఛార్జ్‌గా నియమించినట్లు చెప్పారు. సాగర్ నీటి విడుదల అంశంలో తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతర్ చేస్తోందని ఆరోపించారు. నీటి విషయంలో అందరం కూర్చుని సమస్యను పరిష్కరించుకుందామని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. ఏపీ పునర్విభజనలో చట్టంలోని ప్రతి అంశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటను ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ అన్న అంశం రానున్న బడ్జెట్లో ఉందని స్పష్టమైన సంకేతాలు తమకు అందాయని పరాకల ప్రభాకర్ వెల్లడించారు. -
రైల్వే జోన్‌కు పచ్చజెండా
స్మార్టు సిటీగా ప్రకటించిన నేపథ్యంలో విశాఖకు మరింత బలం రైల్వేమంత్రి సానుకూల స్పందన పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయముంటుందా.. విశాఖపట్నం సిటీ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కసరత్తు తొందర్లోనే ముగియనుంది. రైల్వే జోన్ ఏర్పాటు అంశం పూర్తిగా రాజకీయ నిర్ణయమే అయినా ఎలా వెలువడుతుందోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జోన్ భవిష్యత్ ఓ కొలిక్కి రానుందని రైల్వే వర్గాలంటున్నాయి. జోన్ కమిటీ రైల్వే బోర్డుకు ఇప్పటికే తమ నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. కానీ రైల్వే బోర్డు దాన్ని గోప్యంగా వుంచింది. నివేదిక ముఖ్యాంశాలు బయటకు పొక్కకమునుపే రైల్వే మంత్రి సదానంద గౌడ స్థానంలో సురేష్ ప్రభాకర్ ప్రభును రైల్వే మంత్రిగా నియమించి బాధ్యతలు అప్పగించింది. ఆయన రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రతీ కార్మికునికీ ఓ లేఖ రాసి ఆకట్టుకుంటున్నారు. సురేష్ప్రభాకర్ను కొందరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విశాఖ కేందంగా జోన్‌పై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. రైల్వే సహాయ మంత్రి సిన్హా కూడా సానుకూలంగా వుండడంతో విశాఖకు రైల్వే జోన్ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అమెరికా అభివృద్ది చేయనున్న మూడు స్మార్ట్ సిటీల్లో అహ్మదాబాద్, విశాఖలు వుండడంతో జోన్ కేంద్రం కూడా విశాఖకే అన్న భావన వ్యక్తమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలోగా కేంద్రం దీనిపై ఓ ప్రకటన చేయొచ్చని అంచనా. ఇదిలా వుండగా రైల్వే బోర్డులో గానీ,రైల్వే జోనల్ కేంద్రమైన భువనేశ్వర్‌లో గానీ కొత్త రైల్వే జోన్ అంశంపై ఎలాంటి సమాచారం లేదని అధికారిక వర్గాలు అంటున్నాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు నివేదిక ఇచ్చిన కమిటీ ఎలాంటి బలమైన సాంకేతిక అడ్డంకులను ప్రస్తావించలేదని భోగట్టా. జోన్ కేంద్రం విశాఖలో ఏర్పాటుకు అవసరమైన సాంకే తిక అడ్డంకులు లేకపోవడంతో నివేదికను మరోసారి లోతుగా పరిశీలించి నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. జోన్ మాటెలాఉన్నా కనీసం వాల్తేరును దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేసినా ఫర్వాలేదని కొందరంటున్నారు. -
వైజాగ్‌కు రైల్వే జోన్ లేనట్టే(నా) ?!
-
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ లేనట్టే?!
రైల్వే బోర్డుకు నివే దిక ఇచ్చిన కమిటీ భగ్గుమన్న ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు విశాఖపట్నం సిటీ: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు జోన్ రీ ఆర్గనైజేషన్ కమిటీ బ్రేక్ వేసింది. ఇటీవల రైల్వే బోర్డుకు కమిటీ తన నివేదికను అందజేసింది. ఆ నివేదికలో మూడు డివి జన్లతోనే కొత్త జోన్ ఉండాలని ప్రతిపాదించిం ది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తా రైల్వేలోనే విశాఖను కొనసాగించాలని స్పష్టం చేసింది. తూర్పు కోస్తా నుంచి వాల్తేరు రైల్వే డివిజన్‌ను విడదీయ డం సరికాదంది. వాల్తేరు, సంబల్పూర్, కుర్దా రైల్వే డివిజన్లతో కూడిన తూర్పు కోస్తా రైల్వే ఇతర జోన్లకు సమఉజ్జీగా వుందని అభిప్రాయపడింది. వాల్తేరును తూర్పుకోస్తా నుంచి తొలగిం చడంతో కొత్తగా ఏర్పాటయ్యే జోన్‌కు ఎలాంటి ప్రయోజనం వుండదని పేర్కొంది. పైగా గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లతో బాటు వాల్తేరును కలిపితే ఏర్పాటయ్యే జోన్ మరింత పెద్దదిగా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తాను ఎటూ కదపకుండానే కొత్త జోన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ ప్రాధాన్యతను ఏ మాత్రం పట్టించుకోకపోవడం నగరవాసులను తీవ్రంగా కలచివేస్తోం ది. విశాఖ కేంద్రంగా జోన్ ప్రకటించకపోతే మళ్లీ ఆందోళనలు ఉధృతం చేస్తామని జోన్ సాధన కమిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆదాయమే అడ్డంకి..! వాల్తేరు రైల్వే డివిజన్‌ను వదులుకోవడానికి తూర్పు కోస్తా రైల్వే ఇష్టపడడం లేదు. బంగారు బాతులాంటి ఈ డివిజన్ వదులుకుంటే ఏటా రూ.6300 కోట్లు ఆదాయం కోల్పోవాల్సి వస్తుం దని తూర్పు కోస్తా ఆందోళన చెందుతోంది. కోచింగ్ రైళ్లు(ప్రయాణికుల రైళ్లు) కన్నా గూడ్సు రైళ్లు ద్వారానే వాల్తేరు డివిజన్ ఏటా దాదాపు రూ.6 వేల కోట్లు ఆర్జిస్తోంది. పెట్టుబడి తక్కువ గా ఉండి ఆదాయం ఎక్కువగా వుండే ఈ డివి జన్ను వదులుకునేందుకు ఒడిశా కనుసన్నల్లోని రైల్వే అధికారుల బృందం ససేమిరా అంటోంది. -
రైల్వే జోన్‌కు లైన్ క్లియర్
రైల్వే ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష వీగిన ఒడిశా వాదన విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు! అన్నీ విశాఖ జోన్లోనే.. విశాఖపట్నం సిటీ : విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు లైన్‌క్లియర్ అయింది. హైదరాబాద్‌లో గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైల్వే ఉన్నతాధికారుల సమీక్షలో రైల్వే జోన్ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. రైల్వే జోన్‌కు అవసరమైన అన్ని అర్హతలు విశాఖకే ఉన్నాయని గుర్తించారు. దీంతో కొత్త రైల్వే జోన్ల కోసం ఏర్పాటైన కమిటీ పని సులువైంది. ఇక జోన్ ప్రకటనే ఆలస్యం. ఈ నెల 15వ తేదీతో ప్రత్యేక రైల్వే జోన్ కమిటీ నివేదికను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంది. దీంతో కమిటీ తన పనిని వేగవంతం చేస్తోంది. త్వరలోనే విశాఖను నవ్యాంధ్రకు రైల్వే జోన్‌గా ప్రకటించేందుకు మార్గం సుగమమయింది. ఫలించిన సుదీర్ఘ పోరాటం! : రాష్ట్ర పునర్విభజన బిల్లులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంతకు ముందు నుంచే దశాబ్దాల కాలంగా విశాఖ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ఆందోళనలు జరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఒడిశా రైల్వే అధికారుల పెత్తనం కారణంగానే ఈ డిమాండ్ స్థానికుల్లో బలంగా నాటుకుపోయింది. విశాఖకు వచ్చే పలు రైళ్లను భువనేశ్వర్‌కు పొడిగించుకుపోవడంతో పాటు బెర్తుల్లో కోటాను ఆక్రమించేస్తుండడంతో విశాఖ వాసులు ఈ పోరాటాన్ని సుదీర్ఘకాలం నుంచి చేస్తున్నారు. కానీ రైల్వే జోన్ కోసం విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లు పోటీపడ్డాయి. రాష్ట్ర రాజధాని ఉన్నచోటే రైల్వే జోన్ ఉండాలని ఆ ప్రాంతీయులు డిమాండ్ చేశారు. కానీ మొదటి నుంచి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు బీజేపీ సుముఖంగా ఉంది. మొదటి నుంచి విశాఖలోనే రైల్వే జోన్ అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదేపదే ప్రకటించారు. మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయవాడ పేరునే ప్రకటించినా పాలన వికేంద్రీకరణ నేపథ్యంలో జోన్ విశాఖనే వరించనుంది. నాలుగు డివిజన్లు! : విశాఖ కేంద్రంగా ఏర్పడే నూతన రైల్వే జోన్లో నాలుగు డివిజన్లు ఉంటాయి. వాల్తేరు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వే డివిజన్లను కలిపి ఒకే జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. తూర్పు కోస్తా రైల్వేలో ఉన్న వాల్తేరు డి విజన్‌ను విడదీసి కొత్త జోన్లో విలీనం చేస్తారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లకు ఇక విశాఖ కేంద్రం కానుంది. వాల్తేరు జోన్‌ను వదులుకోలేమంటూ ఇప్పటి వరకూ అడ్డుకున్న ఒడిశా రైల్వే ఉన్నతాధికారుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. జోన్ కేంద్రానికి అవసరమైన రైల్వే స్థలాలు, క్రీడా మైదానాలు, ఆస్పత్రులు, కార్యాలయాలన్నీ విశాఖలోనే భారీగా ఉండడంతో కమిటీ విశాఖను ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. -
ఆ వాదన మోసపూరితం
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర రాజధాని అన్ని జిల్లాలకు మధ్యలో ఉండాలనే వాదన మోసపూరితమని రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్ఎస్ఎఫ్) కన్వీనర్ భాస్కర్, కో-కన్వీనర్ దస్తగిరి, నగర కన్వీనర్ కల్యాణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు వీరు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలనడం విజయవాడ-గుంటూరుకు తీసుకెళ్లే కుట్రలో భాగమేనని విమర్శించారు. సమైక్యాంధ్ర రాజధానిగా ఉన్న హైదరాబాదు, తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక రాజధాని బెంగుళూరు అలాగే మరెన్నో రాష్ట్రాల రాజధానులు మధ్యభాగంలో లేవనే విషయం నాయకులకు తెలీదా అని ప్రశ్నించారు. అసలు దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉందా అంటూ వారు నిలదీశారు. విశాలాంధ్ర విడిపోయిన తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలని చర్చించడమే అనవసరమన్నారు. 1937 నాటి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని ‘సీమ’లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి విరుద్ధంగా రాజధానిని కోస్తాకు తరలించుకుపోతున్నా ‘సీమ’లో అడిగే నాయకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడిన పాలకులు నేడు రాజధాని, పారిశ్రామిక కారిడార్, ఎయిమ్స్, మెట్రో రైలు, రైల్వేజోన్ వంటి ప్రాజెక్టులన్నిటినీ కోస్తాకే తరలిస్తున్నారని తెలిపారు. ఇకనైనా రాయలసీమ ప్రజలు మేల్కొని ఉద్యమించకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఆందోళనలో రాయలసీమ విద్యార్థి వేదిక వైవీయూ కన్వీనర్ నాగార్జున, కో-కన్వీనర్ నాగరాజు, సభ్యులు ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి
పట్టణ బంద్ విజయవంతం గుంతకల్లు టౌన్ : రైల్వే జోన్ సాధన కోసం సీపీఎం-సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం జిల్లా గుంతకల్లులో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఉదయాన్నే నాయకులు రోడ్లపైకి వచ్చి వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నేత దశరథరెడ్డి మాట్లాడారు. భారతీయ రైల్వేలోనే ప్రసిద్ధి చెందిన గుంతకల్లు రైల్వే డివిజన్ కేంద్రంలో జోన్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం, సౌకర్యాలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విశాఖలో జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండటం సరికాదన్నారు. గుంతకల్లులో జోన్ ఏర్పాటు చేయడం వల్ల కరువు, కాటకాలతో తల్లడిల్లుతున్న అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రగతి పథంలో నడుస్తున్న రైల్వే డివిజన్‌కి తీవ్ర అన్యాయం జరుగుతున్నా నిలదీయాల్సిన జిల్లాకు చెందిన ఎంపీలు చేతకానితనాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. రైల్వే జోన్ సాధించే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ అనుబంధ సంఘాల నేతలు, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మెట్రోరైల్, రైల్వే జోన్ ఏర్పాటుకు విజయమ్మ హామీ
విశాఖ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వైఎస్ఆర్ పథకాలు మీకందుబాటులోకి వస్తాయని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎస్సీఎస్టీ సంఘాలతో సమావేశమైన వైఎస్ విజయమ్మ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాలకు అండగా ఉంటామని విశాఖ లోక్‌సభ అభ్యర్థి పోటీ చేస్తున్న వైఎస్ విజయమ్మ తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు వైఎస్ విజయమ్మ విజ్క్షప్తి చేశారు. ఆతర్వాత వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో పారిశ్రామికవేత్తలతో వైఎస్ విజయమ్మ సమావేశమయ్యారు. విశాఖలో పరిశ్రమల అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. 2019కల్లా నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు కృషిచేస్తామని విజయమ్మ తెలిపారు. విశాఖ అన్నిరంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డినే అని అన్నారు. విశాఖలో మెట్రోరైల్, రైల్వే జోన్ ఏర్పాటుకు తనవంతు కృషిచేస్తానని విజయమ్మ అన్నారు. -
అటకెక్కిన రైల్వే ప్రాజెక్టులు
గుంతకల్లు, న్యూస్‌లైన్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రాయలసీమ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన నూతన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం అటకెక్కింది. ఇవి ఏళ్ల క్రితమే మంజూరైనా.. నిధులు విడుదల చేయడంలో రైల్వే శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నూతన రైలు మార్గాలతో పాటు రైలు మార్గాల సర్వేలు, గేజ్ మార్పిడి, డబ్లింగ్, విద్యుద్దీకరణ, ప్రయాణికులు, సిబ్బంది సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నింటిదీ ఇదే దుస్థితి. ఇప్పటికే పాలనాపరంగా, సాంకేతికంగా మంజూరైన పనులు చేపట్టాలంటే రూ.వేల కోట్లు అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. నిధుల గురించి ఎంపీలు పార్లమెంటులో కనీసం నోరు విప్పడం లేదు. త్రిశంకు స్వర్గంలో నూతన రైలు మార్గాలు మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేయించిన కడప - బెంగళూరు (వయా బంగారుపేట్) రైలు మార్గం నిర్మాణం ఇప్పటికీ బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. 2008-09 బడ్జెట్లో మంజూరైన ఈ రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, రైల్వే శాఖ 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంది. కడప నుంచి కోలార్ వరకు రైలు మార్గం నిర్మాణానికి రూ.1,760 కోట్లతో అంచనాలు రూపొందించారు. అప్పట్లో సర్వే కోసం రూ.29 కోట్లు కేటాయించారు. అక్కడితో ప్రాజెక్టు ప్రగతి ఆగిపోయింది. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 308.7 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మించాలని భావించి 1997-98లోనే రైల్వే బోర్డు అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు రూ.539.80 కోట్లు అవసరమని అప్పట్లో అంచనా వేశారు. ఈ వ్యయం నేడు మూడింతలు పెరిగిందని రైల్వే ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గం నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తామని చెప్పినప్పటికీ రైల్వే శాఖ ముందుకు రావడం లేదు. దీంతో 2004-05 నుంచి వరుసగా అంచనా వ్యయాన్ని సవరించి పంపుతూనే ఉన్నారు. 1996-97లో మంజూరైన నంద్యాల - ఎర్రగుంట్ల మార్గానికి నిధుల కొరత వేధిస్తోంది. దీనివల్ల ఈ మార్గంలోని బనగానపల్లి- నంద్యాల మధ్య పనులు పూర్తి కాలేదు. 1997-98 బడ్జెట్లో మహబూబ్‌నగర్ - మునీరాబాద్ మధ్య 246 కి.మీ మేర మంజూరైన రైలు మార్గం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మంత్రాలయం - కర్నూలు రోడ్డు (వయా ఎమ్మిగనూరు), పుట్టపర్తి-తిరుపతి(వయా కదిరి), గిద్దలూరు- భాక్రాపేట పనుల కోసం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు. ఇక మార్కాపురం - శ్రీశైలం మధ్య 65 కిలోమీటర్ల రైలు మార్గానికి 2007లో సర్వే చేపట్టారు. సర్వే నివేదికను అదే ఏడాది నవంబరు 26న రైల్వే బోర్డుకు నివేదించారు. అయినప్పటికీ నిధులు మంజూరు కావడం లేదు. నత్తనడకన డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు ఓబుళవారిపల్లె -కృష్ణపట్నం పోర్టు మధ్య దాదాపు 114 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు నిధుల కొరతతో పడకేశాయి. వెంకటాచలం వరకు పనులు పూర్తి చేసి వదిలిపెట్టారు. సికింద్రాబాద్- బెంగళూరు ప్రధాన మార్గంలో సికింద్రాబాద్ నుంచి డోన్ వరకు డబ్లింగ్ చేయాలని రైల్వే శాఖ భావించింది. అయితే... 2006 ఫిబ్రవరిలో సర్వే చేసి చేతులు దులుపుకుంది. ఈ మార్గం డబ్లింగ్ కోసం రూ.534.32 కోట్లు అవసరం. ఇక ముంబయి - చెన్నై ప్రధాన మార్గంలోని రేణిగుంట - నందలూరు మధ్య 85 కి.మీ. విద్యుద్దీకరణ పనులను 2004 జూన్‌లో పూర్తి చేయాల్సి ఉండగా... అష్టకష్టాలు పడి గత ఏడాది పూర్తి చేశారు. నందలూరు - ముద్దనూరు మధ్య 55 కిలోమీటర్లు, ముద్దనూరు - కొండాపురం మధ్య 24 కి.మీ, కొండాపురం - గుంత కల్లు మధ్య 104 కి.మీ పనులు కూడా ఆ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తయ్యాయి. నందలూరు - వాడి మధ్య 451 కి.మీ. రైలు మార్గం విద్యుద్దీకరణకు రూ.1,200 కోట్లను కేటాయించారు. ఈ పనులు 2010 డిసెంబరు నాటికే పూర్తి కావాలి. అయితే.. నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుకు సాగని విద్యుత్తు లోకోషెడ్డు పనులు రైల్వే డివిజన్ కేంద్రమైన గుంతకల్లులో రూ.74.3 కోట్లతో విద్యుత్తు లోకోషెడ్డును ఏర్పాటు చేసేందుకు డీటైల్డు రిపోర్టును రైల్వేబోర్డుకు పంపారు. వంద విద్యుత్తు లోకో ఇంజన్ల సామర్థ్యం గల ఈ షెడ్డులో 600 మందికి పైగా సిబ్బందిని నియమించే అవకాశముంది. దీన్ని 2012 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో అంచనా వ్యయం కాస్తా రెటి ్టంపయ్యే అవకాశం ఉందని స్థానిక రైల్వే అధికారులు ఆందోళన చెందుతున్నారు.