
సమష్టి పోరాటంతో రైల్వేజోన్
⇒వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
⇒సాగరతీరంలో బీచ్‌వాక్
⇒రైల్వేజోన్ ఆవశ్యకతపై వాకర్స్‌కు అవగాహన
బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): ఏళ్ల తరబడి రైల్వే జోన్ విషయంలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నా రు. రైల్వే జోన్ కోరుతూ ఈ నెల 30 నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం సాగర తీరంలో పార్టీ నాయకులతో ఆయన బీచ్ వాక్ చేపట్టారు. ‘ఈస్ట్‌కోస్ట్ హటావో వాల్తేర్ బచావ్’ అంటూ నినాదాలు చేస్తూ వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్ వరకు ఈ వాక్ సాగింది. ప్రత్యేక రైల్వే జోన్ ఆవశ్యకతను వాకర్స్‌కు వివరిస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే జోన్‌పై చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణకి నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ఈ నెల 30 నుంచి 11 రోజుల పాటు పాదయాత్ర చేపడతారని చెప్పారు.
అనంతరం గుడివాడ అమర్‌నా«థ్ మాట్లాడుతూ విభజన చట్టంలో ఆరు నెలల సమయంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని పొందిపరిచినా, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఎంత కాలం ప్రజలను మోసగిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వెంకయ్య మాయమాటలు చెప్పడం తప్ప, విశాఖకు ఒరిగిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీచ్ వాక్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కోలా గురువులు, తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, కొండేటì æచిట్టిబాబు(పి.గన్నవరం), రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, మిండగుదిటి మోహన్, గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, పార్టీ సీనియర్ నాయకులు విజయకుమార్‌రాజు, పార్టీ 20వ అధ్యక్షుడు పితాల వాసు, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.