తాడేపల్లికి వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యాలయం | YSR Congress Party Office Shift To Tadepalli | Sakshi
Sakshi News home page

తాడేపల్లికి వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యాలయం

Jul 13 2019 2:06 PM | Updated on Jul 13 2019 10:10 PM

YSR Congress Party Office Shift To Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లికి మారనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా  శనివారం ఆయన ప్రధాన కార్యాలయం పనులను పర్యవేక్షించారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... మరో పది రోజుల్లో తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక నుంచి పార్టీ కార్యకలాపాలు అన్ని ఇక్కడ నుంచే జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, పార్టీకి సంబంధించిన నియామకాలు అన్ని ఇక్కడ నుంచే జరుగుతాయని అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయం అని ధీమా వ్యక‍్తం చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి పథక, వ్యూహ రచనలు తాడేపల్లి నుంచే జరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు నవరత్నాల ద్వారా లబ్ది పొందాలని,  ప్రజలుకు మంచి పరిపాలన ఇవ్వాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతుందని విజయసాయి రడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement