Vijay Sai Reddy
-
విజయసాయి రెడ్డి రాజీనామా
-
జేపీసీలో YSRCP ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు
-
సభలో టీడీపీని నవ్వులపాలు చేసిన YSRCP ఎంపీలు
-
కాకినాడ సీపోర్ట్ కేసులో నాపై దొంగ కేసు పెట్టారు : విజయసాయిరెడ్డి
-
నేను చెప్పిందే నిజమైంది.. జమిలి ఎన్నికలకు సిద్ధమవ్వండి
-
చంద్రబాబు ఇదైనా నిజం చేస్తాడా?
-
సీఎం చంద్రబాబు లక్ష్యమని వేరే చెప్పాల్సిన పనిలేదు
-
చంద్రబాబు, కేవీ రావు పై విజయ సాయి రెడ్డి ఆగ్రహం
-
Vijay Sai Reddy: చంద్రబాబు జైలుకెళ్లక తప్పదు
-
కేవీ రావు, చంద్రబాబు కలిసి కుట్రలు పన్నుతున్నారు: Vijay Sai Reddy
-
UN: ఐరాస భద్రతా మండలిని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి
-
కూటమి ప్రభుత్వం కడప జిల్లా ఎమ్మెల్యేలకు అన్యాయం చేస్తుంది
-
ప్రపంచం ఎంతో మారింది. కానీ చంద్రబాబు మారడు
-
Vijay Sai Reddy: చంద్రబాబు చేతులెత్తేశారు
-
2027లో ఎన్నికలు రాబోతున్నాయి: ఎంపీ విజయసాయిరెడ్డి
-
ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణార్పణ చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. ఆయన అంకితభావం రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది’ అని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. On Andhra Pradesh Formation Day, my warm greetings to the resilient and talented people of this remarkable state. Remembering the immense sacrifice of ‘Amarajeevi’ Potti Sriramulu Garu, whose dedication paved the way for the state’s formation. May Andhra Pradesh continue to…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 1, 2024 -
బాబు వచ్చాడు.. కరువు తెచ్చాడు
-
YSR మరణానికి కారకులెవరు..
-
షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా
-
ఈవీఎం స్కాం బయటకు రాకుండ చంద్రబాబు వేసిన స్కెచ్ ఇది..
-
పురందేశ్వరిపై YSRCP ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
-
చంద్రబాబులాంటి వెన్నుపోటుదారులే దేవుడిని, మతాన్ని వాడుకుంటారు
-
తోడల్లుళ్ల పిల్ల చేష్టలు.. కలియుగ రాక్షసుడు చంద్రబాబు
-
100 రోజుల్లో పార్టీ మటాష్.. బై బై బాబు..బై బై బాబు
-
ఏచూరికి విజయసాయి రెడ్డి నివాళి
-
నారాయణ, చైతన్య సహా కోచింగ్ సెంటర్లను నిషేధించండి
-
మోదీ అండతో బాబు కీచక పాలన !
-
రాజ్యసభలో ఎన్డీఏపై విజయసాయిరెడ్డి ఫైర్
-
రెడ్ బుక్ రాజ్యాంగంలో బాధితులపైనే కేసులు
-
ఎల్లో మీడియా రిపోర్టర్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన విజయసాయి రెడ్డి
-
నా ప్రతిష్ట దెబ్బతీసిన వారిని వదలను: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం: కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడే వాడిని కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం(జులై 15) విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తేలేదన్నారు.ఐదేళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తా. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూల్ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డిప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారు..నాపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదునా ఇంటికి టీడీపీ నాయకుడు, ఒక మహిళ వచ్చారుఇది సిసీ కెమెరాల్లో రికార్డు అయిందివిజయసాయి రెడ్డి గాడు పారిపోయాడా ఉన్నాడా అని అడిగాడువాడు టైం చెపితే నేనే వస్తాను, నేనే వాడి ఇంటికి వెళ్తానుమేము ఎవడికి భయపడేది లేదుమళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేమధ్యంతర ఎన్నికలు వచ్చిన వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందితాటాకు చపపుళ్లకు భయపడేది లేదు..ఒక ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా ప్రచారం చేశారుఆధారాలు లేని ఆరోపణలు చేశారుమహా న్యూస్, ఎబిఎన్, టీవీ 5 నాపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారు.కనీసం నా వివరణ కూడా తీసుకోలేదుమీతో ఎలా క్షమాపణ చెప్పించాలో నాకు తెలుసునా వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసురాధాకృష్ణ, బిఆర్ నాయుడు, వంశీ కృష్ణ లాగా బ్లాక్ మెయిల్ చేయడం నాకు తెలియదు..నేను తప్పు చేస్తే దేవ దేవుడు శిక్షిస్తాడుబరితెగించి హద్దులు మీరు ఆధారాలు లేకుండా ఆదివాసీ మహిళతో సంబంధం కట్టబెట్టారుఈ కుట్ర వెనుక ఉన్న వంశీ, రాధా కృష్ణ, వెంకట కృష్ణ, బిఆర్ నాయుడు, సాంబ లకు బుద్ధి చెపుతానురామోజీరావును ధైర్యంగా ఎదుర్కొన్నానువంశీ అనే వాడిపై, పరువు నష్టం దావాతో పాటు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాను.ఎస్టీ కమిషన్, ఉమెన్ ఆర్గనైజేషన్ ను ఫిర్యాదు చేస్తానుప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతానుసహాయం కోసం వస్తే సంబంధం అంటకట్టేస్తారావయసుతో సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారాసాయిరెడ్డి తండ్రి లాంటి వారని ఆదివాసీ మహిళ చెప్పింది.వంశీ అమ్మ అబ్బకు పుట్టి ఉంటే ఇటువంటివి రాసే వాడు కాదుకుట్రలో భాగంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందిఒక సామాజిక వర్గానికి చెందిన ఛానెల్స్ నాపై తప్పుడు ప్రచారం చేశారువంశీ మీ అమ్మ అక్క చెల్లి ఎవరైనా ఇటు వంటి ఆరోపణలు చేస్తే ఇలానే డిబెట్లు పెడతావావంశీ, సాంబ, వెంకట కృష్ణ పుట్టుక మీద నాకు అనుమానం ఉందిమీకు డీఎన్ఏ టెస్ట్ లు చేయాలిబ్లీచింగ్ పౌడర్, టాల్కం పౌడర్‌కు తేడా తెలియని వ్యక్తి వంశీఓనమాలు రాని వ్యక్తి వంశీతల్లికి చెల్లికి తేడా తెలియని వ్యక్తి వంశీవంశీ ఇంట్లో ఆడవాళ్ళు మీద ఆరోపణలు చేస్తే ఆ బాధ తెలిసేదిటీవీ 5 సాంబ గురించి సంద్య శ్రీధర్ గురించి అడగాలివెంకట కృష్ణ అమ్మాయిని మోసం చేసి ఈనాడులో ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తిఎవరో మహిళతో మహాన్యూస్ వంశీకి అక్రమ సంబంధం ఆటగట్టి డీఎన్ఏ టెస్ట్ అడిగితే ఎలా ఉంటుంది -
చంద్రబాబు నీచ రాజకీయం బయటపెట్టిన విజయసాయి రెడ్డి
-
ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరత
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త టెక్నాలజీల వినియోగం ద్వారా పరిశుభ్రమైన ఇంధనాలతో ప్రపంచంలో కాలుష్యాన్ని, వాతావరణ విధ్వంసాన్ని అదుపు చేయగలుగుతున్నాం. అయితే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఖనిజ లోహాల కొరత ప్రపంచానికి పొంచి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బయిన్లు, సోలార్ ప్యానెల్స్ తదితర నూతన సాధనాలకు కీలకమైన ఖనిజ లోహాలు తగినంత స్థాయిలో ఇక ముందు లభ్యం కాకపోవచ్చని తాజా సమాచారం చెబుతోంది.శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గాలంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ప్రత్యామ్నాయాలకు రాగి, లిథియం లోహాలు అవసరం. రాగి విద్యుత్ ఉత్పత్తికి, లిథియం బ్యాటరీలు పనిచేయడానికి కీలకమనే విషయం తెలిసిందే. 2035 నాటికి ప్రపంచానికి అవసరమైన రాగి డిమాండును 70 శాతం, లిథియం డిమాండును 50 శాతం మేరకే తీర్చగలిగే పరిస్థితులున్నాయని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కిందటేడాది లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ ధరలు తగ్గడం మంచి పరిణామామమేగాని, దీంతో ఈ లోహాల ఉత్పత్తిలో నిమగ్నమైన రంగాల్లో పెట్టుబడులు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఈ ఖనిజ లోహాల కొరత ప్రపంచదేశాల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు వంటి నూతన సాంకేతిక సాధనాలకు ప్రపంచంలో డిమాండు విపరీతంగా పెరుగుతోంది. వాటి తయారీకి అత్యంత కీలకమైన ఖనిజ లోహాల సరఫరా తగినంత స్థాయిలో లేకపోతే ఈ డిమాండును తట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఐఈఏ వివరించింది.2040 వరకు 80వేల కోట్ల డాలర్లుమైనింగ్ ప్రాజెక్టుల్లో 2040 వరకు ఇన్వెస్టర్లు 80వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితేనే ప్రపంచంలో ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం మునుపటి స్థాయికి అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం సాధ్యమౌతుందని అంచనా. మైనింగ్ రంగంలో పెట్టుబడులు మందగిస్తే ఖనిజ లోహాల సరఫరా గణనీయంగా పడిపోతుందని ఐఈఏ హెచ్చరించింది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపకరించే సాధనాల తయారీకి కీలకమైన గ్రాఫైట్ వినియోగం 2040 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. పైన పేర్కొన్న కీలకమైన కొన్ని ఖనిజ లోహాల ధరలు కొవిడ్ ముందునాటి స్థాయిలకు పడిపోయాయి. బ్యాటరీల తయారీకి అవసరమైన లోహాల ధరలు బాగా తగ్గిపోయాయి. అయినా భవిష్యత్తులో వాటి కొరత తప్పదని నిపుణులు భావిస్తున్నారు.ఇండియాలో బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిక్షేపాలు పెద్ద మొత్తాల్లో ఉన్నట్టు గతేడాది కనుగొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి, ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి అవసరమైన ఖనిజ లోహాల ఉత్పత్తి కేవలం కొన్ని దేశాకే పరిమితం కావడం మంచిది కాదు. దానివల్ల వాటి సరఫరా సాఫీగా సాగదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక స్థానానికి చేరిన ఇండియా వంటి పెద్ద దేశాల్లో ఈ ఖనిజ లోహాల లభ్యత, విస్తృత స్థాయిలో ఉత్పత్తి ఎంతో అవసరమని అంతర్జాతీయ ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
బాబూ.. ప్ట్.. నాలుగు సీట్లేనా! విజయసాయిరెడ్డి సెటైర్లు
-
‘వర్కింగ్ ఏజ్’ జనాభా తగ్గడమే పెద్ద సవాలు
జపాన్ దేశ ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆర్థికవ్యవస్థలో మలుపుల కారణంగా అక్కడి నగరాల్లో మూడొంతుల జనాభా నివసిస్తోంది. దాంతో ఆ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. దానికి సమీపంలోని మరో ఆధునిక ఆర్థికవ్యవస్థ దక్షిణ కొరియాలో జనాభా పెరుగుదల రేటు రోజురోజుకు తగ్గిపోతుండడంతో అక్కడ సంతాన సాఫల్య రేటును పెంచడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.‘మినిస్ట్రీ ఆఫ్ లో బర్త్ రేట్ కౌంటర్ ప్లానింగ్’ అనే పేరుతో దేశంలో జనాభా పెంచడానికి మార్గాలు ఆలోచించి, వాటిని అమలు చేసే శాఖను ఏర్పాటు చేయడానికి పార్లమెంటు అనుమతి కోరనున్నట్టు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెవల్ గురువారం ఓ టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు. గత 65 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాలుగా ఎదిగిన జపాన్, దక్షిణ కొరియాను ఒకేరకమైన ప్రత్యేక సమస్యలు పీడిస్తున్నాయి. జపాన్ నేడు 5 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉంది. 20 అగ్రస్థాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దక్షిణ కొరియా 14వ స్థానంలో, ఆసియాలో నాలుగో ర్యాంకులో ఉంది. ఆశించిన స్థాయిలో జనాభా పెరుగుదలకు కీలకమైన సంతాన సాఫల్య రేటు (ఫెర్టిలిటీ రేటు) బాగా తగ్గిపోవడం ఈ రెండు దేశాలను సంక్షోభాల వైపునకు నడిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెప్పుకోదగ్గ ఆర్థికాభివృద్ధి సాధించిన జపాన్, దక్షిణ కొరియాలతోపాటు ఆర్థికవ్యవస్థలో వేగంగా దూసుకుపోతున్న చైనాలో కూడా సంతాన సాఫల్య రేటు ఘననీయంగా తగ్గిపోవడం అక్కడ పాలకులను ఆందోళన కలిగిస్తోంది.ఈ ప్రమాదం ఇండియాకు ఉందా..?ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా ఈ ఏడాది కొత్త రికార్డును సొంతం చేసుకుంది. భారత్‌లోనూ భవిష్యత్తులో సంతాన సాఫల్య రేటు కాస్త ఆందోళన కలిగించే స్థాయికి చేరే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ దేశంలోనైనా పనిచేసే వయసు కలిగిన ప్రజలు (వర్కింగ్ ఏజ్ పీపుల్) సరిపడా ఉండి, దానికి ఇతర కారణాలుతోడైతే ఆ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోంది. ఇతర కారణాలు బాగున్నా వర్కింగ్ ఏజ్ ప్రజలు సరిపడా లేకపోతే సమస్యలు తప్పవు. పారిశ్రామికాభివృద్ధి సాధించిన అనేక యూరప్ దేశాలకు ఇదే ప్రధాన సమస్య. యువ జనాభా బాగా తగ్గిపోవడం పాశ్చాత్య దేశాలకు చాలా ఏళ్ల కిందటి నుంచే పెద్ద ఇబ్బందిగా మారింది. కానీ, ఇతర దేశాలకు చెందిన నిపుణులు అక్కడకు వలస వెళ్లి స్థిరపడేలా వీలు కల్పించే విధానాలున్నాయి. దాంతో అమెరికా వంటి దేశాలకు ఇది అసలు ఆలోచించాల్సిన అంశమే కాదు.కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కూడా సంతాన సాఫల్య రేటు ఆందోళన కలిగించేలా ఉన్నా వలస వచ్చి స్థిరపడుతున్న ప్రజలవల్ల ఈ సమస్యకు కొంత ఉపశమనం కలుగుతోంది. ఇలాంటి విధానాలు లేని జపాన్, దక్షిణ కొరియాకు ఇబ్బందులు తప్పడంలేదు. విదేశీ వర్కర్లు, ఉద్యోగుల వలసలను కఠినతరం చేసే పాలసీలు ఈ రెండు రాజ్యాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాగైనా వర్కింగ్ ఏజ్ జనాభా సరిపడా ఉండేలా ప్రభుత్వాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తు బంగారు బాట అవుతుంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఓట్ హక్కు వినియోగించుకున్న విజయ్ సాయి రెడ్డి, దేవినేని అవినాష్
-
సరైన భద్రత లేదు..విజయసాయిరెడ్డి అసహనం
-
క్యూలో నిలబడిన విజయ సాయి రెడ్డి
-
చంద్రబాబు వ్యాఖ్యలకు విజయ్ సాయి రెడ్డి కౌంటర్..
-
చంద్రబాబు కి విజయ్ సాయి రెడ్డి సూటి ప్రశ్న..!
-
టీ స్టాల్ లో టీ పెట్టిన విజయ సాయి రెడ్డి
-
చంద్రబాబు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు
-
YSRCP ఎంపీ విజయసాయి రెడ్డితో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
నెల్లూరులో జోరుగా విజయ సాయి రెడ్డి ఎన్నికల ప్రచారం..
-
ఎన్నికల ప్రచారంలో విజయసాయి రెడ్డి భార్య,కూతురు
-
ఎన్నికల ప్రచారంలో విజయసాయి రెడ్డి భార్య, కూతురు
-
ప్రచారంలో దూసుకుపోతున్న విజయసాయి రెడ్డి
-
కోటంరెడ్డికి విజయసాయి రెడ్డి మాస్ కౌంటర్..
-
సంధ్య ఆక్వా కంపెనీ కేసుపై విజయ్ సాయి రెడ్డి క్లారిటీ
-
కులతత్వ, మతతత్వ పార్టీలు ఒక్కటయ్యాయి: విజయసాయిరెడ్డి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో 100 మంది జనసేన నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని, జనసేనకి భవిష్యత్తు లేదన్నారు. కులతత్వ, మతతత్వ పార్టీలో ఏపీలో ఒక్కటయ్యాయని ఆయన మండిపడ్డారు. నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా.. రాష్టంలోని అన్ని జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశాను.. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు.. అందుకే వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడ్ని లాక్కుని టికెట్ ఇచ్చారు. మా పార్టీలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలు ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. ‘‘టీడీపీ నేతలు వీధి రౌడీలు, చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది. చంద్రబాబు బంధువులకు చెందిన కంపెనీ. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతలు దొరికితే.. వైఎస్సార్‌సీపీపైకి నెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆరు సీట్లకు మించి రావు. సీబీఐ విచారణలో టీడీపీ నేతల బండారం బయటపడటం ఖాయం. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. బ్రెజిల్ అధ్యక్షునికి అభినందనలతో ట్విట్ పెడితే.. దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారు’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి: జేపీని నమ్మొద్దు.. ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా: పోసాని -
నాపై ఆరోపణలు చేసే వాళ్లకు చెప్తాను...విజయ్ సాయి రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
దుమ్మురేపుతున్న విజయ్ సాయి రెడ్డి ఎన్నికల ప్రచారం
-
గీతాంజలి ఘటనపై..విజయసాయి రెడ్డి సీరియస్
-
నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డికి ఘనస్వాగతం
-
భారీ ప్రణాళికలతో బాపట్ల సిద్ధం సభ
-
మేనిఫెస్టో పై విజయసాయిరెడ్డి క్లారిటీ
-
రాహుల్ గాంధీపై విజయ్ సాయి రెడ్డి సంచలన ట్వీట్
-
మంగళగిరిలో కూడా గెలుపు మాదే..
-
టెస్లాకు ప్రత్యేక రాయితీలు లేవు - విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాకు ప్రత్యేకంగా ఎలాంటి రాయితీలను కల్పించడం లేదని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణ పాల్ గుర్జార్ స్పష్టం చేశారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు రాయితీలతో కూడిన ప్రత్యేక విధానం ఏదీ ప్రభుత్వం రూపొందించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు, మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. దేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటి)తో కూడిన ఉత్పాదనల కోసం ప్రభుత్వం ఉత్పత్తితో ముడిపడిన రెండు ప్రోత్సాహక పథకాలను (పిఎల్ఐ)ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఏఏటితోపాటు దేశంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసిసి) బ్యాటరీల ఉత్పాదనను కూడా పిఎల్ఐ స్కీమ్‌లో చేర్చినట్లు చెప్పారు. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజి కార్యక్రమం కింద ఈ రంగంలో దేశీయంగా ఏసీసీ బ్యాటరీల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో 2021 మే 12న ప్రభుత్వం ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. దీని కోసం 18 వేల 100 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. దేశంలో 50 గిగావాట్ అవర్స్ (జిడబ్ల్యూహెచ్) సామర్ధ్యం వరకు ఏసీసీ బ్యాటరీల ఉత్పత్తి సామర్ధ్యాన్ని స్థాపించడం, ఈ పథకం ఉద్దేశం అని మంత్రి పేర్కొన్నారు. ఇక ఆటోమొబైల్, అటో విడిభాగాల పరిశ్రమ కోసం 2021 సెప్టెంబర్ 15న ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ)ని ప్రభుత్వం ఆమోదించింది. దీని కోసం 25 వేల 938 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు జరిగింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడిభాగాలతో పాటు అత్యంత అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పాదనలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పిఎల్ఐ స్కీం కోసం కెంపెనీల నుంచి దరాఖాస్తుల స్వీకరణకు తుది గడువు ముగిసిపోయిందని మంత్రి వెల్లడించారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ బ్యాటరీ స్టోరేజి కార్యక్రమం కింద ఈ ఏడాది జనవరి 24న ప్రకటించిన పిఎల్ఐ పథకానికి ఆసక్తిగల కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించడం జరిగింది. దీనికి అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ కూడా ఆర్ఎఫ్పి పంపించవచ్చని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు -
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే జగన్ సీఎం కావాలి
-
సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది:విజయసాయి రెడ్డి
-
సీఎం జగన్ మాటే ఫైనల్..పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే..
-
సామాజిక సమతా సంకల్పం సభకు లక్ష 50 వేల మంది..!
-
సీఈసీతో ఎంపీ విజయసాయిరెడ్డి బృందం భేటీ
-
సీఈసీతో ఎంపీ విజయసాయిరెడ్డి బృందం భేటీ
-
ఇండియాలోనే రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఎక్కువ? డబ్ల్యూహెచ్ఓ నివేదిక ఏం చెప్పింది?
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన తాజా నివేదికలో తెలిపింది. 2010–2021 మధ్య రోడ్డు ట్రాఫిక్ దుర్ఘటనలు ఏటా 5 శాతం (లక్షా 19 వేలు) తగ్గాయి. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో సభ్యత్వం ఉన్న 108 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిపోతుండగా, భారత్‌లో మాత్రం 15 శాతం పెరిగాయని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఇండియాలో 2010లో 1.34 లక్షలు సంభవించగా, 2021లో వాటి సంఖ్య 1.54 లక్షలకు పెరిగింది. రోడ్డు భద్రతలో ప్రపంచ పరిస్థితి–2023 అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నార్వే, డెన్మార్క్, జపాన్, రష్యా సహా పది దేశాల్లో రోడ్డు దుర్ఘటనల మరణాలు 50 శాతం తగ్గించగలిగారు. మరో 35 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 30 నుంచి 50 శాతం వరకూ తగ్గిపోయాయి. 2019 నాటికి ప్రపంచంలో ఐదు నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, యువతీయువకుల మరణాలకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలని, అన్ని వయసులవారి హఠాన్మరణాలకు 12వ ప్రధాన కారణం రోడ్డు దుర్ఘటనలేనని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మూడింట రెండు వంతుల మరణాలు పనిచేసే వయసులో ఉన్న వారికే సంభవించాయి. గడచిన దశాబ్దంలో ప్రపంచ జనాభా 140 కోట్లు (13%) పెరగింది. కాని, విశ్వవ్యాప్తంగా రోడ్డు దుర్ఘటనల్లో మొత్తం మరణాలు ఐదు శాతం తగ్గిపోయాయి. పదేళ్ల కాలంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. 2010–2021 సంవత్సరాల మధ్య ప్రపంచంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. కాగా, ప్రతి లక్ష వాహనాలకు ఏటా ప్రమాదాల్లో సంభవించే మరణాల రేటు 79 నుంచి 47కు తగ్గింది. అంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య 41% తగ్గినట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల మరణాలు 28 శాతం ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంభవించాయి. 25% రోడ్డు చావులు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, 19% ఆఫ్రికా ప్రాంతంలో, అమెరికా ఖండాల్లో 12%, తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో 11%, ఐరోపా ప్రాంతంలో కేవలం ఐదు శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. పేద, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లోనే రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువ. మోటారు వాహనాలకు రహదారులపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించేది పేద, మధ్య స్థాయి ఆదాయాలు ఉన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రతి పది మరణాల్లో తొమ్మిది ఈ పేద దేశాల్లోనే జరిగే రోడ్డు దుర్ఘటనల్లో సంభవిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే–పేద, మధ్య స్థాయి ఆదాయాలున్న దేశాల్లో జనం వాడే మోటారు వాహనాలు సంఖ్య తక్కువ. అలాగే, ఈ దేశాల్లో ఉన్న రహదారుల సంఖ్య కూడా బాగా తక్కువ. రోడ్ల నాణ్యత కూడా అభిలషణీయ స్థాయిలో ఉండదు. సరైన మౌలిక సౌకర్యాలు, అవసరమైనన్ని మోటారు వాహనాలు లేని ఈ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించే అవకాశం ధనిక దేశాలతో పోల్చితే బాగా ఎక్కువ. ఈ బడుగు దేశాల్లో మోటారు వాహనాల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ పేదరికం, సరైన రోడ్లు లేకపోవడం, డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వంటి కారణాల వల్ల అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో రోడ్లపై తిరిగే మొత్తం మోటారు వాహనాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే తక్కువ ఆదాయ దేశాల్లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలపింది. ఈ నివేదిక వివరాలను ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక శుక్రవారం ప్రచురించింది. రోడ్డు ప్రమాదాల్లో యువకులు, చిన్న పిల్లల మరణాల వల్ల ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. రోడ్లపై మోటారు వాహనాల ప్రమాదాలు అరిక్టడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా, మరణాలకు కారకులైనా పెద్ద శిక్షలు వేయడం ఎప్పటి నుంచో అమలులో ఉన్న విధానం. ఇండియాలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో చావుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
లోక్‌సభలో పోస్టాఫీస్ బిల్లుపై చర్చ
-
అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం..
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఉడాన్ యోజన(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా విమానయాన కంపెనీలకు కొన్ని రాయితీలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీ గడువు ముగిసిన తర్వాత కొన్ని సర్వీసులు ఆగిపోయాయనే వాదనలు ఉన్నాయి. కొన్ని అంతకు ముందు నిలిచిపోయినట్లు తెలిసింది. అయితే తాజాగా కేంద్రం రూట్లను తగ్గించి విమానాలు నడుపుతున్నారని పలువురు భావిస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా పార్టీల నేతలు వాటిపై ఎలాంటి ప్రశ్నలు అడగడంలేదు. అయితే తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యసింథియా స్పందించారు. ఇప్పటికే కోటి 30 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారని తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన రూట్లలో మూడేళ్ల కన్సెషన్ గడువు ముగిసింది. దాంతో కేవలం 7 శాతం (54 రూట్లు) మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నట్లుగా కాగ్ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన రూట్లు కన్సెషన్ గడువు వరకు కూడా ఎందుకు మనుగడ సాగించలేకపోయాయి’ అంటూ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఉడాన్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. దేశ వ్యాప్తంగా 76 ఎయిర్‌పోర్టులు ఉడాన్ యోజనలో భాగంగా ఉన్నాయి. ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) వల్ల ఇప్పటి వరకు 2 కోట్ల 75 లక్షల విమాన ప్రయాణాలు జరిగాయి. విమానయాన ప్రయాణానికి దూరంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడ్డాయి. ఈ రాష్ట్రాల్లో కొత్తగా 9 ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరిగింది. అందులో 6 ఎయిర్‌పోర్ట్‌లు కేవలం ఉడాన్ యోజన కిందే ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద ఆయా రూట్లలో విమానాలు నడిపే సంస్థలకు మూడేళ్లపాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను చెల్లించాలని ప్రతిపాదించాం. దాంతో ఈ పథకం ద్వారా మొదట్లో వేయి రూట్లను లక్ష్యంగా చేసుకున్నాం. ఇందులో 74 రూట్లలో మూడేళ్ళ కాల వ్యవధి తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే మూడేళ్ల తర్వాత గిట్టుబాటు కాని రూట్ల స్థానాల్లో కొత్త రూట్లను గుర్తిస్తున్నాం. ప్రజలు విమాన ప్రయాణానికి అలవాటు పడుతున్న కొద్దీ ఈ రూట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 1920లో కోటి 44 లక్షలు ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 42 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం’అని మంత్రి వివరించారు. దేశంలో ఇటీవల నెలకొన్న ప్రత్యేకపరిస్థితుల వల్ల గరిష్ఠంగా ఒకరోజు 4 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. కొవిడ్‌కు ముందు 2019 లెక్కల ప్రకారం దేశీయంగా నడిచే విమానాల్లో వారానికి దాదాపు 90 వేల మంది ప్రయాణించారని సమాచారం. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. ఏపీలో గతంలో మొత్తం 4 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత 40 ఉడాన్ రూట్లను గుర్తించారు. ఉడాన్ రూట్లలో భాగంగా కడప, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, ప్రకాశం బ్యారేజి (సీ ప్లేన్) నుంచి విమాన సర్వీసులకు అనుమతులు మంజూరయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు బెలగాం, కొల్హాపూర్, హుబ్లి, జగ్దల్పూర్, కలబురిగి (గుల్బర్గా), కలైకుండ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేలా ఆమోదం తెలిపారు. -
పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు
-
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో విజయసాయిరెడ్డి
-
"దమ్ముంటే ఆ పని చేయాలి "..విజయసాయి రెడ్డి కౌంటర్
-
పురందేశ్వరిపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లపై సెటైర్లు
-
విజయనగరంలో YSRCP సామాజిక సాధికార బస్సు యాత్ర
-
ప్రతి పక్షాలకు విజయ్ సాయి రెడ్డి కౌంటర్
-
పురందేశ్వరికి సూటి ప్రశ్న !
-
టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి..ఆ ఇద్దరి పై విజయ్ సాయి రెడ్డి పంచులు..
-
చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
-
బాబు భ్రమలు తొలగిపోయాయి
ఒంగోలు: చట్టం నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చన్న చంద్రబాబు భ్రమలు నేటితో తొలగిపోయాయని ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఆదివారం రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. తాను ఎన్ని అక్రమాలు చేసినా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోవచ్చని, స్టేలు తెచ్చుకుని శిక్ష నుంచి తప్పించుకోవచ్చని చంద్రబాబు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారన్నారు. కానీ నేటితో ఆ భ్రమలు వీడిపోయాయన్నారు. విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎవరైనా చట్టానికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే పాలన సాగించాల్సి ఉంటుందని కోర్టు తీర్పుతో నేడు మరోమారు నిరూపితమైంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశముంది. ఆయనపై ఇంకా 6 లేదా 7 ట్రయిలబుల్ (ప్రాసిక్యూషన్ ) కేసులు ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు సంబంధించిన సంపదను దోచుకుని, విదేశాలకు ఎలా తరలించారన్న దానిపై విచారించి తిరిగి ఖజానాకు జమచేసేలా సీఎం జగన్ చర్యలు చేపడతారు. నిజానికి.. బాబు అవినీతికి సంబంధించిన అన్ని కేసుల్లో శిక్షపడితే జీవితాంతం జైల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌తోపాటు తదుపరి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడం ద్వారా ఇంకా అనేక అంశాలు బహిర్గతమవుతాయి. రామోజీ అకృత్యాలు చాలానే.. ఇక రామోజీరావు దారుణాలు, అకృత్యాలు కూడా చాలానే ఉన్నాయి. ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొన్నింటిలో తప్పించుకున్నారు. కానీ, అన్నింటిని చట్టపరిధిలోనే ధర్మాన్ని నెరవేరుస్తాం. ఉన్నత పదవుల్లో ఉన్నవారు రాష్ట్ర సంపదను దోచుకుని అవినీతికి పాల్పడినప్పుడు కేసు నమోదుచేస్తే అది రాజకీయ కక్ష అవుతుందా? నిజంగా రాజకీయ కక్షే అయితే ఆదివారం ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పువచ్చేది. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదై, అరెస్టయితే మిగిలిన వ్యవహారమంతా కోర్టు పరిధిలోకి వెళ్తుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రకారమే అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది. -
భారత ఆర్థికవ్యవస్థను ఇంజిన్‌లా ముందుకు తీసుకెళుతున్న సేవారంగం
142 కోట్ల జనాభాలో 120 కోట్ల తక్కువ ఆదాయవర్గం కొనుగోలు శక్తి పెరిగితే ప్రగతి రథం పరుగులు పెడుతుంది! ప్రపంచంలో అనేక అభివృద్దిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం తరచు దర్శనమిస్తోంది. అయితే, ప్రపంచంలో అత్యధిక జనాభా, విస్తృత మార్కెట్ ఉన్న ఇండియా అంతర్జాతీయ కుదుపుల ప్రభావం పెద్దగా లేకుండా ముందుకు సాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6–7 శాతం మధ్య కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను సేవారంగం రైలింజిన్లా ముందుకు వేగంగా నడిపిస్తోంది. భారత జీడీపీలో 60% వాటా కలిగి ఉన్న సేవారంగం ఏడాదికి 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. జీడీపీ ఆరు శాతం వార్షిక వృద్ధి రేటుతో కొనసాగడానికి సేవారంగం ప్రధాన పునాదిగా పనిచేస్తోంది. సేవారంగం పోగా మిగిలిన రెండు కీలకరంగాలైన పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు జీడీపీలో వరుసగా 26%, 14% వాటా కలిగి ఉన్నాయి. అనూహ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశమున్న ఈ రెండు రంగాలు కాస్త అటూ ఇటూ అయినా పటిష్ఠమైన సేవారంగం ప్రగతితో భారత ఆర్థిక వ్యవస్థ మంచి ఆరోగ్యంతో పరుగులు తీస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక–తయారీ రంగాలు వరుసగా 4%, 5.5% వార్షిక వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు రంగాల అభివృద్ధి రేటు మరో ఐదు శాతం పెరిగితే దేశ జీడీపీ రేటు 8 శాతానికి పెరగడం సాధ్యమేనని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. జనాభాలో నంబర్ 1 అయినా– యువత నైపుణ్యం, ప్రతిభాపాటవాలు పెరగాలి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా అవతరించిన మాట నిజమే. అలాగే, ఇక్కడి జనసంఖ్యలో యువత వాటా ఇతర దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కాని, కళాశాలల్లో చదువులు పూర్తిచేసుకుని పట్టభద్రులుగా తిరిగొస్తున్న భారత యువతీయువకుల్లో ఉద్యోగాలు సమర్ధంగా చేసే నైపుణ్యాలు చాలా తక్కువని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటి యువతకు అవసరమైనంత నైపుణ్యం సమకూర్చడానికి సర్కారు 2015 జులై 15న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ (ఎనెస్ డీఎం) ఏర్పాటు చేసింది. మంచి శిక్షణ పొందిన, నైపుణ్యమున్న కార్మికుల కొరత దేశంలో తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎనెస్ డీఎం వివరిస్తూ, ‘‘ఇండియాలో ఉద్యోగంలో చేరడానికి ముందు శిక్షణ పొందిన ఉద్యోగలు లేదా కార్మికుల సంఖ్య కేవలం 2.3% మాత్రమే. అదే యూకేలో 68%, జర్మనీలో 75%, అమెరికాలో 52%, జపాన్ లో 80%, దక్షిణ కొరియాలో 96% ఉద్యోగ శిక్షణ పొందినవారే. ఉద్యోగాలిచ్చే సంస్థల యజమానుల అవసరాలకు అనుగుణంగా, దేశ ఆర్థిక ప్రగతిని పెంచడానికి యువత ప్రతిభాపాటవాలు పెంచడానికి తగిన శిక్షణ అవసరం’ అని నొక్కిచెప్పింది. పెరుగుతున్న వస్తుసేవల వినియోగం దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వృద్ధికి అనుగుణంగా వాటి వినియోగం కూడా వాంఛనీయ స్థాయిలో పెరుగుతోంది. బ్లూమ్ వెంచర్స్ అనే సంస్థ రూపొందించిన తన 2023 ఇండస్ వ్యాలీ నివేదిక ప్రకారం దేశంలో అగ్రశ్రేణి వినియోగదారులు 12 కోట్ల మంది ఉన్నారు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.10 లక్షలు. వారిలో రూ.29 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ఓ చిన్న సంపన్న శ్రేణి జనాభా రెండున్నర కోట్ల మంది. ద్వితీయ శ్రేణి వినియోగదారుల జనాభా 10 కోట్లు. వారి సగటు వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు. ఈ ఆదాయవర్గాన్నే మధ్య తరగతి అని పిలుస్తారు. ఇక అసలు సిసలు ఇండియాగా పరిగణించే మూడో తరగతి వినియోగదారుల సంఖ్య 120 కోట్లని అంచనా. వారి సగటు వార్షికాదాయం రూ.1.20 లక్షలు. డాలర్–రూపాయి మారకం విలువ, అమెరికాలో వస్తుసేవల ధరలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న భారతీయుడు అమెరికాలో అంతే మొత్తం ఆదాయం (డాలర్లలో 12,00) ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ సరకులు కొనుగోలు చేయగలడని బ్లూమ్ వెంచర్స్ నివేదిక అంచనా వేసింది. ఈ లెక్కన 22 కోట్ల జనాభా ఉన్న మొదటి, రెండో అగ్రశ్రేణి వినియోగదారుల కొనుగోలు శక్తి భారత ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించడానికి దోహదం చేస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భావిస్తోంది. అయితే, 142 కోట్ల జనాభాలో 120 కోట్ల మంది ఉన్న తక్కువ ఆదాయవర్గం ఆదాయం, కొనుగోలు శక్తీ కూడా అభిలషణీయ స్థాయిలో పెరిగితే భారత ప్రగతి రథం అందరూ కోరుకునే రీతిలో వేగం పుంజుకుంటుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
సీఈసీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఓట్ల తొలగింపుపై భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఈసీని కలిశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీతో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీస్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు మేము అవకతవకలకు పాల్పడుతున్నామని ఆయన అంటుంటే దొంగే దొంగ అన్నచందాన ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. 2014-19 వరకు బాబు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని, ఆ లెక్క సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తూనే దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఈసీదేనని అన్నారు. వెంటనే ఓటరు కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒకరికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని.. రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకతతో జరిపించాలని ఈసీని కోరినట్టు స్పస్టం చేశారు. ఈ దఫా అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు జరిగిందని 2019లో 3,98,34776 ఓట్లు ఉంటే, ఇప్పుడు 3,97,96,678 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఎక్కడా దొంగ ఓట్ల నమోదు జరగలేదని అన్నారు. ఎన్నికలకు నిజమైన ఓటర్ల జాబితా ఉండాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. చంద్రబాబు సేవా మిత్ర, మై టీడీపీ ద్వారా బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని, టీడీపీ ఓటరు ప్రొఫైలింగ్ ఆపాలని ఈసీని కోరినట్టు తెలిపారు. దీనిపై ఈసీ ఫుల్ కమిషన్ ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చంద్రయాన్-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్ రూట్ మార్చిన ఇస్రో -
సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు
-
షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ బిల్లుపై రాజ్యసభలో చర్చ
-
ల్యాప్‌ట్యాప్‌లపై కేంద్రం ఆంక్షలు.. భారత ఐటీ హార్డ్ వేర్ రంగానికి మంచి రోజులు!
ఆధునిక భారతంలో నేడు ప్రతి చోటా అవసరమైన ల్యాప్‌ట్యాప్‌లు,ట్యాబ్లెట్ పీసీలు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల హఠాత్తుగా ఆంక్షలు విధించడం చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించింది. అంతేకాదు, ఇంటర్నెట్ ఆధారిత లోకంలో ఇలాంటి కొత్త ‘నిత్యావసరాల’ దిగుమతులు సాఫీగా జరిగేలా చూడకుండా వాటి నిరంతర సరఫరాను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అడ్డుకోవడం ఎంత వరకు సబబు? ఇలాంటి ఆంక్షలు దేశంలో ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు , పీసీల ఉత్పత్తి అవసరమైనంతగా పెరిగి, నాణ్యత గల కంప్యూటర్లు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయా? లేక ఈ దిగుమతుల పరోక్ష ‘నిషేధం ఉత్తర్వులు’ అనుకున్న లక్ష్యాలు సాధించకపోతే చివరికి పాత మార్గంలోనే పయనించాల్సి వస్తుందా? ఇలాంటి కీలక వినియోగ వస్తువుల దిగుమతిపై ఆంక్షలు పెట్టడానికి దేశ భద్రత ప్రధాన కారణమని ప్రకటించారు. దీంతో ఈ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్ సెట్లను స్థానికంగా తయారుచేసుకోవడంలో ఇండియా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. కాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హార్డ్ వేర్ రంగంలో (ల్యాప్‌ట్యాప్‌లు, పీసీలు,ట్యాబ్లెట్లు) ఆశించినంత అభివృద్ధి ఇంకా సాధించలేదు. భారతదేశంలో వినియోగించే దాదాపు 65 శాతం ల్యాప్ ట్యాప్‌లు, పీసీలను దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులపై ఆంక్షలతో దేశీయంగా ఈ ఐటీ హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీ గణనీయంగా పెంచాలనుకునే ఆశయం మంచిదే. మరి ఈ పని ఎప్పుడో చేసి ఉంటే ల్యాప్‌ట్యాప్‌లు, పీసీల తయారీ రంగం ఎంతో ముందుకు సాగేదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దిగుమతులకు తగినంతగా అడ్డుకట్ట వేయడంలో జరిగిన విపరీత జాప్యం వల్ల సింగపూర్, హాంకాంగ్, వియత్నాం వంటి తోటి ఆసియా దేశాలు ఈ రంగంలో తిరుగులేని అభివృద్ధి సాధించాయి. మరోపక్క కంప్యూటర్ సాధనాల తయారీ, ఎగుమతిలో చైనా ఎదురులేని అగ్రశేణి దేశంగా తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. చైనా విషయంలో జాగరూకతే ఆంక్షలకు కారణమా? పైన చెప్పిన కంప్యూటర్ సాధనాల విషయంలో చైనాపై ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదని, అందుకే వాటి దిగుమతిపై ఆంక్షలు విధించడం తప్పనిసరి అని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా చర్యను వారు సమర్ధిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ హఠాత్ నిర్ణయం వల్ల కంపెనీలు ఇబ్బంది పడకుండా మరి కొన్ని నెలలపాటు అవి లాప్టాప్ లు, పీసీలను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం కొత్త దిగుమతి లైసెన్సింగ్ విధానం ద్వారా వాటికి మార్గం చూపిస్తోంది. దీని వల్ల ఇప్పటికిప్పుడు ఈ కంప్యూటర్ సాధనాలకు కొరత ఏర్పడి, వాటి ధరలు పెరిగే ప్రమాదం ఉండకపోవచ్చని కూడా ఐటీ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈలోగా ఈ కీలక వినియోగ వస్తువుల ఉత్పత్తి దేశీయంగా తగినంతగా పెరిగే పరిస్థితులను సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పీసీలు, లాప్టాప్ లు వంటి ఐటీ హార్డ్ వేర్ రంగం కోసం ఈ ఏడాది మొదట్లోనే ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని కోసం బడ్జెట్లో రూ.17,000 కోట్లు కేటాయించింది. ఈ రంగంలోకి భారీ పెట్టుబడులను, బడా కంపెనీలను ఆకర్షించడానికి వీలుగా ఈ కొత్త పథకం కోసం దరఖాస్తు చేసుకునే గడువును కూడా పొడిగించింది. విద్య, వ్యాపారం, వినోద రంగాల్లో రోజురోజుకూ వినియోగం పెరుగుతున్న లాప్టాప్ లు, టాబ్లెట్లు, పీసీలు తయారీ దేశంలో శరవేగంతో పెరిగితేనే ఇండియా అవసరాలు తీరతాయి. ఈ రంగంలో అమలులోకి వచ్చే దిగుమతి ఆంక్షలకు తోడు కంప్యూటర్ సాధనాల అరకొర ఉత్పత్తి వల్ల దేశం ఐటీ హార్డ్ వేర్ రంగంలో ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి రాకుండా భారత ప్రభుత్వం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన సంఖ్యలో కంప్యూటర్లు, లాప్టాప్ ల తయారీతోపాటు ఈ ఐటీ ఉత్పత్తుల నాణ్యత, ధరలు అత్యంత కీలకమౌతాయి. ఈ రెండు అంశాలే దేశంలో ఐటీ హార్డ్ వేర్ ఉత్పత్తుల రంగం అభివృద్ధిని నిర్ణయిస్తాయి. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రపంచస్థాయి ఐటీ కంప్యూటింగ్ సాధనాలకు ఇండియాయే ఓ పెద్ద సరఫరాదారు అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటి చైనా మాదిరిగానే ల్యాప్‌ట్యాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల ఎగుమతి కేంద్రంగా అవతరిస్తుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
పకడ్బందీగా కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాశ్ సర్కార్ తెలిపారు. సీయూఈటీ తాత్కాలిక ఆన్సర్ కీలో పొందుపర్చిన అనేక సమాధానాలు తప్పులు తడకగా ఉన్న విషయం వాస్తవమేనా అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సంబంధించి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలో 570 జవాబులను సబ్జెక్టు నిపుణులు పరిష్కరించి సవరించారన్నారు. కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో మొత్తం 61 సబ్జెక్టులకు సంబంధించి 2,305 ప్రశ్నపత్రాల్లో 1,48,520 ప్రశ్నలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రశ్నలకు సంబంధించి విడుదల చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలలో అభ్యర్థులు 3,886 ఆన్సర్ కీలను చాలెంజ్ చేశారన్నారు. తప్పు జవాబులపై అభ్యర్థులు చేసిన చాలెంజ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమించిన సబ్జెక్ట్ నిపుణులు పరిష్కరించిన అనంతరం రూపొందించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే ఫలితాల విడుదల జరుగుతుందని మంత్రి వివరించారు. ఏపీలో 662 రైజింగ్ ఇండియా పాఠశాలలు ఆంధ్రప్రదేశ్‌లో 662 పాఠశాలలను ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం ఎస్హెచ్ఆర్ఐ)లో భాగంగా గుర్తించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. వీటి కోసం 2023–24లో కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.354.85 కోట్లు (212.91కోట్లు+141.94 కోట్లు) ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు అనుమతించినట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 10,834 గ్రామాల్లో డ్రోన్ సర్వే ఆంధ్రప్రదేశ్‌లోని 10,834 గ్రామాల్లో ఇప్పటివరకూ పీఎం స్వమిత్వలో భాగంగా డ్రోన్ సర్వే నిర్వహించినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. గ్రామాల్లో గృహ యజమానులు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడానికి ఈ సర్వే చేస్తున్నట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2031 వరకూ నెల్లూరు హైవేకు రాయితీ జాతీయ రహదారి–16లోని నెల్లూరు–తడ నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, నిర్వహణ, బదిలీ(బీవోటీ) టోల్ పద్ధతిలో నిర్మించారని, దీని రాయితీ కాలం సెపె్టంబర్ 2031 వరకూ ఉంటుందని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. టోల్ వసూలు ఏజెన్సీతో ధరల సవరణ ఎంవోయూ ఏదీ పరిశీలనలో లేదన్నారు. -
అమెరికా నుంచి ఇండియాకు తిరిగొస్తున్నవారు ఎక్కువా?
అమెరికా నుంచి ఇండియాకు తిరిగొస్తున్నవారు ఎక్కువా? దేశం వదలి పాశ్చాత్య దేశాలకు వలసపోతున్న జనం ఎక్కువా? వృత్తి నిపుణుల వలసలపై ఎడతెగని చర్చ ఇండియా నుంచి సంపన్నులు భారత పౌరసత్వం వదులుకుని పాశ్చాత్య దేశాల్లో ఎందుకు స్థిరపడుతున్నారు? అమెరికా వంటి పారిశ్రామిక దేశాల్లో చదువుకుని, కొన్నేళ్లు ఉద్యోగం చేశాక ఇండియా వచ్చేసి కొత్త వ్యాపారాలు పెట్టుకునే నిపుణులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారా? దేశం విడిచి అభివృద్ధిచెందిన దేశాలకు పోతున్నవారు, స్వదేశానికి తిరిగొస్తున్న భారతీయుల్లో...ఎవరు ఎక్కువ? ఈ రెండు రకాల వలసలపై మధ్య తరగతి ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఏ దేశంలోనైనా చదువు, సంపద, పారిశ్రామికీకరణ, మరీ ముఖ్యంగా జనాభా పెరిగినప్పుడు ఆ దేశం నుంచి సంపన్నులు, ఉన్నత విద్యావంతులు అత్యున్నత ప్రగతి సాధించిన దేశాలకు పోయి స్థిరపడతారు. ‘రవి అస్తమించని సామ్రాజ్యం’ నెలకొల్పిన గ్రేట్ బ్రిటన్ నుంచే పెద్ద సంఖ్యలో జనం అమెరికాకు 19వ శతాబ్దం నుంచి వలసపోవడం భారీగా మొదలైంది. 1820–1957 మధ్యకాలంలో అంటే 137 ఏళ్లలో ఇంగ్లండ్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఆంగ్లేయుల సంఖ్య 45 లక్షలు. బ్రిటన్ నుంచి జనం పెద్ద సంఖ్యలో 1860లు, 70లు, 80ల్లో అట్లాంటిక్ మహాసముద్రం దాటి అతిపెద్ధ వైశాల్యం ఉన్న అమెరికాకు వలసపోయారు. ఒక్క 1888లోనే ఇంగ్లండ్ నుంచి 11 లక్షల మంది అమెరికా వెళ్లిపోయారు. మరి, అప్పటికి ఎంతో ప్రగతి సాధించిన సామ్రాజ్యవాద శక్తి బ్రిటన్ నుంచే అంత మంది ప్రజలు ఎందుకు వెళ్లిపోయారు? 19వ శతాబ్దంలో అమెరికా అభివృద్ధిపథంలో వేగంగా పయనిస్తూ అందించే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికే వారు వలసపోయారు. అంతేగాని స్వదేశంలో వేధింపులు ఉన్నాయనో, భవిష్యత్తు లేదనే నిరాశతోనో ఇంగ్లిష్ ప్రజలు దేశం వదలిపోలేదు. ఇప్పుడు 21వ శతాబ్దం ప్రథమార్ధంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతున్న ఇండియా నుంచి జనం అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధిచెందిన దేశాలకు వలసపోవడం కూడా అత్యుత్తమ అవకాశాల కోసమే. ఇండియాలో తమకు గొప్ప జీవనశైలి, భద్రత ఉండదనే నైరాశ్యంతో కాదు. బ్రిటిష్ వారి హయాంలోనే ఇండియా నుంచి వలసలు బ్రిటిష్ వారి వలస పాలనలోని గయానా, మారిషస్, ఫిజీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని చెరకు తోటలు, ఇతర వ్యవసాయ క్షేత్రాల్లో ఒప్పంద కార్మికులుగా పనిచేయడానికి ఇండియా నుంచి జనం పెద్ద సంఖ్యలో వెళ్లడం 1834లో ఆరంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల వేధింపులు తట్టుకోలేక కొందరు, మెరుగైన విద్యార్హతలతో ఉత్తమ ఉపాధి అవకాశాల కోసం మరి కొందరు పాశ్చాత్య దేశాలకు వలసపోయారు. ఇలా ఇతర దేశాలకు వెళ్లినవారిలో కొందరు నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని కొన్ని ప్రజాస్వామ్య రాజ్యాల్లో దేశాధినేతలు అయ్యారు. ప్రస్తుతం దాదాపు 200 మందికి పైగా భారత సంతతికి చెందిన ప్రముఖులు కనీసం 15 దేశాల్లో ఉన్నత పదవుల్లో నేడు కొనసాగుతున్నారు. వారిలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్, గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా ప్రముఖులు. ఇప్పుడు చరిత్రలోకి తొంగి చూసి పై విషయాలన్నీ చెప్పడానికి కారణాలున్నాయి. ఇండియా నుంచి మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. 2011 నుంచీ 16 లక్షల మంది సంపన్నులు భారత పౌరసత్వం వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబతున్నాయి. ద్వంద్వ పౌరసత్వానికి వీలులేనందు వల్ల ఇతర దేశాల పౌరసత్వం తీసుకునే ప్రజలు తమ భారత పౌరసత్వం వదులుకోవాల్సివస్తోంది. ఒక్క 2022లోనే 2,25,62 మంది భారతీయులు ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పైన చెప్పుకున్నట్టు మెరుగైన అవకాశాలు, భిన్నమైన జీవనశైలి కోసం 140 కోట్ల జనాభా దాటిన ఇండియా నుంచి కొన్ని లక్షల సంఖ్యలో ధనికులు ఇతర దేశాలకు వలసపోవడం ఆందోళన కలిగించే అంశమేమీ కాదని సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదీకాక, అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి పదేళ్లకు పైగా అక్కడ ఉద్యోగం చేసిన పలువురు భారతీయలు అనేక కారణాలతో స్వదేశానికి తిరిగొచ్చి వినూత్న తరహాలో వ్యాపారాలు పెట్టుకుని విజయాలు సాధిస్తున్నారని కూడా మీడియాలో చదువుతూనే ఉన్నాం. ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అపూర్వ ప్రగతి సాధిస్తున్న దేశాల నుంచి సైతం కొందరు వలసపోవడం అత్యంత సహజ పరిణామమేగాని పెద్దగా దిగులుపడాల్సిన విషయం కాదు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. -
‘డాలర్ మిలియనీర్ల విదేశీ వలసలు తగ్గుతున్నాయి’
ఇండియా నుంచి పది లక్షల డాలర్ల (మిలియన్) మించిన సంపద ఉన్న ధనికులు పెట్టుబడులతో విదేశాలకు తరలిపోవడం క్రమంగా పెరుగుతోందని కిందటేడాది ఆందోళన వ్యక్తమైంది. నిజమే, కొత్తగా కోట్లాది రూపాయలు సంపాదించిన తెలివైన భారతీయులు స్వదేశం విడిచి ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాలకు తరలిపోవడం ఎవరికైనా మొదట దిగులు పుట్టిస్తుంది. కష్టపడి వ్యాపారాల ద్వారా సంపాదించిన వ్యక్తులు మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు పోగేసుకున్న తర్వాత కూడా తమకు అనుకూలంగా కనిపించే దేశాలకు పెట్టుబడుల ద్వారా వలసపోవడానికి అనేక కారణాలుంటాయి. తమ ఆర్జనపైన, విదేశాల్లో పెట్టే పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాలపైన భారత ప్రభుత్వం విధించే పన్నులు సబబుగా, హేతుబద్ధంగా లేవనే కారణంతో కొందరు పైన చెప్పిన డాలర్ మిలియనీర్లు విదేశాలకు వలసపోతుంటారు. మరి కొందరు మిలియనీర్లు ఇక్కడ కన్నా మెరుగైన సామాజిక జీవనశైలి సాధ్యమని భావించిన దేశాలకు పోయి స్థిరపడుతుంటారు. ఇలా రకరకాల కారణాలతో కొద్ది మంది కొత్త కోటీశ్వరులు ఇండియా నుంచి బయటకు పోతున్నారు. వలసపోయే మిలియనీర్ల సంఖ్య తగ్గడం శుభవార్తే! 2022లో దేశం నుంచి మిలియన్ డాలర్ల సంపన్నులు 7,500 మంది విదేశాలకు తరలిపోయారు. కాని, ఇలా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి బయటకు పోతున్న సంపన్నులను ఆకట్టుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా 2023లో ఇలాంటి ధనికుల సంఖ్య 6,500కు తగ్గుతుందని అంచనా. ఇలాంటి పెట్టుబడి వలసలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసే లండన్ కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ విడుదల చేసిన వివరాలు పై విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇండియా వదిలిపోవాలనుకునే భారత సంపన్నుల్లో ఎక్కువ మంది ఇష్టపడే దేశం ఆస్ట్రేలియా. తర్వాత స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటైన దుబాయి. ఇప్పటికే దుబాయి మాదిరిగానే భారత సంతతి ప్రజలున్న సింగపూర్ పోయి స్థిరపడానికి కూడా కొందరు భారతీయులు ఉత్సాహపడుతున్నారని హెన్లీ అండ్ పార్టనర్స్ సర్వే చెబుతోంది. ఆస్ట్రేలియాలో 2023లో పెట్టుబడులతో వచ్చి స్థిరపడే విదేశీయులు గరిష్ఠంగా 5,200 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. డాలర్ మిలియనీర్ల వలసల్లో చైనాదే ప్రథమ స్థానం! 20వ శతాబ్దంలో 1978 నుంచీ ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన చైనా, 1991 నుంచీ పేదరికం నిర్మూలించి, సంపద సృష్టించడానికి కొత్త మార్గంలో ప్రయాణం మొదలెట్టిన ఇండియాలో కొత్త ఐడియాలతో, వినూత్న పరిశ్రమతో కొత్త డాలర్ మిలియనీర్లు ఏటా గణనీయ సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ సైజులో పెద్దదైన చైనా ఇలాంటి వలసల విషయంలో కూడా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. 2023లో చైనా నుంచి 13,500 మంది కోటీశ్వరులు ఇతర దేశాలకు వలసపోతారని భావిస్తున్నారు. 2022లో ఈ సంపన్నుల సంఖ్య 10,800 మాత్రమే. అంటే ఏటా చైనా నుంచి బయటకు పోయే కొత్త ధనికుల (పది లక్షల అమెరికన్ డాలర్లకు మించిన సంపద ఉన్న హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతుండగా ఇండియాలో వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తి ఇంగ్లండ్ నుంచి కూడా డాలర్ మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారట. ఇంకా ఈ తరహా దేశాల్లో రష్యా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి సంపన్నుల విదేశీ వలసల విషయంలో శుభపరిణామం ఏమంటే–ఇండియాలో మెరుగవుతున్న ఆర్థిక,సామాజిక పరిస్థితులను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది భారతీయులు విదేశాల నుంచి వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడుతున్నారు. వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, అవకాశాల స్వర్గంగా భావించే అమెరికా నుంచి కూడా మిలియనీర్లు ఇతర దేశాలకు వలసపోవడం సాధారణ విషయంగా నేడు మారిపోయింది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. -
ఆర్థిక అసమానతల తగ్గింపు కన్నా పేదరిక నిర్మూలనకే ప్రాధాన్యం
ప్రపంచంలో ఇంకా సూటిగా చెప్పాలంటే భారతదేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతున్న నేపథ్యంలో అదే సమయంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ఇప్పుడు చర్చ కేంద్రీకృతమౌతోంది. దేశంలో దారిద్య్రం మాయమౌతున్న క్రమంలో ప్రజల్లో ఆర్థిక వ్యత్యాసాలు వృద్ధి చెందడం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుందని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కిందటి దశాబ్దంలో (2011–2021) ఇండియాలో వరుసగా 2014, 2015లో అనావృష్టి పీడించింది. 2020 - 22 మధ్య కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఫలితంగా పేదరిక నిర్మూలక లక్ష్యం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. సదుద్దేశంతో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) దశాబ్దం చివర్లో ఆర్థిక వ్యవస్థను కొంత ఇబ్బంది పెట్టినా తర్వాత ఆర్థికరంగం తిరిగి ప్రగతిపథంలో పయనించింది. ఇప్పుడు పారిశ్రామిక దేశాల్లో మాదిరిగానే ఇండియాలో కూడా ఆర్థిక అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయనే మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. గత మూడు దశాబ్దాల్లో ఆర్థిక ప్రపంచీకరణ వల్ల అత్యధిక దేశాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. పూర్వం వర్ధమాన దేశంగా ముద్రపడిన ఇండియాలో దారిద్య్రం మున్నెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అంతరించింది. కాని, కొవిడ్ మహమ్మారి ఫలితంగా ప్రపంచంలో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ప్రపంచ ఆర్థిక అసమానత నివేదిక–2022 వెల్లడించింది. 1990ల మధ్య నుంచీ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఒక శాతం జనాభా ప్రపంచంలో 38 శాతం సంపదను తమ చేతుల్లోకి తెచ్చుకోగలిగారు. 2020 తర్వాత ఇదే ధోరణి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పేదరిక నిర్మూలనే మొదటి లక్ష్యం కావాలి, అసమానతలు తర్వాత రూపుమాపవచ్చు! అయితే, ఆర్థిక అసమానతలు రూపుమాపడం కన్నా ఇండియాకు పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఉండాలని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరవింద్ పనగఢియా ఇటీవల ఓ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అసలు ఆర్థిక అసమానతలు ప్రతి దేశంలో ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే నేను ఎక్కువగా పట్టించుకునేది అక్కడ ఇంకా పూర్తిగా తొలగిపోని పేదరికం. నా లెక్క ప్రకారం దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు ఆందోళన కలిగించే స్థాయిలో కనపడడం లేదు. వాస్తవానికి 2021 - 22 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (ఏటా చేసే శ్రామికశక్తులపై అధ్యయనం) చూస్తే భారత్‌లో అసమానతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమవ్వడం వల్ల ఆర్థిక సంక్షోభాల ప్రభావం ఆ కాలంలో రవాణా, నిర్మాణ రంగాలపై పడింది. దీంతో ధనికవర్గంపై ఇది ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్థిక వ్యత్యాసాలు దీని వల్ల కొద్దిగా తగ్గాయి,’ అని పనగఢియా ఈ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మొదట దారిద్య్రం బాగా తగ్గిపోయి పూర్వపు పేదల ఆదాయాలు పెరిగితే, ఆర్థిక అసమానతలను తర్వాత రూపుమాపడం కష్టమేమీ కాదనేది అత్యధిక ఆర్థికవేత్తల అభిప్రాయంగా కనిపిస్తోంది. అదీగాక, ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా ఆసియా ఖండం మారుతున్న నేపథ్యంలో భారతదేశానికి అనేక ఆర్థిక అవకాశాలు చేతికందుతున్నాయి. తయారీ, సేవల రంగంలో ఇండియాలో ఉత్పత్తి, ఎగుమతులు పెంచడానికి కొత్త పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. (ఇదీ చదవండి: బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటి?) దేశంలో సంపద సృష్టించే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా పేదరికం మరింత తగ్గించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వాలు, ఆర్థికవేత్తలు–ఆర్థిక అసమానతలపై కన్నా దారిద్య్ర నిర్మూలనపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన లక్ష్యాన్ని సాధించవచ్చు. పేదరికం లేని నవభారతాన్ని నిర్మించవచ్చు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటి?
‘అంతర్జాతీయ డబ్బు సంబంధిత వ్యవహారాల్లో నిన్న మొన్నటి వరకూ తిరుగులేని రాజైన అమెరికా డాలర్ నెమ్మదిగా తన పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. 2022 మార్చి నాటికి ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా దాదాపు 58 శాతానికి పడిపోయింది. ఇది 1994 నుంచీ అత్యంత కనిష్ఠం. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్ (కేంద్రీయ) బ్యాంకులు పాత ఆనవాయితీకి విరుద్ధంగా డాలర్లకు బదులు తమ బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. ఒక్క 2022 సంవత్సరంలోనే ఈ సెంట్రల్ బ్యాంకులు తమ ఖజానాలకు అదనంగా 1126 టన్నుల బంగారాన్ని కొని తరలించాయి. 1950 తర్వాత ఇంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకన్నా మరో ఆశ్చర్యకర విషయం ఏమంటే, అనేక దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను తమ సొంత లేదా థర్డ్ పార్టీ కరెన్సీలతో నిర్వహించుకుంటున్నాయి,’ ఈ తరహా వార్తలు గడచిన మూడు నాలుగు నెలలుగా మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మారకం కరెన్సీగా డాలర్ భవితవ్యంపై అమెరికా కాని, ఇతర ధనిక, పారిశ్రామిక దేశాలు గాని ఎక్కువగా దిగులు పడడంలేదు. అమెరికా 21వ శతాబ్దంలో తనకు అవసరమైనప్పుడల్లా తన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు పెంచడానికి ఎడాపెడా తన కరెన్సీని ప్రింట్ చేసి విడుదల చేస్తోందనీ, దీని వల్ల ఇతర ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా వర్ధమాన దేశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోందనేది కొందరు అంతర్జాతీయ నిపుణులు, కొన్ని పారిశ్రామిక దేశాల ఆరోపణ. అత్యవసర పరిస్థితుల్లో ఏ దేశమైనా తన సొంత కరెన్సీని తాత్కాలికంగా పరిమితికి మించి ప్రింట్ చేయడం తప్పేమీ కాదనే సిద్ధాంతం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఎప్పటిలాగానే అంతర్జాతీయ ఆర్థిక వ్యవహరాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ కథ 1944లో మొదలైంది ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత పాత మారకపు కరెన్సీ అయిన బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ స్థానంలో అమెరికా డాలర్ ఎలా వచ్చిందీ ఓసారి గుర్తుచేసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో అమెరికాలో బ్రెటన్ వుడ్స్లో జరిగిన అనేక దేశాల అంతర్జాతీయ సమావేశం నిర్ణయాల ఫలితంగా బ్రిటిష్ పౌండు స్థానంలో అమెరికా డాలర్ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా వేగంగా అవతరించింది. ఈ యుద్ధంలో ఇంగ్లండ్ సహా అనేక ఐరోపా దేశాలు ఆర్థికంగా దివాలా స్థితికి రావడంతో డాలర్ ప్రపంచ వాణిజ్య యవనికపై దర్శనమిచ్చి అప్పటి నుంచి అలా నిలిచిపోయింది. మధ్యలో కొన్నిసార్లు అమెరికా ఆర్థిక ఇబ్బందుల వల్ల డాలర్ బలహీనపడిన మాట నిజమే గాని ప్రతిసారీ అది పుంజుకుని తన పూర్వ స్థానం నిలబెట్టుకుంటూనే ఉంది. మరో ముఖ్య విషయం ఏమంటే.. బంగారానికి (ఈ లోహానికి ఉన్న అనేక సుగుణాల వల్ల) ప్రపంచవ్యాప్తంగా ప్రాచీనకాలం నుంచీ విలువ ఉంది. కాలంతో పాటు మనుషులకు ఈ లోహంపై మోజు మరీ పెరిగిపోతోంది. డాలర్ మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం కొనుగోలు ధర పెరుగుతుంది. ఈ కారణంగా ప్రపంచంలో బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరిగినప్పుడల్లా డాలర్ పని ఇక అయిపోయిందనే మాటలు, పుకార్లు వినిపిస్తాయి. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఈ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, మారకద్రవ్యంగా డాలర్‌కు ఉన్న ప్రాధాన్యానికి ఎదురయ్యే సవాళ్లు కొన్ని మాసాలకు మాత్రమే పరిమితమని గడచిన దాదాపు 75 ఏళ్ల చరిత్ర చెబుతోంది. ప్రసిద్ధ ఆర్థికవేత్తలు సైతం ఇప్పట్లో అమెరికా డాలర్ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా తన హోదాను కోల్పోయే ప్రమాదమేమీ లేదని గట్టిగా వాదిస్తున్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరగడానికి, దాని ధర కూడా పైకి ఎగబాకడానికి అవకాశాలున్నాయి గాని అమెరికా డాలర్ పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (రూపాయి సింబల్ ₹, డాలర్ $, పౌండ్ £...వీటి వెనుక కథ ఏమిటంటే...) -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
గోధుమల ఎగుమతుల బ్యాన్: ఫుడ్ ఎమర్జెన్సీ నుంచి ఇండియా ఎలా బైటపడిందో తెలుసా?
దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కిందటేడాది గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. ఇంకా, బియ్యం ఎగుమతులపై షరతులతో కూడిన ఆంక్షలు అమలుచేస్తోంది. 2022 సెప్టెంబరులో బియ్యం నూకల ఎగుమతి పూర్తి నిషేధంతో పాటు కేంద్ర సర్కారు ఇతర రకాల తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను విధించింది. గత సంవత్సరం వరి పండించే రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా దేశంలో బియ్యం ధరలు పెరగకుండా నిరోధించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని మొన్న ఫిబ్రవరిలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 2023–2024 సంవత్సరంలో దేశంలో గోధుమల ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ ధాన్యం, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది మార్కెటింగ్ సీజన్ గడిచే వరకూ ఇండియా తొలగించకపోవచ్చని కూడా అమెరికా వ్యవసాయ శాఖలోని విదేశీ వ్యవసాయ సేవల విభాగం అంచనా వేసింది. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దేశం అయిన ఇండియా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారధాన్యాల తీవ్ర కొరత ఎదుర్కొన్న దేశం ఇండియా. అలాంటిది ఈ 75 ఏళ్లలో గోధుమలు, వరి బియ్యం తదితర ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచగలగడమేగాక వరి, గోధుమలను పెద్ద మొత్తాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి నేడు చేరుకోవడం దేశం సాధించిన గొప్ప విజయం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ ప్రజలకు సరఫరా చేయాల్సిన ఆహారధాన్యాలను బ్రిటిష్ సేనల కోసం నాటి ఇంగ్లండ్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఆదేశాల ప్రకారం తరలించడంతో 1943లో బెంగాల్ లో కరువు వచ్చి లక్షలాది జనం మరణించారు. దేశ విభజనతో ఇండియాలో ఆహారధాన్యాల కొరత తీవ్రం 1947 ఆగస్టులో జరిగిన దేశవిభజనతో భారతదేశంలో తిండిగింజల కొరత తీవ్రమైంది. వరి విపరీతంగా పండే తూర్పు బెంగాల్ (నేటి బంగ్లాదేశ్), గోధుమల సాగు విస్తారంగా జరుగుతూ, భారీ దిగుబడులకు పేరుగాంచిన పశ్చిమ పంజాబ్ ప్రాంతాలు పాకిస్తాన్ లో అంతర్భాగం కావడం వల్ల భారత్ లో ఆహారధాన్యాల కొరత కనీవినీ రీతిలో పెరిగింది. అంతకు ముందు 1937లో ఇండియా నుంచి బర్మాను విడదీసి బ్రిటిష్ వారు దానికి స్వాతంత్య్రం ఇవ్వడంతో దేశంలో పప్పుధాన్యాల కొరత వచ్చింది. ఈ సమస్య నెమ్మది మీద పరిష్కారమైంది. స్వతంత్ర భారతంలో తొలి ప్రధాని పండిత నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దేశంలో ఆహారధాన్యాల సాగును అభివృద్ధిచేసే కన్నా తిండి గింజలను దిగుమతి చేసుకోవడమే తక్కువ ఖర్చుతో కూడిన పని అని భావించాయి. మొదటి పదేళ్ల కాలంలో పరిశ్రమల స్థాపనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇవ్వాలని 1959లో ఢిల్లీ వచ్చిన అమెరికా వ్యవసాయ నిపుణుల బృందం నెహ్రూ సర్కారుకు సలహా ఇచ్చింది. ఆహారధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినాగాని నెహ్రూ కాలం నుంచి 1970 వరకూ ఇండియాలో తిండి గింజల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగింది. 1964-1969 మధ్యకాలంలో అంటే శాస్త్రి, ఇందిరాగాంధీ పాలనలో అమెరికా నుంచి ఇండియాకు పీఎల్-480 అనే పథకం కింద నాసిరకం గోధుమలు ఉచితంగా, రాయితీ ధరలపై సరఫరా అయ్యేవి. అయితే, తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి సి.సుబ్రమణ్యం చొరవతో రూపొందించి, ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలు–హరిత విప్లవం పేరుతో తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు ఇచ్చాయి. అధిక దిగుబడినిచ్చే గోధుమ (మెక్సికో రకం), వరి వంగడాలు విస్తారంగా రైతులకు అందుబాటులోకి రావడం దేశంలో తిండిగింజల ఉత్పత్తి బాగా పెరిగింది. దాంతో అమెరికా నుంచి ఆహారధాన్యాల సాయానికి భారత్ స్వస్తి పలికింది. పంజాబ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రీన్ రివల్యూషన్ పద్ధతులు సత్ఫలితాలనిచ్చాయి. దీంతో, 1968 రబీ సీజన్ లో దేశంలో అంతకు ముందు అత్యధికంగా పండిన పంట కన్నా 30 శాతం ఎక్కువ ఆహారధాన్యాల దిగుబడి సాధించాం. మధ్యలో అనావృష్టి పరిస్థితులు ఎదురైనా..ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో తిండి గింజలు ఎగుమతి చేసే దేశంగా ఇండియా ప్రపంచంలో పేరు సంపాదించుకుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
2030 నాటికి పేదరిక నిర్మూలన సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్ : భారతదేశంలో పేదరికం గత 32 ఏళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. 1991 వేసవిలో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశంలో సంపద సృష్టికి మాత్రమేగాక దారిద్య్ర నిర్మూలనకు దారితీశాయి. ఇండియాలో 2005-2006 సంవత్సరం 2019-2021 ఏడాది మధ్య దాదాపు 41 కోట్ల 50 లక్షల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంకా ఈ కాలంలో దారిద్య్రం 55శాతం నుంచి కేవలం 16 శాతానికి తగ్గిపోయిందని కూడా గ్లోబల్ బహువిధ దారిద్య్ర సూచిక-2022 (ఎంపీఐ) గత అక్టోబర్‌లో వెల్లడించింది. పేదరికాన్ని ఇలా తగ్గించగలిగినా ప్రపంచంలో అత్యధిక పేద ప్రజలు 2020లో (22 కోట్ల 89 లక్షలు) ఇండియాలోనే ఉన్నారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ), ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ దారిద్య్రం, మానవాభివృద్ధి ఇనిషియేటివ్ (ఓఫీ) విడుదల చేపిన ఈ ఎంపీఐ నివేదిక తెలిపింది. పై గణాంక వివరాల్లో కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఎంత ఉందో చెప్పకపోయినప్పటికీ మొత్తంమీద కొవిడ్ రాక ముందున్న 15 ఏళ్లలో ఇండియాలో పేదరికం గణనీయంగా తగ్గిపోవడం ఓ వాస్తవం. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేదల సంఖ్యను సగానికి తగ్గించాలని 2010లో సమావేశమైన యూఎన్డీపీ, ఓఫీ ప్రతినిధులు నిర్ణయించారు. పదిహేనేళ్లలో దాదాపు 42 కోట్ల మంది దారిద్య్రం నుంచి విముక్తి పొందినా...ఇంకా ఇండియాలో ఇంకా దాదాపు 30 కోట్ల మంది పేదలు ఉంటారని అంచనా. వారిలో 90శాతం (20.5 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రోజుకు సగటున 1.9 డాలర్ల ఆదాయంతో ఆరోగ్యంగా జీవించే వ్యక్తిని దారిద్య్రం నుంచి బయటపడిన మనిషిగా పరిగణిస్తారు. కేవలం ఆర్థిక పరిస్థితి మాత్రమేగాక చదువు, ఆరోగ్యం వంటి అంశాలను కూడా కలిపి ప్రజలు పేదలా, కాదా అని నిర్ధారించే పద్ధతి ఇప్పుడు అమలులోకి వచ్చింది. తూర్పు రాష్ట్రాల్లో పేదరికం నిర్మూలించడమే ప్రధాన లక్ష్యం కావాలట దేశంలోని తూర్పు ప్రాంతం వైరుధ్యాల పుట్ట. అత్యంత సంపన్న ప్రకృతి వనరులున్న ఈ తూర్పు రాష్ట్రాల్లో ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన లోహాలు, ఖనిజాలు అందించే గనులు ఇతర వనరులున్న ఈ ప్రాంతం ప్రగతిపథంలో నడవాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం చొరవ, ప్రోత్సాహకాలు సరిపోవు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు లేదా దారిద్య్రం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించడానికి రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇక్కడ తూర్పు ప్రాంతం అంటే..బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు. అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు, గనులు ఉన్న ఈ రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసపోతున్నారు. సహజ వనురులున్న సొంత రాష్ట్రాల్లో పనులు లేక ఇతర రాష్ట్రాలకు పోయి ప్రమాదకర ఉద్యోగాలు సైతం వారు చేస్తున్నారు. నీతి ఆయోగ్ బహువిధ పేదరిక సూచిక (ఎంపీఐ) ప్రకారం బిహార్ లో 51.91శాతం, ఝార్ఖండ్ లో 42.16శాతం ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారు. ఈ ఐదు తూర్పు రాష్ట్రాల్లోని సహజ వనరుల ఆధారంగా అక్కడ పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయంలో గణనీయ స్థాయిలో దిగుబడులు సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అత్యంత విలువైన గనులున్న ఝార్ఖండ్, అటవీ ప్రాంతాలున్న ఛత్తీస్ గఢ్, గతంలో పారిశ్రామికంగా ఓ వెలుగు వెలిగిన పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో పేదరికం పూర్తిగా నిర్మూలించి అభివృద్ధి మార్గంలో నడిపించడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధిక దారిద్య్రాన్ని తొలగించే చర్యలు, ఆర్థిక అభివృద్ధికి రూపొందించే పథకాలు ఏకకాలంలో అమలు చేస్తే తూర్పు ప్రాంతం దేశ ప్రగతికి కీలకపాత్ర దోహదం చేస్తుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక
ప్రపంచ దేశాలు అనేక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో వాటికి దిశానిర్దేశం చేసే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ అజయ్ బంగా ఎన్నికవడం ఇండియాకు గర్వకారణం. ఇండియాలోని పుణె ఖడ్కీ కంటోన్మెంటులో పంజాబీ సిక్కు సైనికాధికారి కుటుంబంలో జన్మించిన 63 ఏళ్ల అజయ్ పాల్ సింగ్ బంగా తర్వాత దేశంలోని అనేక నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో కూడా చదివిన బంగా కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా పౌరుడయ్యారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి స్థాపించిన ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్ష పదవికి కేవలం అమెరికన్లకు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వడం, ఈ బ్యాంక్ జోడు సంస్థ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సారధి పదవిని ఐరోపా దేశీయుడికే ఇవ్వడం ఆనవాయితీ. సాధారణంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. అయితే, ఈసారి 24 మంది బోర్డు సభ్యులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా బంగా ఎన్నిక బుధవారం నిర్వహించారు. బోర్డులో సభ్యత్వం ఉన్న రష్యా ప్రతినిధి ఈ ఎన్నిక ఓటింగులో పాల్గొనలేదు. భారతదేశంలో పుట్టినాగాని కొన్నేళ్లు దేశంలో పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడ పెప్సికో, మాస్టర్ కార్డ్ వంటి దిగ్గజ కంపెనీల్లో బంగా పనిచేశారు. అలా ఆయన అమెరికా పౌరుడు కావడంతో ప్రపంచ బ్యాంక్ సారధిగా ఎన్నికవడం వీలైంది. జూన్ 2 నుంచి ఐదేళ్లు పదవిలో జూన్ 2న కొత్త పదవి స్వీకరించే బంగాను ఈ పదవికి బుధవారం ఎన్నుకునే ముందు సోమవారం ప్రపంచ బ్యాంక్ బోర్డు సభ్యులు నాలుగు గంటలపాటు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ అత్యున్నత పదవికి బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరి నెలాఖరులో ప్రతిపాదన రూపంలో నామినేట్ చేశారు. ఆయన నామినేషన్ ను బ్యాంకు బోర్డు ఖరారు చేయడం భారతీయ అమెరికన్లతో పాటు భారతీయులకు గర్వకారణంగా భావిస్తున్నారు. గత పాతికేళ్లలో పలువురు భారతీయ అమెరికన్లు అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, సంస్థల అధిపతులుగా నియమితులై, విజయవంతంగా వాటిని నడుపుతూ మంచి పేరు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ జూన్ ఒకటి వరకూ పదవిలో ఉంటారు. ఆయన గతంలో అమెరికా ఆర్థికశాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేసిన గొప్ప ఆర్థికవేత్త. మాల్పాస్ మాదిరిగానే బంగా కూడా ఐదేళ్లు బ్యాంక్ ప్రెసిడెంట్ గా పదవిలో జూన్ 2 నుంచి కొనసాగుతారు. 1944 నుంచి ఇప్పటి వరకూ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవిని 13 మంది అమెరికన్లు నిర్వహించారు. బాంగాకు ముందు ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో పుట్టిన జిమ్ యాంగ్ కిమ్ (2012–2019) కూడా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు. బంగా మాదిరిగానే 1959లో జన్మించిన యాంగ్ ఐదేళ్ల వయసులో తన కుటుంబంతో పాటు అమెరికా వలసపోయి స్థిరపడి అమెరికా పౌరుడయ్యారు. గతంలో ఈ బ్యాంక్ అధ్యక్షులుగా పనిచేసిన ఆర్థికరంగ నిపుణుల్లో యూజీన్ ఆర్ బ్లాక్ (1949–1962), రాబర్ట్ ఎస్ మెక్ నమారా (1968–1981)లు 12 ఏళ్లు దాటి పదవిలో ఉండడం విశేషం. మెక్ నమారా కాలంలోనే ఈ అంతర్జాతీయ బ్యాంక్ తన కార్యకపాలు విస్తరించింది. బ్యాంకు సిబ్బందితోపాటు అనేక దేశాలకు రుణాలు ఇవ్వడం పెంచింది. పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టింది. మెక్ నమారా ఈ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడానికి ముందు అమెరికా రక్షణ మంత్రిగా పనిచేశారు. మొదటిసారి ఒక భారతీయ అమెరికన్ ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టడం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికం తగ్గించి, సంపద విస్తరించడానికి కృషి చేసే అత్యంత ముఖ్యమైన సంస్థల్లో ఒకటైన ప్రపంచబ్యాంక్ సారధిగా బంగా అత్యధిక సభ్యుల ఆమోదంతో ఎన్నికవడం హర్షణీయమని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అభినందించడం భారతీయ అమెరికన్ల సమర్ధతకు అద్దంపడుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
ఏపీకీ ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ పరిస్థితి ఏమిటి? అంటూ రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రాష్ట్రాలతో కేంద్రం పంచుకునే పన్నుల రాబడి సమాంతరంగా జరగాలన్న ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే గతంలో పన్నుల పంపిణీలో 32 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 2015-2020 కాలానికి 42 శాతానికి పెంచినట్లు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం సైతం 2020-2026 కాలానికి ఈ పంపిణీ నిష్పత్తిలో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్తగా జమ్ము కశ్మీర్ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును పూడ్చడం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 90:10 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం భరించడం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిలో ఒక అంశం. 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో విదేశీ ఆర్థిక సంస్థల రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌ల వ్యయాన్ని వడ్డీతో సహా కేంద్రమే చెల్లించడం ప్యాకేజీలో ప్రధాన అంశమని చెప్పారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత సానువులను ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము, కశ్మీర్ రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాల వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తాయని మిగిలిన రాష్ట్రాలలో ఈ నిష్పత్తి 60:40గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని -
దేశ జీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం.. స్పందించిన కేంద్రం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2013-14లో రూ. 89,796 రూపాయలుగా ఉన్న భారతదేశ జీడీపీ తలసరి 2021-22 నాటికి రూ.1,72,913 రూపాయలకు పెరిగిందని ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. దేశ జాతీయ ఆదాయంలో టాప్ 1 శాతం కలిగిన ధనికులు 40 శాతం, టాప్ 10 శాతం కలిగిన ధనికులు 57 శాతం ఉంటే, దిగువనున్న 57 శాతం మంది ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారన్న వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్-2022 గణాంకాలు వాస్తవమేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్టు -2022 నివేదిక సందేహాస్పదంగా ఉండడంతో దానిని పరిగణలోకి తీసుకోలేమని అన్నారు. ఆ నివేదిక ఆధారంగా కోరిన వివరాలపై వ్యాఖ్యానించలేమని తెలిపారు. దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, వీక్షిత్ భారత్ ఉద్దేశాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌పై జీడీపీతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఎంపీ విజయ సాయి రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏపీలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా? ఢిఫెన్స్ కారిడార్లకు సేవలందించే విధంగా ఎన్సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ అందించనున్నారా? డిఫెన్స్ కారిడార్లలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా చేపట్టనున్నారా? ఉంటే వాటికి సంబంధించిన వివరాలు తెలపాలని అన్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఎన్సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు. యువతలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివేకం, జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి తద్వారా వారు సమాజానికి నిస్వార్ధమైన సేవలు అందించడంతో పాటు, రక్షణ దళాల వైపు మొగ్గు చూపే లక్ష్యంతోనే ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. -
ఈ నెల 12 న ప్రధాని మోదీ విశాఖ పర్యటన
-
రైల్వే జోన్ పై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు మానుకోవాలి
-
ధరలను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది
-
రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి ప్రమాణస్వీకారం
-
25న సీబీఐటీలో వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళా
చాపాడు(వైఎస్సార్ జిల్లా): చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో 25న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సీబీఐటీలో శుక్రవారం మీడియాతో మాట్లాడి, జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్సైట్ ((WWW.YSRCPJOBMELA.COM))ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. చదవండి: ఊపందుకుంటున్న ‘ఊళ్లు’ ఇప్పటికే తిరుపతి, వైజాగ్, గుంటూరులో జాబ్ మేళాల ద్వారా 40,243 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు పొత్తులు ఉన్నా లేకున్నా తమ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని, సుపరిపాలన అందించే తమ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 స్థానాల్లో గెలిపిస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రజలకు ఉపయోగకరంగా ఏదీ ఆలోచించరని, అది వారికి పుట్టుకతో వచ్చిందని, ప్రతి దాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తారని విజయసాయిరెడ్డి విమర్శించారు. -
‘వంచన, వెన్నుపోటుకు పుట్టిన బిడ్డే ఉన్మాది చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఉన్మాది చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చదవండి: మామను చంపిన ‘బాబు’ ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు ఎందుకు పగ సాధిస్తున్నారు. ‘‘కిక్ బాబు-సేవ్ ఏపీ’’ నినాదంతో వైఎస్సార్సీపీ ముందుకు వెళ్తోంది. ఎంతో ఉన్నతాశయంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. నారా అంటే నాసి రకం రాజకీయ నాయకుడు. చంద్రబాబును తరిమికొడితేనే ఏపీకి మంచి రోజులు. 14 సంవత్సరాల్లో చంద్రబాబు ఏం సాధించారు? ఒక్క ప్రాజెక్టునైనా ఆయన పూర్తి చేశారా? అని’’ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. -
AP: జాబ్ మేళాకు జేజేలు
సాక్షి నెట్వర్క్: మేథో సంపత్తిలోనూ, కష్టపడి పనిచేయటంలోనూ తెలుగు యువతకు ఎవరూ సాటిరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో పది లక్షల మందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మనదేశంలో 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నింటిలో 50 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులే ఉన్నారు. అలాగే బెంగళూరులో 25 శాతం, చెన్నైలో 15 శాతం ఉద్యోగులు ఈ రాష్ట్రానికి చెందిన వారే. అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేసిన గత పాలకుల నిర్ణయాల ఫలితం.. విభజనాంధ్రప్రదేశ్లో యువతకు శాపంగా మారింది. ఒకప్పుడు లోకల్ స్టేటస్‌ను అనుభవించిన మన విద్యార్థులు ఇప్పుడు అక్కడ నాన్ లోకల్‌గా మారిపోయారు. అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే అవకాశాలు కల్పించింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ శకానికి శ్రీకారం చుట్టింది. చదువు ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ‘కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తాం..’ అంటూ అన్ని రంగాల్లో అందరికీ అవకాశాలు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించి ఒకేసారి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందిస్తూనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలు నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. పరిశ్రమలు లేకపోయినా, శ్రమించే యువత ఉండటం మనకు కలిసి వచ్చిన అదృష్టం. ఏప్రిల్ 16, 17 తేదీల్లో తిరుపతిలో, 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో.. ఈ నెల 7, 8 తేదీల్లో గుంటూరులోని ఏఎన్‌యూలో నిర్వహించిన జాబ్ మేళాల్లో 34,173 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు ఆఫర్ లెటర్లు అందించాయి. మరో రెండువేల మంది ఫైనల్ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యారు. తిరుపతిలో శ్రీకారం రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 16, 17 తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. పార్టీ వెబ్సైట్లో సుమారు 47 వేల మందికి పైగా నిరుద్యోగులు పేర్లను నమోదు చేసుకున్నారు. 143 జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ కేటగిరీల్లో ఉద్యోగాలకు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. టెన్త్ నుంచి ఎంటెక్ వరకూ.. రెండు రోజుల పాటు నిర్వహించిన ఎంపికల్లో మొత్తం 8,256 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్హత కలిగిన 4,139 మంది.. డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన 2,041 మంది.. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన 1,358 మంది యువతీ యువకులు ఉద్యోగాలు సాధించారు. మరో 718 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అభ్యర్థులకు కనిష్ట వేతనం రూ.13 వేలు కాగా గరిష్టంగా రూ.77 వేలు వేతనం లభించనుంది. సాగర తీరాన... విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 23, 24 తేదీల్లో జాబ్ మేళా నిర్వహించారు. 208 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. తొలిరోజు 13,663 మంది, రెండో రోజు 8,554 మంది చొప్పున మొత్తంమీద 22,217 మంది యువతీ యువకులు ఉద్యోగాలు సాధించారు. మొదటి రోజు జాబ్‌మేళాలో రూ.12, రూ.10 లక్షల వార్షిక వేతనాలతో ఇద్దరు, రెండోరోజు రూ.12.5 లక్షల వేతనంతో ఒకరు, రూ.12 లక్షల వేతనంతో ఇద్దరు ఉద్యోగాలు సాధించటం విశేషం. మేళాలో పాల్గొన్న ఒమిక్స్ కంపెనీ ఈ మేరకు అత్యధిక వేతనం ఆఫర్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంది. టెన్త్ విద్యార్హతలతోనే రూ.10 వేల వేతనంతో ఫ్లిప్‌కార్ట్ నియామకాలు చేసుకొంది. ఏఎన్‌యూలో... గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాబ్‌మేళాకు 14,500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 3,700 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. మరో రెండు వేల మంది ఫైనల్ సెలెక్షన్స్‌కు ఎంపికయ్యారు. నెలకు రూ.14 వేల నుంచి ఏడాదికి రూ.11 లక్షల వరకు ప్యాకేజీలు లభించాయి. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వెబ్ ప్రాసెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దక్కారో టీ హబ్, డీమార్ట్, మ్యాక్స్, ఫ్లిప్‌కార్ట్‌లతో కలిసి 42 మంది దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అందరికీ ఆఫర్ లెటర్స్ అందించారు. త్వరలో కడపలో.. కడపలో త్వరలో జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేదీలు ఖరారు కావాల్సి ఉంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఆదేశాల మేరకే ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. చదువుకుని అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు అండగా ఉండాలన్న సీఎం ఆశయ సాధనలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. సుమారుగా 15,000 ఉద్యోగాలు వరకూ కల్పించాలని తలపెట్టిన కార్యక్రమం అనుకున్న అంచనాలను మించి తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులలో కలిపి 35,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించాం. ఇది ఆరంభం మాత్రమే. ప్రతిఏటా జాబ్ మేళా ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించనున్నాం. నిరుద్యోగ సమస్య తీరేవరకూ మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తూ వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువతకు అండగా ఉంటుంది. – వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దేశ చరిత్రలోనే అద్వితీయం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల్లోనే ప్రభుత్వంలో 6,03,756 పైచిలుకు ఉద్యోగాలు కల్పించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రయివేటు రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు వీలైనంత మేరకు ఉద్యోగ కల్పన చేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టింది. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఇదే మొదటిసారి అనడంలో అతిశయోక్తి లేదు. నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేసిన ఠీఠీఠీ. yటటఛిp్జౌbఝ్ఛ ్చ.ఛిౌఝకి చాలా మంచి రెస్పా¯Œన్స్ వచ్చింది. విద్యార్థులు ఖీజ్చిnజు ్గౌu ఇM జీట అంటూ జేజేలు పలుకుతుంటే ఈ కరోనా పాండమిక్‌లో కల్పించిన ఉద్యోగాలకు వారి ఆనందానికి అవధుల్లేవు. – గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి -
పామాయిల్ సాగు ప్రోత్సాహానికి రూ.11 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పామాయిల్ సాగు ప్రోత్సాహం కోసం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ఎంఈవో) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంటనూనెల దిగుమతి వల్ల పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ఎంఈవో బృహత్తర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చు తగ్గుల నుంచి పామాయిల్ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. ఏపీలో 40 ఎఫ్‌సీఐ వేర్‌హౌస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్సీఐకు చెందిన సొంత, అద్దె గోదాములు 40 ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న వేర్‌హౌస్‌లు సెంట్రల్‌పూల్ స్టాక్‌కు సరిపోతాయని చెప్పారు. ఏపీ ప్రతిపాదనలకు అనుమతి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై)లో ఏపీ పంపిన ప్రతిపాదనలను అనుమతించామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రూ.657.11 కోట్ల పనులకు అనుమతించి ఇప్పటివరకు రూ.108.95 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, ఓడరేవుల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు ఫిష్ రిటైల్ హబ్ తదితర పనులకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పీపీపీ పద్ధతిలో ఎంవీయూలు పశువుల సంరక్షణ నిమిత్తం సేవలు నేరుగా రైతుల ఇంటివద్దే అందించేలా మొబైల్ వెటర్నరీ యూనిట్లను (ఎంవీయూలను) పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో తీసుకొచ్చినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలను, ఏజెన్సీలు (కోఆపరేటివ్, మిల్క్ యూనియన్లు) మానవ వనరులను ఏర్పాటు చేస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లబ్ధిదారుల్ని పెంచాలని ఏపీ కోరింది జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)లో లబ్ధిదారుల సంఖ్యను గ్రామీణ ప్రాంతంలో 75, పట్టణ ప్రాంతంలో 50 శాతానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2011 జనాభా లెక్కలననుసరించి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41.14 శాతం లబ్ధిదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. -
8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
-
కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: రైతులకు కనీసమద్దతు ధర కల్పించే విషయంలో సంబంధిత భాగస్వాములతో చర్చించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు సాగుచట్టాలను రద్దుచేయాడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో.. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయన్నారు. కనీస మద్దతు ధర కల్పించాలనే అంశం మరోసారి చర్చకు వచ్చిందన్నారు. కాగా, తమ ప్రభుత్వం ఏపీ రైతులకు కనీస మద్దతుధర ఆచరించి చూపిందని తెలిపారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తే.. తమ ప్రభుత్వం మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్పీ ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఏపీలో 47 పంటలు కనీస మద్దతుధర పరిధిలోకి వచ్చాయని పేర్కొన్నారు. దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే అత్యధిక పంటలకు ఎంఎస్పీ ప్రకటించిన రాష్ట్రం ఏపీ అని విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలో కూడా అత్యధిక పంటలకు ఎంఎస్పీ ఉండేలా చట్టబద్ధమైన హామీ కల్పించాల్సిన అవసరముందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలో ఆటంకంగా ఉన్న అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్లో చట్టం చేయడానికి ఈ సంప్రదింపులు ఎంతగానే ఉపయోగపడతాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటుచేసి, కనీస మద్దతు ధరపై ముడిపడిన వివిధ సమస్యలపై సంబంధిత భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
డ్యాం సేఫ్టీ బిల్లు అత్యంత అవసరం: ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి డ్యాం సేఫ్టీ బిల్లుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించడానికి తీవ్ర కాలాయపన జరుగుతోందన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే 776 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి చేరాయన్నారు. ధవళేశ్వరం, ప్రకాశం, తోటపల్లి డ్యాంలు తదితర ప్రాజెక్టులు చాలా పురాతనమైనవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. డ్యాం సేఫ్టీ బిల్లు అత్యంత అవసరమని.. అదే విధంగా డ్యాంల డేటాబేసు అందుబాటులో ఉంచాలన్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని అన్నారు. రైతులకు న్యాయం జరగాలంటే జలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయపరమైన వాటాదక్కాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. -
‘విభజన హామీలన్నీ నెరవేర్చాలని పార్లమెంటులో పోరాడతాం’
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. కాగా, సమావేశం అనంతరం వైఎస్సార్ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సమావేశంలో కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న మరో 24 పంటలకు కూడా కేంద్రం ఎంఎస్పీని ప్రకటించాలని కోరామని పేర్కొన్నారు. అదే విధంగా, సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో.. దిశ బిల్లును ఆమోదించాలని, విభజన హామీలన్ని నెరవేర్చేలా పోరాడతామని తెలిపారు. చంద్రబాబు.. ఏడుపు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలో.. వైఎస్సార్సీపీ వ్యవసాయ చట్టాలకు సంబంధించి పలు అభ్యంతరాలను తెలిపిందని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర విషయంలో వైఎస్సార్సీపీ తమ విధానాన్ని చాలా స్పష్టంగా విశదీకరించిందన్నారు. ఎంఎస్పీ లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, వారితో చర్చించి వాటిని పునఃపరిశీలించాలని చెప్పడం జరిగిందని తెలిపారు. రైతులు, రైతు సంఘాలు, స్టేక్ హౌల్డర్స్ అభిమతాన్ని తెలుసుకునే విధంగా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సమావేశంలో కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. తాజా మునిసిపల్ ఫలితాలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు చిహ్నమని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు సీఎం వైఎస్ జగనే రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు గ్రహణం పట్టిందని, రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి విరబూస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో సొంత కొడుకు ఓడిపోయాడని, ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పాన్ని కూడా చంద్రబాబు పోగొట్టుకున్నారన్నారు. ఇకపై చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రవాసాంధ్రుడిలా విశ్రాంతి తీసుకుంటూ.. రామోజీరావును, రాధాకృష్ణను రోజూ కలుసుకుంటూ భవిష్యత్‌పై చర్చించుకోవచ్చని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఓట్లు పడవని, మంచి చేస్తేనే పడతాయని అన్నారు. ‘తనపై 11 కేసులున్నాయని, అందులో సెక్షన్ 307 కూడా పెట్టారని.. ఏం పీక్కుంటారని లోకేశ్ అడుగుతుంటే కుప్పం పీకేసుకుంటామని ప్రజలు ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఏదైనా కేసు ఉంటే.. 48 గంటల్లోనే స్టే తీసుకు వస్తానని లోకేశ్ అంటున్నాడు. ఇది న్యాయవ్యవస్థను కించపరచటం కాదా. కంటెప్ట్ యాక్ట్ కింద లోకేశ్ మీద సుమోటోగా విచారణ చేపట్టిæ శిక్షించాలని హైకోర్టుకు నివేదించుకుంటున్నాను’ అన్నారు. తండ్రీకొడుకులిద్దరూ సీటు మారాల్సిందే.. చంద్రబాబుకు తన కొడుకు దేనికీ పనికిరాకుండా పోయాడన్న మనస్తాపం తప్ప ఇంకొకటేమీ మిగల్లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొన్న మంగళగిరి సీటు పోతే, ఇప్పుడు కుప్పం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ సీట్లు మారాల్సిందేనన్నారు. కారుపై నిలబడి కాలర్ ఎగరేస్తూ బూతులు తిడితే సీట్లు రావని.. ప్రజాప్రయోజనాలు కాపాడితేనే ప్రజలు ఓట్లు వేస్తారనే విషయాన్ని గుర్తించాలని లోకేశ్‌కు హితవు పలికారు. మాపై బాధ్యత పెంచిన విజయం: మంత్రి ముత్తంశెట్టి ప్రజలిచ్చిన తీర్పును తాము వినయంతో, విధేయతతో స్వీకరిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బాధ్యతను పెంచిందని వ్యాఖ్యానించారు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు ఒకే పార్టీ ఉండటం దేశ చరిత్రలో జరగలేదని, మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాంటి ఘనత నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో ఈ తీర్పు ఇచ్చారన్నారు. -
టిడిపి వెంటిలేటర్ పై ఉన్న పార్టీ
-
విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే అనుమానిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిపై అనుమానం వ్యక్తం చేస్తారా అని ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. ఆ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీలు చేయలేదని.. అలాంటప్పుడు ఆ ఆదేశాలను ప్రస్తావిస్తూ, అనుమానాలు ఎలా వ్యక్తం చేస్తారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. తాను కూడా ఇలాంటి కేసుల్లో నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించానని చెప్పారు. ఇది సహేతుక కారణం కాదని.. సదరు కోర్టు ఎదుట ఉన్న పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. అత్యవసర విచారణలో.. పెట్టుబడుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో తాను వేసిన పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం భోజన విరామం తర్వాత అత్యవసర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత నెల 26న తాము దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిందంటూ సాక్షి వెబ్సైట్లో కథనాన్ని ఉంచిందని కోర్టుకు వివరించారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రెండు వారాలపాటు దుబాయ్, మాల్దీవులు, ఇండోనేషియా దేశాల్లో పర్యటించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక కోర్టుపై అనుమానాలు ఉన్నాయని, అందువల్ల తమ పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేసి విచారించేలా ఆదేశించాలని కోరారు. అయితే.. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఏప్రిల్ నెలలో వేశామని న్యాయవాది బదులిచ్చారు. ఆగస్టు 25న తమ పిటిషన్‌పై ఆదేశాలు రావాల్సి ఉందని, అయితే విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ తాము పిటిషన్ వేయడంతో.. రెండు పిటిషన్లపై ఈ నెల 15న ఆదేశాలు ఇస్తామని ప్రత్యేక కోర్టు పేర్కొన్నదని వివరించారు. అప్పీలు చేయకుండానే.. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం ఉన్నట్లయితే.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అప్పీల్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బదులిచ్చారు. అలాంటప్పుడు ప్రత్యేక కోర్టు ఆదేశాలను ఎలా ప్రస్తావిస్తున్నారని న్యాయమూర్తి నిలదీశారు. గతంలోనూ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. అప్పుడు ప్రత్యేక కోర్టు విధించిన షరతులను విజయసాయిరెడ్డి ఏమైనా ఉల్లంఘించారా అని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్‌ను ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని స్పెషల్ పీపీ తెలిపారు. అంతేగాకుండా మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సహేతుక కారణాలేవీ చూపకుండానే, బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్న తరుణంలో ఇలా పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. నిందితులు విదేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనేక సార్లు ఆదేశాలు ఇస్తూ ఉంటుందని.. అంత మాత్రాన పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. -
మాన్సాస్ ట్రస్టు: సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు
-
‘గెజిట్ నోటిఫికేషన్‌తో కేఆర్ఎంబీ సమర్థవంతంగా పనిచేసే అవకాశం’
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో జల విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కేఆర్ఎంబీకి ఇండెంట్ పెట్టకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ గత జూలై 5న జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ గత జూన్ 17న లేఖ ద్వారా తెలంగాణ జన్‌కోను ఆదేశించింది. జల విద్యుత్ ఉత్ప్తత్తి కోసం నీటి వినియోగంపై కేఆర్ఎంబీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యుత్ ఉత్పాదన చేయవద్దని ఆ లేఖలో సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌తోపాటు నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తూనే ఉన్నందున దీనిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ జూలై 15న కేఆర్ఎంబీ తెలంగాణ జెన్కో అధికారులను ఆదేశించిందని చెప్పారు. జల విద్యుత్ ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగు నీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కూడా కేఆర్ఎంబీ స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. కేఆర్ఎంబీ రాసిన లేఖలపై తెలంగాణ జెన్కో (హైడల్) డైరెక్టర్ జూలై 16న ప్రత్యుత్తరమిస్తూ జల విద్యుత్ ఉత్పాదన చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే తాము విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లు కేఆర్ఎంబీకి తెలిపారని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసే వరకు శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్ ఉత్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా కేఆర్ఎంబీ జూలై 16న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. అయినప్పటికీ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేఆర్ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. దీని వలన బోర్డు మరింత సమర్ధవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
‘జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ఏదీ పెండింగ్‌లో లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను అడ్వైజరీ కమిటీ 2011లో ఒకసారి, ఆ తర్వాత ఫిబ్రవరి 2019లో ఆమోదించిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి షేకావత్ సమాధానం ఇస్తూ.. జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ఏదీ పెండింగ్‌లో లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 2005-06 లెక్కల ప్రకారం రూ.10,151.04 కోట్ల అచనాలతో డీపీఆర్‌ను ఆమోదించామని తెలిపారు. 2009 జనవరి 20న ఈ డీపీఆర్‌ను జలశక్తి శాఖలోని ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ 95వ మీటింగ్‌లో ఆమోదించిందని తెలిపారు. -
రైల్వే శాఖ మంత్రిని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.ఎంపీ విజయసాయిరెడ్డి సారధ్యంలో పార్టీ ఎంపీలు గురువారం పార్లమెంట్ భవనంలోని కార్యాలయంలో రైల్వే మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌ల అమలును వేగవంతం చేయాలని కోరుతూ వారంతా సంతకం చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. భేటీలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్ట్‌ల స్థితిగతులను మంత్రికి వివరించారు. రెండేళ్ళయినా రైల్వే జోన్ పట్టాలెక్కలేదు.... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి రెండేళ్ళు దాటినా ఇప్పటికీ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రికి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి 13 వేల కోట్ల రూపాయల ఆదాయంతో దేశంలోనే అత్యధిక లాభసాటి అయిన జోన్‌గా రాణిస్తుంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టులకు ఈ జోన్ ద్వారా అందించే రైలు రవాణా సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. దీని వలన రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ఎంతగానో అవసరమైన రవాణా అవసరాలు నెరవేరతాయి. రైల్వేకి కూడా గణనీయమైన ఆదాయం లభిస్తుందని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి వివరించారు. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన కోరారు. విశాఖ కేంద్రగా వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలి... రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ ఒకటని విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలోని కొన్ని రైల్వే జోన్లకంటే కూడా వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం సంపాదిస్తోంది. తూర్పు కోస్తాలో అత్యధిక ఆదాయం గడించే డివిజన్లలో వాల్తేరు డివిజన్‌దే అగ్రస్థానం. నానాటికీ పురోగమిస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుందని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి స్పష్టం చేశారు. వాల్తేరు డివిజన్ రద్దు వలన కొత్త సమస్యలు కోరి తెచ్చుకున్నట్లవుతుందని కూడా ఆయన చెప్పారు. వాల్తేరు డివిజన్లో ప్రస్తుతం జరిగే కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి 350 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ డివిజన్‌కు తరలించడం వలన నిర్వహణా సమస్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సమస్యలు ఉత్పన్నమై ప్రమాదాల సమయంలో రైల్వే యంత్రాంగం స్పందించే వేగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. అలాగే విశాఖపట్నంలోని వాల్తేరు డివిజన్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కంటైనర్ టెర్మినల్స్, లోకో షెడ్, వాగన్ వర్క్‌షాప్, 2300 మంది సిబ్బందికి సరిపడ స్టాఫ్ క్వార్టర్లు ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నంలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 125 ఏళ్ళనాటి వాల్తేరు డివిజన్‌ను రద్ద చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచవద్దని విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరో 5 విస్టాడోమ్ కోచ్‌లు కేటాయించండి... ప్రకృతి రమణీయ దృశ్యాలతో కనువిందు చేసే బీచ్‌లు, తూర్పు కనుమలు, ఘాట్లు, గుహలతో విశాఖపట్నం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. తూర్పు తీరానికే ఆభరణంగా విరాజిల్లుతున్న విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలను ఏటా దేశ విదేశాలకు చెందిన లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి వివరించారు. విశాఖపట్నం నుంచి అరకులోయ మధ్య నడిచే రైలుకు అనుసంధానించిన విస్టాడోమ్ కోచ్‌కు పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. విస్టాడోమ్కు పర్యాటకుల నుంచి అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ అదనపు విస్టాడోమ్ కోచ్‌లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ విపరీతమైన అలసత్వం ప్రదర్శిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. అదనపు విస్టాడోమ్ కోచ్‌లు కావాలని గత ఏడాది మార్చిలో రాజ్యసభలో నేను చేసిన విజ్ఞప్తిపై స్పందించిన అప్పటి రైల్వే మంత్రి త్వరలోనే మరిన్ని కోచ్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ విశాఖ-అరకు రైలుకు కేటాయించిన విస్టాడోమ్ కోచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్న విషయాన్ని ఆయన రైల్వే మంత్రి దృష్టికి తీసుకువస్తూ విశాఖ-అరకు మధ్య నడిచే రైలుకు అదనంగా మరో 5 విస్టాడోమ్ కోచ్‌లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కంటైనర్ తయారీ విభాగాన్ని నెలకొల్పండి... ఆంధ్రప్రదేశ్‌లో ఒక మేజర్ పోర్ట్, అయిదు సాధారణ పోర్టులు, 10 నోటిఫైడ్ పోర్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏడాదికి 170 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేస్తున్నాయి. గుజరాత్ తర్వాత అత్యధిక కార్గో హ్యాండ్లింగ్ రాష్ట్రంలోని పోర్టులలోనే జరుగుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణం కూడా పూర్తయితే మరో 15 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేసే సామర్ధ్యం వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో కంటైనర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వలన రవాణా ఖర్చుల భారం బాగా తగ్గుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. కాబట్టి చిత్తూరు జిల్లా మన్నవరంలో ఉన్న ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ ఆవరణలో ఈ కంటైనర్ తయారీ విభాగాన్ని నెలకొల్పాలని ఆయన రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి... రైల్వేలో నియామకాల కోసం దేశంలో 21 ప్రాంతాల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బోర్డు లేదు. దీని వలన రాష్ట్రానికి చెందిన ఉద్యోగార్ధులు ఆర్ఆర్బీ పరీక్షలు రాయడానికి అటు సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్‌కు వెళ్ళాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ఆవశ్యకత ఉన్నందున దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. అలాగే చాలా కాలంగా సాగుతున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కర్నూలులో కోచ్ వర్క్‌షాప్ నెలకొల్పాలని, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని, తిరుపతి-పాకాల-చిత్తూరు-కట్పడి మధ్య డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలని విజయసాయి రెడ్డి కోరారు. రాజరాజేశ్వరిపేట వాసులకు ఊరట కల్పించండి... విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని రైల్వే భూముల్లో మూడు దశాబ్దాలకు పైగా 800 మంది నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆక్రమణలో ఉన్న తమ నివాసాలను క్రమబద్ధం చేయాలని ఆయా కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందువలన ఆ భూమికి బదులుగా అజిత్ సింగ్ నగర్‌లోని రైల్వే భూములకు సమీపంలోనే ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వేకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాజరాజేశ్వరిపేటలోని ఆక్రమిత రైల్వే భూమికి బదులుగా ఈ భూమిని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందంలో విజయసాయి రెడ్డితోపాటు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఆళ్ళ ఆయోధ్య రామిరెడ్డి, డాక్టర్ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనురాధ ఉన్నారు. -
నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
-
ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించాలని రూల్ 267 నోటీసు ఇచ్చిన విజయసాయి రెడ్డి
-
ఎంపీ విజయసాయిరెడ్డితో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భేటీ
-
ఆ దృశ్యం అద్భుతంగా ఉంది: విజయసాయిరెడ్డి
-
CRDA కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు
-
గోకుల్ పార్క్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం
-
ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోంది
-
సీఎం వై ఎస్ జగన్ ఆదేశాలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు
-
విశాఖలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
ఏపీ లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు :విజయ సాయి రెడ్డి
-
డిస్కంలకు రూ. 21 వేల కోట్ల రుణం
సాక్షి, ఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు పునరుజ్జీవం కల్పించేందుకు సమూల సంస్కరణలు చేపట్టినట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ సంస్కరణల్లో భాగంగా ఈ రెండు రాష్ట్రాల డిస్కంలకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రూ. 21 వేల కోట్ల రుణం సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ రుణంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 8,370 కోట్లు, తెలంగాణకు రూ.12,652 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కొన్ని షరతులకు లోబడి ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఈ రుణాన్ని డిస్కంలకు సమకూర్చుతాయని తెలిపారు. మంజూరు చేసిన రుణంలో మొదటి వాయిదా కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,300 కోట్లు, తెలంగాణకు రూ. 6,287 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ స్కీమ్ కింద మంజూరు చేసే ఈ రుణం కొన్ని షరతులకు లోబడి మాత్రమే పంపిణీ జరుగుతుందని తెలిపారు. అందులో ప్రధానమైంది ప్రభుత్వ శాఖలు, విభాగాలు డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలను మూడు వార్షిక వాయిదాలలో విడుదల చేయడానికి అంగీకరిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో విద్యుత్ వినియోగానికి సంబంధించి స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు విధిగా అమర్చాని, దాని వల్ల డిస్కంలకు ప్రభుత్వ చెల్లింపులు సకాలంలో జరిగే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ వినియోగదారుల్లో కొన్ని కేటగిరీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ విధానాన్ని కూడా సమూలంగా మార్చాలన్నారు. సబ్సిడీకి సంబంధించిన బకాయలను ప్రతి మూడు మాసాలకు ఒకసారి విధిగా చెల్లించడానికి అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి షరతులకు ఆయా రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత మాత్రమే తదుపరి రుణ వాయిదాల విడుదల జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలను ఆయా డిస్కంలు బాధ్యాతాయుతంగాను, పారదర్శకంగాను నిర్వహించాలని తెలిపారు. అందుకోసం ప్రతి త్రైమాసికం ముగిసే నాటికి డిస్కంలు ఎనర్జీ ఆడిట్ ఫలితాలను ప్రచురించాలన్నారు. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి ఫీడర్ వ్యాప్తంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) మార్గదర్శకాలను అనుసరించి ఎనర్జీ అకౌంటింగ్ చేపట్టాలన్నారు. ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్లో విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గించే దిశగా డిస్కంలు ఆచరణ సాధ్యమైన కార్యాచరణను రూపొందించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ చర్యలు, సంస్కరణల ద్వారా డిస్కంలు నష్టాల ఊబి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుందని మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. -
బాబు ఇప్పుడెందుకు రంకెలేస్తున్నాడు: విజయసాయి రెడ్డి
అమరావతి: వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ చంద్రబాబు హయాం లోనే ప్రారంభమైందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అప్పుడు తనకేమి పట్టనట్లు ఉన్న చంద్రబాబు ఇప్పుడెందుకు రంకెలేస్తున్నాడని ట్విటర్ వేదికగా విమర్శించారు. పొస్కొకంపెనీ ప్రతినిధులు, కొరియా రాయబారి 2018 అక్టోబర్ 22న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమంత్రి పార్లమెంట్లో ప్రస్తావించిన సంగతిని గుర్తు చేశారు. చంద్రబాబు జిమ్మిక్కులను ఏపీ ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఇప్పటికైన చంద్రబాబు రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. చదవండి: అబద్దాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్.. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి కనబర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పోస్కో- ఆర్ఐఎన్ఎల్ మధ్య 2019 అక్టోబర్‌లో ఎంవోయూ కుదిరినట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్నారు. ప్లాంట్‌లో ఎవరి వాటా ఎంత ఉండాలన్న అంశం ఇంకా ఖరారు కాలేదని, అయితే ఎంవోయూ ప్రకారం 50 శాతం మేరకు తమకు వాటా ఉండాలని పోస్కో స్పష్టం చేసిందని వివరించారు. ఆర్ఐఎన్ఎల్ వాటా ఎంత ఉండాలన్నది, అది కేటాయించే భూముల విలువపై ఆధారపడి ఉంటుందని మంత్రి వెల్లడించారు. కొండపల్లి - తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు.. విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తిరుపతి వరకు 450 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఆసక్తి కనబరిచిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కొండపల్లి-తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణ, విస్తరణ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ గెయిల్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ)కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ పైప్ లైన్ నిర్మాణం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని, గృహావసరాలు, పారిశ్రామిక అవసరాలకు కోసం గ్యాస్ అనునిత్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టిన కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, శ్రీకాకుళం-అంగుల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి వివరించారు. -
స్టీల్ ప్లాంట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు బుధవారం టీడీఐ జంక్షన్ వద్ద భారీగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ, మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజు, ఐఎన్టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అదే విధంగా లెఫ్ట్ పార్టీ నేతలు నరసింగరావు, సత్యనారాయణ, ట్రేడ్ యూనియన్ నేతలు హాజరయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తన చేపట్టబోయే నిరసన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఐఎస్టీయూసీ పేర్కొంది. కూర్మన్నపాలెంలో వేలాది మంది కార్మికులతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపింది. 18న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, భార్యా పిల్లలతో నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించింది. కేంద్రం ఆధ్వర్యంలోనే స్టీల్‌ప్లాంట్ కొనసాగాలని, వేలాది మంది భూముల త్యాగంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందని ఐఎన్టీయూసీ డిమాండ్ చేసింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు: నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయాలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మొదటి నుంచి చెప్తున్నామని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకూడదన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాజకీయాలకతీతంగా ఉద్యమించి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేట్‌పరం చేయాలనే ఉద్దేశంతో సొంత గనులు ఇవ్వలేదని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానికి లేఖ రాసి, సూచనలు చేశారని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం కార్మిక సంఘాలతో కలిసి పోరాడతామని, అన్ని కార్మిక సంఘాలను ఢిల్లీ తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరతామని ఆయన తెలిపారు. చదవండి: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం -
టీడీపీ ఎంపీలు కాళ్ల బేరానికి వెళ్లారు..
సాక్షి, న్యూఢిల్లీ: నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ ఎంపీలపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారే వెళ్లి శాంతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఆలయాలపై దాడులకు పాల్పడింది ఎవరన్న విషయం ఆధారాలతో బహిర్గతం కావడంతో టీడీపీ ఎంపీలు కాళ్ల బేరానికి వెళ్లారని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో గత్యంతరం లేక అమిత్ షా వద్ద సాష్టాంగ పడేందుకు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. టీడీపీ ఎంపీల తీరుపై ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ.. తల్లిదండ్రులను కడతేర్చిన ఓ కసాయి కొడుకు కోర్టు బోనులో భోరున విలపిస్తూ.. 'తల్లితండ్రి లేని వాడిని', 'నన్ను శిక్షించకండి' అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. నిన్న అమిత్ షా వద్దకు వెళ్లిన టీడీపీ ఎంపీలు..ప్రవీణ్ చక్రవర్తికి సంబంధించిన పాత వీడియోను ఆయనకు చూపించి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, దీన్ని బట్టి దొంగలు ఎవరు, నేరం ఎవరిదనే విషయం స్పష్టమయ్యిందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఆరాచకాలపై పూర్తి సమాచారం కలిగిన అమిత్ షా ముందు వారి పప్పులు ఉడకలేదని, అందుకే నామమాత్రపు భేటీని ఆయన త్వరగా ముగించి సాగనంపారన్నారు. -
బయోగ్యాస్ ప్లాంట్లలో కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం టాప్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక శిక్షణను కూడా అందిస్తున్నట్లు విద్యుత్, పునరుత్పాదక ఇందన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 2 లక్షల 62 వేల 841 బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటులో కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆర్థిక, సాంకేతిక సహాయం కూడా అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒక క్యూబిక్ మీటర్ పరిమాణంలో ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్‌కు రూ.7,500 నుంచి 25 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో ఏర్పాటుచేసే ప్లాంట్‌కు రూ.35 వేల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాతపూర్వకంగా చెప్పారు. అలాగే దేశంలోని వివిధ బయోగ్యాస్ అభివృద్ధి, శిక్షణ కేంద్రాలతోపాటు భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ ద్వారా కూడా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక శిక్షణ కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బయోగ్యాస్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు పెద్ద ఎత్తున బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర నోడల్ ఏజెన్సీ కృషి చేస్తున్నట్లు మంత్రి రాతపూర్వకంగా తెలిపారు. -
సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, వైఎస్సార్ సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Birthday greetings to Andhra Pradesh CM Shri ysjagan Garu. I pray that Almighty blesses him with a healthy and long life. — Narendra Modi (narendramodi) December 21, 2020 ఇక సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సహా పలువులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. On the6 joyous occasion of Hon'ble Chief Minister of AndhraPradesh ysjagan's birthday, I would like to convey my warm felicitations to him and wish him many more happy returns of the day. — Edappadi K Palaniswami (CMOTamilNadu) December 21, 2020 Birthday greetings to the Chief Minister of Andhra Pradesh Shri ysjagan ji. May you be blessed with good health and long life. — Nitin Gadkari (nitin_gadkari) December 21, 2020 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ysjagan — Lok Sabha Speaker (loksabhaspeaker) December 21, 2020 ప్రియతమ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజారంజకంగా పాలించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.ysjagan HBDYSJagan — Vijayasai Reddy V (VSReddy_MP) December 21, 2020 జన్మదిన శుభాకాంక్షలు Warm birthday wishes to the young & dynamic Chief Minister of AndhraPradesh - Y. S. Jaganmohan Reddy. On this special day, I pray to Lord Venkateswara for your good health & long life.HBDYSJagan YSJaganBirthday ysjagan YSRCParty AndhraPradeshCM — Parimal Nathwani (mpparimal) December 21, 2020 "నేను విన్నాను.. నేను ఉన్నాను.." అని చెప్పి ప్రజల్లో భరోసా కల్పించడమే కాకుండా ఆ మాటను నిజం చేస్తున్న మన ప్రియతమ నాయకుడు వైయస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.ysjagan HBDYSJagan HBDBestCMYSJagan — Buggana Rajendranath Reddy (IamBuggana) December 21, 2020 Wishing a happy birthday to Andhra Pradesh Chief Minister ysjagan from all the team UKinHyderabad — Dr Andrew Fleming (Andrew007Uk) December 21, 2020 Warm birthday greetings to Chief Minister of Andhra Pradesh Shri Y.S.Jaganmohan Reddy. My best wishes for a long and healthy life in the service of the people. ದೇವರ ಅನುಗ್ರಹ ಸದಾ ಇರಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇನೆ. ysjagan — B.S. Yediyurappa (BSYBJP) December 21, 2020 Wishing a very happy birthday to Chief Minister of Andhra Pradesh Shri ysjagan Ji. Hope this year is filled with good luck, good health, and much happiness. — Dr. Ramesh Pokhriyal Nishank (DrRPNishank) December 21, 2020 పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు. ప్రతి మనిషికీ ‘నేను ఉన్నాను’ అనే ధైర్యాన్ని ఇచ్చాడు. నవరత్నాలతో నమ్మకాన్ని నింపాడు. తన పాలనతో రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం ఆయన వైపు తొంగి చూసేలా చేశాడు. ‘దట్ ఈజ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి’ HAPPY BIRTHDAY జగన్ అన్న.HBDYSJagan ysjagan VSReddy_MP — MARGANI BHARAT RAM (BharatYSRCP) December 21, 2020 జనం కోసం పుట్టిన జననేత కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే జగన్ అన్న HBDYSJagan — Biyyapu MadhuSudhan Reddy - MLA (BiyyapuMadhu) December 21, 2020 Hon’ble AP Governor Sri Biswa Bhusan Harichandan conveyed his warm wishes on birthday of AndhraPradeshCM Sri ysjagan Y S Jagan Mohan Reddy. The Governor wished that Lord Jagannath, Venkateswara & Maa Kanakadurga bless him with joy, prosperity & long life in service to people. — Governor of Andhra Pradesh (governorap) December 21, 2020 Wishing the honourable chief minister of Andhra Pradesh ysjagan many many happy returns of the day!!💐… May God bless you with the strength to lead AP to it’s glory!!! Thank you jagan Garu For the relief measures given to the Telugu film industry!! HBDYSJagan — Nagarjuna Akkineni (iamnagarjuna) December 21, 2020 -
‘బినామీల గావుకేకలకు ఏడాది అవుతోందట’
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యగ్యాస్త్రాలు సంధించారు. ‘‘టూరిస్టు బాబుగారు ఏపీలో 2 రోజులు ఉండేలా వస్తున్నారు.. పునాది వేసి సమాధిగా మార్చిన ప్రాంతాన్ని రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంట్ లేకుండా పంచానంటున్న రైతుల ప్లాట్లను చూపించి కన్నీళ్లు కార్చటానికి ఆయన, తమ భూముల రేట్లు తగ్గటానికి వీల్లేదని బినామీలు పెట్టే గావు కేకలకు ఏడాది అవుతోందట’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: తప్పుడు ప్రచారాలపై సీఎం జగన్ ఆగ్రహం) టూరిస్ట్ చంద్రబాబు: ఎంపీ నందిగం సురేష్ తాడేపల్లి: ‘అమరావతికి వచ్చిన టూరిస్ట్ చంద్రబాబు’ అంటూ ఎంపీ నందిగం సురేష్ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకి అమరావతిపై ఆరాటం తప్ప.. పోరాటం కాదు. చంద్రబాబు బినామీల ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈ ఉద్యమం. పేద, బడుగు, బలహీన ప్రజలకు అమరావతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్యం భూములు కేటాయిస్తే కోర్టుకి వెళ్లారు. అమరావతి ప్రాంతంలో డెమో గ్రాఫిక్ అభివృద్ధి దెబ్బతింటుంది అని చెప్పడం చంద్రబాబు బుద్దిని బయటపెట్టింది. కూడబెట్టుకున్న ఆస్తులు సంరక్షణ కోసం తాపత్రయం తప్ప అమరావతి మీద ప్రేమ కాదు. నాలుగు సంవత్సరాలు అంబేద్కర్ విగ్రహం కట్టడానికి మనసు రాలేదు.. కానీ దళితులకు న్యాయం చేస్తారట’’ అంటూ ఎంపీ సురేష్ దుయ్యబట్టారు. (చదవండి: మన్యంలో మావోయిస్టుల ఘాతుకం) -
చెట్లు నరకాలంటే అనుమతి తప్పనిసరి: అవంతి
సాక్షి, విశాఖపట్న: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీ) ఆధ్వర్యంలో మదురవాడ న్యాయ కళాశాల పనొరమ హిల్స్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతిశ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం జిల్లాలో సుమారు 25 కోట్ల మొక్కలు నాటాలని ఆదేశించారని తెలిపారు. వాహనాలు, జనాభా పెరుగుదలతో గ్రీన్ బెల్ట్ తగ్గుతోందని, మొక్కలు నాటి గ్రీన్ బెల్ట్‌ను 2021 నాటికి పెంచుతామని తెలిపారు. విశాఖ రాజధాని ప్రాంతం ఏర్పాటు అవడంతో పట్టణాభివృద్ధికి ఈ మొక్కలు నాటడం ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి చెట్లు నరకాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో సుమారు 1000 పార్కులో మొక్కలు నాటాలని, ఫెన్సింగ్ వేయాలని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరు వైపుల మొక్కలు నాటితే బడ్డీల పేరుతో ఆక్రమణలు జరగవని తెలిపారు. -
‘కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా బాబు?’
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో సోమవారం ఆయన ‘ప్రచారం మీద బతికే అసమర్థుడికి ఎల్లో మీడియా పాలనాదక్షుడు అనే ఎలివేషన్ ఇచ్చింది. దిగిపోయే ముందు ఆఖరి సంత్సరంలో 250 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి వడ్డీ కింద 108 కోట్ల ప్రజా ధనాన్ని చెల్లించాడు. అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా.. కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా బాబ’ ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డి సవాలు చేశారు. (చదవండి: ‘బాబులో వణుకు మొదలైంది’) -
మున్సిపల్ గ్రాంట్లు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు గ్రాంట్ల కింద విడుదల చేయాల్సిన మొత్తాల్లో కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.581.60 కోట్ల త్వరితగతిన విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఏపీలోని మున్సిపాలిటీలకు రూ. 3,635.80 కోట్ల గ్రాంట్లుగా అందించాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. మొత్తం నిధులను పట్టణాలు, నగరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల సంరక్షణ, ఆట స్థలాల అభివృద్ధి వంటి పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సించి ఉంటుందన్నారు. మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం మంజూరు చేసిన మొత్తం గ్రాంట్లలో ఇప్పటి వరకు రూ.3054.20 కోట్లు విడుదలైనట్లు ఆయన తెలిపారు. తదుపరి గ్రాంట్ల విడుదలకు అవసరమైన అన్ని నియమ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన గ్రాంట్లకు సంబంధించి వినిమయ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందన్నారు. అలాగే ఆర్థిక సంఘం నిర్దేశించిన మూడు ప్రధాన సంస్కరణలు సైతం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేసిన వార్షిక అకౌంట్లను సమర్పించిందని వివరించారు. మున్సిపాలిటీల ఆదాయ వనరులను పెంపొందిచేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. నిర్దేశిత స్థాయిలో పౌర సేవల ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పౌర సేవలు నిరాటంకంగా కొనసాగించేందుకు, వారికి కనీస సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాలను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ. 581.60 కోట్ల మున్సిపల్ గ్రాంట్లను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను నిరాటంకంగా కొనసాగించేందుకు దోహదం చేస్తుందని లేఖలో ప్రస్తావించారు. -
భావ ప్రకటనకు సంకెళ్లా..?
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థ అంగుళం కూడా కదలనివ్వడం లేదని, ప్రజలకు మేలు చేసే ఏ నిర్ణయంపైనైనా స్టే వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కుంభకోణాలను వెలికితీయాలని ఆదేశించాల్సిందిపోయి.. ఆపండని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీలందరితో కలిసి మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవలి హైకోర్టు నిషేధిత ఉత్తర్వులపై తాను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లినట్టు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఏ ఒక్క జడ్జికీ ఉద్దేశాలను ఆపాదించడం లేదు ► భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచారం తెలుసుకోవడం భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు. అసాధారణ పరిస్థితుల్లో ఆ హక్కును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు గానీ ప్రతి చిన్న విషయానికి చట్టసభలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ ఆ హక్కును హరించి వేయడం దురదృష్టకరం. ► ఏ తీర్పునైనా లాజికల్‌గా విమర్శించడంలో తప్పులేదని చట్టమే చెబుతోంది. ఏపీలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థలోని, న్యాయవ్యవస్థలోని పరిణామాలన్నీ అందరికీ తెలుసు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ ఒక్క జడ్జికి గానీ, ఏ ఒక్క వ్యక్తికి గానీ మోటివ్స్ (ఉద్దేశాలను) ఆపాదించడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ► గతంలో 2010 నుంచి 2019 వరకు ఏ న్యాయ సూత్రాలు అనుసరించారో.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అవి న్యాయసూత్రాలుగా లేవు. ఇపుడు ఎందుకు మరో రకంగా ఇంటర్‌ప్రిట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నా. ఆ రోజు ఇలాంటి నిషేధిత ఉత్తర్వులు గుర్తుకు రాలేదా? ► 2011, 2012లో మాపై తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు ఇలాంటి “నిషేధిత’ ఉత్తర్వులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నా. సహజ న్యాయ సూత్రాలు రాజ్యాంగ వ్యవస్థలో ప్రధాన మంత్రి నుంచి సామాన్యుడి వరకు ఒకటే. చట్టం దృష్టిలో అందరూ సమానులే. ► ఐపీసీ గానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ప్రధాన మంత్రికి గానీ, ముఖ్యమంత్రికి గానీ, చీఫ్ జస్టిస్‌కు గానీ ప్రత్యేక చట్టం ఉండదు. అందరూ సమానులే. ఈ విషయాన్ని మరిచిపోయి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ ఎందుకు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది? ► ఉదాహరణకు నిన్ననో మొన్ననో హైకోర్టు ఒక కేసులో ఒక నిషేధిత ఉత్తర్వు జారీ చేసింది. దీనిని నేను రాజ్యసభలో కూడా ప్రస్తావించాను. నాకున్న కొద్దిపాటి రాజకీయ అనుభవం రీత్యా ఇప్పటి వరకు ప్రభుత్వం.. టీవీ ఛానెల్స్, మీడియా, పత్రికల నోరు నొక్కుతుందని ఆరోపణలు చేసేవారు. ఈ రోజు పరిస్థితి తారుమారైంది. న్యాయ వ్యవస్థ పత్రికల నోరు నొక్కే పరిస్థితి ఎదురైంది. దీనికి కారణం ఏంటి? ప్రజలే అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. ► నిషేధిత ఉత్తర్వు అనేది అసాధారణ పరిస్థితుల్లో.. పాజిబుల్ డిఫమేషన్ ప్రివెంట్ చేసేందుకు గానీ, ప్రయివసీ ఇన్వేషన్ జరుగుతుందనుకున్నపుడు దానిని నిరోధించేందుకు గానీ, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ రక్షణకు గానీ అవసరమవుతుంది. ఈ మూడు పరిస్థితుల్లోనే జారీ చేస్తారు. ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదలనివ్వడం లేదు ► ఏపీలో ఒకటిన్నర సంవత్సర కాలంలో పరిశీలిస్తే ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా? అనిపిస్తోంది. న్యాయవ్యవస్థే.. కార్యనిర్వాహక వ్యవస్థను, శాసన వ్యవస్థను టేకోవర్ చేసిందా? ఇది జ్యుడిషియల్ ఎన్‌క్రోచ్‌మెంట్ అవుతుందా? కాదా? జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుందా? కాదా అన్నది ప్రజలే నిర్ధారించుకోవాలని మనవి చేస్తున్నా. ► న్యాయం లేదా న్యాయ విచారణనకు నిజంగా ప్రమాదం ఉన్నపుడు మాత్రమే ప్రచురణపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ ఈరోజు దానికి పూర్తి భిన్నంగా జరుగుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులను హరించివేసే పరిస్థితి. ఎవరో కాదు.. ఒక నేరస్తుడో ఇంకొకరో నేరానికి పాల్పడితే అర్థం చేసుకోవచ్చు. తగినవిధంగా శిక్షించగలం. ► దేశంలో ఎవరైతే న్యాయాన్ని, ధర్మాన్ని పాటించి తీర్పులు ఇవ్వాలో వారే పక్షపాత ధోరణితో తీర్పులు ఇస్తే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతోందో మనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామనడంలో సందేహం లేదు. ప్రభుత్వాన్ని ఒక అంగుళం కూడా కదలనివ్వడం లేదు. ప్రభుత్వం ఏం చేసినా తప్పేనా? ► ఏం చేయాలన్నా, ఒక జీవో ఇష్యూ చేసినా స్టే వస్తుంది. ఏదైనా ఒక ప్రజోపయోగ కార్యక్రమం చేపట్టాలన్నా స్టే వస్తుంది. కనీసం పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలన్నా స్టే వస్తుంది. ఇదీ చట్ట విరుద్ధమే. ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కటీ చట్టవిరుద్ధమేనట. అంతకుముందు ఐదేళ్లు ప్రభుత్వం ఏం చేసినా, చట్టవిరుద్ధమైన పనులు చేసినా అది చట్ట వ్యతిరేకం కాదు.. చట్టబద్ధమే అవుతుందన్న రీతిలోఈ రోజు న్యాయ వ్యవస్థ పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ► ప్రజలే తీర్పు ఇవ్వాలి. కేంద్రం జోక్యం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ తప్పుదారి పడుతోందని మీకు తెలియజేస్తున్నా. ► మేం ఏ జడ్జికీ మోటివ్స్ (ఉద్దేశాలను) ఆపాదించడం లేదు. (ఓ ప్రశ్నకు సమాధానంగా..) ఒక్క న్యాయ వ్యవస్థేనా స్వతంత్రంగా పనిచేసేది? శాసన వ్యవస్థ స్వతంత్రంగా పని చేయడం లేదా? కార్యనిర్వాహక వ్యవస్థ పని చేయడం లేదా? “నిషేధిత’ ఉత్తర్వు మీడియాకు ఇచ్చారు. మేం మీ కోసం అడుగుతున్నాం. జుడీషియల్ ఓవర్‌రీచ్ అన్నది కొన్నేళ్లుగా చర్చలో ఉన్న అంశం. గతంలో న్యాయశాఖ మంత్రి కూడా దీనిపై మాట్లాడారు. చాలా మంది పార్లమెంటు సభ్యులు దీన్ని నమ్ముతున్నారు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ► అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే అని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► ప్రధాన మంత్రిని కానీ, రాష్ట్రపతి కానీ కలిసి జరుగుతున్న పరిణామాలు తెలియపరుస్తాం. మా సొంత పనుల కోసం కాదిది. ప్రజలకు సంబంధించిన విషయం ఇది. ప్రజల కోసం చేసే పనులకు అడ్డుపడుతున్నారు. అన్ని వేదికలపై దీనిని ప్రస్తావిస్తాం. అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే. ► న్యాయ వ్యవస్థను అనడం లేదు. న్యాయ వ్యవస్థలో కొంత మంది కచ్చితంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. న్యాయంగా జరగాల్సినవి అన్యాయంగా జరుగుతున్నాయి. అప్పీలుకు అవకాశం ఉంది. కానీ ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ► ప్రజలకు మేలు చేసే అన్ని కార్యక్రమాలను ఆపడం ఏమిటి? కుంభకోణాలపై దర్యాప్తులు ఆపడం ఏమిటి? ఆధారాలతో సహా ఇచ్చాం. కుంభకోణాలు వెలికి తీయాలని ఆదేశించాలి గానీ.. కుంభకోణాలు ఆపడం ఏంటి? ఏదైనా కేసు కేసే. ఎప్పటికైనా కేసే. తాత్కాలికంగా ఆపొచ్చు గానీ.. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. ► పార్లమెంటులో ఏ విషయమైనా అన్ని అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం. మేం శాసనకర్తలం. అన్నింటిపై చర్చిస్తాం. మాకు ఆ అధికారం ఉంది. ► ఈ ఆందోళనలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, లోక్‌సభ ఉపనేత నందిగం సురేష్, లోక్‌సభలో పార్టీ విప్ మార్గాని భరత్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, తలారి రంగయ్య, బీవీ సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యానారాయణ, పోచ బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో ఎఫ్ఐఆర్ ప్రస్తావన ► ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్, ఇతరులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. కోవిడ్ 19 నియంత్రణ చర్యలను వివరిస్తూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ► రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన సంఖ్యలో ఉచితంగా కరోనా టెస్టులు చేసిందని, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలో ఉచిత చికిత్స అందజేసిందని వివరిస్తూ.. ఈ కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక రంగం సృష్టించిన సంక్షోభంతో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసిందని వివరించారు. ► “ఇక్కొడక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులతో మాత్రమే సతమతం కావడం లేదు..’ అంటూ ప్రారంభించి మాజీ అడ్వకేట్ జనరల్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతిని ప్రస్తావించారు. ► “అసాధారణమైన కేసుల్లో దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించేందుకు హైకోర్టుకు స్వేచ్ఛ ఉంది. కానీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని.. గత ప్రభుత్వ హయాంలో న్యాయ అధికారి (అడ్వకేట్ జనరల్)గా పని చేసిన పిటిషనర్ ఆరోపించినప్పుడు.. ఆ అంశాలకు విస్తృత మీడియా ప్రచారం, పబ్లిక్ స్క్రూటినీ ద్వారా పిటిషనర్‌కు మేలు జరుగతుంది. కానీ మీడియాలో వార్త రాకపోవడం వల్ల పిటిషనర్‌కు ఎలా ఉపయోగపడుతుందో దానికి స్పష్టత లేదు..’ అని పేర్కొన్నారు. ► ఈ సందర్భంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పదేపదే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ జోక్యం చేసుకుంటూ విషయంపై చర్చించాలని సూచించారు. చివరగా “ఈ ధోరణి ఆగిపోవాలి..’ అంటూ విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. విజయసాయిరెడ్డి ప్రసంగంలోని అభ్యంతరకర వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ తొలగిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌కు లేఖ రాయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు సోమవారం తన ట్విటర్ ఖాతాలో.. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాశారని విమర్శించారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (వ్యవస్థలను నాశనం చేయడం మీకు కొత్త కాదుగా!) చదవండి: (ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..) -
‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ఎంపీ విజయ సాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో నిద్ర చేశారు. బాధిత గ్రామంలో ఆరుబయట నిద్రించిన ఎంపీ విజయ సాయిరెడ్డి మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. పరిహారం ఇవ్వడం కాదు ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పద్మనాభనగర్లోని ఓ బాధితుడి ఇంట్లో నిద్ర చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని, ప్రజలతో పాటు గ్రామంలో నిద్రించామని ఆయన తెలిపారు. (చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ సాయం) వెంకటాపురంలో బాధితుల ఇంటిలో బస చేసిన ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. బాధిత గ్రామాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్వయంగా మంత్రులే గ్రామాల్లో బస చేయడంతో ప్రజలలో ధైర్యం పెరిగిందని ఆయన తెలిపారు. వెంకటాద్రి నగర్లో ఓ బాధితుని ఇంటిలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ బసచేశారు. ఎస్సీ, బీసీ కాలనీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి నిద్రచేశారు. ప్రతీ గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయని మంత్రులు తెలిపారు. నేటి నుంచి వాలంటీర్ల సహకారంతో ఎన్యూమరేషన్ ప్రారంభం కానుందని మంత్రులు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అసాధారణ విజయాలివి : విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి : దేశంలోనే ప్రతి రోజూ అత్యధిక కోవిడ్ వైరస్ పరీక్షలు జరుపుతున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానానికి ఎగబాకిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడున్న టెస్టింగ్ ల్యాబ్‌లకుతోడు మిగిలిన జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. ప్లాస్మా థెరపీకి కేంద్రం నుంచి అనుమతి లభించిందని, ఇవన్నీ అసాధారణ విజయాలని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నిటిలో ప్రతిపక్ష పార్టీలున్నాయి. కరోనా కష్ట కాలంలో ఎక్కడా ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించవు. ప్రజలు పోతే పోయారు గాని ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని అనుకోవడం లేదు. ఒక్క ఏపీలో మాత్రం పచ్చ పార్టీ, ఎల్లో మీడియా అలా కోరుకుంటున్నాయి. బాబు పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100 కోట్లే మిగిలాయి. కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గింది. వచ్చే 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చు. లాక్ డౌన్లో ఎవరూ ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ అనేక చర్యలు తీసుకున్నారు. హామీలు నెరవేస్తున్నారు. అయినా పచ్చ మాఫియా ఏడుస్తూనే ఉంది’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. -
ప్రమాణానికి రెడీ..
-
ఒక్కరూ అర్ధికంగా ఇబ్బంది పడకూడదు
-
‘కరోనా సోకితే ప్రాణం పోయినట్టేనని చెప్పాలట’
సాక్షి, అమరావతి: సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకునే మాఫియా అల్లాడిపోతోందని ప్రతిపక్ష టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపని విమర్శించారు. ‘సీఎం జగన్ గారు సీరియస్‌గా లేరట. అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపు. కరోనా సోకితే ప్రాణం పోయినట్టేనని చెప్పాలట. ఆందోళన చెందొద్దు అని ధైర్యమిస్తే అప్రమత్తంగా లేనట్టట!’ అని ఆయన ట్వీట్ చేశారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకునే మాఫియా అల్లాడుతోంది. సిఎం జగన్ గారు సీరియస్ గా లేరట. అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపు. కరోనా సోకితే ప్రాణం పోయినట్టేనని చెప్పాలట. ఆందోళన చెందొద్దు అని ధైర్యమిస్తే అప్రమత్తంగా లేనట్టట! — Vijayasai Reddy V (@VSReddy_MP) April 2, 2020 కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుందని విజయసాయిరెడ్డి మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఐసీయూ బెడ్లు పెంచడం దగ్గర నుంచి దేనికీ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. అత్యవసర కొనుగోళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పచ్చ పార్టీ ఆర్తనాదాలను పట్టించుకోనవసరం లేదని సూచించారు. ఇక కరోనాను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న వలంటీర్లను అభినందించారు. కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు చర్యలు తీసుకుంది. ఐసియూ బెడ్లు పెంచడం దగ్గర నుంచి దేనికీ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అత్యవసర కొనుగోళ్లకు కలెక్టర్లకు అధికారాలిచ్చారు సిఎం జగన్ గారు. పచ్చ పార్టీ ఆర్తనాదాలను పట్టించుకోనవసరం లేదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) April 2, 2020 "ఇంటింటికి తిరిగి ఆరోగ్య వివరాలు సేకరిస్తూనే, ఒకటో తేదీ నాడే సామాజిక పెన్షన్లను అందజేసిన వలంటీర్లకు రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారు. ప్రధాన ప్రతిపక్షం అవమానాలకు గురిచేసినా సడలని సంకల్పంతో సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెట్టిన వలంటీర్ యువతకు పేరుపేరున ధన్యవాదాలు" తెలిపారు. జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య సహాయం తీసుకోవాలని కోరారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని తెలిపారు. వైరస్ సోకినవారిలో మరణాల శాతం 3 కంటే తక్కువే ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు. కాకపోతే వృద్ధులు, ఇతర జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని విజయసాయిరెడ్డి సూచించారు. (‘తొక్కేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట’) -
విజయాన్ని మాత్రం ఆపలేరు..
-
నిమ్మగడ్డ రమేష్ కరోనా కంటే ప్రమాదకరం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. ప్రతిపక్ష టీడీపీకి మేలుచేకూర్చేందుకే ఎన్నికలను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌పై తమకు గౌరవం ఉందని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదో లేదో ప్రజలే తేలుస్తారని అన్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికి రాజ్యాంగ విలువలను కాలరాశారని పేర్కొన్నారు. కరోనా వైరస్ కంటే నిమ్మగడ్డ రమేష్ ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిపారు. (కరోనాకు ఎన్నికల వాయిదాకు సంబంధమేమిటి?) ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ‘ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని, సంబంధిత సెక్రటరీలను సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడం దారుణం. ఏ అధికారి అయినా వ్యవస్థ అభివృద్ధి కోసం పాటుపడాలి. రాజ్యాంగాన్ని, పోలీసులను, అధికారులను ఎవరినీ సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకున్నారు. నైతికత ఉంటే రమేష్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలి. నిమ్మగడ్డ రమేష్ అని పిలవడం కన్నా.. నారావారి గబ్బిలం అని పిలిస్తే బెటర్. ఆర్టికల్ 243కే ప్రకారం విపత్తుల సమయంలో మాత్రమే ఎన్నికలు వాయిదా వేయాలి’ అని అన్నారు. చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారు.. కాగా ఇదే విషయంపై మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ‘ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైఎస్సార్ సీపీ హవా కనిపిస్తోంది. అధికారం ఉన్నా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కమిషన్ వ్యవస్థను నిమ్మగడ్డ రమేష్ కుమార్ భ్రష్టు పట్టించారు. చంద్రబాబు హయాంలోనే రమేష్ నియమితులైయ్యారు. అందుకే ఆయన రుణం తీర్చుకునేలా వ్యవహరిస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో కరోనా వుంటే ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదించారా ? మీరు చెప్పినట్టు అరు వారాల తర్వాత కరోనా అదుపులోకి వస్తుందని అంచనాలు వేశారు.. మీ దగ్గర శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?. ఉగాదికి ఇళ్ల పట్టాలు ఇవద్దని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదు’ అని అన్నారు. విజయాన్ని మాత్రం ఆపలేరు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీదే విజయమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ‘కేంద్రం నుంచి రావాల్సిన 5 వేల కోట్లు రాకుండా చంద్రబాబు కుట్ర పన్నారు, ఎన్నికల వాయిదా అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఎవరు ఇచ్చారు. ఇళ్ళ పట్టాలు పంపిణీ వద్దని మరుసటి రోజు కరోనా కారణం చూపించారు. ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయగలిగారు..కానీ విజయం మాత్రం వైఎస్సార్సీపీదే. చంద్రబాబు కుట్రలను మేధావులు ఖండించాలి’ అని వ్యాఖ్యానించారు. -
విజయనగరంలో టీడీపీకి షాక్
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శోభా స్వాతి రాణి, గుళ్లిపల్లి గణేష్ దంపతులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. శోభా స్వాతి రాణి, గుళ్లిపల్లి గణేష్ దంపతులకు ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్ సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత తొమ్మిది నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు ఆకర్షితులై తాను వైఎస్సార్ సీపీలో చేరినట్లు శోభా స్వాతి రాణి తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడంతో పాటు పలు సంక్షేమ పధకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయనగరం వైఎస్సార్ సీపీ నేత నెరత కాయల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. -
విశాఖలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
-
‘తొక్కేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట’
సాక్షి, అమరావతి : నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని ట్విటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదని తెలిపారు. ‘మోపిదేవి, బోస్‌ల పార్టీ విధేయతను గుర్తించి.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే చంద్రబాబుకు, జగన్‌కు ఉన్న తేడా’ అని ట్విట్టర్లో విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో దిట్ట. మోపిదేవి, బోస్ ల పార్టీ విధేయతను గుర్తించి సిఎం జగన్ గారు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే నీకూ జగన్ గారికి తేడా. — Vijayasai Reddy V (@VSReddy_MP) March 11, 2020 ‘టీడీపీలో చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్దపీట వేశాడు. బలివ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం దళితులు, బీసీలు గుర్తుకొస్తారు. మోత్కుపల్లి, పుష్పరాజ్, అనంతయ్య నుంచి వర్ల రామయ్య వరకు అదే తంతు. గెలిచే ఛాన్స్ దగ్గర తన వాళ్లు, ఓడే ప్రమాదం ఉన్న దగ్గర దళితులు!’ అని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. టీడీపీలో చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్ద పీట వేశాడు. బలివ్వాల్సి వచ్చినపుడు మాత్రం దళితులు, బిసిలు గుర్తుకొస్తారు. మోత్కుపల్లి, పుష్పరాజ్, బంగి అనంతయ్య నుంచి ప్రస్తుత వర్ల రామయ్య గారి వరకు అదే తంతు. గెలిచే ఛాన్సున్న దగ్గర తన వాళ్లు, ఓడే ప్రమాదం ఉన్న దగ్గర దళితులు! — Vijayasai Reddy V (@VSReddy_MP) March 11, 2020 -
‘బాబు ఇంత పతనమవుతాడనుకోలేదు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవడంపై అభ్యంతరం తెలిపిన చంద్రబాబును ట్విటర్ వేదికగా దుయ్యబట్టారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు’ అని మండిపడ్డారు.(ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?: విజయసాయిరెడ్డి) మరో ట్వీట్లో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాబు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడని విమర్శించారు. పరిపాలన అంటే లూటీ చేయడమే అతని ఫిలాసఫీ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎవరేంటి అనేది ప్రజలకు తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు. -
‘కియా’పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు
-
కేపీ ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణాపురం ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధాన్ని ఎత్తివేసింది. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కూడా ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతినిచ్చి.. కేపీ ఉల్లి రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతినిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అదేవిధంగా 10 వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని చెన్నై నుంచి వెంటనే ఎగుమతి చేసుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చింది. ‘కేపీ ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలి’ ఇక ఉల్లి పరిమాణంపై కడప హార్టికల్చర్ అధికారి సర్టిఫికెట్ జారీ చేసి మార్చి 31లోగా ఎగుమతులు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు, ఎంపీ విజయసాయిరెడ్డికి, మిథున్‌రెడ్డికి కేపీ ఉల్లి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అదేవిధంగా వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి... రైతులను వెంట తీసుకుళ్లి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి కేపీ రైతుల సమస్యను ఆయనకు వివరించగా.. రెండు రోజులల్లో నిర్ణయం ప్రకటిస్తామని.. ఆయన హామీ ఇచ్చినట్లు మిథున్‌రెడ్డి ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇచ్చిన హామీ మేరకు కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతిని ఇస్తూ కేంద్రం నిషేధాన్ని తొలగించినట్లు ప్రకటించింది.