సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ఎంపీ విజయ సాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో నిద్ర చేశారు. బాధిత గ్రామంలో ఆరుబయట నిద్రించిన ఎంపీ విజయ సాయిరెడ్డి మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. పరిహారం ఇవ్వడం కాదు ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పద్మనాభనగర్‌లోని ఓ బాధితుడి ఇంట్లో నిద్ర చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని, ప్రజలతో పాటు గ్రామంలో నిద్రించామని ఆయన తెలిపారు. (చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ సాయం)
వెంకటాపురంలో బాధితుల ఇంటిలో బస చేసిన ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. బాధిత గ్రామాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో స్వయంగా మంత్రులే గ్రామాల్లో బస చేయడంతో ప్రజలలో ధైర్యం పెరిగిందని ఆయన తెలిపారు. వెంకటాద్రి నగర్‌లో ఓ బాధితుని ఇంటిలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ బసచేశారు. ఎస్సీ, బీసీ కాలనీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి నిద్రచేశారు. ప్రతీ గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయని మంత్రులు తెలిపారు. నేటి నుంచి వాలంటీర్ల సహకారంతో ఎన్యూమరేషన్ ప్రారంభం కానుందని మంత్రులు పేర్కొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment