LG Polymers
-
నాడు తక్షణమే అందిన సాయం.. భరోసా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకేజీ ఘటనలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించిన తీరుకు.. నేడు ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన దుర్ఘటన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నాడు ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువులు (స్టైరిన్ గ్యాస్) లీకైన సంఘటన 2020 మే 7వ తేదీ వేకువజామున 3.40 గంటలకు జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామున 5 గంటలకు కలెక్టరు, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. » 6 గంటలకు అప్పటి ప్రజాప్రతినిధులు ముత్తంశెట్టి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్ తదితర నేతలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. » వేకువజాము నుంచే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి 11 గంటలకే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. » ఆ రోజుల్లో కోవిడ్ కేసులు భారీగా ఉండి.. బహిరంగంగా తిరిగేందుకు ఆందోళన చెందుతున్న పరిస్థితులున్నాయి. అయినా, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. » ఆ తర్వాత బాధితులను గుర్తించి ప్రకటించిన నష్టపరిహారం అందించారు. అంతేకాక.. మూడ్రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, చికిత్స పొంది వెంటనే డిశ్చార్జి అయిన వారికి రూ.లక్ష ప్రకటించారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే రూ.30 కోట్ల నిధులను విడుదల చేశారు. » విషవాయువులు వ్యాపించిన నేపథ్యంలో ప్రతీ కుటుంబ సభ్యుడికి రూ.10 వేల చొప్పున ఐదు గ్రామాల ప్రజలకు అందజేశారు. » నెలరోజులుభోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు 29 పునరావాస కేంద్రాల్లో 20 వేల మందికి వసతి కల్పించారు. » విష వాయువుల ప్రభావంలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రజల్లో భయాలు నెలకొనడంతో వారిలో భరోసా నింపేందుకు వీలుగా ప్రజాప్రతినిధులైన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి తదితరులు రాత్రి సమయాల్లో నిద్రించి ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. » ఏకంగా డీజీపీ స్థాయి అధికారి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడునెలల పాటు హెల్త్ క్యాంపులూ నిర్వహించారు. -
కాలుష్యంపైనా ద్వంద్వ ప్రమాణాలా!
కొన్ని వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు విడుదలైన సందర్భంగా ఆ సంస్థను వెంటనే మూసివేయా లని ఏపీ ప్రతిపక్ష టీడీపీ ఎంతగా గగ్గోలు పెట్టిందో అందరికీ తెలిసిందే. కానీ అమర్‌రాజా బ్యాటరీస్ సంస్థకు కాలుష్య నివారణపై నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో... ఉత్పత్తిని ఆపివేయమని ఏపీ కాలుష్యనియంత్రణ మండలి ఆదేశాలిస్తే ఇదే టీడీపీ గగ్గోలు పెడుతోంది. దక్షిణాదిలో ఇతర నగరాల్లోని పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా ‘కాలుష్య కాసారం’ పేరుతో గతంలో వరుస కథనాలు దంచిన ఇదే మీడియా... ఇప్పుడు మాత్రం టీడీపీ ఎంపీకి చెందిన పరిశ్రమపై చేయివేస్తే ఊరుకోనంటూ ఎగిరెగిరిపడుతోంది. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అన్నది ప్రశ్న.కొన్ని నెలల క్రితం విశాఖ సమీపంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి కాలుష్యం విడుదల అయిన ఘటనలో పదమూడు మంది మరణించారు. అనేక మంది అస్వస్థతకు గురి అయ్యారు. ఆ సమయంలో ఒక వర్గం మీడియాలో వచ్చిన కథనాలు గుర్తు చేసుకోండి. ఆ సంస్థతో వైఎస్సార్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, అందుకే దానిని మూసివేయడం లేదని ఆరోపించే కథనాలు ఎక్కువగా వచ్చాయి. ఆ కంపెనీ రసాయనాన్ని దక్షిణ కొరియాకు తరలిస్తుంటే కూడా చాలా యాగీ చేశాయి. ప్రతిపక్ష టీడీపీ ఆ సంస్థను మూసివేయాలని డిమాండ్ చేసింది. ఆ సంస్థ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిందని, ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదని, రకరకాల ఆరోపణలు టీడీపీ నేతలు సాగించారు. సీఎం జగన్ వెంటనే ఎల్జీ పాలిమర్స్ సంస్థ మూసివేతకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, ఆ సంస్థ ఉన్నతాధికారులనూ అరెస్టు చేయించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అది అప్పటి సంగతి. తాజాగా చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా విడుదల అవుతున్న సీసం వంటి కాలుష్య పదార్థాలు ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో వెల్లడైంది. దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని కాలుష్యమండలి ఆదేశించింది. కానీ సంస్థ యాజమాన్యం స్పందించలేదన్నది అభియోగం. దాంతో మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. దానిపై ఆ సంస్థ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. అదే హైకోర్టు.. కాలుష్య మండలి కాలుష్య నివారణకు చేసిన సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈలోగా అమరరాజా సంస్థ తన కొత్త యూనిట్‌ను తమిళనాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందని వార్తలు. ఇంకేముంది, ఒక పరిశ్రమ వెళ్లిపోతోందని ఆ వర్గం మీడియా గగ్గోలు పెట్టింది. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలన్న ఆలోచన తప్ప, తెలుగుదేశం పార్టీని జాకీలు వేసి లేపాలన్న ఉద్దేశం తప్ప ఇంకో ఆలోచనతో వీరు పనిచేయడం లేదు. మరి అమరరాజా బాటరీస్ సంస్థ ద్వారా కాలుష్యం ఏర్పడుతోందా? లేదా? అనేక మందిని పరీక్షించినప్పుడు ఎక్కువమందిలో ప్రమాదకరమైన సీసం ఉన్నట్లు గుర్తించారా? లేదా? అలా సీసం కారణంగా ఉద్యోగులు, లేదా ప్రజల ప్రాణాలకు ప్రమాదం కాకుండా ఆ సంస్థ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా? లేదా? అలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఆ సంస్థపై ఎవరైనా చర్య తీసుకుంటే అది తప్పు అవుతుంది. ఒకవేళ కాలుష్య నియంత్రణ మండలిపై ఏవైనా అనుమానం ఉంటే, వేరే స్వతంత్ర సంస్థతో పరీక్షలు జరిపించి ఆ ఫలితాలను వెల్లడి చేయవచ్చు కదా? ఇలా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా ఆ పరిశ్రమవారు వెళ్లిపోతామని బెదిరిస్తే ఏమి చేయాలి? ఈ ఒక్క కంపెనీకి మాత్రమే నోటీసు ఇస్తే ఆలోచించవచ్చు. మరో 54 కంపెనీలకు కూడా కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మూసివేయవలసి వస్తుం దని హెచ్చరించిందా? లేదా? అమరరాజా సంస్థ టీడీపీ వారిది కాకపోతే ఒక వర్గం మీడియా ఈ కాలుష్యంపై ఎలాంటి వార్తలు ఇచ్చేది? దేశంలో ఎక్కడైనా కాలుష్య కారక పరిశ్రమలు ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తాయి. అందుకే కాలుష్య నియంత్రణ మండళ్లు ఏర్పాటు అయ్యాయి.1980వ దశకంలో భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ సంస్థ నుంచి వెలువడ్డ విషవాయువులు ఎన్ని వేలమందిని బలిగొన్నది, ఎన్నివేలమంది శారీరకంగా ఎలాంటి రుగ్మతలకు గురైంది ఈ మీడియాకు గుర్తు ఉండాలికదా? అంతదాకా ఎందుకు.. తూర్పు గోదావరి జిల్లాలో ఒక మందుల పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతోందంటూ టీడీపీనే ఆందోళనకు దిగింది కదా? విశాఖలోని కొన్ని సంస్థలు విడుదల చేసే వాయువుల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంటారో చెప్పనవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలో రొయ్యల పరిశ్రమల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితం అయి తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడింది. తుందుర్రు అనే గ్రామంలో ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ ఆందోళనకారులను మహిళలని కూడా చూడకుండా గత ప్రభుత్వం అరెస్టు చేసింది. తమిళనాడులో స్టెరలైట్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఆ పరిశ్రమను మూసివేయాలని న్యాయస్థానమే ఆదేశించింది. అప్పుడు ఈ మీడియా కాని, టీడీపీ వంటి పార్టీలు కాని, ఆ పరిశ్రమను ఎలా మూసివేస్తారని ప్రశ్నించలేదు. ఇక తాజాగా అక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారు? ఇక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారని ఒక మీడియా కథనాలు ఇస్తుంటే, తిరుపతిలో అమరరాజా బ్యాటరీస్ కాలుష్యమే సృష్టించడం లేదంటూ మరో మీడియా ప్రచారం ఆరంభించింది. నిజంగానే రాజకీయ కోణంలోనే అమరరాజాకు ప్రభుత్వం నోటీసులు ఇస్తే ఎవరూ ఒప్పుకోరాదు. అదే సమయంలో ఆ సంస్థలో కాలుష్యం ఉంటే దానిని ఎవరూ సమర్థించరాదు. ఏ పరిశ్రమ అయినా ప్రజలకు ఉపాధి కల్పించాలి. అందుకు ప్రభుత్వాలు సహకరించాలి. కావాలని ఏ పరిశ్రమనూ వేధించరాదు. అలా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తే ప్రభుత్వ నేతలు వెంటనే స్పందించాలి. ఇంతవరకు తప్పు లేదు. కానీ అదే సమయంలో పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అరికట్టాలని కోరడం తప్పు కాదు. 13 వేలమందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోం దని చెబుతున్నారు. మంచిదే. అదే సమయంలో అందుకు రెట్టింపు మంది ఆరోగ్యానికి ముప్పు తెచ్చే విధంగా ఆ సంస్థ వ్యవహరిస్తే ఏమి చేయాలి? దానిని నిరోధించడం ప్రభుత్వ బాధ్యత. గతంలో హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు ప్రాంతంలో పరిశ్రమలు విడుదల చేసిన రసాయనాలతో కూడిన నీరు, వాయువులతో అనేక మంది చర్మవ్యాధులకు గురయ్యేవారు. అప్పట్లో ఈ వర్గం మీడియానే ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా కాలుష్య కాసారం పేరుతో అనేక కథనాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయా కంపెనీలను వేరేచోటుకు తరలించవలసి వచ్చింది. ఆ సంగతిని మర్చిపోకూడదు. ఇప్పుడు అదే మీడియా కాలుష్యాన్ని సమర్థిస్తూ వార్తలు ఎందుకు ఇస్తోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మాట్లాడుతూ తాము అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ వెళ్లిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగా చర్యలు చేపడితే మంచిది. లేకుంటే తమిళనాడుకు వారి యూనిట్‌ను తీసుకు వెళ్లినంత మాత్రాన, అక్కడి ప్రభుత్వం ఎలాంటి కాలుష్యాన్ని అయినా భరించడానికి ఒప్పుకుం టుందా? నిజంగానే పరిశ్రమను తరలిస్తే, అక్కడ కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయకుండా ఉండడానికి ఏ రాష్ట్రంలోని ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా? తమిళనాడుకు వందల కోట్లు వ్యయం చేసి తరలించే బదులు కాలుష్య నియంత్రణమండలి చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా. ప్రభుత్వ అధికారులు కూడా ఈ దిశలో ఆ కంపెనీని ఒప్పించే యత్నం చేయాలి. ఎల్.జి. పాలిమర్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉపాధి కల్పిస్తోంది. అయినా అప్పుడు ఆ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేసినవారు, ఇక్కడ మాత్రం భిన్నంగా వాదిస్తున్నారు. ఇది రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. కనుక ప్రభుత్వం అయినా, పరిశ్రమ అయినా బాధ్యతగా వ్యవహరించడం అవసరం అని చెప్పక తప్పదు. ఎందుకంటే పరిశ్రమలు ముఖ్యమే. ఉపాధి ముఖ్యమే. అలాగే కాలుష్య నివారణ కూడా అంతకన్నా ముఖ్యం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఎల్జీ పొలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు ఇవాళ్టితో ఏడాది పూర్తి
-
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు ఏడాది పూర్తి
-
విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గతేడాది విషవాయువులు లీకైన దుర్ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తినిచ్చాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. బాధితులకు పరిహారం అందించడంలో సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కార్యాచరణ నివేదికను అంగీకరిస్తున్నట్టు తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన 12 మంది కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున, రెండుమూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన 485 మందికి రూ.లక్ష చొప్పున అందజేయడంతోపాటు 12 మందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిపింది. గతేడాది మే 7న జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించిన విషయం విదితమే. ‘ఆర్ఆర్వీ పురం, నందమూరి నగర్, కంపరపాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ, మేఘాద్రిపేట కాలనీల్లోని 17 వేల ఇళ్ల నుంచి 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి 23 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశాం. ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షల చొప్పున, ప్రాథమిక చికిత్స పొందిన 99 మందికి రూ.25 వేల చొప్పున అందజేశాం. ప్రభావిత ప్రాంతాల్లోని 19,893 మందికి రూ.10 వేల చొప్పున, చనిపోయిన 25 జంతువులకు సంబంధించి యజమానులకు రూ.8,75,000 అందజేశాం. ఎన్జీటీ, ఢిల్లీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వద్ద రూ.50 కోట్లు డిపాజిట్ చేశాం’ అని సంబంధిత అధికారులు తెలియజేశారని వెల్లడించింది. 437 మందిని విచారించి 12 మందిపై క్రిమినల్ చర్యలు ప్రారంభించడంతోపాటు సంస్థ సీఈవో, డైరెక్టర్లు, సీనియర్ అధికారుల పాస్‌పోర్టులు సీజ్ చేసినట్టు తెలిపారని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్ కంట్రోల్ ఎక్స్‌ప్లోజివ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. చదవండి: పేదల గూటికి టీడీపీ గండి! ఎస్ఈసీకి ఎదురుదెబ్బ.. ఆ అధికారం మీకెక్కడుంది!? -
నిర్వహణ లోపం వల్లే ఎల్జీపాలిమర్స్ ప్రమాదం
-
విశాఖ గ్యాస్ లీకేజీ: నిందితులకు రిమాండ్
-
ఎల్జీ పాలిమర్స్ సీఈవోకు రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి ఆ సంస్థ సీఈవో, డైరెక్టర్‌తో పాటు అరెస్ట్ చేసిన 12 మందిని పోలీసులు బుధవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. కోవిడ్–19 కారణంగా న్యాయమూర్తి జూమ్ యాప్ ద్వారా విచారణ నిర్వహించి.. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అంతకుముందు నిందితులందరికీ కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మే నెల 7న చోటుచేసుకున్న దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నట్టు హైపవర్ కమిటీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఆ బృందం నివేదిక ఆధారంగా పోలీసులు సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియోంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషినల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పిచ్చుక పూర్ణచంద్రమోహన్, ఎస్ఎంహెచ్ ఇన్చార్జి హెచ్‌వోడీ కోడి శ్రీనివాస్కిరణ్కుమార్, ప్రొడక్షన్ టీమ్ లీడర్ రాజు సత్యనారాయణ, ఇంజనీర్లు చంద్రశేఖర్, గౌరీ శంకర నాగేంద్ర రాము, ఆపరేటర్ రాజేష్, నైట్ డ్యూటీ ఆఫీసర్ బాలాజీ, జీపీపీఎస్ ఇన్చార్జి అచ్యుత్, ఇంజనీర్ కె.చక్రపాణి, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్ వెంకట నరసింహ రమేష్ పట్నాయక్‌లను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని బుధవారం మధ్యాహ్నం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. 12 మందికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు వారిని విశాఖలోని సెంట్రల్ జైలుకు తరలించారు. -
విశాఖ ఘటన: నిందితులకు 14 రోజుల రిమాండ్
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన కేసులో అరెస్టు అయిన 12 మందిని విశాఖ పోలీసులు బుధవారం సెకండ్ అడిషనల్ ఛీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు మందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 12 మందిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరు పరచగా వీరికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా స్టైరీన్ గ్యాస్ ప్రమాద ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి కేజీఎచ్‌లో నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 213గా కేసు నమోదు చేయగా, ఐపీసీ 304(2),278, 284 285, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్) గోపాలపట్నం ప్రాంతంలో ఆర్ఆర్ వెంకటాపురంలో మే 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో స్టైరీన్ వాయువు లీకైన ఘటనలో స్థానికులు 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బాదితులని పరామర్శించి ఆదుకుంటామని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమని తేలితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి బాధితులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు రోజుల్లోనే కోటి రూపాయిల నష్టపరిహారం చెల్లించారు. బాధిత గ్రామాల ప్రజలందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఉచిత వైద్య సేవలకి వెంకటాపురంలో పది పడకల క్లినిక్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. (ఎల్జీ గ్యాస్ లీకేజీ : ప్రమాదానికి కారణమదే) అనంతరం ఎల్జీ పాలిపర్స్ ప్రమాదంపై సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమించగా, రెండు నెలలపాటు ఆయా గ్రామాల ప్రజలు, అన్ని వర్గాలను సంప్రదించి 350 పేజీల నివేదికను హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సమర్పించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని హైపవర్ కమిటీ తేల్చి చెప్పిన వెంటనే నివేదిక ఇచ్చిన 24 గంటలలోపే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎల్జీ పాలిపర్స్ సీఈఓ, డైరక్టర్లు సహా విశాఖ పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సస్పెన్షన్ చేసింది. -
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్..12 మంది అరెస్టు
-
ఎల్జీ సీఈఓ అరెస్ట్
-
ఎల్జీ సీఈఓ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: స్టైరీన్ గ్యాస్ ప్రమాద ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గోపాలపట్నం ప్రాంతంలో ఆర్ఆర్ వెంకటాపురంలో మే 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో ఎమ్–6 స్టోరేజ్ ట్యాంక్ నుంచి స్టైరీన్ వాయువు లీకైన ఘటనలో స్థానికులు 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రోజునే వెంకటాపురం రెవెన్యూ అధికారి ఎంవీ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా పర్యవేక్షణలో పోలీసుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. కంపెనీపై కేసు నమోదు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై విచారణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు రెండు నెలల పాటు అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ప్రమాదానికి గత కారణాలతో నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేసింది. నివేదిక ఇచ్చిన 24 గంటల్లోనే కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా మొత్తం 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. సరిగ్గా ప్రమాదం జరిగిన రెండు నెలల్లో పోలీసులు సైతం ప్రమాదానికి గల కారణాలపై అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా కంపెనీ ప్రతినిధుల నిర్లక్ష్యం ఉన్నట్లు నిర్ధారణ అవడంతో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియోంగ్, టెక్నికల్ డైరెక్టర్ డి.ఎస్.కిమ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పి.పూర్ణచంద్రమోహన్ రావు, ఎస్ఎంహెచ్ ఇన్చార్జ్ హెచ్ఓడీ కె.శ్రీనివాస్ కిరణ్‌కుమార్, ప్రొడక్షన్ టీమ్ లీడర్ ఆర్.సత్యనారాయణ, ఇంజినీర్లు సీహెచ్ చంద్రశేఖర్, కె. గౌరీ శంకర నాగేంద్ర రాము, ఆపరేటర్ ఎం.రాజేష్, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్) పి.బాలాజీ, జీపీపీఎస్ ఇన్చార్జ్ ఎస్. అచ్యుత్, ఇంజినీర్ కె.చక్రపాణి, నైట్‌షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్ కె. వెంకట నరసింహ రమేష్ పట్నాయక్‌లను అరెస్టు చేశారు. నివేదిక అందిన 24 గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదానికి బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. రెండు నెలల క్రితం జరిగిన ప్రమాద ఘటనపై హైవపర్ కమిటీ నివేదిక సమర్పించిన 24గంటల్లోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 మంది కంపెనీ బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఒకవైపు కంపెనీ సీఈవో, కీలకమైన ఇద్దరు డైరెక్టర్లతో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేసే లోపే మరోవైపు ప్రభుత్వం ముగ్గురు అధికారులపై వేటు వేసింది. నాడు చెప్పారు.. నేడు చేశారు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే విశాఖకు వెళ్లి దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించి వారం రోజుల్లోనే అందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. క్షతగాత్రులను శరవేగంగా ఆదుకున్న వైఎస్ జగన్ సర్కార్ అంతే వేగంగా ఇప్పుడు బాధ్యులపైనా చర్యలు తీసుకున్నారు. మే 7న క్షతగాత్రులను పరామర్శించడం కోసం హుటాహుటిన విశాఖపట్నం వెళ్లిన సీఎం వైఎస్ జగన్ దోషులెంతటివారైనా ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నాడు ప్రకటించినట్టుగానే సరిగ్గా రెండు నెలల్లోనే... మే 7న ప్రమాదం జరగ్గా జూలై 7న చర్యలు తీసుకోవడం విశేషం. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన.. కీలక పరిణామం
సాక్షి, విశాఖపట్నం: సంచలనం కలిగించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మంగళవారం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్‌రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. (నిర్లక్ష్యమే కారణం) ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది. -
నిర్లక్ష్యమే కారణం
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని హైపవర్ కమిటీ నిగ్గు తేల్చింది. భద్రతా నియమాలను సక్రమంగా పాటించకపోవడం, ప్రమాద సంకేతాలను హెచ్చరికలుగా పరిగణించకపోవడం వల్లే ఈ అనర్థం సంభవించిందని స్పష్టం చేసింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి నివేదిక సమర్పించింది. కమిటీ సభ్యులైన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్‌తో కలసి నాలుగు వేల పేజీల నివేదికను నీరబ్ కుమార్ ముఖ్యమంత్రికి అందజేశారు. ఇందులో నివేదిక 350 పేజీలు కాగా అనుబంధాలతో కలిపి మొత్తం 4,000 పేజీలు ఉన్నట్లు నీరబ్ కుమార్ మీడియాకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం... నివేదిక అందిన అనంతరం కమిటీ సభ్యులుగా ఉన్న విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డైరెక్టర్ డాక్టర్ అంజన్‌రాయ్, చెన్నైకి చెందిన సీపెట్ డైరెక్టర్ ఎస్కే నాయక్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ డైరెక్టర్ భరత్ కుమార్ శర్మలతో సీఎం జగన్¯ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు ► ఎల్జీ పాలిమర్స్‌లో ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడంలో తప్పు జరిగింది. ఎల్జీ పాలిమర్స్‌లో 2019 డిసెంబర్లో రిఫ్రిజిరేటర్ పైపులు మార్చారు. దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. అప్పట్లో ఫ్యాక్టరీలో ఉష్టోగ్రతను కొలిచే పరికరాన్ని ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగం, పైభాగంలో ఎంత టెంపరేచర్ ఉందో తెలుసుకోలేకపోయారు. ఈ తరహా గ్యాస్ లీకేజీ ఘటన దేశంలోనే మొదటిది. ► స్టైరీన్ పాలిమరైజేషన్ అవుతోందని డిసెంబర్లోనే రికార్డు అయినా యాజమాన్యం దీన్ని హెచ్చరికగా భావించలేదు. ► ఒకవైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత భారీగా పెరగడం, స్టైరీన్ బాష్పీభవనం చెందడం (బాయిలింగ్ పాయింట్), ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ► స్టైరీన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలను బొమ్మల రూపంలో కమిటీ నివేదికలో వివరించింది. పలు రకాలుగా సమాచార సేకరణ... ► ఎల్జీ పాలిమర్స్‌లో గత మే 7వ తేదీన తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరగ్గా మే 10న కమిటీ ప్రమాద స్థలాన్ని సందర్శించింది. సాంకేతిక నిపుణులతో కలిసి పరిశ్రమలో ప్రమాదానికి కారణమైన ట్యాంక్, కంట్రోల్ రూంతో, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. యాజమాన్యాన్ని ప్రశ్నించి సమాధానాలు రాబట్టింది. ► సాంకేతిక నిపుణులైన ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కేవీ రావు, ఐఐపీఈ ప్రొఫెసర్ వీఎస్ఆర్కే ప్రసాద్, ఏయూ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్.బాలప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించి కమిటీ సమాచారాన్ని సేకరించింది. ► బాధితులతో పాటు ప్రత్యక్ష సాక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, పరిశ్రమల అభిప్రాయాలను తీసుకుంది. సీబీఆర్ఎన్, ఎన్డీఆర్ఎఫ్, సీఎస్ఐఆర్, ఎన్ఈఈఆర్ఐ, ఏపీపీసీబీ నుంచి కూడా పూర్తి వివరాలను సేకరించింది. ► విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ , వీఎంఆర్డీఏ, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, సీఈఎస్‌ఓ, బాయిలర్స్ డిపార్ట్మెంట్, ఏపీపీసీబీ, పరిశ్రమల శాఖ, కార్మికశాఖ, అగ్ని మాపక శాఖల నివేదికలను పరిశీలించింది. ► జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నుంచి నియమితులైన కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్‌వీ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పి.జగన్నాధరావును కలిసి సమాచారం సేకరించింది. ► 250 ఈ మెయిల్స్, 180 ఫోన్‌కాల్స్‌తో పాటు 1,250 ప్రశ్నలతో వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం తీసుకుంది. మీడియా, వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా సమాచారం సేకరించింది. ► కమిటీలో ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, నలుగురు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిపుణులున్నారు. 11 వాల్యూమ్‌లతో 4 వేల పేజీల నివేదికను కమిటీ రూపొందించింది. కమిటీలోని 9 మంది సభ్యులూ నివేదికను ఆమోదించారు. అయితే మీడియాలో వచ్చినట్లుగా ఇది గ్యాస్ లీక్ కాదని, ‘అన్ కంట్రోల్డ్ స్టైరీన్ వేపర్ రిలీజ్’ అని కమిటీ పేర్కొంది. ప్రమాదాల నియంత్రణకు నివేదికే దిక్సూచి: సీఎం వైఎస్ జగన్ ► ఎల్జీ పాలిమర్స్‌లో చోటు చేసుకున్న ప్రమాదంపై హైపవర్ కమిటీ అందచేసిన నివేదిక భవిష్యత్తులో పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకంగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఈ నివేదిక ఒక ఆరంభం కావాలన్నారు. అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు, సవరణలు చేస్తామన్నారు. ► ప్రమాదం జరిగినప్పుడు హెచ్చరించే అలారం పరిశ్రమలో 36 చోట్ల ఉన్నప్పటికీ అవి సక్రమంగా పని చేయలేదని హైపవర్ కమిటీ నివేదికలో పొందుపర్చిందని సీఎం చెప్పారు. అలారం మోగకపోవడం లాంటి లోపాల వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం చోటు చేసుకుంటోందన్నారు. తరలింపు లేదా మార్పులు.. ► ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక మేరకు నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించడం లేదా గ్రీన్, వైట్ కేటగిరీ పరిశ్రమలుగా మార్పులు చేసుకోవాలని నిర్దేశిస్తామని సీఎం జగన్ చెప్పారు. ► పరిశ్రమలకు సంబంధించి అన్ని శాఖలు మరింత పటిష్టంగా కార్యాచరణ ప్రణాళికతో పాటు ప్రొటోకాల్ సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రజల రక్షణ, పరిశ్రమల్లో భద్రత పట్ల ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసేలా హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించారు. -
ఎల్జీ గ్యాస్ లీకేజీ: ప్రమాదానికి కారణమదే
సాక్షి, అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సమర్పించింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషాయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. విశాఖలో జరిగింది కేవలం గ్యాస్‌లీకేజీ మాత్రమే కాదని అనియంత్రిక స్టైరిన్ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయామని, అయితే ఎల్జీ పాలిమర్స్ విషయంలో తీవ్ర తప్పదం జరిగిందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్లో రిఫ్రిజిరేషన్ పైపులు మార్చారని, దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు. (ఎల్జీ గ్యాస్ లీకేజీపై హైపర్ కమిటీ నివేదిక) సైరన్ ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం ‘ఫ్యాక్టరీలో ఉష్టోగ్రత కొలిచే పరికరం ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగంలో పైభాగంలో ఎంత టెంపరేచర్ నమోదు అవుతోంది తెలుసుకోలేకపోయారు. స్టైరిన్ పాలిమరైజేషన్ అవుతోందని వారికి డిసెంబర్లోనే రికార్డు అయింది. కానీ దీనిని వారు హెచ్చరికగా భావించలేదు. ఓ వైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరగడం, స్టైరిన్ బాయిలింగ్ పాయింట్‌కు చేరడం, ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. స్టైరిన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలేంటో పూర్తిగా డయాగ్రామ్ రూపంలో నివేదికలో పొందుపరిచాం. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే... స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫ్యాక్టరీలో 36 చోట్ల అల్లారం పాయింట్లున్నాయి.. ప్రమాదం జరిగినా సైరన్ మోగించలేదు. ఎల్జీ పాలిమర్స్‌లో అల్లారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం. స్టైరిన్‌ను అదుపు చేసేందుకు కావాల్సిన రసాయనాలు పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలో లేవు. ఒకవేళ ఇలాంటి రసాయనాలు అందుబాటులో ఉంటే స్టైరిన్‌ను త్వరగా న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉండేది. ఈ రసాయనాలను గుజరాత్ నుంచి తెప్పించాల్సి వచ్చింది. అప్పటికే ట్యాంకుల్లో టెంపరేచర్ పూర్తిగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాలపై అధ్యయనం కేవలం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికే పరిమితం కాకుండా దీనికి సంబంధించిన అన్ని విభాగాల పనితీరుపైనా మేము విచారణ చేశాము. పారిశ్రామిక అభివృద్ధి ముఖ్యమే కాని.. దానితోపాటు పరిశ్రమల భద్రత, పర్యావరణ సంరక్షణ కూడా ముఖ్యమే. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో చర్చించాము. ఎల్జీ పాలిమర్స్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన ఫ్యాక్టరీ జనావాసాల్లో ఉండేందుకు వీల్లేదు అని నివేదికలో స్పష్టంగా చెప్పాము. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలపై అధ్యయనం చేసి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలనే దానిపై సూచనలు చేశాం. చాలా ఫ్యాక్టరీల్లో స్టైరిన్‌లాంటి కెమికల్స్ వాడుతుంటారు ఇలాంటి ఫ్యాక్టరీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిబంధనలు సూచించాం. పరిశ్రమల భద్రతకు సంబంధించి ఒకే ఏజన్సీకి అధికారాలివ్వాలని సూచించాం. ప్రమాదకర రసాయనాల ఫ్యాక్టరీలను జనావాసాల కంటే దూరంగా ఏర్పాటుచేయాలి. మాస్టర్ ప్లాన్ తయారు చేసే సమయంలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్జీ పాలిమర్స్‌ను వేరే ప్రాంతానికి తరలించడం మంచిది అనే మా అభిప్రాయం’ అని నివేదికలోని వివరాలు వెల్లడించారు. -
అల్లారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం
-
సీఎం జగన్‌కు నివేదిక ఇచ్చిన హైపవర్ కమిటీ
-
ఎల్జీ గ్యాస్ లీకేజీపై హైపర్ కమిటీ నివేదిక
సాక్షి, తాడేపల్లి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నివేదికను సమర్పించారు. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. (ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది) అలాగే ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, సీనియర్ జర్నలిస్ట్‌లు, అధికారులతో హైపవర్ కమిటీ చర్చించింది. నివేదిక సమర్పన సందర్భంగా విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వినయ్ చంద్, నగర కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు. కాగా విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్జీ పాలిమర్స్‌లో మే 7 వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారాంత ప్రభుత్వ సహాయంతో చికిత్స పొంది కోలుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి బాధితులను ఆదుకుంది. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన: నేడు హైపవర్ కమిటీ నివేదిక
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై హైపవర్ కమిటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నేడు నివేదికను సమర్పించనుంది. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ఘటనపై ఆరు ప్రత్యేక కమిటీలతో పాటు హైపవర్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఐదు గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, సీనియర్ జర్నలిస్ట్‌లతో హైపవర్ కమిటీ చర్చించింది. ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను కమిటీ ఇవ్వనుంది. -
‘సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ చౌదరికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే సమయం లేదు గానీ, అవినీతికి పాల్పడిన టీడీపీ గజ దొంగలను మాత్రం పరామర్శించేందుకు వెళ్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చురకలంటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారని విమర్శించారు. పేదల కష్టార్జితాన్ని దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారని తెలిపారు. శుక్రవారం మంత్రి వెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ‘ఈఎస్ఐ స్కాంలో తన పేరు ఎక్కడ బయట పెడతారోననే భయంతో లోకేష్ అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిలువుగా, అడ్డంగా పెరిగితే బాహుబలి కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించే సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి. మీరందరూ కాలకేయుల్లాంటోళ్లు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పడిపోయింది. వైఎస్ రాజారెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా. గతంలో ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అరెస్టులు చెయలేదా. లోకేష్‌ను కూడా టీడీపీ నేతలు పరామర్శించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మంగళగిరి మందలగిరికి, జయంతి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి లోకేష్. మాట్లాడితే అచ్చెన్నాయుడిని హత్య చేయాలని ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు. హత్యలు చేసే సంస్కృతి టీడీపీది. వంగవీటి రంగను నడిరోడ్డుపై చంపిచింది ఎవరు? టీడీపీ అధికారంలో ఉన్నపుడే వంగవీటి రంగను హత్య చేయించలేదా..? హత్యా రాజకీయాలకు పేరు ప్రఖ్యాతులు గడిచింది నారా చంద్రబాబు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: ఎవరి వాటా ఎంత?) (అందరం కలిసికట్టుగా ఈ చీకటిపై పోరాడుదాం) -
ఎల్జీ పాలిమర్స్ ఘటన.. త్వరలోనే తుది నివేదిక
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కమిటీ ఇప్పటికే సంబంధం ఉన్న అందరి నుండి సలహాలు, సూచనలు ప్రశ్నలు సేకరించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా 243 రిప్రజెంటేషన్ 175 టెలిఫోన్, పబ్లిక్, వాట్సాప్ ను రిసీవ్ చేసుకున్నామని పేర్కొన్నారు. దాని ఆధారంగా కమిటీ ఒక ప్రశ్నావళి రూపొందించి ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఇతర రెగ్యులేటరీ అథారిటీ ద్వారా అందించడం జరిగిందని, ఇంకా ఎల్జీ పాలిమర్స్ నుంచి జవాబు అందాల్సి ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైపవర్ కమిటీ తుది జాబితాలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. మే నెలలో విశాఖపట్నం సందర్శించిన హైపవర్ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించిందన్నారు. జూన్ 15న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఘటనలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే వారంలో హైపవర్ కమిటీ మరిన్ని సమావేశాలు రెగ్యులేటరీ ఆథారిటీతో కలిపి నిర్వహించనుందని ఆయన తెలియజేశారు. -
ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది
సాక్షి, అమరావతి: ‘విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఎంతో గొప్పగా వ్యవహరించింది. ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరికీ కోటి రూపాయల భారీ తక్షణ నష్టపరిహారం అందించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంత భారీ మొత్తాన్ని పరిహారంగా ఇచ్చిన ప్రభుత్వ మానవతా దృక్పథాన్ని.. దయార్ద హృదయాన్ని అభినందిస్తున్నాం’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కరోనా వల్ల కోర్టులు పనిచేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ కోరుతున్న విధంగా న్యాయవాదులకు వడ్డీ రహిత రుణాలు ఇచ్చేలా బ్యాంకులను కోర్టులు ఆదేశించజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులను ఆదుకునేందుకు ఇప్పటికే కేటాయించిన రూ.100 కోట్ల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ దేవానంద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులే.. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఎస్బీఐ ద్వారా వడ్డీ రహిత వ్యక్తిగత రుణంగా రూ.లక్ష ఇప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎం.గిరిబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. ఇవి పూర్తిగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులేనని, కేంద్ర నిధులు కావని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదుల కోసం ఉపయోగించాలని నిర్ణయించిందన్నారు. ఈ విషయంలో జీవో జారీ చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని తెలిపారు. -
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ప్రశంసలు కురిపించింది. విశాఖ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం గొప్పగా వ్యవహరించిందని గుర్తు చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి తక్షణ పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొంది. ప్రభుత్వం మానవతా దృక్పథం, దయార్థ హృదయాన్ని అభినందిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా గ్యాస్ లీకేజీ ఘటనపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు పదిరోజుల్లోనే పరిహారం అందించారు. (చదవండి: బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట) -
‘వచ్చే ఏడాది మహానాడు జైలులోనే’
సాక్షి, విశాఖపట్నం: పేదల సొమ్మును టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, కొందరు అధికారులు పందికొక్కుల్లా తిన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ధ్వజమెత్తాడు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాక ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి టైం దొరకని చంద్రబాబుకు, ఒక దొంగను అరెస్ట్ చేస్తే పరామర్శించడానికి టైం దొరికిందా అని ప్రశ్నించారు. అచ్చెంనాయుడు అరెస్ట్‌ను కిడ్నాప్‌గా అభివర్ణిస్తూ, రాజకీయం చేసి కులాలకు ఆపాదించారని, అవినీతికి కులం, మతం ఉండదని చంద్రబాబుకు తెలుసన్నారు. చంద్రబాబు హయంలో హెచ్‌పీసీఎల్, ఒఎన్జీసీ ఘటనలు జరిగిన బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ) తన సొంత ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం గోదావరీ పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నా టీడీపీ తరుపున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ బాధిత ప్రాంతంలో నివసిస్తున్న 20 వేల జనాభాను ఆదుకుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఆరు లక్షల కోట్ల అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. తాను చేసిన అరాచకాలు, అన్యాయాలు మర్చిపోయి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజల మీద ఉన్నది సవతి ప్రేమ అని, ఆయన అక్రమాలను తెలుగు ప్రజలు మర్చిపోరు అని అన్నారు. మొన్న మహానాడునను జూమ్ యాప్‌లో చేసుకున్న చంద్రబాబు వచ్చే ఏడాది జైలులో చేసుకోవాల్సిందే అని అమర్నాధ్ ఎద్దేవా చేశారు. (అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం) -
ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ
సాక్షి, న్యూ ఢిల్లీ : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల విచారణ వీలైనంత త్వరగా ముగించాలని హైకోర్టుకు సూచిస్తామని తెలిపింది. వచ్చే వారం చివరి నాటికి హైపర్ కమిటీ విచారణ ముగించాలంది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం ఉందని ఇప్పటికే ఎన్జీటీ స్పష్టం చేసిందని పేర్కొంది. ఎన్జీటీ ఆదేశాలతో డిపాజిట్ చేసిన 50 కోట్ల పంపిణీని 10 రోజులు ఆపాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ప్రధాన ఆదేశాలను సవాలు చేస్తూ అప్లికేషన్ సమర్పించాలని పిటిషనర్‌కు సూచన చేసింది. ( గ్యాస్ లీకేజీ ఘటన: ముగిసిన విచారణ ) ప్లాంట్‌ను సీల్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ. ప్లాంట్ సీల్, కంపెనీ డైరెక్టర్ల పాస్ పోర్టులను సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేశామన్నారు. ప్లాంట్‌ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న రోహత్గీ వాదనపై జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ స్పందిస్తూ.. ప్లాంట్‌ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని భావించట్లేదన్నారు. కంపెనీ లోపం వల్ల గ్యాస్ లీక్ అయిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఇందులో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ముకుల్ రోహత్గీ కోరిన నేపథ్యంలో పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
గ్యాస్ లీకేజీ ఘటన: ముగిసిన విచారణ
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మూడు రోజుల విచారణ పూర్తి అయింది. దీనిపై ఈ నెల 20 లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హైపవర్ కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఎ) నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. (ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్వోసీ ఇవ్వలేదు) గ్యాస్ లీక్ అయిన సమయంలో పని చేసిన జర్నలిస్టులు, జీవీఎంసీ ఫైర్ సిబ్బంది అభిప్రాయాలను కమిటీ సభ్యులు సేకరించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రతినిధులు హైపవర్ కమిటీకి పలు సూచనలు చేశారు. మనుషులు, జంతువులపై స్టైరిన్ గ్యాస్ ప్రభావంపై పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఆధారంగా ఇతర ప్రమాదకర పరిశ్రమల స్థితిగతులపైనా అధ్యయనం చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రజల్లో మానసిక ఆందోళన తొలగించే ప్రయత్నం అత్యవసరమని పేర్కొన్నారు. (‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు) -
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ
-
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ
-
హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఎ) నీరబ్‌కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. సంఘటన ఎలా జరిగింది. లీకేజీకి సంబంధించిన అంశాలు విపులంగా పరిశీలించనుంది. వివిధ కమిటీల నివేదికలను పరిశీలించి, పర్యావరణ, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల వినతులు అధ్యయనం చేసి.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి నుంచి సమాచారం సేకరించడానికి కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు నివేదికలు రావడంతో పూర్తిస్థాయి ముసాయిదా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇందుకోసం మూడు రోజులపాటు హైపవర్ కమిటీ వివిధ వర్గాలతో వరుసు భేటీలు నిర్వహించనుంది. చదవండి: బాబాయ్ భ్రష్టు పట్టించారు -
బయటపడ్డ రంగనాయకమ్మ కేసుల చిట్టా
సాక్షి, గుంటూరు : విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ కేసుల చిట్టాలను పోలీసులు బయటపెట్టారు. ఆమెపై ఇదివరకు పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగనాయకమ్మపై 2011 నుంచి పలు క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. 2011లో ఓ కేసులో ఆమెకు గుంటూరు కోర్డు 5వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే 2014లో ఆమెపై నమోదైన ఓ సివిల్ కేసు విచారణ సందర్భంగా రూ.15.40 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించిట్లు రికార్డులో తేలింది. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!) ఇక వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ 2014, 2015ల్లో నమోదైన 3 క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గుంటూరు, మార్కాపురం కోర్టుల్లో 4 క్రిమినల్ కేసుల్లో విచారణ జరుగుతోంది. అవికాక తాజాగా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల కేసులోనూ రంగనాయకమ్మ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన రంగనాయకమ్మ వ్యవహారశైలిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె చేసిన గత పోస్టులన్నింటినీ గమనిస్తే కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నట్లు అర్థమవుతోందని వారందరూ అభిప్రాయపడుతున్నారు. -
ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్వోసీ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలో కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం ఎల్జీ పాలిమర్స్‌కు నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇచ్చామనడం శుద్ధ అబద్ధమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. లాక్డౌన్ 3.0 మార్గదర్శకాల ప్రకారం.. కేంద్రం పలు సడలింపులు ఇచ్చిందని, దీని ప్రకారం తమ పరిశ్రమ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినివ్వాలని ఎల్జీ పాలిమర్స్ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకుందని వివరించింది. అనుమతి కావాలంటే పరిశ్రమ కంటైన్మెంట్, బఫర్ జోన్లో లేదని డిక్లరేషన్ ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్‌కు చెప్పామని, అయితే ఆ కంపెనీ డిక్లరేషన్‌ను సమర్పించలేదంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇప్పటికే కంపెనీ నిర్వహణ, ఉత్పత్తికి అనుమతిని ఉపసంహరించిందని వివరించింది. విశాఖపట్నంలో మే 7న ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ విషవాయువు విడుదలై 12 మంది మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదే ఘటనపై మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల వన్ కౌంటర్ దాఖలు చేశారు. స్టైరీన్ వాయువు కాదని, అది ద్రావణమని, ట్యాంక్‌లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్లే స్టైరీన్ లీకైందని వలవన్ వివరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమీప గ్రామాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిందన్నారు. మృతులకు భారీ నష్టపరిహారం, ఇతరులకు వైద్య సాయం, పరిహారం అందించామన్నారు. ప్రాణ నష్టానికి ఎల్జీ పాలిమర్స్‌దే బాధ్యత : ఎన్జీటీ విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ప్రాణ నష్టానికి çపూర్తి బాధ్యత ఎల్జీ పాలిమర్స్దేనని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతుల్లేకుండా ప్లాంటు నడిపించారని, 1989 నాటి పర్యావరణ అనుమతులను కూడా కంపెనీ ఉల్లంఘించిందని బుధవారం నాటి రాతపూర్వక ఉత్తర్వుల్లో పేర్కొంది. జస్టిస్ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక స్టైరీన్ గ్యాస్ నిల్వలను కంపెనీ సరైన రీతిలో నిర్వహించలేకపోయినట్టు తెలిపిం దని వివరించింది. కంపెనీ జమ చేసిన రూ.50 కోట్లను బాధితులకు నష్టపరిహారంగా, పర్యా వరణ పునరుద్ధరణకు వెచ్చించాలని తెలిపింది. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన: ఎన్జీటీ తీర్పు
న్యూఢిల్లీ: విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు, బాధితులకు పంచాలని ఆదేశించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు రెండు నెలల్లో ప్రణాళిక రూపొందించాలని పేర్కొంది. ఇందుకోసం కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీని రెండు వారాల్లో ఏర్పాటు చేయాలన్న ఎన్జీటీ.. రెండు నెలల్లో నివేదిక అందజేయాల్సిందిగా కమిటీని ఆదేశించింది. అదే విధంగా తుది నష్టపరిహారాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ.. కాలుష్య నియంత్రణ మండలి కలిసి అధ్యయనం చేయాలని సూచించింది. (‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు) ఇక కంపెనీకి అనుమతుల విషయంలో చట్ట ప్రకారంగా నడుచుకోని అధికారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. అదే విధంగా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఎల్జీ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ కంపెనీకి అనుమతులు ఇస్తే వాటి వివరాలు ట్రిబ్యునల్‌కు తెలియజేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ పర్యవేక్షణ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని.. అదే విధంగా రసాయన పరిశ్రమల పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది.(నివేదిక వచ్చాక నిర్ణయం: సీఎం జగన్) కాగా గ్యాస్ లీకేజీ ఘటనపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. కోటి రూపాయిల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు పదిరోజుల్లోనే పరిహారం అందించారు. అదే విధంగా విషాదానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకునేందుకు నిపుణులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 కమిటీలను ప్రభుత్వం నియమించింది. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయని వెల్లడించింది. -
‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ స్టైరిన్‌తో కలుషితమైపోయిందన్న అనుమానాల్ని నివృత్తి చేస్తూ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరీ) మంగళవారం నివేదికను విడుదల చేసింది. దుర్ఘటన జరిగిన తర్వాత తీసిన శాంపిల్స్‌లో ఎలాంటి స్టైరిన్ అవశేషాలు లేవంటూ నాగ్‌పూర్‌లోని నీరీ సంస్థ రిపోర్టులో వెల్లడించింది. పంపించిన శాంపిళ్ల నివేదికను నీరీ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. నీటిలో ఏయే లవణాలు ఎంత మోతాదులో ఉన్నాయి. ఇతర పరిమాణాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని సీఎస్ఐఆర్–నీరీకి చెందిన 15 మంది శాస్త్రవేత్తల బృందం పూర్తిస్థాయిలో పరిశీలించింది. మే 12 నుంచి 16వ తేదీ వరకు మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌లోని నీటి శాంపిళ్లను పరీక్షలకు సేకరించింది. నీటి నాణ్యత పరీక్షలతో పాటు బయో ఎస్సే పరీక్షలు కూడా నిర్వహించారు. రిజర్వాయర్ నీటిలో స్టైరిన్ అవశేషాలు అతి స్వల్పంగా ఉన్నాయని.. దానితో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. పీహెచ్ లెవెల్స్ కూడా సాధారణంగా ఉన్నాయని తెలిపింది. సోడియం, ఇతర గాఢ లవణాల శాతం ఎక్కువగా ఉందనీ, ఈ కారణంగా నేరుగా తాగునీటి కోసం వినియోగించొద్దని నీరీ సూచించింది. గాఢ లవణాలు తీసేస్తే, కంబైన్డ్ ఓజోన్ యాక్టివేటెడ్ కార్బన్ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా శుద్ధి చేసిన తర్వాత మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోని నీటిని యథాతథంగా వినియోగించవచ్చని స్పష్టం చేసింది. స్టైరిన్ అవశేషాలు మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోని నీటిలో లేవంటూ నీరీ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా చెప్పారనీ, అయితే నివేదిక ఇంకా తమ చేతికి అందలేదని జీవీఎంసీ కమిషనర్ జి.సృజన స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాతే నీటిని వినియోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: సెల్లో ఫొటోలు తీసి... ఆపై గర్భవతిని చేసి -
చంద్రబాబు వచ్చారు.. వెళ్లారు
సాక్షి, అమరావతి: హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు నానా హడావుడి చేసిన చంద్రబాబు రెండ్రోజులు కూడా గడవకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఉండవల్లి నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆయన రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 25న ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్రానికి వచ్చేందుకు చంద్రబాబు డీజీపీ అనుమతి కోరారు. ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చేందుకు డీజీపీ అనుమతిచ్చారు. కానీ, ఆ రోజు రాష్ట్రంలో ప్రారంభం కావాల్సిన విమాన ప్రయాణాలన్నీ రద్దుకావడంతో బాబు విశాఖకు వెళ్లకుండా రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. వచ్చిన తర్వాతైనా విశాఖ వెళ్లే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదు. రెండ్రోజులపాటు ఆన్లైన్లో మహానాడు నిర్వహించారు. అది ముగిసిన తర్వాతైనా విశాఖ వెళ్తారని పార్టీ నాయకులు భావించారు. కానీ, అనూహ్యంగా అది ముగిసిన మర్నాడే చంద్రబాబు సైలెంట్‌గా హైదరాబాద్ వెళ్లిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. -
నివేదిక వచ్చాక నిర్ణయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : విశాఖలో గ్యాస్ లీక్ దుర్ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు ఆ దిశగా పని చేస్తున్నాయని, నివేదికలు వచ్చాక ఒక నిర్ణయానికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఘటన తర్వాత బాధితులను వేగంగా ఆదుకున్నామని, కేవలం పది రోజుల్లోనే దాదాపు రూ.50 కోట్ల మేర ఆర్థిక సాయం చేశామని తెలిపారు. పరిశ్రమలు– మౌలిక సదుపాయాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేధోమథన సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. (టీటీడీ ఆస్తుల విక్రయం నిషిద్ధం) చట్టంలో మార్పు చేస్తాం ► ప్రజలు ఎక్కువగా ఉన్నచోట ఆరెంజ్, రెడ్ పరిశ్రమలు లేకుండా కాలుష్య నియంత్రణ చట్టాన్ని మార్చబోతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ► సదస్సులో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక వేత్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు (ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్) ► రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని పేర్కొంటూ ఇటీవల విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనను సీఎం జగన్ ప్రస్తావించారు. ఎల్జీ పాలిమర్స్‌లో జరగకూడని ఘటన జరిగిందని, దురదృష్టవశాత్తూ ప్రజలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన విషయంలో రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచన చేశానని సీఎం పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే దురుసుగా వ్యవహరించి ఉంటే పారిశ్రామిక వర్గాల్లో భయాన్ని రేకెత్తిస్తున్నారనే విమర్శలు వచ్చేవని, అదే సమయంలో ఏమీ చేయకుంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే విమర్శలు కూడా చేస్తారన్నారు. అందుకనే రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచన చేశానన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి ముఖ్యమని, అయితే దానివల్ల ప్రజలకు నష్టం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. ► ఏం జరిగిందో తెలుసుకోకుండా, వాస్తవాలు గుర్తించకుండా కఠిన చర్యలు తీసుకుంటే పారిశ్రామిక వర్గాలలో ఒక భయానికి ఆస్కారం ఇచ్చినవాళ్లం అయ్యేవాళ్లం. అదే సమయంలో ప్రజల ప్రాణాలు, బాగోగులు ముఖ్యం. అందుకే రాష్ట్రానికి ఒక తండ్రిగా అన్నీ చూడాలి, అభివృద్ధి జరగాలి, అటు ప్రజలకు నష్టం జరగకూడదు కాబట్టి ప్రభుత్వం రంగంలోకి దిగి 10 రోజుల్లోనే బాధితులకు దాదాపు రూ.50 కోట్ల మేర ఆర్థిక సాయం చేశాం. ► ఘటన జరిగిన సమయంలో అలారం ఎందుకు మోగలేదనే విషయాన్ని దర్యాప్తు కమిటీలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. ప్రజల సందేహాలను కూడా నివృత్తి చేసేందుకు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చామన్నారు. ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఉన్న రసాయనాన్ని తరలించామన్నారు. (నేటి ముఖ్యాంశాలు..) -
పొరపాట్లు జరిగితే మర్చిపోండి
సాక్షి, అమరావతి: పార్టీలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మర్చిపోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు కార్యకర్తల్ని కోరారు. పొరపాట్లు మళ్లీ జరక్కుండా చూసుకుంటానని, అందరూ పార్టీ కోసం పనిచేయాలన్నారు. భవిష్యత్తు అవసరాల్ని బట్టి పార్టీ యంత్రాంగాన్ని తయారుచేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బుధవారం జూమ్ వెబ్‌నార్ ద్వారా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం.. మృతిచెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపారు. పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ మాట్లాడిన తర్వాత చంద్రబాబు ప్రసంగించారు. గడచిన సంవత్సరం చాలా బాధాకరమైనదని.. ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని.. ఈ ఏడాదిలో ఎదుర్కొన్నన్ని సమస్యలు ఎప్పుడూ లేవని, పార్టీ నాయకుల్ని అన్ని రకాలుగా దెబ్బతీశారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో ఉంది. కేంద్రం నుంచి డబ్బులు వస్తాయో లేదో తెలీదు. ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం జీఓ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు తీసుకొచ్చింది మనమే. రాయలసీమకు కృష్ణా జలాలను బనకచర్ల మీదుగా తీసుకెళ్లేలా ప్లాన్ చెప్పా. ► సంవత్సరంలో 34 సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేశారు. పెట్టుబడులు పోయాయి. రైతులు దివాళా తీశారు. వారికి మద్దతు ధర ఇచ్చే పరిస్థితిలేదు. ► 2016లో చేసిన నిర్ణయాన్ని రివర్స్ చేశామంటున్నారు. ఆస్తుల వేలం నిలిపేసి క్షమాపణ చెప్పాలి. తిరుమల ఆస్తులను చౌకగా కొట్టేయాలని చూస్తున్నారు. ► ఎల్జీ గ్యాస్ ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఇస్తాం. ► కరెంటు ఛార్జీలు పెంచారు. మద్యం, ఇసుక, సిమెంటు అన్ని రేట్లు పెంచేశారు. ఇరిగేషన్లో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ప్రత్యేక హోదా ఏమైంది. ► రూ.80 వేల కోట్ల అప్పులు చేశారు. వాటితో అభివృద్ధి చేయలేదు. ఏడు తీర్మానాలు.. సీఎం జగన్‌పై ఆరోపణలకే మహానాడులో తొలిరోజు ఏపీకి సంబంధించి ఏడు తీర్మానాలు చేయగా అవన్నీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనే పెట్టడం గమనార్హం. 8 ‘విద్యుత్ చార్జీల పెంపు–మాట తప్పిన జగన్’ తీర్మానాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ‘కరోనా విజృంభణ–వలస కార్మికుల కష్టాలు’ తీర్మానం గుంటూరు ఎంపీ జయదేవ్.. ‘టీటీడీ ఆస్తుల అమ్మకం’పై వేమూరి ఆనంద్‌సూర్య.. ‘అరాచక పాలనకు ఏడాది’ తీర్మానాన్ని వర్ల రామయ్య.. ‘అన్నదాత వెన్నువిరిచిన జగన్ సర్కార్’ తీర్మానాన్ని సోమిరెడ్డి.. ‘సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు’ తీర్మానాన్ని కాల్వ శ్రీనివాసులు.. ‘అక్రమ కేసులు–ఆస్తుల విధ్వంసం’ తీర్మానాన్ని అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టారు. తెలంగాణకి సంబంధించి రెండు తీర్మానాలు రేపటికి వాయిదా వేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరు తొలిరోజు మహానాడుకు ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలిసింది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొనలేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంకా పలువురు ముఖ్య నేతలూ సమావేశానికి దూరంగా ఉన్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మొక్కుబడి తంతే.. కరోనా నేపథ్యంలో జూమ్ వెబ్‌నార్ ద్వారా నిర్వహించిన మహానాడు మొక్కుబడి తంతులా జరగడంతో నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రతిరోజూ చేపట్టే వీడియో కాన్ఫరెన్స్లానే ఉంది తప్ప మహానాడులా లేదని పార్టీ సీనియర్లు పెదవి విరిచారు. కాసేపటికే విసుగొచ్చి చాలామంది లైన్‌కట్ చేసినట్లు తెలిసింది. ప్రారంభంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లైన్ సరిగా లేకపోవడంతో ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే కట్ చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఒకేసారి నాయకులంతా వచ్చి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. జెండా ఆవిష్కరణ, ఎన్టీఆర్‌కి నివాళులర్పించేటప్పడు నాయకులంతా భౌతికదూరాన్ని బేఖాతర్ చేశారు. -
ఇంద్రభవనంలో విశ్రమించి ఇప్పుడొచ్చారు
సాక్షి, అమరావతి: కోట్లాది రూపాయలతో హైదరాబాద్‌లో నిర్మించుకున్న ఇంద్రభవనంలో రెండు నెలలకుపైగా విశ్రాంతి తీసుకొని చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీకి రాగానే పూలు జల్లించుకున్న చంద్రబాబు, భౌతిక దూరం పాటించలేదని, టీడీపీ నేతలు మాస్క్‌లు కూడా ధరించలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన బ్రహ్మాండంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు, సహాయక కార్యక్రమాలను దేశం మొత్తం ప్రశంసించింది. ► హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లారు. ఇప్పుడు వైజాగ్ వెళ్లి ఏం చేస్తారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ వెళ్లవచ్చుకదా? కరకట్ట ఇంటికి ఎందుకు వచ్చారు. తాను విశాఖ వెళ్తుంటే ఎయిర్‌పోర్టులు మూసివేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. ► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు. ► అందరికీ లబ్ధి చేకూరేలా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతోంది. జగన్‌కు మంచిపేరు వస్తుందనే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. -
ఎల్జీ పాలిమర్స్ సీజ్
విశాఖపట్నం: స్టైరీన్ గ్యాస్ లీకేజీ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని జిల్లా రెవిన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ నెల 7వ తేదీన జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా 585 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపడుతోంది. ముందుగా కంపెనీని సీజ్ చేయడంతో పాటు డైరెక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎ.రామలింగరాజు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రసాద్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సీజ్ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కంపెనీని మూసివేసినట్లు ఆర్డీఓ తెలిపారు. -
‘వారు ఇప్పుడు గుర్తుకొచ్చారా’
సాక్షి, విశాఖపట్నం: ఇరవై రోజుల తర్వాత ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తానని చెప్పడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే వస్తున్నారని విమర్శించారు. గ్యాస్ ఘటనలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి ఆదుకున్న ఘనత దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. సీబీఐ విచారణకు చంద్రబాబు స్వాగతించడం ఆయన నీచ రాజకీయానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తన అవినీతిని వెలికి తీస్తారని అధికారంలో ఉన్నప్పుడు సీబీఐకు నో ఎంట్రీ అన్న చంద్రబాబు సీబీఐ కావాలని ఎలా అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, అయ్యన్నలు.. రంగనాయకమ్మ పోస్ట్‌ను షేర్ చేసి అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత పాలనలో రాష్ట్రాన్ని దోచుకుతిన్న టీడీపీ నేతలు దోచుకోవడం గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఉమాశంకర్ విమర్శించారు. -
రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ వ్యవహారశైలిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన గత పోస్టులన్నింటినీ గమనిస్తే కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నట్లు అర్థమవుతోందని వారందరూ అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఆమె చేస్తున్న దుష్ప్రచారంపై సీఐడీ కేసు నమోదుచేసి విచారణకు పిలిస్తే టీడీపీ అగ్రనేతలు రంగనాయకమ్మకు దన్నుగా నిలవడం చూస్తుంటే సర్కారుపై ఆ వర్గం కావాలనే బురదజల్లే కార్యక్రమం చేపట్టినట్లు అర్థమవుతోందని వారు తీవ్రంగా ఎండగట్టారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మీకు ఈ డ్రామాలు దేనికమ్మా అంటూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నెటిజన్లు శనివారం ముక్తకంఠంతో ప్రశ్నించారు. పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడంలేదా అంటూ నిలదీశారు. పెద్ద వయస్సు అంటూ మీరు చేసిన నేరాన్ని తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని. ఆ వయసులో ప్రభుత్వం మీద పోస్టింగులు ఎలా పెట్టారని ప్రశ్నించారు. చరిత్రలో ఇంత గొప్పగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మరొకటి ఉందా? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే పథకాలేమిటి? అంత గొప్ప నాయకుడైతే ఎందుకు చిత్తుగా ఓడాడు? అంటూ నిలదీశారు. దేశ చరిత్రలోనే జగనన్న ప్రభుత్వం రికార్డు స్థాయిలో 28 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీకి రంగం సిద్ధంచేసింది. ఏ రకంగా చూసుకున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అంటూ వివరించారు. -
కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకై ప్రాణనష్టం జరిగిన ఘటనకు సంబంధించి ఆయా కమిటీల నుంచి నివేదికలు రావాల్సి ఉందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఈ నివేదికలు అందిన వెంటనే కోర్టు ముందుంచుతామని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీల్లో ఏదో ఒక కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించినా అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే తమ డైరెక్టర్లు పాస్‌పోర్టులను అధికారులకు స్వాధీనం చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. భూముల విక్రయంపై పిల్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు రాష్ట్రంలో ఖాళీ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించతలపెట్టిన భూముల్లో గతంలో ప్రైవేటు వ్యక్తులు ప్రజాప్రయోజనార్థం ఇచ్చిన భూములు కూడా ఉన్నాయని, అందువల్ల ఆ భూ విక్రయాలను అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తోట సురేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. -
ఆందోళనల 'పొగ'
మల్కాపురం (విశాఖ పశ్చిమ): మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నిప్పులు చెరుగుతున్న వేళ.. కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఉక్కుపోత, చెమటతో ఇళ్లలో ఉండలేక.. చాలామంది ఆరుబయటికొచ్చారు. సరిగ్గా అదే సమయంలో సమీపంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) రిఫైనరీ వద్ద గోధుమ వర్ణంలో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమేస్తున్న దృశ్యం చూసి మల్కాపురం, వెంకటాపురం తదితర చుట్టుపక్కల ప్రాంతాలవారు బెంబేలెత్తిపోయారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన ఇంకా కళ్లముందే మెదులుతుండగానే.. హెచ్‌పీసీల్ నుంచి రేగుతున్న ఈ పొగ స్థానికుల్లో ఆందోళనను రాజేసింది. మళ్లీ ఏ విపత్తు ముంచుకొస్తుందోన్న భయంతో ఇళ్లలో ఉన్నవారు సైతం రోడ్లపైకి వచ్చేసి దూరప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. ఇంకొందరు రిఫైనరీ గేటు వద్దకు చేరుకొని వాకబు చేయసాగారు. ఇంతలోనే ఐదు పది నిమిషాల వ్యవధిలోనే పొగలు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పొగలు రావడం సాధారణమేనని.. అయితే ఈసారి కాస్త మోతాదు పెరిగిందని, దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని హెచ్‌పీసీఎల్ అధికారులు వివరించారు. ఎఫ్‌సీసీఎల్ యూనిట్–1 కంబర్షన్ సమయంలో పైప్‌లైన్‌లో నిలిచిన వ్యర్థాల కారణంగా పొగ ఎక్కువగా వచ్చిందని.. ఇందులో ఎటువంటి రసాయనాలు గానీ, విషవాయువులు గానీ లేవని భరోసా ఇచ్చారు. దాంతో కొంత శాంతించినప్పటికీ.. భవిష్యత్తులో పెనువిపత్తులు సంభవించకుండా తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్ ములగాడ తహసీల్దార్ రమామణిని అప్రమత్తం చేశారు. వెంటనే హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న ఆమె సంస్థ ప్రతినిధులతో చర్చించి వివరాలు సేకరించారు. స్థానికులకు పరిస్థితిని వివరించి ఆందోళన విరమింపజేశారు. ఇది ప్రమాదమే కాదు యూనిట్లో కంబర్షన్లో స్వల్ప లోపం తలెత్తడం వల్లే ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ప్లాంట్‌లో ఇది సర్వసాధారణమే తప్ప ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. స్థానికులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా పొగను అదుపులోకి తీసుకొచ్చాం. 35 నుంచి 40 డిగ్రీల మధ్యలో ట్యాంకు ఉష్ణోగ్రత ఉంటుంది. దాన్ని హయ్యర్ టెంపరేచర్ వద్ద మండించి వేపర్ చేసి రకరకాల చర్యలతో ఉత్పత్తులు తయారవుతాయి.– నారిశెట్టి రాజారావు, సీనియర్ జనరల్ మేనేజర్, హెచ్‌పీసీఎల్ ప్రాణాలు పోతాయని భయమేసింది పొగ చూడగానే ఏడుపు వచ్చింది. ప్రాణాలు పోతాయని భయమేసింది. వీధిలో ఉన్న అందరం బిగ్గరగా అరిచాం. ఇళ్ల నుంచి బయటికి వచ్చి అందరం రోడ్లపై నిలుచున్నాం. పొగ మొత్తం కమ్మేసింది. అయితే కొద్ది నిమిషాల్లోనే మాయమైపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం. – బి.స్వప్న, ప్రియదర్శిని కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం మధ్యాహ్నం కరెంట్ లేకపోవడంతో ఇంటి నుంచి బయటికి వచ్చాం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ కనిపించడంతో భయపడ్డాం. ఎల్జీ పాలిమర్స్లోలా ప్రమాదం జరిగిందేమోనని ఉలిక్కిపడ్డాం. ఇళ్ల నుంచి వెళ్లిపోదామనుకునేలోగా పొగ మాయమైపోయింది. –చట్టి నూకరాజు యాదవ్, మల్కాపురం -
'ఇలాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు'
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా వైరస్ నియంత్రణకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రోజున తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. వలస కూలీల అంశంలో సీఎం మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు. నడచి వెళ్తున్న కూలీలకు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. కేంద్ర సూచనలను అమలు చేయడంలో కూడా ఏపీ ముందంజలో ఉంది. చదవండి: 'ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు' ప్రజల పట్ల ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో సీఎం జగన్ చూపించారు. నిర్లక్ష్యం వహిస్తే పరిశ్రమలు నిర్వహించేవారు భయపడేలా బాధితులకు భారీ పరిహారం ప్రకటించారు. 10 రోజుల్లో బాధిత కుటుంబాలు, గ్రామాలకు అన్ని సహాయక చర్యలు అందించారు. కరోనా సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు ఏకకాలంలో సీఎం జగన్ అమలు చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. ప్రభుత్వం మంచి చేస్తున్నా విమర్శలు చేయడమే టీడీపీ నేతల పని. టీడీపీ నేతల ఆలోచనలు రోజురోజుకు దిగజారుతున్నాయి. కరోనా వైరస్ కంటే అత్యంత డేంజరస్ వైరస్.. ఎల్లో వైరస్' అంటూ సజ్జల మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..? కరోనా కట్టడి అనేది సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కాదు. కరోనా నియంత్రణకు ప్రయత్నం చేయాలి. ఎక్కువ కరోనా కేసులు వచ్చాయని భయపడకూడదు. తక్కువ కేసులు వచ్చాయని ఆనంద పడకూడదు. చంద్రబాబు ఆలోచనలు మాత్రం దుర్బుద్ధితోనే ఉన్నాయి. ఒక్కరోజైనా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చారా? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు.. సాయంత్రానికి రూ.కోటితో ప్రాణాలు వస్తాయా? అని మాట మార్చారు. రూ.25 లక్షలతో ప్రాణాలు తిరిగి వస్తాయా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఓఎన్జీసీలో ప్రమాదం జరిగితే బాబు ప్రభుత్వంలో రూ.2 లక్షల పరిహారం ఇచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ ఉండే నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. చదవండి: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సజ్జల లేఖ కరోనా కాలంలో ఉద్యోగులు సహకరిస్తుంటే.. చంద్రబాబు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. చంద్రబాబు అధికారంలో ఉండి రైతు రుణమాఫీని అమలు చేయలేక పోయారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మేనిఫెస్టోలోని అంశాలతో పాటు చెప్పనివి కూడా అమలు చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఏపీలో ఆర్థిక లోటు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. పేదలు ఆర్థికంగా నిలబడేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. సీఎం జగన్ మంచి పరిపాలన చూసి టీడీపీ ఓర్వలేక పోతోంది' అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. -
హైదరాబాద్ రమ్మంటారా.. విజయవాడ వస్తారా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'చంద్రబాబు .. ఎల్జీ ప్లాంట్‌కు అనుమతులపై చర్చకు వస్తారా అని అడిగారు. మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?' అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. 'రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు. వీళ్లు 20 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తే సీఎం గారు కోటి ఇస్తారు. వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారు. గొప్ప సలహా ఏదైనా ఇస్తే, పాటించకూడదని పట్టుదలకు పోయే స్వభావం కాదాయనది. కానీ వీళ్లకు ఆ స్థాయి ఏదీ?' అంటూ మండిపడ్డారు. అయితే అంతకు ముందు 'అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లైనా ఎవరూ మర్చిపోలేదు' అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ' -
మీ బిడ్డే ముఖ్యమంత్రి.. అన్యాయం జరగనివ్వను
మన పనితీరు పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని గర్వంగా చెప్పగలను. ఇలాంటి దుర్ఘటనల్లో ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలనేది చూపించాం. ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ.. పది రోజుల్లో పరిహారాన్ని నేరుగా బాధితుల చేతుల్లో పెట్టడం గొప్ప కార్యక్రమం. ఇందుకు అధికారులకు అభినందనలు. మీ బిడ్డనే సీఎంగా ఉన్నారు. బాధితులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అన్ని రకాలుగా అండగా ఉంటుంది. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికతో పాటు, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, సందేహాలను కంపెనీకి ఇచ్చి.. వివరణ తీసుకుందాం. ఆ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తాం. బాధ్యులైన వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ దుర్ఘటనలో మరణించిన 12 కుటుంబాల వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగం ఇద్దాం. కనీసం గ్రామ సచివాలయాల్లో అయినా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇందుకు అవసరమైతే నిబంధనలు మారుద్దాం. సాక్షి, అమరావతి: ‘మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వను’ అని విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గ్యాస్ లీక్ దుర్ఘటనకు బాధ్యులెవరైనా సరే వదిలి పెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంపెనీలో మరోసారి అలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే కంపెనీని తరలిస్తామని, ఇప్పటికే 13 వేల టన్నుల స్టైరీన్‌ను కొరియాకు పంపించామని స్పష్టం చేశారు. గ్యాస్ ప్రభావిత ఐదు గ్రామాలు, ఎనిమిది కాలనీల్లో 19,893 మందికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సోమవారం ఆయన కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఇది బాధాకరం.. అందుకే ఇంత పరిహారం ► ఎల్జీ పాలిమర్స్ సంఘటన దురదృష్టకరం. ఎక్కడైనా సరే ఇలాంటివి జరిగితే ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలనేది అధికార యంత్రాంగం చేసి చూపించింది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ ఘటనలో 22 మంది చనిపోయారు. ఆప్పుడు నేను ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా చూశాను. ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఓఎన్జీసీ రూ.20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఇచ్చింది. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున వచ్చింది. ► అలాంటి దుర్ఘటన జరిగినపుడు ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలి? కంపెనీకి ఎలాంటి శిక్ష విధిస్తే ప్రమాదాలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటాయి? అని అలోచించాను. ► ఇలాంటి ఘటనలు విదేశాల్లో జరిగితే, ఎలా పరిహారం ఇస్తారో.. ఇక్కడా అలాగే ఇవ్వాలని కోరాను. పెనాల్టీ భారీగా, షాక్ కొట్టేలా ఉంటుందని ఆ కంపెనీకి భయం ఉంటే, అవి చాలా జాగ్రత్త తీసుకుంటాయని చెప్పి.. కోటి రూపాయలు చొప్పున ఇవ్వాలని నేను ఆ రోజే డిమాండ్ చేశాను. ► ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు ఓఎన్జీసీ సంఘటన గుర్తుకొచ్చింది. అందుకే దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చింది. సత్వరమే స్పందనకు అభినందనలు ► కంపెనీ నుంచి స్టైరీన్ గ్యాస్ లీకేజీ తెల్లవారుజామున చోటుచేసుకుంది. అ సమయంలో అధికార యంత్రాంగం చూపించిన సత్వర స్పందన దేశంలోనే గతంలో ఎక్కడా చూసి ఉండం. 4.30 గంటలకే అధికారులంతా సంఘటనా స్థలికి చేరుకున్నారు. ► 110 అంబులెన్స్‌లు వచ్చాయి. రెండు గంటల వ్యవధిలోనే ఊర్లలో అస్వస్థతకు గురైన వందలాది మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. కలెక్టర్, కమిషనర్, పోలీసులు, వైద్య సిబ్బంది, వైద్యులు.. ఇలా అధికార యంత్రాంగం అందరికీ అభినందనలు. పలు కమిటీలతో అధ్యయనం ► ఈ దుర్ఘటనపై పలు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే పది మంది వైద్య నిపుణులతో కమిటీ వేశాం. బాధితులకు తగిన వైద్య పరీక్షలు, చికిత్స చేసేందుకు ఆదేశాలు ఇచ్చాం. ఇందుకు అవసరమైన ఉపకరణాలు సమకూర్చాం. ► ఇలాంటి దుర్ఘటనల్లో కంపెనీలపై ఏవైనా చర్యలు తీసుకోవాలంటే ముందు నిజమేమిటో తెలియాలి. అదేమిటో తెలుసుకోవడానికి, అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయడానికి ఏం చేయాలనే విషయమై పలు కమిటీలు వేశాం. ► ప్రమాదానికి కారణమైన స్టైరీన్ గ్యాస్.. కంపెనీలో ఉండకూడదనే ఉద్దేశంతో 13 వేల టన్నులను రెండు షిప్‌ల ద్వారా దక్షిణ కొరియాకు తిరిగి పంపించేశాం. అనుమతులన్నీ బాబు హయాంలోనే ► ఈ కంపెనీకి ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా మన ప్రభుత్వం ఇవ్వలేదు. 1996లో ఎల్జీ కెమికల్స్ సంస్థ పాలిమర్స్ కంపెనీని టేకోవర్ చేయడం నుంచి మొదలు 2015లో ఇచ్చిన కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్ సర్టిఫికెట్, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ వరకూ రెన్యువల్స్ కానీ, విస్తరణ ప్రాజెక్టు కానీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చినవే. ► ప్రమాదం జరిగిన తర్వాత ఇవన్నీ వారే చేశారని ఒక్క మాట కూడా అనకుండా సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు విశాఖలోనే ఉండి సహాయ, పునరావాస కార్యక్రమాలన్నీ పర్యవేక్షించారు. మానవతా దృక్పథంతో ఆదుకున్నాం ► బాధితులను ఆదుకునేందుకు ఎంతో మానవతా దృక్పథం ప్రదర్శించాం. చనిపోయిన 12 మంది కుటుంబాలకు పది రోజుల వ్యవధిలోనే దేశంలో మరెక్కడా లేనివిధంగా రూ.కోటి చొప్పున ఇచ్చాం. ► ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఎక్కడా స్ట్రెస్‌కు గురికాకూడదనే ఉద్దేశంతో పెద్దలు, పిల్లలనే భేదం లేకుండా 19,893 మందికి రూ.10 వేల చొప్పున ఇచ్చాం. ► ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం పొందినా సరే రూ.25 వేల చొప్పున, రెండు రోజులకు మించి ఆసుపత్రుల్లో వైద్యం పొందినవారికి రూ.లక్ష చొప్పున, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు సహాయంగా ఇచ్చాం. అధికారులు బాగా పని చేశారు ► ‘గుడ్ జాబ్ వినయ్ (విశాఖ కలెక్టర్).. మీరంతా చాలా బాగా పని చేశార’ని సీఎం అభినందించారు. ‘అ«ధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు చక్కగా పని చేశారు. గ్రామంలో పడుకుంటానని మంత్రి కన్నబాబు స్వయంగా ముందుకు వచ్చారు. ఇది ఎందరికో స్ఫూర్తి దాయకం. నా మంత్రివర్గంలో ఇంత మంచి వారున్నారని నిజంగా సంతోషపడ్డాను. అధికారులకు కృతజ్ఞతలు. అక్కడ ఉన్న వారందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అన్నారు. ► మంత్రి కె.కన్నబాబు స్పందిస్తూ.. ‘మీరు (సీఎం) చరిత్రలో నిలిచిపోతారు. మీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాము. మానవీయ కోణంలోనూ మీకెవ్వరూ సాటిరారు’ అన్నారు. ► ‘ఇంకా 12 ఇళ్లలోని వారి బ్యాంక్ ఖాతాల వివరాలు అందాల్సి ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులతో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రులు, అధికారుల స్పందన బాగుంది గ్యాస్ లీకేజి ప్రమాదం జరిగినప్పటి నుంచి నేటి వరకు అధికారులు, మంత్రుల స్పందన బాగుంది. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ మాలాంటి పేద ప్రజలకు ధైర్యం చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచన ప్రకారం మంత్రులు, అధికారులు సత్వర రీతిలో చర్యలు తీసుకుని మాలో భయాందోళన తగ్గిపోయేలా చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ధైర్యం పెంచారు. స్థానిక గ్రామాల్లోని ప్రజలు ఇప్పడు ఎంతో సంతోషంగా ఉన్నారు. – మామిడి రామకృష్ణ, నందమూరినగర్ కుటుంబ పెద్దలా ఆదుకున్నారు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో బాధితులందరికీ సీఎం జగన్ కుటుంబ పెద్దలా సాయపడ్డారు. తల్లికి కొడుకులా, ఇంటికి పెద్దలా ఆలోచించారు. ఎవరూ ఊహించని విధంగా ఆదుకున్నారు. పాలిమర్స్ కంపెనీ బాధిత కుటుంబాలకు పెద్ద దిక్కయ్యాడు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఎవరూ ఊహించలేనిది. చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, రూ.లక్ష, రూ.25 వేలు ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వారందరికి తలో రూ.10 వేలు ఇచ్చారు. ఇది మాకెంతో మేలు చేస్తోంది. ఇప్పటికే అమ్మఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్.. తదితర ఎన్నో పథకాల ద్వారా పేదలను ఆదుకుంటున్నారు. ఇంత చేస్తున్న నాయకుడికి అండదండగా నిలిచి రుణం తీర్చుకుంటాం. – యల్లపు చంద్రమణి, ఆర్ఆర్వీ పురం కొండంత భరోసాగా అనిపిస్తోంది కుటుంబాన్ని కోల్పోయి బాధల్లో ఉన్న నాకు మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. కొండంత భరోసాగా అనిపిస్తోంది. నా భర్త చనిపోవడంతో చాలా బాధపడ్డాను. కుటుంబ పెద్దను కోల్పోయి ఒంటరి అయ్యాను. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురాడానికి మేము 20 ఏళ్లు చాలా కష్టపడ్డాము. మాకు జరిగిన అన్యాయానికి ఊహించని విధంగా రూ.కోటి ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన నాకు రూ.లక్ష నా ఖాతాలో వేశారు. కుటుంబానికి అండగా నిలిచారు. నా పెద్ద కుమార్తె కొడుకు, నా మనవడు ఎంటెక్ పాసయ్యాడు. ఇతనికి ఉద్యోగం ఇప్పిస్తే నాకు తోడుగా ఉంటాడు. మీ పరిపాలన చాలా బాగుంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. – మేక సుశీల (మృతుడు మేక కృష్ణమూర్తి భార్య), వెంకటాపురం, వెంకటాద్రి గార్డెన్స్ మీరున్నారనే ధైర్యం వచ్చింది ఘటన జరిగిన వెంటనే మాకు ఏమీ అర్థం కాలేదు. అర గంట పాటు ఏం జరిగిందో కూడా తెలియదు. పరుగులు తీసి స్పృహ కోల్పోయి పడిపోయాం. తర్వాత అధికారులొచ్చి మమ్మల్ని ఆస్పత్రుల్లో చేర్చారు. మాలో కొండంత ధైర్యాన్ని నింపారు. మా కుటుంబాలకు అండగా నిలిచారు. మాకు బెహరా కాలేజీలో బస ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటన్న భయం మమ్మల్ని వెంటాడింది. అయితే ఊహించని విధంగా మీరు నష్ట పరిహారం ప్రకటించారు. మీరిచ్చిన భరోసా మాలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికే నాకు అమ్మ ఒడి పథకంలో రూ.15 వేలు వచ్చింది. నా భర్త ఆటోడ్రైవర్. అతనికి రూ.10 వేలు వచ్చాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మా కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.40 వేలు ఇచ్చారు. మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. భవిష్యత్తులో ఏమి జరిగినా మీరున్నారన్న ధైర్యం వచ్చింది. మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి. – పొట్నూరి పరమేశ్వరి ఎస్సీ, బీసీ కాలనీ రోడ్డున పడకుండా ఆదుకున్నారు ఆ రాత్రి గ్యాస్ లీక్ కాగానే పోలీసులు వచ్చారు. సైరన్ మోగించారు. మమ్మల్ని అప్రమత్తం చేశారు. ఆ వెంటనే అధికారులు వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ఆస్పత్రుల నుంచి శిబిరానికి తరలించి మంచి ఆహారం పెట్టారు. చిన్న పిల్లలకు కోడిగుడ్లు కూడా పెట్టారు. మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి మా యోగ క్షేమాలు విచారించారు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. అక్కడి నీళ్లు తాగొద్దని, మంచినీరు సరఫరా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం ప్రకటించారు. గతంలో కొంత పరిహారం ప్రకటించినా, అది ఎప్పుడిస్తారో.. ఎవరిని కలవాలో కూడా తెలిసేది కాదు. కానీ మీరు ప్రకటించిన పరిహారాన్ని మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు మంత్రులు, అధికారులు మా వద్దకు వచ్చి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. – గంగరాజు, పద్మనాభపురం కొంతమంది భయపెట్టారు.. గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగాక, మా లాంటి వారిని ఎవరు ఆదుకోరేమో అని భయపడ్డాము. కొంత మంది అయితే మళ్లీ మా గ్రామాలకు వెళ్లొద్దని చెప్పి భయభ్రాంతులకు గురిచేశారు. ఏం చేయాలో అర్థం కాక ఆందోళనకు గురయ్యాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసాతో మాలో ధైర్యం వచ్చింది. మంత్రులు, అధికారులను రాత్రుళ్లు గ్రామాల్లో బస చేయించడంతో మాలో మానసిక స్థైర్యం మరింత పెరిగింది. వారు మా గ్రామాల్లో బసచేసి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీంతో మాకందరికీ ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. దీంతో స్థానికంగా కొంత మంది చెబుతున్న మాటలు వినడం మానేశాం. మేము ఊహించని విధంగా సాయం చేసిన సీఎంకు ధన్యవాదాలు. – మామిడి గౌరి, నందమూరి నగర్ -
గ్యాస్ లీకేజీ: బాధితుల అకౌంట్లలోకి రూ. 20 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ చాలా బాధాకరమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌కు తమ ప్రభుత్వ హయాంలో ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని... 13 వేల టన్నుల స్టైరీన్‌ను రెండు షిప్పుల ద్వారా వెనక్కి పంపినట్లు తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులతో సీఎం జగన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి బటన్ నొక్కిన సీఎం వైఎస్ జగన్.... ఒకేసారి సుమారు 20 వేల మందికి గ్యాస్ లీకేజీ బాధితుల అకౌంట్లలో పది వేల రూపాయిల చొప్పున మొత్తం 20 కోట్లు జమ చేశారు. విశాఖ కలెక్టరేట్ నుంచి మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజ్, పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జీవీఎంసి కమీషనర్ సృజన, జేసీ వేణుగోపాలరెడ్డి, అరుణ్ బాబు, విశాఖ పశ్చిమ ఇన్ ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, బాధితులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.(22న సీఎం చేతుల మీదుగా) 2 గంటల్లో గ్రామాలు ఖాళీ చేయించారు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలో.. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయారు. ఆ ప్రమాదంలో ప్రమాదంలో సంస్థ రూ. 20 లక్షలు,.. కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం 2 లక్షలు అందించాయి. ఘటన జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటామని.. కంపెనీలకు హెచ్చరిక ఉండేలా ప్రభుత్వాలు స్పందించాలి. ఓఎన్జీసీ ఘటనలో బాధితులకు రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలని కోరాను. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనూ నాకు అదే గుర్తొచ్చింది. అందుకే ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించింది. కలెక్టర్, కమిషనర్‌తో పాటు 110 అంబులెన్స్‌లు కూడా ఘటనా స్థలికి చేరుకున్నాయి. 2 గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అధికారులు స్పందించిన తీరును అభినందనీయం ’’ అని ప్రశంసించారు. మానవతా దృక్పథంతో ముందుకు సాగాం.. ‘‘మనం అధికారంలోకి వచ్చాక ఎల్జీ పాలిమర్స్‌కు ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. ఆ సంస్థకు అనుమతి గాని, విస్తరణ గాని... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. అయినా ఎక్కడా మనం రాజకీయ ఆరోపణలు చేయలేదు. మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని మాత్రమే ప్రయత్నించాం.10 రోజుల్లోపే పరిహారంతో పాటు వైద్య సేవలను పూర్తిగా అందించాం. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజల ఆందోళన చెందకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. ప్రభావిత గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి రూ.10 వేలు ఆర్థికసాయం. వెంటిలేటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షలు ఆర్థికసాయం రెండ్రోజులకు పైగా ఆస్పత్రుల్లో ఉన్నవారికి రూ.లక్ష... ప్రాథమిక చికిత్స చేయించుకున్నవారికి రూ.25 వేలు ఆర్థికసాయం అందించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఫిర్యాదులు ఉంటే స్వీకరించండి ఎల్జీ పాలిమర్స్ ఘటనపై అధ్యయనానికి వేసిన కమిటీలు ఇచ్చే నివేదికల ద్వారా తప్పు ఎవరివల్ల జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కంపెనీకి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభావిత ప్రాంతాల్లో.. ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక శానిటేషన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. బాధితులకు ప్రత్యేక వైద్యసదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాబోయే నెలరోజుల పాటు గ్రామాల్లోనే.. వైద్యులను, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అంతేగాక తాత్కాలికంగా విలేజ్ క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో వైద్య సేవలందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. -
పరిహారం సంపూర్ణం
సాక్షి, విశాఖపట్నం: ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులందరికీ న్యాయం చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు, ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందచేయగా కంపెనీ పరిసరాల్లోని ఐదు ప్రభావిత గ్రామాలు, ఎనిమిది కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆ మేరకు సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.20 కోట్ల మేర పరిహారాన్ని జమ చేయనున్నారు. ► 12 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని ఇప్పటికే జమ చేశారు. ► తీవ్ర అస్వస్థతతో కేజీహెచ్‌లో మూడు రోజులకు పైగా చికిత్స పొందిన 319 మందికి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్న 166 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేశారు. వెంటిలేటర్‌పై ఉన్న ఒకరికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించారు. ► అస్వస్థతతో సీహెచ్‌సీల్లో చికిత్స పొందిన 94 మందికి, కేజీహెచ్‌లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన మరో ఐదుగురికి రూ.25 వేలు చొప్పున చెక్కులు అందజేశారు. ► స్టైరీన్ ప్రభావిత ఐదు గ్రామాలు, పరిసర ఎనిమిది కాలనీల్లో ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామన్న సీఎం హామీ మేరకు అధికారులు తాజాగా ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో 6,297 ఇళ్లు ఉండగా 20,554 మంది నివాసం ఉంటున్నారు. వారికి పరిహారంగా ప్రభుత్వం రూ.20.55 కోట్లు (రూ.20,55,40,000) మంజూరు చేసింది. ► డోర్ లాక్ కారణంగా 163 ఇళ్లల్లో ఎన్యూమరేషన్ జరగలేదు. అవి మినహా 6,134 ఇళ్లలోని 20,013 మందికి సోమవారం రూ.20 కోట్లు (రూ.20,01,30,000) అందజేయనున్నారు. నేడు బ్యాంకు ఖాతాల్లో జమ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాలు, కాలనీల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి అర్హుల జాబితా వార్డు సచివాలయాల్లో ఉంచాం. ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్‌తోపాటు ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యుడి బ్యాంక్ ఖాతా వివరాలను వలంటీర్లు సేకరించారు. దీని ప్రకారం పరిహారం బ్యాంకు ఖాతాలో సోమవారం జమ కానుంది. – డాక్టరు జి.సృజన, కమిషనర్, జీవీఎంసీ మిగతా వారికీ అందజేస్తాం... కొంత మంది ఇప్పటివరకు తమ ఇంటికి తిరిగిరాలేదని ఎన్యూమరేషన్లో గుర్తించాం. డోర్ లాక్ చేసి ఉన్న 163 ఇళ్లల్లోని 541 మందికి కూడా పరిహారం మంజూరైంది. వారు తిరిగి వచ్చిన వెంటనే ఎన్యూమరేషన్ పూర్తిచేసి పరిహారాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. – వి.వినయ్‌చంద్, కలెక్టర్, విశాఖ -
పాలిమర్స్ బాధితులకు నష్టపరిహారం
ఆరిలోవ(విశాఖ తూర్పు)/రాజాం/సంతకవిటి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన దుర్ఘటనలో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన 147 మందికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం చెక్కులు అందజేశారు. ఆరిలోవ హెల్త్‌సిటీ అపోలో ఆస్పత్రిలో మంత్రి ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విచారణ కమిటీ రిపోర్టును ఆధారంగా కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే చంద్రబాబు రాజకీయం చేస్తూ బాధితులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ తిరుపతిరావు పాల్గొన్నారు. మెడికో కుటుంబానికి రూ.కోటి అందజేత ఈ ప్రమాదంలో మృతిచెందిన మెడికో విద్యార్థి అన్నెపు చంద్రమౌళి తల్లిదండ్రులు పద్మావతి, ఈశ్వరరావులకు కూడా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని కావలి గ్రామంలో రూ.కోటి చెక్కును మంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
ఆ గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు
విశాఖపట్నం: ‘విష వాయువు ప్రభావిత గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు.. వారి సంక్షేమం, ఆరోగ్యం విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడండి’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్యాస్ ప్రభావానికి గురైన గ్రామాల్లో పరిస్థితులు, బాధితుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే జిల్లాలో స్టైరీన్ గ్యాస్ తరలింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ గ్యాస్ పీడిత బాధితులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించామని చెప్పారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు అందించడానికి గ్రామస్తుల ఎన్యుమరేషన్ ప్రస్తుతం జరుగుతోందని, ఇది శనివారం సాయంత్రానికి పూర్తవుతుందని తెలిపారు. ఆ జాబితాలను వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించి సోమవారం నాటికి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 18 నాటికి ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అదే రోజు ఉదయం వలంటీర్లు నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి లేఖలు అందించే ఏర్పాట్లు చేయాలని, అదే రోజు లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ చేయాలని స్పష్టం చేశారు. గ్యాస్ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి కారణమైన స్టైరీన్ గ్యాస్‌ను పూర్తిగా అక్కడ నుంచి తరలించాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ వినయ్‌చంద్ జిల్లాలో ఉన్న 13 వేల టన్నుల స్టైరీన్‌ను రెండు ఓడల ద్వారా దక్షిణ కొరియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 8 వేల టన్నుల స్టైరీన్‌ను ఒక ఓడలోకి పంప్ చేయించారు. తాజాగా సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో స్టైరీన్ తరలింపు విషయాన్ని మరోసారి ప్రస్తావించడంతో శనివారం ఉదయానికి మిగతా 5 వేల టన్నుల స్టైరీన్ గ్యాస్‌ను రెండో ఓడలోకి పంప్ చేసి జిల్లా నుంచి తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగాక అధికారులు స్పందించిన తీరు, బాధిత గ్రామాల్లో తీసుకున్న చర్యలు, సత్వర పరిహారం అందేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను సీఎం అభినందించారు. -
స్టైరిన్ పూర్తిగా తరలించాం: కరికాల వలవన్
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్‌ను పూర్తిగా తరలించినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్టైరిస్ గ్యాస్‌తో రెండో వెస్సెల్ వెళుతోందని, పరిశ్రమ చుట్టుపక్కల అయిదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పరిశ్రమ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆహారం, మంచి నీళ్ళు, పాలు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అలాగే విశాఖలో 20 కెమికల్ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించినట్లు కరికాల వలవన్ వెల్లడించారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టామన్నారు. ఇతర జిల్లాల్లో 35 పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టి, నివేదిక కూడా అందించారన్నారు. వాటికి సర్టిఫికెట్లు జారీ చేశాక మాత్రమే తిరిగి ప్రారంభించాలన్నారు. (బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట) కాగా ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చైర్మన్‌గా, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు అయింది. (అణువణువూ శోధన) అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్లు ఇక గ్యాస్ లీకేజీతో అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందిచడానికి, ఇతర సహాయక చర్యలు చేపట్టేందుకు ఎల్జీ పాలీమర్స్ యాజమాన్యం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. గ్యాస్ ప్రభావంతో అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చివవారికి అన్నవిధాలా సాయం అందించనున్నట్లు తెలిపింది. బాధితులకు, వారిక కుటుంబాలకు వైద్యం,నిత్యావసర సరకులు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. గ్రామస్తులు ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు 0891-2520884 0891-252338 వినతులు, వివాదులు, సమస్యలపై ఈమెయిల్ fpicrr@fchem.comకి పంపించవచ్చు. -
‘టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు’
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన పలువురికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బాధితులను పరామర్శించి ప్రభుత్వ పరిహారాన్ని చెక్కుల రూపంలో అందించారు. ప్రభుత్వం కేవలం ఆర్థిక సహాయం ప్రాతిపదికగా కాకుండా పూర్తిగా ఆరోగ్యం నిలకడగా మారేంతవరకు సహాయం అందిస్తుందని దీనికి ఎంత భారమైనా భరించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజయసాయిరెడ్డి ప్రజలను కోరారు. -
బాధితులంతా డిశ్చార్జ్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో వెలువడిన స్టైరీన్ గ్యాస్ ప్రభావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ పూర్తిగా కోలుకున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం 300 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందించి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ► కేజీహెచ్‌లో చేరిన 321 మందిలో 21 మందికి ఆరోగ్యం నయమవడంతో రెండు రోజుల క్రితమే వైద్యులు ఇంటికి పంపించారు. మిగిలిన 300 మందిలో 287 మందికి బుధవారం రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ► బాధితులు గ్రామాలకు వెళ్లడానికి భయపడే అవకాశాలు ఉండడంతో అధికారులు గోపాలపట్నంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని ప్రత్యేక బస్సులలో అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ► బుధవారం రాత్రికి 180 మంది ఆ కేంద్రాలకు వెళితే.. మిగిలిన 107 మంది వారి సొంత వాహనాలలో ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది కూడా గురువారం రూ.లక్ష చెక్కు తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. అధికారులు వీరిని బస్సులో పునరావాస కేంద్రానికి తరలించారు. ► గ్రామాల్లో ప్రస్తుతం స్టైరీన్ అవశేషాలు పూర్తిగా తొలగిపోవడంతో పునరావాస కేంద్రాల్లో 42 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స అందిస్తాం ప్రమాదానికి గురైన మొత్తం బాధితులందరూ గురువారం నాటికి డిశ్చార్జ్ అయిపోయారు. ఎవరికైనా ఏ చిన్న పాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తారు. గతంలో డిశ్చార్జ్ అయిన వాళ్లు నేరుగా కేజీహెచ్‌కు వచ్చినా చికిత్స అందిస్తాం. – అర్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్ -
టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు..
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని.. కానీ అసమర్థ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గ్యాస్ లీకేజ్ బాధితులను గురువారం ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రూరల్ అధ్యక్షులు సరగడం చిన్నప్పల నాయుడు, వైఎస్సార్సీపీ నేతలు ఆదిరెడ్డి మురళీ ఉన్నారు. (‘భవిష్యత్తులో కూడా ఆదుకుంటాం’) టీడీపీ తప్పుడు ప్రచారం.. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఆయన కుమారుడు అప్పల నాయుడు చేస్తోన్న దుష్ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో తండ్రీకొడుకులు నియోజకవర్గాన్ని దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారం దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వకుండానే కంపెనీ తెరుస్తున్నారంటూ టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. (వలస కూలీలపై సీఎం జగన్ ఆవేదన) రూ.10 వేలు పరిహారం.. విష వాయువు ప్రభావిత 5 గ్రామాలు మాత్రమే కాకుండా సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన వివరించారు. గ్యాస్ లీక్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులంతా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు కూడా డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తామని.. ఒక పర్మినెంట్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.10వేల పరిహారాన్ని కూడా ప్రజలకు అందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
‘భవిష్యత్తులో కూడా ఆదుకుంటాం’
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులను పరామర్శించి మానసిక ధైర్యం అందించారని పేర్కొన్నారు. ఐదుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు కూడా బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో భరోసా నింపారన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా బాధితులందరికీ తక్షణ పరిహారం అందించామని మంత్రి పేర్కొన్నారు. (మార్గదర్శకాలను పాటించాలి: కేంద్ర బృందం) స్టైరిన్‌ను కొరియా తరలించాం.. బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించామని, వైఎస్సార్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి అవంతి వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదానికి కారణమైన స్టైరిన్ కూడా కొరియా కు తరలించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, బాధిత గ్రామ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. (‘ఆ దిశగా ఆలోచిస్తే బాగుండేది’) -
‘టీడీపీ జూమ్ పార్టీలా మారింది’
సాక్షి, విశాఖపట్నం : గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని శాఖలు సత్వరం స్పందించడంతో నష్టం తగ్గిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో బాధితులందరికి పరిహారం కూడా అందించామని చెప్పారు. ఆస్పత్రుల్లో బాధితులందరికీ వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రెండు రోజులుగా బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి ఉందన్నారు. ఎరవరికీ సమస్యలు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగిలిన వారికి కూడా పరిహారం అందిస్తామన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే.. ఒక్క టీడీపీ నేత కూడా సహాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. టీడీపీ ఇప్పుడు జూమ్ పార్టీలా మారిందన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో జూమ్ ద్వారా మెసేజ్‌లు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ నియమించామని, నివేదిక వచ్చిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని బొత్స వ్యాఖ్యానించారు. -
దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్యాకేజీ
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దమ్మున్న సీఎం అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారం రాత్రి విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు, రెండు రోజులకు మించి ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.లక్ష చొప్పున.. ఊహించనంత పరిహారం అందజేయడం, ఎల్జీ పాలిమర్స్‌లో ఉన్న 13 వేల టన్నుల స్టైరీన్ గ్యాస్‌ను దక్షిణ కొరియాకు వెనువెంటనే తరలించడం వంటి చర్యలు ఆయన దమ్మున్న సీఎం అనే విషయాన్ని మరోసారి రుజువు చేశాయన్నారు. ఇంకా ఏం చెప్పారంటే.. ► గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశంలో మరే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దేశ చరిత్రలో ఇదే అతి పెద్ద ప్యాకేజీ. ► మృతుల్లో 8 కుటుంబాల వారికి రూ.కోటి చొప్పున చెల్లించాం. నలుగురి కుటుంబ వారసులకు గురువారం అందజేస్తాం. ► కేజీహెచ్‌లో రెండు రోజులకు పైగా చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ మేరకు రూ.లక్ష చెల్లిస్తున్నాం. ప్రమాదం జరిగిన ఐదు రోజుల్లోగానే పరిహారం చెల్లించిన ఘనత జగన్‌కే చెల్లింది. ► బాబు హయాంలో నగరంలో జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటన, పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ సరదా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ఎంత పరిహారమిచ్చారో ఆయన గుర్తు చేసుకోవాలి. ► ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో బాబు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ► ఎల్జీ పాలిమర్స్ కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్‌కు బాబే అనుమతులిచ్చారు. 2015లో 128 ఎకరాల అప్పన్న భూములను చంద్రబాబే ధారాదత్తం చేశారు. దీనిపై చర్చకు వస్తారా? బాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు పోతిరెడ్డిపాడుపై ఈనెల 5నే జీవో విడుదల చేసినా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇప్పటివరకు తన అభిప్రాయాన్ని ఎందుకు చెప్పలేదని ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేని ప్రతిపక్ష నేత ఒక నేతా అని నిలదీశారు. ► విశాఖకు వ్యతిరేకంగా ఆయన ఎంతకైనా తెగిస్తారు. అందులోభాగంగానే ఎల్లో మీడియాలో కుట్రపూరిత రాతలు రాయిస్తున్నారు. అమరావతిపై ప్రేమతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. ► విలేకరుల సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మృతుని భార్యకు రూ.కోటి చెక్కు స్టైరీన్ లీకైన ఘటనలో మృతి చెందిన ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత మేనేజర్ గంగాధర చౌదరి భార్య ఎస్.లక్ష్మికి రూ.కోటి చెక్కును ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం అందజేశారు. మృతుని భార్య లక్ష్మి మాట్లాడుతూ ఇంత త్వరగా పరిహారం అందిస్తారని ఊహించలేదని అన్నారు. -
అందరి ఆర్యోగానికి భరోసా
సాక్షి, విశాఖపట్నం: ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన, షెల్టర్ల నుంచి ఇళ్లకు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నెల రోజులపాటు నిర్వహించనున్నారు. గ్రామాల్లో అంబులెన్స్‌లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెనువెంటనే ఆస్పత్రులకు తరలిస్తారు. 20 పడకలతో వైఎస్సార్ క్లినిక్ ► వెంకటాపురం గ్రామంలో 20 పడకల సామర్థ్యంతో వైఎస్సార్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండేలా.. శాశ్వత భవన నిర్మాణం జరిగే వరకూ తాత్కాలికంగా ఉన్నత పాఠశాల వద్ద దీనిని నిర్వహిస్తారు. ప్రాథమిక వైద్య చికిత్స నిర్వహించేందుకు వైద్యులు, స్టాఫ్ నర్సులను, ఇతరత్రా నర్సింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు. ► గోపాలపట్నం సీహెచ్‌సీ, పెందుర్తి ప్రభుత్వాస్పత్రి రిఫరల్ ఆస్పత్రులుగా ఉంటాయి. అక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు వెంటలేర్లు అందుబాటులో ఉంచారు. ► ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యక్షతన 10 మంది నిపుణులైన వైద్యులతో కమిటీ నియమించారు. స్టైరీన్ ప్రభావం వల్ల బాధితుల్లో ఎవరికైనా కళ్లు, ఊపిరితిత్తులు, శ్వాస, చర్మం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయోమే పరీక్షించేందుకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, పల్మనాలజిస్టు, ఆప్తమాలజిస్టు, డెర్మటాలజిస్టులతో పాటు పీడియాట్రిక్స్, కమ్యూనిటీ మెడిసిన్ వైద్య నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ► మానసిక సమస్యలు తలెత్తితే వైద్యమందించేందుకు సైకియాట్రిస్ట్ కమిటీలో ఉన్నారు. ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఈ కమిటీ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకయ్యే ఖర్చులను వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వమే భరిస్తుంది. ► గ్యాస్ ప్రభావిత ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలతో డేటా (బేస్‌లైన్ రిపోర్ట్) సేకరిస్తారు. దీని ఆధారంగా వైఎస్సార్ హెల్త్ మానిటరింగ్ కార్డు జారీ చేస్తారు. ► ఈ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి వైద్యానికి ఆంధ్రా మెడికల్ కాలేజీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ► రానున్న వారంలో రెండుసార్లు, తర్వాత నెలలో 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత నుంచి నెలకొకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వివరాలతో ఏఎంసీ వద్ద డేటాను అప్డేట్ చేస్తారు. ► అన్ని వయసుల వారికి హిమోగ్లోబిన్, లివర్, కిడ్నీల పనితీరు పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు తీస్తారు. ► గర్భిణులకు స్కానింగ్ చేసి తరచూ పరీక్షలు చేస్తారు. బిడ్డ పుట్టాక ఏడాదిపాటు ఎదుగుదలను పర్యవేక్షిస్తారు.. ఏడాది తర్వాత కూడా ఏమైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే జీవితాంతం వైద్యం అందిస్తారు. 15 వేల హెల్త్ కార్డులు గ్యాస్ లీకేజీ బాధితులతో పాటు వెంకటాపురం, నందమూరి నగర్, కంపర పాలెం, ఎస్సీ, బీసీ కాలనీ, పద్మనాభ నగర్ గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో వీటిని తయారు చేయించే పనిని అధికారులు శరవేగంగా చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లోనే ముద్రణ పూర్తి చేసి ఆ గ్రామాల ప్రజలకు అందజేస్తారు. బాధితులకు గులాబీ కార్డులు, గ్రామ ప్రజలకు తెల్ల కార్డులు జారీ చేస్తారు. రూ.లక్ష చొప్పున పరిహారం అందజేత కేజీహెచ్ నుంచి 287 మంది డిశ్చార్జ్ 282 మందికి చెక్కుల పంపిణీ ఎల్జీ ఘటన బాధితురాలికి బుధవారం లక్ష రూపాయల చెక్కుఅందిస్తున్న మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు స్టైరీన్ ప్రభావానికి గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్లో పూర్తిగా కోలుకున్న 287 మందిని బుధవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. వారిలో 282 మందికి రూ.లక్ష చొప్పున పరిహారాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు పంపిణీ చేశారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు, మూడు రోజులు దాటి చికిత్స పొందే వారికి రూ.లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ.25 వేలు, ఐదు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించిన విషయం విదితమే. ప్రమాదానికి గురైన తమకు మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు రూ.లక్ష పరిహారం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. కేజీహెచ్‌లో ఇంకా 13 మందికి వైద్యం అందిస్తున్నారు. -
వక్రీకరణ అలా.. వాస్తవం ఇలా
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా స్టైరీన్ వాసన వస్తోందా.. ఇళ్లలో ఊపిరి (గాలి) అందడం లేదా.. ఉండలేకపోతున్నారా.. పెద్ద సంఖ్యలో జనం ఇంకా ఆసుపత్రులకు వస్తున్నారా.. సమీపంలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోని నీటిపై గ్యాస్ పేరుకుపోయిందా.. ఓ వర్గం మీడియాలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనా? నిజంగానే అక్కడ ఇంకా అంత ప్రమాదకర పరిస్థితి ఉందా? స్టైరీన్ గ్యాస్ ఇంకా తన ప్రతాపం చూపుతోందా? ఇంతకూ ఏది వక్రీకరణ.. ఏది వాస్తవమో తెలుసుకుందాం. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం వలంటీర్‌పై స్టైరీన్ ప్రభావమా? వక్రీకరణ : ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి ఆనుకుని ఉన్న వెంకటాపురం గ్రామంలో విషవాయువు ప్రభావం ఇంకా ఉందని, కొందరికి ఊపిరి అందడం లేదని.. ఈ క్రమంలో వార్డు వలంటీర్ నూకరత్నం స్పృహ తప్పి పడిపోయిందని ఓ వర్గం మీడియాలో పేర్కొన్నారు. వాస్తవం: వెంకటాపురం నడి బొడ్డున ఉన్న సచివాలయంలో వార్డు వలంటీర్ నూకరత్నం.. ప్రమాదం జరిగాక శనివారం మొదలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 దాటే వరకు నిరంతరాయంగా విధులు నిర్వర్తించింది. మంగళవారం ఉదయం కూడా ఎన్యూమరేషన్లో భాగంగా తనకు కేటాయించిన 50 ఇళ్లకు వెళ్లి వచ్చారు. 11 గంటల సమయంలో గ్రామ సచివాలయానికి మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ రావడంతో సచివాలయ గది జనంతో కిక్కిరిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె డీ హైడ్రేషన్‌తో బీపీ పెరిగి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జీవీఎంసీ ఏఎంహెచ్‌వో లక్ష్మీ తులసి ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత గోపాలపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు చికిత్స తీసుకుని తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. ఇబ్బంది ఉంటే మేమెలా పని చేయగలం? ప్రతి రోజూ వెంకటాపురం ఊరు మధ్యలో ఉన్న వార్డు సచివాలయంలోనే పని చేస్తున్నాం. రమాదేవి, ఆశాజ్యోతి, సత్య తులసితో పాటు సచివాలయ ఇన్చార్జ్ బాధ్యుడిగా నాతో సహా అందరం అక్కడే పని చేస్తున్నాం. ఘటన తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు మొదట్లో కాస్త వాసన వచ్చింది. తర్వాత ఎలాంటి వాసన రావడం లేదు. నిజంగా ఇబ్బందికర పరిస్థితులుంటే మేమెలా పనిచేయగలం? – నాయుడు, వెంకటాపురం వార్డు సచివాలయం ఇన్చార్జ్ ఊపిరి అందనంతటి విషమ పరిస్థితి ఉందా ? వక్రీకరణ : ఆ గ్రామాల్లోని ఇళ్లలో ప్రజలకు ఊపిరి ఆడటం లేదు. జనం పెద్ద సంఖ్యలో గోపాలపట్నం ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. (ఓ దినపత్రికలో వార్త) వాస్తవం: ‘నిజానికి ఊపిరి అందని విషమ పరిస్థితి ఎవరికీ లేదు. చిన్న చిన్న సమస్యలతో వచ్చి చికిత్స (ఇంజక్షన్) చేయించుకుని మందులు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇంత వరకు ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదు. అంతా ఓపీ (అవుట్ పేషెంట్) విభాగానికి వచ్చి వెళ్లిపోతున్నారు’ అని గోపాలపట్నం ఆసుపత్రి ఇన్చార్జ్ డాక్టర్ శాంతిప్రభ స్పష్టం చేశారు. ’ఊపిరి అందడం లేదు..’ అని రాయడం సరికాదు.. నేను ఓ డాక్టర్‌గా చెబుతున్నాను.. అలా ఎలా రాస్తారో నాకు అర్థం కావడం లేదు. గ్యాస్ లీకైన నాలుగైదు రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఇళ్ల తలుపులు ఒక్కసారిగా తెరిస్తే.. అప్పటి వరకు మూసుకుపోయిన గదుల్లోని గ్యాస్ కాస్త బయటకు వస్తుంది. ఆ ప్రభావంతో కొందరు కొద్ది క్షణాలు ఇబ్బంది పడి ఉండొచ్చు. అలాంటి వారు మా వద్దకు వస్తే ప్రాథమిక చికిత్స చేసి పంపించేస్తున్నాం. అంతే కానీ ఊపిరి అందని పరిస్థితి ఎవ్వరికీ లేదు. నిజానికి నాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఓ మాట చెబుతాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచితనాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా ఇంత చేసినా ఇంకా రాజకీయాలు చేస్తున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. స్టైరీన్ లేదని ప్రతీ రిపోర్టులో వచ్చింది ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి రోజూ నీటి శాంపిళ్లు ల్యాబొరేటరీకి పంపించాం. 7, 8 తేదీల్లో తీసిన శాంపిళ్ల రిపోర్టుల్లో స్టైరీన్ లేదని వచ్చింది. ఇప్పటికీ నీటిని పరీక్షలకు పంపిస్తున్నాం. నిజంగా స్టైరీన్ నీటిలో కలిసిపోతే.. అందులోని చేపలు, ఇతర జీవులన్నీ ఇప్పటికే చనిపోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతి రిపోర్టులోనూ స్టైరీన్ మోతాదు లేనట్లు నివేదిక వచ్చినా, నీటిని ఒకటికి రెండు సార్లు శుద్ధి చేశాకే సరఫరా చేస్తాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ మేఘాద్రిగెడ్డపై ‘విష’ ప్రచారం వక్రీకరణ: ఘటన జరిగిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాద్రిగెడ్డలో విషవాయువు స్టైరీన్ కారణంగా నీటిపై పచ్చని రంగు తెట్టు ఏర్పడిందంటూ ఓ పత్రికలో ఫొటో ఐటం వచ్చింది. వాస్తవం: నీటిపై రంగు తెట్టు కాదు.. నాచు ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఎల్జీ పాలిమర్స్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నుంచి నగరంలోని 45, 46, 47, 48, 49వ వార్డుల్లోని 6,590 ఇళ్లకు నీటిని సరఫరా చేస్తుంటారు. అదేవిధంగా ఆర్మీకి చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్), తూర్పు నౌకాదళానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్టŠస్(డీజీఎన్‌పీ)కు బల్క్ నీటి కనెక్షన్ అందిస్తున్నారు. మొత్తంగా మేఘాద్రిగెడ్డ నుంచి 8 మిలియన్ గ్యాలన్ల నీటిని ప్రతి రోజూ సరఫరా చేస్తుంటారు. ► ఈ నెల 7వ తేదీన దుర్ఘటన జరిగిన వెంటనే నీటి సరఫరా నిలిపేశారు. ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించేలా జీవీఎంసీ నీటి సరఫరా విభాగం చర్యలు తీసుకుంది. ► మేఘాద్రిగెడ్డలోని నీరు విషతుల్యం అయ్యిందా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు జీవీఎంసీ చర్యలు ప్రారంభించింది. విశాఖలోని రీజనల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ప్రతినిధులు ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆ నీటి శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకెళ్లారు. ► 7, 8వ తేదీల్లో తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్ మోనోమర్ అవశేషాలు లేవని స్పష్టం చేశారు. నీటిలో ఉన్న లవణాలు, ఇతర వాల్యూస్ అన్నీ.. వినియోగించేందుకు సురక్షితంగా ఉన్నాయని రిపోర్టులో స్పష్టం చేశారు. స్టైరీన్ కలిసి ఉంటే జలచరాలు చనిపోలేదే! రీజనల్ లేబొరేటరీ ఇచ్చిన తొలి రోజు రిపోర్టు, ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే.. నీటిలో ఎలాంటి విషవాయువు అవశేషాలు కలవలేదని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ నీరు కలుషితమై ఉంటే అందులో ఉండే జలచరాలు మృత్యువాత పడేవి. కానీ అది జరగలేదు. స్టైరీన్ బరువైన వాయువు కాబట్టి నీటి ఉపరితలంపై పొరలా ఏర్పడిందనుకుంటే నీటిలోని ఆక్సిజన్ తగ్గి ఉండాలి. ఫలితంగా జలచరాలు మృత్యువాత పడి ఉండాలి. కానీ అదేమీ జరగలేదు. నిల్వ ఉండే నీటిలో నాచు ఉండదా? మేఘాద్రిగెడ్డ నీటిని 7వ తేదీ నుంచి వాడటం లేదు. గేటు సమీపంలో ఎప్పటికప్పుడు నాచు ఏర్పడుతుంటుంది. దాన్ని 10 రోజులకోసారి శుభ్రం చేస్తుంటాం. ఘటన జరిగిన తర్వాత.. ఆ నీటిని పూర్తిగా వినియోగించడం లేదు. నిల్వ ఉండే నీటిలో నాచు ఏర్పడటం సహజం. దానిని చూసి.. రంగు పొరలు ఏర్పడ్డాయనడం సరికాదు. భయపడాల్సిన అవసరం లేదు. – వేణుగోపాల్, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్ఈ నాచు ఎందుకు ఏర్పడిందంటే.. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 61 అడుగులు కాగా, ప్రమాదం సంభవించే సమయానికి 57.5 అడుగుల నీటి మట్టం ఉంది. 9వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి మరో అడుగు నీరు రిజర్వాయర్‌లో చేరి ప్రస్తుతం 58.6 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి గెడ్డల్లో నీరు రిజర్వాయర్‌లో చేరినప్పుడు గెడ్డల నుంచి వచ్చే నాచు ఇక్కడ పొరలుగా ఏర్పడిందే తప్ప.. విషవాయువు ప్రభావం వల్ల కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఊపిరి అందనిది ఎల్లో బ్యాచ్‌కే : బొత్స చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ దుర్ఘటన జరిగిన వెంటనే బాధితులకు పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లింపుతో పాటు శరవేగంగా పునరావాసం, నష్ట నివారణ చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. అయితే జనానికి మంచి చేస్తే చూడలేని విషపు మీడియా ఇష్టారాజ్యంగా కథనాలు వండి వారుస్తోంది. అందులో భాగంగానే ‘ఈనాడు’లో అసత్య వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. వెంకటాపురం గ్రామానికి చెందిన కొద్ది మంది ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే.. గ్రామాల్లో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు రాయడం అమానుషం. ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా.. అధికారులకు మార్గదర్శకం చేసే విధంగా వార్తలు ఉండాలి కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా విషం చిమ్మడం సరికాదు. బాబు జమానాలో అరకొర పరిహారం అందులోనూ జాప్యం.. హుద్‌హుద్ తుపాన్, విశాఖ తుపాన్ విరుచుకుపడిన తేదీ: 2014 అక్టోబర్ 13 మృతులు: 46 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా: రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ: 2015 జనవరి 20 (వంద రోజుల తర్వాత ఇచ్చారు) గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, రాజమండ్రి ఘటన జరిగిన తేదీ: 2015 జూలై 14 మృతులు: 29 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా: రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ: క్షతగాత్రులకు 4 నెలల తర్వాత అరకొరగా చెల్లింపు కృష్ణా నదిలో బోటు మునక, విజయవాడ ఘటన జరిగిన తేదీ: 2017 నవంబర్ 12 మృతులు: 21 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ : 2017 నవంబర్ 30 తిత్లీ తుపాన్, ఉత్తరాంధ్ర తుపాన్ విరుచుకుపడిన తేదీ: 2018 అక్టోబర్ 11 మృతులు: 8 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 నవంబర్ 6 గోదావరిలో బోటు మునక, వాడపల్లి–మంటూరు, తూర్పుగోదావరి జిల్లా ఘటన జరిగిన తేదీ: 2018 మే 17 మృతులు : 22 మంది ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 మే 28 స్కూల్ ఆటో బోల్తా, ఫిరంగిపురం, గుంటూరు జిల్లా ఘటన జరిగిన తేదీ: 2017 డిసెంబర్ 28 మృతులు : ఐదుగురు విద్యార్థులు,ఆటో డ్రైవర్ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 మార్చి 31 అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరేచర్లలో జరిగిన పాదయాత్రలో దీనిపై అప్పటి సీఎం చంద్రబాబును నిలదీశారు. దీంతో కొద్ది నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాలో మూడు లక్షలు కోత పెట్టి రూ.2 లక్షలు చెల్లించింది. గ్యాస్ పైప్‌లైన్ పేలుడు, నగరం, తూ.గో. జిల్లా మృతులు: 22 మంది ఘటన జరిగిన తేదీ : 2014 జూన్ 27 ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా : రూ.3 లక్షలు ఇచ్చిన తేదీ: 2014 జూన్ 30 (గెయిల్, కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల్లోనే ఎక్స్‌గ్రేషియా చెల్లించటంతో రాష్ట్ర వాటా పరిహారం అదే రోజు ఆ మొత్తంతో కలిపి ఇచ్చారు.) ఇప్పుడు విశాఖ ఘటనలో.. రూ. కోటి పరిహారం 5 రోజుల్లో చెల్లింపు -
విశాఖకు ఎల్జీ ఉన్నత స్థాయి బృందం రాక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరిపేందుకు దక్షిణ కొరియా నుంచి యాజమాన్యం తరఫున 8మందితో కూడిన ఉన్నతస్థాయి బృందం బుధవారం విశాఖ చేరుకుంది. వీరంతా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక విమానంలో ఉదయం 11.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ వారికి కోవిడ్-19 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆ బృందం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌కు చేరుకుంది. (ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు) ఎల్జీ కెమికల్స్ ప్రెసిడెంట్ నోహ్ కుగ్ లే ఆధ్వర్యంలో ఎనిమిది మంది ప్రతినిధుల బృందం కంపెనీని సందర్శించింది. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపింది. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాతే వారికి ఎలాంటి సహయ సహకారం అందిస్తారనే విషయాలను స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వనుంది. స్థానిక అధికార యంత్రాంగం ద్వారా నష్టపోయిన కుటుంబాలకు సహాయం చేస్తామని ఎల్జీ యాజమాన్యం ప్రకటించింది. (విశాఖలో సాధారణ పరిస్థితులు) -
ఊహించని విధంగా ఎల్జీ పాలిమర్స్‌పై చర్యలు
సాక్షి, విశాఖపట్నం: ఎవరూ ఊహించని విధంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కంపెనీలో భద్రతాపరంగా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం వైఫల్యమే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో శాశ్వత వైఎస్సార్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కుట్రలను నమ్మవద్దని కోరారు. ప్రభావిత గ్రామాల్లో అయిదుగురు మంత్రులు, ఎంపీలు బస చేసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు యథాస్థితికి వచ్చేవరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. స్వార్థపూరిత రాజకీయాలకు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయొద్దని హితవు పలికారు. చంద్రబాబు అబద్దాల ప్రచారం మానుకోవాలని సూచించారు. తప్పుడు కథనాలతో తప్పుదోవ పట్టించొద్దు: కన్నబాబు మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలోనైనా ఈనాడు విలువలు పాటించాలన్నారు. బాబును సంతోష పరిచే ఎజెండాలో భాగంగా ఈనాడు తప్పుడు కథనాలు ఇస్తుందని ధ్వజమెత్తారు. భయానక వాతావరణం ఉందని చిత్రీకరించి తప్పుడు వార్తలతో ప్రజలని తప్పుదోవ పట్టించద్దని కోరారు. చంద్రబాబు హయాంలో విశాఖపై సవతి ప్రేమ చూపించారు.. కానీ ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. అమరావతి కోసం విశాఖను నిలువెల్లా మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు విద్యుత్ బిల్లులు పెంచారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజ్‌పై ఇకనైనా రాజకీయం మానేయండని సూచించారు. ఈ ఘటనలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులంతా కోలుకున్నారని తెలిపారు.స్టైరిన్ తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఒక టన్ను స్టైరిన్ కూడా ఉండడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. -
ఈ కమిటీలన్నీ చంద్రబాబు చెబితే వేశారా?
సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీక్ ఘటన బాధితులలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులంతా కోలుకున్నారని చెప్పారు. డిశ్చార్జ్ అవుతున్న అందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం అందించామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనంత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ఇస్తే.. చంద్రబాబు నాయుడు హోమ్ క్వారంటైన్లో ఉండి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి : విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు) ‘ గ్యాస్ లీక్ ఘటన జరిగిన గంటల్లోనే సీఎం జగన్ బాధితులను పరామర్శించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ అందించనంత రూ.కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. బాధితుల్లో భరోసా నింపేందుకు గ్రామాల్లో మంత్రుల కమిటీ బస చేసింది. స్టెరిన్ తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఒక్క టన్ను స్టెరిన్ కూడా ఉండడానికి వీల్లేదని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. ఇంట్లో కూర్చొని చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా నగరం ప్రమాదంలో 21 మంది చనిపోయారు. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ వల్ల 29 మంది చనిపోయారు. అప్పుడు వారికి చంద్రబాబు ఎలాంటి సహాయం అందించారు.. ఇప్పుడు సీఎం జగన్ ఎలాంటి సహాయం అందించారో చర్చకు సిద్ధమా’ అని టీడీపీ నేతలకు మంత్రి కన్నబాబు సవాల్ విసిరారు. టీడీపీకి సంబంధించిన ఏ నిపుణడు వచ్చినా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే చంద్రబాబు ఈ రోజు టీడీపీ సమావేశంలో డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఘటన జరిగిన వెంటనే 6 కమిటీలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించాం.. ఈ కమిటీలు అన్ని చంద్రబాబు చెబితేనే వేశామా అని ప్రశ్నించారు. సింహాచల భూములను డీనోటిఫై చేసి ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి అప్పగించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. మంతనాలు, లాలూచీ పడే అలవాటు చంద్రబాబుకు మాత్రమే ఉందని కన్నబాబు విమర్శించారు. -
కుట్రలు చేయడమే చంద్రబాబు పని
సాక్షి, విశాఖపట్నం : ప్రతీ విషయాన్ని రాజకీయకోణంలో చూసి కుట్రలు చేయడమే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పని అని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి బాధితులని ఆదుకునే ప్రయత్నం చేసిందో గమనించుకోవాలన్నారు. బుధవారం గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బాధిత గ్రామాలలో ప్రస్తుతం సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి బాధిత గ్రామాలలో 24 గంటలపాటు పనిచేసేలా వైద్య బృందాలను ఏర్పాటు చేశాం. ఆయా గ్రామాల ప్రజలకోసం 15 పడకలతో వైఎస్సార్ క్లీనిక్ ప్రారంభిస్తున్నాం. సంఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు ప్రజల భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఎల్జీ పాలిమర్స్‌లో ఉన్న స్టైరిన్‌ని వెనక్కి పంపిస్తున్నాం. ఇప్పటికే ఫ్యాక్టరీలోఉన్న స్టైరిన్‌ని ట్యాంక్‌ల ద్వారా పోర్టుకి తరలించాం. ( విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు ) పోర్టు నుంచి దక్షిణ కొరియాకి షిప్ ద్వారా తరలిస్తున్నాం. విశాఖలో మిగిలిన స్టైరిన్‌ను సైతం ఒకటి రెండు రోజులలో మరో షిప్ ద్వారా తరలిస్తాం. బాధిత గ్రామాలలో ప్రజల ఆరోగ్య సమస్యలపై ధీర్ఘకాలం పనిచేసేలా ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో 10 మంది వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రం లోపు కోలుకున్న బాధితులని కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే బాధితులకి అందజేసి బస్సులలో గ్రామాలకి తరలిస్తాం. ఒక్క టన్ను స్టైరిన్ కూడా ఉండటానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు’’ అని అన్నారు. -
విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వెంకటాపురంలో 10 పడకలతో వైఎస్సార్ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్య నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు బాధిత గ్రామాలలో 24 గంటలలో పాటు 3 షిఫ్టులలో 6 వైద్య బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ బృందం ప్రజల ఆరోగ్య సమస్యలపై దీర్ఘకాలికంగా పర్యవేక్షించడానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించామన్నారు. ఈ వైద్య నిపుణుల కమిటీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను పరీక్షించడంలో దీర్ఘకాలికంగా పనిచేస్తుందని చెప్పారు. (బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు) ఇందులో న్యూరో, పల్మనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కంటి, జనరల్ మెడిసిన్, పాథాలజీ, చిన్న పిల్లల వైద్య నిపుణులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ కమిటీకి తాను చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యలపై ఈ కమిటీ అధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయమైన పద్దతిలో అధ్యయనం చేయడమే కాకుండా నిరంతరాయంగా పర్యవేక్షణ చేయనున్నామన్నారు. ఇక బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వారి ఆరోగ్యంపై ఇబ్బందులు రాకుండా ఈ నిపుణుల కమిటీ పనిచేస్తుందన్నారు. స్టెరైనా గ్యాస్ వ్యవహారం, బాధితుల భవిష్యత్తు వైద్య సమస్యలపై ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రాజీవ్ గర్గ్, ఇన్సిట్యూట్ ఆప్ న్యూక్లియర్ మెడిసిన్ నిపుణులతోనూ చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. (‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’) -
ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరిన్ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్ను జిల్లా యంత్రాంగం గుర్తించింది. మంగళవారం రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా స్టైరిన్ అధికారులు తరలిస్తున్నారు. 13వేల టన్నుల స్టైరిన్ దక్షిణ కొరియాకు తరలిస్తున్నామని విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. (విశాఖలో నెలరోజుల పాటు మెడికల్ క్యాంప్) ఎల్జీ పాలిపర్స్ వద్ద ఉన్న యమ్ 5,111ఏ, 111బీ ట్యాంకులలోని 3209 స్టెరైన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. నిన్నరాత్రి నుంచి 20 టన్నుల చొప్పున ఫ్యాక్టరీ నుంచి స్టెరైన్‌ని రోడ్డు మార్గంలో అధికారులు తరలించారు. పోర్టు ప్రాంతంలో టీ2, టీ3 ట్యాంకులలో ఉన్న 9869 టన్నుల స్టెరైన్‌ని వెనక్కి పంపించేందుకు పోర్టు అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడారు. టీ2, టీ3 ట్యాంకుల నుంచి 7919 టన్నుల స్టెరైన్‌ని వెజల్ అర్హన్‌లోకి లోడింగ్ పూర్తి చేశారు. మిగిలిన స్టెరైన్‌ని వెజల్ నార్డ్ మేజిక్ ద్వారా మే 17 లోపు దక్షిణకొరియా తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. (స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు) -
ప్రభుత్వం బస.. పల్లెలకు భరోసా
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావిత ఐదు గ్రామాల ప్రజలు ఐదు రోజుల తర్వాత మంగళవారం సరికొత్త ఉదయాన్ని చూశారు. సోమవారం రాత్రి వారి మధ్యనే మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బస చేసి కొండంత భరోసా ఇచ్చారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీవీఎంసీతోపాటు అన్ని విభాగాల అధికారులు కంటిమీద కునుకు లేకుండా ఆయా గ్రామాల్లో రాత్రంతా కాపలా కాశారు. సోమవారం రాత్రి ఇళ్లకు చేరుకున్న గ్రామస్తులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నైతిక స్థైర్యం కల్పించారు. ఆ గ్రామాల్లో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రజాప్రతినిధుల నిద్రతో ఆ ప్రాంతాల్లో నవోదయం వెల్లివిరిసింది. ఐదు రోజుల్లోనే గ్రామస్తుల దైనందిన జీవనం యథావిధిగా ప్రారంభమైంది. ఉదయాన్నే చాలామంది నిర్భయంగా మార్నింగ్ వాక్కు వెళ్లారు. కిరాణా, పాలు, కూరగాయలు తదితర షాపులన్నీ తెరుచుకున్నాయి. దినపత్రికలు సరఫరా అయ్యాయి. గ్రామాల్లో మంత్రుల నిద్ర ఆ ఐదు గ్రామాల్లో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్ సోమవారం రాత్రి బస చేశారు. గ్రామస్తులతో ముచ్చటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సాధకబాధకాలు తెలుసుకున్నారు. రాత్రి వారితోనే కలిసి భోజనం చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు: కన్నబాబు వెంకటాపురం: జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు సోమవారం రాత్రి 8 గంటలకు వెంకటాపురం చేరుకున్నారు. గడపగడపకూ తిరిగారు. గ్రామస్తులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు వెంకటాపురంలోనే ఒక ఇంట్లో నిద్ర చేశారు. ఉదయం 6 గంటలకు లేచి రెడీ అయ్యి మళ్లీ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం అన్నివిధాలా గ్రామస్తులను ఆదుకుంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. కాలుష్యం కారణంగా భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కొంతమంది ఆందోళన వ్యక్తం చేయగా.. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు శాఖల వైద్యాధికారులు గ్రామాల్లోనే ఉంటారని చెప్పారు. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాథమిక శిబిరాల్లో పరీక్షలు నిర్వహించి అవసరమైతే పెద్దాస్పత్రులకు పంపించడం జరుగుతుందన్నారు. కన్నబాబు వెంట మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఉన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుంది: ముత్తంశెట్టి పద్మనాభనగర్‌లో: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం రాత్రి 8 గంటలకు గ్యాస్ పీడిత గ్రామాలను సందర్శించారు. వెంకటాపురం, పద్మనాభనగర్లలో స్థానికులతో మాట్లాడారు. అనంతరం రాత్రి 10 గంటలకు గ్రామస్తులతో కలిసి భోజనం చేసి పద్మనాభనగర్లోని ఒక ఇంట్లోనిద్రించారు. ఉదయం 5.45 గంటలకు లేచి గ్రామంలో తిరిగారు. ఆవులకు పశుగ్రాసం వేశారు. బోర్ వాటర్‌ను పరిశీలించారు. అనంతరం ఇళ్లకు వెళ్లి స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఉన్నారు. 9 గంటలకు మిగిలిన నాలుగు గ్రామాలు కూడా సందర్శించి అక్కడ పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కంపెనీ మూతపడే ఉంది: బొత్స నందమూరి నగర్లో: మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాత్రి 8 గంటలకు నందమూరినగర్‌లో ఇంటింటికీ వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 6 గంటలకే నిద్రలేచి గ్రామం మొత్తం కలియతిరిగారు. స్థానికుల సమస్యలను సావధానంగా విన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం కంపెనీ మూతపడి ఉందని, కమిటీ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా ఉన్నారు. వెంకటాపురంలో ఎన్యుమరేషన్ తీరును పరిశీలిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్టైరీన్ తరలిస్తున్నాం :ధర్మాన ఎస్సీ, బీసీ కాలనీలో: మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి 9 గంటలకు ఎస్సీ, బీసీ కాలనీకి చేరుకుని ఓ ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకే నిద్ర లేచి గ్రామంలోని ప్రతి వీధీ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నిపుణుల సూచనలు ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా స్టైరీన్ గ్యాస్‌ను తరలించేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గ్రామస్తులతో ఎంపీల మాటామంతి సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయా గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో ముచ్చటించారు. స్థానికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అక్కడే ఒక ఇంట్లో మేడమీద ఆరు బయటే నిద్రించారు. తిరిగి ఉదయం 5.45 గంటలకు లేచారు. గ్రామాల్లో కలియతిరిగారు. వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రజలను కలిశారు. వెంకటాపురంలో కొంతమంది తమ సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి నాలుగు ఇళ్లకు ఒక పారిశుధ్య కార్మికుడు నిత్యం పనులు చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ ఎంవీవీ సోమవారం రాత్రి 8 గంటలకు కంపరపాలెం గ్రామాన్ని సందర్శించారు. మంత్రులతో కలిసి అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 10 గంటలకు స్థానికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం 11 గంటలకు ఓ ఇంట్లో నిద్ర చేశారు. ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి మళ్లీ అన్ని గ్రామాల్లో కలియతిరిగారు. -
చంద్రబాబు.. యూటర్న్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి 13 వేల టన్నుల స్టైరిన్‌ను విదేశాలకు తరలిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు (బుధవారం) ఉదయం 8వేల స్టైరిన్‌ను ఒక షిప్ ద్వారా వెనక్కి పంపిస్తున్నామని.. మే 17లోపు మిగిలిన స్టైరిన్‌ను కూడా పంపిస్తామని వెల్లడించారు. బాధిత గ్రామాల్లో మెడికల్ బృందాలు అనుక్షణం పనిచేస్తాయని తెలిపారు. బాధిత గ్రామం వెంకటాపురంలో ప్రత్యేకంగా వైఎస్సార్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. (స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు) ఆ కంపెనీతో సంబంధం లేదు.. ఇప్పటివరకు మృతుల కుటుంబాల్లో 8 మందికి రూ.కోటి సాయం అందించామని.. మిగిలిన వారికి రేపటిలోగా పరిహారం వారి ఖాతాల్లో వేస్తామన్నారు. తనకు, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తున్నాడని.. తనకు బంధువని టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు. చంద్రబాబును యూటర్న్ నాయుడిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. (చదవండి: స్టైరిన్ తరలింపు ప్రక్రియ ప్రారంభం) -
స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: బాధితులకు భరోసా ఇచ్చేందుకే విషవాయువు ప్రభావిత గ్రామాల్లో బస చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. తిరిగి జన జీవనం కొనసాగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో పూర్తిగా పారిశుధ్య పనులతో పాటు.. ఇళ్లను శుభ్రం చేయించామని తెలిపారు. ఇళ్ల ముందున్న చెట్లను తొలగించామని పేర్కొన్నారు. 10 మంది వైద్యులతో కమిటీ ఏర్పాటు చేశామని.. గ్రామాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు వైద్యుల కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు. (‘అప్పుడు గుర్తుకు రాలేదా బాబూ..’) బాధితులకు హెల్త్‌కార్డులు.. ఇలాంటి ఘటన మొదటిసారి జరిగింది కాబట్టి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. ప్రతి బాధిత గ్రామంలో 24 గంటలు పనిచేసేలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వెంకటాపురంలో ‘వైఎస్సార్ క్లినిక్’ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇన్ పేషంట్ ఉండేలా ఈ క్లినిక్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. బాధిత గ్రామాల ప్రజలకు ఒక ఏడాదిపాటు వైద్య సేవలు అందే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. (మన నీళ్లను తీసుకుంటే తప్పేంటి?: సీఎం జగన్) స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా రసాయన పరిశ్రమలను తనిఖీ చేస్తామన్నారు. విశాఖలో 20 రసాయన పరిశ్రమలను గుర్తించామని.. వచ్చే 4 రోజుల్లో పరిశ్రమల్లోని భద్రతా ప్రమాణాలు తనిఖీ చేస్తామని కన్నబాబు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టైరీన్‌ను దక్షిణ కొరియాకు వెనక్కి పంపిస్తున్నామని పేర్కొన్నారు. రేపు ఉదయానికి ఒక షిప్ వెనక్కి వెళ్లనుందని తెలిపారు. తప్పుడు ప్రచారాలు దుర్మార్గం.. గ్యాస్ ఘటన బాధితులు మంగళవారం కొంతమంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని..రేపు(బుధవారం) మరి కొంతమంది డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన చిన్నారి గ్రీష్మ తల్లిపై కేసులు నమోదు చేశామని తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గమని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయొద్దని కన్నబాబు హితవు పలికారు. -
గ్రీష్మ తల్లిపై ఏ కేసు పెట్టలేదు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన మృతి చెందిన చిన్నారి గ్రీష్మ తల్లిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఓ వర్గం మీడియా కావాలనే అసత్యం ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఘటన బాధిత కుటుంబాలపై కేసులు నమోదు చేశారని ఓ వర్గం మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. 50 మందిపై పోలీసులు కేసులు పెట్టారన్న ప్రచారం కూడా అవాస్తవమే అన్నారు. (చదవండి : అయ్యో గ్రీష్మ.. అప్పుడే నూరేళ్లు..!) ఇంటింటి సర్వే గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గ్రామాల్లో గడ్డి వినియోగించరాదని పశుసంవర్ధశాఖ సూచించింది. గ్రామాల్లోని చెట్ల ఫలాలను కూడా వినియోగించరాదని పేర్కొంది. బాధితులను పరామర్శించిన విజయసాయిరెడ్డి కేజీహెచ్‌లో గ్యాస్ లీకేజీ బాధితులను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు పరామర్శించారు. రాజేంద్రప్రసాద్ వార్డులో బాధితులకు ఎంపీ విజయసాయిరెడ్డి పరిహారం చెక్కులను అందజేశారు. వీరంతా గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి రవాణా సౌకర్యం కల్పిస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. ఇంటికి వెళ్లాక కూడా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే గ్రామాల్లోని అన్ని వీధుల్లో మంత్రులు, ఎంపీల బృందం పర్యటించి గ్రామస్ధులతో మాట్లాడారు. గ్రామాలలో బ్లీచింగ్ చల్లడం, శానిటైజేషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగం 700 మంది శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. నేడు కూడా బాధితులకి ఆయా గ్రామాల్లోనే భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భోజనం సిద్ధం చేయడానికి ప్రతీ గ్రామంలో 50 మందికి పైగా వంట చేసేవారిని ఏర్పాటు చేశారు. సుమారు పది వేల మందికి పైగా ప్రజల కోసం అయిదు గ్రామాల్లో భోజనం సిద్ధమతోంది. ప్రతీ గ్రామంలో భోజనాలు తయారు చేసి అక్కడే అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితుల భోజనం మెనూలో వెజిటబుల్ బిర్యానీ, పెరుగు చట్నీ, రైస్‌తో పాటు బంగాళా దుంప కూర, ఎగ్ కర్రీ, పప్పు, సాంబారు, పెరుగు, స్వీటు, అరటి పండు అందించనున్నారు. -
విశాఖ గ్యాస్ ప్రమాదం గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు
-
గ్యాస్ లీకేజీ: ఆ బాధ్యత అంతా ప్రభుత్వానిదే
సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు సమీక్ష చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో మంగళవారం మంత్రులు, వైఎస్సార్సీపీ ఎంపీలు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటన వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (నేటి నుంచి ఎన్యూమరేషన్ ప్రారంభం) గ్రామ వాలంటీర్ ద్వారా ఇంటింటి సర్వే చేస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాన్ని పూర్తి సేఫ్ &గ్రీన్ జోన్‌గా తయారు చేస్తామన్నారు. స్థానికంగా ఉన్నపశువుల కోసం 25 టన్నుల పశుగ్రాసం సరఫరా చేస్తున్నామని ప్రకటించారు. అలాగే ప్రజలకు మధ్యాహ్నం, సాయంత్రం భోజనంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాంతమంతా మామూలు పరిస్థితికి వచ్చేంతవరకు.. బాధ్యత అంతా ప్రభుత్వానిదే అని మరోసారి స్పష్టం చేశారు. అధికారులు, ప్రభుత్వం కృషితో ఇప్పటికే సాధారణ పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక పరిస్థితులపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. కంటి, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించి వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. నెలరోజుల పాటు మెడికల్ క్యాంప్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. గ్రామాల్లో ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చామని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ఎంపీ విజయ సాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో నిద్ర చేశారు. బాధిత గ్రామంలో ఆరుబయట నిద్రించిన ఎంపీ విజయ సాయిరెడ్డి మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. పరిహారం ఇవ్వడం కాదు ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పద్మనాభనగర్లోని ఓ బాధితుడి ఇంట్లో నిద్ర చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని, ప్రజలతో పాటు గ్రామంలో నిద్రించామని ఆయన తెలిపారు. (చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ సాయం) వెంకటాపురంలో బాధితుల ఇంటిలో బస చేసిన ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. బాధిత గ్రామాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్వయంగా మంత్రులే గ్రామాల్లో బస చేయడంతో ప్రజలలో ధైర్యం పెరిగిందని ఆయన తెలిపారు. వెంకటాద్రి నగర్లో ఓ బాధితుని ఇంటిలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ బసచేశారు. ఎస్సీ, బీసీ కాలనీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి నిద్రచేశారు. ప్రతీ గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయని మంత్రులు తెలిపారు. నేటి నుంచి వాలంటీర్ల సహకారంతో ఎన్యూమరేషన్ ప్రారంభం కానుందని మంత్రులు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జగన్‌పై బురద జల్లటమే చంద్రబాబు పని
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నియంత్రణలో, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీక్ దుర్ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరుకు ప్రపంచమంతా మెచ్చుకుంటూంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా కువిమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ ఇబ్బందుల్లో ఈ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి జగన్ యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకుని భరోసా నింపారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వ ఖజానా నుంచి భారీ ఆర్థిక సాయం అందించిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. దీన్ని చంద్రబాబు మెచ్చుకోక పోగా రకరకాలుగా మాట్లాడుతున్నారని అంబటి మండి పడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... ► ఎల్జీ పాలిమర్స్ వారితో లాలూచి పడ్డారని అంటూ కువిమర్శలు చేస్తున్నారు. ఆ కంపెనీతో లాలూచి పడవల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. వారితో పరిచయంగాని, బంధం, బాంధవ్యం గాని జగన్ ప్రభుత్వానికి లేవు. అలాంటి బంధాలు చంద్రబాబుకే ఉంటాయి. ► రూ. కోటి ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా అని చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ► ఎఫ్ఐఆర్ సరిగ్గా కట్టలేదంటున్నారు. అది ప్రాథమిక దర్యాప్తు నివేదిక మాత్రమే. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబుకు ఇది తెలియదా? ► కంపెనీ వారిని అరెస్టు చేయలేదంటున్నారు. రుజువులు లేకుండా అరెస్టులు చేస్తారా? పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఎంత మందిని అరెస్టు చేశారు. ► గెయిల్ ప్రమాదంలో మృతులకు సంస్థ రూ 20 లక్షల పరిహారం ఇస్తే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది రూ 3 లక్షలే. ఈ ప్రమాదంలో చంద్రబాబు ఎంత మందిని అరెస్టు చేశారు? ► విశాఖలో పర్యటించడానికి కేంద్రం ఎందుకు అనుమతి నివ్వలేదో అడిగే సాహసం చంద్రబాబు చేస్తారా? -
ఎల్జీ పాలిమర్స్‌కు మేం అనుమతివ్వలేదు
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తమ ప్రభుత్వం అనుమతులివ్వలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తామే ఆ కంపెనీకి భూములిచ్చామనడం సరికాదన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం ఏపీలోని టీడీపీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► హిందుస్థాన్ పాలిమర్స్‌కు 1964 నవంబర్ 23న కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో 2177 ద్వారా 213 ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ భూమికి 1992 అక్టోబర్ 8న అప్పటి ప్రభుత్వం జీవో 1033 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. హైకోర్టు సూచనల మేరకే టీడీపీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది. ► ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తిని, స్టైరీన్ ఉత్పత్తితో ముడిపెట్టడం దివాలాకోరుతనం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే ఎక్స్‌పాండబుల్ పాలిస్టైరీన్ ఉత్పత్తికి అనుమతించి కేంద్రానికి సిఫారసు చేసింది. ► గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బిడ్డ చనిపోయి బాధలో ఉన్న తల్లి, తండ్రిపై కేసు పెట్టారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు అండగా ఉన్న ప్రతిపక్షాల నాయకులపై కేసులు పెట్టారు. కోటి వద్దు కూతురే కావాలనే తల్లిపై కేసు పెట్టడం అమానుషం. ► లీకేజీ దుర్ఘటనను సాధారణ ప్రమాదంగా చూపించి కంపెనీకి కొమ్ము కాయడం దారుణం. విమానాశ్రయంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడటం, కోటి పరిహారం ప్రకటించడం, మల్టీ నేషనల్ కంపెనీగా కితాబివ్వడం, అందులోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం అంతా వెనకేసుకురావడమే. ► నిందితులకు సానుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడటం విచారణను నీరుగార్చడమే. కంపెనీని మూసేయాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తుంటే అందులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎలా అంటారు? ► ఎల్జీ పాలిమర్స్ కంపెనీ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ కంపెనీతో భారతి పాలిమర్స్, నందిని పాలిమర్స్‌కు ఉన్న వ్యాపార లావాదేవీలు ఏమిటి? -
ఎల్జీకి అనుమతులు టీడీపీ నిర్వాకమే
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని ఇంద్రభవనంలో సేద తీరుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయనకు అలవాటైన రీతిలో దగాకోరు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు( ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. విశాఖలో జరిగిన ప్రమాదంపై రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్జీ పాలిమర్స్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే.. 7 ఏళ్ల పాటు అనుమతులిచ్చిన టీడీపీ సర్కారు ► ఎల్జీ పాలిమర్స్ సంస్థ విస్తరణ, ఉత్పత్తి ప్రారంభించడానికి 2018లో చంద్రబాబు సర్కారే అనుమతులు ఇచ్చింది. కంపెనీ విస్తరణ కోసం కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఎల్జీ పాలిమర్స్ 2018, నవంబర్ 29న దరఖాస్తు చేయగా అదే ఏడాది డిసెంబర్ 7న తనిఖీలు నిర్వహించారు. 2018 డిసెంబర్ 21న కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో మొక్కుబడిగా చర్చించి డిసెంబర్ 27నే అనుమతులు జారీ చేసేశారు. ► ఏకంగా ఏడేళ్లపాటు అనుమతులు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2018, డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు లేకుండానే టీడీపీ ప్రభుత్వమే అనుమతులిచ్చేసింది. దీంతోనే ఆ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. ఇవన్నీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల్లో ఉన్న వాస్తవాలే. సింహాచలం భూములు కట్టబెట్టిన బాబు ► సింహాచలం దేవస్థానానికి చెందిన 162 ఎకరాలను ఎల్జీ పాలిమర్స్‌కు కట్టబెడుతూ 2015లో చంద్రబాబు ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చింది. ఆమేరకు ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు వీలుగా డీ నోటిఫై చేస్తూ 2015 ఆగస్టు 17న టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో తాము ఆ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. ఎల్జీ పాలిమర్స్ ఆ భూములకు సంబంధించి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ తగిన నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పింది. ఆ సాకుతో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఆ భూములను ఎల్జీ పాలిమర్స్‌కు కట్టబెట్టేసింది. ► సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి వేలాది మంది సామాన్యులకు ప్రయోజనం కల్పించేలా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తానని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. ఎల్జీ పాలిమర్స్‌కు మాత్రం ఆగమేఘాల మీద 162 ఎకరాలను ధారాదత్తం చేశారు. -
ఆపదలో ఆదుకుంది
మహారాణిపేట/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): విష వాయువు లీకేజీ ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత సోమవారం 8 కుటుంబాలకు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగాయి. రూ.కోటి చొప్పున పరిహారాన్ని జమ చేసినట్లు గోపాలపట్నం తహసీల్దార్ బి.వి.రాణి తెలిపారు. నలుగురు మృతుల కుటుంబ సభ్యులకు కేజీహెచ్‌లో మంత్రులు పరిహారానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ప్రభుత్వం ఆదుకుంది.. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంది. ఘటన జరిగిన ఐదు రోజుల లోపే పరిహారం చెల్లించింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం బాధగా ఉంది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మమ్మల్ని అన్ని వి«ధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. ఇలాంటి సీఎం నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి. – గండబోయిన శ్రీనివాస్ (శ్రియ తండ్రి) ఏ ప్రభుత్వమూ ఇలా స్పందించలేదు... గతంలో ఏ ప్రభుత్వాలూ మాలాంటి పేదలను ఇంతగా ఆదుకోలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన తీరు చాలా బాగుంది. ప్రభుత్వం అందించిన భరోసాతో కుదుటపడ్డాం. భర్తను కోల్పోయానన్న బాధ ఉంది. కుటుంబంతో సుఖంగా జీవిస్తున్న మాకు ఈ ఘటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. భర్త లేని లోటు తీర్చలేనిది. ముఖ్యమంత్రి జగన్ మమ్మల్ని ఆదుకున్న తీరు అభినందనీయం. – పిట్టా యల్లమ్మ (మృతుడు శంకరరావు భార్య) జనావాసాల్లో వద్దు.. మాది పెందుర్తి మండలం నరవ. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో నా భర్త మృతిచెందాడు. నా భర్త కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని బాధపడుతున్న సమయంలో ప్రభుత్వం ఆదుకుంది. మాకు ఆర్థిక సహాయం చేసిన సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నా. అదే చేతులతో జనావాసాల్లో ఇలాంటి కంపెనీలు వద్దని వేడుకుంటున్నా. – చిన్న నాగమణి (మృతుడి చిన్న గంగరాజు భార్య), నరవ పెందుర్తి మండలం ఐదు ఊళ్లు ఊపిరి పీల్చుకున్నాయి... నా భర్త సింహాచలం ఆర్టీసీ డిపోలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్లుగా వెంకటాపురంలో నివాసం ఉంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు పార్ధు (13) ఏడో తరగతి చదువుతున్నాడు. ఐదో తరగతి చదివే మా పాప గ్రీష్మ (10) ఈ దుర్ఘటనతో మాకు శాశ్వతంగా దూరమైంది. నిత్యం ఇంట్లో చలాకీగా తిరిగే పాప ఇక లేదనే సంగతి మమ్మల్ని కలచివేస్తోంది. డబ్బు కంటే ప్రాణం ముఖ్యమే అయినా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. అధికారులు, మంత్రులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఐదు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. – నాగులాపల్లి లత (గ్రీష్మ తల్లి) పిల్లలను బాగా చదివిస్తా ఈ ఘటనలో నా భర్త గోవిందరాజు చనిపోవడం చాలా బాధగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో పిల్లలను చదివించి మంచి ప్రయోజకులను చేస్తా. గ్యాస్ లీకేజీతో ఐదు ఊళ్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అన్ని రకాలుగా ప్రభుత్వం స్పందించడం వల్ల కష్టాల నుంచి బయట పడ్డాం. తరలించిన వారికి షెల్టర్లలో అన్ని వసతులు కల్పించడం. చాలా బాగుంది. కంపెనీకి అనుకుని ఉన్న మా ఇళ్లను కూడా శుభ్రం చేస్తున్నారు. ఆర్ధికంగా కూడా చేయూతనిచ్చారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వంతున ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం గొప్ప విషయం. ప్రభుత్వం ప్రజలను ఆదుకున్న తీరు బాగుంది. – శివకోటి వెంకట లక్ష్మి (మృతుడు శివకోటి గోవిందరాజుల భార్య) కూలి పనుల కోసం వచ్చాం... మాది విజయనగరం జిల్లా, ఎల్ కోట మండలం, కల్లేపల్లి రేగ .కూలి పనుల కోసం వెంకటాపురం వచ్చాం. గ్యాస్ లీక్ దుర్ఘటనలో నా భార్య ప్రాణాలు కోల్పోయింది. పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా ముఖ్యమంత్రి రూ.కోటి చొప్పున ఆర్ధిక సాయం అందించడం ఊరటనిచ్చింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – రావాడ సత్యమంతుడు (మృతురాలు రావాడ నారాయణమ్మ భర్త ఊరటనిచ్చినా.. మాది పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామం. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో నా భర్త మేకా కృష్ణమూర్తి మృతిచెందాడు. ప్రభుత్వం అందించిన రూ.కోటి సహాయం ఊరటనిచ్చినా నా భర్త లేరనే విషయం మనసును తొలిచివేస్తోంది. – మేకా సుశీల (మృతుడు మేకా కృష్ణమూర్తి భార్య) అందివచ్చే సమయంలో అకాల మరణం అందివస్తున్న నా కుమారుడు అకాల మరణం చెందడం బాధగా ఉంది. చిన్నతనం నుంచి కష్టపడి చదివే అన్నెపు చంద్రమౌళి (19) పేదలకు మరింత సేవ చేసేందుకు డాక్టర్ కావాలని కోరుకున్నాం. విశాఖ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఎంతో బాగా చదువుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మా కుమారుడు లేడనే బాధ మర్చిపోలేనిది. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని ప్రకటించడం మంచి నిర్ణయం. – అన్నెపు ఈశ్వరరావు, వెంకటాపురం (వైద్య విద్యార్థి అన్నెపు చంద్రమౌళి తండ్రి) (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) -
విషాద జ్ఞాపకాల్ని కడిగేసి..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విష వాయువు చేదు జ్ఞాపకాలను కడిగేశారు. స్టైరీన్ అవశేషాలు ఒక్క శాతం కూడా లేకుండా తుడిచేశారు. మూగజీవాల మృత కళేబరాలను తొలగించారు. ప్రతి గ్రామం.. వీధి.. ప్రతి ఇంటినీ జల్లెడపట్టి కాలుష్య ఛాయలు లేకుండా క్లీన్ చేశారు. ప్రమాదానికి గురైన ఆర్ఆర్ వెంకటాపురం, నందమూరి నగర్, కంపర పాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ రూపురేఖలను కేవలం ఐదు రోజుల్లో మార్చేసిన ప్రభుత్వ యంత్రాంగం గ్రామాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చింది. (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) సీఎం ఆదేశాలతో.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు 5 గ్రామాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇందుకోసం 700 మంది సిబ్బందిని మోహరించారు. ► గ్రామాల్లోని ప్రధాన, అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. వాయు కాలుష్యానికి మాడిపోయిన చెట్లు, మొక్కలను, కాలువల్లో పూడికను తొలగించారు. చనిపోయిన పశు కళేబరాలను తరలించారు. ► వాటర్ ట్యాంకర్ల సాయంతో ఇళ్ల లోపల కూడా రసాయనిక వాయువుల జాడ లేకుండా శుభ్రం చేశారు. ► 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో 5 బెల్ మిస్ట్ భారీ యంత్రాలు, 6 టాటా ఏస్ వాహనాల ద్వారా ప్రధాన రోడ్లపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేసి బ్లీచింగ్ చల్లారు. ► వ్యాధులు ప్రబలకుండా 100 మంది మలేరియా సిబ్బంది పర్యవేక్షణలో పనులు చేపట్టారు. గ్రామాల్లోకి వచ్చాక ప్రజలు చేయాల్సిన పనులు, చేయకూడని పనులను వివరిస్తూ అవగాహన కల్పించారు. ► సోమవారం సాయంత్రానికి ఐదు గ్రామాల ప్రజలను వారి ఇళ్లకు తరలించారు. ► వాటర్ వర్క్స్ ఏఈల ఆధ్వర్యంలో స్టోరేజ్ ట్యాంకుల్లో నీటిని శుభ్రం చేశారు. గ్రామాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు ఎస్ఈ వేణుగోపాల్ ఆదేశాలతో 30 ట్యాంకర్లతో 80 ట్రిప్పులు సరఫరా చేశారు. ► కుళాయిల ద్వారా కూడా గృహాలకు మంచినీటి సరఫరా చేశారు. అలాగే యూసీడీ పీడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం రాత్రికి గ్రామస్తులకు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించారు. ► ఐదు గ్రామాల ప్రజలకు 20 వేల మాస్కులను పంపిణీ చేశారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అన్ని వసతులు కల్పించారు ప్రభుత్వం చెప్పిన విధంగానే మాకు అన్ని వసతులు కల్పించారు. ఈ ప్రాంతంలో అంతటి ప్రమాదం జరిగిందన్న ఆనవాళ్లు లేకుండా ఊళ్లను శుభ్రం చేయించారు. – పుల్లేటికుర్తి పుష్ప, వెంకటాపురం ప్రభుత్వ చర్యలు బాగున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరు అద్భుతం. ఆసుపత్రుల్లో ఉన్న బాధితులకు సైతం భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా బాగుంది. – వెంకటరమణరావు, న్యాయవాది, వెంకటాపురం జీవితాంతం రుణపడి ఉంటాం ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే మమ్మల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చారు. సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాం. – యడ్ల వరలక్ష్మి, వెంకటాపురం నాలుగు రోజుల తర్వాత అమ్మ ఒడికి... నాలుగు రోజుల తర్వాత చంటి బిడ్డ కనిపించడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో అస్వస్థతకు గురైన ఎ.నాగమణి ఈ నెల 7 నుంచి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. సోమవారం ఆమె కోలుకోవడంతో రెండు నెలల పసికందును బంధువులు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. కన్నబిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానని నాగమణి కంటతడి పెట్టడంతో అక్కడున్న అందరి కళ్లూ చెమర్చాయి. దీంతో మంత్రులు, ఇతర అధికారులు ఆమెను ఓదార్చారు. ఊళ్లకు కళొచ్చింది స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనతో చెల్లాచెదురైన గ్రామాలు కోలుకున్నాయి. ఐదు గ్రామాలను అన్నివిధాలా నివాసయోగ్యంగా తీర్చిదిద్దటంతో ప్రజలను వారి ఇళ్లల్లోకి సోమవారం అనుమతించారు. రాత్రి సమయానికి 70 శాతం ప్రజలు ఇళ్లకు చేరుకున్నారు. క్షేమంగా చేరారు ► ఎల్జీ పాలిమర్స్‌కి ఆనుకుని ఉన్న వెంకటాపురంలో 1,250 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ నివసించే 5 వేల మందిలో 3 వేల మంది ఇళ్లకు చేరుకున్నారు. మిగతా వారు షెల్టర్లు, బంధువుల ఇళ్లలో ఉన్నారు. అస్వస్థతకు గురైన వారు కేజీహెచ్‌లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు. ► కంపెనీకి కిలోమీటరు దూరంలో ఉన్న నందమూరి నగర్లో 600 వరకూ ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. వారిలో 70 శాతం మంది సోమవారమే తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ► 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభ నగర్లో 500 వరకూ ఇళ్లు, 2,200 మంది జనాభా ఉంది. గ్రామస్తులంతా ఇళ్లకు చేరుకున్నారు. మేఘాద్రి గెడ్డ నీరు సురక్షితమే ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ స్టైరీన్‌తో కలుషితమైపోయిందన్న సందేహాలను నివృత్తి చేస్తూ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక విడుదల చేసింది. దుర్ఘటన జరిగిన నాటి నుంచి రోజూ రిజర్వాయర్ నీటి శాంపిళ్లని పరీక్షల కోసం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ రీజనల్ వాటర్ లేబొరేటరీకి పంపించింది. ఈ నెల 7న పంపించిన శాంపిళ్లకు సంబంధించిన నివేదికను జీవీఎంసీకి కాలుష్య నియంత్రణ మండలి అందించింది. తొలి రోజు తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్ మోనోమర్ అవశేషాలు లేవని నివేదికలో పేర్కొంది. నీరు వినియోగించేందుకు సురక్షితంగా ఉందని తెలిపింది. -
బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట
పరిహారం కోసం పడిగాపులు లేవు..కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి లేదు..ప్రజా ప్రతినిధుల రికమండేషన్లతో పనిలేదు..ప్రాణాలకు వెలకట్టే వ్యాపారిలా కాకుండా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ప్రభుత్వం నిలబడింది! మానిపోని గాయానికి మానసిక స్థైర్యాన్ని అందిస్తూ..బాధితులకు భరోసా కల్పిస్తూ బాసటగా నిలిచింది. ఘటన జరిగిన రోజే ప్రకటించిన పరిహారాన్ని కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే అందించి ఆదుకుంది. కన్నీటి సుడులు తిరుగుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలబడ్డారు. సాక్షి, విశాఖపట్నం: విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు దేశంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోనంత సాయాన్ని అందచేసి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన దానికంటే రెట్టింపు పరిహారం ఇస్తామని విశాఖలో దుర్ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఐదు రోజుల్లోనే బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఆదివారమే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సోమవారం అందచేశారు. బాధిత కుటుంబాలకు భరోసా.. విశాఖ కేజీహెచ్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబుతోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ వి.వినయ్‌చంద్ కలిసి మృతుల కుటుంబాలకు అకౌంట్లల్లో నగదు జమ చేశారు. పరిహారానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. సంబంధిత పత్రాలతోపాటు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖను కూడా అందించారు. తొలి విడతగా మృతుల చట్టబద్థ వారసులుగా నిర్థారించిన 8 మందికి ఒకొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. బాధితులందరినీ ఆదుకుంటామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రులు అన్ని విధాలా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మాటగా భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అదనపు డీజీపీ రాజీవ్‌కుమార్ మీనా, ఏఎంపీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ పాల్గొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు: మంత్రి బొత్స ► ఎల్జీ పాలిమర్స్ సమీప గ్రామాల్లో నీటి నమూనాలను పరీక్షల కోసం పుణె ల్యాబ్‌కు పంపాం. సుమారు 500 మంది సిబ్బందితో గ్రామాల్లో శానిటైజేషన్ నిర్వహిస్తున్నాం. ► గ్యాస్ లీకేజీ ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు నిపుణులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 కమిటీలను నియమించాం. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయి. ► ఈ ప్రభుత్వానికి ప్రజలపైనే ప్రేమ ఉంటుంది. కంపెనీలపై కాదు. ► గత సర్కారు చేసిన తప్పిదాలను మా ప్రభుత్వం సరిదిద్దుతోంది. ► టీడీపీ సర్కారు ఇచ్చిన అనుమతుల కారణంగానే ఆ కంపెనీ పనిచేస్తోంది. గ్రామాల్లో మెడికల్ క్యాంప్ : మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ► స్టైరీన్ గ్యాస్ పూర్తిగా అదుపులో ఉంది. ఇప్పటికే ఐదు గ్రామాలను మేమంతా పరిశీలించాం. జీవీఎంసీ 500 మంది సిబ్బందితో అణువణువు శుభ్రం చేస్తోంది. ► సాయంత్రం గ్రామాల్లోకి వచ్చిన ప్రజలందరికీ భోజన వసతి కల్పిస్తున్నాం. ► ప్రజల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ► గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాం. అనుమతులిచ్చింది గత సర్కారే: మంత్రి కన్నబాబు ► గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కారణంగానే ఎల్జీ పాలిమర్స్‌లో లీకేజీ ఘటన సంభవించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ► రూ.కోటితో మృతి చెందిన వారి ప్రాణాలు తీసుకురాలేం కానీ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలనే గొప్ప మనసుతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ► అస్వస్థతకు గురైన వారందరిని మంగళవారం డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. డిశ్చార్జి అయిన వారికి గ్రామ వలంటీర్లే నేరుగా ఇంటికి వెళ్లి పరిహారం అందజేస్తారు. ► నిపుణుల సలహా మేరకు ఐదు గ్రామాల్లో శానిటైజేషన్ చేయించాం. ట్యాంక్‌లో విషవాయువులు సాధారణ స్థితికి వచ్చాయి. ప్రజలెవరూ అధైర్యపడొద్దు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. బాధిత గ్రామాల్లో మంత్రుల బస విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం చెప్పేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి గ్రామాల్లోనే బస చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బి. సత్యవతి బాధిత గ్రామాల్లో రాత్రంతా ప్రజలతో పాటునిద్రపోయారు. అంతకుముందు బాధిత గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో చేపడుతున్న చర్యలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా,ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి కోలుకొని గ్రామాలకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వం సోమవారం రాత్రి భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది. మంత్రుల నేతృత్వంలో నాణ్యమైన భోజనాన్ని అందించారు. వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో ఐదు గ్రామాల్లోనూ ప్రజలకు భోజనం పెట్టారు. ప్రజలతో కలిసే మంత్రులు కూడా భోజనం చేశారు. (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) -
‘లాలూచీ పడాల్సిన అవసరం మాకు లేదు’
సాక్షి, తాడేపల్లి : ఎల్జీపాలిమర్స్‌తో లాలూచీ పడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆ సంస్థతో లాలుచీ పడి సింహాచల ఆలయ భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ ప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోందని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విశాఖ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డ వేగంగా స్పందంచారని, ప్రమాదం జరిగిన రోజే బాధితులను పరామర్శించారని గుర్తు చేశారు. గ్యాస్ బాధితులకు కనివినీ రీతిలో సాయం చేశారన్నారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అయితే.. ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది అని విమర్శించారు.(చదవండి : అలాంటి వార్తలు రాయొద్దు: మంత్రి బొత్స) యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభిస్తే.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల ప్రమాదానికి కారణమైనవారిలో ఎంతమంది అరెస్ట్ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విశాఖకు వచ్చేందుకు చంద్రబాబు కేంద్రం పర్మిషన్ ఇచ్చిందో లేదో తెలియదని, ఆ విషయాన్ని చద్రబాబు ఎందుకు బయటపట్టడం లేదని ప్రశ్నించారు. (చదవండి : గ్యాస్ లీక్ : సీఎం జగన్ సహాయం ఓ నిదర్శనం) బాధితులను పరామర్శించే మనసు ఉంటేకారులో కూడా విశాఖకు రావొచ్చని, కానీ చంద్రబాబుకు ఆ ఉద్దేశమే లేదన్నారు. సీబీఐని రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జీవితమంతా రాజకీయ కుట్రలేనని అంబటి విమర్శించారు. -
ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు
సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్‌లో లీకైన స్టైరిన్‌ను తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. స్టైరిన్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభమైందని, ఎల్జీ పాలిమర్స్‌లో పరిస్థితి అదుపులో ఉందన్నారు. లీకైన ట్యాంక్‌తో పాటు అయిదు ట్యాంకుల్లో 12 నుంచి 13వేల టన్నుల స్టైరిన్ ఉందని, వాటిని నౌకల ద్వారా కొరియాకు తరలించనున్నట్లు చెప్పారు. మూడు నుంచి అయిదు రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి అవుతుందని కలెక్టర్ వెల్లడించారు. (బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్) అలాగే బాధితులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని, ఇప్పటికే మృతుల కుటుంబాలకు కోటి పరిహారం అందించినట్లు చెప్పారు. బాధిత గ్రామాలలో ఇంటిలో ప్రతి కుటుంబ సభ్యునికి పదివేల రూపాయలు ఆర్దిక సహాయం అందచేస్తామన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేలు పరిహారం రేపటి (మంగళవారం) నుంచి అందిస్తామన్నారు. ఇవాళ సాయంత్రానికి డీశానిటైజేషన్ పూర్తయ్యాక... కోలుకున్న వారితో పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని గ్రామాలకు తరలిస్తామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. గ్రామంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇక స్టైరిన్ గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, వైద్య బృందాలు, జీవీయంసీ పారిశుద్ద్య బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయన్నారు. (బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్) -
గ్యాస్ లీక్ : సీఎం జగన్ సహాయం ఓ నిదర్శనం
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతి చెందినవారికి సంబంధించి ఎనిమిది కుటుంబాలకు మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్య నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లు చెక్కులు అందించారు. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విధంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందించామన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, సీఎం జగన్ వారికి రాసిన లేఖతో పాటు అందించామని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది కుటుంబాలకు చట్టపరమైన వారసులను గుర్తించామని, మిగిలిన నాలుగు కుటుంబాల వారసులు గుర్తించిన వెంటనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. (విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు చెక్కుల పంపిణీ) చెక్కల పంపిణీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘బాధితులను తక్షణమే ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని భావించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటిరూపాయల పరిహారం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో మంత్రులు, అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయమే మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. మనస్సున్న మనిషిగా ఆయన స్పందించిన తీరుకు ఈ సహాయం ఓ నిదర్శనంగా చెబుతున్నాం. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి సమీక్షించాం. డిశ్ఛార్జ్ చేయాల్సిన వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి పంపిస్తాం. రేపు ఎక్కువ మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని వైద్య అధికారులు తెలియచేశారు. ఎవరైతే పూర్తిగా కోలుకుని ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యాధికారులు ధృవీకరిస్తారో వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసిన అనంతరం వారికి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని అందిస్తాం. ఐదు గ్రామాలలో బాధితులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం అందిస్తామని సీఎం చెప్పారు. ఆ ప్రకారం గ్రామాలలోకి ప్రజలు తిరిగి వెళ్లిన వెంటనే వాలంటీర్లను ఇంటికి పంపించి పెన్షన్ మాదిరిగా ఇస్తున్నారో అదే విధంగా ఇంటివద్దకే పంపిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పకుండా సహాయం అందించడం వైఎస్ జగన్ మార్క్. అందుకే వారందరికీ సేవలు తక్షణం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. సంఘటన ఏడో తేదీ జరిగితే కేవలం మూడురోజుల వ్యవధిలో బాధిత కుటుంబాలకు కోటిరూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన దృష్ట్యా పారిశ్రామిక భద్రతకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని అన్నారు. బాధితులకు అండగా ఉంటాం : అవంతి శ్రీనివాస్ ‘ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీలో ఉన్న స్టైరిన్ గ్యాస్ పూర్తి అదుపులో ఉంది. దయచేసి సోషల్ మీడియా రూమర్స్ గాని, వదంతులు గాని ఎవ్వరూ కూడా నమ్మద్దు.ఐదు గ్రామాలలో రసాయనాలతో క్లీన్ చేసే కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది ద్వారా జరుగుతోంది. సోమవారం రాత్రికి ప్రజలకు ఇబ్బంది లేకుండా భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడ గ్రామాలలోకి వచ్చిన తర్వాత మెడికల్ క్యాంపులు కూడా పెట్టమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అన్నిరకాల హెల్త్ చెకప్‌లు చేయించి వారికి పూర్తి అండగా ఉంటాం’ అని అన్నారు. ప్రగాఢసానుభూతి : మంత్రి ధర్మాన కృష్ణదాస్ ‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరం. బాధితులు, చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం.ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వం మాది. రాష్ర్టంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అనేకమంది నిపుణులతో కమిటీలు వేసి నివేదికలు తెప్పించుకున్న తర్వాత తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాధిత ఐదు గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారుల అండగా ఉంటారు’ అని పేర్కొన్నారు. కంపెనీపైన మాకు ప్రేమలేదు: బొత్స సత్యన్నారాయణ ‘నిపుణుల సూచనల మేరకే ఐదు గ్రామాలలో శానిటైజ్ చేస్తున్నాం. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మేం కూడా గ్రామాలకు వెళ్లి గ్రామస్తులను ఇళ్లల్లోకి తీసుకువెళ్తాం. కంపెనీ మెయింటెనెన్స్‌కు జిల్లా కలెక్టర్ మూడుషిఫ్ట్ లలో 15 మంది చొప్పున 45 పాసులు జారీచేశారు. ప్రమాదం జరిగినప్పుడు 15 మంది ఉన్నారు. కంపెనీపైన మాకు ప్రేమలేదు. ఇక్కడ ఉన్న ప్రజలపైన, వారి సంక్షేమం, ఈ ప్రాంతం భద్రత పైన మాత్రమే మాకు ప్రేమ ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాలనే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎల్జీ పాలిమర్స్ కు ఎటువంటి నూతన అనుమతులు ఇవ్వలేదు. పాత అనుమతులతోనే పనిచేస్తోంది.’ అని స్పష్టం చేశారు. -
బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగులు హాజరయ్యారు. అధికారులు గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రికి తెలియజేశారు. సంఘటనా స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని వివరించారు. సాయంత్రం లోపు బాధితులను వారి ఇళ్లకు చేర్చాలని.. రాత్రికి ఆయా గ్రామాల్లోనే బస చేయాలని సీఎం జగన్ మంత్రులను ఆదేశించారు. ( ఆ అనుమతులిచ్చింది చంద్రబాబే ) అంతకుక్రితం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. -
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు చెక్కుల పంపిణీ
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. సోమవారం మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి నష్ట పరిహారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన జరిగిన ఐదురోజుల వ్యవధిలోనే రూ. కోటి పరిహారం బాధితులకు పంపిణీ చేయటం జరిగింది. చదవండి : ఆ అనుమతులిచ్చింది చంద్రబాబే -
మృతుల కుటుంబాలకు నేడు పరిహారం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కోటి రూపాయల నష్టం పరిహారాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదివారమే నష్ట పరిహారం అందించాలని చెప్పినప్పటికీ లీగల్ డాక్యుమెంట్లలో జాప్యం జరగడంతో సాధ్యం కాలేదన్నారు. మృతుల కుటుంబాలతో పాటు వెంటిలేటర్స్‌పై ఉన్న బాధితుల కుటుంబాలకు కూడా సోమవారం పరిహారం అందించనున్నామన్నారు. డిశ్చార్జ్ అయిన వారికి రెండు రోజుల్లో పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధిత గ్రామాల్లో ప్రజలు ఇంటికి చేరాక వివరాలు సేకరించి ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. ఘటనపై వేసిన కమిటీలు వంద శాతం సురక్షితం అని చెప్పిన తరువాతే ప్రజలను గ్రామాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించి, పలు చోట్ల ఏర్పాటు చేసిన 21 షెల్టర్లలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లల్లోని సరకులు వినియోగించొద్దు ఇళ్లల్లో వినియోగంలో ఉన్న బియ్యం, పప్పులు, ఉప్పులు వంటి నిత్యావసర సరకులను వినియోగించవద్దని మంత్రులు సూచించారు. ఫ్రీజ్‌లో ఉన్న వాటిని కూడా వాడవద్దన్నారు. ఇంటికి వెళ్లిన తరువాత ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ప్రకటనల ద్వారా తెలియజేస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా కొంత మంది కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని మంత్రులు కోరారు. కంపెనీలో గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టామని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదన్నారు. అక్కడి గాలి, నీరు, మట్టి ఎంత మేర కలుషితమైందనేది పరీక్షలు నిర్వహించామన్నారు. శనివారంతో పోల్చుకుంటే ఆదివారానికి కలుషిత గాలి తగ్గిందని తెలిపారు. మాది ప్రచారాల ప్రభుత్వం కాదు టీడీపీ సర్కారులా తమది ప్రచారాల ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు అనుమతులు ఇచ్చారని స్పష్టం చేశారు. ఓ సారి కంపెనీలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు.. కంపెనీని తరలించాలని అప్పుటి పెందుర్తి ఎమ్మెల్యే చంద్రబాబుకు లేఖ రాస్తే కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడు ఇలా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. నివేదిక ఆధారంగా కంపెనీపై చర్యలు టీడీపీ డ్రామా కంపెనీ ప్రతినిధులు బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన స్క్రీప్ట్‌ను మీడియా ముందు చదివి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేశారని మంత్రి బొత్స ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రమాదం జరిగినా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో కంపెనీ నిర్లక్ష్యం ఉందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కంపెనీని తర లించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని తప్పకుండా రాబడతామని చెప్పారు. -
గండం నుంచి గట్టెక్కినట్లే..!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాద స్థాయి తగ్గుముఖం పట్టింది. ప్రమాదానికి కారణమైన ట్యాంక్‌లో ఉష్ణోగ్రత తగ్గడంతో.. అందులో ద్రవరూపంలో ఉన్న స్టైరీన్ క్రమంగా ఘన రూపంలోకి మారుతోంది. దీంతో వాయువు వెలువడే అవకాశం లేకపోవడంతో గండం నుంచి దాదాపు గట్టెక్కినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ► ప్రమాదం సంభవించినప్పుడు ట్యాంక్ లోపలి ఉష్ణోగ్రత 150 డిగ్రీల వరకు ఉండగా.. ప్రస్తుతం 73 డిగ్రీలకు చేరుకుంది. సోమవారం రాత్రి నాటికి 50 డిగ్రీలకు చేరుకునే సూచనలున్నాయి. ఉపరితల ఉష్ణోగ్రతలు 98.4 డిగ్రీల నుంచి 92.6 డిగ్రీలకు చేరుకున్నాయి. ► ఉష్ణోగ్రతని తగ్గించేందుకు ట్యాంక్‌పై నిరంతరం నీటిని చల్లుతున్నారు. ఈ చల్లే క్రమంలో ఆవిరి విడుదలవుతోంది. ఈ ఆవిరి వాసనే అప్పుడప్పుడూ వస్తుందనీ.. దీనికి ప్రజలు భయపడొద్దని నిపుణులు చెబుతున్నారు. ► నిరంతరం నీటిని చల్లుతుండటంతో ద్రవరూపంలో ఉన్న స్టైరీన్ ఘనీభవనం చెందుతోంది. పూర్తిగా గడ్డకట్టేస్తే.. చిన్నపాటి వాయువు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. ► ప్రమాదం సంభవించినప్పుడు ట్యాంక్‌లో 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరీన్ నిల్వ ఉండగా... ప్రస్తుతం 1550 మెట్రిక్ టన్నులకు చేరింది. ► ప్రమాదానికి కారణమైన ట్యాంక్ పక్కన ఉన్న 3 వేల మెట్రిక్ టన్నుల ట్యాంక్‌ని ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో ఉన్న స్టైరీన్ మోనోమర్ నిల్వల్ని ప్లాంట్ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం స్టైరీన్ నిల్వలే కాకుండా.. ప్లాంట్‌లో ఉన్న రసాయనిక నిల్వలన్నింటినీ అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. ► ట్యాంక్ ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, ప్లాంట్‌లో స్టైరీన్ వాయువు తీవ్రత, గాఢతని నిపుణుల బృందం ఎప్పటికప్పుడు నమోదు చేస్తోంది. -
ఆ అనుమతులిచ్చింది చంద్రబాబే
సాక్షి, విశాఖపట్నం: 2015లో ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు మాజీ సీఎం చంద్రబాబే అనుమతులిచ్చి, ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆదివారం సర్క్యూట్‌హౌస్‌లో మంత్రుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిందని, అప్పుడే ఆ సంస్థపై తగిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ఇప్పుడు తనకేమీ తెలియదని, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు అండ్ కో మాట్లాడడం సరికాదన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. ► మీరు సీఎంగా ఉన్నప్పుడే జీవీఎంసీ పరిధిని అక్కడ వరకు పెంచినప్పుడు ఆ సంస్థతో అక్కడ ప్రజలకు హాని అని తెలియలేదా? ► మీరు సీఎంగా ఉన్నప్పుడు అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే ఎం.ఆంజనేయులు లేఖ రాస్తే ఎందుకు స్పందించలేదు? ► ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే బాధితులను సీఎం పరామర్శించి, అధికారులతో, సంస్థ యాజమాన్యంతో సమీక్షలు నిర్వíహించడమే కాకుండా, మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించారు. ► ఎల్జీ పాలిమర్స్ చేసిన తప్పిదాలపై యాజమాన్యాన్ని ఆరా తీసి, వాటిపై ఉన్నతస్థాయి కమిటీని వేసిన విషయం గుర్తుంచుకోవాలి. గ్యాస్ లీకేజీ బాధితులకు నేడు పరిహారం మంత్రులు కన్నబాబు, బొత్స, ముత్తంశెట్టి గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు సోమవారం పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కన్నబాబు, మంత్రులు బొత్స, ముత్తంశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్‌హౌస్‌లో మంత్రులు విలేకరులతో మాట్లాడారు.మృతుల కుటుంబాలకు, డిశ్చార్జి అయినవారికి, పశువులను కోల్పోయిన రైతులకు ఆదివారమే చెక్కులు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఇందుకు సంబంధించి సీఎస్ నీలం సాహ్ని, కలెక్టరు వి.వినయ్‌చంద్ ఇప్పటికే ఏర్పాట్లు చేశారని సాంకేతిక కారణాల వల్ల చెక్కుల పంపిణీ ఆదివారం కుదర్లేదని చెప్పారు. -
పునర్జన్మనిచ్చారు!
‘ఆ రోజు రాత్రి అమ్మ దగ్గర పడుకున్నాను. మధ్య రాత్రిలో ఏదో వాసనకు మెలకువొచ్చింది. ఊపిరాడలేదు. ఒళ్లంతా మంటలు.. నోట్లోంచి నురగలొచ్చేస్తున్నాయి. తమ్ముడికీ అంతే. చచ్చిపోతున్నామా అమ్మా? అని ఏడ్చాను. అంతా బయటకొచ్చేశాం. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. స్పృహ వచ్చాక హాస్పిటల్ బెడ్‌మీద ఉన్నాం. డాక్టర్లు మమ్మల్ని బతికించారు’ కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పదేళ్ల పీతల లాస్య సంతోషంతో చెప్పిన మాటలివి. ‘గ్యాస్ పీల్చడం వల్ల నాకు, నా భర్త, ఇద్దరు పిల్లలు చేతన (14), చిన్మయి (9)లకు వాంతులయ్యాయి. కాసేపటికి స్పృహ కోల్పోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తీసుకొచ్చారంట. స్పృహలోకి వచ్చాక మేం బతికినా.. చావుకు దగ్గర్లో ఉన్నామనిపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన వైద్యం అందేలా చేసింది. డాక్టర్లు పగలూ, రాత్రి ప్రత్యేక చికిత్స చేయడంతో మా బిడ్డలు బతికారు’ అని పేడాడ నారాయణమ్మ చెమర్చిన కళ్లతో చెప్పింది. కోలుకున్న ఇద్దరు కూతుళ్లతో నారాయణమ్మ సాక్షి, విశాఖపట్నం: లాస్య, నారాయణమ్మే కాదు.. విషవాయువు బారినపడి విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులందరిదీ ఒకే మాట. మా బిడ్డలకు వైద్యులు పునర్జన్మనిచ్చారంటూ ఆనందంతో చెబుతున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి వచ్చిన చిన్నారుల్లో ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చికిత్స చేయడంతో వీరంతా వైద్యులను దేవుళ్లతో పోలుస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన వెనువెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారంటూ నిండైన హృదయాలతో కృతజ్ఞతలు చెబుతున్నారు. 17 మంది డిశ్చార్జ్ ► స్టైరీన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఆర్.ఆర్. వెంకటాపురానికి చెందిన 585 మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 54 మంది చిన్నారులకు కేజీహెచ్ పిల్లల వార్డులో వైద్యం అందిస్తున్నారు. ► ఇందులో ఆదివారం నాటికి 17 మంది పిల్లలను డిశ్చార్జ్ చేశారు. నలుగురికి న్యుమోనియా లక్షణాలుండడంతో వారిని ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం చేస్తున్నారు. ► ఏ ఒక్కరి ప్రాణం పోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో కేజీహెచ్ వైద్యులు అన్ని అత్యవసర చర్యలు చేపట్టారు. రేయింబవళ్లు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సు చొప్పున నియమించారు. ► ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. బాధిత పిల్లలందరికీ నిరంతరం మూత్ర, రక్త పరీక్షలను నిర్వహించారు. అవసరమైన మందులను అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. ► ఫలితంగా రెండు మూడు రోజులకే చిన్నారులంతా కోలుకున్నారు. మిగిలిన పిల్లలనూ రెండు మూడు రోజుల్లోనే ఇంటికి పంపించి వేస్తామని వైద్యులు చెబుతున్నారు. ► ఆస్పత్రిలో తమ బిడ్డలకు మంచి వైద్యంతోపాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పారు. మూడు రోజుల్లోనే కోలుకున్నారు నేను.. నా ఇద్దరు పిల్లలు దీపు (12), భవ్య (9) గ్యాస్ పీల్చి వాంతులు చేసుకుని, నురగలు కక్కుతూ పడిపోయాం. ఆ రోజు ఉదయాన్నే 108లో కేజీహెచ్‌కు తీసుకొచ్చారంట. పిల్లల పరిస్థితి చూస్తే బతుకుతారన్న ఆశ కనిపించలేదు. మంచి వైద్యం అందించడంతో మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. ఈ రోజు డిశ్చార్జి ఇచ్చారు. సంతోషంగా వెళ్తున్నాం. వైద్యులకు, తక్షణమే స్పందించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – ఈసంశెట్టి భారతి, ఆర్.ఆర్. వెంకటాపురం పిల్లలంతా సేఫ్ స్టైరీన్ గ్యాస్ పీల్చడం వల్ల ప్రాణాపాయ స్థితిలో కొందరు, ఆపస్మారక స్థితిలో మరికొందరు ఆస్పత్రిలో చేరారు. 24 గంటలూ నిపుణులైన పిల్లల వైద్యులతో చికిత్స అందించాం. మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సును నియమించాం. తక్షణమే ప్రత్యేక వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా వెంటిలేటర్లను సిద్ధం చేసినా వాటి అవసరం పిల్లలెవరికీ రాలేదు. పిల్లలు ఇంటికి వెళ్లాక న్యుమోనియా రాకుండా మందులిస్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే ఆస్పత్రి తీసుకు రావాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం. – డాక్టర్ జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
ప్లాంట్లను ప్రారంభించే ముందు జాగ్రత్త
న్యూఢిల్లీ: విశాఖపట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న విషవాయు లీకేజీ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ–ఎన్డీఎంఏ) పలు మార్గదర్శకాలను జారీ చేసింది. లాక్డౌన్ అనంతరం పరిశ్రమలను ప్రారంభించే సమయంలో ఉద్యోగులు, కార్మికుల రక్షణకు, ప్లాంట్ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. లాక్డౌన్ కారణంగా కొన్ని వారాలుగా పరిశ్రమలు మూతపడిన కారణంగా, వాల్వ్‌లు, పైప్‌ల్లో మిగిలిపోయి ఉన్న రసాయనాలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముందని ఎన్డీఎంఏ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. మూసివేత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొన్ని ప్లాంట్లు తీసుకుని ఉండకపోవచ్చని పేర్కొంది. ప్రమాదకర రసాయనాలు, మండే స్వభావమున్న రసాయనాల స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్వహణ విషయంలోనూ జాగ్రత్త అవసరమని సూచించింది. పైప్‌లు, వాల్వ్‌లు, వైర్లలో ఎలాంటి లీకేజీల్లేకుండా చూసుకోవాలంది. పరిశ్రమను ప్రారంభించిన తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలివారం ట్రయల్ రన్ మాత్రమే చేయాలని పేర్కొంది. ట్రయల్ రన్ సమయంలో అసాధారణ శబ్దాలు రావడం కానీ, పొగ వెలువడడం కానీ జరుగుతుందేమో పరిశీలించాలంది. వెంటనే ఉత్పత్తిని పెంచాలని ప్రయత్నించవద్దని, ప్లాంట్ అంతా శానిటైజ్ చేయాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులు, కార్మికుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంది. అందరికీ శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలంది. సమస్య తీవ్రంగా ఉంటే ప్లాంట్‌ను మూసివేసి, మెయింటెనెన్స్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో భద్రత చర్యలపై ఆయా రాష్ట్రాల్లోని విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. మేనేజీరియల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది షిఫ్ట్‌కు 33% ఉండేలా చూసుకోవాలని, ఈ విషయంలో హోం శాఖ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. -
ఆ ఊళ్లకు ఊరట
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విషవాయువు మిగిల్చిన భయానక జ్ఞాపకాల నుంచి విశాఖలోని ఐదు గ్రామాలు క్రమంగా తేరుకుంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమించడంతో మూడు రోజుల్లోనే కాలుష్య మేఘాలు తొలగిపోయాయి. రసాయనాలతో కూడిన వాయువులు ఆవిరవుతున్నాయి. గ్రామస్తుల్లో భయాలను తొలగించేందుకు జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ (నీరి) నుంచి ఐదుగురితో కూడిన నిపుణుల బృందాన్ని ప్రభుత్వం రంగంలోకి దించింది. గ్రామాల్లో గాలి, నీరు, నేలపై స్టైరీన్ అవశేషాల కోసం పరీక్షలు నిర్వహిస్తోంది. విషపూరిత వాయువులు లేవని నిపుణులు నిర్ధారించిన తరువాతే గ్రామస్తులను సురక్షితంగా ఇళ్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిపుణుల బృందం మరో 24 గంటల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం అక్కడ వాతావరణం దాదాపుగా సాధారణ పరిస్థితికి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎల్జీ పాలిమర్స్‌కు సమీపంలోని ఐదు గ్రామాలైన వెంకటాపురం, నందమూరి నగర్, పద్మనాభనగర్, ఎస్సీబీసీ కాలనీ, కంపరపాలెంలలో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి ఆదివారం అక్కడ పర్యటించారు. గురు, శుక్రవారాల్లో బాధిత గ్రామాల్లో కనిపించిన మూగజీవాల కళేబరాలను తొలగించడంతో పాటు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టారు. ప్రతి గ్రామంలో గాలి కాలుష్యాన్ని సైతం పరిశీలిస్తున్నారు. గాలిలో స్టైరీన్ గ్యాస్ దాదాపుగా తొలగిపోయినట్లు అధికారులు గుర్తించారు. నిరంతరం పోలీస్ నిఘా దుర్ఘటన అనంతరం గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లకు తాళాలు వేయలేదు. దీంతో పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. కొన్ని ఇళ్లకు పోలీసులే తాళాలు కొనుగోలు చేసి వేశారు. డీసీపీ–2 ఉదయ్ భాస్కర్ బిల్లా ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి గ్రామంలోనూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. డీసీపీ నిరంతరం ఈ గ్రామాల్లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్ సృజన కూడా స్థానికంగా పర్యటించారు. మూగ జీవాలకు సపర్యలు.. ఎల్జీ పాలిమర్స్‌కు అతి సమీపంలోని వెంకటాపురానికి చెందిన ఇల్లపు తాతారావు పాడిరైతు. కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాడు. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో తాతారావుకు చెందిన ఒక గేదె, మూడు పెయ్యలు, ఒక ఆవు, లేగదూడ అక్కడిక్కకడే మృత్యువాత పడ్డాయి. ఒక గేదె చూపు కోల్పోయింది. మూడు రోజులు వేరే చోట తలదాచుకున్న ఆయన ఆదివారం సాయంత్రం పశువులశాలకు చేరుకుని గేదెకు సపర్యలు చేస్తూ కనిపించారు. అంతా సర్దుకున్నాక ఇంటికి వస్తానని తాతారావు చెప్పారు. చూపు కోల్పోయిన గేదెకు సపర్యలు చేస్తున్న తాతారావు తొలగిన భయం.. కంపరపాలెనికి చెందిన కంచిపాటి శంకర్రావు కుటుంబం ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన రోజు సబ్బవరంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం కుటుంబం అంతా తిరిగి వచ్చేసింది. ఇళ్లంతా శుభ్రం చేసుకుని వంట చేసుకుని భోజనం చేశారు. కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చోని టీవీ చూశారు. వెంకటాపురంలో.. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి ఆనుకుని సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి చెందిన వారే ఎక్కువగా విష వాయువుతో ప్రభావితమయ్యారు. గ్రామంలో సుమారు 1,250 ఇళ్లు, 5 వేల జనాభా ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా గ్రామానికి చేరుకుని ఇళ్లను చూసి శుభ్రం చేసుకుని తిరిగి వెళుతున్నారు. జీవీఎంసీ సిబ్బంది ప్రతి అరగంటకు ఒకసారి ఇక్కడ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లుతున్నారు. నందమూరినగర్‌లో.. కంపెనీకి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో 600 పైచిలుకు ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. నీరి (నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) నిపుణుల బృందం ఇక్కడ నీరు, మట్టి పరీక్షలు నిర్వహిస్తోంది. గ్రామం నుంచి కొన్ని నమూనాలను సేకరించారు. గాలి కాలుష్యాన్ని పరిశీలించగా 0.1గా నమోదైనట్లు చూపించింది. పద్మనాభనగర్‌లో.. కంపెనీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారుగా 500 ఇళ్లు ఉండగా 2,200 మంది వరకు ఉంటున్నారు. తిరిగి వస్తున్న వారికి పోలీసులు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జీవీఎంసీ సిబ్బంది పారిశుద్ధ్య పనులతో పాటు ఎప్పటికప్పుడు బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేస్తున్నారు. ఎస్సీబీసీ కాలనీలో.. కంపెనీకి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలో సుమారుగా 480 ఇళ్లు ఉండగా 2 వేల మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు నిత్యం ఇక్కడ పహారా కాస్తున్నారు. గ్రామానికి తిరిగి వస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. కంపరపాలెంలో.. కంపెనీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 250 ఇళ్లు ఉండగా 1,200 మంది నివసిస్తున్నారు. ఇళ్లకు చేరుకున్న కొందరు స్థానికులు ఆసక్తిగా టీవీలు చూస్తూ కనిపించారు. నిపుణుల బృందం ఇక్కడ కూడా నమూనాలను సేకరించింది. జీవీఎంసీ సిబ్బంది బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేస్తున్నారు. నెల రోజులు ఉచిత వైద్య శిబిరాలు: మంత్రి ముత్తంశెట్టి ఆదివారం ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అధికారులు చెప్పే వరకు ఇళ్లల్లో నివసించవద్దని సూచించారు. ఐదు గ్రామాల్లో నెల రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీనిచ్చారు. కంపెనీని తరలించాలి.. ‘ఎల్జీ పాలిమర్స్‌లో గతంలో ప్రమాదాలు జరిగినా పెద్దగా నష్టం జరిగేది కాదు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే లక్షలాది మంది ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడింది. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీని తరలించాలి. – ఎన్.శ్రీనివాసరెడ్డి, ఎస్సీబీసీ కాలనీ నిపుణుల సూచనలు ► విష వాయువు ప్రభావిత గ్రామాల్లోని ఇళ్లలోకి వెళ్లే ముందు కొద్ది గంటల పాటు తలుపులు తీసి ఉంచాలి. ► బహిరంగంగా వదిలేసిన ఆహార దినుసులు, పదార్థాలు వాడకూడదు. ► ప్యాకింగ్ చేసిన పదార్థాలను వినియోగించుకోవచ్చు. ► ట్యాంకుల్లో నీటిని ఖాళీ చేయాలి. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే మళ్లీ పట్టుకోవాలి. పోలీసులు వచ్చి మమ్మల్ని ఇళ్లు ఖాళీ చేయించారు. పునరావాస కేంద్రానికి తరలించారు. మూడు రోజుల పాటు అధికారులు చాలా బాగా చూసుకున్నారు. మా గ్రామంలో పరిస్థితి మెరుగుపడిందని తెలియడంతో ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేశాం. – డి.లక్ష్మి, కంపరపాలెం ‘చాలాకాలంగా కంపెనీలో క్యాజువల్ కార్మికుడిగా పనిచేస్తున్నా. 1998లో జరిగిన అగ్ని ప్రమాదం తరువాత ఇదే పెద్ద ఘటన. గురువారం నేను డ్యూటికి వెళ్లలేదు. గ్యాస్ వాసన రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. వెంటనే అధికారులు వచ్చి మమ్మల్ని పునరావాసానికి తరలించారు. అక్కడ అంతా బాగా చూసుకున్నారు. ఈ రోజు ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వచ్చా’ – పి.శ్రీనివాసరెడ్డి, వెంకటాపురం,ఎల్జీ పాలిమర్స్ క్యాజువల్ కార్మికుడు -
భరోసానిచ్చేలా..
మూడు రోజులు.. 72 గంటలు.. గడియారంలోని ముల్లుల కంటే వేగంగా స్పందిస్తూ.. విశాఖలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపుతూ.. విషాద ఘటన నుంచి నగరాన్ని కోలుకునేలా చేశారు. మరో 24 గంటల్లో పూర్తిగా సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇదిలావుంటే.. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిపుణుల కమిటీలు క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ మోనోమర్ వాయువు లీకైన మూడు రోజుల్లోనే పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతర పర్యవేక్షణలో.. ఏడుగురు మంత్రులు విశాఖలోనే మకాం వేసి స్టైరీన్ ప్రభావానికి గురైన ఐదు గ్రామాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఓ వైపు బాధితుల ఆరోగ్యాన్ని సంరక్షించే చర్యలు తీసుకుంటూనే.. గ్రామాల్లో పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాలిలో స్టైరీన్ వాయువు మోతాదు దాదాపు సున్నా స్థాయికి వచ్చినప్పటికీ.. ఆ గ్రామాల్లో పకడ్బందీగా పారిశుధ్య చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు నిశ్చింతగా నివాసం ఉండేందుకు వీలుగా తీర్చిదిద్దిన తర్వాతే గ్రామాల్లోకి అనుమతించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు అటు అధికారులు.. ఇటు మంత్రులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదిలావుండగా.. అత్యుత్తమ వైద్య సేవలందిస్తుండటంతో బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటి వరకూ 190 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అధ్యయనం మొదలైంది ► ప్రమాదం ఎలా జరిగిందనే విషయంతోపాటు ప్రమాద తీవ్రత వల్ల అక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు సంభవించాయనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఉన్నతస్థాయి కమిటీలు, నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. ► ఎన్డీఆర్ఎఫ్కు చెందిన కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్ఎన్)కు సంబంధించిన నలుగురు శాస్త్రవేత్తలు ఎల్జీ పాలిమర్స్‌లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ► నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి)కు చెందిన ఐదుగురు శాస్త్రవేత్తలతో కూడిన బృందం బాధిత గ్రామాల్లో పర్యటించింది. ► ఐదు గ్రామాల్లోని మొక్కలు, నీరు, మట్టి నమూనాలు, పండ్ల మొక్కల అవశేషాలు మొదలైనవి సేకరించారు. వీటని ఆదివారం నాగ్‌పూర్‌లోని ల్యాబ్‌కు తరలించారు. సోమవారం కూడా మరోసారి నమూనాలు సేకరిస్తారు. ► రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ కూడా పరిశ్రమ నుంచి వివరాలు సేకరించింది. ప్రస్తుతం ఆ గ్రామాల్లో కాలుష్య పరిస్థితి ఎలా ఉంది, పరిశ్రమలో కాలుష్యం ఎంత ఉందనే గణాంకాలను నమోదు చేస్తోంది. ► అక్కడ వాతావరణం సాధారణ పరిస్థితికి వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సాంకేతిక నిపుణుల పర్యటన ► కేంద్రం నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు సంతన్ గీతే, వినయ్రే ఆదివారం రెండు దఫాలుగా ఎల్జీ పాలిమర్స్ సంస్థను పరిశీలించి, ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. ► నీరు, మట్టి, గాలి శాంపిల్స్ సేకరించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న ఎల్జీ ప్రధాన కార్యాలయ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ► సాంకేతిక అంశాలు, తప్పిదాలపై ఆరా తీశారు. సోమవారం సాయంత్రానికి ప్రాథమిక నివేదిక సిద్ధం కానుంది. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న ప్రజలు ► గ్రామాల్లో పారిశుధ్య పనుల్ని జీవీఎంసీ ముమ్మరం చేసింది.పిచ్చి మొక్కలు, మూగజీవాల కళేబరాల్ని తొలగించారు. రహదారులు, వీధుల్ని, మురుగు కాల్వల్ని శుభ్రం చేశారు. ► గ్రామాల్లో ఎయిర్ లెవల్ క్వాలిటీని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు 3 భెల్ మిస్టర్ యంత్రాలతో నీటిని పిచికారీ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి 200 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. బ్లీచింగ్ చల్లి గ్రామాల్లో పారిశుధ్యం మెరుగయ్యేలా చర్యలు తీసుకున్నారు. ► మరోవైపు పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఒక్కొక్కరుగా గ్రామాల్లోకి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. పీటీబీసీ తీసుకొచ్చేందుకు అనుమతివ్వండి స్టైరీన్ లీకేజీని అరికట్టేందుకు అవసరమైన రసాయనాల్ని తీసుకొచ్చేందుకు అనుమతి కోరుతూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. డామన్ విమానాశ్రయం నుంచి వెయ్యి కిలోల పారా టెరిటరీ బ్యూటైల్ కాటేకాల్(పీటీబీసీ)ని, కాండ్లా నుంచి 3,600 కిలోల పాలిమరైజేషన్ ఇన్‌హెబిటర్, 3,600 కిలోల గ్రీన్ రెటార్డర్ను విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతానికి పరిస్థితి నూరు శాతం అదుపులోకి వచ్చిందని.. వీటిని ముందు జాగ్రత్తగా నిల్వ చేసుకునేందుకు అనుమతివ్వాలని విన్నవించింది. -
మీరూ ఆ గ్రామాల్లోనే బస చేయండి
పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరినీ సోమవారం సాయంత్రానికి ఇళ్లకు చేర్చేలా చూడాలి. ప్రజలకు ధైర్యాన్ని కల్పించేందుకు ఆయా గ్రామాల్లోనే మంత్రులు బస చేయాలి. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారాన్ని అందజేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విశాఖ దుర్ఘటనకు సంబంధించి సోమవారం సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రులను ఆదేశించారు. ప్రజలకు ధైర్యాన్ని కల్పించేందుకు ఆయా గ్రామాల్లోనే మంత్రులు బస చేయాలన్నారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారాన్ని ఆదివారం అందజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు సోమవారం పరిహారం అందించాలని ఆదేశించారు. మిగిలిన వారికి కూడా ప్రకటించిన విధంగా సాయం అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖలో గ్యాస్ లీక్ దుర్ఘటన అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ► ఎల్జీ కంపెనీలో గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు చేపట్టిన చర్యల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ► బాధితులు కోలుకుంటున్న వైనం, చికిత్స అందుతున్న తీరును అధికారులు వివరించారు. ► గాలిలో గ్యాస్ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని అధికారులు తెలిపారు. దీనిపై నిపుణులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారని వివరించారు. ► కంపెనీకి సమీపంలోని గ్రామాల్లో స్టైరీన్ గ్యాస్ అవశేషాలను తొలగించేందుకు చేపడుతున్న చర్యలపై అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ► గ్రామాల్లో ముమ్మరంగా పూర్తి స్థాయిలో శానిటేషన్ నిర్వహించాలని, అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాతే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ► బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలన్నారు. ► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరే వరకు ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకోవాలని, వారికి మంచి సదుపాయాలు అందేలా చూడాలని సూచించారు. ► తర్వాత కూడా వారికి వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ► ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం కోసం ప్రజలూ ఎక్కడా తిరగకుండా పారదర్శకంగా గ్రామ వలంటీర్ల ద్వారా నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందించాలని ఆదేశించారు. ► ప్రమాదానికి కారణమైన స్టైరీన్‌ను విశాఖ నుంచి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. -
గ్యాస్ లీక్ ఘటన యాజమాన్య వైఫల్యమే
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరగటానికి పరిశ్రమ యాజమాన్య వైఫల్యమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడానికి తాము సిద్దంగా లేమని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల సూచనల మేరకే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైతే ఫ్యాక్టరీని జనావాసాల మధ్య నుంచి తరలిస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా గ్రామాలలో పూర్తిగా కెమికల్ శుద్ది చేసిన తర్వాతే ప్రజలని ఇళ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. చంద్రబాబులా తాము ఏది పడితే అది మాట్లాడలేమన్నారు. రేపటి నుంచి బాధితులకి నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. టీడీపీది డ్రామా కంపెనీ.. స్క్రిప్ట్ చదివి నాటకం రక్తి కట్టించామా లేదా అని చూసుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు. చదవండి : ఆ కుటుంబాలకు పరిహారం అందించండి: సీఎం జగన్ -
ఆ కుటుంబాలకు పరిహారం అందించండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆదివారం తన నివాసంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కంపెనీలో గ్యాస్ లీకేజీని అరికట్టడానికి తీసుకున్న చర్యలను, కంపెనీ సమీప గ్రామాల్లో స్టెరెన్ గ్యాస్ అవశేషాల తొలగింపునకు చేపడుతున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ముమ్మరంగా శానిటైజేషన్ జరపాలని.. అన్నిరకాల చర్యలను తీసుకున్న తర్వాతనే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని.. ఈ రోజు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని.. రేపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ( విదేశాల నుంచి వచ్చేవారి వివరాలు నమోదు ) మిగిలిన వారికి కూడా ప్రకటించిన విధంగా సహాయం అందించడానికి తగినన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాధితులు కోలుకుంటున్న వైనం, వారికి చికిత్స అందుతున్న తీరును అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు నివేదించారు. గాలిలో గ్యాస్ పరిమాణం రక్షిత స్థాయికి చేరిందని తెలిపారు. దీనిపై నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నారని వివరించారు. ( వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్ ) -
బాబుకు విదేశీ మోజు ఎక్కువ: అందుకే..
సాక్షి, విశాఖపట్నం : ‘ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి విదేశీ మోజు ఎక్కువ. మనలాంటి సాధారణ మనుషులంటే ఆయనకి పడదు.. సూటు,బూటు వేసుకున్న వాళ్లంటేనే ఇష్టం’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకి అభద్రతా భావం పెరిగిపోయిందని అన్నారు. ఆయన హయాంలోనే నిబంధనలకి విరుద్దంగా ఎల్జీ పాలిమర్స్‌కి ఇష్టానుసారం అనుమతులిచ్చేశారని తెలిపారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎల్జీ పాలిమర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకపోయినా ప్లాంట్ విస్తరణకి బాబు హయాంలో అనుమతులు ఇవ్వలేదా.. సింహాచలం దేవస్ధానం భూములని సైతం అక్రమంగా డీనోటిఫై చేసి ఎల్జీ పాలిమర్స్ అప్పగించింది మీరే కదా బాబు? అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బాబుకు ఎక్కడిది ‘‘ చంద్రబాబుకి మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలని ఎవరినీ నమ్మేవారు కాదు. సీఎం వైఎస్ జగన్ మమ్మల్ని, అధికారులని నమ్మి బాధ్యతలు అప్పగించారు. బాబుకి తానొక్కడినే ప్రచారం పొందాలనే యావ ఎక్కువ. తన హయాంలో జరిగిన ప్రమాదాలపై ఎలా స్పందించారో ప్రజలకి తెలియదా?. ప్రజలు అమాయకులు కాదు... ఆయన తప్పుడు ఆరోపణలను గమనిస్తున్నారు. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ స్పందించిన తీరును అందరూ అభినందిస్తుంటే బాబు ఓర్వలేక విమర్శిస్తున్నారు. చంద్రబాబు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. ( 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' ) ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండేదికాదు. చాలా వేగంగా స్పందించి ప్రమాద స్ధాయిని తగ్గించగలిగాం. గంట ఆలస్యమైనా ప్రమాద స్ధాయి ఎక్కువగా ఉండేది. సీఎం జగన్‌కు చంద్రబాబులా ప్రచారయావ లేదు. ముఖ్యమంత్రి మనసుతో ఆలోచించే బాధిక కుటుంబాలకి కోటి రూపాయిలు నష్టపరిహారం ప్రకటించారు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానాల’’ని హితవుపలికారు. -
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే గ్రామాల్లోకి
సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద స్టైరిన్ గ్యాస్ లీకేజీ పూర్తిగా అదుపులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద స్టెరైన్ లీకేజీ జీరో శాతానికి చేరుకుందని ఆయన వెల్లడించారు. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన నిపుణులు ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.భద్రతాపరంగా ఇక ఇబ్బంది ఉండదని నిపుణులు స్పష్టం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. నిరంతరాయంగా ట్యాంక్ వద్ద స్టైరిన్ శాతాన్ని, ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. (అణువణువూ శోధన) ఇక ప్రమాదం జరిగిన సమీపంలోని అయిదు గ్రామాలలో నిపుణుల సూచలన మేరకు శానిటైజ్ చేయబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రజల భద్రత, ఆరోగ్యమే తమకు ప్రధానమన్న కలెక్టర్... గ్రామాలలోకి ప్రజలని అనుమతించే విషయంలో నిపుణుల సూచనలని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మట్టి, నీరు తదితర శాంపిల్స్‌ను నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ నిపుణులు సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు. (బాబు నిర్వాకం.. విశాఖకు శాపం) గ్రామాలలోకి ప్రజలు ఇంకా వెళ్లవద్దని, శానిటైజేషన్ ప్రక్రియకి ఒకటి, రెండు రోజులు పడుతుందని చెప్పారు. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ప్రజలని గ్రామాలలోకి వెళ్లనిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం తరపున కోటి రూపాయిల నష్టపరిహారాన్ని ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఒకట్రొండు రోజులలో బాధిత కుటుంబాలకి చెక్‌లు అందిస్తామని తెలిపారు. (నిశ్శబ్దం నిర్మానుష్యం) -
‘ఎల్జీ పాలీమర్స్ విస్తరణకు బాబే అనుమతిచ్చారు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు విశాఖలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో పరిస్థితులు పరిష్కర దశలో ఉండంగా చంద్రబాబు సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. 2017లో ఎల్జీ పాలీమర్స్ విస్తరణకు అనుమతులు ఇచ్చిందే చంద్రబాబు అని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్‌పై చిన్న కేసులు పెట్టారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలు ఇవ్వగానే, వాటికి అనుబంధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే విషయం బాబుకు తెలియంది కాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ రోజు సీఎం జగన్మోహన్రెడ్డి రూ.కోటి పరిహారం ఇస్తూ ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. విశాఖ సమస్య పరిష్కారానికి సీఎస్‌తో సహా ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే ఉండి సమీక్షిస్తున్నారని మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కమిటీ సమస్యలు సృష్టించి, ప్రజల్ని ఆందోళన వైపు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. -
వారేమైనా రసాయన శాస్త్రవేత్తలా?: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ ఘటనపై తమ ప్రభుత్వమేమి తప్పించుకోవడంలేదని మంత్రి కురసాల కన్నాబాబు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే సీఎం నుంచి కింది స్థాయి వరకు అంతా వేగంగా స్పందించామని గుర్తుచేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాద సమయంలో అలారం ఎందుకు మోగలేదని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారని వివరించారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ యాజమాన్యంతో సీఎం మాట్లాడితే తప్పన్నట్లు కొందరు పనికట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి సమాధానం చెప్పండి చంద్రబాబు ‘1998 లో మీరు సీఎం(చంద్రబాబు)గా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగితే అప్పుడు మీరేం చేశారు?. నిబంధనలకి విరుద్దంగా ఎల్జీ పాలిమర్స్‌కు మీ హయాం(2015)లో విస్తరణకు ఎలా అనుమతులిచ్చారు?. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా 2023 వరకు ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతులిచ్చింది మీరు కాదా?. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే మానం ఆంజనేయులు లేఖ రాస్తే ఎందుకు స్పందించలేదు? నిబంధనలకు విరుద్దంగా అనుమతులివ్వడంపై ప్రశ్నిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి శర్మకి ముందుగా సమాధానం చెప్పండి. నిబంధనలను పట్టించుకోకుండా సింహాచలం దేవస్థానానికి చెందిన వందల ఎకరాలని డీ నోటిఫై చేసి మరీ ఎల్జీ పాలిమర్స్‌కు మీరు అప్పగించలేదా? జీవిఎంసీ పరిధిని ఎల్జీ పాలిమర్స్ వరకు పెంచినప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీ వల్ల ప్రజలకి ఇబ్బంది అని తెలీదా? ఐఏఎస్ కమిటీలను ఎలా విమర్శిస్తారు? ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించింది. ఐఏఎస్‌లతో కూడిన ఈ కమిటీలను చంద్రబాబు ఎలా విమర్శిస్తారు. వారికేం తెలుసని అడగడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నియమించిన టీడీపీ కమిటీలో ఉన్న అచ్చెన్నాయుడు, చిన్నరాజప్ప, రామానాయుడు రసాయన శాస్త్రవేత్తలా? నగరంలో గెయిల్ ప్రమాదం జరిగితే చంద్రబాబు ఎలాంటి నష్టపరిహారం ఇచ్చారో అందరికీ తెలుసు. పుష్కరాల తొక్కిసలాట వల్ల చనిపోయిన కుటుంబాలను ఎలా ఆదుకున్నారో ప్రజలందరికీ గుర్తుంది. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు’ అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: ‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’ ఆందోళన వద్దు... మీ బాధ్యత మాది -
‘బాబు విమర్శలను పట్టించుకోనవసరం లేదు’
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో ప్రమాదాల సమయంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలా స్పందించారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కాగా బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఫ్యాక్టరీలో1998లో అగ్నిప్రమాదం జరిగిందని, మరి అప్పుడెందుకు మూసేయలేదని ప్రశ్నించారు. (ఆందోళన వద్దు... మీ బాధ్యత మాది) కేంద్రం అనుమతివ్వకున్నా మీరెలా అనుమతిచ్చారు? అంతేకాక హెచ్పీసీఎల్లో ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీని తరలించాల్సింది కదా అని ప్రశ్నించారు. బాబు హయాంలో సింహాచలం భూములను డీనొటిఫై చేసి మరీ ఎల్జీ పాలిమర్స్‌కు అప్పగించింది వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా వీటికి మీ హయాంలో ఎలా అనుమతిలిచ్చారని వరుస ప్రశ్నలు సంధించారు. వారి నిర్లక్ష్యమే ఇప్పటి ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. 'చంద్రబాబు హయాంలో ఏం చేసినా అది న్యాయం.. సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏం చేసినా అన్యాయం అవుతుందా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల శ్రేయస్సే తమకు అత్యంత ప్రాధాన్యమని ఉద్ఘాటించారు. నిపుణుల సూచనల మేరకే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని అమర్నాథ్ వెల్లడించారు. (‘నేను.. 3 గ్రామాలు.. నా 33 వేల ఎకరాలు’) -
‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాద స్థలంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి మంత్రుల బృందంతో సమామేశమై తాజా పరిణామాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. సాయంత్రానికి 48 గంటల పూర్తవుతున్ననేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు ఐదు గ్రామాల ప్రజలను వెనక్కి పంపించే విషయమై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. (చంద్రబాబు హయాంలో రూ. కోటి పరిహారం ఇచ్చారా? ) ప్రస్తుతం స్టైరిన్ అదుపులోకి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లడం దారుణమని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఎల్జీ పాలిమర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏం చర్యలు తీసుకున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. సింహాచలం దేవస్ధానం భూములను సైతం డీనోటిఫై చేయలేదా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండానే ఫ్యాక్టరీ విస్తరణకు మీరు ఎలా అనుమతులిచ్చారని ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. (బాబు నిర్వాకం.. విశాఖకు శాపం) చంద్రబాబు తప్పిదాల వల్లే ఈ రోజు ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ప్రమాదం జరిగి ఉండేది కాదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. చంద్రబాబు తప్పు చేసి తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఏ నాయకుడు స్పందించని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి రూ.కోటి నష్ట పరిహారం ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. రూ.30 కోట్లు విడుదల చేస్తూ జీఓ కూడా జారీ చేశామని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చర్యలపై ప్రతిపక్షాలన్నీ అభినందించినా చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు కుటిల రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయని మంత్రి మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా పలు కమిటీలు వేశామని ఆయన తెలిపారు. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. అన్ని కమిటీల సూచనలతో భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
అణువణువూ శోధన
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ చైర్మన్‌గా, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణాలు అన్వేషించేందుకు ఈ బృందం క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. కరికాల వలవన్ నేతృత్వంలో బృంద సభ్యులు శనివారం పరిశ్రమని సందర్శించి అణువణువూ పరీక్షించారు. ప్లాంట్‌లోని ప్రతి ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలను నిశితంగా పరిశీలించారు. ప్రమాదం సంభవించినప్పుడు ట్యాంకులో సుమారు రెండు వేల మెట్రిక్ టన్నుల స్టైరీన్ నిల్వ ఉంది. 40 రోజులుగా ట్యాంకులో నిల్వ ఉండటం, లోడ్, అన్లోడ్ చర్యలు లేకపోవడంతో ఆటో పాలిమరైజేషన్ స్థితికి చేరుకుంది. ఫలితంగా స్టైరీన్.. వాయువు రూపంలోకి మారిపోయింది. ట్యాంకులో ఒత్తిడి పెరిగితే వాల్వులు వాటికవే తెరుచుకుని అది బయటకు వెళుతుంటుంది. వాల్వ్ ఏమాత్రం తెరుచుకోకున్నా ట్యాంక్ పేలిపోయేదే. అదే జరిగితే పక్కనే ఉన్న మూడు వేల మెట్రిక్ టన్నుల ట్యాంక్ కూడా పేలిపోయేది. అదృష్టవశాత్తు ట్యాంక్‌కు ఉన్న వాల్వ్‌లు పనిచేస్తున్నట్టు కమిటీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. వాయు రూపంలో ట్యాంకు నుంచి స్టైరీన్ వెళ్లిపోవడంతో ప్రస్తుతం 1650 మెట్రిక్ టన్నులు మాత్రమే ట్యాంకులో ఉన్నట్టు నిపుణుల కమిటీ గుర్తించింది. పరిస్థితి అదుపులోనే ఉంది ► ట్యాంకు ఉపరితల ఉష్ణోగ్రతలతో పాటు, లోపలి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు సంభవించినా అది వాయు రూపంలోకి మారిపోతుంటుంది. ► ప్రెజర్ కుక్కర్లో ఆవిరి పెరిగినప్పుడు విజిల్ రూపంలో బయటికి వచ్చే మాదిరిగా... వాల్వ్ నుంచి వస్తుంటుంది. ► లోపలి ఉష్ణోగ్రతలు 150 డిగ్రీల వరకూ, బయటి ఉష్ణోగ్రతలు 110 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులో ఒత్తిడి పెరిగింది. ► యాంటీ డాట్‌గా పీటీబీసీ పంపించడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ► లోపలి ఉష్ణోగ్రతలు 76 డిగ్రీలకు చేరుకుంటే భద్రంగా ఉన్నట్టని నిపుణులు చెబుతున్నారు. ► ప్రస్తుత ఉష్ణోగ్రత 75 డిగ్రీలకు చేరుకున్నట్టు కమిటీ గుర్తించి పరిస్థితి అదుపులో ఉన్నట్టు తెలిపింది. గాలిలో స్టైరీన్ శాతం తగ్గుముఖం ► గాలిలో స్టైరీన్ మోనోమర్ శాతం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ► ప్రస్తుతం కంపెనీ పరిసరాల్లో 1.9 పీపీఎంగా నమోదవుతోంది. ► అయితే పరిశ్రమలో ఉత్పత్తి జరిగినప్పుడు గాలిలో 50 పీపీఎం వరకూ స్టైరీన్ మోనోమర్ విడుదలవుతుంటుంది. ఈ పరిమాణం వరకూ ఉంటే 8 గంటల పాటు విధులు నిర్వర్తించే ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందేం లేదని నిపుణుల బృందానికి ఎల్జీ పాలిమర్స్ సంస్థ సేఫ్టీ బృందం గణాంకాలతో సహా వివరించింది. ► ఆ కోణంలో విచారించేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ► అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని కమిటీ సభ్యులు చెబుతున్నారు. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం.. ట్యాంకులో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గంటగంటకూ రీడింగ్ నమోదుచేసి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల్ని గుర్తిస్తున్నాం. 30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుంటే స్టైరీన్ మోనోమర్ ఘన స్థితిలోకి చేరుకుంటుంది. అప్పుడు లీకేజీ సమస్య ఉండదు. ప్రమాదానికి కారణాల్ని అన్వేషిస్తున్నాం. – కరికాల వలవన్, రాష్ట్ర ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సభ్యుడు సాధారణ స్థితికి చేరుకుంది ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఎల్జీ పాలిమర్స్‌లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి పరిహారం ప్రకటించడం దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఎక్కడా లేదు. ప్రభుత్వానికి సలహాలివ్వాలిగానీ రాజకీయంగా రెచ్చగొట్టి పరిస్థితుల్ని మరింత ఉద్రిక్తం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. – ఆర్.వీరారెడ్డి, ప్రభుత్వ పరిశ్రమల శాఖ సలహాదారు -
ఆందోళన వద్దు... మీ బాధ్యత మాది
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్ సంస్థ సమీప గ్రామాల ప్రజల భద్రత, రక్షణ తమ బాధ్యతని డీజీపీ సవాంగ్ భరోసానిచ్చారు. ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన దురదృష్టకరమైందని విచారం వ్యక్తం చేశారు. విషవాయువుల నుంచి ఐదు గ్రామాల ప్రజల ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శనివారం ఆయన గోపాలపట్నంలో ఎల్జీ పాలీమర్స్‌ని సందర్శించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అనంతరం సంస్థలోపల విష వాయువులు లీకైన ట్యాంక్‌లను పరిశీలించి టెక్నికల్ నిపుణులు, యాజమాన్యంతో చర్చించారు. మూడు కిలోమీటర్ల పరిధిలో గల సమీప గ్రామాల్లో పరిస్థితులను పరశీలించారు. ఆయన వెంట అడిషనల్ డీజీ, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు, డీసీపీ – 2 ఉదయ్‌భాస్కర్ బిల్లా, డీసీపీ సురేష్‌బాబు పాల్గొన్నారు. ► ఎల్జీ పాలిమర్స్ ట్యాంక్‌ల ఉష్ణోగ్రత ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం విషవాయువులు విడుదల కావడంలేదు.. ప్రజలెవ్వరూ ఆందోళన చెందనవసరం లేదు. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. అయితే సాధారణ స్థితికి రావడానికి మరో 24 గంటలు సమయం పడుతుంది. అప్పటివరకు సమీప గ్రామాల్లోకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ► చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, మంత్రులు ప్రమాద పరిస్థితులపై, ప్రజలకు వైద్య సౌకర్యాలపై çగత రెండు రోజులుగా నగరంలోనే ఉంటూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలను తీసుకొచ్చింది. ► ప్రమాదంపై వివరాలు తెలుసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ► ప్రస్తుతం కంపెనీపై కేసు నమోదు చేశాం.. దర్యాప్తు కూడా కొనసాగుతోంది. యాజమాన్యం తప్పిదాలపై కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. -
చంద్రబాబు హయాంలో రూ. కోటి పరిహారం ఇచ్చారా?
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్‌లీక్ ఘటనలో 12 మంది చనిపోవడం దురదృష్టకరమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (కొడాలి నాని) ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సాయం ఇచ్చారన్నారు. దేశంలో ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు ఇంత పెద్ద ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్ మాత్రమేనన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పలుచోట్ల చాలా ఘటనలు చోటు చేసుకొని చాలా మంది చనిపోయారు. ఎప్పుడైనా మృతి చెందిన ఒక్కరంటే ఒక్కరికి రూ. కోటి పరిహారం ఇచ్చారా అని నిలదీశారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మరో మంత్రి పేర్ని నానితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► విషవాయువు వ్యాపించిన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తాం. హెల్త్ కార్డులు జారీ చేసి వారికి దీర్ఘకాలం వైద్యసేవలు అందేలా చూస్తాం. ► 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో అగ్నిప్రమాదం జరిగితే ఎందుకు మూయించలేదో సమాధానం చెప్పాలి. హిందూస్థాన్ పాలిమర్‌ను.. ఎల్జీ పాలిమర్స్‌గా మార్చింది, అందుకు బ్రోకర్‌గా వ్యవహరించింది బాబునే. 2017లో కూడా కంపెనీ విస్తరణకు పర్మిషన్ ఇచ్చిందీ ఆయనే. ► గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార సినిమా షూటింగ్ వల్ల 30 మంది చనిపోయారు. వాళ్లు బతికొస్తారనే చంద్రబాబు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా? పరిహారంపై గతంలో ఒక విధంగా.. నేడు మరొకలా బాబు మాట్లాడుతున్నారు. ► ఇప్పటికైనా బాబు లుచ్చా మాటలు ఆపి ఆక్సిజన్ పెట్టుకుని హైదరాబాద్‌లోని అద్దాల కొంపలో కూర్చొంటే బాగుంటుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ► గ్యాస్ లీక్ ఘటనను నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. ప్రజల భద్రతే మాకు ముఖ్యం. ఫ్యాక్టరీ వల్ల ప్రమాదముందని నివేదిక వస్తే చర్యలు తీసుకుంటాం. బాబు టీడీపీకి చెందిన దద్దమ్మలతో డ్రామా కమిటీ వేశారు. ► ఎల్జీ కంపెనీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది. -
బాబు నిర్వాకం.. విశాఖకు శాపం
విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్‌కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది. జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, కార్యకలాపాలు ప్రారంభించడానికి నిబంధనలకు విరుద్ధంగా గత చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఏకపక్షంగా అనుమతులు ఇచ్చింది. ప్రమాదకరమైన ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిద్దామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించినా, నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు. సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖలో జనావాసాల మధ్య ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ విస్తరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పలు అనుమతులు ఇచ్చింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని పెందుర్తి మండలం ఆర్ ఆర్ వెంకటాపురంలో 213 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. 415 టీపీడీ సామర్థ్యంతో ఉన్న ఫ్యాక్టరీని రూ.168 కోట్ల వ్యయంతో 655 టీపీడీ సామర్థ్యానికి విస్తరించాలని యాజమాన్యం 2016లో నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసింది. కాగా ప్రమాదకరమైన రసాయన వాయువులతో ముడి పడిన ఈ పరిశ్రమ విస్తరణ అంశాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయపడింది. జనావాసాల మధ్యలో ఉన్న ఈ పరిశ్రమ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం తానుగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉన్నతాధికారులు భావించారు. ఆ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి భేటీ మినిట్స్‌లోనూ నమోదు చేశారు. ఫ్యాక్టరీని తరలించాలని నిపుణుల డిమాండ్ ► ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు సన్నద్ధమవుతుండటంతో విశాఖలోని నిపుణులు అభ్యంతరం తెలిపారు. పరిశ్రమ జనావాసాలకు సమీపంలో ఉండటం పట్ల భయాందోళనలు వ్యక్తం చేశారు. ► ఈ ఫ్యాక్టరీని 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ మిగులు భూముల్లో నెలకొల్పిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బదులుగా వేరే చోట భూములు కేటాయించి తరలించాలని డిమాండ్ చేశారు. విస్తరణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కూడా పట్టుబట్టారు. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని అప్పట్లో డిమాండ్ చేశారు. మనమే అనుమతి ఇచ్చేద్దాం.. చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు, కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్(సీఎఫ్‌ఇ), కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్(సీఎఫ్‌వో)కు తాజాగా 2018 డిసెంబర్ 27న అనుమతులు జారీ చేసింది. ఇవి 2025 డిసెంబర్ 26 వరకు అమలులో ఉండేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమాచారమిచ్చి చేతులు దులిపేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణకు 2023 ఏప్రిల్ వరకు అనుమతి ఇస్తూ టీడీపీ ప్రభుత్వం 2018 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేవని ఒప్పుకున్న ఎల్జీ పాలిమర్స్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేశామని, ఇంకా తమకు మంజూరు కాలేదని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యమే స్వయంగా పేర్కొంది. ఈ మేరకు 2019 మే 8న (అప్పటికి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది) ఆ కంపెనీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ► ఈ పరిస్థితిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తామని, ఎలాంటి అపరాధ రుసుము అయినా చెల్లిస్తామని కూడా పేర్కొనడం గమనార్హం. టీడీపీ హయాంలో తూతూమంత్రంగా తనిఖీలు ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి భూ పందేరం చేయడమే కాకుండా.. దాని విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గత టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఆ కంపెనీలో లోటుపాట్లను కనీస మాత్రంగానైనా పట్టించుకోలేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే విస్తరణకు అనుమతులిచ్చిన టీడీపీ సర్కారు.. సదరు సంస్థ ఉత్పత్తిని పెంచుకునేలా అడ్డగోలు అనుమతులిచ్చింది. అప్పటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలను సైతం తూతూమంత్రంగా నిర్వహించి, మొక్కుబడి నివేదికలు సమర్పించింది. 2016 సెప్టెంబర్ 16న, 2017 మార్చి 21న, 2017 అక్టోబర్ 27న, 2018 ఏప్రిల్ 23న, 2018 అక్టోబర్ 12వ తేదీన.. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి ఎటువంటి సూచనలు, ఆదేశాలు గానీ జారీ చేయలేదు. బాబుకు ఆది నుంచి ప్రత్యేక ఆసక్తి ► ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ అని పిలుస్తున్న ఈ ఫ్యాక్టరీని 1961లో ‘హిందుస్థాన్ పాలిమర్స్’ పేరుతో స్థాపించారు. అప్పట్లో విశాఖకు దూరంగా ఉన్న ఆర్.ఆర్.వెంకటాపురంలో నెలకొల్పారు. హిందుస్థాన్ పాలిమర్స్‌ను 1978లో యూబీ గ్రూప్‌నకు చెందిన మెక్‌డోనాల్డ్స్ కంపెనీ టేకోవర్ చేసింది. ► 1997లో చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీని యూబీ గ్రూప్ నుంచి దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కొనుగోలు చేసింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు యూబీ గ్రూప్‌నకు డీలర్‌గా ఉండేవారు. ఆ గ్రూప్ చైర్మన్ విజయ మాల్యాకు ఆదికేశవులు వ్యాపార భాగస్వామి. ► ఎల్జీ కంపెనీ ప్రమోటర్లు 1997లో అప్పటి సీఎం చంద్రబాబు, డీకే ఆది కేశవుల ద్వారానే కథ నడిపించి యూబీ గ్రూప్ నుంచి ఈ ఫ్యాక్టరీని కొనుగోలు చేసినట్టు సమాచారం. అందుకే చంద్రబాబు ఎల్జీ కంపెనీ పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు. ► 1961లో ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం విశాఖపట్నం నగరానికి దూరంగా ఉండేది. కానీ 2017 నాటికి జనావాసాల మధ్య ఉన్న ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లో 1998లో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. నేను అప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నాను. కంపెనీని తరలించాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ శివాజీ రావు నాకు లేఖ రాశారు. నేను ఆ లేఖ విషయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని చంద్రబాబుకు వివరించాను. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక కంపెనీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందని ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. – మానం ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి అప్పన్న భూములను కట్టబెట్టిన బాబు ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఉన్న భూముల్లో 162.75 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి చెందినవి. ఈ భూములను స్వాధీనం చేసుకోడానికి దేవస్థానం ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని సూచించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ 162.75 ఎకరాల్లోని 128.24 ఎకరాలను డీ నోటిఫై చేస్తూ ఎల్జీ పాలిమర్స్‌కు అనుకూలంగా 2015 ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా 34.51 ఎకరాల గురించి కూడా నెలరోజుల్లో తేల్చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.10 కోట్ల పైమాటే. అంటే రూ.1,620 కోట్ల విలువైన భూమిని ఎల్జీ పాలిమర్స్ పరమయ్యాయన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇంతటి ప్రమాదకరమైన పరిశ్రమ జనావాసాలకు సమీపంలో ఉండటం ప్రమాదకరం. ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ పొందలేదు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంతటి ప్రమాదానికి కారణమైన కంపెనీ ప్రమోటర్లపై కేసు నమోదు చేయాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి -
బాధితుల ముసుగులో శవ రాజకీయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సింహాచలం: ఎల్జీ పాలిమర్స్ బాధితుల ముసుగులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. కంపెనీ ముందు శవ రాజకీయాలకు దిగాయి. నిజమైన బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతో పోలీసులు సంయమనంతో వ్యవహరించడాన్ని అలుసుగా తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులపై రాళ్లు రువ్వాయి. అయినప్పటికీ పోలీసులు ఓపిగ్గా బాధితులకు నచ్చజెప్పడానికే ప్రయత్నించారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కంపెనీ పట్టించుకోదా? ► ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకై 12 మంది మృతి చెందడంతో బాధితులు శనివారం కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మూడు మృతదేహాలతో ధర్నాకు దిగారు. ప్రమాదానికి కారణమైన కంపెనీని జనావాసాల మధ్య నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ► యాజమాన్య ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. కంపెనీ నిర్లక్ష్యానికి ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని ప్రకటించినా, యాజమాన్యం కనీసం తమని పట్టించుకోకపోవడం పట్ల మండిపడ్డారు. టీడీపీ శ్రేణుల రాకతో ఉద్రిక్తత ► అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన ఆందోళన టీడీపీ నేతల రాకతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. బాధితుల ముసుగులో జనసేన, టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ► అప్పటి వరకు కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా బాధితులు ఆందోళన చేపడితే.. టీడీపీ నేతలు ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు, నినాదాలు చేయడంతో బాధితుల గోడు రాజకీయ రంగు పులుముకుంది. దీంతో నిజమైన బాధితుల డిమాండ్లు పక్కకుపోవడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ► ఇంతలో జనసేన, టీడీపీ మరింత రెచ్చిపోయారు. ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులపై రాళ్లు రువ్వారు. కంపెనీ గేట్లు దూకి లోపలకు దూసుకొచ్చారు. దీంతో కొంత సేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ► కంపెనీలో పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్ అప్పటికే సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన కంపెనీలో ఉండగానే టీడీపీ నేతలు బయట రెచ్చిపోయారు. డీజీపీని, ఇతర పోలీసు ఉన్నతాధికారులను అక్కడ నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఒక దశలో వారిపై కూడా తిరగబడ్డారు. ► అయినప్పటికీ పోలీసులు తమ పంథాకు వ్యతిరేకంగా వ్యవహరించారు. తమ అధికారాన్ని ఏ మాత్రం ప్రదర్శించలేదు. ఓపికగా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజా శ్రేయస్సే ముఖ్యం.. ► సంఘటనా స్థలానికి మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, గుమ్మలూరి జయరాం చేరుకున్నారు. నిజమైన బాధితులు, మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా తమకు పరిహారంతో పాటు తక్షణ వైద్య సహాయం అందిందనీ.. అయితే కంపెనీ యాజమాన్యం మాత్రం ఇంత వరకూ పట్టించుకోలేదనే కోపంతోనే రోడ్డెక్కామని చెప్పారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల సంక్షేమం, శ్రేయస్సే ముఖ్యమని, నిబంధనలకు విరుద్ధంగా, నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలకు హాని చేసే బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు కాదని మంత్రి ముత్తంశెట్టి బాధితులకు స్పష్టం చేశారు. స్థానిక గ్రామ ప్రజల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పారు. ► ఇప్పటికే కంపెనీలో జరిగిన ప్రమాదంపైనే కాకుండా, భవిష్యత్తు పరిణామాలపై కూడా విచారణ చేపట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వారికి వివరించారు. ఆ కమిటీల నివేదికల ఆధారంగా ప్రజలకు మేలు జరిగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు బాధితులకు హామీ ఇచ్చారు. దీంతో బాధితులు, మృతుల కుటుంబీకులు ఆందోళన విరమించారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు చేసేదేమీ లేక వెనుదిరిగారు. -
అంతా అప్రమత్తం
విశాఖలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయినప్పటికీ సీఎం సూచన మేరకు పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులందరూ అక్కడే ఉన్నారు. స్వయంగా అన్ని విషయాలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వైద్య సేవల్లో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ బాధితుల్లో కొండంత ధైర్యం నింపుతున్నారు. వివిధ కమిటీల ద్వారా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ శనివారం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలు అన్వేషించడంలో భాగంగా ఈ బృందం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో అణువణువూ పరిశీలించింది. గాలిలో స్టైరీన్ మోనోమర్ శాతం కూడా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం కంపెనీ పరిసరాల్లో 1.9 పీపీఎంగా నమోదవుతోంది. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడు కరికాల వలవన్ తెలిపారు. గంటగంటకూ రీడింగ్ నమోదు చేసి, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు గుర్తిస్తున్నామన్నారు. పశువులకూ వైద్యం ► సీఎం ఆదేశాల మేరకు ప్రమాద ప్రాంతంలో పశువులకూ వైద్యం కొనసాగుతోంది. పలు గ్రామాల్లో పశువులకు సెలైన్ ఎక్కిస్తున్నారు. 13 వెటర్నరీ బృందాలు పని చేస్తున్నాయి. ► బాధిత గ్రామాల్లో వైద్య సదస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పారు. మృతుల బంధువులను వారు పరామర్శించారు. ► ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ సమీప గ్రామాల్లోని ప్రజల భద్రత తమ బాధ్యత అని డీజీపీ గౌతమ్ సవాంగ్ భరోసా కల్పించారు. శనివారం ఆయన ప్లాంట్‌ను సందర్శించారు. ఇప్పుడే కంపెనీని తెరవం ► ఎల్జీ పాలిమర్స్‌లో పరిస్థితులపై వివిధ కమిటీల అధ్యయనం తర్వాత ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని, అంతవరకు కంపెనీ తెరిచే ప్రసక్తే లేదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వైద్యానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం సీఎం ప్రకటించారన్నారు. లీగల్ హెయిర్ రిపోర్టు ఆదివారం తెప్పిస్తారని చెప్పారు. ► విశాఖ జిల్లాలో ఉన్న అన్ని రసాయనిక కర్మాగారాల పరిస్థితిని నిపుణుల బృందంతో తనిఖీ చేయిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభావిత గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌లను వాడవద్దని నిపుణులు చెప్పారని, బోర్‌వెల్స్‌నూ పరిశీలిస్తారన్నారు. ► బాధితులకు సత్వర వైద్యం, పరిహారం, వసతి, నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా వ్యవహరిస్తోంది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ నీలం సాహ్ని మూడు రోజులుగా విశాఖలోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ► గ్యాస్ ప్రభావం అత్యల్ప స్థాయికి తీసుకొస్తున్న తీరుతెన్నులు, బాధిత ప్రజలకు అందుతున్న వైద్యం, షెల్టర్లలో సౌకర్యాలపై మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షించారు. వేగంగా కోలుకుంటున్న బాధితులు ► గ్యాస్ లీకేజీతో తీవ్రంగా, స్వల్పంగా అస్వస్థతకు గురైన 585 మంది కేజీహెచ్‌తో పాటు విశాఖ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన సంగతి తెలిసిందే. ► కేజీహెచ్‌లో చేరిన 418 మందిలో 111 మంది పూర్తిగా కోలుకోవడంతో శనివారం డిశ్చార్జి చేశారు. మిగతా 307 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన 167 మందిలో 62 మంది డిశ్చార్జి అయ్యారు. పరిహారం అందజేతకు ఏర్పాట్లు ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వడం కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ పరిహారాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందించేందుకు అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా గుర్తింపు పత్రాలను సేకరిస్తున్నారు. ఆదివారం ఈ ప్రక్రియ కొలిక్కిరానుంది. గ్యాస్ ప్రభావంపై అధ్యయనానికి కమిటీలు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గురువారం లీకైన స్టైరీన్ గ్యాస్ ప్రభావంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక సాంకేతిక నిపుణుల కమిటీలు రంగంలోకి దిగాయి. విష వాయువు ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ కమిటీలు ప్రభుత్వానికి అవసరమైన సూచనలిస్తాయి. కేంద్రం నియమించిన నిపుణుల కమిటీలోని ఇద్దరు సభ్యులు శనివారం విశాఖకు వచ్చారు. ముంబైలోని సుప్రీం పెట్రోకెమికల్స్ సంస్థ నుంచి ప్రముఖ స్టైరీన్ నిపుణుడు శంతను గీటె, ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) డైరెక్టర్ అంజన్ రే ఇక్కడకు చేరుకున్నారు. ► ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, తదుపరి చర్యలను సూచించేందుకు ఇంటర్నల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► లీక్ లీకేజీ అనంతర పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు ప్రొఫెసర్లతో మరో కమిటీని నియమించారు.ప్రొఫెసర్ ఎస్.బాలప్రసాద్ , ప్రొఫెసర్ ఎస్వీ నాయుడు, ప్రొఫెసర్ జె.బాబూరావు, డాక్టర్ భానుకుమార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ► ప్రస్తుత పరిస్థితిపై ఆయా కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, గ్యాస్ లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు తెలిపేందుకు తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) సంస్థ నుంచి నిపుణులు విశాఖకు రానున్నారు. -
‘చంద్రబాబుకు మనసు లేదు’
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటనను రాజకీయం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురదచల్లే విధంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు, ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందన్నారు. పోలీసులు వెంటనే స్పందించకుండా ఉంటే ప్రమాద తీవ్రత మరోలా ఉండేదన్నారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించడమే కాకుండా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. (‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’) మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఐఏఎస్‌లపై అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబుకు తన మంత్రులపై నమ్మకం లేక తానే పనిచేసినట్లు ప్రచారం చేసుకోవడం అలవాటని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రచారం అవసరంలేదన్నారు. ఏడుగురు మంత్రులు, సీఎస్‌ను విశాఖలోనే ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఫ్యాక్టరీతో తమకు సంబంధంలేదని, ఆ కంపెనీపై ప్రత్యేక ప్రేమలేదని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఐదు గ్రామాల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు ప్రజలే ముఖ్యమని తెలిపారు. చంద్రబాబుకు మనసు లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో కూర్చోని ట్వీట్లు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. (‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’) -
ఇదేనా చంద్రబాబు చిత్తశుద్ధి: ఉమ్మారెడ్డి
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన బాధాకరమని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా వైఎస్ జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారని తెలిపారు. (‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’) ప్రతిపక్షాలన్నీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాయని.. కానీ చంద్రబాబు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రజలను వదిలేసి నేరుగా ఫ్యాక్టరీకే వెళ్తానన్నప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. విచారణ అనంతరం కంపెనీపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం కంపెనీకి అనుకూలంగా మాట్లాడాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తప్పుబట్టారు. (‘అవే ఆయనకు దినచర్యగా మారాయి’) -
‘ప్రజల భద్రతే ముఖ్యం కంపెనీ కాదు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజల భద్రతే ముఖ్యమని కంపెనీ కాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ అన్నారు. మంత్రులు శనివారం సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని అన్నారు. మృత దేహాలను త్వరగా తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. (విశాఖ విషాదం: ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ) సున్నితమైన సమయంలో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని మంత్రులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు తెలిపారు. (ప్రమాద స్థలిలో ఇదీ పరిస్థితి!) -
అయ్యో గ్రీష్మ.. అప్పుడే నూరేళ్లు..!
సాక్షి, అమరావతి : విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో చీకటిని నింపింది. ఈ ఘటనలో గ్రీష్మ అనే తొమ్మిదేళ్ల బాలికను విష వాయువు కబలించింది. హాయిగా నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా మృత్యువు ఆ చిన్నారిని కాటేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి అర్థరాత్రి నిద్రలోనే మృత్యువు ఒడికి చేరుకుంది. (చదవండి : విశాఖ విషాదం: ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ) ఆర్ ఆర్ వెంకటాపురంకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి గణేష్, లత దంపతుల కూతురే గ్రీష్మ. తొమ్మిదేళ్ల గ్రీష్మ నాలుగో తరగతి చదువుతోంది. గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిన రోజు రాత్రి గ్రీష్మ తల్లిదండ్రులతో కలిసి మేడపై నిద్రించింది. ఆమె పక్కింట్లో ఉండే బాబాయి కుటుంబం గ్యాస్ వాసన వస్తోందని అప్రమత్తమై.. సురక్షిత స్థలానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రీష్మ తండ్రికి ఫోన్ చేశారు. అయితే ఫోన్ తీయకపోవడంతో వాళ్ల ఇంటికి వెళ్లి చూసేసరికి కుటుంబ సభ్యులంతా ఒకరిపై ఒకరు స్పృహ లేకుండా పడి ఉన్నారు. దీంతో అందర్నీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గ్రీష్మ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. గ్రీష్మ తల్లిదండ్రులు, సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: శవాగారం.. శోకసంద్రం) కాగా, శనివారం ఉదయం గ్రీష్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చిన్నారి గ్రీష్మ మృతదేహాన్ని చూసి బంధువులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న తల్లిదండ్రులు తమ బిడ్డను కడసారి చూసేందుకు మార్చురీకి వచ్చారు. తమ బిడ్డ ఇక లేదనే విషాదంతో కన్నీటి పర్యంతం అయ్యారు. తర్వాత గ్రీష్మ మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకుని వెళ్లారు. (చదవండి : గ్యాస్ పీడ విరగడ!) కాగా, విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను శనివారం అప్పగించారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తుల అంత్యక్రియల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితులకు నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వదంతులను నమ్మొద్దు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. -
విశాఖ గ్యాస్ లీక్: క్షమాపణ కోరిన ఎల్జీ పాలిమర్స్
విశాఖపట్నం: మహా విషాదానికి కారణమైన గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రజలు, వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు అన్నివిధాల సహకరిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని పేర్కొంది. వెంటనే అమలు చేయగల సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి కచ్చితమైన చర్యలను తక్షణమే అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. బాధితులు, మరణించిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు ఎల్జీ పాలిమర్స్ వెల్లడించింది. స్థానికులకు దోహదపడేలా మధ్య, దీర్ఘకాలిక మద్దతు కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. (ఎల్జీ పాలిమర్స్ జీఎం స్పందన ఇది) విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున విషవాయువు లీకావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన 300 మందిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, గ్యాస్ లీకేజీ వల్ల జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ. 50 కోట్లను విశాఖ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలీమర్స్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిన్న ఆదేశించింది. ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను ఈరోజు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, జయరాం, డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. (రెండోసారి గ్యాస్ లీక్ కాలేదు: ఎన్డీఆర్ఎఫ్) -
గ్యాస్ లీక్ పరిస్థితి అదుపులో ఉంది: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొని, పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరామ్, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రులు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం మంత్రి అవంతి శీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వదంతులను నమ్మొద్దు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. (గ్యాస్ లీక్ బాధితులు కోలుకుంటున్నారు: కన్నబాబు) పరిస్థితి అదుపులో ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎల్జీ పాలిమర్స్‌ను గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మధ్యాహ్నానికల్లా ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తుందని ఆయన చెప్పారు. నిపుణుల బృందం పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. బయట నుంచి కొంతమంది వచ్చి కావాలనే ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు చేస్తున్న పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. (అప్రమత్తతతోనే ముప్పు తప్పింది ) -
సీఎం జగన్ స్పందన అభినందనీయం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ వ్యవస్థలన్ని స్పందించిన తీరు అద్భుతమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. ఆయన శినివారం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీకేజీ బాధితలును పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షణ క్షణం సమీక్షించి స్పందించటం అభినందనీయం అన్నారు. (అప్పుడలా.. ఇప్పుడిలా) మృతుల కుటుంబాలకు గాని, బాధితులకు కానీ అందిస్తున్న ప్యాకేజీ ఉహించనిదని ఆయన తెలిపారు. నేనున్నా అని నిజమగానే బాధిత కుటుంబాల మనసుల్లో వైఎస్ జగన్ ఉండిపోయారని ఆయన చెప్పారు. కొందరు రాజకీయ నేతలు, పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు అనాగరికమని పంచకర్ల రమేష్‌బాబు మండిపడ్డారు. (‘తండ్రీ కొడుకులను వ్యాన్‌లో మా రాష్ట్రానికి పంపండి’) -
గ్యాస్ లీక్ బాధితులు కోలుకుంటున్నారు: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్ ఆస్పత్రిలో సుమారు 300 మంది విష వాయువు బాధితులు చికిత్స పొందుతున్నారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆస్పత్రుల్లో బాధితులు కోలుకుంటున్నారని ఆయన చెప్పారు. మంత్రి కన్నబాబు శనివారం ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను గ్రామాల్లోకి అనుమతించలేదని ఆయన చెప్పారు. (గ్యాస్ లీక్‌పై విచారణకు హైపవర్ కమిటీ) అదేవిధంగా బాధత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించేందుకు ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ వినయ్‌చంద్, సీపీ ఆర్కే మీనా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (కరువు పొమ్మంది.. వాయువు ఆయువు తీసింది) -
శవాగారం.. శోకసంద్రం
పాతపోస్టాఫీసు (విశాఖ): విషాదం వెల్లువైంది. కన్నీరు కాలువకట్టింది. ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో మృతుల భౌతిక దేహాలను మార్చురీ వద్ద చూసిన బంధువుల ఆక్రందనలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. ఘటనలో మృతి చెందిన మెడికో మృతదేహాన్ని గురువారం అప్పగించారు. మిగిలిన 10 మంది మృతదేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి వైద్యాధికారులు మృతదేహాలను వారివారి బంధువులకు అప్పగించారు. మృతుల కుటుంబాలకు చెందినవారి ఆర్తనాదాలు, శోకాలతో పోస్టుమార్టం పరిసరాలు ప్రతిధ్వనించాయి. తమ వారి మృతదేహాల కోసం ఉదయం నుంచి పోస్టుమార్టం వద్ద బంధువులు పడిగాపులు పడ్డారు. కడసారి చూసుకుందామని కన్నీళ్లతో ఎదురుచూశారు. మృతదేహాలను చూసి గగ్గోలు పెట్టారు. ♦ నాగులాపల్లి గ్రీష్మ (9) మృతదేహాన్ని చూసి తల్లి ఎలుగెత్తి శోకించింది. కూతురు బాగుందని చెప్పి చివరికి శవాన్ని అప్పగించారా అంటూ అమె కన్నీళ్లు పెట్టుకుంది. గ్రీష్మ అన్న పార్ధు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ♦ గండిబోయిన కుందన శ్రియ (6) మృతదేహాన్ని చూసి తల్లి శోభ స్పృహ కోల్పోయింది. ఆమె అన్న శ్రీకర్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ♦ నేమర్తి నాని (30) కూలిపనులు చేసేవాడు. అతడి భార్య లక్ష్మి మార్చురీ వద్ద రోదించడంతో అందరి కళ్లు చెమర్చాయి. నాని తల్లి అప్పలనర్సమ్మకు విషయం తెలియకుండా బంధువులు జాగ్రత్త పడ్డారు. ♦ మృతురాలు రావాడ నారాయణమ్మ (45) భర్త సత్యవంతుడు విజయనగరం జిల్లా కల్లేపల్లిలో వ్యవసాయకూలీ. లాక్డౌన్ వల్ల అక్కడే ఉండిపోవడంతో మృతదేహాన్ని బంధువులు తీసుకెళ్లారు. ♦ శివకోటి గోవిందరాజులు (33) పాలిమర్స్ కంపెనీలోనే కార్పెంటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చారు. ♦ ఎండోమెంట్లో రిటైర్డ్ ఈవో మేకా కృష్ణమూర్తి (73) మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అతడి అల్లుళ్లు వచ్చారు. ♦ మరణించిన యలమంచిలి అప్పలనర్సమ్మ (45)కు భర్త పైడిరాజు, కుమారులు వెంకటేష్, రమేష్ ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ♦ నూతిలో పడి చనిపోయిన సిహెచ్.గంగరాజు (40) భవన నిర్మాణ కార్మికుడు. భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. సోదరుడు సన్యాసిరావు అన్న మృతదేహాన్ని తీసుకువెళ్లాడు. ♦ మృతుడు పిట్టా శంకరరావు (46) భవననిర్మాణ కార్మికుడు. బంధువులు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ♦ దుర్ఘటనలో మరణించిన అన్నెపు చంద్రమౌళి (19) వైద్య విద్యార్థి. గురువారం రాత్రి పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం తరలించారు. -
నిశ్శబ్దం నిర్మానుష్యం
నిన్నటి వరకు ఆ ప్రాంతాలు పచ్చగా కళకళలాడాయి.. జనం రాకపోకలతో సందడిగా కనిపించాయి. ఒక్కరోజులోనే పరిస్థితి తిరగబడింది. పచ్చదనం హరించుకుపోయింది. సందడి స్థానంలో నిశ్శబ్దం తాండవిస్తోంది.దీనంతటికీ కారణంగా.. గురువారం వేకువజామున మృత్యుగ్యాస్ దాడి చేయడమే.. ఆదమరిచి ఉన్న వేళ జరిగిన ఈ దాడితో భీతిల్లిన జనం తలోదిక్కుకూ తరలిపోవడంతో ఆర్ఆర్వెంకటాపురం పరిసర గ్రామాలు శుక్రవారం కూడా నిర్మానుష్యంగా కనిపించాయి. గురువారం అర్ధరాత్రి నుంచి.. గ్యాస్ ట్యాంకు పేలిపోతుందని.. మళ్లీ భారీగా గ్యాస్ లీక్ అవుతోందని.. పోలీసులే ప్రజలను తరలిస్తున్నారని.. ప్రమాద ప్రాంతానికి సుదూరంగా ఉన్న కంచరపాలెం తదితర ప్రాంతాల వారిని కూడా వెళ్లిపొమ్మంటున్నారని..ఇలా రకరకాల పుకార్ల షికార్లు.. కార్లు, బైకుల పరుగులు.. అలుపెరుగని నడక సాగించిన కాళ్లు.. అర్ధరాత్రి వేళ పిల్లాపాపలతో కట్టుబట్టలతో నగరంలోని చాలా ప్రాంతాల ప్రజల వలస.. వారితోనే రోడ్లన్నీ రద్దీగా మారడం.. వెరసి గురువారం రాత్రి నగరం నిద్రపోలేదు. ఇక గ్యాస్ బాధిత గ్రామాల్లో శుక్రవారం ఉదయం గంభీరమైన పరిస్థితి. నిపుణుల బృందం గ్యాస్ అరికట్టే ప్రయత్నాలు, మంత్రుల పర్యటనలు, పారిశుధ్య చర్యలు చేపట్టిన కార్మికుల కార్యకలాపాలతో పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలూ శ్రమిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: విషవాయువు దుర్ఘటనతో ఎల్జీ పాలిమర్స్ సమీపంలోని ఐదు గ్రామాలు పూర్తిగా బోసిపోయాయి. గ్యాస్ లీకేజీ అరకట్టే చర్యలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్తగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. ఇంకా చాలామంది సమీప గ్రామాలవారు భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. స్టైరిన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆర్ఆర్ వెంకటాపురంతో పాటు సమీపంలో ఉన్న వెంకటాపురం, నందమూరునగర్, ఎస్సీబీసీ కాలనీ, పద్మనాభనగర్ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ 5 గ్రామాల ప్రజల్లో 600 మంది ఆస్పత్రుల్లో ఉండగా.. వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ప్రాణాలతో మిగిలిన పశువుల్ని సైతం తమ వెంట తీసుకువెళ్లిపోవడంతో అంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. గ్రామాల్లో ఉన్న చెట్లు, మొక్కలన్నీ.. విషవాయువు ధాటికి మాడిపోయాయి. ఇళ్లలో అక్వేరియంలో పెంచుకున్న చేపలు మృత్యువాత పడ్డాయి. కోళ్లు, మేకలు, ఆవులు, గేదెలు, దూడలు.. ఇలా.. మూగజీవాలన్నీ మృత్యు వాయువుకు బలయ్యాయి. చాలా ఇళ్లకు తాళాలు వెయ్యకుండానే ప్రజలు పరుగులు తీశారు. ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీసిన ప్రజలు.. తమ ఇళ్లు, సంపద ఏమవుతుందోనన్న ఆలోచన చెయ్యలేదు. కేవలం ప్రాణాలతో బయటపడితే చాలనే లక్ష్యంతో తోచిన దిక్కుకల్లా పరుగులు తీశారు. గురువారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం రాత్రితెల్లవార్లూ ఇదే కొనసాగడంతో మొత్తం గ్రామాలన్నీ ఖాళీ అయిపోయాయి. కుటుంబంలో భాగమైన మూగజీవాలూ... సాధారణంగా పశువుల్ని గ్రామాల్లో సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వాటికేం జరిగినా విలవిల్లాడిపోతారు. అలాంటిది.. ప్రాణాలు కోల్పోయి.. విగతజీవులుగా పడిఉన్న తమ పశువుల్ని చూడటానికి కూడా యజమానులు రాని పరిస్థితి. దీంతో.. జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది.. మూగజీవాల్ని ఖననం చేసేందుకు గ్రామం నుంచి తరలించారు. గ్యాస్ పీడ విరగడ! 24 గంటల్లో పూర్తిగా అదుపులోకి విశాఖపట్నం: గ్యాస్ లీక్ పీడ క్రమంగా విరగడ అవుతోంది. నాగ్‌పూర్, పూణేల నుంచి వచ్చిన నిపుణుల బృందం ఎల్జీ పాలిమర్స్‌లోని ట్యాంక్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్‌ను అరకట్టే ప్రత్యేక ఆపరేషన్‌ను గురువారం అర్ధరాత్రే ప్రారంభించింది. శుక్రవారం రాత్రికే పరిస్థితి చాలా వరకు అదుపులోకి వచ్చింది. గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు లీకేజీ కారణంగా ఏర్పడిన వాయు కాలుష్య పరిస్థితిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ప్రత్యేక వాహనం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉష్ణోగ్రత పెరగకుండా చర్యలు స్టైరిన్ గ్యాస్ నిల్వ చేసిన ట్యాంకు ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీలు మధ్య ఉండాలి. దానికి మించిపోవడం వల్లే ఒత్తిడి పెరిగి గ్యాస్ లీక్ అయినట్లు నిపుణుల బృందం తేల్చింది. ఆ మేరకు ఉష్ణోగ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. ఫలితంగా శుక్రవారం రాత్రి వరకు ట్యాంకులోని సుమారు 70 శాతం స్టైరిన్ పల్మరైజ్ అయ్యింది. మరో 24 గంటల్లో పూర్తిగా పల్మరైజ్ అయ్యి గ్యాస్ లీకేజీ పూర్తిగా ఆగిపోతుందని నిపుణుల బృందం సభ్యులు జిల్లా అధికారులకు భరోసా ఇచ్చారు. కంపెనీ ప్రతినిధులతో పాటు నిపుణుల బృందం సభ్యులతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితి తెలుసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. నావికాదళం సేవలను సైతం వినియోగించుకోవాలని భావిస్తున్నారు. -
నగరం నిద్రపోలేదు..!
సాక్షి, విశాఖపట్నం: అర్ధరాత్రి వేళ.. నగరంలో అలజడి... ఎల్జీ పాలిమర్స్‌లో మళ్లీ గ్యాస్ లీకయిందంటూ వచ్చిన వదంతులు.. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. పిల్లా పాపలతో పరుగులు పెట్టించింది. దీనితో జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. ఒకవైపు అధికారులు, పోలీసులు వందతులను నమ్మొద్దని, ఇళ్లలోనే ఉండాలని మైకులలో ప్రచారాలు చేసినా నగరవాసులు పట్టించుకోలేదు. ఏ క్షణమైనా కంపెనీలో గ్యాస్ ట్యాంకర్ పేలిపోతుందని, దాని ప్రభావం 7 కిలోమీటర్ల వరకు ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో చెలరేగిన పుకార్లు నగర ప్రజల్ని కలవరానికి గురిచేశాయి. గోపాలపట్నం పరిసర ప్రాంతవాసులే కాకుండా ఒకవైపు పెందుర్తి వరకు, మరోవైపు కంచరపాలెం వరకు, ఇంకోవైపు సింహాచలం వరకు ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి దూరప్రాంతాలకు పరుగులు పెట్టారు. పెట్రోల్ బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. కొంత మంది తెలిసిన వాళ్ల ఇళ్లకు వెళితే.. మరికొంత మంది దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తలదాచుకున్నారు. ఎక్కువ మంది బీచ్‌కు వెళ్లారు. ఉలిక్కిపడ్డ పోలీస్ యంత్రాంగం... కరోనా నియంత్రణలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఉన్న పోలీసులు పెద్ద సంఖ్యలో వస్తున్న జనాలను చూసి ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకొని.. వదంతులను నమ్మొదని పెట్రోలింగ్ వాహనాలలో మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో పోలీసులు మీడియా కార్యాలయాలకు సైతం పత్రికా ప్రకటనలు జారీ చేశారు. అలాగే ఈ వందంతుల వ్యాప్తిపై నిఘా పెట్టారు. ఇది ఆకతాయిల పనా? లేక విశాఖ సేఫ్ కాదన్న విషయాన్ని చెప్పడానికి చేసిన కుట్రా.. అని పోలీసులు రహస్య విచారణ చేస్తున్నారు. నగరంలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో నగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రానికి తిరిగి ఇళ్లకు వెళ్లారు. భయంతో వెళ్లిపోయాం... రాత్రి 12.30కు స్నేహితుల నుంచి ఫోన్ వచ్చింది. ఎల్జీ పాలిమర్స్‌లో ట్యాంక్ పేలి 7 కిలోమీటర్ల వరకు గ్యాస్ లీకవుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందని చెప్పారు. ముందు నమ్మలేదు. చుట్టు పక్కల వారు బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నామని చెప్పారు. భయంతో మేము కూడా మా బంధువుల ఇంటికి బయల్దేరారు. – జి.ముత్యాలమ్మ,వేపగుంట -
కరువు పొమ్మంది.. వాయువు ఆయువు తీసింది
బుచ్చెయ్యపేట(చోడవరం): తెల్లవారుజాము సమయం.. విపరీతమైన వాసన.. గాఢ నిద్రలో ఉన్న కుటుంబమంతా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. కళ్లముందు ఏమీ కనిపించడం లేదు. విపరీతమైన కళ్లమంట. ఊపిరి అందక ఎటువెళ్తున్నారో తెలియక సమీప కాలువలో పడి మరణించింది ఓ మహిళ. భర్త పిల్లలూ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. పూర్తిగా తెల్లవారిన తర్వాత కాలువలో పడి ఉన్న మృతదేహం వరలక్ష్మిదిగా గుర్తించారు. 18 ఏళ్ల క్రితం... వరలక్ష్మిది గోపాలపట్నం దగ్గర వెంకటాపురం. 18 ఏళ్ల క్రితం విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి భీమవరం పంచాయతీ శివారు గొన్నవానిపాలానికి చెందిన పినపోలు వెంకటరావుతో వివాహం జరిగింది. గొన్నవానిపాలెంలో వర్షాలు కురవక, ఉపాధి కరువవ్వడంతో వరలక్ష్మి కుటుంబం వెంకటాపురానికి వలస వచ్చింది. భర్త ఆటో నడుపుతూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో వరలక్ష్మి కాలువలో పడి మరణించింది. కోడలు మృతితో గొన్నవానిపాలెంలో విషాదం అలుముకుంది. భర్త వెంకటరావు, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. రూ.కోటిపరిహారంతో అండ ఈ సంఘటనపై వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, దొండా రాంబాబు, పినపోలు రామునాయుడు, తహసీల్దార్ మహేశ్వరరావు, ఎంపీడీవో విజయలక్ష్మి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారాన్ని అందస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం వరలక్ష్మి కుటంబానికి అండగా ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. -
అప్రమత్తతతోనే ముప్పు తప్పింది
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/విశాఖపట్నం/ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ)/పాత పోస్టాఫీసు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకున్న కారణంగానే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి బయటపడగలిగామని మంత్రులు.. ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆళ్ల నాని శుక్రవారం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 554 మందిలో 128 మందిని డిశ్చార్జి చేశామని తెలిపారు. 305 మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా, మరో 121 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. సీఎం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు.. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, గుమ్మనూరు జయరాం, ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, జేసీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. పరిశీలించాకే అనుమతులు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంఘటన జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం విషవాయువు ప్రమాద స్థాయి తగ్గిందని.. మరో 48 గంటల నుంచి 72 గంటల్లో సాధారణ స్థితికి రావచ్చని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు వచ్చిన ఆయన సంస్థ అధికారులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి.. పరిస్థితిని సాధారణ స్థితికి తేవడానికి అవసరమైన మెటీరియల్ వచ్చిందన్నారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి 86 కంపెనీలను గుర్తించామని, వీటన్నింటిలో భద్రతా ప్రమాణాలు పరిశీలించాకే పున:ప్రారంభానికి అనుమతిస్తామన్నారు. కాగా ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబూ.. చౌకబారు రాజకీయాలు మానుకో: మంత్రి బొత్స ఆగ్రహం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంపై ప్రతిపక్షాలతో సహా అన్ని వర్గాలు హర్షిస్తున్నాయని, చంద్రబాబు అండ్ కో మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తాము అనుమతులు ఇచ్చినట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
అప్పుడలా.. ఇప్పుడిలా
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు కేవలం తన షూటింగ్ వ్యామోహం, సర్కారు వైఫల్యం వల్ల గోదావరి పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేందుకు సైతం మనస్కరించని చంద్రబాబు ఇప్పుడు విశాఖలో గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు సీఎం జగన్ ప్రకటించిన కోటి రూపాయల పరిహారం చాలదని వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఇప్పటివరకు ప్రమాదాలు, విపత్తుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇంత భారీగా పరిహారాన్ని ప్రకటించిన దాఖలాలు లేవని, సీఎం జగన్ మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరని అన్ని వర్గాలు పేర్కొంటుండగా చంద్రబాబు దాన్ని స్వాగతించకపోగా విమర్శలకు దిగడంపై సొంత పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన నివాసానికి కూతవేటు దూరంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడంతో కృష్ణా నదిలో పడవ మునిగి మృత్యువాత పడ్ద వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారంతో సరిపుచ్చారు. కానీ ఇప్పుడు విశాఖలో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం, ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్ కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తే విమర్శలకు దిగడం, దీన్ని చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నించడం ద్వారా చంద్రబాబు తనకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రాణాలు, ప్రయోజనాలు ఏమాత్రం పట్టవని నిరూపించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందలేని చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులను స్వాగతించకపోగా విమర్శించడం విపక్ష నేత రెండు నాల్కల ధోరణికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. నిజానికి చంద్రబాబు విమర్శల వెనుక ఒకింత అసూయ కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేశానని చెప్పుకునే ఆయన ఎప్పుడూ బాధితుల పట్ల ఈ స్థాయిలో ఉదారం చూపలేదు. బాబు హయాంలో బాధితులకు తూతూ మంత్రమే ► చంద్రబాబు సీఎంగా ఉండగా 2014 అక్టోబర్ లో హుద్‌హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలా కుతలం చేయగా 46 మంది మృత్యువాతపడ్డారు. అప్పుడు వారి కుటుం బాలకు కేవలం రూ.ఐదు లక్షలే ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ► 2015 జులైలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు తన షూటింగ్ కోసం భక్తుల్ని ఆపివేయడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోతే వారికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేవలం తన పబ్లిసిటీ పిచ్చి, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా వారిపై కనికరం చూపలేదు. ► 2017 నవంబర్‌లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో బోటు మునిగి 21 మంది చనిపోతే రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ఘటన జరిగిన ప్రాంతం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ఉండటం, వరద ఉధృతి ఉన్నా బోటును అనుమ తించిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టమైనా బాధిత కుటుంబాలకు తూతూమం త్రంగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ► 2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను ప్రభావానికి శ్రీకాకుళం జిల్లా లో ఎనిమిది మంది చని పోగా కేవలం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి గొప్ప గా ప్రచారం చేసుకున్నారు. ► 2018 మే నెలలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వాడపల్లి–మంటూరు వద్ద గోదావరి లో బోటు మునిగి 22 మంది చనిపోగా రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ► 2017లో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు, డ్రైవర్ చనిపోతే రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించినా చాలారోజులు దాన్ని వారికి ఇవ్వలేదు. 2018లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ ప్రాంతం లో పాదయాత్ర చేసినప్పుడు బాధిత కుటుంబాలు ఆయన దృష్టికి ఈ విష యాన్ని తీసుకెళ్లడంతో చంద్ర బాబు వైఖరిని ఎండగట్టారు. దీంతో ఉలిక్కి పడ్డ చంద్రబాబు కేవలం రూ. రెండు లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి మిగి లిన రూ.మూడు లక్షలు ఎగ్గొట్టారు. ► 2014 జూన్‌లో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలి పలువురు మృత్యువాత పడగా చంద్రబాబు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గెయిల్ రూ.20 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు చొప్పున బాధితులకు ఇచ్చింది. -
ఐఏఎస్‌లకు ఏం తెలుసు?
విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారు? ఐఏఎస్ అధికారులకు సబ్జెక్ట్ తెలుసా? సైంటిఫిక్, టెక్నికల్ అంశాలు వాళ్లకి తెలియవు. వాళ్ల గురించి నాకు తెలియదా? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న నాకే స్టైరీన్ అంటే ఏంటో తెలియదు. ఇక ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుంది. నేను ఉండిఉంటే నేరుగా ఫ్యాక్టరీలోకే వెళ్లేవాడిని. – చంద్రబాబు, ప్రతిపక్ష నేత సాక్షి, అమరావతి: విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారులకు సబ్జెక్ట్ తెలుసా? అని ప్రశ్నించారు. సైంటిఫిక్, టెక్నికల్ అంశాలు వాళ్లకి తెలియవన్నారు. వాళ్ల గురించి తనకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న తనకే స్టైరీన్ అంటే ఏంటో తెలియదని, ఇక ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుందన్నారు. మేధావులు దీనిపై అధ్యయనం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఏపీలో ఎంపిక చేసిన మీడియాతో ఆయన ఆన్లైన్లో మాట్లాడారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.. ► కోటి రూపాయలతో మనిషి మళ్లీ బతికివస్తాడా? రూ.కోటి సరిపోతాయా? డబ్బులివ్వమని ఎవరైనా అడిగారా? ► గ్యాస్ లీకేజీ ఘటనను సీఎం చాలా లైట్‌గా తీసుకున్నారు. ఆయనది అవగాహనా లోపం. తూతూమంత్రంగా ఒక కమిటీ వేస్తే ఎలా? నిపుణులతో అధ్యయనం చేయించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణను కొద్దికాలం పరిశీలించి చూడాలి. ► ఘటనపై నిజ నిర్ధారణ కోసం టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నిమ్మల రామానాయుడితో త్రిసభ్య కమిటీని నియమిస్తున్నాం. ► ఇది మామూలు ప్రమాదం కాదు. ఇంతవరకూ ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దీన్ని ప్రభుత్వం హ్యాండిల్ చేసిన విధానం చూసి చాలా బాధేసింది. ► ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని చూడాలి తప్ప ఫ్యాక్టరీని దృష్టిలో పెట్టుకోకూడదు. అవగాహనా రాహిత్యం ఉంది. అందుకే హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఎన్జీటీ కూడా సుమోటోగా తీసుకుని రూ.50 కోట్లు డిపాజిట్ చేయమంది. వెంటనే ఫ్యాక్టరీని మూసివేయాలి. అవసరమైతే వేరేచోటకి మార్చాలి. నిపుణులతో మాట్లాడా.. ► ఈ సీఎం ఎవరు చెప్పినా వినరు. ఇలాంటప్పుడు పదిమందితో మాట్లా డాలి. నేను ఉండుంటే నేరుగా ఫ్యాక్ట రీలోకే వెళ్లేవాడిని. ఒకవేళ గ్యాస్ ప్రభా వం ఉంటే తగ్గాకే వెళ్లాలి. ఎవరితోనూ మాట్లాడ కుండా కలెక్టర్ చెప్పాడని ఏదో చెప్పేస్తే ఎలా? ► ఇందులో మీ సొంత పాండిత్యం ఏమిటి? సబ్జెక్ట్ నిపుణులతో కమిటీ వేయాలి. ► సీఎంలు అన్నింటిలో నిపుణులు కాదు. ఇది అధికార, పరిపాలనా యంత్రాంగం వైఫల్యం. ► గ్యాస్ లీకేజీపై నేను చాలామంది సబ్జెక్ట్ నిపుణులతో మాట్లాడా. ఇది మానవ తప్పిదమా? సాంకేతిక ప్రమాదమా అనేది తేల్చాలి. ► లాక్డౌన్ తర్వాత ప్రమాదకరమైన ఇలాంటి ఫ్యాక్టరీని తెరిచేటప్పుడు తనిఖీ చేసి అనుమతి ఇవ్వాల్సింది. ► ఈ ఘటన తర్వాత రాత్రి నాకు నిద్ర రాలేదు. అక్కడికి ఎందుకు వెళ్లలేకపోయానా అని బాధపడ్డా. వెళ్లేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. కేంద్రం అనుమతి కోరా. అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడు వెళతా. -
గ్యాస్ లీక్‌పై విచారణకు హైపవర్ కమిటీ
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫార్సులు చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వం అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సభ్యులుగా ఉండే ఈ కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ సభ్య కన్వీనరుగా వ్యవహరిస్తారు. అధ్యయనం చేయాల్సిన అంశాలివీ.. ► గ్యాస్ లీకేజీకి కారణాలతోపాటు భద్రతా ప్రమాణాలను కర్మాగారం పాటించిందా లేదా? అనే అంశాలను కమిటీ విచారించాలి. ► పరిసర గ్రామాలపై గ్యాస్ లీకేజీ ప్రభావం దీర్ఘకాలం ఉంటే నివారణ చర్యలపై కూడా సిఫార్సు చేయాలి. ► యాజమాన్యం నిర్లక్ష్యమే గ్యాస్ లీక్‌కు కారణమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ సిఫార్సు చేయాలి. ► నివారణ చర్యలు, భద్రతా తనిఖీలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. ► ఈ తరహా పరిశ్రమలకు సంబంధించి కమిటీ పరిశీలించిన ఇతర ముఖ్యమైన అంశాలను కూడా నివేదికలో పేర్కొనవచ్చు. ► కమిటీ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి. ► నివారణ చర్యలపై సూచనల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు/ నిపుణులను కమిటీ సహాయకులుగా హైపవర్ కమిటీ చైర్మన్ ఎంపిక చేసుకోవచ్చు. ► కమిటీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రభుత్వం ఆదేశించింది. రూ.30 కోట్లు విడుదల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్ మోహన్‌రెడ్డి విశాఖపట్నం వెళ్లి బాధితులను పరామర్శించి నష్టపరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశం మేరకు ప్రమాదం జరిగిన మరుసటి రోజునే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే చెల్లించాలని ఆదేశం ► ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున తక్షణమే పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు. ► వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లింపు. ► రెండు, మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేల చొప్పున చెల్లిస్తారు. ► గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తారు. ► ప్రమాదం జరిగిన మరుసటి రోజే బాధితులందరికీ నష్టపరిహారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార వర్గాల హర్షం. ► ఆపన్నులకు, బాధితులకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు తానే సాటి అని ఈ చర్య ద్వారా నిరూపించుకున్నారన్న పలువురు ఐఏఎస్‌లు. ప్రతి అంశంలోనూ సీఎం జగన్ ఇదే రకమైన వేగాన్ని ప్రదర్శిస్తున్నారని, నిర్ణయాల్లోనూ, అమల్లోనూ అదే తీరు కనబరుస్తున్నారని ప్రశంస. -
విశాఖ గ్యాస్‌లీక్: ప్రమాద స్థలిలో ఇదీ పరిస్థితి!
మొన్నటి వరకూ ప్రశాంతంగా కనిపించిన ఆ ప్రాంతం.. ఇప్పుడు విషవాయువు కారణంగా నిర్జీవంగా మారిపోయింది.. ప్రాణాలతో పాటు పర్యావరణాన్నీ కాటేసింది..ఇంతలా విశాఖని వణికించిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఏం జరిగింది? విషాదానికి కారణమైన ట్యాంక్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? షికార్లు చేస్తున్న పుకార్లు చెప్పేవి నిజమేనా?మళ్లీ ఆ ట్యాంక్ నుంచి ప్రాణాలు పిండేసేలా విషవాయువు లీకవుతోందా.. ప్రభుత్వం చెప్పినట్లుగా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులో ఉందా? ఎల్జీ పాలిమర్స్‌లో వాస్తవ పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. మళ్లీ గ్యాస్ లీకవుతోంది.. ప్రజలు భయపడుతున్నారు.. పేలిపోయే ప్రమాదం ఉందని అక్కడి పోలీసులు, అధికారులు చెబుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో గురువారం అర్ధరాత్రి ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన వదంతులు వచ్చిన నేపథ్యంలో.. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌ని ‘సాక్షి ప్రతినిధి బృందం’ శుక్రవారం ఉ.10.30 గంటలకు పరిశీలించింది. ఆ సమయంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీపీ–2 ఉదయ్‌భాస్కర్.. సంస్థ ప్రతినిధులు, ఎన్డీఆర్ఎఫ్ బృంద ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బయట వినిపిస్తున్న వదంతుల మాదిరిగా అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా లేదని నిర్థారించారు. సాక్షి పరిశీలనలో అక్కడ కనిపించిన వాస్తవాలివీ.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం ఈ ట్యాంక్‌తోనే అసలు సమస్య.. ఇక ప్రమాదం జరిగిన ట్యాంకర్ పక్కనే కొత్తగా ఏర్పాటుచేసిన మరో ట్యాంక్ ఉంది. ఇందులో 3 వేల టన్నుల స్టైరీన్ మోనోమర్ నిల్వలున్నాయి. ఈ ట్యాంక్‌ని చూసే అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే.. లీకవుతున్న సమయంలో ఏ చిన్నపాటి పేలుడు సంభవించినా మొదటి ట్యాంక్‌లో కన్నా రెండో ట్యాంక్‌లో పెద్ద మొత్తంలో స్టైరీన్ ఉంది కాబట్టి.. తీవ్రత 10 కిలోమీటర్ల వరకూ వ్యాపించే ప్రమాదం ఉందని భయాందోళనలు నెలకొన్నాయి. అయితే.. మొదటి ట్యాంక్‌లో ప్రమాదం జరిగిన వెంటనే రెండో ట్యాంక్ ఉష్ణోగ్రతలపై దృష్టిసారించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్యాంక్ సేఫ్జోన్లో ఉంది. ప్రభావం కొంత ఎత్తు వరకే.. స్టైరీన్ మోనోమర్ వాయువు బరువైనది. ఈ కారణంగా ప్రమాద తీవ్రత కొంత ఎత్తు వరకూ మాత్రమే ఉంది. పైకి వెళ్లేకొద్దీ.. వాయువు ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందనేది సమీపంలో ఉన్న చెట్లు చూస్తే స్పష్టమవుతోంది. కంపెనీలో కింద ఉన్న పచ్చని పచ్చిక మొత్తం మాడిపోయింది. చిన్నచిన్న మొక్కల పరిస్థితీ అంతే. కానీ.. పెద్దపెద్ద చెట్ల పైభాగంలో ప్రభావం మాత్రం తక్కువగానే ఉంది. నాలుగు నుంచి 5 మీటర్ల వరకు మాత్రమే చెట్లు ఆకులు రంగు మారాయి. పైభాగంలో పచ్చగానే కనిపిస్తున్నాయి. యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు ఎల్జీ పాలిమర్స్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, పోలీసులు చమటోడుస్తున్నారు. ప్రమాద తీవ్రత తెలిసినా ఏమాత్రం లెక్క చేయకుండా పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు. కార్బన్ డై ఆక్సైడ్ ఫోమ్ చల్లుతూ పరిసరాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే వదంతులని సృష్టించొద్దనీ.. రెండ్రోజుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఇదే ఆ ట్యాంక్.. 12 మందిని పొట్టన పెట్టుకుని.. వందల మందిని ఆస్పత్రి పాల్జేసిన దుర్ఘటనకు కారణమైన స్టైరీన్ మోనోమర్ విషవాయువు లీకైంది ఈ ట్యాంక్ నుంచే. 2,500 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ ట్యాంక్‌లో ప్రమాదానికి ముందు 2 వేల టన్నుల స్టైరీన్ గ్యాస్ ఉంది. 25 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో దీన్ని నిల్వ ఉంచాలి. కానీ.. లాక్డౌన్ కారణంగా నిల్వలు పెరిగిపోవడంతో.. లోపల ఉపరితల ఉష్ణోగ్రత క్రమంగా పెరిగింది. ఫలితంగా పీడనం పెరిగి వాయు రూపంలో లీకైంది. ప్రమాదం జరిగిన రాత్రే దీన్నుంచి స్టైరీన్‌ని వేరే ట్యాంక్‌లోకి మళ్లించాలని ప్రయత్నించినా విఫలమయ్యారు. అది పెను ప్రమాదానికి దారితీస్తుందనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఇందులోకి హైడ్రాలిక్ ఫైర్ టెండర్స్ ద్వారా యాంటీ డోస్ పంపించారు. ఫలితంగా.. ఒత్తిడి 90 శాతం వరకూ తగ్గింది. ప్రస్తుతం అతి స్వల్పంగా మాత్రమే లీకేజీ జరుగుతోంది. అయితే.. ఇలాంటి లీకేజీలు అప్పుడప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.. గురువారం నాటి ప్రమాద తీవ్రతకు పశుపక్ష్యాదులు మృత్యువాత పడ్డాయి. కానీ.. శుక్రవారం మాత్రం విషవాయువు లీకైన ట్యాంక్ పక్కనే పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అంటే.. ప్రమాద తీవ్రత లేదని స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడు సంభవించే పరిస్థితిలేదు ట్యాంక్‌లో ఉన్న స్టైరీన్ మోనోమర్.. పరిమాణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఎలాంటి పేలుడూ సంభవించే పరిస్థితులు కనిపించడంలేదు. ట్యాంక్‌లో రియాక్షన్ కూడా తగ్గుతూ వస్తోంది. శనివారం ఉదయానికల్లా పరిస్థితి పూర్తి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం. – డా. జార్జ్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి హైడ్రాలిక్ ఫైర్ టెండర్స్ ద్వారా యాంటీ డోస్ ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ ట్యాంక్‌ల వద్దకు మా ఫైర్ సేఫ్టీ బృందం వెళ్లింది. అయితే.. అప్పటికే లీకైన వాయువు గేట్ వరకూ వ్యాపించింది. దీంతో వారు అక్కడికి వెళ్లలేకపోయారు. వెంటనే స్ప్రింక్లర్ సిస్టమ్‌ని 4 గంటలకు ఓపెన్ చేశాం. ఇందులో యాంటీ డోస్‌ని 4.30 గంటల నుంచి యాడ్ చేసి నీటిని స్ప్రింక్ చేశాం. హైడ్రాలిక్ ఫైర్ టెండర్స్ ద్వారా ట్యాంక్‌లోకి యాంటీ డోస్ సరఫరా చేశాం. ప్రస్తుతం వాతావరణంలో లీకైన విషవాయువు ప్రభావంలేదు. – రమేష్ పట్నాయక్, ఎల్జీ పాలిమర్స్ సేఫ్టీ ఏజీఎం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం... ప్రస్తుతం ప్లాంట్‌లో పరిస్థితి అదుపులో ఉంది. ఎలాంటి ప్రమాద సూచనలూ కనిపించడంలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా.. 9 నుంచి 10 గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం. ప్రమాద స్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటున్నాం. – ఉదయ్‌భాస్కర్, డీసీపీ–2 -
మళ్లీ జరగకూడదు : సీఎం వైఎస్ జగన్
కాలుష్య నివారణ మండలి క్రియాశీలకంగా ఉండాలి. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటి నివారణ, పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలి. విశాఖపట్నంలో ఇలాంటి విష వాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి.. అందులో జనావాసాల మధ్య ఉన్నవి ఎన్నో గుర్తించాలి. విదేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి వ్యవస్థలు ఏరకంగా స్పందిస్తాయో, ఏ రకంగా వ్యవహరిస్తాయో, అలాంటి స్పందనే ఇక్కడా కచ్చితంగా చూపాల్సి ఉంటుంది. అందుకనే మంచి మనసుతో.. ఉదారంగా స్పందించి పరిహారం ఇస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ విశాఖలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఫ్యాక్టరీ ట్యాంక్‌లోని రసాయనంలో 60 శాతం పాలిమరైజ్ అయ్యింది. మిగిలిన 40 శాతం కూడా పాలిమరైజ్ అవుతోంది. ఇందుకు 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని మిగతా ట్యాంకులు భద్రంగా ఉన్నాయి. – సీఎంతో సీఎస్, విశాఖ కలెక్టర్ సాక్షి, అమరావతి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని.. గ్యాస్ లీక్ వెనుక కారణాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్యాస్ లీక్ దుర్ఘటన, అనంతరం తీసుకున్నచర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. గట్టి చర్యలు తీసుకోవాలి ► ఈ తరహా దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విష వాయువులున్న పరిశ్రమలను జనావాసాల నుంచి తరలించడంపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలి. ► ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలను పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదా ఉన్న ముడి పదార్థాలను పూర్తిగా వినియోగించేలా ఇంజినీర్లతో మాట్లాడాలి. ► మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష, సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఉదారంగా స్పందించాలి ► బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం పట్ల అధికారులు సీఎంను ప్రశంసించారు. దేశంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆదర్శంగా నిలిచారన్నారు. ► గతంలో తూర్పుగోదావరి జిల్లా నగరంలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించానని సీఎం గుర్తు చేశారు. ► ఆ సందర్భంలో.. ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కంపెనీలు ఎలా వ్యవహరిస్తాయో.. అదేరకంగా సహాయం చేయాలని డిమాండ్ చేశానన్నారు. మరణించిన కుటుంబాల వారికి భారీగా పరిహారం ఇవ్వాలని ఆరోజు తాను డిమాండ్ చేశానని చెప్పారు. ► ఈ సమయంలో ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. దేశంలో ఎక్కడోచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, అలాంటప్పుడు విదేశాల తరహా స్పందన కచ్చితంగా చూపాల్సి ఉంటుందన్నారు. ► ఈ సమీక్షలో ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్.. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా పాల్గొన్నారు. కాగా, నీరబ్ కుమార్ ప్రసాద్, వివేక్ యాదవ్ విశాఖకు బయలుదేరనున్నారు. -
ఉక్కునగరికి ఊపిరి
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం వేకువజామున విషవాయువు లీకేజీతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ ఉక్కునగరం రాష్ట్ర ప్రభుత్వ సత్వర చర్యలతో రెండో రోజునే ఊపిరిపీల్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిపై ఆరా తీస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ఒక్కరోజులోనే ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.బాధితులకు సీఎం ప్రకటించిన నష్టపరిహారం కింద ప్రభుత్వం 24 గంటల్లోనే రూ.30 కోట్లను విడుదల చేసింది. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున.. వెంటిలేటర్లపై ఉన్న వారికి రూ.10 లక్షల చొప్పున తక్షణమే పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది. గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గుతేల్చేందుకు ఉన్నతస్థాయి (హైపవర్) కమిటీని కూడా నియమించింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడంతోపాటు ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఫార్సు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ నెలరోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. సూచనల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లేదా నిపుణులను సహాయకులుగా కమిటీ చైర్మన్ నియమించుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. విషవాయువు కారణంగా గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన వారు క్రమంగా కోలుకుంటున్నారని.. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన చర్యలు తీసుకోవడంతో రెండోరోజునే నగరంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని మంత్రులు ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మొత్తం 554 మందిలో 128 మంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారని.. మిగిలిన వారెవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ఇక ప్రమాదం జరిగిన స్థానిక గ్రామాల ప్రజలకు ఎటువంటి లోటు రానీయకుండా ప్రభుత్వం పెద్దఎత్తున ఆపన్న హస్తం అందిస్తోంది. పునరావాస కేంద్రాల్లో దాదాపు 15 వేల మందికి వసతి, నాణ్యమైన భోజనం ఏర్పాటుచేస్తున్నారు. జీవిఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. గ్యాస్ లీకేజి వల్ల జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ.50 కోట్లను విశాఖ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. కంపెనీ నుంచి లీక్ అవుతున్న గ్యాస్‌లో గాఢతను, విష ప్రభావాన్ని దాదాపుగా తగ్గించడంలో నిపుణుల బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఖాళీచేసిన కంపెనీ పరిసర ఐదు గ్రామాల్లోకి ప్రజలను మరో రెండు రోజుల వరకూ ముందుజాగ్రత్త చర్యగా అనుమతించవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశించారు. నిపుణుల బృందం, పీటీబీసీ రాక కాగా, సీఎం వైఎస్ జగన్ కృషితో విషవాయువులను నియంత్రించేందుకు అవసరమైన కెమికల్స్ గుజరాత్ నుంచి ప్రత్యేక కార్గో విమానంలో గురువారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్నాయి. వీటితోపాటు పుణే, నాగపూర్ నుంచి తొమ్మిది మంది ప్రత్యేక నిపుణుల బృందం కూడా వచ్చింది. వీరు తీసుకొచ్చిన పారాటెరిటరీ బ్యూటెల్ కాటెకాల్ (పీటీబీసీ) అనే రసాయనిక పదార్థాన్ని గ్యాస్‌లో గాఢతను తగ్గించేందుకు వినియోగిస్తున్నారు. గురువారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో 122.5టీపీఎం స్థాయిలో విషవాయువు గాలిలో ఉంది. శుక్రవారం ఇది చాలావరకు తగ్గిందని.. జీరో స్థాయికి రావడానికి మరో 24గంటలు పడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, గ్యాస్ లీకేజీ ప్రదేశంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి 20 అగ్నిమాపక శకటాల ద్వారా నీటిని వెదజల్లుతున్నారు. (అప్పుడలా.. ఇప్పుడిలా) కాలుష్యంపై ఎప్పటికప్పుడు తనిఖీ.. గాలిలో విషవాయువులు జీరో స్థాయికి చేరాయని, వాతావరణం పూర్తిగా సురక్షితమని తేలిన తర్వాతే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. గాలిలో గ్యాస్ విష ప్రభావాన్ని పరిశీలించేందుకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి చెందిన మొబైల్ తనిఖీ యంత్రాన్ని ఎల్జీ కంపెనీ ప్రాంగణంలోనే ఉంచారు. కంపెనీ పరిసర గ్రామాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో జీరోగా నమోదైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కంపెనీ ప్రధాన ద్వారం, వెంకటాపురం గ్రామంలో మాత్రమే విషవాయువు జాడ ఉందని, దీన్ని కూడా మరో 24 గంటల్లో జీరోకి తీసుకురాగలమని జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్, కంపెనీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామం వ్యూ మంత్రుల నిరంతర పర్యవేక్షణ గ్యాస్ లీకేజీ బాధితులకు, ప్రభావిత గ్రామాల్లోని వారి ఆస్తులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. నీలం సాహ్ని విశాఖలోనే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చోరీలు జరుగుతున్నాయనే వదంతులు నమ్మవద్దని, ఎలాంటి ఆందోళన చెందవద్దని విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ప్రజలకు విన్నవించారు. మరోవైపు.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి గౌతంరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తదితరులు స్వయంగా ఎల్జీ కంపెనీకి వచ్చి లోపలంతా పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్ తదితర నాయకులు కూడా కంపెనీని సందర్శించారు. నీలం సాహ్ని, గౌతంరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కంపెనీ ప్రాంగణంలో సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 12కు చేరుకున్న మృతులు ఇదిలా ఉంటే.. గ్యాస్ లీకేజీతో అస్వస్థతకు గురైన 554 మందికి విశాఖ నగరంలోని కేజీహెచ్‌తో పాటు అపోలో, కిమ్స్ ఐకాన్ తదితర ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారిలో శుక్రవారానికి 128 మంది కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 305 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారిలో 52 మంది పిల్లలు ఉన్నారు. వైద్యం అందిస్తున్న తీరుతెన్నులను ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం సమీక్షించారు. ఇక ఈ çఘటనలో మృతుల సంఖ్య 12కి చేరుకుందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. గురువారం నాటికి 10 మంది చనిపోయారని, శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను గుర్తించి పోస్ట్‌మార్టం నిర్వహించామని చెప్పారు. దుర్ఘటన కారణాలపై హైపవర్ కమిటీ విచారణ దుర్ఘటనకు కారణాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ హైపవర్ కమిటీని నియమించారు. ఈ కమిటీ శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. కమిటీలో సభ్యుడైన పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకేజీలో పలు తప్పిదాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. అలారం మోగకపోవడంపైనా విచారిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ప్రమాదానికి కారణాలపై శోధించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా శుక్రవారం వచ్చింది. (మళ్లీ జరగకూడదు : సీఎం వైఎస్ జగన్) -
జగన్ గారికి హ్యాట్సాఫ్
‘‘విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఘటన బాధాకరం. ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థను ప్రధాని మోదీగారు నిషేధించాలి’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నారాయణమూర్తి స్పందిస్తూ– ‘‘1985, 1990 దశకంలో భారతదేశంలో పీవీ నరసింహారావుగారు ప్రధానిగా, మన్మోహన్ సింగ్గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ఓతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటి. బహుళ జాతి కంపెనీలను, కార్పొరేట్ శక్తులను, ప్రైవేట్ శక్తులను అభివృద్ధి పేరుతో మన దేశంలోకి ఆహ్వానిస్తున్నాం. దాని దుష్పరిణామమే ఈరోజు దక్షిణ కొరియాకి సంబంధించిన కంపెనీలో జరిగిన దుర్ఘటన. బాగా వెనకబడ్డ ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినా ఇవ్వలేదు. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిగారు నవరత్నాలను అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తట్టుకొని ప్రజలకు ది బెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులున్నాయా? లేవా? అని కూడా చూడకుండా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించి మానవతను చాటుకున్న జగన్‌గారికి హ్యాట్సాఫ్. నరేంద్ర మోదీగారు ఇప్పటికైనా స్పందించి, జాతీయ విపత్తు నిధి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలి’’ అని అన్నారు. -
గ్యాస్ లీక్ వార్తలపై ఎల్జీ పాలిమర్స్ వివరణ
సాక్షి, విశాఖపట్నం : అర్ధరాత్రి సమయంలో ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయ్యిందని వచ్చిన వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది. అలాంటి సంఘటన ఏమీ జరగలేదని సంస్థ శుక్రవారం రాత పూర్వకంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకై 12మంది మృతి చెందగా, వందలాదిమంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఎల్జీ పాలిమర్స్ సమీపంలోని గ్రామాల ప్రజలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గాలిలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే స్టెరైన్ ఉండటాన్ని గుర్తించామని విశాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రవీంద్రనాథ్ తెలిపారు. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) వెంకటాపురం పరిసర ప్రాంతాలలో రెండు రోజులుగా ఆరు ప్రాంతాలలో గాలిలో ఎప్పటికపుడు వాయువుల శాతాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నిన్నటితో (గురువారం) పోలిస్తే ఇవాళ చాలా తక్కువ మోతాదులో స్టెరైన్ను గాలిలో గుర్తించామని తెలిపారు. నిపుణులు, కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లతో కలిసి పరిస్ధితిని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనపై శుక్రవారం ఐఏఎస్‌ల హైపవర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. (గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు) -
గ్యాస్ లీకేజీ బాధితులకు భోజన వసతి
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో విషవాయువు వలయంలో చిక్కుకున్న బాధిత కుటుంబాలకు విశాఖ శారదాపీఠం, వానప్రస్థం సంస్థలు భోజన వసతిని కొనసాగిస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే తక్షణం స్పందించి బాధితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన ఈ సంస్థలు రెండో రోజు కూడా తమ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాయి. బాధిత కుటుంబాలు తల దాచుకున్న షెల్టర్ హోమ్స్ వద్దకు ఆహార ప్యాకెట్లను నేరుగా సరఫరా చేస్తున్నాయి. అధికారుల సూచన మేరకు రెండు పూటలూ భోజన వసతి కల్పించేందుకు విశాఖ శారదాపీఠం వానప్రస్థం సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం ఐదు వేలు రాత్రికి మరో అయిదు వేల చొప్పున మొత్తం పదివేల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నాయి. విశాఖ శారదాపీఠం ట్రస్టు సభ్యులు, వానప్రస్థం వృద్ధాశ్రమ సంస్థ నిర్వాహకులు రొబ్బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. (గ్యాస్ లీకేజీ: చంద్రబాబు వ్యాఖ్యల సరికాదు) 48 గంటల వరకు గ్రామాలకు వెళ్లొద్దు.. ‘ఇప్పట్లో చంద్రబాబు కోలుకోవడం కష్టమే’ -
చంద్రబాబు బుర్ర పని చేస్తుందా?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుగుతోందని శుక్రవారం మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... బాధితులందరికి పరిహారం అందజేస్తామని చెప్పారు. 17 కేంద్రాల్లో ప్రజలకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, బాధితులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించామన్న మంత్రి, ఈ విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు సరికావన్నారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. (గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ ప్రారంభం) బాధితులను వేగంగా ఆదుకోవడం తప్పా అని బొత్స ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించడం తప్పా? అని ఆయన నిలదీశారు. సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి చౌకబారుగా మాట్లడటం దారుణమని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్‌కు తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు బుర్ర పనిచేసే మాట్లాడుతున్నారా? అంటూ ధ్వజమెత్తారు. ప్రమాద ఘటనపై చర్యలు తీసుకుంటామని చెప్పిన బొత్స, కమిటీ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. ప్రజల క్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, బాధితుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని బొత్స స్పష్టం చేశారు. (గ్రామీణాభివృద్ధి శాఖలపై జగన్ సమీక్ష) -
48 గంటల వరకు గ్రామాలకు వెళ్లొద్దు..
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ గ్యాస్ లీకేజీ ప్రమాదం సంభవించిన ప్రాంత సమీపంలోని ప్రజలు మరో రెండు రోజుల పాటు సొంత గ్రామల్లోకి వెళ్లొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకు వస్తున్నామని, బాధితులందరూ కోలుకుంటున్నారని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఘటనా ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్లో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మంత్రుల బృందం శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. స్టెరైన్ను నియంత్రించడంతో పాటు బాధితుల పరిస్థితులపైచర్చించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్పందించామని ఆమె తెలిపారు. 454 మంది బాధితులు ఆసుపత్రికి చికిత్స పొందడానికి వచ్చారని, పదివేల మంది ప్రజలకు తాము వసతి, భోజన సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) విచారణకు టెక్నికల్ కమిటీ విశాఖ ఘటనపై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికపుడు చర్చిస్తున్నామని నీలం సాహ్ని తెలిపారు. ప్రస్తుతం టెంపరేచర్ 115 డిగ్రీలకి తగ్గిందని, అయితే వెంకటాపురం వద్ద ఇంకా కొంత శాతం గాలిలో స్టైరెన్ శాతాన్ని గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. అయిదు గ్రామాల ప్రజలను 48 గంటల పాటు గ్రామాలలోకి వెళ్లవద్దని, ప్రభుత్వ క్యాంపులోనే కొనసాగాలని సూచించారు. విశాఖ బాధితులకి అన్నిరకాల సాయం అందిస్తున్నామని, బాధితులకి నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయల అందించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో సైతం ప్రమాద ఘటనపై విచారణకు టెక్నికల్ కమిటీని నియమించామని, ఇప్పటికే రాష్ట్ర స్థాయి కమిటీ విచారణ ప్రారంభించిందని పేర్కొన్నారు. స్టెరైన్ పూర్తిగా నియంత్రించిన తర్వాతే సేఫ్ అని చెప్పగలమన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని నీలం సాహ్ని పేర్కొన్నారు. (గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ ప్రారంభం ) గ్యాస్ దుర్ఘటనపై అత్యున్నత స్ధాయి కమిటీ విచారణ జరుగుతోందని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. వేపగుంట, పెందుర్తి రోడ్, ఇండస్ట్రీ మెయిన్ గేట్ వద్ద గాలిలో స్టెరైన్ శాతం జీరోగా ఉందన్నారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని, ప్రతీ మృతుని కుటుంబానికి కోటి రూపాయిలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, గుమ్మునూరు జయరాం, ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ హాజరయ్యారు. (తెలంగాణలో మరో పది పాజిటివ్ కేసులు) -
గ్యాస్ లీకేజీ: రెండో రోజు ఎన్సీఎమ్సీ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ రెండో రోజు సమీక్ష జరిపింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఏపీ చీఫ్ సెక్రటరీ తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కెమికల్ సేఫ్టీకి సంబంధించి అంతర్జాతీయ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కమిటీ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కెమికల్స్ పంపేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. కాగా, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనపై శుక్రవారం ఐఏఎస్‌ల హైపవర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్.. కమిటీ కన్వీనర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు వివేక్ యాదవ్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌లు ఈ విచారణలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అరగంటకు పైగా కంపెనీలో గ్యాస్ లీక్ అయిన తీరుపై అధికారులు, కార్మికులను విచారించారు. -
‘మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్’
సాక్షి, చిత్తూరు: విశాఖ గ్యాస్ లీకేజ్ విషాదం అందరినీ కలచివేసిందని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని చూసి అన్ని పార్టీలు అభినందిస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం తక్షణమే విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించి ధైర్యం నింపారని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులున్నారని.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల కష్టాలను చూసి చలించిపోయారని.. ఎన్నడూలేని విధంగా రూ.కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారని చెప్పారు. (‘ఆ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది’) వారు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. టీడీపీ నేతలు దీనిపై కూడా చీప్‌గా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్ ఈ ఘటనపై హైపవర్ కమిటీతో విచారణకు ఆదేశించారని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. యాజమాన్యంపై కూడా పోలీసు కేసు నమోదయ్యిందన్నారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) -
నిబంధనలు అతిక్రమిస్తే సహించం
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గ్యాస్ లీకేజ్ ఘటనపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సహించమని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కష్టకాలంలో బాధితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహరించారని పేర్కొన్నారు. (యుద్ధ ప్రాతిపదికన స్పందించాం) తనతో సహా మంత్రులను విశాఖకు పంపించి.. సాధారణ పరిస్థితి వచ్చేలా చూడాలని సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు. ఎల్జీ కంపెనీని రూ.50 కోట్లు డిపాజిట్ చేయమని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్‌రెడ్డి అభినందించారు. (పరిశ్రమల శాఖను అప్రమత్తం చేసిన మంత్రి) ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు,నిపుణులతో మంత్రి భేటీ.. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు, నిపుణులతో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ట్యాంక్ పరిస్థితిపై సమీక్షించామని తెలిపారు. ట్యాంక్ ఉష్ణోగ్రత 120 కన్నా తక్కువ గా ఉందని.. కొన్ని రసాయనాలు వాడి పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నారని తెలిపారు. ‘‘ఇప్పుడు వచ్చిన నిపుణులు ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది. స్టైరిన్ గాల్లో తక్కువ మోతాదులో ఉంది. దీని వల్ల ప్రమాదం లేదు. ఇది ఎక్కువ శాతం గాల్లో కూడా ఉండదు. ఇది భూమి మీద పడిపోతుంది. దీని వల్ల ప్రమాదం లేదని’’ మంత్రి వివరించారు. రాష్ట్రంలో 86 కంపెనీలు గుర్తించామని.. భద్రత ప్రమాణాలు పరిశీలించిన తరువాతే ప్రారంభించడానికి అనుమతులు ఇస్తామని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.(గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) -
రూ.50 కోట్లు జమ చేయండి, ఎల్జీ పాలిమర్స్‌కు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన సంఘటనను జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందగా, వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక నష్టపరిహారం కింద రూ.50 కోట్లను జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఎన్జీటీ ఆదేశించింది. అలాగే ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ పీసీబీ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. (ఏం జరిగింది పెద్దాయనా?) ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘటనకు దారి తీసిన కారణాలపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ వి.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పులిపాటి కింగ్, సీపీసీబీ సభ్య కార్యదర్శి, నీరి హెడ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. (గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు) పర్యావరణ నిబంధనలు, ప్రమాదకర రసాయనాలు నిబంధనలు లేదని స్పష్టమవుతోందని, భారీ మొత్తంలో విషవాయువులు వెలువడడానికి ఖచ్చితంగా ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని ఎన్టీటీ స్పష్టం చేసింది. ఫ్యాక్టరీని నియంత్రించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే వారు కూడా బాధ్యులేనని, ఈ ఘటనకు దారితీసిన కారణాలు, లోపాలు, నష్టం, తదుపరి చర్యలపై దృష్టి పెట్టామని పేర్కొంది. తదుపరి కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) గ్యాస్ లీక్ ఘటనల క్రమం, వైఫల్యాలకు గల కారణాలు, బాధ్యులు, ప్రజలు, జీవాల ప్రాణాలకు కలిగిన నష్టం, గాలి నీరు భూమికి జరిగిన నష్టం అంచనా బాధితులు, పర్యావరణానికి నష్టపరిహారం చెల్లింపు కు తీసుకున్న చర్యలు మళ్లీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఐదు అంశాలపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశం -
ఒక్క రోజే పలు పారిశ్రామిక ప్రమాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకవడంతోపాటు గురువారం నాడు దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో 12 మంది మరణానికి దాదాపు 300 మంది అస్వస్థతకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదమే తీవ్రమైనది. విష వాయువును నియంత్రించే వ్యవస్థ సరిగ్గా పని చేయక పోవడం వల్లనే ఇంత తీవ్ర ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. నియంత్రణ వ్యవస్థ సరిగ్గా పని చేయక పోవడం అంటేనే మెయింటెనెన్స్ సరిగ్గా లేదని అర్థం.దేశవ్యాప్తంగా లాక్డౌన్ తర్వాత తెరచుకున్న పలు పరిశ్రమల్లో మెయిన్టెన్స్ సరిగ్గా లేక పోవడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎలాగు ఉత్పత్తి లేదుగదా అని, మెయింటెనెన్స్ స్టాఫ్‌ను తక్కువగా నియమించడం, వారిపై తగిన ఆజమాహిషి లేక పోవడం ప్రమాదాలకు దారితీసింది. (గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు) చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని పేపరు మిల్లులో విష వాయువు వెలువడడంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు,. నాసిక్‌లోని ఓ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించగా, తమిళనాడులోని నెయ్వేలిలోని ఎన్ఎల్సి భారత థర్మల్ విద్యుత్ కేంద్రంలో గురువారం నాడే పేలుడు సంభవించి ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు.సరైన మెయింటెనెన్స్ లేక పోవడం వల్ల ఈ ప్రమాదాలు సంభవించాయని బయటకు కనిసిస్తున్నప్పటికీ బయటకు కనిపించని బలమైన కారణం మరోటి ఉంది. పరిశ్రమలను ప్రోత్సహించాలనే తపనతో చట్టాలను సడలిస్తూ రావడం. గురువారం నాడే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు పారిశ్రామిక చట్టాను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. రద్దు చేసిన వాటిలో పలు వృత్తిపరమైన భద్రత, వర్కింగ్ కండీషన్స్‌కు సంబంధించిన నిబంధనలు కూడా ఉండడం గమనార్హం. ఇదే తరహాలో మధ్యప్రదేశ్ రాఫ్రం కూడా కార్మిక, పారిశ్రామిక చట్టాల రద్దుకు ఉపక్రమించింది.(గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతులు) -
‘ప్రభుత్వ చర్యలతో బాధితులు త్వరగా కోలుకున్నారు’
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వం తీసుకున్న చర్యలతో విశాఖ గ్యాస్ లీక్ బాధితులు త్వరగా కోలుకున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పరిహారం త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం చాలా బాగా స్పందించిందని గుర్తుచేశారు. ప్రతి ఇంటి తలుపు తట్టి అధికారులు సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 554 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. 128 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారని చెప్పారు. కేజీహెచ్‌లో 305 మంది ఉన్నారని.. వీరిలో 52 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. మిగతావారు ప్రైవేటు ఆస్ప్రతుల్లో చికిత్స పొందుతున్నారని.. ఎవరికీ ప్రాణప్రాయం లేదని స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ బాధితులకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. వైద్యులు, నిపుణలు సూచించేవరకు ప్రమాద స్థలానికి ఎవరూ వెళ్లొద్దన్నారు. -
బాబు ఈ జన్మకు మారరు
చిత్తూరు, పుత్తూరు: ‘‘అబద్ధాలతోనే ఇన్నేళ్లు రాజకీయాలు చేశారు.. ప్రజలు బుద్ధి చెప్పినా మీ తీరు మారడం లేదు.. ఈ జన్మకు మీరు మారరు’’ అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి విరుచుకుపడ్డారు. గురువారం పుత్తూరులో విలేకరులతో మాట్లాడు తూ జీడీ నెల్లూరు మండలం నాగూరు పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 951/4లో 83 సెంట్లు ప్రభుత్వ భూమిలో ఆ గ్రామస్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ భూమిని గత ప్రభుత్వ హయాంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సుబ్రమణ్యంరెడ్డి భార్య ఢిల్లీరాణి పేరుతో డీకేటీ పట్టా పొందినట్లు చెప్పారు. దీనిపై హైకోర్టు, జేసీ కోర్టు పరిశీలించి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చినట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా రెవెన్యూశాఖ అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు సూచిక బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. ఇటీవల ఢిల్లీరాణి కుటుంబసభ్యులు మృతిచెందితే శ్మశానంలో దహనక్రియలు జరపాల్సి ఉండగా, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో ఖననం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై గ్రామంలో అలజడి చెలరేగితే రాజకీయ రంగు పులమడాన్ని ఆక్షేపించారు. ఈ విషయాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించడం దారుణమన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జిల్లా అధికారులను విచారించి నిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు నానా యాగీ చేయడం చూస్తుంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలు చేయాలనే తపన కనిపిస్తోందన్నారు. నిజానిజాలు ప్రజల మధ్యే తేల్చుతానన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే నాగూరుపల్లికి రావాలని సవాలు విసిరారు. విశాఖపట్టణంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. -
గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : గ్యాస్ లీక్ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్ కే మీనా పాల్గొన్నారు. ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ నివారణకు చేపట్టిన చర్యలను సీఎంకు కలెక్టర్ వినయ్‌చంద్ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. ట్యాంకర్‌లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్ అయ్యిందని, మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్ అవుతుందన్నారు. దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారని నీలం సాహ్ని తెలిపారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయన్న సీఎస్.. విశాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ వస్తోందన్నారు. (గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు) కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగిన కార్యాచరణ, ప్రణాళికతో రావాలని సీఎం సూచించారు. కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలని తెలిపారు. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటి నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని, అందులో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను గుర్తించాలన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టిపెట్టాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలని సూచించారు. జరిగిన ఘటనను దృష్టిలోకి తీసుకుని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది రాకుండా జనావాసాలకు దూరంగా తరలింపుపై తగిన ఆలోచనలు చేయాలన్నారు. అలాగే ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేదా ఉన్న ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాల్సిన మార్గాలపైకూడా ఇంజినీర్లతో మాట్లాడాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.. (గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతులు) -
గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన స్టైరిన్ విషవాయువును పీల్చడం ద్వారా 12 మంది మృతి చెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హైపవర్ కమిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కరికలవలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా, పీసీబీ మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. (గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతులు) ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటానికి గల కారణాలపై ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎల్జీ పాలిమర్స్ పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీయనుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా చేపట్టిన విస్తరణ కార్యకలాపాలు, దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కంపెనీ కార్యకలాపాల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు చోటు చేసుకుంటే దానికి గల కారణాలను ఈ కమిటీ అన్వేషించనుంది. విచారణలో ఎదురైన అంశాలు, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వెల్లడించిన అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం హైపవర్ కమిటీకి సూచించింది. (పరిశ్రమల శాఖను అప్రమత్తం చేసిన మంత్రి) -
పరిశ్రమల శాఖను అప్రమత్తం చేసిన మంత్రి
సాక్షి, విశాఖపట్నం : విజయవాడ నుంచి విశాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బయలుదేరారు. మధ్యాహ్నం విశాఖకు గౌతమ్ రెడ్డి చేరుకోనున్నారు. 12.30గంటలకు ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమ, స్థానిక గ్రామాలు, ప్రజల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనున్నారు. ఒంటి గంటకు ఎల్ జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ పరిశీలన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. 1.30 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మేకపాటి పరామర్శించనున్నారు. గురువారం రాత్రి వరకూ ఫ్యాక్టరీలో లీకేజ్ కట్టడి, బాధితుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించారు. విశాఖ ప్రమాదంతో పరిశ్రమల శాఖను, అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. (యుద్ధ ప్రాతిపదికన స్పందించాం) ఇప్పటికే ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితం చెందే పరిశ్రమల జాబితాను గౌతమ్ రెడ్డి తెప్పించుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయం చేస్తున్న అధికారులకు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు ఆస్పత్రి ప్రాంగణంలో అధికార యంత్రాంగంతో, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలు, పారిశ్రామిక జోన్లు, పరిశ్రమల పరిస్థితులపై చర్చించనున్నారు. వేసవి కాలం, ఉష్ణోగ్రతల మార్పుకు అనుగుణంగా పట్టణ పరిధిలో ఉన్న పరిశ్రమలు, స్థానిక ప్రజల రక్షణకై ఎలా వ్యవహరించాలన్నదానిపై అధికారులతో చర్చించనున్నారు. తాజా దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. -
హైదరాబాద్ సిటీ సేఫ్..!
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఎలాంటి ప్రమాదకర గ్యాస్ వెలువరించే కంపెనీలు లేకపోవడంతో సిటీ సేఫ్ జోన్‌గా నిలిచింది. ఏపీలోని వైజాగ్ నగరంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకైన దుర్ఘటన నేపథ్యంలో నగరంలో ఇలాంటి పరిశ్రమలు లేవని పీసీబీ, పరిశ్రమల శాఖలు స్పష్టం చేశాయి. నగరంలో ఎల్పీజీ గ్యాస్ కేంద్రాలు మినహా ఎలాంటి విషవాయువులు వెలువరించే కంపెనీలు, సంస్థలు లేవని తెలిపాయి. నగరంలోని బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు సహా ఇతర పరిశ్రమలు సైతం పీసీబీ, పరిశ్రమల శాఖ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నాయి. -
విశాఖ గ్యాస్ లీకేజీపై నేడు విచారణ
సాక్షి, విజయవాడ : విశాఖ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతంపై పరిశ్రమల శాఖ కార్యదర్శి కరికలవలవన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో నేడు విచారణ జరగనుంది. గ్యాస్ లీకేజీ ప్రమాదానికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. కాగా విచారణ నేడు మధ్యాహ్నం 12గంటలకు మొదలు కానుంది. కమిటీ విచారణ బృందంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఛైర్మన్, డైరెక్టర్ ఫ్యాక్టరీస్,ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం , ఎనర్జీ నిపుణులు, హెచ్ పీసీఎల్ సాంకేతిక నిపుణులు, ఆంధ్రా యూనివర్సివర్సిటీ నిపుణులు ఉన్నారు. (గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతులు) కాగా గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్యాస్ లీకేజీ ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు బాధితులను పరామర్శించారు. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కంపెనీ పునఃప్రారంభమైన తర్వాత, లేదంటే వేరొక చోటుకు తరలించిన తర్వాతైనా సరే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అలాగే వెంటిలేటర్ సాయంతో వైద్యం పొందుతున్న వారికి రూ.10 లక్షలు.. రెండు మూడు రోజుల పాటు చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష.. ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. -
గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతులు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన్ ఘటనలో మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. అలాగే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనవారికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు గ్యాస్ లీకేజి అరికట్టేందకు 9 మంది నిపుణుల బృందంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నిపుణల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఘటన సంబంధించి మంత్రులు కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను సమీక్ష నిర్వహించారు. (చదవండి : విషవాయువు పీల్చి 10 మంది మృతి) మరోవైపు నేడు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గత రాత్రి జరిగిన పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. కేజీహెచ్‌తో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రుల బృందం పరామర్శించనుంది. అలాగే బాధిత ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మంత్రుల బృందం ఆయా గ్రామాలలో పర్యటించే అవకాశం ఉంది. స్టైరీన్ బ్యాంకర్‌లో తగ్గుముఖం పట్టిన ఉష్టోగ్రత ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ బ్యాంకర్‌లో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. పుణె, నాగపూర్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. పూర్తిస్థాయిలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే గ్యాస్ తీవ్రత తగ్గిన తర్వాత ప్రజలను ఇళ్లలోకి అనుమతించే అవకాశం ఉంది. (చదవండి : విశాఖ దుర్ఘటన; దర్యాప్తునకు సహకరిస్తాం) -
ఎల్జీ పాలిమర్స్ జీఎం స్పందన
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ఘటనపై ఆ సంస్థ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులందరికీ అవసరమైన వైద్య సహాయ సహకారాలు అందజేసేందుకు కృషి చేస్తామని హామీయిచ్చారు. బాధిత గ్రామాల ప్రజలు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య భద్రత తమ బాధ్యతని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం చేసే దర్యాప్తునకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సాంకేతిక బృందాల్ని సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. (మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు) బాధితులు త్వరగా కోలువాలని ప్రార్థిస్తున్నాం న్యూఢిల్లీ: ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై దక్షిణ కొరియా స్పందించింది. విశాఖ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఢిల్లీలో ఉన్న కొరియన్ దౌత్యవేత్త షిన్‌బాంగ్ కిల్ అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ లీకేజీతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (విశాఖ దుర్ఘటన: ఒక్క ఫోన్ కాల్ కాపాడింది) -
గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు యత్నిస్తున్న నిపుణుల బృందం
సాక్షి, విశాఖపట్నం : గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు 9 మంది నిపుణులతో కూడిన బృందం అర్థరాత్రి తరువాత విశాఖకు చేరుకుంది. కాగా గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు 9మంది నిపుణుల బృందం ప్రయత్నిస్తుంది. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీపీ ఉదయ్‌భాస్కర్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లీకేజీని అరికట్టే సమయంలో పేలుడు సంభవిస్తుందనేది పుకారు మాత్రమేనని ఆర్కే మీనా పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఫ్యాక్టరీ నుంచి కిలోమీటర్ దూరం వరకు ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేయించామన్నారు. గ్యాస్‌లీకేజీ అరికట్టే సమయంలో ఇబ్బందులు ఎదురైనా పేలుడులాంటి ఘటనలుండవని, ప్రజలెవరూ పుకార్లను నమ్మవద్దన్నారు. (విశాఖ విషాదం) కాగా ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్యాస్ లీకేజీ ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు బాధితులను పరామర్శించారు. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కంపెనీ పునఃప్రారంభమైన తర్వాత, లేదంటే వేరొక చోటుకు తరలించిన తర్వాతైనా సరే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అలాగే వెంటిలేటర్ సాయంతో వైద్యం పొందుతున్న వారికి రూ.10 లక్షలు.. రెండు మూడు రోజుల పాటు చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష.. ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం. (‘కోటి’ సాయంపై సర్వత్రా హర్షం) పీటీబీసీ రసాయనాలు రప్పించారు విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన విష వాయువులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. పరిశ్రమలు అత్యధికంగా ఉన్న గుజరాత్ నుంచి ఇందుకు అవసరమైన రసాయనాలను తెప్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి గురువారం ఉదయం ఫోన్ చేశారు. విశాఖ దుర్ఘటన గురించి వివరించారు. విష వాయువుల తీవ్రతను తగ్గించడంలో ఉపకరించే పారా టెరిటరీ బ్యూటైల్ కాటెకాల్ (పీటీబీసీ) కెమికల్స్ గుజరాత్‌లోని వాసి నగరంలోని పారిశ్రామికవాడల్లో పెద్ద ఎత్తున తయారవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ రసాయనాలను వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యరి్థ, అనిల్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీతోనూ సంప్రదింపులు జరిపారు. ఇదే అంశంపై మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖను సంప్రదించింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి పీటీబీసీ రసాయనాన్ని వెంటనే సరఫరా చేయాలని ఆదేశించింది. దాంతో గుజరాత్‌లోని వల్సద్ జిల్లా వాపీలోని పరిశ్రమ నుంచి 500 కేజీల రసాయనాన్ని దామన్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తరలించారు. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి స్టైరీన్ గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ పీటీబీసీ రసాయనాన్ని పిచికారి చేస్తారు. తద్వారా స్టైరీన్ వాయువును నిరీ్వర్యం చేస్తారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్టైరీన్ గ్యాస్‌ను నిర్వీర్యం చేయడానికి శాస్త్రీయ చర్యలకు ఉపక్రమించింది. -
పెద్దాయనా.. ఎలా ఉన్నావు?
ద్వారకానగర్ (దక్షిణ): విష రసాయనం వ్యాపించి.. వేలాది మందిని వెంటాడి.. భయభ్రాంతులకు గురి చేసిన తరుణంలో.. అసంఖ్యాక ప్రజలు ఆస్పత్రుల పాలైతే హుటాహుటిన వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి కేజీహెచ్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. పలువురితో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి చెంత కూర్చుని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. వీలైనన్ని విధాలుగా సాయం అందిస్తామని, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో 70 ఏళ్ల తాతబ్బాయితో సీఎం సంభాషణ ఇలా సాగింది.. సీఎం: పెద్దాయనా.. ఎలా ఉన్నావ్.. తాతబ్బాయి: దేవుడి దయవల్ల బాగానే ఉన్నానయ్యా సీఎం: ఏం జరిగింది పెద్దాయనా? తాతబ్బాయి: బాబూ.. ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా వాసన వచ్చింది. అంతే. లేచేలోగానే విషగాలి కమ్మేసింది. ఊపిరి ఆడలేదు. సీఎం: ఇప్పుడెలా ఉంది? తాతబ్బాయి: అంతా వేగంగా వచ్చి మమ్మల్ని ఆస్పత్రికి తెచ్చారయ్యా. ఇప్పుడు పర్వాలేదు. సీఎం: నీ ఆరోగ్యం బాగయ్యేలా డాక్టర్లు జాగ్రత్తగా చూస్తారయ్యా. మేం అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. భయం లేదు. -
3 గంటల్లోనే అదుపులోకి..
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకైన ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టిందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్యాప్తునకు ఆదేశించారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్‌తో అత్యవసర సమావేశం అనంతరం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెల్లవారు జామున 3.30 గంటలకు గ్యాస్ లీక్ కాగా మూడు గంటల్లోనే పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకువచ్చిందీ ఈ సందర్భంగా ఆయన వివరించారు. ► విషవాయువు వెలువడిన విషయాన్ని స్థానికులు తెల్లవారుజామున డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రక్షక్ మొబైల్ పోలీసులు కేవలం పది నిముషాల్లోనే ఘటన స్థలానికి వెళ్లారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా 4.30 గంటల ప్రాంతంలో స్వయంగా వెళ్లి పరిశీలించి సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులను తరలించి సహాయక చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించాం. ► ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని తలుపులు పగలగొట్టి ఆస్పత్రులకు తరలించి రక్షించాం. మూడు గంటల్లోనే గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చాం. కొందరు పోలీసులు కళ్లు తిరుగుతున్నా, వికారం వచ్చినా ఇబ్బందిపడుతూనే ప్రజల ప్రాణాలను కాపాడారు. ► నేషనల్ డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడాయి. విజయవాడ నుంచి కూడా ఫోరెన్సిక్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లను పంపించాం. ► ఉదయం 3.30గంటలకు ప్రమాదం జరిగితే తక్షణం స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రతిపాదిక చర్యలు చేపట్టింది. సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించి ఉదయం 6.30 గంటలకు మామూలు పరిస్థితిని తీసుకుని రాగలిగింది. -
‘ఎల్జీ పాలిమర్స్’ బాధితులందరికీ ఉచితంగా వైద్యం
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో అనారోగ్యం పాలైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డా.మల్లికార్జున పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తామని, ఏ ఒక్కరూ పైసా చెల్లించకుండా ఆస్పత్రులకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► గ్యాస్ ఘటన ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా ఎలాంటి ఫీజూ లేకుండా వైద్యానికి వెళ్లొచ్చు. ► సదరు ఆస్పత్రి ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోయినా సరే వైద్యం ఉచితంగా అందించాలని ఆదేశాలిచ్చాం. ఇప్పటికే ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అన్ని ఆస్పత్రులకు సమాచారం అందించాం. ► వైద్యానికి వచ్చే బాధితుల ఆధార్ కార్డు, ఇతర వివరాలను తీసు కుని చికిత్స చేయాలి. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ► వైద్యం అనంతరం ఆస్పత్రులు సంబంధిత బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపిస్తే సొమ్ము చెల్లిస్తాం. ► గ్యాస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందాలని కోరుతున్నాం. ► అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. డా.డి.భాస్కరరావు, జిల్లా కోర్డినేటర్, 8333814019 నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తారు. -
‘కోటి’ సాయంపై సర్వత్రా హర్షం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తణుకు: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు, ప్రకటించిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవు తోంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, స్వల్ప అస్వస్థతతో రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్లే వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో చేరగానే ఉపశమనం పొంది డిశ్చార్జ్ అయిన వారికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించడాన్ని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి. అంతేగాక గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లోని మొత్తం 15,000 మందికీ రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడాన్ని అందరూ కొనియాడుతున్నారు. ‘బాధితులు నయాపైసా కూడా వైద్య ఖర్చులు భరించాల్సిన పనిలేదు. డిశ్చార్జ్ అయి వెళ్లేప్పుడు ఈ నష్టపరిహారం కూడా ఇచ్చి పంపాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం’ అని సీఎం జగన్ ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు, వామపక్షాలతో పాటు అందరూ అభినందిస్తున్నారు. గంటల వ్యవధిలోనే.. ► నష్టపరిహారం ప్రకటించే విషయంలో ప్రభుత్వాలు రకరకాల ఆలోచనలతో జాప్యం చేయడం రివాజుగా వస్తోంది. ► ప్రయివేటు కర్మాగారాల్లో జరిగే ప్రమా దాల విషయంలో ఇది మరీ ఎక్కువ. ► సీఎం వైఎస్ జగన్ దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే విశాఖపట్నం చేరుకుని బాధితులను పరామర్శించి, అక్కడే సమీక్ష నిర్వహించి నష్ట పరిహారాన్ని ప్రకటించారు. ► ఎక్కడైనా ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తే అధిక నష్ట పరిహారం ప్రకటించాలని ప్రతిపక్షాలు, వామపక్షాలు డిమాండ్ చేయడం రివాజు. ► విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన బాధితుల విషయంలో అలాంటి డిమాండ్ ఏ ఒక్కరి నుంచీ రాకముందే ఊహించనంత భారీ నష్ట పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా.. రాష్ట్రంలో, దేశంలో ఎన్నో భారీ విపత్తులు చూశాం. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ, ఏ ప్రధానమంత్రీ చేయని విధంగా బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిహారం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ.కోటి, చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని వారికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించడం ఇంతవరకు ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలు అద్భుతం. – విష్ణుకుమార్‌రాజు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉపశమనం కలిగిస్తుంది బాధితులకు సీఎం ప్రకటించిన పరిహారం ఉపశ మనం కలి గిస్తుం ది. అసలు ఇలాం టి ప్రమాదం మరోసారి జరగ కుండా కంపెనీని నివాస ప్రాంతాల మధ్య నుంచి తరలించాలి. – గణబాబు, ఎమ్మెల్యే, విశాఖ పశ్చిమ నియోజకవర్గం మేం ఊహించిన దాని కన్నా 4 రెట్లు ఎక్కువ మేం ఊహించిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ సా యాన్ని ప్రక టించిన సీఎం వైఎస్ జగన్ అభినందనీ యులు. బాధితు లను, బాధిత గ్రామాల ప్రజలకు కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆదుకున్న తీరు ప్రశంసనీయం. – నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి బాధితులను ఆదుకున్నతీరు ప్రశంసనీయం బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటించి సీఎం వైఎస్ జగన్ వారిని ఆదుకున్న తీరు హర్షణీయం. ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలిం చడంతో పాటు.. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి. ఈ ఘటనకు ఎల్జీ కంపెనీ బాధ్యత వహించాలి. – కె.రామకృష్ణ, పి.మధు, వామపక్ష నేతలు -
యుద్ధ ప్రాతిపదికన స్పందించాం
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకయిన వెంటనే రాష్ట్ర యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ► ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను త్వరితగతిన ఖాళీ చేయించడం ద్వారా మరణాల సంఖ్య తగ్గించగలిగాం. ► జిల్లా కలెక్టర్, పరిశ్రమలశాఖ అధికారులతో పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు విశాఖలోని పరిశ్రమలశాఖ జీఎం కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ► ఇందుకోసం ఎస్ ప్రసాదరావు, ఆర్.బ్రహ్మ అనే అధికారులను నియమించాం. సహాయం కోసం వీరిని 7997952301, 8919239341, 9701197069 అనే నంబర్లలో సంప్రదించవచ్చు. ► సహాయక పనులను పర్యవేక్షించడానికి పరిశ్రమలశాఖ తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశాం. ► ఈ దుర్ఘటనకు కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచారణ అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటాం. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం ఢిల్లీలోని దక్షిణ కొరియా దౌత్యవేత్త షిన్‌బాంగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై దక్షిణ కొరియా స్పందించింది. విశాఖ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఢిల్లీలో ఉన్న కొరియన్ దౌత్యవేత్త షిన్‌బాంగ్ కిల్ అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ లీకేజీతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దర్యాప్తుకు సహకరిస్తాం ఎల్జీ పాలిమర్స్ జీఎం శ్రీనివాస్ రామ్ ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ఘటనపై ఆ సంస్థ జీఎం శ్రీనివాస్ రామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులందరికీ అవసరమైన వైద్య సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత గ్రామాల ప్రజలు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య భద్రత తమ బాధ్యతని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం చేసే దర్యాప్తుకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సాంకేతిక బృందాల్ని సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
బాధితుల భద్రతే ముఖ్యం
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు, గ్రామాల్లో వారి ఆస్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్‌ను ఆదేశించారు. గ్యాస్ ప్రభావం తగ్గిన తర్వాత సురక్షిత పరిస్థితి ఏర్పడి.. బాధితులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లేవరకూ షెల్టర్లలో వసతి కల్పించాలని సూచించారు. గురువారం ఆయన కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన అనంతరం ఆంధ్రా వైద్య కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దుర్ఘటన జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన విషయాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రిఫ్రిజిరేషన్ సరిగా జరగకే.. ► ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయ్యింది. ఘటన జరిగిన ప్రదేశంలో 2,500 కిలోలీటర్ల ట్యాంకు, మరొకటి 3,500 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్నవి ఉన్నాయి. ► 2,500 కేఎల్ ట్యాంకు నుంచే తొలుత గ్యాస్ లీక్ మొదలైంది. దీనిలో 1,800 కేఎల్ స్టైరీన్ ద్రవ రూపంలో ఉంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ ఇది సురక్షితం. సాంకేతిక కారణాల వల్ల రిఫ్రిజిరేషన్ సరిగా జరగలేదు. దీంతో అది గ్యాస్ రూపంలోకి మారి లీక్ అయ్యింది. ► గ్యాస్ లీకైన వెంటనే కంపెనీ పరిసరాల్లోని వెంకటాపురం, పద్మనాభపురం, ఎస్సీ, బీసీ కాలనీల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రధానంగా వెంకటాపురం గ్రామంపై తీవ్ర ప్రభావం పడింది. 5.30 గంటలకల్లా అధికార యంత్రాంగం ఘటన స్థలికి చేరుకుంది. ► గురువారం ఉదయం 9.30 గంటల సమయానికి 122.5 పీపీఎం స్థాయిలో గ్యాస్ గాలిలో ఉంది. ఇది పూర్తిగా తగ్గాలి. దీనికి 24 గంటల సమయం పట్టవచ్చు. దీనివల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో పాటు చర్మ వ్యాధుల ప్రమాదం ఉంటుంది. ► గ్యాస్ ప్రభావం పరిధి 1.5 కి.మీ నుంచి 2 కి.మీ ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. గ్యాస్ లీకేజీ ప్రదేశంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీటిని వెదజల్లుతున్నాం. ఈ ప్రమాదం కారణంగా పది మంది చనిపోయారు. 22 పశువులు మృత్యువాత పడ్డాయి.(పెద్దాయనా.. ఎలా ఉన్నావు?) మరోసారి నిపుణులతో అధ్యయనం ► బాధిత ప్రజలకు పునరావాసం కల్పించే బాధ్యత జిల్లా కలెక్టర్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వాతావరణంలో గ్యాస్ విష ప్రభావాన్ని మరోసారి నిపుణులతో అధ్యయనం చేయించాలని, పూర్తిగా సురక్షితమని తేలిన తర్వాతే బాధితులను ఇళ్లకు పంపాలన్నారు.షెల్టర్లను ఏర్పాటు చేసి, మంచి భోజనం అందించాలన్నారు. గ్రామాల్లో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని సూచించారు. ► ప్రమాద సంఘటన సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన స్పందించిన జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు అధికారులను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. సైరన్ ఎందుకు మోగలేదు? ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం విష వాయువు లీకేజీ దుర్ఘటనకు సంబంధించి సైరన్ ఎందుకు మోగలేదని ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెల్లవారుజామున స్టైరీన్ గ్యాస్ లీక్ అయినప్పుడు సమీప గ్రామాల ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ఆరా తీశారు. ఆ సమయంలో అలారం ఎందుకు మొగలేదని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని సీఎస్ నీలం సాహ్నిని సీఎం ఆదేశించారు. ప్రమాద ప్రభావిత ఐదు గ్రామాల ప్రజల సంరక్షణ బాధ్యతను ఐదుగురు మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసులకు అప్పగించారు. (విశాఖ విషాదం)