
ద్వారకానగర్ (దక్షిణ): విష రసాయనం వ్యాపించి.. వేలాది మందిని వెంటాడి.. భయభ్రాంతులకు గురి చేసిన తరుణంలో.. అసంఖ్యాక ప్రజలు ఆస్పత్రుల పాలైతే హుటాహుటిన వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేజీహెచ్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. పలువురితో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి చెంత కూర్చుని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. వీలైనన్ని విధాలుగా సాయం అందిస్తామని, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో 70 ఏళ్ల తాతబ్బాయితో సీఎం సంభాషణ ఇలా సాగింది..
సీఎం: పెద్దాయనా.. ఎలా ఉన్నావ్..
తాతబ్బాయి: దేవుడి దయవల్ల బాగానే ఉన్నానయ్యా
సీఎం: ఏం జరిగింది పెద్దాయనా?
తాతబ్బాయి: బాబూ.. ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా వాసన వచ్చింది. అంతే. లేచేలోగానే విషగాలి కమ్మేసింది. ఊపిరి ఆడలేదు.
సీఎం: ఇప్పుడెలా ఉంది?
తాతబ్బాయి: అంతా వేగంగా వచ్చి మమ్మల్ని ఆస్పత్రికి తెచ్చారయ్యా. ఇప్పుడు పర్వాలేదు.
సీఎం: నీ ఆరోగ్యం బాగయ్యేలా డాక్టర్లు జాగ్రత్తగా చూస్తారయ్యా. మేం అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. భయం లేదు.
Comments
Please login to add a commentAdd a comment