
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ వ్యవస్థలన్ని స్పందించిన తీరు అద్భుతమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. ఆయన శినివారం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీకేజీ బాధితలును పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్షణ క్షణం సమీక్షించి స్పందించటం అభినందనీయం అన్నారు. (అప్పుడలా.. ఇప్పుడిలా)
మృతుల కుటుంబాలకు గాని, బాధితులకు కానీ అందిస్తున్న ప్యాకేజీ ఉహించనిదని ఆయన తెలిపారు. నేనున్నా అని నిజమగానే బాధిత కుటుంబాల మనసుల్లో వైఎస్ జగన్ ఉండిపోయారని ఆయన చెప్పారు. కొందరు రాజకీయ నేతలు, పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు అనాగరికమని పంచకర్ల రమేష్‌బాబు మండిపడ్డారు. (‘తండ్రీ కొడుకులను వ్యాన్‌లో మా రాష్ట్రానికి పంపండి’)