Panchakarla Ramesh Babu
-
ప్రజల సొమ్ముతో పంచకర్ల పుట్టినరోజు!
పెందుర్తి: ‘ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.1000 చొప్పున ఇవ్వాలి. లేదంటే తర్వాత ఇబ్బందులకు గురవుతారు. మీ కాలనీకి రోడ్లు ఉండవు. ఇతర సౌకర్యాలు రావు’అంటూ జనసేన నాయకులు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈ నెల 13న జరిగిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు జనసేన నాయకులు ఊర్ల మీద పడ్డారు. జీవీఎంసీ పరిధి పలు వార్డుల్లోని అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్‌లతో పాటు వ్యాపారులు, ఇతర వర్గాలకు చెందిన ప్రజల నుంచి నలుగురైదుగురు జనసేన నాయకులు గుంపుగా వెళ్లి వసూళ్లు చేశారు. ఎమ్మెల్యే పుట్టిన రోజుకు మేమేందుకు డబ్బులు ఇవ్వాలని ప్రజలు అనేసరికి బెదిరింపులకు దిగారు. మీ ప్రాంతానికి సౌకర్యాలు లేకుండా చేస్తామని హెచ్చరికలు చేయడంతో చేసేది లేక ప్రజలు డబ్బులు ఇచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచకర్ల పుట్టినరోజు వేడుకల పేరు చెప్పుకుని ఆయా నాయకులు దాదాపు రూ.15 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో సగం కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ల జేబుల్లోనే వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేగా అధికారికంగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకముందే పంచకర్ల అనుచరులు చెలరేగిపోతుండడం గమనార్హం. రానున్న రోజుల్లో జనసేన నాయకుల ఆగడాలు మరెన్ని చూడాలో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ వసూళ్ల పర్వం ఎమ్మెల్యే పంచకర్లకు తెలిసి జరిగిందా.. తెలియకుండా జరిగిందా అన్నదే ప్రశ్నార్థకం. -
43 ఏళ్ల సీనియర్‌కు అవమానాలు
పెందుర్తి: జగమంతా కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది అన్నట్లు తయారైంది 43 ఈయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, టీడీపీలో రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందిన బండారు ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థిగా పెందుర్తి బరిలో ఉన్న పంచకర్ల రమేష్‌బాబు తన చిరకాల ప్రత్యర్థి బండారు సత్యనారాయణమూర్తిని క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేలా చేశారు. కూటమి అభ్యర్థిగా ఉన్న రమేష్‌బాబు ప్రధాన పార్టీ టీడీపీని కలుపుకుని వెళ్లాల్సింది పోయి.. దొడ్డిదారిలో టీడీపీలో బండారు వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో అడుగడుగునా బండారు వర్గానికి జనసేన క్యాడర్ నుంచి తీవ్రస్థాయిలో అవమానాలు ఎదురవుతున్నాయి. ‘మాకు మీ అవసరం లేదు’అంటూ బండారు వర్గాన్ని మరింత రగిలిపోయేలా చేస్తున్నారు. అధినేత నుంచే అవమానం జనసేన–టీడీపీ జత కట్టిన దగ్గర నుంచి సీనియర్, స్థానికుడైన బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా పలు బహిరంగ వేదికల్లో బండారుకే టికెట్ అన్నట్లు సంకేతాలిచ్చారు. తీరా ఆఖరి నిమిషంలో బండారును కాదని కొద్ది రోజుల కిందట జనసేన తీర్థం పుచ్చుకున్న స్థానికేతరుడు పంచకర్లకు పెందుర్తి టికెట్ కేటాయించారు. బండారుకు టికెట్ ఇవ్వకపోగా.. కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ఒకవైపు టికెట్ నిరాకరించడం.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి అయిన రమేష్‌బాబుకు టికెట్ ఇవ్వడంతో బండారు రగిలిపోతున్నారు. నిద్రాహారాలు కూడా సరిగా లేకపోవడంతో కొద్ది రోజుల కిందట అనారోగ్యం పాలయ్యారు. అయినా కూడా టీడీపీ అధిష్టానం నుంచి కనీసం పరామర్శ లేదని బండారు వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. బండారా.. డోంట్ కేర్ : ఇదిలా ఉండగా జనసేన నుంచి కూడా బండారుకు తొలి నుంచి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇరు పార్టీలు జతకట్టిన తర్వాత తప్పదన్నట్లు అప్పుడప్పుడు కలసి తిరిగినా.. బండారు–పంచకర్ల బంధం టికెట్ కేటాయించిన తర్వాత అతుక్కునే ప్రయత్నమే జరగలేదు. బెర్త్ ఖాయం చేసుకొని పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టిన పంచకర్ల రమేష్‌బాబు మర్యాద కోసమైన బండారును పలకరించలేదు. ఇంటికే పరిమితమైన బండారు లేకపోతే మాకెంటి అనే రీతిలోనే జనసేన తీరు ఉంది తప్పితే.. పొత్తు ధర్మం కోసం పంచకర్ల వర్గం బండారును కలుపుకునే ప్రయత్నం చేయలేదు. కాగా.. కొద్ది రోజులుగా బండారుపై కాస్తోకూస్తో అసంతృప్తిగా ఉన్న కిందిస్థాయి నాయకులతో పంచకర్ల టచ్‌లోకి వెళ్లడంతో.. బండారు వర్గం తీవ్రస్థాయిలో రగిలిపోతోంది. నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోసిన బండారు సత్యనారాయణమూర్తికి జనసేన నుంచి ఇన్ని అవమానాలా? అంటూ టీడీపీ పాత కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అక్కడ ఆటలు సాగవని అర్థమైంది.. అందుకే గ్లాస్లో మునకేశాడా?
స్థిరత్వం లేని కొందరు రాజకీయ నేతలు గాలివాటుకు ప్రయాణం చేస్తుంటారు. ప్రతి ఎన్నికలకు ఒక్కో పార్టీ చొప్పున మారుతుంటారు. అలాగే నియోజకవర్గాలూ మారుతుంటారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజలను మోసం చేసి అక్కడి నుంచి మరోచోటుకు వెళుతుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అలాంటి నాయకుడొకరు తయారయ్యారు. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా ఆ నాయకుడిలో మార్పు రాలేదు. ఆయనో మాజీ ఎమ్మెల్యే. పద్నాలుగేళ్ల రాజకీయ జీవితం. రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదు పార్టీలు మారారు. చాలా నియోజకవర్గాలూ మారారు. పార్టీ మారడం అనేది పెద్ద సమస్య కాదు. కాని స్థిరత్వం ఉండదని, గాలివాటుకు పోతుంటారని, ఏ పార్టీలో ఉన్నా, అవినీతి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ముద్ర వేసుకున్నారు. ప్రజలు చీదరింపులు ఎదుర్కొంటున్నారు. ఆయనే పంచకర్ల రమేష్‌బాబు. విశాఖలో షిప్పింగ్ కాంట్రాక్టులు చేసే రమేష్‌బాబు ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసి, చిరంజీవి పేరుతో పెందుర్తి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రజలకు సేవ చేస్తాడని నమ్మారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినపుడు ఆయన కూడా హస్తం గూటికి చేరారు. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పెందుర్తిలో చేసిందేమీలేక, అక్కడి ప్రజలకు మొఖం చూపించలేక యలమంచిలి టిక్కెట్ తీసుకుని సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. యలమంచిలి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నీరు, చెట్టు, చెరువు, మట్టి, కొండ అన్న తేడా లేకుండా అక్కడి ప్రకృతి సంపద అంతా దోచుకున్నారు. చదవండి: పవన్ ‘బ్రో’ సీన్‌పై మంత్రి అంబటి రియాక్షన్ దోపీడి కోసమే రాజకీయాల్లోకి వచ్చిన పంచకర్ల రమేష్‌బాబును 2019 ఎన్నికల్లో జనం చిత్తుగా ఓడించారు. రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో జగన్మోహన్రెడ్డి పాలన చూసి తాను మారానంటూ వైఎస్సార్సీపీలో చేరారు. అధికార పార్టీని అడ్డుగా పెట్టుకుని దోపిడీ కొనసాగించవచ్చని భావించారు. ఫార్మా సిటీ, అరకులో భూముల కబ్జాకు సిద్ధమయ్యారు. రమేష్ బాగోతం తెలిసిన వైఎస్సార్సీపీ నాయకత్వం ఆయన్ను కట్టడి చేసింది. దీంతో ఇక్కడ తన ఆటలు సాగవని అర్థమై.. పవన్ కళ్యాణ్ జనసేన పంచన చేరారు. అనేక పార్టీలు, పలు నియోజకవర్గాలు మారిన రమేష్‌బాబును చూసి జనం ఈసడించుకుంటున్నారు. రమేష్‌ను నమ్మి గతంలో ఆయన వెంట తిరిగిన కార్యకర్తలు చాలామంది ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారు. ఒకరిద్దరు మాత్రం భూకబ్జాలు, అక్రమ మట్టి తవ్వకాలతో ఆర్థికంగా బలపడ్డారు. చదవండి: ‘వావీ వరసలు లేని.. నారాయణ.. నారాయణ’ ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు పంచకర్ల లాంటి నాయకులకు ఉత్తరాంధ్రలో చోటు ఇవ్వరాదని భావిస్తున్నారు. ఇటీవల పెందుర్తిలో ఆత్మీయ సమావేశం పేరిట పంచకర్ల కొందరు సన్నిహితుల్ని పిలవగా వారంతా ముఖం చాటేసారు. దోపిడీయే లక్ష్యంగా పార్టీలు, నియోజకవర్గాలు మారే రమేష్‌ను చూసి ఏ పార్టీ కార్యకర్తలు వస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. గ్లాస్ పార్టీ తరపున ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
20న జనసేన పార్టీలో చేరుతా: మాజీ ఎమ్మెల్యే
సీతమ్మధార: విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సమక్షంలో ఈనెల 20వ తేదీన ఆ పార్టీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం సీతమ్మధారలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఉదయం సీతమ్మధారలోని తన నివాసం నుంచి కార్లు, బస్సుల్లో తన మద్దతుదారులతో ర్యాలీగా విజయవాడ బయలుదేరుతా నని చెప్పారు. పెందుర్తిలో పోటీ చేసేందుకు జనసేన నుంచి ఎలాంటి హమీ తీసుకోలేదని అన్నారు. వైఎస్సార్ సీపీలో వ్యక్తిగత లబ్ధి కోసం ఏరోజు అడగలేదన్నారు. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగత విమర్శలు చేయడానికి తాను దూరంగా ఉంటానన్నారు. అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన ప్రకారమే పార్టీలో పనిచేస్తానన్నారు. -
వైఎస్సార్సీపీలోకి పంచకర్ల రమేష్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్చార్జ్ వి.విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన రమేష్ సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటామని, ముఖ్యమంత్రి ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీలో చేరడం సంతోషకరమైన విషయమని అన్నారు. పంచకర్ల రమేష్ బాబుతో పాటు ఇతర నేతలు లంకా మోహన్ రావు, చెల్లుబోయిన రామ్మోహన్, కాండ్రేగుల జోగేందర్ సింహాచలం నాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం: పంచకర్ల ► చంద్రబాబు నిర్ణయాలతో విసిగి పోయి 5 నెలల క్రితమే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశాను. చంద్రబాబు, ఆయన మనుషులు పనిగట్టుకుని ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు. తన మనుషులే అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ► అభివృద్ధి వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ఉత్తరాంధ్రతో సహా మూడు ప్రాంతాల ప్రజలూ స్వాగతిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని చంద్రబాబు ప్రజలను, రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ► లోకేష్ నాయకుడిగా పనికి రాడని టీడీపీ నేతలంతా చెప్పినా, బాబు దొడ్డిదారిన అతన్ని మంత్రిని చేశారు. పార్టీపై పెత్తనం చెలాయించేలా చేశారు. లోకేష్ అజ్ఞానాన్ని మేము భరించలేక పోయాం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ నాయకత్వంలో ఇంతకాలానికి ఉత్తరాంధ్రకు మంచి రోజులు వచ్చాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారబోతోంది. మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి : మంత్రి అవంతి ► చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చిందే ఉత్తరాంధ్ర ప్రజలు. ఆయనకు అంత నమ్మకమే ఉంటే.. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేస్తున్నాం. అప్పుడే ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో చంద్రబాబుకు తెలుస్తుంది. ► చంద్రబాబు ఇప్పటికైనా ఊహల్లోంచి బయటకు రావాలి. ఆయన అధికారంలో ఉండగా విశాఖలో ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లకు రూ.23 కోట్లు చెల్లించారు. జగన్ ప్రభుత్వం 30 ఎకరాల్లో స్టేట్ గెస్ట్ హౌస్ కట్టాలని నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు అడ్డుపడుతుండటం దారుణం. అమరావతిలో తాత్కాలిక భవనాలకు మాత్రం 33 వేల ఎకరాలను సేకరించారు. -
చంద్రబాబు మమ్మల్ని రెచ్చగొట్టారు: పంచకర్ల
-
చంద్రబాబు మమ్మల్ని రెచ్చగొట్టారు: పంచకర్ల
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మనుషులే అభివృద్ధి చెందాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరులతో కలిసి పంచకర్ల రమేష్‌బాబు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ.. ఐదు నెలల క్రితమే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశా. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారు. మా ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండలేక పార్టీని వీడాం. అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించాం. సీఎం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఇంకా చాలా మంది టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలోకి వచ్చే పరిస్థితి ఉంది. లోకేష్ నాయకుడిగా పనికిరాడని టీడీపీ నేతలంతా చెప్పాం. దొడ్డిదారిన లోకేష్‌ను మంత్రిగా చేసి పెత్తనం చెలాయించేలా చేశారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు మంచి రోజులు వచ్చాయి’అని పేర్కొన్నారు. (చదవండి: 'ఆగస్టు 28.. చంద్రన్న రక్తపాత దినోత్సవం') బాబు ఊహల్లోంచి బయటకి రావాలి: అవంతి ‘చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఉత్తరాంధ్రే. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసిపోతుంది. చంద్రబాబు ఇప్పటికైనా ఊహల్లోంచి బయటకు రావాలి. బాబు అధికారంలో ఉండగా విశాఖలో ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లకే రూ.23 కోట్లు చెల్లించారు. 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్‌హౌస్ కట్టేందుకు చంద్రబాబు అడ్డుపడుతున్నారు. రాజధాని బిల్డింగ్‌లకు మాత్రం 30వేల ఎకరాలు సేకరించారు’అని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజా వ్యతిరేకి. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నదే నెరవేరుతుంది. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుంది. రఘురామరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. రఘురామరాజుపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. రఘురామరాజుపై చర్యలు తీసుకుంటారనే విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు. (చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల) -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రమేష్‌బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, అభివృద్ధి వికేంద్రీకరణపై టీడీపీ వైఖరితో విసిగిపోయిన పంచకర్ల మే నెలలోనే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: ‘టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు’) -
సీఎం జగన్ స్పందన అభినందనీయం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ వ్యవస్థలన్ని స్పందించిన తీరు అద్భుతమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. ఆయన శినివారం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీకేజీ బాధితలును పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షణ క్షణం సమీక్షించి స్పందించటం అభినందనీయం అన్నారు. (అప్పుడలా.. ఇప్పుడిలా) మృతుల కుటుంబాలకు గాని, బాధితులకు కానీ అందిస్తున్న ప్యాకేజీ ఉహించనిదని ఆయన తెలిపారు. నేనున్నా అని నిజమగానే బాధిత కుటుంబాల మనసుల్లో వైఎస్ జగన్ ఉండిపోయారని ఆయన చెప్పారు. కొందరు రాజకీయ నేతలు, పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు అనాగరికమని పంచకర్ల రమేష్‌బాబు మండిపడ్డారు. (‘తండ్రీ కొడుకులను వ్యాన్‌లో మా రాష్ట్రానికి పంపండి’) -
టీడీపీకి మరో షాక్.. పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి,విశాఖపట్నం : జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్‌బాయ్ చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి రమేష్ బాబు తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం టీడీపీ పెద్దలకు రుచించలేదని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. విశాఖ క్యాపిటల్‌గా వ్యతిరేకిస్తే నష్టపోతామని చెప్పినట్లు, టీడీపీ పెద్దలు నా మాటలను పక్కన పెట్టారని వాపోయారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని తనకు చెప్పారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు. రాజధానిగా విశాఖ వద్దనడం సరికాదని రమేష్ బాబు హితవు పలికారు. వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని కోరారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు తాము ఒప్పుకున్నామని, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు 23 సీట్లు ఇచ్చిన దానిపై చంద్రబాబు ఎప్పుడైనా చర్చించారా అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుదారులను మంత్రులను చేయడం ప్రజలు అంగీకరించలేదని తెలిపారు. టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు) కాగా మంగళవారం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్సీపీలోకి చేరిన విషయం తెలిసిందే. వారికి విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఓవరాక్షన్
విశాఖపట్నం: ప్రత్యేక హోదా పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులు ఆందోళనకారులపై జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసగా తెలిపేందుకు వస్తున్న వారిపై దౌర్జన్యం చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు అత్యుత్యాహం ప్రదర్శించారు. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశిస్తూ హల్ చల్ చేశారు. తన వాహనంలో తిరుగుతూ ఆందోళనకారుల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమచారం చేరవేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి అయివుండి గూండాలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమానికి మద్దతు తెలపకుండా అణిచివేయాలని చూడడం దారుణమని వాపోయారు. -
ఈసారి నాకేమీ ఓట్లేయక్కర్లేదులే
ఈసారి నాకేమీ ఓట్లేయక్కర్లేదులే మహిళలపై ఎమ్మెల్యే పంచకర్ల ఆగ్రహం ఓట్లు కోసం అప్పుడొచ్చారు.. ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేదు ఎమ్మెల్యే పంచకర్లను నిలదీసిన మహిళలు అసహనంతో ఊగిపోయిన ఎమ్మెల్యే సాక్షి, విశాఖపట్నం/అచ్యుతాపురం : ‘చెప్పిన కాడికి చాలు ఇకనోర్ముయండి..మీరంతా నాకే ఓట్లేశారు మరి.. ఈసారి నాకేమి ఓట్లయ్యక్కర్లేదులే పనిచూసుకోండి’ అంటూ యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మహిళలతో దురుసుగా మాట్లాడారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. యలమంచిలి టౌన్లో ఏఎస్సార్కాలనీ, మిలట్రీ కాలనీ, యానాద్రికాలనీలను సందర్శించారు. ఏఎస్సార్కాలనీలో మహిళలతో మాట్లాడుతూ పులిహార, బిర్యానీ పొట్లాలు పంపిచాం అందాయాఅని ఆరా తీశారు. పులిహోర,బిర్యానీలతో మా సమస్య పరిష్కారం కాదు. రోడ్లు, కాలువలు నిర్మించి ముంపు సమస్యను పరిష్కరించాలి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చారు. మళ్లీ రావడానికి రెండున్నరేళ్లు పట్టింది. ఇన్నాళ్లు మా సమస్యలు ఎందుకు పట్టించు కోలేదని పలువురు మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పగ్గాలు చేపట్టిన తర్వాత మా సమస్యపట్టించుకుని ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేదికాదని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే స్పెందిస్తూ ఇప్పుడే మన్సిపాలిటీ సిబ్బందికి చెబుతాను.. కాలువలన్నీ క్లియర్చేయించి ముంపులేకుండా చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. మీరు అలాగె చెప్పి వెళ్తారు. ఆ తర్వాత ఆ పనులు జరగవు.. ఇక్కడే ఉండి సమస్య పరిష్కరించాలని ఏఎస్సార్ కాలనీకి చెందిన మళ్ల పార్వతి ఎమ్మెల్యేను నిలదీసింది. ఇంకా మాట్లాడబోతుంటే ‘చెప్పినకాడికి చాలు ఇకనోర్ముయ్’ అని ఎమ్మెల్యే దురుసుగా గద్ధించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరికాస్త ముందుకెళ్లిన తర్వాత కూడా ఎమ్మెల్యేకు ఇదే రీతిలో మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్నాళ్లు మేం కన్పించ లేదా అంటూ కనక అనే మహిళ నిలదీయగా.. మీకు ముంపులో బతకడం అలవాటే కదా అని ఎమ్మెల్యేపై కూడా అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. దీనిపై కాలనీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకుంటే వినిపించుకోకుండా ఎమ్మెల్యే కసురుకోవడం ఏంటని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. -
నేనా.. దందాలా..?
అబ్బే అదేమీ లేదు ఎమ్మెల్యే పంచకర్ల అచ్యుతాపురం: నేనా.. దందాలా.. అబ్బే అదేమీ లేదు.. మైనింగ్ కూడా ఆపేసి తొమ్మిది నెలలైంది.. అని యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వ్యాఖ్యానించారు. ఆదివారం సాక్షి దినపత్రికలో ‘అక్కడ పచ్చ భూతాలదే రాజ్యం’ శీర్షికన వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. సోమవారం అచ్యుతాపురంలో విలేకరులతో మాట్లాడారు. కథనంలో తన పేరు ప్రస్తావించకపోయినా నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా సంజాయిషీ ఇవ్వాల్సి వస్తోందన్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 9 నెలల క్రితం తానే స్వయంగా మైనింగ్ అధికారులతో చర్చించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను అరికట్టానని చెప్పారు. ఎస్ఈజెడ్ పరిశ్రమల యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు అడిగితేనే పట్టించుకోవడం లేదని... ఇక తమకు లంచాలు ఏవిధంగా ఇస్తారని ప్రశ్నించారు. దేవుడి మాన్యం భూములను ఆక్రమించలేదని చెప్పారు. నాలుగు మండలాల్లో ఎక్కడా ఇన్‌చార్జ్‌లను నియమించలేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, రాజాన రమేష్‌కుమార్, రంగనాయకులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు పట్టం
సాక్షి,విశాఖపట్నం : పంచాయతీల పరిపుష్టి కోసం ఎన్నినిధులు వెచ్చించేందుకైనా సిద్ధంగా ఉన్నామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్మల్ గ్రామ పురస్కారాల బహుమతుల ప్రదానోత్సవం శని వారం ఘనంగా జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా 27 పంచాయితీలకు ఈ అవార్డులు ప్రదానం చేయగా, విశాఖజిల్లాలో ఎనిమిది పంచాయితీలకు ఈ అవార్డులు మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులు అంద జేశారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలం చీమలపల్లి, దీపర్ల, సోమవరం, ఎర్రవరం, మునగపాక మండలం అరబుపాలెం, పాయకరావుపేట మండలం కేశవర ం, కొత్తూరు, రాజగోపాల పురం పంచాయితీసర్పంచ్లను ఈసందర్భంగా మంత్రులు దుశ్సాలు వాలు కల్పి ఘనంగా సత్కరించారు. రూ.22లక్షల చెక్‌లను ఆయా పంచాయితీ సర్పంచ్‌లకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ స్వచ్చభారత్, స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని పంచా యితీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, రోడ్ల అభివృద్ధి, విద్యుత్, భూగర్భడ్రైనేజీ తదితర అంశాలపై దృష్టి పెట్టామన్నారు. ఈ ఏడాది 27 పంచాయితీ లకు కేంద్రం రూ.1.20కోట్లు కేటాయించిందన్నారు. 2014-15లో నిర్మల్ పురస్కా రాలకు కొత్త గైడ్‌లైన్స్ ప్రకటించిందన్నారు. పంచాయితీల్లోడంపింగ్ యార్డుల నిర్మాణానికి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు కేటాయిస్తున్నామన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ గతంలో నిర్మల అవార్డుల ప్రదానం హైదరాబాద్‌లో సాదాసీదాగా జరిగేదన్నారు. తొలిసారిగా సర్పంచ్‌లను ఘనంగా సత్కరించేందుకు విశాఖలోరాష్ర్ట స్థాయి వేడుకను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, కలెక్టర్ ఎన్.యువరాజ్, డీపీఒ వెంకటేశ్వరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.ప్రభాకరరావు, డ్వామా పీడీ శ్రీరాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తప్పు చేస్తే రాజకీయ సన్యాసం:టీడీపీ ఎమ్మెల్యే
-
తప్పు చేస్తే రాజకీయ సన్యాసం:టీడీపీ ఎమ్మెల్యే
విశాఖపట్నం: తప్పు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గానికి చెందిన యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. తాను ఎస్ఐ ట్రాన్స్ఫర్ కోరుకోలేదని చెప్పారు. మంత్రి గంటా వర్గం ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. మైనింగ్ లీజు విషయంలో ఎమ్మార్వోను అడిగే హక్కు ఎస్ఐకి ఉందా? అన్న విషయంపైనే ఎస్పీని అడిగినట్లు చెప్పారు. దానికి ఆయన క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. అమ్మవారి జాతర విషయంలో ఎస్పీ సహకరించడంలేదనే డీజీపీని కలిసినట్లు చెప్పారు. తనకు, మాజీ ఎమ్మెల్యేలకు ఎటువంటి లావాదేవీలు లేవని చెప్పారు. పది మంది ఎమ్మెల్యేలకు అక్రమ గ్రావెల్స్, ఇసుక రవాణా లేవని తెలిపారు. ఒకవేళ ఉంటే రాజీనామా చేస్తామని రమేష్ బాబు చెప్పారు. -
‘దేశం’లో వర్గపోరు
అచ్యుతాపురం, న్యూస్‌లైన్ : తెలుగుదేశంలో వర్గపోరు ఆ పార్టీ యలమంచిలి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్లరమేష్బాబుకు చుక్కలు చూపెడుతోంది. ఒక వర్గానికి చెందిన శ్రేణులు కలిసిరాకపోవడంతో సోమవారం రాత్రి ఎం.జగన్నాథపురంలో అతనికి చేదు అనుభవం ఎదురైంది. మాజీ ఎంపీ పప్పల చలపతిరావును తీసుకొని ఆ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడానికి పంచకర్ల వెళ్లారు. సుందరపు విజయకుమార్ లేకుండా గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీలులేదంటూ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ హాఠాత్పరిణామంతో పప్పల కంగుతిన్నారు. విజయకుమార్ని పరిచయం చేసిన తనను గౌరవించకపోవడమేమిటంటూ వాపోయారు. వాడురావాలి వీడురావాలంటే కుదరని పని.. పార్టీమీద అభిమానం ఉంటే చేయండి లేకపోతేలేదు. ఒక్కఊరు ఓట్లు వేయకపోతే నష్టమేమీ ఉండదంటూ విసురుగా కారు ఎక్కి పంచకర్ల, పప్పల వెనుదిరిగారు. టీడీపీలో వర్గపోరుకు ఈ సంఘటన అద్దం పట్టింది. తిరుగుబాటు బెడద ఇప్పట్లో సమసిపోదని ఎం.జగన్నాథపురం విషయంలో స్పష్టమైంది. నియోజకవర్గం ఇన్చార్జిగా సుందరపును నియామకాన్ని అప్పట్లో నియోజకవర్గ నాయకులైన లాలం భాస్కరరావు, పప్పల చలపతిరావు,గొంతెన నాగేశ్వరరావు,ఆడారి తులసీరావులు తీవ్రంగా వ్యతిరేకించారు. సుందరపుకి సహకరించవద్దని కార్యకర్తలను ఆదేశించారు. కానీ సర్పంచ్, ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థులకు అండగా నిలిచిన విజయ్‌కుమార్ నియోజకవర్గంలో తనకంటూ ఒక స్థానాన్ని, వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలుపొందిన సర్పంచ్‌లంతా ప్రస్తుతం సుందరపు వెంటే ఉన్నారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో వీరు అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గం నాయకులే అడ్డుకున్నారంటూ రగిలిపోతున్నారు. ఈ స్థితిలో బేరసారాలతో సుందరపు అలకను తీర్చగలిగారు. గాయపడిన కార్యకర్తల మనోభావాలను మాత్రం మాన్పలేకపోతున్నారు. పంచకర్ల అన్నలాంటివాడని సమావేశాల్లో సుందరపు విజయకుమార్ పేర్కొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వెన్నుపోటు పొడిచినవారిని అన్నా అని పిలవద్దంటున్నారు. ఇదిలావుండగా సుందరపు వర్గాన్ని కాదని పంచకర్ల డబ్బు ఎరతో మరో వర్గాన్ని తయారు చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా గ్రామాల్లో తెలుగుదేశం కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం అభ్యర్థి పంచకర్లకు తలనొప్పిగా ఉంటోంది.