వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు | Ex-TDP MLA Panchakarla Ramesh Joined in YSRCP - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

Published Fri, Aug 28 2020 11:49 AM | Last Updated on Fri, Aug 28 2020 7:42 PM

TDP Ex MLA Panchakarla Ramesh Babu Joined In YSR Congress Party - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రమేష్‌బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, అభివృద్ధి వికేంద్రీకరణపై టీడీపీ వైఖరితో విసిగిపోయిన పంచకర్ల మే నెలలోనే పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చదవండి: ‘టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు’)


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement