
పంచాయతీలకు పట్టం
సాక్షి,విశాఖపట్నం : పంచాయతీల పరిపుష్టి కోసం ఎన్నినిధులు వెచ్చించేందుకైనా సిద్ధంగా ఉన్నామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్మల్ గ్రామ పురస్కారాల బహుమతుల ప్రదానోత్సవం శని వారం ఘనంగా జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా 27 పంచాయితీలకు ఈ అవార్డులు ప్రదానం చేయగా, విశాఖజిల్లాలో ఎనిమిది పంచాయితీలకు ఈ అవార్డులు మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులు అంద జేశారు.
జిల్లాలోని అచ్యుతాపురం మండలం చీమలపల్లి, దీపర్ల, సోమవరం, ఎర్రవరం, మునగపాక మండలం అరబుపాలెం, పాయకరావుపేట మండలం కేశవర ం, కొత్తూరు, రాజగోపాల పురం పంచాయితీసర్పంచ్‌లను ఈసందర్భంగా మంత్రులు దుశ్సాలు వాలు కల్పి ఘనంగా సత్కరించారు. రూ.22లక్షల చెక్‌లను ఆయా పంచాయితీ సర్పంచ్‌లకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ స్వచ్చభారత్, స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని పంచా యితీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, రోడ్ల అభివృద్ధి, విద్యుత్, భూగర్భడ్రైనేజీ తదితర అంశాలపై దృష్టి పెట్టామన్నారు.
ఈ ఏడాది 27 పంచాయితీ లకు కేంద్రం రూ.1.20కోట్లు కేటాయించిందన్నారు. 2014-15లో నిర్మల్ పురస్కా రాలకు కొత్త గైడ్‌లైన్స్ ప్రకటించిందన్నారు. పంచాయితీల్లోడంపింగ్ యార్డుల నిర్మాణానికి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు కేటాయిస్తున్నామన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ గతంలో నిర్మల అవార్డుల ప్రదానం హైదరాబాద్‌లో సాదాసీదాగా జరిగేదన్నారు. తొలిసారిగా సర్పంచ్‌లను ఘనంగా సత్కరించేందుకు విశాఖలోరాష్ర్ట స్థాయి వేడుకను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, కలెక్టర్ ఎన్.యువరాజ్, డీపీఒ వెంకటేశ్వరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ టి.ప్రభాకరరావు, డ్వామా పీడీ శ్రీరాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు.