Minister Ganta Srinivasa Rao
-
గంటాను భీములి నుంచి తప్పించేందుకు బాబు స్కెచ్
-
బుక్కుల్లో బొక్కేశారు!
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీలనూ అధికార పార్టీ నేతలు వదలడం లేదు. గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోళ్ల పేరుతో రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులను మింగేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడితోపాటు ఓ ఉన్నతాధికారి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందినా అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో విచారణ ముందుకు సాగడం లేదు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి వచ్చినా ఈ వ్యవహారానికి అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. అసలు రేట్లను భారీగా పెంచేసి... బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్‌వరల్డ్ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందచేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామనడంతో ఎస్ఎస్ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడే గోల్‌మాల్‌కు తెరలేచింది. ముందుగా చెప్పిన్నట్లు కాకుండా పుస్తకాల ధరను పెంచేశారు. డిస్కౌంట్‌ను 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. ఉదాహరణకు ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్ ఆఫ్ ఇండియా’ పుస్తకం ధర రూ.1495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. ‘ఓషన్ రిలీవింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ డీప్’ పుస్తకం ధర రూ.1,000 నుంచి రూ.1995కి పెంచేశారు. ‘అట్లాస్ ఆఫ్ మై వరల్డ్’ పుస్తకం ధర రూ.695 నుంచి రూ.1,495కు పెంచేశారు. ‘డబుల్’ దందా! వాస్తవానికి తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ధరను అమాంతం రూ.13,489కి పెంచారు. రాష్ట్రంలోని 11,217 ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపిణీ చేయడానికి రూ.15,13,06,113 అవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే తరువాత స్కూళ్ల సంఖ్యను 7,413కి కుదించారు. ఆ ప్రకారం రూ. 9,99,93,957 అవుతుందని లెక్కగట్టారు. ఆమేరకు పుస్తకాలను పాఠశాలలకు అందించాలని జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఎస్ఎస్ఏ ఎస్పీడీ ఆదేశాలు జారీచేశారు. మండల పాయింట్లకు డ్రీమ్‌వరల్డ్ సంస్థే పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉన్నా కేవలం జిల్లా కేంద్రాలకు అందించేలా ఎస్ఎస్ఏ వెసులుబాటు కల్పించడంతోపాటు జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు. ఫైల్‌ను ముందు ముఖ్యకార్యదర్శికి పంపి ఆమోదం పొందాల్సి ఉన్నా అందుకు భిన్నంగా ఆర్డర్లు ఇచ్చిన తరువాత ఫైలును పంపడం గమనార్హం. ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా... డ్రీమ్‌వరల్డ్ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడాన్ని ముఖ్యకార్యదర్శి గుర్తించారు. ముందుగా ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.6,289 చొప్పున అదనంగా రేటు పెంచి రూ.13,489 చేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్ఎస్ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957 చెల్లింపులు చేశారు. పుస్తక ధరలను నిర్ణయించేందుకు రాష్ట్ర పుస్తక ప్రచురణ విభాగం ఉన్నా దానితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా ధరలను ఖరారు చేయించారు. ఎస్ఎస్ఏ ఫైల్లో ధరలు భారీగా పెరగడంపై ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా ఫలితం లేకపోయింది. అసలది పబ్లిషింగ్ సంస్థే కాదు.. డ్రీమ్‌వరల్డ్ సంస్థ ముందు ఇచ్చిన ఆఫర్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.5,33,73,600 మాత్రమే కాగా ధరలు పెంచి రూ.4,66,20,357 అదనంగా చెల్లించారు. విచిత్రమేమంటే డ్రీమ్‌వరల్డ్ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్ సంస్థే కాదని కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ ప్యారగాన్ పబ్లిషింగ్ తదితర సంస్థల పుస్తకాలను పంపిణీ చేసి వాస్తవ ధరలను 50 శాతం వరకు పెంచిందని, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారని ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలింది. ఆర్డర్లు రద్దు చేసి బిల్లుల చెల్లింపును నిలిపి వేయాలని, డ్రీమ్‌వరల్డ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని, తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించారు. -
పవన్ పత్తా లేకుండా పోయారు
సాక్షి, విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. పవన్‌కు ఆయన 25 ప్రశ్నలను సంధించారు. పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు. ప్రత్యేక హోదాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్ పత్తా లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇస్తే.. దానిమీద పన్ నోరు మెదపడం లేదని, కేంద్రంపై పల్లెత్తు మాట అనే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు. మీ రాజకీయ పార్టీ రహస్య ఏజెండా ఏమిటి. మీ పొత్తు ఎవరితో అని పవన్‌ను ప్రశ్నించారు. ‘గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి మీరు సాయం చేశారు. దానిని అంగీకరిస్తున్నాం. కానీ మీరు లేనప్పుడు కూడా టీడీపీ గెలిచింది’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు. -
గంటా ఇంట్లో లాటరీ.. ఏమిటీ కిరికిరి!
బహిరంగ ప్రదేశంలో.. సంబంధితులందరి సమక్షంలో తీయాల్సిన లాటరీని.. నాలుగ్గోడల మధ్య అనుకూలమైన కొద్దిమంది సమక్షంలో మమ అనిపించేశారు..వేల సంఖ్యలో నిర్మిస్తున్న హుద్‌హుద్ బాధితులకు నిర్మిస్తున్న ఫ్లాట్ల కేటాయింపు ప్రహసనమిది.. అది కూడా ఒక మంత్రి ఇంట్లో జరగడం ఆరోపణలకు, విమర్శలకు ఆస్కారమిస్తోంది.నాలుగేళ్ల క్రితం కకావికలం చేసిన హుద్‌హుద్ తుపానులో నష్టపోయిన వారి కోసం గ్రామీణ ప్రాంతంలో 810, ఆర్బన్ ప్రాంతంలో 4434 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో దాదాపు సగం మంత్రి గంటా నియోజకవర్గమైన భీమిలికే పోయాయి. నాలుగేళ్లపాటు ముక్కుతూ.. మూలుగుతూ ఎట్టకేలకు 2268 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటిని కేటాయించేందుకే శుక్రవారం మంత్రి గంటా ఇంట్లో లాటరీ తీసి.. అక్కడికక్కడే కొందరికి పత్రాలు పంపిణీ చేసేశారు. మంత్రి అనుచరులకు, టీడీపీ కార్యకర్తలకు ఇళ్లు దక్కేలా చేసేందుకే ఈ మంత్రాంగం నెరిపారని మిగతా బాధితులు ఆరోపిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా హౌసింగ్ కాలనీలో ఫ్లాట్ల్ల కేటాయింపు లబ్ధిదారుల సమక్షంలో ఆ కాలనీలోనే చేపడతారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు అందరూ చూస్తుండగా లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుపుతారు. కానీ ఇందుకు విరుద్ధంగా శుక్రవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని తన ఇంట్లో అతికొద్ది మంది లబ్ధిదారుల సమక్షంలో హుద్‌హుద్ ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ తీయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనర్హులకు ఇళ్ల కేటాయింపులు.. అడ్డగోలు దోపిడీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా జిల్లా హౌసింగ్ అధికారుల స్టైలే వేరు. మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ప్రాపకాన్ని పొందేందుకు వారు చూపిస్తున్న అత్యుత్సాహానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాన్ దెబ్బకు వేలాది మంది నిలువ నీడలేకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. విశాఖ జిల్లాలోనే లక్ష మందికిపైగా నిర్వాసితులు కాగా.. హుద్‌హుద్ పునర్నిర్మాణం పేరిట ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి పదివేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలోగా పూర్తి చేసి ఇవ్వాలని లక్ష్యం కాగా.. ఇంకా పూర్తి కాని దుస్థితి. ఇక విషయానికి వస్తే విశాఖ జిల్లాలో హుద్‌హుద్ బాధితుల కోసం గ్రామీణ ప్రాంతంలో 810, అర్బన్ ప్రాంతంలో 4434 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో అత్యధికంగా 2484 ఇళ్లు మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత నియోజకవర్గమైన ఒక్క భీమిలికే కేటాయించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2268 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, భీమిలిలో 784 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటి కోసం కాలనీ వద్దే మొత్తం లబ్ధిదారుల సమక్షంలో ఫ్లాట్ల కేటాయింపు జరగాలి. కానీ ఇందుకు భిన్నంగా శుక్రవారం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో మంత్రి గంటా ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ తీశారు. ఫ్లాట్లు దక్కించుకున్న పార్టీ కార్యకర్తలు, అనుచరులను ఇంటికి పిలిచి వారికి ఫ్లాట్ల కేటాయింపు చేయడం వివాదాస్పదమవుతోంది. తమ అనుచరులకు అనువుగా ఉండే ఫ్లాట్లనే లాటరీలో పెట్టి కేటాయింపులు జరిపారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 216 మందికి గంటా ఇంట్లో లాటరీ ద్వారా కేటాయింపులు జరపడంపై మిగతా లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో అందరి సమక్షంలో తీయాల్సిన లాటరీని గంటా ఇంట్లో తీయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పారదర్శకతకు తూట్లు పొడుస్తూ హౌసింగ్ అధికారులు మంత్రి ప్రాపకం కోసమే ఈ పని చేశారని, ఈ లాటరీని రద్దు చేసి గృహ సముదాయం వద్దే అందరి సమక్షంలో ఫ్లాట్ల కేటాయింపు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
600 కోట్లకు మోగిన గంటా
-
రూ.600 కోట్లకు ‘గంటా’రావం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని పేదలకు చెందిన విలువైన 358 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసి వాటి ద్వారా రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఆ ప్రాంత మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి రంగం సిద్ధం చేశారు. గతంలోనే ఇందుకు ప్రయత్నించగా విషయం రచ్చవడంతో అప్పట్లో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఆయన తన ప్రయత్నాలు మానలేదు. తెరవెనక మంత్రాంగం కొనసాగించారు. బినామీ పేర్లతో వాటిని కొనేసిన మంత్రి వాటిని చట్టబద్ధం చేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించారు. భూసమీకరణ పేరిట విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు ఈ భూములు అప్పగించి.. అందుకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లను సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నారు. ఇందుకోసం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘చినబాబు’తో మాట్లాడి రంగం సిద్ధం చేసుకున్నారు. తద్వారా రూ.600 కోట్లకుపైగా అప్పనంగా కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రతిపాదనకు సీఎం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం. అసైన్డ్ భూములను కొనుగోలు చేసి... విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, పెందుర్తి, ఆనందపురం మండలాల పరిధిలో సుమారు 358 ఎకరాల అసైన్డ్ భూములను మంత్రి గంటా శ్రీనివాసరావు బినామీ(బంధువులు, సంస్థ ఉద్యోగుల) పేర్లతో చట్టవిరుద్ధంగా కారుచౌకగా కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములను అమ్మడానికి, కొనడానికి వీలులేదని ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్(పీఓటీ) చట్టం స్పష్టంగా చెబుతోంది. పీఓటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూముల్ని కొనడం నేరం. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ‘‘ఈ భూములను వుడా తీసుకుంటోంది. ఇది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన అసైన్డ్ భూమి అయినందున వుడా నష్టపరిహారం ఇవ్వకుండా ఉచితంగా లాగేసుకుంటుంది. మాకు ఇస్తే ఎకరాకు రూ.లక్ష ఇస్తాం.. అంటూ మంత్రి బంధువులు, ఆయనకు చెందిన సంస్థలోని ఉద్యోగులతో ప్రచారం చేయించడం ద్వారా అసైనీల్లో భయం సృష్టించారు. దీంతో ఊరికే భూములు పోగొట్టుకోవడంకంటే ఎంతో కొంత తీసుకుని విక్రయించడం మేలనే భావనతో ఎకరా రూ.లక్ష నుంచి లక్షా ఇరవై వేల ధరతో అమ్మేశారు. మొత్తం 358 ఎకరాలను రూ.40 కోట్లలోపు మొత్తానికే మంత్రి బినామీ పేర్లతో కైవసం చేసుకున్నారు. ఇందులో భాగంగా రికార్డులను సైతం తారుమారు చేశారు. ఈ భూముల్ని అమ్ముకుంటే రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లదాకా వస్తుంది. అయితే పీఓటీ చట్టం ప్రకారం అమ్ముకోవడం వీలుకాదు. అందువల్ల ఈ భూమిని వుడాకు సమీకరణ కింద కట్టబెట్టి వుడా నుంచి ఎకరాకు 1,120 గజాల చొప్పున ప్లాట్లు తీసుకోవాలని మంత్రి పథకం రూపొందించారు. ఇలా తీసుకున్న ప్లాట్లు మంత్రి బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయి. దీంతో చట్టబద్ధంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. తమ చేతికి మట్టి అంటనివిధంగా వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మేరకు భూసమీకరణ కింద ఈ భూములను తీసుకోవాలని వుడాపై ఒత్తిడి తెచ్చారు. ‘చినబాబు’ నుంచి కూడా ఒత్తిడి రావడంతో వుడా మౌఖికంగా అంగీకరించింది. సీఎం గ్రీన్‌సిగ్నల్ వుడా భూసమీకరణకు అనుమతించాలని విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ గత నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కోరగా సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘గతంలో ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ వుడా భూ సమీకరణ ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపడం గమనార్హం. రూ.40 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్లకుపైగా రాబడి.. భూసమీకరణ కింద మంత్రి బినామీల నుంచి 358 ఎకరాలను సమీకరించినందుకు ప్రతిగా వుడా వారికి ఎకరాకు 1,120 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలని ప్రతిపాదనలతో గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు రావడం, విశాఖ ప్రాంతానికి చెందిన మరో మంత్రి స్వయంగా మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయడంతో ఇది ఆగిపోయింది. అయితే ఇప్పుడు గత ప్రతిపాదనల ప్రకారమే ముందుకు వెళుతున్నారు. ఆ మేరకు 358 ఎకరాల సమీకరణకుగాను భూయజమానులైన బినామీలకు వుడా 4,00,960 గజాల మేరకు ప్లాట్లను ఇవ్వాల్సి ఉంటుంది. వుడా ఇవ్వడానికి ప్రతిపాదించిన ప్రాంతంలో గజం విలువ రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంది. కనిష్ట ధరను ప్రామాణికంగా తీసుకున్నా గజానికి రూ.15,000 ప్రకారం 400960 గజాలకు రూ.601.44 కోట్లు అవుతుంది. మధ్యస్తంగా గజం రూ.17,000 ధరతో విక్రయిస్తే రూ.681.63 కోట్లు వస్తుంది. ఏతావాతా రూ.40 కోట్లతో మంత్రి కొట్టేసిన అసైన్డ్ భూమిని వుడాకు కట్టబెట్టడం ద్వారా ఆయన కొట్టేసే మొత్తం రూ.600 కోట్లుపైమాటే. ఇందులో చినబాబు, మంత్రి పంచుకోగా మిగిలిన దానిలో కొంత మొత్తాన్ని ఎన్నికల ఖర్చుకోసం ఇస్తామని మంత్రివర్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై ఇక రాద్ధాంతం చేయవద్దని చినబాబు మరో మంత్రికి హితవు పలికినట్టు సమాచారం. -
ఇంజనీరింగ్.. బాలురు భళా!
26 నుంచి కౌన్సెలింగ్ జూన్ 11 నుంచి తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 26 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి చెందిన దాదాపు 20 వేల నుంచి 30 వేల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుతారన్నారు. గతేడాది అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కలిపి 1,36,790 సీట్లు ఉండగా 84,498 భర్తీ అయ్యాయని, 52,312 సీట్లు మిగిలిపోయాయని వెల్లడించారు. నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. కంబైన్డ్ స్కోరుతో ర్యాంకుల్లో మార్పులు ర్యాంకుల నిర్ణయంలో ఎంసెట్‌లో (160 మార్కులు) సాధించిన మార్కులను, ఇంటర్మీడియెట్ మార్కులను నార్మలైజేషన్ చేసి 75 శాతం, 25 శాతంగా తీసుకొని కంబైన్డ్ స్కోర్‌ను నిర్ణయించారు. ఆ స్కోర్ ప్రకారం ర్యాంకులను ప్రకటించారు. దీనివల్ల ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించినా ఇంటర్మీడియెట్ మార్కులతో కలిపి కంబైన్డ్ స్కోర్‌ను తీసుకున్నప్పుడు కొందరు ర్యాంకుల్లో వెనుకంజలో నిలిచారు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో తొలి ర్యాంకర్ సూరజ్ కృష్ణకు ఎంసెట్ మార్కులు 150.1803 రాగా కంబైన్డ్ స్కోర్ 95.2720 వచ్చింది. రెండో ర్యాంకర్.. గట్టు మైత్రేయకు ఎంసెట్ మార్కులు 151.7622 రాగా కంబైన్డ్ స్కోర్ 94.9302. ఫలితంగా ఎంసెట్‌లో తక్కువ మార్కులు ఉన్నా కంబైన్డ్ స్కోర్‌లో ముందున్న సూరజ్‌కృష్ణను ఫస్టు ర్యాంకర్‌గా ప్రకటించారు. సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2018 ఫలితాల్లో బాలురు సత్తా చాటారు. టాప్ ర్యాంకుల్లోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ ముందంజలో నిలిచారు. టాప్ 10 ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌లో 9, అగ్రి, మెడికల్ విభాగంలో 7 ర్యాంకులు సాధించారు. బాలికలు టాప్ టెన్‌లో ఇంజనీరింగ్‌లో 1, అగ్రి, మెడికల్‌లో 3 ర్యాంకులు దక్కించుకున్నారు. ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన భోగి సూరజ్ కృష్ణ సాధించగా, తెలంగాణకు చెందిన గట్టు మైత్రేయ రెండో స్థానంలో నిలిచాడు. ఇక అగ్రి, మెడికల్‌లో విశాఖపట్నానికి చెందిన జంగాల సాయి సుప్రియ మొదటి ర్యాంకు, కర్నూలుకు చెందిన గంజికుంట శ్రీవాత్సవ్ రెండో ర్యాంకు దక్కించుకున్నారు. ఏపీ ఎంసెట్–2018 ఫలితాలను బుధవారం విజయవాడలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారావు, కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. 160 మార్కులకు నిర్వహించిన ఎంసెట్‌లో కనీస అర్హత మార్కులను 40గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు లేవు. ఇంజనీరింగ్ విభాగంలో 1,90,922 మంది పరీక్ష రాయగా 1,38,017 మంది (72.28 శాతం) అర్హత సాధించారు. 52,905 మంది అర్హత మార్కులు సాధించలేదు. అర్హత సాధించినవారిలో బాలురు 82,190 మంది, బాలికలు 55,827 మంది ఉన్నారు. అగ్రి, మెడికల్ విభాగంలో 73,373 మంది పరీక్ష రాయగా 63,883 మంది (87.06 శాతం) అర్హత సాధించారు. వీరిలో 21,852 మంది బాలురు, 42,031 మంది బాలికలు ఉన్నారు. 9,460 మందికి అర్హత మార్కులు కూడా రాలేదు. అర్హత సాధించినవారికి ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి కంబైన్డ్ స్కోర్ ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు. ఇంజనీరింగ్‌లో 1,26,197 మందికి, అగ్రి, మెడికల్ విభాగంలో 58,923 మందికి ర్యాంకులు ప్రకటించారు. ర్యాంకుల సమాచారాన్ని అభ్యర్థుల మొబైల్ నెంబర్లకు పంపించారు. అభ్యర్థుల ర్యాంకు కార్డులు ఈ నెల 7 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్ ఫలితాల్లో ర్యాంకులు సాధించినవారే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా టాప్ ర్యాంకులు సాధించారు. జేఈఈ మెయిన్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన భోగి సూరజ్‌కృష్ణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలోనూ మొదటి ర్యాంకు సాధించాడు. ఇక జేఈఈ రెండో ర్యాంకర్ అయిన హేమంత్‌కుమార్ 8వ ర్యాంక్ పొందాడు. ఐదో ర్యాంకు సాధించిన మైత్రేయ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. ఏటా ఎంసెట్ రాసేవారి సంఖ్య పెరుగుతున్నా ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. 2017లో 79.74 శాతం అర్హులు ఉండగా ఈసారి 72.28 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. 124 ప్రశ్నలపై 235 అభ్యంతరాలు ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ ప్రాథమిక ‘కీ’ల్లో 124 ప్రశ్నలకు సంబంధించి 235 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని నిపుణుల కమిటీ పరిశీలించి ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా నాలుగు ప్రశ్నలకు మల్టిపుల్ సమాధానాలను సరైనవిగా గుర్తించి మార్కులను కలిపారు. ఇంజనీరింగ్‌లో మొత్తం ఆరు సెషన్లలో 960 ప్రశ్నలు ఇవ్వగా నిపుణుల సలహా మేరకు ఒక ప్రశ్న ఆప్షన్‌ను మార్పు చేశారు. మూడు ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్లు ఇచ్చారు. అగ్రికల్చర్ విభాగంలో రెండు సెషన్లలో 320 ప్రశ్నల్లో పరీక్ష నిర్వహించగా నిపుణుల సలహాతో ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆప్షన్లను ఇచ్చారు. -
పదో తరగతిలో 94.48% ఉత్తీర్ణత
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : ఇంటర్మీడియట్లో పైచేయి సాధించిన అమ్మాయిలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లోనూ అగ్రస్థానంలో నిలిచారు. బాలురకంటే తామే ముందున్నామని బాలికలు మరోసారి నిరూపించారు. 2018 పదో తరగతి పరీక్షా ఫలితాలను ఆదివారం సాయంత్రం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయని, ఈ పరీక్షలకు 6,13,378 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. వీరిలో 94.48 శాతమైన 6,04,527 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇందులో 94.56 శాతం బాలికలు కాగా, 94.41 శాతం బాలురు. ఉత్తీర్ణతలో బాలురకంటే బాలికలు 0.15 శాతం ఆధిక్యం సాధించారన్నారు. అలాగే, ప్రైవేటుగా హాజరైన విద్యార్థులు 78.35 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 5,340 ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయని.. సున్నా ఫలితాలు సాధించిన స్కూళ్లలో ప్రైవేట్‌వి 10, ఎయిడెడ్వి 2, జిల్లా పరిషత్ పాఠశాలలు 5 ఉన్నాయని వివరించారు. పాఠశాలల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని చూస్తే.. జిల్లా పరిషత్ పాఠశాలలు 92.57, ప్రభుత్వ పాఠశాలలు 90.77, ఏపీ మోడల్ స్కూళ్లు 97.38, మున్సిపల్ స్కూళ్లు 90.40 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి వివరించారు. ‘ప్రకాశం’ టాప్.. నెల్లూరు లాస్ట్ రాష్ట్రంలోకెల్లా ప్రకాశం జిల్లా 97.93 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, 80.37 శాతంతో నెల్లూరు జిల్లా ఆఖరి స్థానంలోనూ నిలిచాయని ‘గంటా’ వివరించారు. 2007లో పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లా మళ్లీ ఇప్పుడు ఆ స్థానం దక్కించుకుంది. సామాజికవర్గాల వారీగా చూస్తే.. ఓసీ విద్యార్థులు 96.77, ఎస్సీలు 91.12, ఎస్టీలు 91.47, బీసీలు 94.94 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అలాగే ద్వితీయ భాషలో అత్యధికంగా 99.98 శాతం, గణితంలో అత్యల్పంగా 96.45 శాతం మంది ఉత్తీర్ణత పొందారన్నారు. అలాగే, రాష్ట్రం మొత్తమ్మీద 29,921 మంది 10/10 జీపీఏ సాధించారని, వీరిలో అత్యధికులు (26,475 మంది) ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారేనని చెప్పారు. జూన్ 11 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. జూన్ 11 నుంచి 25 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి మే 30లోగా చెల్లించాలన్నారు. విద్యార్థులకు మార్కుల మెమోలను 15 రోజుల్లో పంపిస్తామని చెప్పారు. విద్యార్థులు మార్కులు తిరిగి లెక్కింపు కోరుకుంటే రూ.500 చెల్లించి మే 14 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సబ్జెక్టుల సమాధాన పత్రాల పునఃపరిశీలనా విధానాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో వికేంద్రీకరించినట్టు తెలిపారు. ఇలాంటి వారు మే 14లోగా తమ దరఖాస్తులు పంపుకోవాలన్నారు. ‘ప్రైవేటు’ ఫలితాలపై విచారణ 10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లే ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని విలేకరులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి పాఠశాలలపై విచారణ జరిపిస్తామని ఆయన బదులిచ్చారు. అలాగే, ఈ ఏడాది వేసవి సెలవులు ముగియడానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల మాధ్యమంలోనే అధిక ఉత్తీర్ణత టెన్త్ పరీక్షల్లో తెలుగు మాధ్యమం అభ్యర్థులకన్నా ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆంగ్ల మాధ్యమంలో 97.32 శాతం మంది ఉత్తీర్ణులు కాగా తెలుగు మాధ్యమంలో 90.12 శాతం మంది మాత్రమే పాసయ్యారు. -
వచ్చే నెలలో మరోసారి టెట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మరోసారి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మేలో జారీ చేసి జూన్‌లో ఆన్లైన్లో పరీక్షలు చేపట్టనున్నారు. టెట్ పూర్తయ్యాక ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ని నిర్వహించే అవకాశం ఉంది. మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావు టెట్, డీఎస్సీలపై అధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల నిర్వహించిన టెట్ లోపాలతో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఈ టెట్‌లో అనేకమందికి అర్హత మార్కులు రాలేదు. దీంతో వారంతా మరోసారి టెట్ నిర్వహించాలని కోరుతున్నారు. దీనిపై సమావేశంలో చర్చ జరిగింది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించేందుకు అవకాశమున్నందున మరోసారి నిర్వహణకు నిర్ణయించారు. అభ్యంతరాలకు అవకాశమేది? ఇటీవల నిర్వహించిన టెట్‌ను 4,14,120 మంది రాయగా 1,94,093 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడంతో ప్రశ్నలు, సమాధానాల జంబ్లింగ్, ఇతర కారణాలతో తమకు ఫైనల్ ‘కీ’ ప్రకారం వచ్చిన మార్కులకు, తుది ఫలితాల్లోని మార్కులకు చాలా వ్యత్యాసం ఉందని, 20 నుంచి 30 వరకు మార్కులు తగ్గిపోయాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. తమ సమాధాన పత్రాలు ఇవ్వాలనే డిమాండ్ రావడంతో రూ.200 ఫీజుతో వాటిని అందించారు. 30,591 మంది వీటిని తీసుకున్నారు. అయితే వీటిని పరిశీలించుకొని అభ్యంతరాలు తెలియచేసేందుకు విద్యాశాఖ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు కొన్ని పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో టెట్ పరీక్ష పత్రంలోని ఐదు ప్రశ్నలు కంప్యూటర్లలో కనిపించలేదు. ఈ కారణంగా తాము నష్టపోతున్నామని 1356 మంది ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని విద్యాశాఖ నియమించింది. వీరికి ఆ ప్రశ్నలకు సంబంధించిన మార్కులు ఎలా కలపాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. ఇలా కలపడం వల్ల మిగిలిన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు, న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని, ఆ తర్వాత తదుపరి టెట్‌కు ప్రభుత్వానికి లేఖ రాస్తామని అధికారులు వివరించారు. ప్రొఫెసర్ పోస్టుల కంటే టీచర్ పోస్టులకు ఎక్కువ అర్హత మార్కులు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కంటే టెట్‌లో అర్హత మార్కులు అధికంగా పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ పోస్టులకు 40 శాతం మాత్రమే అర్హత మార్కులు ఉన్నాయని, తమకు 60 శాతం మార్కులు రావాలనే నిబంధన పెట్టడం అన్యాయమని వాపోతున్నారు. కాగా.. డీఎస్సీ పోస్టులపై ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 14,494 ఖాళీ పోస్టులున్నా అన్నిటినీ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా భర్తీ చేయాలనుకుంటున్నారు. రెండో టెట్ నిర్వహణలోపు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి వీలుంటుందని, లేదంటే టెట్ ముగిశాక సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంటుందని అధికార వర్గాలు వివరించాయి. – పోస్టుల భర్తీని వాయిదా వేసేందుకేనా! ఇలా ఉండగా టెట్‌లో గందరగోళం రేకెత్తేలా చేయడం, మళ్లీ దాన్ని నిర్వహించాలని నిర్ణయించడాన్ని పరిశీలిస్తే టీచర్ పోస్టుల భర్తీని సాధ్యమైనంత జాప్యం చేసేందుకే అనే అభిప్రాయాలు నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఇప్పటివరకు డీఎస్సీ నిర్వహించింది కేవలం ఒకేఒక సారే. రెండేళ్లుగా మంత్రి శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇదిగో విడుదల చేస్తున్నాం, అదిగో నోటిఫికేషన్ జారీ అవుతోందంటూనే ఇప్పటికీ కాలం గడుపుతూనే వస్తున్నారు. 2017లో మూడు పర్యాయాలు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రకటనలిచ్చారు. గతేడాది డిసెంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షల నోటిఫికేషన్ తేదీలను కూడా విడుదల చేశారు. 2017 డిసెంబర్ 14న టెట్, ఆ మర్నాడు డీఎస్సీ నోటిఫికేషన్.. అన్నారు. కానీ టెట్ నోటిఫికేషన్ వెలువడటం, పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయడం అన్నీ అయిపోయాయి. టెట్ నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఇప్పుడు తాజాగా మరోసారి టెట్ నిర్వహించనున్నామని, అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తోందని సర్కారు చెబుతోంది. వీటన్నింటినీ బట్టి చూస్తే.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో సాధ్యమైనంత జాప్యం చేయడానికే సర్కారు కుయుక్తులు పన్నుతోందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం (నేడు) నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,423 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 10,26,891 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీటిలో 48 కాలేజీల్లో సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నపత్రాల సెట్‌ను బుధవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి చెప్పారు. 28న ఫస్టియర్, 29న సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫస్టియర్‌కు 5,09,898 మంది, సెకండియర్‌కు 5,16,993 మంది హాజరవుతారు. వీరిలో వొకేషనల్ విద్యార్థులు 63,419 మంది ఉన్నారు. కాగా, అధికారులు సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాలను గుర్తించి ఆయాచోట్ల అదనపు భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పరీక్షలు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షల్లో కాపీ చేస్తూ పట్టుబడితే నాలుగేళ్ల వరకు అనుమతించకుండా డిబార్ చేసేలా కొత్త నిబంధన పెట్టారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు ‘ఐపీఈ సెంటర్ లొకేటర్’ అనే ప్రత్యేక యాప్‌ను కూడా బోర్డు రూపొందించింది. హాల్‌టికెట్ నెంబర్ నమోదుచేస్తే సెంటర్ రూట్‌మ్యాప్ చూపిస్తుంది. ఇదిలాఉంటే.. ఈ ఏడాది నుంచి ర్యాంకుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్న సంగతి తెలసిందే. సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 0866–2974130, ఫ్యాక్స్ నెంబర్ 0866–2970056, టోల్ ఫ్రీ నెంబర్ 18002749868కు తెలియజేయాలని కార్యదర్శి పేర్కొన్నారు. -
కోడి పందేలపై గంటా వివాదాస్పద వ్యాఖ్యలు
-
‘అత్యాశ’వాసి
యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్‌కల్యాణ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్లే.. గోపాల గోపాల, సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి. సర్దార్ గబ్బర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లయితే నష్టాలను భర్తీ చేయాలని ఏకంగా హైదరాబాద్‌లో ధర్నా కూడా చేశారు. మరోవైపు ఎన్నికల్లో ఇప్పటివరకు పోటీచేయని, సంస్థాగత నిర్మాణం లేని పార్టీ అధినేతగా పవన్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల తొత్తుగా మారి ‘భ’జనసేనగా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్లో కూరుకుపోయాడు. ఇక సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోజుకో ట్వీట్‌తో పవన్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇమేజ్ తగ్గలేదని చాటేందుకు అజ్ఞాతవాసి హిట్ చేయడం తప్పనిసరి.. అంతేకాదు.. ఏకంగా బాహుబలి కలెక్షన్లనే పవన్ టార్గెట్‌గా పెట్టుకున్నాడన్న వాదనలు ఉన్నాయి. సరే.. సినిమాలో విషయం ఉండి జనాలకు ఎక్కితే ఎవ్వరూ ఆపలేరు. కానీ ఇష్టారాజ్యంగా ప్రీమియర్ షోల పేరిట దోపిడీ పర్వానికి తెరతీయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా అజ్ఞాతవాసికి రోజుకు ఏకధాటిగా ఏడు షోలు.. అదీ ఒక్క రిలీజ్ రోజుకే కాకుండా రిలీజ్ నుంచి వారం పాటు 24 గంటలూ షోలకు సర్కారు అనుమతినివ్వడం వివాదాస్పదమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్ వరుస చిత్రాలతో ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కుదేలయ్యారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్‌కు ఒక్క హిట్ సినిమా పడలేదు. ‘ప్రత్యేక దేవుడు’ పాత్ర పోషించిన గోపాల గోపాల, గబ్బర్‌సింగ్ మేనియాతో హిట్టవుతుందని తీసిన సర్దార్ గబ్బర్ సింగ్, రీమేక్‌ను నమ్ముకుని తీసిన కాటమరాయుడు.. ఈ మూడు సినిమాలు బయ్యర్లకు చుక్కలు చూపించాయి. నగరంలో ఓ సినిమా థియేటర్ యజమాని పవన్ మూడు చిత్రాల కలెక్షన్లపై యదార్థంగా చెప్పిన లెక్కలు ఓసారి చూద్దాం. గోపాల గోపాల సినిమాను తన థియేటర్లో ఆడించేందుకు రూ.12 లక్షలకు కొనుగోలు చేస్తే రూ.10 లక్షలు వచ్చింది. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు రూ. 15లక్షలు పెడితే డిజాస్టర్ అయిన ఆ సినిమాకు కేవలం రూ. 6 లక్షల కలెక్షన్లే వచ్చాయి. అంటే రూ.9లక్షలు పోయాయి. ఇక కాటమరాయుడు సినిమాను రూ.15 లక్షలకు కొనుగోలు చేస్తే.. అట్టర్ ఫ్లాప్ అయిన ఆ సినిమాకు రూ.5 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే ఏకంగా పది లక్షలు పోయాయన్నమాట. ఇదంతా ఒక థియేటర్ కలెక్షన్ మాత్రమే. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద ఆ మూడు సినిమాల వల్ల ఎన్ని రూ.కోట్లు పోయాయో అర్థం చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లకు సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా నష్టాలను భర్తీ చేసే క్రమంలో కాటమరాయుడు సినిమా హక్కులు ఇస్తే అది మరింతగా నష్టాల ఊబిలోకి నెట్టింది. జిల్లాలో సర్దార్ గబ్బర్‌సింగ్, కామటరాయుడు సినిమాలను కొనుగోలు చేసిన సంస్థ ఏకంగా రూ. 7కోట్ల నుంచి రూ.8 కోట్ల నష్టాల్లో మునిగినట్టు తెలిసింది. ఇక ఆ తర్వాత సదరు సినీపంపిణీ సంస్థ ఇప్పటివరకు మరే సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయలేని పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. అజ్ఞాతవాసితో దండుకోవాలని.. యాధృచ్ఛికమో.. ఇతరత్రా కారణాలేవైనా కావొచ్చు గానీ.. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఈ నాలుగేళ్లలో రిలీజ్ అయిన పవన్ సినిమాలన్నీ వరుసగా దెబ్బతిన్నా అజ్ఞాతవాసికి హైప్ ఏర్పడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేదిల ట్రాక్ రికార్డు నేపథ్యంలో బయ్యర్లు అజ్ఞాతవాసిపై ఎగబడ్డారు. ఇదే అదనుగా ఇంచుమించు బాహుబలి–2 రేట్లకు సినిమాను విక్రయించారు. వాస్తవానికి జిల్లాలో బాహుబలి–1 రూ. 7కోట్లకు కొనుగోలు చేయగా రూ. 10 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి–2 సినిమా రూ. 14 కోట్లకు కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 18 కోట్ల వరకు వసూలు చేసిందని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో ఇదే రికార్డు. ఇప్పుడు పవన్ అజ్ఞాతవాసి సినిమాను ఏవీ సినిమాస్ అనే సంస్థ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసింది. అంటే ఆ వసూళ్లు రావాలంటే సినిమా బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాలి. ఇక్కడే పవన్‌కల్యాణ్ సినిమా నిర్మాతలు అడ్డగోలు వసూళ్లకు తెరలేపారన్న వాదనలు బలంగా ఉన్నాయి. అప్పుడు బాహుబలుడు.. ఇప్పుడు అజ్ఞాతవాసీ .. అల్లుడు గారే అజ్ఞాతవాసి సినిమా విశాఖ జిల్లా హక్కులను రూ.11.50కోట్లకు ఏవీ సినిమాస్ కొనుగోలు చేసింది. వాస్తవానికి ఆ సంస్థలో ప్రధాన వాటా మంత్రి గంటా శ్రీనివాసరావు అల్లుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు(అంజిబాబు) కుమారుడు ప్రశాంత్‌దేనని తెలుస్తోంది. జిల్లాలో బాహుబలి–2 కూడా ఇదే సంస్థ పంపిణీ చేసింది. రోజంతా సినిమానే.. ఇంతముందెన్నడూ ఏడు షోలకు అనుమతించిన పరిస్థితి లేదు. బాహుబలి సినిమాకు ఐదు షోలకు అనుమతిస్తేనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు రాత్రీపగలు తేడా లేకుండా థియేటర్లలో అదే పనిగా సినిమా ఆడించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలివ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ లెక్కన థియేటర్లను క్లీన్ చేయడానికి కూడా సమయం ఉండదేమోనన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టికెట్ల ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వారంరోజుల పాటు ఒక్క ఐనాక్స్ (బాల్కనీ రూ.175) మినహా ఏ థియేటర్లోనైనా బాల్కనీ టికెట్ రేటు రూ.200కు పెంచేయడం దోపిడీ కాక మరేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో బాహుబలి విడుదల సమస్యలోనూ టికెట్ రేట్ లు పెంచటం విమర్శలకు తావిచ్చింది. అలాగే నగరంలోని ప్రతి థియేటర్ వద్ద రాత్రి వేళల్లో బందోబస్తుకు ఓ ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లను నియమించనున్నామని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. -
ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 22 నుంచి 26 వరకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఎంసెట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. ఎంసెట్‌తో సహా 8 సెట్ల షెడ్యూళ్లను తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. అన్ని సెట్లనూ ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు. ముందుగా ఎడ్‌సెట్, లాసెట్‌ను ఏప్రిల్ 19న నిర్వహిస్తామని, మే 4న జరిగే పీఈసెట్‌తో సెట్స్ ముగుస్తాయని తెలిపారు. ఎంసెట్ కోసం 115 నుంచి 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
డీఎస్సీ బాధ్యత ఏపీపీఎస్సీకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ–2018 నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కు అప్పగించారు. పరీక్ష నిర్వహణ, పోస్టుల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో ఈ నెల 15న విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. డీఎస్సీపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహణపై చర్చించారు. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీపీఎస్పీ ఛైర్మన్ చెప్పారు. అయితే, ఈ నెల 15న ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినందున దరఖాస్తుల స్వీకరణ, అనంతరం పరీక్ష నిర్వహణకు సమయం తక్కువగా ఉంటుందని అధికారులు మంత్రికి వివరించారు. జాతీయస్థాయిలో జరిగే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణీత గడువును ఇస్తూ డీఎస్సీ పరీక్ష తేదీలను నిర్ణయిస్తామన్నారు. కొత్త ఏడాదిలో కొత్త నోటిఫికేషన్లు పరీక్షను ఆన్లైన్లో (కంప్యూటర్ ఆధారితంగా) నిర్వహించాలా? లేక ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలా? అనేదానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించితే పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించాల్సి ఉంటుందని, రోజుకు 50 వేల మంది వరకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ పేర్కొన్నారు. ఇక పోస్టులపై సాధ్యమైనంత త్వరగా జిల్లాల నుంచి సమాచారాన్ని తెప్పించి, ఏపీపీఎస్సీకి అందించాలని మంత్రి గంటా ఆదేశించారు. ఆర్థిక శాఖ అనుమతి రావాల్సిన పోస్టులపైనా త్వరితంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఎంపికైన అభ్యర్థులకు 2018 జూన్ 12 నాటికి ఉత్తర్వులు అందించేలా చూడాలని పేర్కొన్నారు. ఖాళీలు, రోస్టర్, సిలబస్, అర్హతలు, ఇతర అంశాలపైనా చర్చించారు. అవసరమైతే విద్యాశాఖ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌కు మంత్రి గంటా సూచించారు. సమావేశం అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే కొత్త ఏడాదిలో పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. కోర్టు కేసుల వల్ల పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందన్నారు. ఏపీపీఎస్సీ కార్యకలాపాలను త్వరలో విజయవాడ నుంచే కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పండాదాస్ పాల్గొన్నారు. విద్యాశాఖ ద్వారానే డీఎస్సీ: యూటీఎఫ్ టీచర్ పోస్టుల భర్తీని విద్యాశాఖ ద్వారానే చేపట్టాలని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పి.బాబురెడ్డి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించామన్నారు. 5,735 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,531 పీఈటీ పోస్టులు, 248 పండిట్ పోస్టులు అవసరమని గతేడాది రేషనలైజేషన్‌లో లెక్కల్లో తేల్చారని, వాటిని కూడా ఇప్పుడు డీఎస్సీలో కలిపి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
నేడు ‘టెట్’ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామకాల అర్హత పరీక్ష అయిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. టెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. పరీక్షలను జనవరి 17 నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేస్తామని మంత్రి గంటా వివరించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష అనంతరం ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీని) చేపడతామని వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి అప్పగిస్తామని వివరించారు. టెట్‌కు హాజరయ్యేందుకు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని, అనంతరం సంబంధిత దరఖాస్తులను ఆన్లైన్లో ‘హెచ్‌టీటీపీ://సీఎస్ఈ.ఏపీ.జీ ఓవీ.ఐఎన్’ద్వారా సమర్పించాలన్నారు. టెట్ షెడ్యూల్, ఇతర సమాచారాన్ని కూడా ఇదే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. -
అస్మదీయులకే కొలువులన్నీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించే నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఔట్ ‘రేటు’పోస్టుల మాదిరిగా మార్చేస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో తమకు సంబంధించిన ఏజె న్సీకి అప్పగించి దాని ద్వారా తమ పార్టీకి అనుకూలురనే ‘ఎంపిక’ చేసుకోవాలని తల పోస్తోంది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయవద్దని, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయిలో ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకుం టామని విద్యాశాఖలో ఇప్పటికే మౌఖిక ఆదే శాలు జారీ అయ్యాయి. ఇతర శాఖల్లోనూ ఇదే రీతిలో చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నా హాలు చేపడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 1.42 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఒక్కటీ భర్తీ చేయక పోగా ఉన్నవాటికే ఉద్వాసన పలికేందుకు సిద్ధం కావటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పోస్టుకు రూ. 2 లక్షలు చెల్లించేలా ఏజన్సీతో బేరం! ఔట్సోర్సింగ్ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకూ జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసి వాటి ద్వారా ఉద్యోగులను తీసు కుంటున్నాయి. ఇప్పుడు వీటిని రద్దుచేసి రాష్ట్ర స్థాయిలో తమకు సంబంధించిన ఏజెన్సీకి ఎంపిక కాంట్రాక్టు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. పీఆర్సీతో ఔట్సోర్సింగ్ వేత నాలు కొంతమేర పెరగడం, భారీగా పోటీ పడుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచు కుని రాష్ట్ర స్థాయిలోఎంపికైన ఏజన్సీ ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలకు పైగా పెద్దలకు చెల్లిం చేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలి సింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఇది అశనిపాతంగా మారనుంది. 12 వేల మందిపై పిడుగు! విద్యాశాఖలో 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా బోధనేతర పోస్టులు కూడా వేలల్లోనే ఖాళీలున్నాయి. సర్వశిక్ష అభియాన్, డీఈఓ ఎంఈవో కార్యాలయాలతో పాటు అనేక విభాగాల్లో వేలాది మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 664 మండల విద్యాధికారి కార్యాలయాల్లో 5,312 వరకు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో 7,392 మంది, జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో 260 మంది, ఎస్ఎస్ఏ పీవో కార్యాలయాల్లో 260 మంది, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు 4,000 వేల మంది వరకు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మొత్తం 17,224 పోస్టుల్లో దాదాపు 12 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు న్నారు. మిగతావి ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులు భర్తీచేయవద్దని మంత్రి గంటా సూచనల మేరకు అధికారులు ఆయా విభాగాలకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్రస్థాయిలో ఒకే ఏజెన్సీకి కట్టబెట్టాలని నిర్ణయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పనిచేస్తున్న వారి సర్వీసులు డిసెంబర్‌తో ముగియనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీరిని పొడిగించే అవకాశాలు లేకుండా పోయాయి. ఏజన్సీల చుట్టూ నిరుద్యోగుల ప్రదక్షిణ ఔట్సోర్సింగ్ నియామకాలకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు ఆర్థిక శాఖ గతంలో 4271 జీవో ద్వారా విధివిధానాలు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరక్టర్, జిల్లా లేబర్ ఆఫీసర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి సభ్యులుగా ఉన్న కమిటీ ఏజెన్సీలను గుర్తిస్తుంది. ఆయా సంస్థలు ఈపీఎఫ్, ఈఎస్ఐతో సహా కార్మిక చట్టాల ప్రకారం ఇతర అన్ని అంశాలను పాటిస్తున్నా యో లేదో పరిశీలించి ఎంపిక చేస్తాయి. ఉద్యోగులను ఎంపిక చేసే సంస్థలకు కొంత కమీషన్‌ను చెల్లిస్తుంది. ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసును ఏడాది మాత్రమే కొనసా గిస్తారు. రెన్యువల్ చేస్తేనే వారికి పోస్టు ఉంటుంది. ఆయా సంస్థలు కూడా ఉద్యోగుల వేతనం నుంచి కొంత మినహాయించుకుం టున్నాయి. శాశ్వత ఉద్యోగాల భర్తీ లేకపోవటంతో నిరుద్యోగులు ఔట్సోర్సింగ్ ఏజన్సీల చుట్టూ క్యూ కడుతున్నారు. -
విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి గంట ఏమన్నారో చూడండి!
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా విద్యాకుసుమాలు రాలిపోతుండటం.. ఒత్తిడి తాళలేక పెద్దసంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం రాష్ట్రంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. విద్యా వికాసాన్ని పంచాల్సిన చదువులే.. యమపాశలై.. కార్పొరేట్ కళాశాలల ఒత్తిళ్లకు విద్యార్థులు బలి అవుతుండటం రాష్ట్రంలో తీరని విషాదాన్ని నింపింది. ఇటీవలికాలంలో నారాయణ కాలేజీలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం.. వారి తల్లిదండ్రుల గుండెల్లో తీరనిశోకాన్ని నింపింది. అయితే, ఇంతటి తీవ్రమైన ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తేలికగా స్పందించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రే.. కాలేజీల్లో ఆత్మహత్యలు ఓవర్‌నైట్‌లో ముగిసిపోవు అంటూ తేల్చేశారు. విద్యార్థులు చనిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని, విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు కమిటీ వేశామని ఆయన చెప్పుకొచ్చారు. నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా కాలేజీలను మూసివేస్తామని మంత్రి గంట అన్నారు. -
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. బుధవారం విజయవాడలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. జనవరి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుంది. అదే నెల 29న అదే సమయంలో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ఉంటాయి. జనరల్‌తోపాటు వొకేషనల్ విద్యార్థులకు ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయి. కాగా తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1న మొదలవుతాయి. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మార్కుల స్థానంలో గ్రేడింగులు ఇస్తామన్నారు. మొత్తం ఏడు గ్రేడ్లు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలకు 10,48,688 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4,96,660 మంది, సెకండియర్ విద్యార్థులు 4,82,235 మంది ఉన్నారని తెలిపారు. ఇంటర్ థియరీ పరీక్షలకు 1600 కేంద్రాలు, ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 1077 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. కాగా నిర్దిష్ట సమయానికి మించి స్టడీ అవర్లు నిర్వహిస్తున్న 205 కళాశాలలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలల్లో సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్‌కు 41 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. 811 అనుమతులు లేని హాస్టళ్లు, కళాశాలలు నడుస్తున్నాయని, ఇవి అనుమతులు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు. -
ప్రత్యూష కంపెనీకి చుక్కెదురు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నడిబొడ్డున ఉన్న రూ.కోట్లాది విలువైన జిల్లా గ్రంథాలయ సంస్థ భూమి కొట్టేయాలనుకున్న ప్రత్యూష కంపెనీకి చుక్కెదురైంది. ఆ కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకోవడంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కంపెనీకి పరిహారం చెల్లించనవసరం లేదని, కావాలని కాలయాపన చేసిన కంపెనీయే గ్రంథాలయ సంస్థకు రూ. 85,86,774 నష్టపరిహారం చెల్లించాలంది. ఒప్పంద సమయంలో ప్రత్యూష కంపెనీ ఇచ్చిన రూ.1.25 కోట్ల బ్యాంకు గ్యారంటీని కూడా ఇవ్వనసరం లేదని, ఆ సొమ్మును గ్రంథాలయ సంస్థ ఖాతాకు జమ చేయాలని సూచించింది. ప్రస్తుతం స్థలాన్ని సీఆర్పీఎఫ్ వద్ద నుంచి వెంటనే స్వాధీనం చేసుకుని గ్రంథాలయ సంస్థకు అప్పగించాలని కమిటీ తెలిపింది. విశాఖలో అత్యంత ఖరీదైన మహారాణిపేటలో జిల్లా గ్రంథాలయ సంస్థకు ఎకరాకు పైగా స్థలం ఉంది. ఈ స్థలాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు డైరెక్టర్‌గా వ్యవహరించిన సమయంలో ప్రత్యూష కంపెనీ 2010 ఫిబ్రవరి 15న 33 ఏళ్ల లీజుకు తీసుకుంది. ఒప్పందం ప్రకారం ఇందులో 24 నెలల్లో బహుళ అంతస్తుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా అది పూర్తి చేయలేదు. గడువులోగా నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టకపోవడంతో పౌర గ్రంథాల యసేవా సమితి ఉద్యమం చేపట్టింది. -
ఆ కాలేజీలు మూసేస్తాం: మంత్రి
సాక్షి, విశాఖ సిటీ: శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల్లో తాను ఇటీవల తనిఖీలు నిర్వహించానని, అక్కడ పిల్లలు పడుతున్న ఇబ్బందులు చాలా భయంకరంగా ఉన్నాయని మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలల్లో ఉదయం 4.30 గంటలకు మొదలు అర్ధరాత్రి 11.00 గంటల వరకూ విద్యార్థులు ఉండటం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. స్టడీ అవర్స్‌ను నాలుగు గంటలు తగ్గించడంతోపాటు ఆదివారం ఒంటిపూట మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇంటర్ బోర్డు నిబంధనలను ప్రతి కళాశాలలో తప్పనిసరిగా పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెప్పారు. సరైన సౌకర్యాలు లేని హాస్టళ్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని, నెల రోజుల్లో విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకపోతే వాటిని మూసివేస్తామని మంత్రి గంటా హెచ్చరించారు. -
విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దు: చంద్రబాబు
సాక్షి, అమరావతి: విద్యార్థులపై ఒత్తిడి ఎక్కు వవుతోందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వారిపై ఒత్తిడి పెంచొద్దని విద్యార్థుల తల్లితండ్రులకు సూచించారు. ఒత్తిడిని తట్టు కోలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రని, ఇది బాధాకరమని అన్నారు. ఒత్తిడి లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో వారు చదివేలా చూడాలన్నారు. ఆత్మహత్యలు ఇకపై జరగకూడదన్నారు. అబ్దుల్‌కలాం జయంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభలో సీఎం మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాల్సి ఉందని, డబ్బుతోగాక ప్రతిభతో విద్యార్థులు చదివే పరిస్థితి రావాలని అన్నారు. రాబోయేకాలంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పూర్తిగా చదివించే బాధ్యతను తామే తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతమిస్తున్న 6,500 ప్రతిభా పురస్కారాలకుతోడు మరో వెయ్యి పెంచుతామని, ఇందుకోసం మరో రూ.30 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. పదో తరగతిలో మెరిట్ స్కాలర్షిప్ వచ్చినవారిని ఇంటర్, ఇంటర్లో మెరిట్ స్కాలర్షిప్ వస్తే వాళ్లు తర్వాత ఏ కోర్సులో చేరాలన్నా సహకరిస్తామని, బిట్స్ పిలానీ, ఐఐటీ, ఐఐఎం.. ఎక్కడైనా చదివించడానికి సిద్ధమేనన్నారు. డిగ్రీ నుంచి పీజీకి వెళ్లినా, విదేశాల్లో అయినా చదివిస్తామన్నారు. పిల్లలకివ్వాల్సింది ఆస్తులు కాదు.. చదువూ సంస్కారం పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, చదువూ సంస్కారమని సీఎం అన్నారు. ప్రతిభా పురస్కారాల్లో బాలికలు ఎక్కువమంది ఉండడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో అమ్మాయిల్ని ఎదురుకట్నమిచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఐటీకి ప్రాధాన్యమివ్వడం వల్ల లక్షలాదిమందికి లబ్ధి చేకూరిందన్నారు. ప్రపంచంలోని ఐటీ ఇంజనీర్లలో 25% తెలుగువాళ్లున్నారని, ఇందుకు తానేసిన బీజమే కారణమన్నారు. త్వరలో అన్ని వర్సిటీల్లో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతిభా పురస్కారానికి ఎంపికైన 6,500 మందికి రూ.20 వేల నగదు, ప్రశంసాపత్రం, మెడల్, ల్యాప్‌టాప్‌తోపాటు, లక్షలాదిమందికి స్ఫూర్తినిచ్చిన ‘సీక్రెట్’ బుక్ ఇస్తున్నామని తెలిపారు. సభలో 56 మంది విద్యార్థులకు సీఎం అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి గంటా శ్రీనివాస్ రావును బర్త్ రఫ్ చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్ధుల ఆత్మహత్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఈ నెల 16న కార్పోరెట్ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రటనను విడుదల చేసింది. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలోని కార్పోరేట్ విద్యాసంస్థల్లో అనేక మంది విద్యార్ధినీ, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు మండిపడ్డారు. గడిచిన రెండేళ్లలో కేవలం శ్రీచైతన్య, నారయణ వంటి కార్పొరేట్ కాలేజీల్లోనే అధికారిక లెక్కల ప్రకారం 38 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం తూతూ మంత్రంగా హడావుడి చేయటం తప్ప నివారణ చర్యలు చేపట్టలేదని ఆయన ధ్వజమెత్తారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ విద్యాసంస్థలైనందుకు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన వియ్యకుండైనందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న సంఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మంత్రి గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనుమతి లేని 158 కాలేజీ హాస్టల్లను గుర్తించమన్నారని, అనుమతి లేకుండా కాలేజీలు నడుస్తుంటే, ఇంటర్మీడియట్ బోర్డు, ప్రభుత్వం ఏం చేస్తుందని సలాంబాబు ప్రశ్నించారు. వెంటనే మంత్రి గంటాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చక్రపాణి కమిటీ సూచనలను సత్వరమే అమలు చేసి, మరిన్ని విద్యా కుసుమాలు నేలరాలకుండా కాపాడాలని కోరారు. -
మంత్రిగారి రాజ్యం.. బంధువులకే పట్టం
మంత్రి గారి కుమారుడంట.. వేయండి ఓ పూలహారం.. ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం వీరితో చేయించండి.. మంత్రిగారు మెచ్చుకుంటారు..ఈయన మంత్రి గారి స్నేహితుడు.. ఈయనకీ ఓ దండ వేసేయండి మరి.. అలాగే ఆ భూమిపూజలవీ చేయించండి.. ఆయన మంత్రి గారి మేనల్లుడు.. అవునా.. అక్క డ ప్రారంభోత్సవం ఉందన్నారుగా.. ఈయనతో చేయించండి..మంత్రిగారు గుర్తు పెట్టుకుంటారు..ఇదీ భీమిలి నియోజకవర్గంలో మూడేళ్లుగా జరుగుతున్న తంతు.. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మంత్రిగారి బంధుగణం చేతులమీదే ప్రారంభం అవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించి బంధువులు అంతా తామై ప్రారంభోత్సవాలు చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సీనియర్ నాయకులు. తగరపువలస(భీమిలి) : మొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ మధురవాడలో, నిన్న మంత్రి స్నేహితుడు పరుచూరి భాస్కరరావు భీమిలిలో, నేడు మంత్రి మేనల్లుడు విజయసాయి తగరపువలసలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ఏ అధికారంతో వీరు ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారో భీమిలికి చెందిన టీడీపీ నాయకులకే కాదు అధికారులకు కూడా అంతుచిక్కడంలేదు. భీమిలిలోని అభివృద్ధి కార్యక్రమాలన్నీ మంత్రి గారి బంధువుల చేతుల మీదుగానే ప్రారంభమవుతున్నాయి. మాజీ మంత్రి, వివిధ హోదాలలో పార్టీ పదవులు చేపట్టిన సీనియర్ నాయకులను కాదని, అయిన వారి చేత కార్యక్రమాలు చేయించడాన్ని అటు అధికారులు, ఇటు టీడీపీ తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అడ్డు చెప్పి మంత్రిగారి ఆగ్రహానికి గురయ్యే బదులు జీ హుజూర్ అంటూ వంతపాడితే పోయేదేమీ లేదని ఒకవర్గం సర్దుకుపోతున్నారు. దిగువశ్రేణి నాయకులు మాత్రం అంగీకరించలేకపోతున్నారు. సీనియర్లకు గుర్తింపేదీ? 2004 నుంచి భీమిలిలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడంతో దాదాపు ఇక్కడ అన్నిపార్టీల నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. కనీసం అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తీరిక లేకపోతే సీనియర్ నాయకులు, కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి గాని ప్రజాప్రతినిధుల బంధువులకు ఎలా అప్పగిస్తారంటూ తెలుగు తమ్ముళ్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భీమిలి భూవివాదాలపై సిట్ దర్యాప్తు ప్రారంభమైన తరువాత టీడీపీ భీమిలి కన్వీనర్‌గా ఉన్న పరుచూరి భాస్కరరావు తన మకాం బెంగుళూరుకు మార్చేశారు. ఇటీవల ప్రారంభమైన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ద్వారా ప్రత్యక్షమైన విజయ్ మంత్రి గంటా మేనల్లుడని ప్రచారం జరిగింది. కానీ అభివృద్ధి పనులలో ఆయన ప్రత్యక్షంగా చేయిపెడితే సహించలేకపోతున్నామని భీమిలికే చెందిన టీడీపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసిన నాయకులు ఇంకా బతికే ఉన్నారని మంత్రి గ్రహించాలని కోరుతున్నారు. -
కోడ్ ఉల్లంఘించి టీచర్లతో మంత్రి గంటా భేటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల వేళ ఎన్జీవో, ఉపాధ్యాయ సంఘం నేతలు కాకినాడలో హడావుడి పర్యటనచేశారు. ఏపీ జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు ఓ వైపు, పీఆర్టీయూ నేత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మరోవైపు చాటుమాటు రాజకీయాలు నడిపారు. శనివారం రాత్రి అశోక్‌బాబు తన అనుయాయులను కలిసి ప్రభుత్వానికి మద్దతుగా సంప్రదింపులు చేయగా, ఆదివారం పీఆర్టీయూ నేతలతో గాదె సమావేశమై స్వామిభక్తిని చాటుకున్నారు. కాకపోతే, ఎన్నికల వేళ ఉపాధ్యాయులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం కావడం కాస్తా వివాదాస్పదంగా మారింది. ఏం జరిగిందంటే..: కాకినాడలో శనివారం రాత్రి ఎన్జీవో సంఘం సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు హాజరయ్యారు. ఎన్నికల వేళ అశోక్‌బాబు టీడీపీకి మద్దతు కూడగట్టేలా పరోక్షంగా పావులు కదిపారన్న అభిప్రాయం వ్యక్తమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసిన పేరు అశోక్‌బాబుకు వెళ్లిపోతుందని పీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయులతో నరసన్ననగర్లోని తిరుమల ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి, దానికి మంత్రి గంటాను ఆహ్వానించారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. దీంట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉపాధ్యాయులతో మంత్రి గంటా , ఎంపీ పండుల రవీంద్రబాబు సమావేశం కావడం వివాదాస్పదమైంది. ఎన్నికల్లో సహకరించాలని పిలుపు: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, పది రోజుల్లో పరిష్కారమవుతాయని, కార్పొరేషన్ ఎన్నికల్లో సహకరించాలని మంత్రి గంటా సమావేశంలో విజ్ఞప్తిచేశారు. ప్రైవేటు సంస్థలు, ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఒక సందర్భంలో హుకుం కూడా జారీచేశారు. ఈ విషయం బయటకు రావడంతో మిగతా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉపాధ్యాయ సంఘాలతో ఇలా సమావేశాలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశమైంది. -
మంత్రి గంటాకు నాన్‌బెయిలబుల్ వారెంట్
-
మంత్రి గంటాకు నాన్‌బెయిలబుల్ వారెంట్
ఆదేశాలు జారీచేసిన అనకాపల్లి కోర్టు అనకాపల్లి: రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనకాపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి.వి.వి.సత్యనారాయణమూర్తి నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. 2009 ఎన్నికల్లో గంటా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం మంత్రి గంటా బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు రాకపోవడంతో మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. -
డ్రగ్స్ నియంత్రణకు టాస్క్‌ఫోర్స్
విశాఖ నుంచి భారీ ఎత్తున గంజాయి రవాణా: మంత్రి గంటా సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు పోలీస్, డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్ అధికారులతో ప్రభుత్వం టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనుందని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీంతో పాటు హెల్ప్‌లైన్, టోల్‌ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆదివారం వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఎక్సైజ్ , డ్రగ్ నియంత్రణ అధికారులు, మానసిక ఆస్పత్రి వైద్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విశాఖ సర్క్యూట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. పాఠశాల స్థాయిలో 8, 9 తరగతుల నుంచే పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నందున ఆదిలోనే అరికట్టే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గంజాయి సరఫరాలో పెద్దల హస్తం: విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని, ఇందులో కొంతమంది పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి గంటా చెప్పారు. గతంలో గంజాయి కిలోల్లో రవాణా అయ్యేదని, ఇప్పుడు టన్నుల్లో జరుగుతోందని తెలిపారు. -
కొలిక్కివచ్చిన బదిలీల తంతు
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించి ఏర్పడిన గందరగోళం కొలిక్కివచ్చింది. ప్రభుత్వం పలుమార్లు ఇచ్చిన జీఓలు, వాటి అమలు షెడ్యూళ్లను ఉపాధ్యాయవర్గాలు వ్యతిరేకించడంతో వాటిని రద్దుచేస్తూ వచ్చింది. తాజాగా జరిగిన చర్చలు ఫలించడంతో హేతుబద్ధీకరణ, బదిలీల కోసం తాజా గా 42, 43 జీఓలు, అమలు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యాశాఖాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఇటీవల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు జరిపిన చర్చల ప్రకారం పలు అంశాలకు మినహాయింపు ఇచ్చారు. మెజార్టీ ఉపాధ్యాయుల కోరిక మేరకు సాధారణ విధానంలోనే బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బదిలీ షెడ్యూల్ ఇలా....: బదిలీలకు సంబంధించి పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి సోమవారం విడుదల చేసిన షెడ్యూల్ ఇలా ఉంది. జీఓ 42 ప్రకారం ఉపాధ్యాయులు, పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను ఈ నెల 8వ తేదీలోగా పూర్తి చేయాలి. సవరించిన అంశాల జీఓ 43 ప్రకారం ఉపాధ్యాయులకు లభించే ఎంటైటిల్మెంట్ పాయింట్లను ఈ నెల 6 లోగా పునర్నిర్మాణం చేయాలి. ఎంటైటిల్మెంట్ పాయింట్ల ధ్రువపత్రాలను సంబంధిత అధికారులు ఈ నెల 7 నుంచి 10 మధ్యలో ధ్రువీకరించాలి. అలాగే వీటిని జిల్లా స్థాయిలో 11,12 తేదీల్లో ధ్రువీకరించాలి. 13, 14వ తేదీలలో సీనియార్టీ జాబితా విడుదల చేసి 14నుంచి 16 లోగా అభ్యంతరాలు స్వీకరించాలి. సీనియార్టీ తుది జాబితాను ఈ నెల 17న విడుదల చేస్తారు. జిల్లాలోని వివిధ కేటగిరీ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ఈ నెల 14న గాని తర్వాత గాని ప్రకటించాల్సి ఉంది. మాన్యువల్ విధానంలోనే జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో తొలుత ఈ నెల 18న ప్రధానోపాధ్యాయులకు.. 19, 20వ తేదీలలో స్కూల్ అసిస్టెంట్లు(లాంగ్వేజెస్) ..21, 22 తేదీలలో స్కూల్ అసిస్టెంట్లు (నాన్ లాంగ్వేజెస్)..22 నుంచి 26 వరకు పీఈటీలు, ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ఉంటుంది. పోస్టుల కేటాయింపులకు ప్రమాణాలు తాజా జీఓల హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది, ఉన్నత పాఠశాలలో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున అదనపు పోస్టును కేటాయిస్తారు. దీని ప్రభావం వల్ల జిల్లాలో అన్ని కేటగిరీలు కలుపుకొని 75 మంది టీచర్ల మిగులు పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా 10 ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడే అవకాశాలున్నాయి. ప్రాథమిక పాఠశాలల విలీనం విషయంలో గతంలో జారీచేసిన మార్గదర్శకాల్లో ఏవిధమైన మార్పులు లేకపోవడంతో జిల్లాలో ఏ ఒక్క పాఠశాలా మూతపడదు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ప్రవేశాలతో కలిసి నమోదు 80 మంది అంతకంటే ఎక్కువ ఉండే ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలు పరిగణించి ఎస్జీటీ పోస్టులను మంజూరు చేస్తారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు హిందీ పండిట్ పోస్టు తప్పనిసరి చేశారు. ప్రతిభా పాయింట్ల తగ్గింపుపై ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖపై ఒత్తిడి తీసుకురావడంతో స్పందించిన అధికారులు వాటిని 30 శాతానికి తగ్గించారు. -
బదిలీలుంటాయా?
ఉపాధ్యాయ బదిలీలపై తొలగని సందిగ్ధం.. వెబ్ కౌన్సెలింగ్ ఉండదని మంత్రి గంటా ప్రకటన - వెబ్ కౌన్సెలింగ్‌పై అభిప్రాయాలు సేకరిస్తున్న అధికారులు - ఇప్పటికే 6 జీవోలు, పది సర్క్యులర్లు జారీ చేసినా వీడని చిక్కుముడులు - బదిలీలు ఉంటాయో లేదో తేలక టీచర్ల అయోమయం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై సందిగ్ధత తొలగడం లేదు. టీచర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం, పలుమార్లు నిబంధనల మార్పుతో ఈ వ్యవహారం రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఆరు జీవోలు, పది సర్క్యులర్లు జారీచేసినా బదిలీలపై ఇప్పటికీ ఒక స్పష్టత రావడం లేదు. బదిలీలుంటాయా? ఉండవా? వెబ్కౌన్సెలింగా? మాన్యువల్గానా? అనేదానిపై స్పష్టత లేక లక్షలాది మంది ఉపాధ్యాయులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై పక్షం రోజులు దాటినా ఇప్పటికీ బోధన జరగడం లేదు. నెరవేరని మంత్రి హామీ : బదిలీలపై ఇటీవల టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. ఉపాధ్యాయ సంఘాలు ‘చలో అమరావతి’కి పిలుపునిచ్చాయి. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం సంఘాలతో చర్చించింది. పనితీరు పాయింట్లను 30 శాతానికి తగ్గిస్తామని, మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే, మంత్రి ప్రకటనకు విరుద్ధంగా అధికారులు వెబ్ కౌన్సెలింగ్‌పై టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించడం వివాదాస్పదంగా మారుతోంది. అధికారులు టీచర్లకు నేరుగా ఫోన్లు చేస్తూ వెబ్‌కౌన్సెలింగ్‌పై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తక్షణమే బదిలీలు చేపట్టాల్సిందే: ఉపాధ్యాయల ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలోని ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ తదితర పోస్టులను భర్తీ చేసి, ఆ తర్వాత బదిలీలను చేపట్టాలన్న ప్రతిపాదనను మంత్రి గంటా శ్రీనివాసరావు తెరపైకి తెచ్చారు. అయితే, ఏకీకృత సర్వీసు నిబంధనలు, పదోన్నతులతో సంబంధం లేకుండా బదిలీలను తక్షణమే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు బదిలీలు చేయాలన్నా మళ్లీ కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది. గతంలో ప్రకటించిన బదిలీల షెడ్యూల్లో మూడుసార్లు మార్పు జరిగింది. పనితీరు పాయింట్ల మార్పుతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడా షెడ్యూల్‌ను కూడా మార్పు చేయాల్సి ఉంటుంది. గడియకో నిర్ణయం, రోజుకో మార్పు ► రేషనలైజేషన్‌పై ఈ ఏడాది మే 5న పాఠశాల విద్యాశాఖ జీవో నంబర్ 29ను విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్య 20 కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 30 మంది కంటే తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 50 మంది కంటే తక్కువ ఉన్న హైస్కూళ్లను మూసివేయాలని పేర్కొంది. దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో 10 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లను మరో స్కూల్లో విలీనం చేయాలంటూ నిబంధనలు మారుస్తూ జీవో నంబర్ 30ని జారీ చేసింది. ఆ రెండు జీవోల్లోనూ అస్పష్టత ఉండడంతో కొన్ని సర్క్యులర్లు ఇచ్చారు. ► బదిలీలపై ముందుగా జీవో నంబర్ 31ను విడుదల చేశారు. ఏ శాఖలోనూ లేని విధంగా మైనస్ పాయింట్లు, పనితీరు పాయింట్లు రెట్టింపు చేయడంపై టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో జీవో 32ను విడుదల చేశారు. ► జీవో 32లోనూ స్పష్టత కొరవడడంతో దాన్ని సవరిస్తూ జీవో 33ని విడుదల చేశారు. పనితీరు పాయింట్లపై టీచర్ల వ్యతిరేకతతో వాటిని 40 శాతానికి తగ్గిస్తూ జీవో 38ని విడుదల చేశారు. ఈ జీవోలన్నింటిపై మళ్లీ వివరణలు ఇస్తూ 10 సర్క్యులర్లు జారీ చేశారు. -
సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది
విశాఖ భూకుంభకోణంపై సీఎం సాక్షి, అమరావతి: సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది, ఆధారాలు ఉంటే తీసుకురండి... మరుసటి రోజే చర్యలు తీసుకుంటామని విశాఖ భూ కుంభకో ణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ కోరారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరి వద్ద ఏ ఆధారాలు ఉన్నా వాటిని వెంటనే ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 24 ప్రాజెక్టులను వచ్చే మార్చిలోపులో పూర్తిచేస్తామన్నారు. స్మార్ట్ వాటర్‌గ్రిడ్ తయారు చేయడం లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షం విమర్శలకు భయపడి ఉంటే గోదావరి నీళ్ళు కృష్ణాకు తెచ్చేవాళ్ళం కాదన్నారు. పులిచింతల ప్రాజెక్టును ఆగస్టులో జాతికి అంకితం చేస్తామని చెబుతూ మొత్తం 24 ప్రాజెక్టులను ఎప్పుడు ప్రారంభించేది వివరించారు. కైజాలా యాప్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల ఫొటోలు తీసి పంపిస్తే అటువంటి వారికి అవార్డులు ఇవ్వాని నిర్ణయించినట్లు తెలిపారు. -
టెన్త్‌లో 91.92 % పాస్
- తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్ - 100% ఫలితాలు సాధించిన పాఠశాలలు 4,102 - 10 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య 18,255 - మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి ఏయూక్యాంపస్(విశాఖ): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 91.92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 6,22,538 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 5,68,515 మంది ఉత్తీర్ణత సాధించారు. హాజరైన వారిలో 13,036 మంది ప్రైవేటు విద్యార్థులు కాగా 6,09,502 మంది రెగ్యులర్ విద్యార్థులు. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 2.6 శాతం తక్కువగా నమోదయింది. పరీక్షకు 3,14,471 మంది బాలురు హాజరవగా 2,88,909(91.87 శాతం)మంది, 2,95,031 మంది బాలికలు హాజరవగా 2,71,344(91.97 శాతం)మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన 13,036 మం ది ప్రైవేటు విద్యార్థుల్లో 8,262(63.38 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను శనివారం సాయంత్రం ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, పాఠశాల విద్యా డైరెక్టర్ భార్గవ్, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పీఎస్ అవధాని, విశాఖ డీఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్.. ఫలితాలలో తూర్పుగోదావరి జిల్లా 97.97 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు 80.55 శాతంతో అట్టడుగున నిలిచింది. గత మూడు సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా అట్టడు గున నిలుస్తోందని మంత్రి తెలిపారు. అత్యధిక, అత్యల్ప ఉత్తీర్ణత కలిగిన జిల్లాల మధ్య వ్యత్యాసం 17 శాతం వరకు ఉందన్నారు. అలాగే 11,143 పాఠశాలల్లో 4,102 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయని వివరించారు. గతేడాదితో పోల్చితే 115 పాఠశాలలు తగ్గాయన్నారు. ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహిస్తున్న రెండు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న ఏకైక విద్యార్థి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 97.26 శాతం ఉత్తీర్ణత, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 82.02, జెడ్పీ పాఠశాలల్లో 89.23, ప్రభుత్వ పాఠశాలల్లో 84.29, ఏపీ మోడల్ స్కూల్స్‌లో 94.32, మున్సిపల్ పాఠశాలల్లో 86.67, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 96.37, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 93.45 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జీపీఏ పెరిగింది.. ఫలితాలలో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం గణనీయంగా పెరిగింది. 18,255 మంది విద్యార్థులు పది జీపీఏ సాధించారని మంత్రి తెలిపారు. గతేడాది కేవలం 6,444 మంది విద్యార్థులు మాత్రమే పది జీపీఏ సాధించారని, ఇప్పుడది దాదాపుగా మూడు రెట్లు పెరిగిందన్నారు. జిల్లాల వారీగా జీపీఏలో తూర్పు గోదావరి 2,826 విద్యార్థులతో ప్రథమంలో నిలవగా, 525 మందితో విజయనగరం అట్టడుగున నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 17,209 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే పది జీపీఏ సాధించారని పేర్కొన్నారు. మిగిలిన 1,046 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులని, వీరి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. -
నేటి నుంచి ఆన్లైన్ ఎంసెట్
-
నేటి నుంచి ఆన్లైన్ ఎంసెట్
కాకినాడలో సెట్ కోడ్ విడుదల చేయనున్న గంటా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 2017–18 సంవత్సరానికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ ఎంసెట్–17 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం వరకూ ఇంజనీరింగ్, శుక్రవారం అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు జరుగుతాయి. ఈసారి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చొప్పున, అలాగే హైదరాబాద్‌లోని మౌలాలి, నాచారం, హయత్‌నగర్ ప్రాంతా ల్లోను కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ విభాగంలో ఎంసెట్ రాయాలనుకునేవారి కోసం కర్నూలులో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,98,068, అగ్రికల్చర్ విభాగంలో 80,725 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షకు వెళ్లే అభ్యర్థులు ఎంసెట్ హాల్‌టిక్కెట్‌తోపాటు ఎస్సీ, ఎస్టీలైతే కులధ్రువీకరణ పత్రం, పెన్ను, పెన్సిల్, రబ్బరుతోపాటు సంబంధిత ప్రిన్సిపాల్ ధ్రువీకరించిన దరఖాస్తు ఫారం తీసుకెళ్లాలని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. పేపర్ సెట్ కోడ్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు కాకినాడ జేఎన్టీయూలో సోమవారం ఉదయం విడుదల చేయనున్నారు. విద్యార్థులకు సందేహాలుంటే 0884–2340535 నంబర్లో సంప్రదించవచ్చని సాయిబాబు తెలిపారు. -
టాపర్లంతా..అమ్మాయిలే
♦ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో విద్యార్థినులదే పైచేయి ♦ ప్రథమ సంవత్సరంలో 69, ద్వితీయ సంవత్సరంలో ♦ 80 శాతం బాలికల ఉత్తీర్ణత సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడి యెట్ ఫలితాల్లో బాలికలు విజయ దుందుభి మోగించారు. ప్రథమ, ద్వి తీయ సంవత్సరాల్లో ఉత్తీర్ణత శాతం తోపాటు ర్యాంకులు, సబ్జెక్టుల్లో అత్యు త్తమ మార్కుల సాధనలోనూ అగ్రస్థా నంలో నిలిచారు. ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర మానవ వన రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయ వాడలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయ ణరెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనా«థ్‌దాస్, ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీ య సంవత్సరాల ఫలితాలతో పాటు వొకేషనల్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ ఏడాది మార్కు ల ఆధారంగా ఉత్తీర్ణత వివరాలను ప్రకటించినా, వచ్చే ఏడాది నుంచి గ్రేడ్ల వారీగా ఫలితాలను వెల్లడిస్తా మని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మార్కులను ప్రకటించడా న్ని నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ మంత్రి గంటా గ్రూపుల వారీగా వాటిని ప్రకటించడం గమనా ర్హం. టాప్ 10 ర్యాంకుల్లో మొదటి మూడు ర్యాంకులు, సదరు విద్యార్థుల పేర్లు, వారు సాధించిన మార్కులను వెల్లడించారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగింది. ప్రథమ సంవత్సరంలో 64 శాతం, ద్వితీయ సంవత్సరంలో 77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కడప జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది. మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో తాము ఆశించిన మేర మార్కులు సాధించలేదనుకున్న వారు, సబ్జెక్టు లు ఫెయిలైన వారు మే 15వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ చెప్పారు. ఈ పరీక్షలకు ఈ నెల 20వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫి కేషన్కు ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐఏఎస్ అవుతా... రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు పొందటం సంతోషంగా ఉంది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఇదే కష్టాన్ని, క్రమశిక్షణను కొనసాగిస్తాను. నిత్యం నన్ను ప్రోత్సహించిన వీరిశెట్టి జూనియర్ కళాశాల డైరెక్టర్ నాగప్రసాద్, ప్రిన్సిపల్ శివశంకర్, తల్లిదండ్రులు షేక్ అబ్దుల్ అజీజ్, పర్వీన్, తాత మస్తాన్‌లకు రుణపడి ఉంటాను. – షర్మిల, సీనియర్ ఎంపీసీ స్టేట్ ఫస్ట్ (992), ప్రకాశం జిల్లా పొదిలి నా ప్రాంత వాసులకు సేవ చేస్తా... నీట్లో మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్ట్ పూర్తిచేసి నా ప్రాంత వాసులకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. నాన్న ఆలపర్తి వెంకటేశ్వర్లు చిరుద్యోగి, అమ్మ సురేఖ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. నాకు వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులకు, వీజీఆర్ఎం కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. – ఆలపర్తి నైమిష, సీనియర్ బైపీసీ స్టేట్ ఫస్ట్ (991), బాపట్ల -
వారం తర్వాత గంటా మంత్రిగా ఉంటారా..!
మంత్రివర్గ విస్తరణపై శాసనమండలిలో సరదా చర్చ సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై శుక్రవారం శాసనమండలిలో సభ్యుల మధ్య కొద్దిసేపు అసక్తికర చర్చ జరిగింది. పాఠశాల విద్యపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో... వారం తర్వాత కూడా గంటా శ్రీనివాసరావు మానవ వనరుల (విద్య) శాఖ మంత్రి పదవిలో ఉంటారో లేదోనని పీడీఎఫ్ ఎమ్మెల్సీల పక్ష నాయకుడు బాలసుబ్రమణ్యం ప్రస్తావించినప్పుడు మంత్రి సహా సభలోని పలువురు సభ్యుల ముఖాలలో నవ్వులు విరిశాయి. సభలో చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి గంటా మాట్లాడుతూ.. పాఠశాల విద్యపై అందరి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఎమ్మెల్సీలతో వారం రోజుల్లో ఒక సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనను ఆ శాఖ నుంచి తప్పించి వేరొక శాఖ కేటాయించమని సీఎంను కోరినట్టు ఈ రోజే కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయంటూ వారం రోజుల తర్వాత ఆయన ఈ మంత్రిగా ఉంటారో లేదనని బాలసుబ్రమణ్యం అనుమానం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి నవ్వుతూ బదులిస్తూ.. ఈ శాఖ మంత్రిగా తానుంటే తానే సమావేశం నిర్వహిస్తాననని.. లేదు ఎవరుంటే వాళ్లు సమావేశం నిర్వహిస్తారన్నారు. ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ ప్రభుత్వ సూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆలోచన ఉన్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు శాసనమండలిలో చెప్పారు. పాఠశాల విద్యపై చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ అంశంపై ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిందన్నారు. టీచర్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు, ఈ రంగంపై అసక్తి ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్ధునుల అత్మరక్షణ అవసరమైన అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఫైలెట్ ప్రాజెక్టు ఒక జిల్లాలో తరగతులు నిర్వహించి, ఫలితాలను బట్టి తదుపరి రాష్ట్రమంతా అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం మౌలిక సౌకర్యాల కల్పనకు యాన్యూటీ పద్దతిన రూ.4 వేల కోట్లుతో నిధులు ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని ఉపాధ్యాయులకు జైలు శిక్షలా? పదవ తరగత పరీక్షల ఇన్విజిలేషన్ బాధ్యతల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించాలని.. ఏ తప్పు లేకపోయినా ఉపాధ్యాయులను అనవసరంగా బలిపశువులను చేస్తున్నారని ఎమ్మెల్సీ వై. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చేయని తప్పులకు ఉపాధ్యాయులను జైలులో పెడుతున్నారని తప్పుపట్టారు. సభలో ఆయన మాట్లాడడానికి మండలి చైర్మను మైక్ ఇవ్వకపోయినా శ్రీనివాసరెడ్డి గట్టిగా మాట్లాడుతూ, తన అభిప్రాయాన్ని సభ ముందుంచారు. అంతకు ముందుకు పలువురు సభ్యులు పాఠశాల విద్య అంశంపై మాట్లాడారు. -
సర్కారు సెల్ఫ్‌గోల్!
ప్రశ్నపత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్రప్రభుత్వం లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా? అప్పుడే కుంభకోణంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సీబీఐ విచారణ జరిపించే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? –ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సవాల్ పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తాం. స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు వెల్లడైతే సాక్షిపై చర్యలు తీసుకుంటా. –ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీబీఐ విచారణ ఎందుకు? ప్రశ్నాపత్రం లీక్ కాలేదు.. ఇది మాల్ ప్రాక్టీస్ మాత్రమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నాం. –మంత్రి గంటా శ్రీనివాసరావు సాక్షి, అమరావతి: పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రకరకాల వాదనలను ముందుకు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయింది. ఈ లీకేజీ వ్యవహారంలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు నారాయణ విద్యాసంస్థల అధినేత మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణలిద్దరి హస్తం ఉన్నట్లు స్పష్టం కావడంతో అధికారపక్షం ఇరకాటంలో పడి విలవిల్లాడింది. జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామంటూ దబాయిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ విసిరిన సవాల్‌కు జవాబు చెప్పలేక ఆత్మరక్షణలో పడిపోయారు. లీకేజీకి కారకుడైన వాటర్‌బాయ్ నారాయణ స్కూల్లో ఉద్యోగి కాదా అని జగన్ ప్రశ్నించడంతో అప్పటివరకు గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి సైలెంట్ అయిపోయారు. సహచర మంత్రిని రక్షించుకునేందుకు అసెంబ్లీ సాక్షిగా బాబు తాపత్రయపడడం స్పష్టంగా బయటపడింది. తగినంత సమయం మైక్ ఇవ్వకపోయినా రాష్ట్రప్రభుత్వ దివాలాకోరుతనాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షం సఫలమయ్యింది. కన్నంలో చిక్కిన దొంగలా పరిస్థితి మారడంతో ముఖ్యమంత్రి, మంత్రులు జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శించారు. జగన్ మాట్లాడుతుండగా పదేపదే మైక్ కట్ చేసి మంత్రులకు స్పీకర్ అవకాశమిచ్చారు. అయితే దక్కిన కొద్ది సమయంలోనే ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టడంలో ప్రతిపక్షనేత విజయంసాధించారు. అధికారపక్షం... పలాయనమంత్రం ప్రశ్నాపత్రాల లీకేజీలపై సభలో గురువారం కూడా అదే గందరగోళం.. అదే దొంగాట.. లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా అధికారపక్షం మరోసారి పలాయనమంత్రం పఠించింది. ఈ వ్యవహారంలో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, మంత్రులు సమస్యను తప్పుదోవ పట్టించడం కోసం జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై విచారణకు సహకరించాలని కోరుతూనే.. ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ చేసిందని అభాండాలు వేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ముందు స్పీకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలను వక్రీకరించిన ‘సాక్షి’ మీడియాపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనితతో ఆరోపణలు చేయించి.. చర్చను పక్కదోవ పట్టించి గట్టెక్కేయత్నం చేశారు. గురువారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షం పట్టుబట్టింది. అధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను స్తంభింపజేసింది. ఉదయం 9 గంటల నుంచి నాలుగుసార్లు వాయిదా వేసిన అనంతరం.. మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది. మాల్‌ప్రాక్టీస్‌గా చిత్రీకరించే యత్నం... మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమయ్యాక మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రకటన చేస్తారని చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నా మంత్రి జాడ కానరాలేదు. మంత్రి ఎక్కడున్నారంటూ ప్రతిపక్షం నినాదాలు చేయడంతో స్పీకర్ తన స్థానం నుంచి దిగి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. మంత్రి గంటాను సభలోకి రప్పించి ప్రకటన చేయించారు. లీకేజీపై మంత్రి చేసిన ప్రకటనలో ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో పాటు ఆరున్నర లక్షలమంది విద్యార్ధులకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని చాలా చిన్నదిగా.. మాల్‌ప్రాక్టీస్ గా చూపే ప్రయత్నం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని.. పోలీసు కేసు నమోదు చేయించామని చెప్పారు. గంటా ప్రకటన అనంతరం జగన్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ సర్కార్‌ను ఏకిపారేశారు. ఆధారాలు చూపిస్తూ.. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ.. జవాబులను విద్యార్థులకు చేరవేస్తూ.. ఆ స్కూళ్ల విద్యార్థులే ర్యాంకులు సాధించేలా చేస్తోన్న తీరును ఎండగట్టారు. నెల్లూరులో కేసు నమోదు చేయించడంలో జాప్యాన్ని.. అనంతపురం జిల్లా మడకశిరలో పేపర్ లీక్ చేసిన నారాయణ సంస్థల ఉద్యోగిని పోలీసులు వదిలేసిన తీరుపై సర్కార్‌ను నిలదీశారు. నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణ, మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇద్దరూ వియ్యంకులు కావడం వల్లే ఈ కుంభకోణం సాగుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు మంత్రులను బర్త్‌రఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత ఆధారాలను చూపుతూ ప్రశ్నాస్త్రాలను సంధించడంతో అధికారపక్షం ఆత్మరక్షణలో పడింది. జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా, నారాయణ, యనమల, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, టీడీపీ ఎమ్మెల్యే అనిత, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అడుగడుగునా అడ్డుతగిలారు. ఇరుకునపడ్డ ప్రభుత్వం... ప్రతిపక్ష నేత సాక్ష్యాధారాలు చూపుతూ లోటుపాట్లను ఎత్తిచూపడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేయడంతో బాబు ఎదురుదాడికి దిగారు. వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడమే కాక సాక్షి స్టింగ్ ఆపరేషన్ చేసిందని ఆరోపించారు. లీకేజీలపై విచారణలో తప్పులున్నట్లు తేలితే ఎవర్నీ వదిలిపెట్టనని.. తాను చండశాసనుణ్ని అంటూ విచారణకు సహకరిస్తారా లేదా అంటూ ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. కావాలంటే జ్యుడిషియల్ విచారణ కూడా వేస్తానన్నారు. ఇదే సమయంలో సమయం లేదు ప్రతిపక్షమా.. మీకున్నది రెండే ఆప్షన్లు సహకరిస్తారా పారిపోతారా అంటూ వ్యంగ్యంగా అన్నారు. కానీ.. జగన్ ఏమాత్రం సంయమనం కోల్పో కుండా బాబు ఎత్తులను తిప్పికొట్టారు. ‘నేను నీలా వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడలేను’ అంటూ చురకలు వేస్తూనే.. చిత్తశుద్ధి ఉంటే మంత్రులను బర్త్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ విచారణకు సిద్ధమా? మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐతో విచారణ చేయించాలి. విచారణకు సాక్షి సహకరిస్తుంది’ అంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో విపక్ష సభ్యులు స్పందిస్తూ.. ‘సమయం లేదు మిత్రమా.. శరణమా.. మరణమా..’ అంటూ అధికారపక్షానికి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌తో ఆత్మరక్షణలో పడిన అధికారపక్షం.. అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే అనితతో చర్చతో సంబంధం లేని అంశాన్ని ప్రస్తావింపజేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలకు ముందు స్పీకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలను వక్రీకరించిన ‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ కోడెల స్పందిస్తూ.. ఆ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తామన్నారు. అదే క్రమంలో లీకేజీలపై ప్రతిపక్షం సీబీఐ విచారణకు డిమాండ్ చేయగా అధికారపక్షం జ్యుడీషి యల్ విచారణ చేయిస్తామన్నదంటూ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం!
-
‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం!
- ప్రశ్నపత్రాల లీకేజీని పక్కదారి పట్టించేలా ప్రభుత్వ చర్యలు - ఉన్నతాధికారులతో గంటా భేటీ సాక్షి, అమరావతి/నెల్లూరు: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా విద్యాధికారి రామలింగంను కూడా పిలిపించారు. ఈ భేటీ వివరాలు బయటకు రాకుండా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రులతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై నోరువిప్పేందుకు అధికారులు భయపడుతున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణ స్కూల్‌ను తప్పించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తును పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీ సమయంలో ఆ కేంద్రంలో ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతోపాటు నారాయణ స్కూల్ సిబ్బంది, ప్రిన్సిపల్ ఉన్నట్లు ప్రచారం. అయితే, నారాయణ పాఠశాల యాజమాన్యాన్ని తప్పించేందుకు వాటర్‌బాయ్, ఇన్విజిలేటర్ మహేష్‌లను బాధ్యులుగా చేసి కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా లీకేజీపై పోలీసులు బుధవారం పలువురిని విచారించారు. వారంతా నగరంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పీఈటీలని తెలిసింది. వాటర్‌బాయ్ ఉపయోగించిన సెల్‌ఫోన్ వేరే వ్యక్తిదని పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
ప్రశ్నపత్రాల లీకేజీ దుష్ప్రచారమే: గంటా
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న గంటా మంగళవారం స్పందించారు. నెల్లూరులోని నారాయణ కళాశాలలో పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత అక్కడి అటెండర్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే అది లీకేజీ అవుతందని, కానీ ఇక్కడ పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత బయటకు వచ్చిందని చెప్పారు. ఏదేమైనా ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్టు తెలిపారు. -
లీకేజీపై సర్కార్ దొంగాట
టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీపై పచ్చి అబద్ధాలు ⇒ నారాయణ, గంటా, చంద్రబాబు విరుద్ధ ప్రకటనలు ⇒ కప్పదాట్లు.. గడియకో సమాధానం.. ⇒ ఆధారాలున్నాయి... చూపిస్తానంటున్నా జగన్‌ను పట్టించుకోని స్పీకర్ ⇒ ప్రతిపక్షనేతకు రెండు నిమిషాలు కూడా మైక్ ఇవ్వని వైనం.. ⇒ లీకేజీపై 30న సీఎం ప్రకటన చేస్తారని చెప్పిన యనమల, కోడెల ⇒ షెడ్యూలులో లేని బిల్లులు హడావిడిగా సభ ముందుకు.. ⇒ ప్రతిపక్షం వాకౌట్ చేయగానే లీకేజీలపై సీఎం ప్రకటన.. ⇒ ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడుతూ లీకేజీలపై మమ.. ⇒ నారాయణను కాపాడేందుకు అడుగడుగునా తాపత్రయం.. ⇒ ముఖ్యమంత్రి తొండి ప్రకటనలో ‘సాక్షి’పైనా అభాండాలు.. (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే అది లీకేజీ అవుతుంది. కానీ నెల్లూరులో పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత పేపర్ బయటకు వచ్చింది.’’ – ఢిల్లీలో మంత్రి గంటా శ్రీనివాసరావు ‘‘అసలు ప్రశ్నాపత్రాల లీకేజీయే లేదు. లీకేజీ జరిగిన చోట నారాయణ విద్యార్థులు లేరు. ఇదంతా ఓ దుష్ప్రచారం.’’ – అమరావతిలో మంత్రి నారాయణ ‘‘లీకేజీయే కానీ ఇది మాల్‌ప్రాక్టీస్ కిందకొస్తుంది. నెల్లూరులోని నారాయణ హైస్కూల్లో వాచ్‌మన్ ప్రవీణ్ ఈనెల 25న ఉదయం 9.25 గంటలకు సెల్‌ఫోన్ ద్వారా పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి వ్యాట్సప్‌లో పంపాడు.’’ (పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.) – అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న దొంగాటకు ప్రభుత్వంలోని ముగ్గురు కీలకమైన వ్యక్తులు చేసిన ఈ మూడు ప్రకటనలు అద్దం పడతాయి. ప్రశ్నాపత్రాల లీకేజీయే జరగలేదని ఒక మంత్రి, జరిగింది గానీ పరీక్ష ప్రారంభమైన తర్వాత జరిగిందని మరో మంత్రి, కాదు కాదు పరీక్ష ప్రారంభానికి ముందే పేపర్ లీకయ్యిందని ముఖ్యమంత్రి.. ఇలా ముగ్గురూ మూడు రకాల ప్రకటనలు చేసి సమస్యను తప్పుదోవ పట్టించడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మంగళవారం శాసనసభను స్తంభింపజేసింది. వాయిదాతీర్మానాన్ని అంగీ కరించకపోవడంతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభ రెండుసార్లు వాయిదాపడింది. దాదాపు మూడున్నర గంటల సేపు ఈ అంశంపై సభ దద్దరిల్లిపో యింది. ప్రభుత్వ పరీక్షల అధికారి ఇచ్చిన నివేదిక సహా తన వద్ద ఉన్న ఆధారాల గురించి వివరిస్తానని ప్రతిపక్షనేత వైఎస్జగన్ ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ అనుమతించలేదు. ప్రశ్నప్రతాల లీకేజీలపై ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే అన్ని విషయాలూ బయటకొస్తా యని విలేకరులతో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్షం ఆందోళనలతో కంగుతిన్న అధికారపక్షం.. హడావిడిగా వేసిన ఎత్తుగడలు వికటించి చివరకు కన్నంలో చిక్కిన దొంగలా దొరికిపో యింది. గడియకో సమాధానం, కప్పదాట్లు చూసినవారికి ఈ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం తత్తరపాటు స్పష్టంగా అర్ధమైపో యింది. ఇందులో ఇద్దరు కీలక మంత్రులకు ప్రత్యక్షంగా ప్రమేయముండడం, అందులో ఒకరు సీఎంకు మరీ కావలసిన వ్యక్తి కావడంతో ప్రభుత్వం అదిరిపడింది. ఒక మంత్రిని కాపాడడం కోసం సీఎం సహా అందరూ అనేక రకాలుగా ప్రయత్నిస్తుం డడం చూసి జనం నివ్వెరపోతున్నారు. మంగళవా రం సభలోనూ, సభ వెలుపలా చోటుచేసుకు న్న పరిణామాలు ఓమారు గమనిస్తే... ప్రతిపక్షనేతకు రెండు నిమిషాలివ్వలేదు... ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య స్పీకర్ సభను రెండు సార్లు వాయిదావేశారు. విపక్షనేతకు మాట్లాడేందుకు రెండునిమిషా లు కూడా అవకాశం దక్కలేదు. అత్యంత ప్రాధాన్యత గలిగిన, లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కనీసం 344 నిబంధన కింద స్వల్పకాలిక చర్చకన్నా అనుమతివ్వాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రభుత్వానికి పంపిన రోజువారీ నివేదికలో నెల్లూరులోని ‘నారాయణ’ హై స్కూల్ ప్రస్తావన ఉంది. ఆ స్కూల్ నుంచి పరీక్షాపత్రం లీకయినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి నుంచి వచ్చిన నివేదిక కూడా ఉంది. ఆ విషయాలనే సభకు వివరిస్తానని, తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని ప్రతిపక్షనేత పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో చంద్రబాబు ఈనెల 30న ప్రశ్నపత్రాల లీకేజీపై ఒక ప్రకటన చేస్తారని ఆర్ధిక మంత్రి యనమల సభలో వెల్లడించారు. అదే విషయాన్ని స్పీకర్ పునరుద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయాన్ని వదిలేసి షెడ్యూలులో లేని ద్రవ్య వినిమయ బిల్లు, 2013 భూసేకరణ చట్టం సవరణ బిల్లు, చుక్కల భూములకు సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులను ఈరోజే ఆమోదింప చేయాల్సి ఉందంటూ ప్రభుత్వం వితండ వాదానికి దిగింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఏకపక్షంగా బిల్లులు ఆమోదింపచేసుకోవడంతో పాటు ద్రవ్యవినిమయ బిల్లునూ ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ప్రకటన 30న అని చెప్పి.. ప్రశ్నాపత్రాల లీకేజీపై ముఖ్యమంత్రి 30న ప్రకటన చేస్తారని ఆర్థిక మంత్రి యనమల, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇద్దరూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ లీకేజీ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వం.. షెడ్యూలులో లేకపోయినా బిల్లులను ముందుకు తేవడం, ద్రవ్య వినిమయబిల్లునూ ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షం వాకౌట్ చేసింది. ప్రతిపక్షం లేకుండానే ద్రవ్యవినిమయబిల్లును మమ అనిపించేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టి సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పడం సభా సంప్రదాయం. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి కల్పించుకొని దాదాపు గంటసేపు ప్రసంగించారు. పనిలో పనిగా 30 న చేస్తామని చెప్పిన లీకేజీ ప్రకటనను సభలో చదివి ఇక ఆ అంశం ముగిసినట్లేనని అనిపించారు. లీకేజీలపై 30న సీఎం ప్రకటన ఉంటుందని అధికార పక్షం, స్పీకర్ చెప్పినా ప్రతిపక్షసభ్యులు వాకౌట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి లీకేజీలపై ప్రకటన చేయడంపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. లీకేజీలపై ఆత్మరక్షణలో పడిపోయిన ప్రభుత్వం ఎలాగోలా గట్టెక్కడం కోసమే సభలో ప్రతిపక్షం లేని సమయంలో ప్రకటన చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక అంశంపై సభలో చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, దానిపై ఏవైనా వివరణలు ఉంటే సమాధానమివ్వడం సాంప్రదాయం. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇలా తప్పించుకునేటట్లుగా దొంగాట ఆడుతుండడం అనేక సందర్భాలలో బైటపడుతోంది. ఏ విషయమైనా ఏకపక్షంగా తామే మాట్లాడడం, ప్రతిపక్షానికి కనీసం మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా గొంతునొక్కడం అడుగడుగునా కనిపిస్తోంది. నారాయణను కాపాడాలన్న తాపత్రయం మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు స్వయానా వియ్యంకుడు కావడం, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులు సమకూర్చిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ను రక్షించేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నారని అర్ధమౌతోంది. మరోవైపు ఆయన చంద్రబాబు బినామీ అన్న వాదనలూ ఉన్నాయి. ద్రవ్య వినిమయబిల్లుపై అకస్మాత్తుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రసంగించడం, ప్రశ్నాపత్రాల లీకేజీలపై 30న చేస్తారనుకున్న ప్రకటన ఈరోజే చేసేయడం చూస్తే ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రహసనంలో ఇరుక్కుపోయిన మంత్రి నారాయణను ఎలాగైనా రక్షించాలన్న తాపత్రయంతోనే ముఖ్యమంత్రి ముందే ప్రకటన చేశారని, ప్రతిపక్షానికి మరో అవకాశం లేకుండా చేయాలన్న ఎత్తుగడ ఇందులో ఇమిడి ఉందని విశ్లేషకులంటున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై నిబంధనలకు విరుద్ధంగా సీఎం సుదీర్ఘ ప్రసంగం చేయడంతో చివరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసేదేమీ లేక ‘‘శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై సీఎం మాట్లాడ్డం జరగదు. కానీ ఇక్కడ మా సీఎం మాట్లాడారు. శాసనసభ చరిత్రలో ఇలా ఇదివరకెన్నడూ జరగలేదు. సీఎం మాట్లాడారు కనుక ఇక నేను చెప్పేందుకేముంటుంది’’ అంటూ ఒక నిట్టూర్పు విడిచి బిల్లును ఆమోదించాలని కోరడంతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. రాష్ట్ర శాసనసభ జరుగుతున్న తీరుపట్ల ముఖ్యంగా ద్రవ్యవినిమయ బిల్లు సందర్భంగా సభలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పలువురు నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన సభావ్యవహారాలను తామిదివరకెన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. గంటలకొద్దీ సమయాన్ని వృధా చేయడానికి, ప్రతిపక్షనేతపై తీవ్ర విమర్శలు చేయడానికి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షానికి రెండు నిముషాలు కూడా ఇవ్వకుండా అడ్డుపడే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రధానప్రతిపక్షం లేకుండానే ఆమోదింపచేసుకున్న తీరు మునుపెన్నడూ ఎరగని పరిణామమని విమర్శిస్తున్నారు. తొండి ప్రకటనలో ‘సాక్షి’పై వ్యాఖ్యలు.. సభలో ప్రతిపక్షం లేని సమయంలో.. ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఏక పక్షంగా ఓ తొండి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి అందులో ‘సాక్షి’ పైనా అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా మారింది. ప్రశ్నపత్రాన్ని 10.25 గంటలకు ‘సాక్షి’ టీవీ విలేకరి ఒకరు వ్యాట్సప్‌లో నెల్లూరు డీఈవోకు పంపారని.. సాక్షి టీవీ విలేకరికే ఆ ప్రశ్నపత్రం ఎలా వచ్చిందని.. ఇందులో ఏదో కుట్ర ఉందంటూ ‘సాక్షి’ మీడియాపై బాబు తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. అదే పశ్నపత్రాన్ని నెల్లూరు సాక్షి టీవీ విలేకరి 10.25 గంటలకు డీఈవోకు వాట్సాప్‌లో పంపారని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతా యని చెప్పారు. సాక్షి విలేకరి వాట్సాప్‌లో ఆ ప్రశ్నపత్రాన్ని డీఈవోకు పంపారని చెప్పిన చంద్రబాబు.. ఒకవేళ తప్పు చేసినవారైతే అలా ఎందుకు చేస్తారన్న చిన్న లాజిక్ మిస్ అయ్యారు. తప్పు జరుగుతోంది సరిదిద్దండి అంటూ జిల్లా విద్యాశాఖాధికారికి ఓ ఆధారాన్ని పంపిన విలేకరిపై అభాండాలు వేయం చూస్తేనే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎలా ఆలోచిస్తున్నారో.. దోషులను కాపాడడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. -
ప్రశ్నాపత్రం లీకుపై మంత్రి సీరియస్
- విచారణకు ఆదేశం విజయవాడ: నెల్లూరు జిల్లాలో పదోతరగతి సైన్స్-1 పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిందనే వార్త హల్చల్ చేస్తోంది. సామన్య శాస్త్రం-1 ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. -
మంత్రి గంటాకు హైకోర్టు నోటీసులు
ప్రభుత్వ భూముల తాకట్టుపై ప్రత్యూష డైరెక్టర్లందరికీ నోటీసులు సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, వేములవలస గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రూ.141 కోట్ల రుణాలు తీసుకున్న వ్యవహారంలో ఉమ్మడి హైకోర్టు స్పందించింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ప్రత్యూష డైరెక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావులతో పాటు ఆ సంస్థ ప్రతినిధులు కొండయ్య బాల సుబ్రహ్మణ్యం, నార్ని అమూల్య, ప్రత్యూష ఎస్టేస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు రెవెన్యూ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా రిజిష్ట్రార్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్లకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న వ్యవహారంలో మంత్రి గంటాతో పాటు ప్రత్యూష రీసోర్సెస్ ఇన్ఫ్రా డైరెక్టర్లు, ఇండియన్ బ్యాంక్ అధికారు లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాజువాకకు చెందిన సాలాది అజయ్‌బాబు గత వారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు
-
మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గంటాపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్హామీదారుగా ఉన్నందుకుగాను గంటాకు ఈ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి ఆ సంస్థ ఇండియన్ బ్యాంకు నుంచి రుణం పొందిందని పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రుణగ్రహీతలు, హామీదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు గంటా సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా మంత్రి గంటాతోపాటు ఆయన బంధువుల ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. తాజాగా ‘ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం కుదవపెట్టిన మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. -
చొక్కా.. చాంతాడంత..
డాబాగార్డెన్స్ (విశాఖ): గెట్ మై టైలర్ స్టార్టప్ కంపెనీ రూపొందించిన అతి పొడవైన షర్ట్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. 47 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పులో షర్ట్‌ను తయారు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు చేయడమే ధ్యేయంగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలని హితవు పలికారు. ఫలితంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారడానికి స్టార్టప్ కంపెనీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని సూరంపాలెం ఆదిత్యా ఇంజినీరింగ్ కాలేజ్ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆ కళాశాల విద్యార్థులు ఇంతవరకు నాలుగు స్టార్టప్ కంపెనీలు ప్రారంభించారని తెలిపారు. స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ గెట్ మై టైలర్ ఆన్లైన్ స్టోర్ ద్వారా సుమారు ఐదు వేల మంది నిరుద్యోగ యువత దీనిలో భాగస్వామ్యమయ్యారని తెలిపారు. గృహిణులు, మహిళలు ఇంటి వద్దే ఉండి టైలరింగ్ ద్వారా ఉపాధి పొందవచ్చని సూచించారు. -
మంత్రి గంటా ఆస్తులు మరిన్ని స్వాధీనం
-
మంత్రి గంటా ఆస్తులు మరిన్ని స్వాధీనం
⇒ చెన్నై, హైదరాబాద్‌లో ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్ ⇒ రూ.203.62 కోట్లకు చేరిన రుణ బకాయిలు సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావుతోపాటు ఆయన బంధువుల ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. తాజాగా ‘ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం కుదవపెట్టిన మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ బుధవారం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో స్వాధీన ప్రకటన జారీ చేసింది. వరుసగా ఆస్తుల స్వాధీన ప్రకటనలు జారీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. 60 రోజులు గడువిచ్చినా... మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ఈ కంపెనీ విశాఖప ట్నం డాబాగార్డెన్‌లోని ఇండియన్ బ్యాంకు నుంచి 2005లో దాదాపు రూ.141.68 కోట్లు రుణం తీసుకుంది. ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించని కారణంగా వడ్డీతో కలిపి రూ.196 కోట్ల మేర బకాయి పేరుకు పోయింది. దీన్ని చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు జారీచేసినా కంపెనీ నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రత్యూష ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన ఆస్తులతోపాటు ఈ రుణం కోసం మంత్రి శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి వెంకయ్య ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, నామి అమూల్యల ఆస్తులను గత డిసెంబర్ 21వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ బ్యాంకు అధికారులు ప్రకటించారు. స్వాధీనం నోటీసు అనంతరం 60 రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. అయితేకంపెనీతోపాటు హామీదారులెవరూ స్పందించకపోవడంతో ఆస్తులను తమ అధీనంలో తీసుకుంటున్నట్టు బుధవారం పొజిషన్ నోటీసు జారీ చేశారు. కాగా, పెరిగిన వడ్డీతో సహా రుణ బకాయిలు ప్రస్తుతం రూ.203.62 కోట్లకు చేరినట్లు బ్యాంకు తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎంతోకొంత రికవరీ చేసుకోవాలన్న ఉద్దేశంతో గతంలో ఆయా కంపెనీలు, హామీదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులతోపాటు అదనంగా మరో రెండు కీలకమైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటన జారీ చేసింది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తులివే.. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సైదాపేట తాలూకా సీషోర్ టౌన్ పరిధిలోని షోలింగనల్లూర్ గ్రామంలో సర్వే నెం.12/1, 13/1 పార్ట్, 13/2 పార్ట్‌లలో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నెం.281ఏను ఫిబ్రవరి 16న స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్ గ్రామంలో సర్వే నెం.201లో ల్యాంకో హిల్స్ టవర్–5లో 67.92 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన మొదటి, రెండో అంతస్తులను ఫిబ్రవరి 17న స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. -
మంత్రి గంటా ఆస్తులు బ్యాంక్ స్వాధీనం
సాక్షి, అమరావతి: రుణాల ఎగవేత కేసులో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన మరిన్ని ఆస్తులను బ్యాంక్ స్వాధీనం చేసుకున్నాయి. గంటా కుటుంబానికి చెందిన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ ఇండియన్ బ్యాంక్‌కు రూ.141 కోట్లు బకాయి ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా రుణాలు చెల్లించకపోవడంతో బాకీ మొత్తం రూ. 203.62 కోట్లకు చేరింది. దీంతో ఆ కంపెనీకి చెందిన ఆస్తులతో పాటు రుణానికి హామీగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావుకి చెందిన ఆస్తులను బ్యాంక్ స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికే విశాఖతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నా బ్యాంక్ తాజాగా హైదరాబాద్, చెన్నైలోని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పత్రికా ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్‌లో ల్యాంకో హిల్స్‌లో కంపెనీ పేరు మీద ఉన్న రెండు ఫ్లాట్లతో పాటు, తమిళనాడులోని కాంచీపురం జిల్లా షోలింగనల్లూర్‌లో ఉన్న 6,000 చదరపు అడుగుల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ బ్యాంక్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆస్తులను ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో స్వాధీనం చేసుకున్నామని, దీనికి సంబంధించి తమకు తెలియకుండా ఎటువంటి క్రయవిక్రయాలు జరపరాదని ఆ బహిరంగ ప్రకటనలో పేర్కొంది. -
సాక్షి ఎఫెక్ట్ : ల్యాండ్ పూలింగ్‌కు బ్రేక్!
-
ల్యాండ్ పూలింగ్‌కు బ్రేక్!
వివాదాస్పద గ్రామాల్లో ప్రక్రియ నిలుపుదల పునర్విచారణ చేయిస్తామన్న వుడా వీసీ విచారణకు సిద్ధమన్న మంత్రి గంటా సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రూ. వందల కోట్ల విలువైన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా అక్రమంగా కొట్టేయాలనుకున్న ఓ మంత్రి, అధికార పార్టీ నాయకుల పన్నాగానికి బ్రేకు పడింది. వివాదాస్పద గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటివరకు సేకరించిన భూములపై పునర్విచారణకు వుడా అంగీకరించింది. ‘విశాఖ శివారు భూముల్లో సర్కారీ దోపిడీ.. రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఓ మంత్రి వ్యూహం’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) వర్గాల్లో కలకలం రేపింది. వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావునాయుడు మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లా డుతూ.. ‘సాక్షి’లో వచ్చిన కథనం నేపథ్యంలో పెందుర్తి మండలం ముదపాక సహా భీమిలి నియోజకవర్గంలోని ఇతర వివాదాస్పద గ్రామా ల్లో ల్యాండ్ పూలింగ్ను తాత్కాలికంగా నిలుపు దల చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటివరకు సేకరించిన భూములపై పునర్విచారణ జరిపిస్తా మని, మీడియా సమక్షంలోనే గ్రామసభలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి, అక్కడ నుంచి వచ్చే తదుపరి ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ శివారులోని 15 గ్రామా ల్లో వుడా చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఇప్పటివరకు 3 (సౌభాగ్యరాయపురం, దబ్బంద, కొమ్మాది) గ్రామాలకు సంబంధించిన భూముల వివరాలే కలెక్టర్‌కు నివేదించామని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో సంబంధిత అసైన్డ్ భూముల రైతులు.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూముల పరిహారాన్ని నేరుగా రైతులకే చెల్లిస్తామన్నారు. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇతరత్రా ఇచ్చే ప్రయోజనాలన్నీ భూ యజమానులకే తప్ప ఇతరులకు ఇవ్వబోమని స్పష్టీకరించారు. ఇదిలా ఉండగా.. ‘సాక్షి’లో కథనం చూసిన వెంటనే మంత్రి అనుచరులు ఆయా ఊళ్లపై పడిపో యారు. స్వచ్ఛందంగా భూములను అప్పగించా మని చెప్పాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చారు. విచారణకు ఆదేశించాం: మంత్రి గంటా ల్యాండ్ పూలింగ్ అక్రమాలు జరిగాయనే విషయమై విచారణకు సిద్ధమేనని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. సాక్షిలో వచ్చిన కథనంపై మంత్రి స్పందిస్తూ విశాఖ జిల్లా కలెక్టరేట్లో మంగళ వారం మీడియాతో మాట్లాడారు. ‘వుడా ల్యాండ్ ఫూలింగ్‌లో జరుగుతున్న అవినీతి, అవకతవక లపై పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తున్నాను. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. తప్పు చేస్తే ఎవరినైనా ప్రభుత్వం వదిలిపెట్టదు’ అని పేర్కొన్నారు. ఓ మంత్రి హస్తం ఉందన్న విషయమై.. ‘ఎవరైనా సరే విచారణలోనే అన్నీ తేలుతాయి’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
సెట్లన్నీ ఆన్లైన్లోనే
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షలను ఈ విద్యాసం వత్సరం నుంచి ఆన్లైన్లో నిర్వహించను న్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఏయూ సెనేట్ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. రానున్న విద్యాసం వత్సరం నుంచి ఎంసెట్ నిర్వాహించా లా? వద్దా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోం దన్నారు. దీనికి పరిష్కారం చూపే విధంగా త్వరలో దీనిపై ప్రత్యేక నిపుణుల కమిటీని నియమిస్తామన్నారు. ఈ సందర్భంగా పలు సెట్లకు కన్వీనర్ల వివరాలను ప్రకటించారు. ఎంసెట్‌ను జేఎన్టీయూ కాకినాడ నిర్వహించనుండగా.. కన్వీనర్‌గా ఆచార్య సీహెచ్ సాయిబాబు వ్యవహరిస్తారు. -
వివాదాల్లో టీడీపీ వియ్యంకులు
-
ఆ కంపెనీతో సంబంధం లేదు
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చంద్రగిరి : విశాఖపట్టణంలో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తనకు ఎటువంటి సంబంధంలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. చంద్రగిరిలో శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యూష కంపనీ రుణ బకాయిలను చెల్లించనందుకు ఇండియన్ బ్యాంకు అధికారులు మంత్రి ఆస్తులను స్వాధీ నం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రిని ప్రశ్నించగా, ఆ కం పెనీ డైరెక్టర్‌గా 2010లో రాజీనామా చేశానని తెలిపారు. కంపెనీకి తాను గ్యారెంటర్‌గా ఉన్న మాట వాస్తవమేనని, కంపెనీ దివాలా తీయడంతో తనకు నోటీసులు అందించారని చెప్పా రు. కంపెనీ డైరెక్టర్లతో సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చర్చిస్తామని తెలిపారు. -
మంత్రి గంటా ఆస్తుల స్వాధీనం!
-
మంత్రి గంటా ఆస్తుల స్వాధీనం!
- విశాఖలోని ఇండియన్ బ్యాంకుకు ’గంటా’ గ్యాంగ్ ఎగనామం - రుణ బకాయిలు చెల్లించని ప్రత్యూష కంపెనీ - వడ్డీతో కలిపి రూ.196.51 కోట్ల బకాయి - డిమాండ్ నోటీసులిచ్చినా స్పందన శూన్యం - కంపెనీతోసహా డైరెక్టర్ల ఆస్తులు, హామీదారుగా ఉన్న గంటా ఆస్తుల స్వాధీనానికి ప్రకటన సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువులు, వ్యాపార భాగస్వాములు రుణ ఎగవేతదారులుగా ముద్రపడ్డారు. ఇక్కడి ఇండియన్ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో వారిని రుణ ఎగవేతదారులుగా పరిగణించిన బ్యాంకు అధికారులు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు, పత్రికా ప్రకటనలు జారీ చేశారు. తీసుకున్న రుణాల్ని వడ్డీతోసహా చెల్లించాలని బ్యాంకు పలుమార్లు డిమాండ్ నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో.. చివరి అస్త్రంగా వారు హామీగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకు బుధవారం పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇందులో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులు కూడా ఉండడం కలకలం రేపుతోంది. వడ్డీతో కలిపి రూ.196.50 కోట్లు విశాఖపట్నం వన్‌టౌన్‌లో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2005 ఆగస్టు 18న కంపెనీల చట్టం కింద రిజిస్టర్(రిజిస్ట్రేషన్ నం.047165) అయ్యింది. మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కార్యకలాపాలకు ఉద్దేశించిన ఈ సంస్థ.. రూ.500 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో ఏర్పాటైంది. ఈ సంస్థకు యాక్టివ్ డైరెక్టర్లుగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావు వ్యవహరిస్తున్నారు. మంత్రి గంటాతోపాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నె అమూల్యలతోపాటు ప్రత్యూష ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్‌లు ప్రధాన హామీదారులుగా ఉన్నారు. సంస్థ విస్తరణ పేరుతో విశాఖలోని ఇండియన్ బ్యాంక్ డాబాగార్డెన్స్ శాఖ నుంచి రూ.141,68, 07,584 రుణం తీసుకున్నారు. అయితే ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఫలితంగా ఈ ఏడాది డిసెంబర్ 13 నాటికి వడ్డీతో కలిపి వారు చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తం రూ.196,51,00,717గా ఇండియన్ బ్యాంకు లెక్కకట్టింది. అక్టోబర్ 4నే డిమాండ్ నోటీసులు ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ గత అక్టోబర్ 4న బ్యాంకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. నోటీసందిన 60 రోజుల్లోగా రుణబకాయి చెల్లించాలని, లేకుంటే కంపెనీతోపాటు డైరెక్టర్లు, హామీదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అందులో స్పష్టం చేసింది. అయినప్పటికీ సంస్థ ఒక్క రూపాయీ చెల్లించలేదు. దీంతో ఆస్తుల స్వాధీనానికి బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్లుగా ఉన్న పరుచూరి వెంకటభాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతోపాటుగా హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్యల ఆస్తులనూ స్వాధీనం చేసుకుంటున్నామంటూ బ్యాంక్ స్వాధీనత ప్రకటన జారీచేసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరి ఆస్తులను ఈ నెల 21 నుంచి 26వ తేదీ మధ్య స్వాధీనం చేసుకున్నట్టుగా బ్యాంక్ అధికారులు ప్రకటించారు. విశాఖ నగరంతోపాటు గాజువాక, చినగదిలి, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడల్లోని ప్రత్యూష కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, లావాదేవీలు జరిపినవారు ఈ రుణ బకాయిలకు బాధ్యులవుతారని హెచ్చరికలు జారీచేసింది. ప్రత్యూష డైరెక్టర్లలో గంటా ఒకరు పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారు. ఈ సంస్థకే జిల్లా గ్రంథాలయసంస్థ నిర్మాణ బాధ్యతలు అప్పగించగా.. ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేపట్టిన ఉద్యమంతో ప్రభుత్వం వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకే గత నెలలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇలాంటి కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ఎగవేయడం, హామీదారులుగా ఉన్న గంటాతోపాటు ఆయన బంధువులైన డైరెక్టర్ల ఆస్తుల్నీ స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ప్రకటన జారీకావడం సంచలనం రేకెత్తించింది. గ్యారంటీర్నే గానీ.. డిఫాల్టర్‌ను కాను ప్రత్యూష కంపెనీలో ఒకప్పుడు నేను డైరెక్టర్‌గా వ్యవహరించిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం ఆ కంపెనీతో నాకెలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఆ కంపెనీ ఇండియన్ బ్యాంకులో తీసుకున్న రుణాలకు గ్యారంటీర్‌గా ఉన్నాను. రుణ బకాయిలు చెల్లిం చకపోవడంతో కంపెనీ డైరెక్టర్లతోపాటు గ్యారం టర్గా ఉన్న నాకు కూడా నోటీసులిచ్చారు. రుణ బకాయిS చెల్లింపుల విషయంలో డైరెక్టర్లతో మాట్లాడతా.. బకాయిలు చెల్లించాలని కోరతా. – సాక్షితో గంటా శ్రీనివాసరావు, ఏపీ మంత్రి -
బీచ్ లవ్ ఫెస్టివల్ రద్దు!
ప్రకటించిన మంత్రి గంటా సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వివాదం రేపిన బీచ్ లవ్ ఫెస్టివల్ ఎట్టకేలకు రద్దయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. విశాఖ తీరంలో వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం ఉబలాట పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని నవంబరు 3న ‘బాబు సర్కారు సమర్పించు బీచ్ లవ్’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచిక ప్రచురించిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. (చదవండి : బాబు సర్కార్ సమర్పించు..బీచ్ లవ్ ) ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ బీచ్ లవ్ ఫెస్టివల్ జరగదని, రద్దయిందని బుధవారం విశాఖలో విలేకరులకు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవ్ జరుగుతుందని మంత్రి తెలిపారు. -
'అన్ని ప్రవేశ పరీక్షలూ ఆన్లైన్లోనే'
విజయవాడ : ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ఇకపై ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రి మంగళవారం సమీక్షసమావేశం నిర్వహించారు. అన్ని ఎంట్రన్స్‌లు ఆన్లైన్లోనే నిర్వహించే క్రమంలో సమర్ధంగా పనిచేసే ఏజెన్సీలను ఎంపిక చేయాలని సూచించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5వ తేదీలోగా నివేదిక అందిన వెంటనే ఏ యూనివర్శిటీకి, ఏ పరీక్షల బాధ్యతలు ఇవ్వాలో ఎంపిక చేసి, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా తెలిపారు. -
రేపు టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్
విడుదల చేయనున్న మంత్రి గంటా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పరీక్షలను మార్చి 1వ తేదీనుంచి టెన్త్ పరీక్షలను మార్చి 14వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు షెడ్యూళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు జరిగేలానే ఏపీలోనూ షెడ్యూల్ ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నారుు. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ముందు భావించినా ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌లో నియమించాలని భావిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లో ఉంటాయని ఇంటర్ బోర్డు ఉత్తర్వులిచ్చింది. -
ఉషారాణి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు
విశాఖ: ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని విదేశీ పర్యటనలో ఉన్న విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్య కార్యదర్శి సుమితాదావ్రాతో మాట్లాడిన ఆయన సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. (చదవండి : ర్యాగింగ్ భూతానికి విద్యార్థిని బలి) కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఉషారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపైనా, ర్యాగింగ్ జరిగినట్లయితే కళాశాలపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ ఎక్కడ జరిగినా సహించేది లేదని, అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
హోదా ఊగిసలాడుతోంది: యనమల
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఊగిసలాడుతోందని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పాలనను ప్రారంభిస్తూ గురువారం పలు ప్రధాన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ హోదాలో యనమల, మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి సమీక్షలు నిర్వహించారు. అనంతరం యనమల విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా? ప్యాకేజీ ఇవ్వాలా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఆదాయం అనుకున్నంత రాకపోవడంతో రూ.3 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. నిధులు మంజూరుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. రాష్ట్రంలో 19 సంస్థల్లో నిర్వహించిన లోకల్ ఆడిట్లో రూ.14,456 కోట్లకు సంబంధించిన 33,37,034 ఆడిట్ అభ్యంతరాలు వచ్చినట్టు వివరించారు. -
ముద్రగడపై ఘంటా వ్యాఖ్యలు సరికాదు
చిక్కడపల్లి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రి ఘంటా శ్రీనివాస్‌రావు వాఖ్యలు వెంటనే విరమించుకుకోవాని ఏపీ కాపు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం అశోక్‌నగర్‌లోని ఎస్ఎంఎస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు తోటరాజు, చందు జనార్థన్, పెద్దకాపు, నీలం రాంబాబునాయుడులు మాట్లాడారు. ఘంటా శ్రీనివాస్ సీఎం చంద్రబాబునాయుడు తొత్తుగా మారి ఆయన మెప్పు పొందేందుకు ముద్రగడపై విమర్శనలు చేస్తున్నారని ఆరోపించారు. కాపులకు బీసీ హోదా కల్పించాలని దీక్ష చేస్తుంటే మద్దతివ్వాల్సిందిపోయి జాతిలో పుట్టి జాతికి అన్యాయం చేసే విధంగా ఘంటా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలోకి రావాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధుల ఇండ్ల ముందు పువ్వులు, పూల దండలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. -
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : పదో తరగతి 2016 జూన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ‘సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్’లో చూసుకోవచ్చు. -
నేడు ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సెస్సీ 2016 జూన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్లో ఫలితాలు విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎంఆర్ ప్రసన్న కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలను ‘సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్’లో చూసుకోవచ్చు. -
అచ్చెన్నకు ‘గంటా’ చెక్!
ఒక్క సిఫారసూ అమలు చేయని వైనం శ్రీకాకుళం : జిల్లా విద్యాశాఖలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడుకు చెక్ పెడుతూ వస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నారుు. అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడు ఎంపీగా ఉన్ననాటి నుంచి వారి కుటుంబంతో గంటాకు మంచి సంబంధాలు ఉండేవి. ఎర్రన్నాయుడు మర ణానంతరం అదే పంథాను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత శ్రీకాకుళం జెడ్పీ సీఈఓ నగేష్ నియామకం నుంచి అచ్చెన్నాయుడు, గంటాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనే ప్రచారం ఉంది. నగేష్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓఎస్డీగా వ్యవహరించేవారు. అప్పట్లో విశాఖ జిల్లాకు చెందిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పిన ఓ పనిని గంటాకు తెలియకుండా నగేష్ చేయడంతో ఆయను ఓఎస్డీగా తొలగించినట్లు అప్పట్లో వ్యాఖ్యానాలు ఉండేవి. అటు తరువాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు నగేష్‌ను శ్రీకాకుళం జెడ్పీ సీఈవోగా నియమించాలని యోచిస్తూ మంత్రి అచ్చెన్న అడుగగా దానికి ఆయన సమ్మతించడంతో నగేష్ సీఈఓగా శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టారు. దీన్ని గంటా కాస్త సీరియస్‌గానే తీసుకున్నారని అప్పట్లో ఆయన అనుయాయులే చెప్పారు. అచ్చెన్నతో సజావుగా ఉంటున్నట్లు ప్రవర్తిస్తున్నా అనేక సందర్భాల్లో ఆయన చేసిన సిఫారసులు అమలుకు నోచుకోకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. వాటిని పరిశీలిస్తే.. రాజీవ్ విద్యా మిషన్ పీవోగా గతంలో రామచంద్రారెడ్డి పనిచేశారు. ఆయన్ని ఓ సందర్భంలో మంత్రి గం టా శ్రీనివాసరావు స్వయంగా మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. అయితే ఆయనను రిలీవ్ చేయకుండా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రామచంద్రారెడ్డిని కొనసాగించేందుకు మంత్రి అచ్చెన్న ప్రయత్నాలు చేశారు. సుమారు రెండు నెలలపాటు రామచంద్రారెడ్డి ఆ పోస్టులో కొనసాగినా మంత్రి మాత్రం ఎవరి సిఫారసులకూ తలొగ్గకుండా సరెండర్కే కట్టుబడ్డారు. చేసేది లేక రెండు నెలల తరువాత రామచంద్రారెడ్డిని రిలీవ్ చేయాల్సి వచ్చింది. రాజీవ్ విద్యా మిషన్ ఎఫ్‌ఏఓగా మోహనరావు అనే వ్యక్తినినియమించారు. ఈయనను ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దని, ఆయనను మార్పు చేయిస్తామని మంత్రి కార్యాలయ వర్గాలు ఆర్వీఎం అధికారులపై ఒత్తిడి తెచ్చాయి. ఆ పోస్టులో ఓ అనర్హుడిని ఆర్వీఎం ఉన్నతాధికారుల ఆదేశాలను కాదని కొనసాగించారు. సుమారు 6 నెలల పాటు మోహనరావుకు బాధ్యతలు అప్పగించకుండా చేశారు. ఆయన బదిలీకి ఎన్ని సిఫారసులు చేసినా ఫలితం లేకపోవడంతో రెండు రోజుల క్రితం శ్రీకాకుళం ఆర్వీఎం ఎఫ్‌ఏఓగా మోహనరావుకు బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జీసీడీఓగా ఓ ప్రధానోపాధ్యాయురాలిని నియమించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకం జరిగింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అధికారుల రేటిఫికేషన్ కోసం నివేదించారు. ఇది జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర అధికారుల నుంచి సమాధానం లేదు. జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఈ విషయంపై మంత్రి గంటాను ఆశ్రయించి అచ్చెన్నాయుడు సిఫారసులతో జీసీడీఓగా ఆమె చేరారని ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర అధికారుల నుంచి ఉత్తర్వులు రాకుండా నిలుపుదల చేయించినట్లు భోగట్టా. శ్రీకాకుళం విద్యాశాఖాధికారి దేవానందరెడ్డికి కృష్ణా లేని పక్షంలో కర్నూలు జిల్లాకు బదిలీ అవుతుందని మార్చి నెల నుంచి ప్రచారం జరుగుతోంది. కాగా ఆయనకు బదిలీ చేస్తే ఆ స్థానంలో ఓ ఉప విద్యాశాఖాధికారిని నియమించాలని అచ్చెన్న ద్వారా ఓ వర్గం ఓ పేరును ప్రతిపాదించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. డీఈఓను బదిలీ చేస్తే అచ్చెన్న సిఫారసు చేసిన వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందేమోనని డీఈఓ బదిలీనే నిలుపుదల చేయించినట్లు సమాచారం. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో డీఈఓకు బదిలీ చేయాల్సి వస్తే ఆయనను తూర్పుగోదావరి జిల్లాలో నియమించేలా, ఆయన స్థానంలో సిఫారసులకు అతీతంగా వేరొక రి పేరును చేర్చాలని ఆ మేరకు ఫైలును సిద్ధం చేస్తే తాను విదేశాల నుంచి వచ్చిన తరువాత పరిశీలన చేస్తానని మంత్రి గంటా రాష్ట్ర ఉన్నతాధికారులతో అన్నట్లు తెలియవచ్చింది. శ్రీకాకుళం విద్యాశాఖాధికారిగా ఇదివరలో ఎస్.అరుణకుమారి పనిచేశారు. ఆమె బదిలీ వెనుక అచ్చెన్న హస్తం ఉందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. జిల్లా నుంచి రిలీవ్ అయిన అరుణకుమారి పాడేరులో బాధ్యతలు చేపట్టకుండా దీర్ఘకాలిక సెలవుపై ఉండిపోయారు. ఆమెను డీఈఓగా నియమించకుండా చూడాలని అచ్చెన్న వర్గం కృషిచేసింది. అయితే దానికి భిన్నంగా అరుణకుమారిని వారం రోజుల క్రితమే విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారిగా నియమించారు. ఇలా అడుగడుగునా అచ్చెన్నకు గంటా చెక్ పెడుతూ వస్తున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కడపలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ 48.66 శాతం, ఫస్టియర్ 76.31 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్ ప్రశ్నాపత్రాల రికౌంటింగ్కు జులై 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సత్యనారాయణ, కలెక్టర్ కె.వి. సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి. -
ఏపీ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు నేడే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కడపలో ఈ ఫలితాలను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలను ‘సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ వెబ్సైట్లో చూసుకోవచ్చు. -
ఎన్నికల్లో గెలిపించే అధికారులు కావాలి
- మాది రాజకీయ పరిపాలన: చంద్రబాబు - ఉద్యోగుల బదిలీలపై మంత్రులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ - మాట వినని అధికారులను వెయిటింగ్లో పెట్టాలి - డీఎస్పీ, ఆర్డీవోల బదిలీలను నేనే చేస్తా - పారదర్శకత అంటూ నాకే ఫిలాసఫీ చెబుతారా? - మంత్రులపై ముఖ్యమంత్రి ఆగ్రహం - బదిలీల గడువు నేటి వరకు పొడిగింపు సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ఉద్యోగుల సాధారణ బదిలీల విషయంలో స్వయంగా ప్రభుత్వమే పారదర్శతకు పాతరేసింది. పైరవీలకు తెరలేపింది. వాస్తవానికి బదిలీల గడువు సోమవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. కావాల్సిన వారిని కావాల్సిన చోట నియమించుకోవడానికి వీలుగా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం బుధవారం వరకు పొడిగించింది. మరో మూడేళ్లలో జరిగే ఎన్నికల్లో గెలవాలంటే మాట వినే అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించడం గమనార్హం. ఉద్యోగుల బదిలీలు పూర్తి పారదర్శకంగా, పనితీరు ఆధారంగానే జరుగుతాయని, ఇందులో రాజకీయ జోక్యానికి తావులేదని ఇప్పటిదాకా చెప్పిన సీఎం హఠాత్తుగా మాట మార్చేశారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బదిలీలు చేపట్టాలని నిర్దేశించారు. ఇక అధికార పార్టీ నేతలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగులు దక్కుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇందులో భారీగా అవినీతి చోటుచేసుకోనుందని, కోట్ల రూపాయల సొమ్ము చేతులు మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పార్టీకి విధేయులైన వారిని నియమించాలి ‘‘మాది రాజకీయ పరిపాలన.. మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మా మాట వినే అధికారులను నియమించాలి. మాట వినని అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టాలి. జపాన్‌లో కేబినెట్ కార్యదర్శి కూడా అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. కీలకమైన డీఎస్పీ, ఆర్డీవోల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఫైళ్లను నాకే పంపించండి. నేను స్వయంగా చూసి ఆదేశాలు జారీ చేస్తా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ముఖ్యమంత్రి మంగళవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఉద్యోగుల బదిలీల వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రులను చంద్రబాబు నిలదీశారు. బదిలీలు పారదర్శకంగా, పనితీరు ఆధారంగానే జరుగుతాయని చెప్పడం వల్ల తాము పట్టించుకోలేదని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫిలాసఫీ చెబుతున్నావా? పారదర్శకత అంటే రాజకీయంగా ఆలోచించవద్దా? అని అచ్చెన్నాయుడిని గద్దించారు. మరో మూడేళ్లలో ఎన్నికలు ఉన్నందున ఉద్యోగుల బదిలీల విషయంలో ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదు ఉద్యోగుల బదిలీల విషయంలో మంత్రులు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు భేషజాల(ఇగో)కు పోతున్నారని, బదిలీల వ్యవహారంలో సరిగా వ్యవహరించట్లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. వ్యవసాయ శాఖలో బదిలీ ల వ్యవహారం ముందుకెళ్లకపోవడంపై సంబంధిత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు క్లాసు తీసుకున్నారు. అధికారులను సమన్వయం చేసుకోలేనప్పుడు మిమ్మల్ని మంత్రిగా, మరొకరిని ఇన్చార్జిగా పెట్టి ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. బదిలీల ప్రక్రియను ఇంతవరకూ చేపట్టని ఆరోగ్యశాఖ, మరో రెండు రోజులు గడువు అడుగుతున్న విద్యాశాఖ తక్షణం ఈ ప్రక్రియను చేపట్టి గడువులోగా పూర్తి చేయాలన్నారు. పరిపాలనలో ముఖ్య భూమికగా ఉండే ఉద్యోగ వ్యవస్థ నుంచి ఉత్తమ బృందాల్ని ఎంపిక చేయడానికే బదిలీల ప్రక్రియ చేపట్టామని సీఎం చెప్పారు. మంత్రి గంటాపై చంద్రబాబు రుసరుసలు సాక్షి, విశాఖపట్నం: విద్యాశాఖలో బదిలీలు ఎందుకు జరగట్లేదు.. ఇంకెంత సమయం కావాలి? ఏడాది పొడవునా చేస్తారా? అంటూ సీఎం చంద్రబాబు మంత్రి గంటా శ్రీనివాసరావుపై రుసరుసలాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం మాట్లాడుతూ... బదిలీలు పూర్తి చేసేందుకు నీటి పారుదల, విద్యా శాఖలు గడువు కోరినట్టు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘‘ఖరీఫ్ ప్రారంభమైనందున ఆగస్టు వరకు వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు మనమే గడువిచ్చాం. విద్యాశాఖకు ఎందుకు గడువు అడుగుతున్నారు? వేసవి సెలవుల్లోనే బదిలీలు పూర్తి చేసి విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విధుల్లో చేరాలి కదా.. ఇప్పుడు గడువు కోరితే ఏడాది పొడవునా చేస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి గంటా బదులిస్తూ.. తమ ప్రిన్సిపల్ సెక్రటరీ 15 రోజులు సెలవుపై వెళ్లారని, అందువల్లే బదిలీలు చేపట్టలేకపోయామన్నారు. ‘‘నాకు సాకులు కాదు.. పని కావాలి’’ అని అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాను వచ్చి వ్యక్తిగతంగా కలుస్తానని గంటా అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా మాట్లాడలేదు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బదిలీలు ఉండాలని, మాట వినే వారికే పోస్టింగ్ ఇవ్వాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల కలెక్టర్లు, ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడలేదని వారు చెబుతున్నారు. ఇన్ని రోజులూ ఉద్యోగుల బదిలీల విషయంలో మంత్రుల జోక్యం అంతగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలతో కంగుతిన్నారు. కలెక్టర్లు కోరిన అధికారులను కీలక పోస్టుల్లో నియమించి, పరిపాలనలో సత్ఫలితాలు సాధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ భావించారు. ఇందులో భాగంగా బదిలీల ఫైళ్ల ను మంత్రుల ఆమోదం కోసం సోమవారం పంపారు. అయినా మంత్రుల నుంచి ఆ ఫైళ్లు వెనక్కి రాలేదు. -
ఏపీ రెసిడెన్షియల్ ప్రవేశ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వివిధ తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల ఫలితాలను మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. సొసైటీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో 3,904 సీట్లకుగాను 23,609 మంది ఐదో తరగతిలో ప్రవేశానికి పరీక్షలు రాశారు. వీరిలో 90.54 శాతం ఉత్తీర్ణులయ్యారు. పది జూనియర్ కాలేజీల్లో 1,425 సీట్లుండగా 56,083 మంది పరీక్ష రాశారు. వీరిలో 83.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీ కాలేజీల్లో 432 సీట్లుండగా 5,792 మంది పరీక్ష రాయగా 82.33 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీ ఆర్జేసీ సెట్లో టాపర్లు వీరే ఏపీ ఆర్జేసీ సెట్లో 150 మార్కులకుగాను ఎంపీసీ విభాగంలో మహ్మద్ ఖమర్ ఝా (పశ్చిమగోదావరి) ఎస్.వెంకటసాయి గోకుల్ (నెల్లూరు), జె.విజయపాల్ (ప.గో.) 146 మార్కులు చొప్పున సాధించి మొదటి మూడు ర్యాంకులు పొందారన్నారు. బైపీసీలో బి.దుర్గాభవాని (ప.గో.) 145, కె.జాహ్నవి (శ్రీకాకుళం) 143, జి.హేమంత్‌కుమార్ (అనంతపురం) 141 మార్కులతో మొదటి మూడు ర్యాంకులు సాధించారు. ఎంఈసీలో డీఏవీ పద్మరాజు (గుంటూరు) 138, ఎం.సంపత్‌కుమార్ (ప.గో.) 137, వి.దిలీప్ వర్మ (ప.గో.) 136 మార్కులతో మొదటి మూడు ర్యాంకులు సాధించినట్లు మంత్రి వివరించారు. ఏపీ ఆర్జేసీ సెట్లో ఆర్ట్స్, కామర్స్, ఫిజికల్ సైన్స్, లైఫ్‌సెన్సైస్ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి పేర్లను మంత్రి ప్రకటించారు. -
ఏపీఆర్జేసీ ఫలితాలు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షా ఫలితాలను మంగళవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్షా ఫలితాలు ఉన్నాయి. మార్కుల ఫలితాల ఆధారంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ప్రైవేట్ కాలేజీలకు నీట్ నుంచి మినహాయింపు లేదన్నారు. ప్రైవేట్ కాలేజీలో సీటుకు నీట్ తప్పనిసరిగా రాయాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులను నీట్‌కు సిద్ధం చేస్తామని చెప్పారు. -
డీఎస్సీ ఫలితాల తుది షెడ్యూల్ విడుదల
♦ 26న సర్టిఫికెట్ల పరిశీలన.. 28న తుది జాబితా ♦ 29, 30, 31 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ ♦ జూన్ 1న అభ్యర్థులకు నియామక పత్రాలు: గంటా సాక్షి, విజయవాడ బ్యూరో: డీఎస్సీ-2014 ఫలితాల తుది షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 1న నియామక పత్రాలు అందిస్తామని చెప్పారు. ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2014లో టెట్, టెర్ట్(డీఎస్సీ) నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. కోర్టు కేసుల వల్ల వాటి తుది ఫలితాలను ప్రకటించలేకపోయామని అన్నారు. న్యాయపరమైన అన్ని అంశాలు పరిష్కారం కావడంతో డీఎస్సీ-2014 ఫలితాల ఫైనల్ షెడ్యూల్‌ను విడుదల చేసినట్టు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న జరుగుతుందన్నారు. 28న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. వారికి ఈ నెల 29, 30, 31 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి జూన్ 1న నియామక పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో నియామక పత్రాలు అందజేసి, జూన్ 2 నుంచి శిక్షణ ఇస్తామన్నారు. ‘నీట్’పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో 23 రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయని, ఈ ఏడాదికి ఎంసెట్ ప్రాతిపదికగా ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయాలని ప్రతిపాదించాయని వివరించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి, సుప్రీంకోర్టుకు తీర్పునకు లోబడి, ఎంసెట్ ఫలితాలను బట్టి ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. -
రేపు సాయంత్రం ఏపీ ఎంసెట్ ఫలితాలు
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ప్రవేశ పరీక్షా-2016 ఫలితాలను ఈనెల 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తొలుత 9న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని తెలపగా, నీట్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పును చెప్పనుండడంతో ఫలితాలను సాయంత్రం విడుదల చేస్తామని చెప్పారు. 10న ఉదయం విడుదల కానున్న టెన్త్ ఫలితాలు : పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 10న ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. విశాఖ ఆంధ్రా వర్సిటీ సెనెట్ హాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
ఉత్తీర్ణత 82.32 శాతం మహారాణిపేట/బాలాజీచెరువు (కాకినాడ)/ కాతేరు (రాజమహేంద్రవరం రూరల్)/తణుకు టౌన్: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2016 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఏయూ సెనేట్ హాల్లో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, మీసాల గీత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మిలతో కలసి ఫలితాల సీడీలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 82.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు కన్నా బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తొలి 25 ర్యాంకులు ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ప.గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలి వెన్నుకి చెందిన మట్టా వెంకట శేషుతేజ్ ప్రథమస్థానం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ససనపూరి శ్రీరామ్గుప్తా రెండో ర్యాంక్, తూ. గోదావరి జిల్లాకు చెందిన మేరుగు వెంకట రోహిత్ మూడో ర్యాంకు సాధించారు. -
మళ్లీ బాలికలదే హవా
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అగ్రస్థానం సాక్షి, విజయవాడ బ్యూరో: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలా బాలికలే అగ్రస్థానంలో నిలిచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండింటిలోనూ వారిదే పైచేయిగా ఉంది. ఫస్టియర్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలు 8.07 శాతం, సెకండియర్ ఫలితాల్లో 5.31 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండూ ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి. ఫస్టియర్‌లో 68.05 శాతం మంది, సెకండియర్‌లో 73.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇంటర్లో 58.29 శాతం మందికి ‘ఏ’ గ్రేడ్ ఫస్టియర్ ఇంటర్ పరీక్షలకు మొత్తం 4,67,747 మంది విద్యార్థులు హాజరవగా వారిలో 3,18,300 (68.05 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 1,85,538 (58.29 శాతం) మంది ‘ఏ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 57.46 శాతం మందికి ‘ఏ’ గ్రేడ్ సెకండ్ ఇంటర్లో మొత్తం 4,11,941 మంది పరీక్షలు రాయగా 3,03,934 (73.78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 1,74,649 (57.46 శాతం) మంది ‘ఏ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మార్కుల జాబితాలను కాలేజీల ప్రిన్సిపాల్స్ 23వ తేదీన ఆర్‌ఐఓల నుంచి తీసుకుని విద్యార్థులకు అందించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సత్యనారాయణ ఆదేశించారు. మార్కుల జాబితాలో ఏవైనా తేడాలు వస్తే సంబంధిత ప్రిన్సిపాల్స్ ద్వారా మే 18వ తేదీలోపు బోర్డు స్వీకరిస్తుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపులను ఈ నెల 26వ తేదీ వరకూ స్వీకరిస్తారు. ఆ తర్వాత పెనాల్టీ ద్వారా చెల్లింపులకు అవకాశం లేదు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24వ తేదీ నుంచి జరుగుతాయి. రీ కౌంటింగ్‌కు ఈ నెల 26వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రతి పేపర్‌కు రూ.120 చొప్పున ఫీజు చెల్లించాలని సత్యనారాయణ చెప్పారు. అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనవారు బెటర్మెంట్ పరీక్షలకు హాజరయ్యేందుకు రూ.120 ఫీజు చెల్లించాలి. ఫస్ట్ ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు పాసైన సబ్జెక్టులకు ఫెయిలైన సబ్జెక్టులతోపాటు పరీక్షలు రాయొచ్చని, ఇలా రాసిన వారి తాజా ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. రెండు ఫలితాలూ ఒకేసారి ఇదే ప్రథమం: గంటా ఇంటర్ ఫలితాల చరిత్రలో మొదటిసారిగా ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్ని ఒకేసారి విడుదల చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ సిలబస్ మార్పు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి గంటా మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంటర్ సిలబస్ మార్పుపై కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రం చెప్పారు. ‘కృష్ణా’కు మళ్లీ అగ్రపీఠం కొన్నేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న కృష్ణాజిల్లా ఈసారీ ఆ స్థానాన్ని పదిలపర్చుకుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ కృష్ణాజిల్లా టాప్‌లో నిలిచింది. ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా విద్యార్థులు 81 శాతం ఉత్తీర్ణత సాధించగా రెండో సంవత్సర ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో 72 శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం జిల్లా రెండో స్థానంలో నిలవగా 71 శాతం ఉత్తీర్ణతతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మూడోస్థానంలో నిలిచింది. 57 శాతం ఉత్తీర్ణతతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో నెల్లూరు రెండో స్థానాన్ని దక్కించుకోగా, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలు మూడో స్థానాన్ని పంచుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా 65 శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది. -
వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో ఎంసెట్: గంటా
సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అన్ని సెట్లు ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో 13 జిల్లాల ఎంసెట్ సమన్వయకర్తలు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఎంసెట్ పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. -
మంత్రి గంటాపై కేసు ఎత్తివేతకు రంగం సిద్ధం!
విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావుపై తుమ్మపాల షుగర్స్ ఆందోళన మిషయమై కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధమయ్యింది. ఇది ప్రజా పోరామంటూ మంత్రిపై కేసులు ఎత్తివేయాలని సిఫార్సులు అందాయి. 2009, జనవరి 11న తుమ్మపాల షుగర్స్ ఆధునీకరణ, బకాయిల చెల్లింపుల విషయమై రైతులు ఆందోళన చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోనకారులు పోలీసుల మీద రాళ్లు రువ్వవడంతో అప్పట్లో కేసు పెట్టారు. ఎమ్మెల్యే గంటాను 11వ నెంబరు ముద్దాయిగా ఈ కేసులో నమోదు చేశారు. అయితే ఎ1 అవ్వాల్సిన గంటాను మంత్రి జోక్యంతో ఎ 11గా చేర్చారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గంటాను అబ్స్కాండెడ్ అని చూపించారు. ఇటీవల ఈ కేసు విషయమై హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో గంటాపై కేసు ఎత్తేయడానికి సిఫార్సు వచ్చింది. రైతులపై పెట్టిన కేసుల గురించి పట్టించుకోకుండా కేవలం మంత్రిపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆయనొక్కరిపైనే కేసులు ఎత్తివేస్తే తమ పరిస్థితి ఏంటని ఏమవుతామని రైతులు ప్రశ్నిస్తున్నారు. కార్మిక నాయకులు, రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులు కూడా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
యూనిఫామ్‌లు వెంటనే అందించండి
ప్రాజెక్టు అధికారులకు మంత్రి గంటా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు సకాలంలో అందేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆయా జిల్లాల సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయమై ఆదివారం ‘సాక్షి’లో కథనానికి మంత్రి గంటా, కార్యదర్శి స్పందించారు. యూనిఫారాల పంపిణీ ఆలస్యంమవడంతో జిల్లా పీఓలు, శాఖాధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ముగిసేలోపు ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. -
జనం సొమ్ముతో జాతర
రేపటి నుంచి విశాఖ ఉత్సవ్ రూ.కోటి ప్రకటించినా పైసా విదల్చని సర్కార్ ముందుకు రాని దాతలు.. బలవంతంగా వసూళ్లు విశాఖపట్నం: సొమ్మొకడిది.. సోకొకడది..అన్నట్టుగా ఉంది సర్కార్ తీరు. విశాఖ ఉత్సవాలకు సర్కార్ రూ.కోటి ప్రకటించినా నేటికీ ఒక్క పైసా విడుదల కాలేదు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఉత్సవాలకు చేయూతనిచ్చేందుకు పారిశ్రామిక సంస్థలు, దాతల నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదు. అయినా సరే జనం సొమ్ముతో జాతర చేసేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. అన్నీ అనుచరగణానికే నూతన సంవత్సరం తొలిరోజైన జనవరి ఒకటో తేదీన విశాఖ సాగరతీరంలో శ్రీకారం చుట్టుకోనున్న ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు జరగనున్నాయి. రాష్ర్ట ఉత్సవాలుగా నిర్వహిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సర్కార్ రూ.కోటి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. కానీ ఉత్సవాల ప్రారంభానికి మరో 48 గంటలలే మిగిలి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మరోపక్క గత ఏడాదితో పోలిస్తే దాతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. అన్నీ అరువు బేరాలే అన్నట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పారదర్శకత పేరుతో టెండర్ల నాటకమాడినా చివరకు ఈవెంట్స్, పనులన్నీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరగణం దక్కించుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఐఐఎం శంకుస్థాపనకు అయిన ఖర్చు అరకోటి. స్వాతంత్య్ర వేడుకలకు అయిన ఖర్చు రూ.అర కోటి. ఏడాది తర్వాత ఐఐఎం శంకు స్థాపన సొమ్ములు అరకొరగా విడుదలైనా.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ల నిధులు నేటికీ విడుదల కాలేదు. గత ఏడాది అట్టహాసంగా జరిగిన విశాఖ ఉత్సవాల్లో ప్రదర్శనలిచ్చిన కళాకారులకు నేటికీ చెల్లింపులు జరగలేదు. రూ.30 లక్షలకుపైగా చెల్లింపులు జరగాల్సి ఉంది. పాత బకాయిలకే దిక్కులేని పరిస్థితుల్లో ఈసారి ఉత్సవాలకు ఏకంగా మూడున్నర కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సర్కార్ కోటి ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అధికారులు మిగిలిన రెండున్నర కోట్లు దాతల నుంచి కూడగట్టాలని ప్రణాళికలు రచించారు. ఈ వంకతో మరో రూ.కోటికి పైగా దండుకోవాలని అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వుడా, జీవీఎంసీలపై భారం మోపారు. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా వుడాకే అప్పగించడంతో కొంత మేర ఆర్ధిక భారం మోసేందుకు వుడా సిద్ధమైంది. మరో పక్క ఆర్ధిక లోటుతో సతమతవుతున్న జీవీఎంసీ మాత్రం నిధులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. కావాలంటే తమ సిబ్బంది ద్వారా పనులు చేయిస్తాం తప్ప నిధులు సమకూర్చలేమని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ విలేకర్ల సమావేశంలోనే స్పష్టం చేశారు. హుద్‌హుద్ తో తీవ్రంగా నష్టపోయిన పారిశ్రామిక సంస్థల నుంచి గత ఏడాది ముక్కుపిండి మరీ విరాళాలు వసూలు చేశారు. ఈ ఏడాది ఆ స్థాయిలో వీరి నుంచి సహకారం లభించడం లేదని ఉత్సవాల నిర్వహణ కమిటీలో ఉన్న కీలకాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి తోడు గడిచిన ఏడాదిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి బకాయిలు రూ.1.50 కోట్ల వరకు పేరుకుపోవడంతో ఉత్సవాల్లో పాలు పంచుకునేందుకు గతంలో ఉత్సాహం చూపిన సంస్థలు ఈసారి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. మరోపక్క మంత్రి పంపించారు.. ఉత్సవాలకు ఇవ్వాల్సిందేనంటూ కొంతమంది అధికారులు పారిశ్రామిక సంస్థల నుంచి బలవంతంగా వసూలు చేసినట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారికంగా ఇప్పటికే రెండు కోట్లకు పైగా దండినట్టు తెలుస్తోంది. జనం సొమ్ముతో మరోసారి జాతర చేసేందుకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. -
'21న అసెంబ్లీలో ప్రైవేటు వర్సిటీల బిల్లు'
మహారాణిపేట (విశాఖపట్నం) : ఈ నెల 21న శాసనసభలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విశాఖలో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ వీసీల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్ని వర్సిటీల్లో ఒకే విధానం కోసం ఈ బిల్లును తీసుకురానున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో న్యాయమైన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రైవేటు వర్సిటీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. -
అడ్రస్ ఏదీ?
నేటికీ అందని యూనిఫాం విద్యార్థుల ఎదురుచూపులు అధికార పార్టీ నేతల అడ్డంకులే కారణం పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు యూనిఫాం అందజేస్తాం. ఇకపై ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం... (గతేడాది వేసవి సెలవులకు ముందు విద్యార్థులకు యూనిఫాం అందజేస్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన ఇది.) ప్రస్తుత పరిస్థితి : విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలవుతున్నా ఇంకా యూనిఫాంలు అందజేయలేదు. ఇప్పట్లో అందే పరిస్థితి కూడా కనిపించడంలేదు. విశాఖపట్నం : ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల స్వార్థం విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాల విద్యార్థులకు ఏటా ఇచ్చే యూనిఫాం పంపిణీ మొక్కుబడి తంతే అవుతోంది. పాఠశాలలు తెరచుకుని ఆరు నెలలు పూర్తయినా అవి అందకపోవడంలో వీరి పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్కూళ్లలో చదివే వారిలో పేదలే అధికంగా ఉన్నందున ఒకటి నుంచి 8వ తరగతుల వారికి సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ఏటా ఉచితంగా రెండు యూనిఫాం ఇస్తోంది. ఈ సంవత్సరం జిల్లాలో 2,36,218 మంది పిల్లలకు రెండు జతల చొప్పున 4,72,436 యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి బడులు తెరిచిన కొద్దిరోజులకే వీటిని పంపిణీ చేయాలి. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వారికే కుట్టు పనులు దక్కించుకోవాలని పట్టుపట్టడంతో ఇన్నాళ్లూ యూనిఫాం ప్రక్రియ నిలిచిపోయింది. పనిచేయని నేతల ఎత్తులు : గత ఏడాది ఇలా కొందరు ప్రజాప్రతినిధులు బల్క్‌గా తమ అనుయాయులకు చేజిక్కించుకున్నారు. ఒక్కో జతకు కుట్టుకూలి కింద ప్రభుత్వం రూ.40 చెల్లిస్తుంది. ఇందులో జతకు రూ.5 వరకు కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ సంవత్సరం కూడా అదే తీరులో వ్యవహారం నడపాలని చూశారు. అందుకు ఎన్నో ఎత్తుగడలు వేశారు. చివరకు నవంబర్ 28న సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ రాజకీయాలకు అతీతంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు అభీష్టం మేరకు టైలర్లకు ఇవ్వవచ్చని ఆదేశాలిచ్చారు. దీంతో యూనిఫాంపై కదలిక వచ్చి ఆప్కో వస్త్రాలను ఆయా స్కూళ్లకు పంపడం మొదలెట్టారు. ఇప్పటిదాకా 70 శాతం వస్త్రాల పంపిణీ జరిగింది. మిగిలింది పంపిణీకి కనీసం మరో 15 రోజులైనా పడుతుంది. యూనిఫాం అందజేయకపోవడంతో చాలామంది సివిల్ డ్రెస్‌తో రోజు స్కూలుకు వెళ్లి వస్తున్నారు. సంక్రాంతి రద్దీలో దర్జీలు సంక్రాంతి పండగ సమీపిస్తున్నందున ప్రస్తుతం దర్జీలంతా రద్దీగా ఉన్నారు. దీంతో ఈ స్కూల్ యూనిఫాం కుట్టు మొదలెట్టడానికి మరో నెలరోజులకు పైగానే పట్టనుంది. అన్నీ సవ్యంగా జరిగితే వీటి కుట్టు పూర్తి కావడానికి, పంపిణీకి రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మార్చి నాటికి గాని బడి పిల్లలకు దుస్తుల అందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది కూడా వేసవి సెలవులకు ముందు వీటిని పంపిణీ చేశారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ సదస్సులో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచిన వెంటనే యూనిఫాంలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కానీ మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది! సత్వరమే అందేలా చూస్తా.. బడి పిల్లలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ సత్వరమే జరిగేలా చూస్తాం. అన్ని జిల్లాల్లోనూ దుస్తుల పంపిణీ ఆలస్యమవుతోంది. యూనిఫాంలకు అవసరమైన వస్త్రాలు కొన్నాళ్ల క్రితమే వచ్చాయి. చాలావరకు వాటిని ఆయా స్కూల్ మేనేజిమెంట్ కమిటీల (ఎస్‌ఎంసీల)కు పంపించేశాం. మిగిలినవి కూడా త్వరలోనే అందజేస్తాం. -టి.శివరామ్‌ప్రసాద్, పీవో, సర్వశిక్షా అభియాన్ -
అగ్గి ‘రాజు’ కుంది!
టీడీపీ, బీజేపీల సిగపట్లు రాజధానికి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల పయనం నేడు సీఎంకు ఫిర్యాదు విశాఖపట్నం: టీడీపీ-బీజేపీల మధ్య అగ్గిరాజుకుం ది. ఇప్పటికే ఈ రెండు పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీతోపాటు ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న బీజేపీని నగరంలో రోజురోజుకు బలహీనపర్చడమే లక్ష్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు బృందం చేస్తున్న రాజకీయాలను కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ఎంపీ కె.హరిబాబు, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖ-ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాటలకు మంత్రులే కాదు.. జిల్లా అధికారులు కూడా ఏ మాత్రం విలువనివ్వడం లే దని ఆ పార్టీనేతలు గుర్రుగా ఉన్నారు. మిత్ర ధర్మానికి విరుద్ధంగా టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయాలు, జరుగుతున్న పరిణామాలపై ఇటీవల పలు వేదికలపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే బాహాటంగానే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం మీడియా సమక్షంలోనే మంత్రి గంటా, విష్ణుకుమార్రాజుల మధ్య జరిగిన సంవాదం ఈ రెండు పార్టీల మధ్య అగాథం ఏ స్థాయికి చేరుకుందో కళ్లకు కట్టింది. ఆ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు గణబాబు, పీలా గోవిందలు విష్ణుకుమార్‌రాజుపై ఎదురుదాడి చేశారు. ఈ రెండు పార్టీల మధ్య ముదురుతున్న విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరాయి. జిల్లాలో ఇరు పార్టీల నేతల మధ్య కొరవడిన సమన్వయం, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కేటాయింపులో మంత్రులు, అధికారుల తీరుపై శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు విజయవాడ పయనమయ్యారు. బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులు పార్టీ ముఖ్యనేతలతో కలిసి శనివారం సీఎంను కలవనున్నారు. నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో తమను భాగస్వామ్యం చేయడం లేదని.. చివరకు కేంద్ర నిధులతో చేపట్టే కార్యక్రమాల విషయంలోనూ తమను పట్టించుకోవడం లేదని సీఎంకు వివరించనున్నట్టు సమాచారం. ఇంతకంటే వివక్ష ఉంటుందా? గత 18 నెలల్లో నగరంలో టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్ని కోట్ల విలువైన పనులు జరిగాయి? నా నియోజకవర్గంలో ఎన్ని కోట్ల పనులు జరిగాయో చూడండి. మీకే అర్ధమవుతుంది. ఇంతకంటే వివక్ష మరొకటి ఉంటుందా? తూర్పు నియోజకవర్గంలో రూ.80 కోట్లు, పశ్చిమలో రూ.32 కోట్లు, దక్షిణంలో రూ.70 కోట్లు, గాజువాకలో రూ.40 కోట్లు, పెందుర్తిలో ఏకంగా 120 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. నా ఉత్తర నియోజకవర్గంలో రూ.50 కోట్ల విలువైన పనులు ప్రతిపాదిస్తే కేవలం రూ. 4.02 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. నేను ఇచ్చిన ప్రతిపాదనలపై జీవీఎంసీ కమిషనర్‌కు 50కు పైగా ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు. ఈ విషయాలనే సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించా. ఎంపీతో కలిసి సీఎంకు ఫిర్యాదు చేస్తా. -విష్ణుకుమార్‌రాజు, ఉత్తర ఎమ్మెల్యే -
ఇక ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు వర్సిటీల బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రతినిధులతో గురువారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్సిటీల విధానం అమలవుతోందని, దేశంలోని మొత్తం 732 యూనివర్సిటీల్లో రెండు వందలకుపైగా ప్రైవేటు యూనివర్సిటీలేనని చెప్పారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఏపీలో ప్రముఖ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్నారు. నిర్ణయం తీసుకుని చర్చలేంటి? ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతిస్తూ బిల్లు తేవాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకున్న తర్వాత తమతో చర్చలు జరపడం సరికాదని ప్రోగ్రెసివ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, ఏవీఎస్ శర్మ, గేయానంద్, వై.శ్రీనివాస్‌రెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి గంటాతో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బిల్లు విషయంలో ముందే తమతో చర్చించి ఉంటే ఉన్నత విద్యావ్యవస్థ పటిష్టతకు మరింత ఉపయోగం ఉండేదన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1700 పోస్టులు భర్తీ చేయకపోవడంతో కేంద్ర నుంచి ఆర్యుఎస్ఎం, యూజీసీ నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీచేయకుండా, నిధులు సమకూర్చకుండా, వాటిని పటిష్టం చేయకుండా నిర్లక్ష్యం చేసి ఉన్నత విద్యను కూడా ప్రైవేటీకరణ చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. -
బీజేపీ వర్సెస్ టీడీపీ
కేజీహెచ్ సమస్యలను లేవనెత్తిన ఎమ్మెల్యే విష్ణు ఆయనపై మూకుమ్మడి దాడిచేసిన టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే మాట్లాడుకోమన్న మంత్రి గంటా భగ్గుమన్న టీడీపీ, బీజేపీ విభేదాలు కేజీహెచ్‌ను స్మార్ట్‌గా చేయండి చాలు: ఎమ్మెల్యే విష్ణు సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేజీహెచ్ సమస్యలను ప్రస్తావించారు. ‘విశాఖను స్మార్ట్‌సిటీగా చేస్తామంటున్నారు. మీకో దండం పెడతాను. ముందు కేజీహెచ్‌ను స్మార్ట్‌గా చేయండి. కేజీహెచ్‌కు నర్సింగ్స్టాఫ్ను ఎప్పుడు ఇస్తారు? ’అని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు నేరుగా మంత్రి గంటాను ప్రశ్నించారు. అసెంబ్లీలోనే మాట్లాడుకో: మంత్రి గంటా దీనికి మంత్రి గంటా జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘డిసెంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా. అక్కడే సార్ట్ క్వశ్చన్ కింద అడుగు. ఇక్కడ ఎందుకు?’అని కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విశాఖపట్నం: కేజీహెచ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు... ఆయనపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ ఇవ్వాలనే విషయాన్ని వదిలేయాలని చెప్పిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి... ఏదైనా అసెంబ్లీలోనే మాట్లాడుకో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన మంత్రి గంటా... జిల్లాలో తీవ్రతరమవుతున్న టీడీపీ, బీజేపీ మిత్రబేధంలో తాజా పరిణామాలు ఇవీ... జీవీఎంసీ వేదికగా టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. స్మార్ట్‌సిటీ అంశంపై జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కేజీహెచ్‌లో సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని సూటిగా ప్రశ్నించారు. దాంతో సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు గణబాబు, పీలా గోవింద సత్యన్నారాయణ ఆయనపై ఎదురుదాడి చేశారు. కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ ఎందుకు కేటాయించరు అన్న ఎమ్మెల్యే విష్ణు డిమాండ్‌పై ఎమ్మెలీ ఎంవీవీఎస్ మూర్తి కలకవరపడ్డారు. చివరగా స్పందించిన మంత్రి గంటా ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావించుకోమని నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించడం అందర్నీ విస్మయపరిచింది. ఈ సమావేశంలో జరిగిన వాడివేడీ సంభాషణలు ఇలా ఉన్నాయి.. మీ మంత్రిని అడగండి: ఎమ్మెల్యేలు గణబాబు, పీలా బీజేపీ ఎమ్మెల్యే కేజీహెచ్ సమస్యలను ప్రస్తావించగానే టీడీపీ ఎమ్మెల్యేలు గణబాబు, పీలా గోవిందు సత్యనారాయణ ఒక్కసారిగా ఆయనపై ఎదురుదాడి చేశారు. ‘ హెల్త్ మినిస్టర్ మీ వాడే కదా. ఆయన్నే అడగండి. ఇక్కడ మాట్లాడొద్దు’అని కాస్త కటువుగా సమాధానం చెప్పారు. కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ ఎప్పుడిస్తారు? కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీని మంజూరు చేయని అంశాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేవనెత్తారు. ‘అన్ని వసతులు ఉన్నప్పటికీ కేజీహెచ్‌కు డెంటల్ కాలేజి ఎందుకు ఇవ్వడం లేదు. ఎవరికి ప్రయోజనం కలిగించడానికి ఇలా చేస్తున్నారు?’అని సూటిగా ప్రశ్నించారు. ఆ విషయం ఎత్తొద్దయ్యా..కూర్చో: మూర్తి కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ అంశాన్ని లేవనెత్తగానే టీడీపీ ఎమ్మెల్యే ఎంవీవీఎస్ మూర్తి గతుక్కుమన్నారు. ఎందుకంటే ఆయన కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలకు డెంటల్ కాలేజీ ఉంది కదా. ఎమ్మెల్సీ మూర్తి వెంటనే స్పందిస్తూ ‘ కేజీహెచ్‌కు డెంటల్ కాలేజీ విషయం ఇప్పుడు ఎందుకు?...నువ్వు ముందు కూర్చో. ఆ విషయం వదిలేయ్’అని అన్నారు. ఈ తాజా పరిణామాలు టీడీపీ, బీజేపీల మధ్య విబేధాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే ప్రజాసమస్యలను లేవనెత్తితే టీడీపీ మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఆయనపై ఎదురుదాడి చేయడం అధికారులను విస్మయపరిచింది. బీజేపీ ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే... ఇక సామాన్య కార్యకర్తల గతేమిటని గుసగుసలాడుకున్నారు. -
మోసపోయాం..న్యాయం చేయండి
మంత్రికి విన్నవించిన డీఎడ్ విద్యార్థులు ఏఎన్‌యూ : తమకు అవగాహన లేక ప్రభుత్వ అనుమతి లేని కళాశాలల్లో చేరి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని డీఎడ్ విద్యార్థులు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావును కోరారు. ర్యాగింగ్‌పై సమీక్ష జరిపేందుకు మంగళవారం ఏఎన్‌యూకు వచ్చిన మంత్రిని డీఎడ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారామని, దయ చేసి న్యాయం చేయాలని మంత్రి కాళ్లు పట్టుకుని కన్నీరు పెట్టారు. ఒక్కొక్కరం రూ.లక్షా ముప్పై వేల నుంచి లక్షా ఎనభై వేల వరకు కళాశాలల యాజమాన్యాలకు చెల్లించామని మంత్రికి తెలిపారు. డీఎడ్ కోర్సు రెండో సంవత్సరంలో ఉన్నామని ఇప్పుడు పరీక్షలు రాయనీయకపోతే మా జీవితాలు ప్రశ్నార్థకంగా మారతాయని వివరించారు. పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ అనుమతి లేని కళాశాలల్లో చదివే విద్యార్థులను పరీక్షకు అనుమతించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కానీ డీఎడ్ విద్యార్థుల జీవితాలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుందనే దానిపై న్యాయ సలహా అడిగామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో డీఎడ్ విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. -
కమిటీలతో కాలక్షేపం!
ఏఎన్‌యూలో విద్యార్థి సంఘాల మండిపాటు ర్యాగింగ్‌పై కఠిన చర్యలకు పూనుకోవడం లేదని ఆవేదన వ్యవస్థలో లోపాలు సరిదిద్దకుండా ర్యాగింగ్‌ను నిరోధించలేమని స్పష్టీకరణ ఇవే విషయాలపై మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశ్నించిన సంఘాల నేతలు గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి బలవన్మరణంపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, తాజాగా అదే కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ద్విసభ్య కమిటీని వేస్తున్నట్టు ప్రకటించడాన్ని విద్యార్థి సంఘాలు ఆక్షేపించాయి. ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ కళాశాలలో తాజాగా సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి గంటా స్పందించి మంగళవారం వర్సిటీకి విచ్చేసి అధికారులతో సమావేశమ య్యారు. దీనిపై శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉదయలక్ష్మిలతో ద్విసభ్య కమిటీ వేస్తున్నట్టు చెప్పి, నివేదిక ఇవ్వాలంటూ మంత్రి ఆదేశించారు.అయితే , కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి, పదే పదే ర్యాగింగ్‌కు కారణాలు ఏమిటి? అనే విషయాలను పరిశీలించకుండా కేవలం కమిటీలు వేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం చెందుతున్నాయి. వీటివల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని, బాధ్యులపై కేసులు నమోదు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక మేరకు వర్సిటీలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సీసీ కెమెరాలు, విద్యార్థులకు ఐడీ కార్డులు, ర్యాగింగ్ నిరోధక బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప, వ్యవస్థలో ఉన్న లోపాలపై దృష్టి సారించలేదంటున్నారు. ఈ కారణంగానే ర్యాగింగ్ పునరావృతమవుతోందని చెపుతున్నారు. యూనివర్సిటీలో కనిపించని ఇన్చార్జి వీసీ విద్యార్థిని రిషితేశ్వరి ఘటన అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బి.ఉదయలక్ష్మిని ఇన్చార్జి వీసీగా నియమించారు. మొదట్లో రెండు, మూడు రోజులపాటు హడావుడి చేసిన ఆమె ఆ తరువాత వర్సిటీలో కనిపించ లేదు. వారంలో మూడు రోజులు ఏఎన్‌యూలో ఉండి ర్యాగింగ్ వంటి కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన ఆమె ఈ వంద రోజుల్లో పట్టుమని పది రోజులు కూడా వర్సిటీకి రాలేదు. ఇన్చార్జి వీసీ సక్రమంగా రావడం లేదని, కొత్త వీసీని నియమించాలని కొందరు విద్యార్థులు ఈ సందర్భంగా మంత్రి గంటా దృష్టికి తెచ్చారు. ర్యాగింగ్‌పై నోరు మెదపని మంత్రి ... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధికారులు, విద్యార్థులతో సమావేశమైన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ జరుగుతున్న ర్యాగింగ్‌పై మాత్రం నోరు మెదపలేదు. పైగా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరిగిందని, ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నేతలు కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ర్యాగింగ్ ఆగదని, వ్యవస్థలో లోపాలను సరిదిద్దకుండా ర్యాగింగ్‌ను ఎలా నిరోధిస్తారంటూ మంత్రిని ప్రశ్నించారు. ర్యాగింగ్ జరిగినప్పుడల్లా కమిటీల పేరిట కాలయాపనచేయడం మినహా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం ఢిల్లీలో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మరో రెండు కార్యక్రమాల్లో పాల్గొం టారు. వీలునుబట్టి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి అక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. రాత్రికి అక్కడే బస చేసి ఐదో తేదీన అక్కడి నుంచి బెంగుళూరు వెళ్లి భారత పరిశ్రమల సమాఖ్య సమావేశంలో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు. -
ఏయూ క్యాంపస్ లో మంత్రి గంటా తనిఖీలు
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతోందంటూ మీడియాలో ఆరోపణలు రావడంతో.. ఆంధ్ర ప్రధేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపస్ లో తనిఖీలు నిర్వహించారు. ర్యాగింగ్ ఆరోపణలపై వర్సిటీ అధికారులు, విద్యార్థుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ర్యాగింగ్ చట్టాన్ని పటిష్టం చేశామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ను ర్యాగింగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా.. సీనియర్ ల నుంచి వేధింపులు ఎదుర్కొన్న విధ్యార్థులు మీడియాను ఆశ్రయించినట్లు తెలిసిందని.. వారు తమకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు చేపడతాం అని గంటా తెలియజేశారు. -
మంత్రుల మధ్య ఆధిపత్య పోరు
డీఆర్ఓ పోస్టు కోసం జోరుగా పైరవీలు తాజాగా తెరపైకి కిషోర్‌కుమార్ నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) నియామకం కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకటో కృష్ణుడు.. రెండో కృష్ణుడు అంటూ నెలకో పేరు తెరపైకి వస్తున్నా... భర్తీ మాత్రం జరగడం లేదు. మంత్రుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు తోడు ఉన్నతాధికారుల వైఖరి కూడా కొత్త డీఆర్ఓ రాకకు బ్రేకులేస్తున్నాయి. విశాఖపట్నం : డీఆర్ఓ పోస్టు కోసం జిల్లాలో గతంలో పనిచేసిన పలువురు అధికారులు తమదైన రీతిలో పైరవీలు సాగించారు. ఏజేసీగా పనిచేసిన జేఎల్ నరసింహారావు, జెడ్పీ సీఈఓగా పని చేసిన మహేశ్వరరెడ్డి కూడా ఈ పోస్ట్ కోసం ప్రయత్నం చేశారు. మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికార్లు సైతం మోకాలడ్డడంతో నరసింహారావు చివరకు ఆర్ అండ్ ఆర్ ఎస్డీసీ పోస్టుతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. డీఆర్ఓగా వచ్చేందుకు మహేశ్వరరెడ్డి ఆశించినప్పటికీ ఇటీవలే బదిలీపై వెళ్లడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కడప జేసీ-2గా పనిచేస్తున్న సి.చంద్రశేఖరరెడ్డిని విశాఖ డీఆర్ఓగా నియమిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రి అయ్యన్న సిఫార్సుతో జరిగిన చంద్రశేఖరరెడ్డి నియామకానికి మంత్రి గంటా శ్రీనివాసరావు మౌఖిక ఆదేశాలతో బ్రేకు పడింది. ఇంతలో విశాఖ ఆర్డీఓ వెంకటేశ్వర్లును డీఆర్ఓగా గత నెల 15న ప్రభుత్వం నియమించింది. మంత్రి అయ్యన్న చేసిన ఈ ప్రయత్నానికి గంటా మరోసారి అడ్డుపుల్ల వేయడంతో 24 గంటలు తిరక్కుండానే ఈ ఉత్తర్వులను అబియన్స్‌లో పెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు విడుదల చేసింది. చివరకు చంద్రశేఖరరెడ్డి రాక పట్ల గంట సుముఖంగానే ఉన్నారని అనుకున్నంతలోనే.. ఆయనను హైదరాబాద్ భూపరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. కిషోర్ కోసం గంటా యత్నాలు : తాజాగా వుడా కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన జి.కిషోర్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఈయ న్ని డీఆర్ఓగా తీసుకొచ్చేందుకు మంత్రి గంటా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సిటీపై ఆధిపత్యం చలాయిస్తున్న మంత్రి గంటా డీఆర్ఓగా కిషోర్ వస్తే ఆయన్ని అడ్డం పెట్టుకుని రూరల్‌లో కూడా తన హవా సాగిస్తారన్న ఆందోళన అయ్యన్న వర్గంలో వ్యక్తమవుతోంది.తరచూ విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతుండడంతో ప్రధాని మొదలు కేంద్ర, రాష్ర్ట మంత్రులు, నెలకు రెండు మూడుసార్లు ముఖ్యమంత్రి పర్యటనలతో ప్రొటోకాల్ చూసే బాధ్యత డీఆర్ఓపై ఉంది. అలాంటి కీలకమైన పోస్ట్ ద్వారా జిల్లాపై పట్టు సాధించేందుకు ఇరువురు మంత్రులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తుల వల్ల ఈ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగానే ఉండిపోయింది. -
నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం : భోగాపురం వద్ద నిర్మించనున్న ఎయిర్‌పోర్టు కోసం నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ర్ట మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సేకరించనున్న భూములు వివిధ రకాలుగా ఉన్నందున వాటి కి ఏ రీతిలో పరిహారం చెల్లించాలనే విషయమై కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటిపై సోమవారం నగర పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ పురోగతిపై గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళినితో కలిసి ఆదివారం సర్క్యూట్ హౌస్‌లో విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు, భోగాపురం ప్రాంత ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 5,300 ఎకరాల్లో 300 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, వుడా ఆమోదం పొందిన లేవుట్లు ఉన్నాయని తెలిపారు. లే అవుట్ భూములను రెండు రకాలుగా వర్గీకరించామని, లే అవుట్లో అమ్మకాలు జరిపినవి, భూమి వినియోగ మార్పిడి చేసి విక్రయించకుండా ఉన్నవిగా గుర్తించి వాటికి పరహారం నిర్ణయిస్తామన్నారు. భూసేకరణలో ఎవరికి నష్టం లేకుండా బాధ కలగకుండా ప్యాకేజీలు రూపొందిస్తామన్నారు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై మరో కమిటీ
సాక్షి, హైదరాబాద్ : విజయవాడ, కర్నూలులో ని నారాయణ జూనియర్ కాలేజీల్లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం మరో కమిటీని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి. చక్రపాణి నేతృత్వంలో ఈ కమిటీ నియమిస్తున్నట్లు మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈమేరకు మం త్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీ నెలరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ ప్రకటనలో నారాయణ కాలేజీ పేరు ప్రస్తావించక పోవడం విశేషం. -
ఇదేమి ఆదర్శం?
♦ 80 మంది పిల్లలు లోపున్నా ఓకే ♦ 100 దాటినా నో ఛాన్స్ ♦ జాబితాలో జిమ్మిక్కులు ♦ విద్యామంత్రి ఇలాకాలో విచిత్రాలు విద్యాశాఖా మంత్రి ఇలాకాలో విచిత్రాలు జరుగుతున్నాయి. ఆదర్శ పాఠశాలల ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలలు నిబంధనలతో పనిలేకుండా ‘ఆదర్శ’ జాబితాలో చేరిపోయాయి. అర్హత ఉన్న పలు స్కూళ్లు స్థానం దక్కించుకో లేకపోయాయి. వీటిని సరి చేయాల్సిన విద్యాశాఖ కూడా చోద్యం చూస్తోందంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : ఆదర్శ పాఠశాలలపై ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేస్తోంది. అంతా పారదర్శకమంటూ హడావుడీ చేస్తోంది. కానీ వీటి ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని వైఎస్సార్‌టీఎఫ్, ఏపీటీఎఫ్ 1938 తదితర ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో అర్హత ఉన్న వాటిని ‘ఆదర్శ’ంలోకి చేర్చకపోవడమే కాదు.. అనర్హత స్కూళ్లకు కూడా అవకాశం కల్పించార ని ఆరోపిస్తున్నాయి. అందుకు సంబంధించి వివరాలతో సహా జిల్లా విద్యాశాఖాధికారికి కూడా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. విశాఖ నగరంలోని ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలు (ప్రాథమిక పాఠశాలలు లేనందున) మినహా జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 231 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అధికారులు ఎంపిక చేశారు. వీటిలో నియోజకవర్గాల వారీగా మాడుగులలో 16, చోడవరంలో 40, నర్సీపట్నం 19, పరవాడ 10, పాయకరావుపేట 35, అనకాపల్లి 17, భీమిలి 38, యలమంచిలి 21, విశాఖ తూర్పు 6, విశాఖ పశ్చిమం 3, గాజువాక 13, పాడేరు 6, అరకులో 7 స్కూళ్లను ఖరారు చేశారు. ఇందులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో 38, చోడవరంలో అత్యధికంగా 40, పాయకరావుపేటలో 35 పాఠశాలలు మెజార్టీ ఆదర్శానికి నోచుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 80 మంది పిల్లలకు మించి ఉన్న వాటిని ఆదర్శ పాఠశాలగా మార్పు చేయాలి. కానీ పలుచోట్ల అందుకు విరుద్ధంగా 80 నుంచి 155 మధ్య పిల్లలున్న స్కూళ్లను కూడా గుర్తించలేదని, పైగా 80 లోపు సంఖ్య ఉన్న పాఠశాలల్లో హాజరును ఎక్కువగా చూపి మోడల్ జాబితాలో చేర్చారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వారి చెబుతున్న దాని ప్రకారం విద్యార్థుల సంఖ్య 80 దాటినా ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక కాని స్కూళ్ల వివరాలు.. 80 దాటినా ‘ఆదర్శ’ం లేదు.. అచ్యుతాపురం మండలం పూడిమడక పాఠశాలలో 92 మంది, చోడపల్లిలో 88, బుచ్చెయ్యపేట మండలం వడ్డాది (కె)లో 83, చినగదిలి మండలం గాంధీనగర్‌లో 155, చంద్రంపాలెం 137, లక్ష్మీనగర్ 130, పాత అడవివరం 95, పీఎంపాలెం 125, ఇందిరానగర్ 93, వెంకటాపురం 92, రాజీవ్ గృహకల్ప కాలనీ 90, గోపాలపట్నం 83, శివశక్తినగర్ 82, తోటగరువు 173, పెందుర్తి దొగ్గవానిపాలెం కాలనీలో 97 మంది, గంగిరెడ్ల కాలనీ పాఠశాలలో 96 మంది పిల్లలు ఉన్నారు. చోడవరం జి-స్ట్రీట్‌లో 107, పీఎస్.పేటలో 100, కె.కాలనీలో 97, దేవరాపల్లిలో 94, గొలుగొండ మండలం వేజంగిలో 87, కె.కోటపాడు మండలం గరుగుబిల్లిలో 110, నర్సీపట్నం మండలం బలిఘట్టంలో 146, ఎస్సీ కాలనీలో 140, శివపురంలో 89 మంది చదువుతున్నారు. పాయకరావుపేట పట్టణం దుర్గానగర్ స్కూల్లో 95, పాతహరిజనపేటలో 83, శ్రీరాంపురం మెయిన్‌లో 91 మంది, ఎస్.రాయవరం మండలం దార్లపూడి పాఠశాలలో 82 మంది పిల్లలు ఉన్నారు. ఇలా 80 మందికి పైగా పిల్లలున్న 28 స్కూళ్లను లెక్క తేల్చారు. సంఖ్యను ఎక్కువగా చూపి.. అంతేకాదు.. పిల్లల సంఖ్య 80 కంటే తక్కువ ఉన్న స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చేందుకు కొంతమంది కంప్యూటర్లలో మార్పులు చేసి 80కి పైగా చూపారని అంటున్నారు. అలాంటి వాటిలో పీఎంపాలెం ఆర్‌హెచ్‌సీలో పిల్లలు 80 లోపుండగా 87 మందిగాను, జీవీఎంసీ ఒకటో వార్డు సంతపాలెంలో 66కి 96 గాను చూపారని చెబుతున్నారు. నిబంధనల మేరకే ఎంపిక నిబంధనల మేరకే ఆదర్శ పాఠశాలల ఎంపిక జరిగింది. ఒకే ప్రాంతంలో కిలోమీటరు పరిధిలోని 80 మంది పిల్లలకంటే లోపున్న పాఠశాలను సమీపంలోని మరో స్కూలులో విలీనం చేశాం. వీటి ఎంపికలో తేడాలున్నాయని కొంతమంది ఉపాధ్యాయ యూనియన్ల నాయకులు నా దృష్టికి తెచ్చారు. కానీ వారి ఆరోపణలు నిజం కావు. -ఎం.వెంకటకృష్ణారెడ్డి, డీఈవో -
తొలి అడుగు..
♦ ఏయూలో ఐఐఎం ప్రారంభం ♦ తొలిరోజే తరగతులు బోధన ♦ 60మంది విద్యార్థులు చేరిక ♦ కొత్తకేంపస్లో నవ్యోత్సాహం ఏయూక్యాంపస్ : చిరకాల స్వప్నం సాకారం అయ్యింది. విశాఖ వేదికగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రారంభమైంది. సో మవారం ఏయూలోని చారిత్రక ఎంబిఏ విభాగం ఎదురుగా ఐఐఐఎం(వి) తొలి అడుగును వేసింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేలకావడంవల్లనో, అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన విశాఖ ప్రత్యేకతో విద్యార్థులను, తల్లిదండ్రులను మొదటి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది. నిర్ధారిత సమయంలో పూర్తిచేసి, చక్కని వసతులతో దర్శనమిచ్చింది. సోమవారం ఉదయం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిని ప్రారంభించారు. నగరం నడిపించింది: విశాఖ నగర ఖ్యాతికి ఐఐఎంవి అదనపు సంపదగా నిలచింది. ఐఐఎం బెంగళూరుతో సమానంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు మన విశాఖ ఐఐఎంను ఎంపిక చేసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయంగా ఇది నిలవనుంది. అరవై మంది విద్యార్థులకు అవకాశం ఉండగా 54 మంది చేరారు. వీరిలో నలుగురు విద్యార్థినులున్నారు. భౌగోళికంగా నగరానికి ఉన్న ప్రాధాన్యత, ఏయూలో ఏర్పాటవుతుండటం కలసివచ్చాయని ఐఐఎం బెంగళూరు ఆచార్యులు స్వయంగా చెప్పారు. నూతనంగా ఏర్పాటవుతున్న సంస్థలో వసతులు, బోధన ఏర్పాట్లపై అనేక సందేహాలు ఉంటాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ విద్యార్థులో తెగువతో ఈ కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రా రంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏయూ ఇన్‌గేట్ వద్ద నున్న ఐఐఎంవి క్యాంపస్‌కు విద్యార్థులు చేరుకున్నారు. తొలిరోజు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు వెంట వచ్చారు. దీనితో వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రాంగణం నిండిపోయింది. {పారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరువాత తరగతులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 7 గంటల వరకు తరగతులు నిర్వహించారు. శాశ్వత అధ్యాపకులు నియమితులయ్యే వరకు ఐఐఎం బెంగళూరు నుంచి అధ్యాపక బృందం బోధనకు వస్తుంటారు. సౌరవ్ ముఖర్జీ(డీన్) విశాఖ కేంద్రానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఐఐఎం బి నుంచి పలువురు ఆచార్యులు ఇక్కడకు చేరుకున్నారు. ఐఐఎం బెంగళూరుకు చెందిన సీనియర్ విద్యార్థుల బృందం సైతం ఇక్కడకు చేరుకుంది. విద్యార్థులకు విభిన్న అంశాలపై వీరు అవగాహన కల్పిస్తున్నారు. అల్యూమినీ విద్యార్థులు సైతం సమన్వయం చేస్తున్నారు. ఇక్కడ చేరిన విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనకు సైతం చర్యలు ప్రారంభించినట్లు ఐఐఎం బి సంచాలకులు సుశీల్ వచాని తెలిపారు. ప్రతిభే కొలమానం.... ఐఐఎంలలో ప్రతిభే కొలమానంగా ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. ఎంటర్‌ప్యూనర్, స్టార్టప్‌లపై ప్రాధాన్యం కల్పించడం జరుగుతుంది. సుశిక్షితులైన బోధన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వైజాగ్ ఐఐఎం భవిష్యత్తులో అత్యుత్తమ సంస్థల సరసన నిలుస్తుంది. విదేశాలలో స్థిరపడాలనే వారు ఇతర దేశాలలో ఎంబిఏకు వెళుతున్నారు. -సుశీల్ వచాని, సంచాలకులు ఐఐఎం బెంగళూరు వసతులు బాగున్నాయి... కొత్త క్యాంపస్ అయినప్పటికీ వసతులు బాగున్నాయి. ఐఐఎంబి మెంటార్‌గా వ్యవహరించడం మంచి పరిణామం. అకడమిక్ హాల్స్, సెమినార్ హాల్స్ చాలా బాగున్నాయి. సీనియర్స్, అల్యూమిని అందిస్తున్న గెడైన్స్ ఎంతో సహకరిస్తోంది. ప్రస్తుతం సిఆర్‌గా వ్యవహరిస్తున్నాను. -అంకిత్గుప్తా, మధ్యప్రదేశ్ ఆలోచనలకు మించి పోయింది.. నేను ఇప్పటికే దేశంలోని పలు ఐఐఎంల ఫోటోలను చూశాను. వీటన్నింటికంటే విశాఖ ఐఐఎం బాగుంది. మా ఆలోచనలు, ఆకాంక్షలను మించే విధంగా దీనిని తయారుచేశారు. ఐఐఎం బెంగళూరు నిపుణులు పడిన కష్టం కనిపిస్తోంది. ఇటువంటి సంస్థలో ప్రవేశం రావడం ఆనందంగాా ఉంది. -మనీష్, చెన్నై -
ఎటూ తేలని డీఎస్సీ
సాక్షి,చిత్తూరు : డీఎస్సీ -2014పై ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఒక వైపు మంత్రితో పాటు ముఖ్యమంత్రి రోజుకోమాట మాట్లాడుతూ అభ్యర్థులను గందరగోళంలోకి నెడుతున్నారు. సెప్టెంబ ర్ మొదటి వారంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రి య పూర్తి చేయనున్నట్లు ఆగస్టు చివరి వారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ తర్వాత విశాఖ పర్యటన సందర్భంగా ముఖ్యమం త్రి చంద్రబాబు సైతం వారంలో నియామకాలు ఉంటాయని చెప్పారు. ఆగస్టు పోయి సెప్టెంబర్ చివరి వారం వచ్చినా డీఎస్సీ నియామకాలు జరిగే పరిస్థితి కానరావడంలేదు. ఎప్పటికి నియామకాలు మొదలు పెడతారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో అభ్యర్థుల్లో మరింత ఆందోళన నెలకొంది. మరో వైపు రేషన లైజేషన్ నేపథ్యంలో అసలు డీఎస్సీ నియామకాలు ఉంటాయో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడి చదివి డీఎస్సీ రాసినా ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల సంగతి పట్టించుకోక పోవడంతో అభ్యర్థులు ఆగ్రహానికి లోనవుతున్నారు. గత ఏడాది నవంబర్ 20న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 1,336 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి తొలుత 42 వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 37,268 మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. మే 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహించింది. జూన్ 3న విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. జూన్ 9 నాటికి మెరిట్ జాబితా జిల్లాలకు పంపి 15 నాటికే ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో విద్యాశాఖ మెరిట్ జాబితా విడుదలను వాయిదా వేసింది. డీఎస్సీ ప్రశ్నాపత్రాల కీ లోని తప్పులపై 1,836 కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ ప్రాథమిక కీ పైనే 3 వేలకుపైగా అభ్యంతరాలు విద్యాశాఖకు అందినట్లు సమాచారం. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు వచ్చినా విద్యాశాఖ ఫైనల్ కీ విడుదలలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో పాటుగా డీఎస్సీ -2014 నిర్వహణ పైనే మరో కేసు ఉంది. డీఎస్సీ 2014ను గతంలోకంటే భిన్నంగా నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. గతంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)ను నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వారికి డీఎస్సీ (టీచర్ రిక్రూట్మెంట్ -టెస్ట్) నిర్వహించేవారు. ఈ సారి టెట్, టెర్ట్లను కలిపేసి డీఎస్సీ నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానంలో ఇప్పటికే కొందరు సవాలు చేస్తున్నారు. ఇక డీఎస్సీపై కోర్టు, ట్రిబ్యునల్‌లో 547 కేసులు నమోదయ్యాయి. వీటిపై కౌంటర్లు దాఖలు చేసి నియామకాలకు వీలుగా మార్గం సుగమం చేసుకోవాల్సి ఉంది. కానీ విద్యాశాఖ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుండడం వల్లే డీఎస్సీ నియామక ప్రక్రియ ముందుకు సాగడంలేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
మీ ఇల్లు ఇలాగే ఉంచుతారా?
ఏఎన్‌యూ వసతిగృహాల్లో పర్యటించిన మంత్రి గంటా పరిసరాలు శుభ్రం చేయాలని సూచన విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఏఎన్‌యూ : రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్సిటీలో సంస్కరణలు, చేపట్టాల్సిన చర్యలపై పరిపాలనాభవన్లోని కమిటీ హాలులో సమీక్ష జరిపారు. అనంతరం బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహ ప్రాంగణంలో పరిసరాలను పరిశీలించారు. పనికిరాని వస్తువులను చిందరవందరగా పడవేయటం, ఆవరణలో చెట్లు పెరిగి ఉండటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మీ ఇల్లు ఇలాగే ఉంచుకుంటారా అని యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. వెంటనే శుభ్రం చేసి లాండ్‌స్కేపింగ్ చేయాలని సూచించారు. వసతిగృహం స్టోర్‌లో వస్తువులు, స్టాక్ రికార్డులను పరిశీలించారు. అనంతరం భోజనశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినినులను అడిగారు. కొన్నిసార్లు భోజనం బాగోవటంలేదని, పెరుగు బాగోవటం లేదని వారు సమాధానమిచ్చారు. బాలికల వసతి గృహాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించాలని ఇన్చార్జి వీసీకి సూచించారు. విద్యార్థినులు ఉండే గదులు, పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని మంత్రిని స్టూడెంట్స్ కోరారు. వెంటనే నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట ఇన్చార్జి వీసీ బి.ఉదయలక్ష్మి, రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, వసతి గృహాల వార్డెన్ ఆచార్య ఎల్.ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సుదర్శన చక్రం
- జేఎన్టీయూ(ఏ)లో రూ.74.32 కోట్ల పనులకు టెండర్లు లేకుండానే అప్పగించేందుకు యత్నం - ఈ ప్రొక్యూర్మెంట్ కాకుండా సీల్డ్కవర్ల విధానం - ప్రకటనలు ఇవ్వకుండా కేవలం వెబ్సైట్లో వివరాల వెల్లడి - 15 రోజుల్లో నూతన వీసీ రానుండడంతో హడావుడి నిర్ణయాలు - ఇన్చార్జ్ వీసీ తీరుపై సర్వత్రా విమర్శలు యూనివర్సిటీ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ-అనంతపురం)లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రూ.74.32 కోట్లతో వర్సిటీ పరిధిలో చేపట్టనున్న పలు భవన నిర్మాణాలకు ఎలాంటి టెండర్లు లేకుండానే కొటేషన్ల ద్వారా పనులు కట్టబెట్టేందుకు నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 15లోపు జేఎన్టీయూకు నూతన వైస్ ఛాన్సలర్‌ను నియమిస్తామని స్వయాన మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే...ఈలోపే ఇన్చార్జ్ వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది. ఇన్చార్జ్ వీసీ అయినప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకుంటుండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వర్సిటీ నిబంధనల ప్రకారం ఇన్చార్జ్ వీసీ రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలి. అత్యవసరమైతే తప్ప కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అయినప్పటికీ నిబంధనలకు విరుదంగా రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తయ్యే భవన నిర్మాణాలకు అంకురార్పరణ చేస్తుండడం గమనార్హం. చట్టంలోని లొసుగులే వెసులుబాటుగా.. రాష్ట్రవ్యాప్తంగా 15 యూనివర్సిటీలలో భవన, రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులను ప్రభుత్వ ఏజెన్సీ, అనుబంధ సంస్థలు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థలకు అప్పగించాలని గత నెల 12న ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమత్రా దావ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జీవో వర్సిటీకి చేరిందో..లేదో ఇంతలోనే గత నెల 20న జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో కొటేషన్లను ఆహ్వానించారు. ఇంటిగ్రేటెడ్ లెక్చరర్ హాల్ కాంప్లెక్స్ 13,500 చదరపు అడుగులు , నూతన పరిపాలన భవనం 9000 చదరపు అడుగులు, ఓటీఆర్‌ఐలో ఫార్మసీ బ్లాక్ 5000 చదరపు అడుగులు, జిమ్ అండ్ యోగా హాలు 240 చదరపు అడుగులు, పులివెందులలో బాలుర హాస్టల్ 4900 చదరపు అడుగుల మేర నిర్మించడానికి కొటేషన్లు కోరారు. ఇవన్నీ రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఆసక్తి గల ప్రభుత్వ ఏజెన్సీలు షీల్డ్ కవర్ ద్వారా అందజేయాలని, తక్కువ మొత్తానికి కోట్ చేసే వారికి పనులను గంపగుత్తగా అప్పగిస్తామని తెలిపారు. ఈ- ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో కొటేషన్లు అందచేయాలని కోరడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటికి సంబంధించిన బాక్స్‌లను వర్సిటీలో ఏర్పాటు చేయలేదు. దీంతో అక్రమాలు జరిగే అవకాశాలు ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది. అందులోనూ పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా కేవలం వెబ్సైట్ ద్వారా కొటేషన్లు ఆహ్వానించడం వల్ల అన్ని ఏజెన్సీలకు తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. రెండేళ్లుగా పెండింగ్ ఉన్న పనులకు సైతం.. వెబ్సైట్లో కొటేషన్లు ఆహ్వానించడానికి వర్సిటీ అత్యుత్తమ పాలకవర్గమైన మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ అనుమతి తప్పనిసరి. ఇదేమీ లేకుండానే కేవలం వీసీ ప్రొసీడింగ్స్ ప్రకారం కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని వెబ్సైట్లో పేర్కొన్నారు. ఆచార్య లాల్‌కిశోర్ వీసీగా ఉన్నప్పుడు భవన నిర్మాణాలు చేపట్టాలని తలచినప్పటికీ బిల్డింగ్ కమిటీ నిర్ధారించిన విధానాలు లేకపోవడంతో ఆలస్యమైంది. దీనివల్ల రెండేళ్ల నుంచి నిర్మాణాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. వీటిని ఇన్చార్జ్ వీసీ టెండర్లు లేకుండానే కొటేషన్ల ద్వారా అప్పగించేందుకు సమాయత్తం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మంత్రి గంటా ఇల్లు ముట్టడి
చెదరగొట్టిన పోలీసులు తోపులాటలో పడి విద్యార్థి నేతలకు గాయాలు ఎంవీపీకాలనీ(విశాఖ): ప్రైవేట్యూనివర్సిటీల బిల్లును వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్థి నాయకులు సోమవారం నగరంలోని ఎంవీపీకాలనీలోని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకున్నారు. ఇది తెలుసుకుని కోపోద్రిక్తులైన ఏబీవీపీ విద్యార్ధి నాయకులు గంటా ఇంటి ఎదుట ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో పోలీసులు వారిని చెల్లాచెదురుచేశారు. దీంతో తోపులాటలో కొందరు కింద పడిపోయారు. ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు వాసు చొక్కా చిరిగిపొయింది. కడుపు మీద గాయమయింది. మరో విద్యార్ధి నాయకుడికి చేతిపై గాయమయింది. విద్యార్థి నాయకుల నినాదాలతో అప్రాంతం హోరెత్తింది. మంత్రి గంటా శ్రీనివాసరావు కార్పొరేట్ శక్తులకు మంత్రి కొమ్ముకాస్తున్నరని నినాదాలు చేశారు. 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి పి. సురేష్, ఎబివిపి ఆంధ్రాయూనివర్శిటి ఇన్చార్జి జి.రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెన్నా సురేష్, సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలగిరిరాజు, వి. మోహన్ యాదవ్, సాయికష్ణ, శేఖర్, ఏయూ పిహెచ్డి స్కాలర్స్ హేమ. జగదీష్, కార్తీకేయ,మణికంఠ, సూర్య, వంశీ యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం
వీసీలతో సమీక్షలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన వీసీలు, రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడితే గతంలో టీసీ ఇచ్చి పంపేసేవారని, ఇప్పుడైతే శాశ్వతంగా విద్యకు దూరం చేస్తారని చెప్పారు. విద్యాసంస్థల అధిపతుల్ని బాధ్యుల్ని చేస్తామన్నారు. వైస్చాన్స్లరే యూనివర్సిటీకి కింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో యూనివర్సిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేయడం కోసం త్వరలోనే సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఫిన్‌ల్యాండ్ దేశాలతో పాటు దేశంలోని తమిళనాడు, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వివరించారు. తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ యూనివర్సిటీల విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి గంటా అన్నారు. నారాయణను టార్గెట్ చేస్తారు : నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, కడపలో నారాయణ విద్యాసంస్థలో విద్యార్థిని మృతిపై అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం చెప్పేలా రికార్డులు సిద్ధం చేయాలని ఆయన వీసీలకు సూచించారు. నారాయణ క్యాబినెట్లో మంత్రిగా ఉండటంతో పాటు తన బంధువు కూడా కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్షం టార్గెట్ చేస్తోందన్నారు. -
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకూ ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకూ బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు బదిలీల విధి విధానాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. టెక్నాలజీ వినియోగంతో అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనితీరు ప్రామాణికంగా తీసుకుని 25 శాతం వెయిటేజీతో బదిలీలు చేపడుతున్నామని, వచ్చే ఏడాది 50 శాతం వెయిటేజీకి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇందుకోసం పాయింట్లను నిర్ణయించామన్నారు. హేతుబద్దీకరణతో 2,998 పాఠశాలలను విలీనం చేసినట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం విశాఖలో, సెప్టెంబర్ 8న ప్రపంచ అక్ష్యరాస్యత దినోత్సవం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును శనివారం మంత్రిమండలి సమావేశంలో పెడతామన్నారు. నారాయణ కళాశాలల్లో జరిగిన ఆత్మహత్యలపై ఏర్పాటైన కమిటీ తనకు తిరుపతిలో నివేదిక అందించిందని, అయితే ప్రభుత్వ కార్యదర్శికి నివేదిక ఇవ్వమని తాను సూచించానన్నారు. రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు పెట్టాలని బాలసుబ్రహ్మణ్యం కమిటీ చెప్పలేదని, ర్యాగింగ్ చేస్తే కఠినమైన కేసులు పెడతామని తాను చెప్పానని అంటూ మంత్రి పొంతన లేని సమాధానాలిచ్చారు. బదిలీల కౌన్సెలింగ్ పూర్తయ్యే లోగా డీఎస్సీ ఖరారు చేస్తామని, డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్స్ ఇస్తామన్నారు. మార్గదర్శకాలివే.. ⇒ ఆగస్టు 1వ తేదీకి ఒకే ప్రాంతంలో ఎనిమిదేళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు, ఐదేళ్లు పూర్తి చేసిన గ్రేడ్-2 టీచర్లకు బదిలీ తప్పనిసరి. ⇒ ఆగస్టు1, 2015 నాటికి రెండేళ్ల లోపు రిటైర్మెంట్ ఉన్నవారి వ్యక్తిగత వినతులను పరిశీలిస్తారు. వయసు 50 లోపు ఉన్న గ్రేడ్-2 హెచ్ఎం లు బాలికల ఉన్నత పాఠశాలల్లో ఉంటే బదిలీ తప్పనిసరి. ⇒ రేషనలైజేషన్‌లో బదిలీ అయిన టీచర్లు ట్రాన్స్ఫర్ కౌన్సెలింగ్ కనీస గడువు రెండేళ్లు లేకపోయినా బదిలీల్లో పాల్గొనవచ్చు. ⇒ ఉర్దూ మీడియం స్కూల్స్‌లో మొదటి లాంగ్వేజ్ ఉర్దూ చదివిన గ్రేడ్-2 హెచ్ఎం లకు ప్రాధాన్యత ఇస్తారు. ⇒ బదిలీలను అప్రూవ్ చేసేందుకు కమిటీలు ఏర్పాటు. షెడ్యూల్ ఇలా.. ⇒ సెప్టెంబర్ 6న ఖాళీల ప్రకటన. 7 నుంచి 10వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. హా 7 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన. ⇒ 15, 16వ తేదీల్లో అభ్యంతరాల నమోదు. ⇒ 19న తుది సీనియారిటీ జాబితా (పాయింట్లతో కలిపి) ఖరారు. ⇒ 21 నుంచి 24 వరకూ వెబ్ ఆప్షన్లు ⇒ బదిలీ ఉత్తర్వులు, చేరేందుకు గడువు సెప్టెంబర్ 30. -
మరణానికి కారణాలేవి?
* నారాయణ విద్యార్థినుల మృతిపై ప్రభుత్వానికి నివేదిక * వెల్లడి కాని అసలు కారణాలు సాక్షి, హైదరాబాద్/తిరుచానూరు: అనుకున్నదే నిజమైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప సమీపంలోని సీకే దిన్నె నారాయణ కాలేజీ ఇంటర్ విద్యార్థినుల మృతికి గల కారణాలపై నియమించిన విచారణ కమిటీ.. సరైన కారణాలు లేకుండానే తన నివేదికను సమర్పించింది. కమిటీ సభ్యులు ప్రొఫెసర్ విజయలక్ష్మి (పద్మావతి మహిళా వర్సిటీ రిజిస్ట్రార్), సులోచన (కడప డీఆర్వో), మాణిక్యం (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి) సోమవారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తిరుపతిలో ఆ నివేదికను సమర్పించారు. ఫ్యాక్సు ద్వారా విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు ఒక కాపీ పంపించారు. అయితే మంత్రి నారాయణ కాలేజీ కావడంతోనే విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై విచారణ కమిటీ లోతుగా విచారణ చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కమిటీ వల్ల నిజాలు తేలవన్న పలువురి అనుమానాలకు బలం చేకూర్చేలానే నివేదిక ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు విద్యార్థినులు ఒకే గదిలో ఒకేసారి ఉరివేసుకుని మరణించడంపై అనేక అనుమానాలు రేకెత్తగా, కమిటీ నివేదిక లో ఆ అంశాలేమీ లేవని తెలుస్తోంది. కాలేజీ నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయాక విచారణ జరిపారనీ, దీంతో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులేవీ వెలుగుచూడలేం దంటున్నారు.కాలేజీ ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది, పోలీసులు, పోస్టుమార్టం చేసిన డాక్టర్ల నుంచి వివరాలు సేకరించి కమిటీ నివేదిక రూపొందించింది. ఇద్దరు విద్యార్థినులు సాయంత్రం 5:36 ప్రాంతంలో మరణించారని పోస్టుమార్టం నివేదికలో ఉంది. అయితే 5:30 గంటలకు ఆ రూము వద్దకు మరో విద్యార్థిని వచ్చి వారిద్దరితో మాట్లాడి వెళ్లిందని, మరో అరగంట తరువాత ఇంకో విద్యార్థిని రూము వద్దకు వెళ్లగా ఇద్దరూ ఉరివేసుకొని కనిపించారని సిబ్బంది తెలిపినట్లు నివేదికలో పొందుపర్చారు. అరగంట వ్యవధిలోనే వారిద్దరూ ఉరివేసుకొని ఉండవచ్చని కమిటీ పేర్కొంది. చనిపోయిన ఆరుగంటల లోపు పోస్టుమార్టం చేసి ఉంటే ఎప్పుడు చనిపోయారో సరిగ్గా తేలేదని, మరునాడు పోస్టుమార్టం చేయడం వల్ల డాక్టర్లు తమ నివేదికలో మృతి సమయంపై స్పష్టతనివ్వలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రక్తంతో రాసినట్లున్న పేపర్లోని రాత ఎవరిది? రక్తం ఎవరిదన్న అంశాలపై ఫోరెన్సిక్ నివేదిక రావలసి ఉంది. -
పంచాయతీలకు పట్టం
సాక్షి,విశాఖపట్నం : పంచాయతీల పరిపుష్టి కోసం ఎన్నినిధులు వెచ్చించేందుకైనా సిద్ధంగా ఉన్నామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్మల్ గ్రామ పురస్కారాల బహుమతుల ప్రదానోత్సవం శని వారం ఘనంగా జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా 27 పంచాయితీలకు ఈ అవార్డులు ప్రదానం చేయగా, విశాఖజిల్లాలో ఎనిమిది పంచాయితీలకు ఈ అవార్డులు మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులు అంద జేశారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలం చీమలపల్లి, దీపర్ల, సోమవరం, ఎర్రవరం, మునగపాక మండలం అరబుపాలెం, పాయకరావుపేట మండలం కేశవర ం, కొత్తూరు, రాజగోపాల పురం పంచాయితీసర్పంచ్లను ఈసందర్భంగా మంత్రులు దుశ్సాలు వాలు కల్పి ఘనంగా సత్కరించారు. రూ.22లక్షల చెక్‌లను ఆయా పంచాయితీ సర్పంచ్‌లకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ స్వచ్చభారత్, స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని పంచా యితీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, రోడ్ల అభివృద్ధి, విద్యుత్, భూగర్భడ్రైనేజీ తదితర అంశాలపై దృష్టి పెట్టామన్నారు. ఈ ఏడాది 27 పంచాయితీ లకు కేంద్రం రూ.1.20కోట్లు కేటాయించిందన్నారు. 2014-15లో నిర్మల్ పురస్కా రాలకు కొత్త గైడ్‌లైన్స్ ప్రకటించిందన్నారు. పంచాయితీల్లోడంపింగ్ యార్డుల నిర్మాణానికి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు కేటాయిస్తున్నామన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ గతంలో నిర్మల అవార్డుల ప్రదానం హైదరాబాద్‌లో సాదాసీదాగా జరిగేదన్నారు. తొలిసారిగా సర్పంచ్‌లను ఘనంగా సత్కరించేందుకు విశాఖలోరాష్ర్ట స్థాయి వేడుకను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, కలెక్టర్ ఎన్.యువరాజ్, డీపీఒ వెంకటేశ్వరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.ప్రభాకరరావు, డ్వామా పీడీ శ్రీరాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గంటాకు వద్దు.. అయ్యన్నకు ముద్దు
మాతృసంస్థకు సరెండర్ చేసిన గంటా సీఈఓగా అందలమెక్కించిన అయ్యన్న ఎస్ఎస్ఏ పీవో వ్యవహారం మంత్రుల మధ్య ఆగని ఆధిపత్య పోరు విశాఖపట్నం: ఏ అధికారిపైనైనా ఆరోపణలొస్తే ఏం చేస్తారు? అంతగా ప్రాధాన్యత లేని పోస్టులో వేస్తారు! లేదా బదిలీ చేస్తారు. మన విశాఖ జిల్లాలో అయితే అలా చేయరు. ఒక మంత్రి అతనిపై చర్య తీసుకుంటే మరో మంత్రి ఆ అధికారికి అడ్డగోలుగా కొమ్ముకాస్తారు. అందలమెక్కిస్తారు. ఒకే ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పడుతున్న తాజా వ్యవహారం ఇదీ! సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి నగేష్ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓఎస్డీ కూడా. నగేష్ చాన్నాళ్లుగా జోడు పదవుల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్వచ్ఛ విద్యాలయ పథకం కింద సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో చాలా వరకు నిర్మాణం పూర్తయినట్టు ఎస్ఎస్ఏ అధికారులు మంత్రి గంటాకిచ్చిన నివేదికలిచ్చారు. వారం రోజుల క్రితం గంటా ఆనందపురం మండలంలో ఓ స్కూలుకు ఆకస్మిక తనిఖీకెళ్లినప్పుడు అక్కడ మరుగుదొడ్డి నిర్మాణం జరగకపోవడంతో పీవో నగేష్, ఈఈ భానుప్రసాద్‌లను వారి మాతృసంస్థలకు సరెండర్ చేశారు. దీంతో నగేష్ తన మాతృసంస్థ సహకారశాఖకు వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ మూడ్రోజులు తిరక్కుండానే శ్రీకాకుళం జిల్లా సీఈవోగా నియమితులయ్యారు. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. అయ్యన్నకు సన్నిహితంగా.. ఎప్పట్నుంచో మంత్రులు అయ్యన్న, గంటా వీలు చిక్కినప్పుడల్లా ఎవరు సత్తా వారు చాటుకుంటున్నారు. సాక్షాత్తూ మంత్రి గంటా తన ఓఎస్డీని సరెండర్ చేస్తే ఆయనకు అయ్యన్నపాత్రుడు శ్రీకాకుళం సీఈవో పోస్టు ఇప్పించినట్టు తెలుస్తోంది. గంటా తొలుత ఏరికోరి తెచ్చుకున్న నగేష్ కొన్నాళ్లుగా అయ్యన్నతో సన్నిహితంగా మెలుగుతుండడం కూడా ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరుగుదొడ్ల అవకతవకలపై గంటా స్పందించి సరెండర్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో నగేష్ వెనువెంటనే మంత్రి అయ్యన్నను ఆశ్రయించడం, ఆయన ఎస్ఎస్ఏ పీవోకంటే కీలకమైన శ్రీకాకుళం జెడ్పీ సీఈవోగా ఉత్తర్వులు వచ్చేలా కృషి చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో తనకు సన్నిహితుడు ఆ జిల్లా మంత్రి కె.అచ్చెన్నాయుడు కూడా సహకరించడంతో అయ్యన్న పంతం నెగ్గించుకోవడానికి వీలు చిక్కిందంటున్నారు. మరోవైపు ఎస్ఎస్ఏ పీవోతో పాటు సరెండర్ చేసిన ఈఈ ఇప్పటికీ అదే విధుల్లో కొనసాగుతుండడం విశేషం. ఈయన కొనసాగడానికి గుంటూరు జిల్లా మంత్రి సహకరించినట్టు తెలుస్తోంది. -
‘నారాయణ’ విద్యార్థినుల మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు
మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టీకరణ హైదరాబాద్: కడప సమీపంలోని సీకే దిన్నెలో నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్మీడియెట్ బోర్డులోని పరీక్షల నియంత్రణాధికారి మాణిక్యం, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, వైఎస్సార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.సులోచనను కమిటీ సభ్యులుగా నియమించామన్నారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు విధించామని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సీకే దిన్నె నారాయణ కాలేజీలో చదువుతున్న నందిని(16), మనీషా(16) సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాలేజీ నారాయణదైనా, ఇంకెవరిదైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. డీఎస్సీ లోపాల బాధ్యులపై కఠిన చర్యలు డీఎస్సీ-2014లో చోటుచేసుకున్న లోపాలకు బాధ్యులైనవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. డీఎస్సీ నిర్వహణలో తప్పులు దొర్లాయని, ఇప్పటికీ ‘కీ’లో మరో పది తప్పులున్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్ ‘కీ’ రెండుసార్లు ఇచ్చాక కూడా ఇంకా తప్పులున్నాయంటే వారి బాధ్యతారాహిత్యం స్పష్టమవుతోందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, కామన్ యూనివర్సిటీల చట్టంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా తెలిపారు. తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో విద్యా నగరాల కోసం స్థలాలను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. -
ఆయనది భీమిలి పట్టు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వడ్డించేవాడు మనవాడైతే... అన్నట్లుగా తయారైంది జీవీఎంసీ నిధుల కేటాయింపు వ్యవహారం. ఈ అంశం నగర పరిధిలోని పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమవుతోంది. భీమిలి నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించి ఇతర నియోజకవర్గాలపట్ల శీతకన్ను వేశా రు. అసలే జీవీఎంసీపై మంత్రి గంటా ఏకఛత్రాధిపత్యం పట్ల అసంతృప్తిగా ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు తాజా పరిణామం మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇటీవల జీవీఎంసీ ప్రతిపాదించిన రూ.7,200కోట్ల పనుల్లో దాదాపు 2,200కోట్లు ఒక్క భీమిలి నియోజకవర్గాకే కేటాయించడం గమనార్హం. తూర్పు నియోజకవర్గానికి కొంత ప్రాధాన్యమిచ్చారు. మిగిలిన నియోకజవర్గాలకే నామమాత్రంగానే నిధులు విదిల్చడంతో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదిం చారు. రూ.7,200కోట్ల నిధులతో ఈ డీపీఆర్‌ను రూపొందిం చారు. వాటిలో భీమిలి నియోజకవర్గాకే సింహభాగం పనులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. వరద నీరు డ్రైనేజీ వ్యవస్థ కోసం భీమిలికి ఏకంగా రూ.1,300కోట్లు కేటాయించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.300 కోట్లతో పనులు ప్రతిపాదించారు. మధురవాడతోపాటు జీవీఎంసీలో కొత్తగా విలీన పంచాయతీల కోసం రూ.600 కోట్లు కేటాయించారు. అంటే రూ.2,200కోట్లు భీమిలి నియోజకవర్గంలో పనుల కోసమే ప్రతిపాదించినట్లు స్పష్టమైంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూడా వరద నీటి డ్రైనేజీ కోసం రూ850కోట్లు ప్రతిపాదించారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో పనులకు మాత్రం జీవీఎంసీ నిధులు విదల్చనే లేదు. వరద ముంపు తీవ్రత ఎక్కువగా ఉన్న విశాఖ దక్షిణ, విశాఖ ఉత్తర, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల గురించి జీవీఎంసీ అసలు పట్టించుకోనే లేదు. ఈ ప్రాంతంలో కొండవాలు కాలనీలు, లోతట్లు ప్రాంతాలు ఉన్నప్పటికీ వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రతిపాదించ లేదు. ఇక తాడో పేడో జీవీఎంసీ తీరుపై నగరంలోని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. తమతో కనీసం సంపరదించకుండానే డీపీఆర్ ఎలా రూపొందిస్తారని ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, గణబాబు, పల్లా శ్రీనివాస్, విజయ్‌కుమార్‌రాజు గుర్రుగా ఉన్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మె సమయమంలో మున్సిపల్ మంత్రి నారాయణ నిర్లక్ష్యపూరిత వైఖరిపై విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బహిరంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జీవీఎంసీ నిధుల కేటాయింపులో కూడా నియోజకవర్గానికి మొండిచెయ్యి చూపడంపై ఆయన మరింతగా మండిపడుతున్నారు. సీఎం వద్దే తాడోపేడో తేల్చుకుంటానని ఆయన తన సన్నిహితుల వద్ద వాఖ్యానిస్తున్నారు. విశాఖ దక్షిణ, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, గణబాబు, పల్లా శ్రీనివాస్ కూడా ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. మున్సిపల్ మంత్రితో చెప్పినా ఫలితం ఉండదని నేరుగా సీఎంతోనే మాట్లాడతామని వారు చెబుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే తాము డివిజన్లలో తిరగలేమని కార్యకర్తల సమక్షంలోనే ఆగ్రహంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
సర్వభక్ష అభియాన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ సర్వశిక్ష అభియాన్.. సర్వభక్ష అభయాన్లా మారింది. కాసులు కురిపించే కామధేనువులా తయారైంది. స్వచ్ఛభారత్‌లో భాగంగా సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1014 మరుగుదొడ్ల నిర్మాణానికి ఏప్రిల్ 20న ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్లాబుతో ఉన్న టాయిలెట్‌కు రూ.లక్షా 76 వేలు, ఓపెన్ టాయిలెట్‌కు 86 వేల చొప్పున సుమారు రూ.13 కోట్లు విడుదలయ్యాయి. వీటి నిర్మాణ బాధ్యతను స్కూలు మేనేజిమెంట్ కమిటీలకు అప్పగించారు. ఆగస్టు 15 నాటికి వీటిని పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 70 శాతం కూడా పూర్తికాలేదని అంటున్నారు. ఒక్కో మరుగుదొడ్డికి మంజూరైన నిధుల్లో 10 శాతం ప్రాజెక్టు అధికారి, ఇంజినీరింగ్ అధికార్లు, సైట్ ఇంజినీర్లు మరో ఐదు శాతం కమీషన్లుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణను వీరు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. దీనిపై లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తవుతున్నాయంటూ తప్పుడు నివేదికలిస్తూ వస్తున్నారు. వాస్తవానికి, నివేదికలకు పొంతన లేదన్న అనుమానంతో మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆనందపురం మండలం బంటుపల్లి కళ్లాలు స్కూలు మరుగుదొడ్ల పరిశీలనలో ఈ వ్యవహారం వెలుగు చూడడం, పీవో, ఈఈలను మాతృ సంస్థలకు సరెండర్ చేయడం తెలిసిందే. కాగా ఎస్ఎస్ఏ కార్యాలయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని కూడా మరుగుదొడ్ల వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. ఈ అవకతవకలపై లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్ని వెలు గు చూసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. పీవో, ఓఎస్డీగా ద్విపాత్రాభినయం.. : సర్వశిక్ష అభియాన్ ప్రస్తుత పీవో నగేష్ మంత్రి గంటాకు కొన్నాళ్ల నుంచి ఓస్డీగా కూడా ఉంటూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని మంత్రి వెంట తరచూ తిరగాలంటూ ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. ఇప్పటిదాకా పనిచేసిన ప్రాజెక్టు అధికారులు టాటా ఇండికా కార్లలోనే తిరిగే వారు. ఇండికా కారుకు నెలకు రూ.25 వేలు చెల్లిస్తే సరిపోయేదని, కానీ ఇన్నోవా కారుకు అంతకు రెట్టింపు రూ.60 వేలకు పైగా చెల్లిస్తున్నారని తెలిసింది. అంతేకాదు.. మంత్రితో వెళ్తున్నట్టు టీఏ, డీఏలు డ్రా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఏజేసీ ద్వారా ఎస్ఎస్ఏ ఫైళ్లు వెళ్లేవని, ఆయన అభ్యంతరాలు చెబుతున్నారంటూ ఇటీవల వాటిని ఓఎస్డీ హోదాలో నేరుగా కలెక్టర్‌కే పంపేస్తున్నారని చెబుతున్నారు. సాక్షాత్తూ మంత్రి గంటానే పీవో కమ్ ఓఎస్డీ నగేష్, ఈఈ భానుప్రసాద్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేయడం చర్చనీయాంశమైంది. నేడో రేపో నగేష్ బదిలీ అవుతారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో మాతృసంస్థకే సరెండర్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
పేట టీడీపీలో తిరుగుబాటు
ఎమ్మెల్యే అనితపై ధ్వజం మంత్రి గంటాపై విమర్శనాస్త్రాలు పాయకరావుపేటలో అసమ్మతి సమావేశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పప్పలతో భేటీ 14న సీఎం వద్ద పంచాయితీ విశాఖపట్నం: జిల్లా టీడీపీలో పుట్టిన ముసలం పదునెక్కుతోంది. టీడీపీని నిలువునా చీల్చేస్తోంది. గంటా, అయ్యన్నవర్గాలుగా కత్తులు నూరుతున్న టీడీపీ వర్గరాజకీయం రోడ్డున పడింది. అందుకు పాయకరావుపేట నియోజకవర్గం వేదికగా మారింది. జిల్లాలో మంత్రి గంటా వర్గంలో కీలకంగా ఉన్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అసమ్మతివర్గం ప్రత్యేకంగా సమావేశమై తాడోపేడో తేల్చుకునేందుకు సంసిద్ధమయ్యారు. మంత్రి గంటా అండ చూసుకునే ఎమ్మెల్యే అనిత నేతలు, కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పప్పల చలపతిరావుతో భేటీ అయి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు 14న సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళికతో బయటపడ్డ టీడీపీ వర్గ విభేదాలు జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సూచికగా నిలుస్తున్నాయి. పార్టీని ముంచుతున్న తీరు.. నియోజకవర్గ టీడీపీ నేతలు ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించారు. నాలుగు మండలాలకు చెందిన దాదాపు 150మంది పాయకరావుపేటలో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేతలు, కార్యకర్తలను ఎమ్మెల్యే గుర్తించడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని విరుచుకుపడ్డారు. నక్కపల్లి మండలంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి నామినేటెడ్ పదవితోపాటు ఐదు పదవులు ఇచ్చిన విషయాన్ని ఉదాహరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పార్టీ కనుమరుగైపోతుందని కూడా తేల్చిచెప్పారు. మంత్రి గంటాపై ధ్వజం మంత్రి గంటా అండదండలు చూసుకునే ఎమ్మెల్యే ఖాతరు చేయడం లేదని పలువురు నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడం వెనుక మంత్రి గంటా హస్తం ఉందని కూడా ఆరోపించారు. పీసీపీఐఆర్ ప్రాజెక్టును నియోజకవర్గంలో ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఎమ్మెల్యే మాత్రం అధికారులతో కలసి బలవంతపు భూసేకరణకు సిద్ధపడటమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా మంత్రి గంటా సూచనల మేరకే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడోపేడో తేల్చుకుంటాం ఈ సమావేశం అనంతరం పాయకరావుపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు యలమంచిలి వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు పప్పల చలపతిరావుతో భేటీ అయ్యారు. డీసీసీబీ డెరైక్టర్ గెడ్డం కన్నబాబు, గెడ్డం బుజ్జి, గొర్రెల రాజబాబు, గెడ్డం రమేష్, బొల్లం సూర్యచలపతి, దేవవరపు శివ, కొండయ్య, సీతారాం తదితరులు పప్పల చలపతిరావును కలిసి ఎమ్మెల్యే అనిత తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. వారిని శాంతింపజేయడానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. సీఎం చంద్రబాబుతో తమకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. ఆయన వద్దే ఎమ్మెల్యే అనిత సంగతి తేల్చుకుంటామమన్నారు. దాంతో 14న సీఎం చంద్రబాబుతో కలిపిస్తానని చలపతిరావు వారికి హామీ ఇచ్చారు. నేతలు, కార్యకర్తలు కొంత శాంతించి సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై కాసేపు చర్చించుకుని వెనుదిరిగారు. జిల్లా టీడీపీని ఓ కుదుపు కుదిపిన ఈ పరిణామం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా నిలుస్తోంది. -
ఇన్చార్జిలతో కాలక్షేపం
సాక్షి, విశాఖపట్నం : మండల విద్యాశాఖాధికారుల (ఎంఈవోల) కొరత జిల్లాను పట్టి పీడిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఈ పోస్టులు భర్తీ కావడం లేదు. దీంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. జిల్లాలో మండలానికొకరు చొప్పున 43 ఎంఈవోలుండాలి. ప్రస్తుతం రెగ్యులర్ ఎంఈవోలు కేవలం ఎనిమిది మందే ఉన్నారు. మిగతా మండలాల్లో ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈవోలుగా పదోన్నతి కల్పించడంపై జిల్లా పరిషత్, ప్రభుత్వ హైస్కూల్ టీచర్ల మధ్య వివాదం తలెత్తింది. తొలుత ఎక్కువ మంది ఉన్న జెడ్పీ హైస్కూల్ వారికి కాకుండా అతి తక్కువ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులకే ఎంఈవోలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల్లో పదోన్నతులు దక్కేవి. 1995లో డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) వచ్చాక జిల్లా పరిషత్, హైస్కూలు ఉపాధ్యాయులకు సమాన హోదా ఉందన్న వాదనతో ప్రభుత్వం సీనియారిటీకి ప్రాధాన్యమిచ్చింది. ఆ మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ఆధారంగా ఎంఈవోలుగా నియమించింది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులు 1998లో సుప్రీంకోర్టుకెళ్లారు. ఈ వివాదం ఇంకా కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన మండలాల్లో సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండే షరతుపై ప్రభుత్వం అడ్హాక్ విధానంలో సీనియర్లయిన జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్లతో ఇన్చార్జి ఎంఈవోలుగా నియమిస్తోంది. ఇలా విశాఖ జిల్లాలోని 43 మండలాల్లో కేవలం సబ్బవరం, పెందుర్తి, అనకాపల్లి, దేవరాపల్లి, యలమంచిలి, మాకవరపాలెం, చోడవరం, హుకుంపేటల్లో (ఎనిమిది మంది) మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. మిగిలిన 35 చోట్ల ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఎవరైనా పదవీ విరమణ చేస్తే అక్కడ ఇన్చార్జి తప్ప కొత్తగా ఫుల్‌టైమ్ ఎంఈవోని వేసే పరిస్థితి లేదు. క్షీణిస్తున్న ప్రమాణాలు: ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మండలంలోని పాఠశాలల్లో విద్యా ప్రగతిని ఎంఈవోలు పర్యవేక్షించాలి. ఇటు హైస్కూలుపైన, అటు మండలంపైన దృష్టి సారించడం వీరికి కష్టతరమవుతోంది. దీంతో విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. ఇన్చార్జి కావడం వల్ల సర్వశిక్ష అభియాన్ నిధులు సకాలంలో వినియోగం కావడం లేదు. ఉపాధ్యాయులకు శిక్షణ తదితర విషయాలపై సమగ్రంగా పర్యవేక్షించలేకపోతున్నారు. ఫలితంగా రెండు పడవలపై ప్రయాణం చేయలేక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. కోర్టు అనుమతితో త్వరలో ఎంఈవో పోస్టుల భర్తీ చేపడతామని ఇటీవల జరిగిన ప్రాంతీయ విద్యా సదస్సులో విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ హామీ కార్యరూపం దాలిస్తేనే జిల్లాలో ఉన్న 35 ఖాళీలు రెగ్యులర్ ఎంఈవోలతో భర్తీ అవుతాయి. -
అసమ్మతి సెగ...అధినేత పొగ
- గంటా తీరుపై సీఎం అసంతృప్తి - సర్వే ఫలితాలే సంకేతం - పెరుగుతున్న వైఫల్యాల చిట్టా - మంత్రి శిబిరంలో మొదలైన గుబులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు చాపకిందకునీళ్లు వస్తున్నాయా!?... ఇన్నాళ్లు జిల్లాలో వైరివర్గాల పోరుతోనే సతమతమవుతున్న ఆయనపై అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నారా!?... టీడీపీలో తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. ఇంటా బయటా ఆయన రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించినట్లుగా చెబుతున్న సర్వేలో గంటాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయన్న సమాచారం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘గంటా పని అయిపోయిం ది’అని నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించారని టీడీపీవర్గాలు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో మంత్రివర్గ పునర్వ్వస్థీకరణ ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో తాజా పరిణామాలు గంటా వర్గంలో గుబులు మొదలైంది. ఇంటా బయటా గడ్డు పరిస్థితి: జిల్లాలో మంత్రి అయ్యన్నవర్గంతో గంటాకస నిత్య కలహమే. అయ్యన్న వర్గానికి బాలకృష్ణ, సీఎం కుమారుడు లోకేష్ మద్దతు ఉందన్న ప్రచారం గంటాను కలవరపరుస్తోంది. మరోవైపు గంటా వ్యవహార శైలిపట్ల సీఎం చంద్రబాబు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. కీలకమైన వ్యవహారాల్లో గంటా స్వతంత్రంగా వ్యవహరించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. తెలంగాణా ప్రభుత్వంతో వివాదాలను రాష్ట్రానికి అనుకూలంగా పరిష్కరించడంలో గంటా తగిన చొరవ చూపించలేదన్న ముద్ర పడింది. ఉన్నత విద్యామండలి, ఎంసెట్, తాజాగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం... ఇలా విద్యా శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ రాష్ట్రం మాట చెల్లుబాటు కావడం లేదు. శాఖపై గంటా పట్టుసాధించలేకపోయారని సీఎం భావిస్తున్నారు. మరోవైపు కౌన్సెలింగ్‌తో నిమిత్తం లేకుండా నేరుగా ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఉపాధ్యాయసంఘాలు ఆందోళన చేశాయి. చివరికి సీఎం జోక్యం చేసుకుని కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాలకు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై కూడా గంటా సత్వరం స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ అంశంలో గంటా వ్యవహారాల శైలిపై అయ్యన్నవర్గం నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేసింది. ఇలా ఒక్కోక్క అంశం గంటాకు వ్యతిరేకంగా పరిణమిస్తూ వచ్చింది. సర్వే చంద్రబాబు సంకేతమా!? : సర్వే ఫలితాలు గంటా వర్గంలో గుబులు పుట్టిస్తున్నాయి. రైతు-డ్వాక్రా రుణమాఫి, పింఛన్లు తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై నిర్వహించిన సర్వే ఫలితాలను సీఎం విజయవాడలో ప్రకటించారు. వాటిలో భీమిలి నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని సీఎం పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. సర్వే అన్నదే లేదని... కేవలం గంటాను తప్పించేందుకు దీన్నో అవకాశంగా సీఎం తెరపైకి తెచ్చారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటా పని అయిపోయిందని జిల్లాలో ఆయన వైరివర్గం విసృ్తతంగా ప్రచారం చేస్తోంది. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా కొందరితో మాట్లాడుతూ ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘గంటా పని అయిపోయింది’
గంటా తీరుపై సీఎం అసంతృప్తి సర్వే ఫలితాలే సంకేతం పెరుగుతున్న వైఫల్యాల చిట్టా మంత్రి శిబిరంలో మొదలైన గుబులు విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు చాప కిందకు నీళ్లు వస్తున్నాయా!?... ఇన్నాళ్లు జిల్లాలో వైరివర్గాల పోరుతోనే సతమతమవుతున్న ఆయనపై అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నారా!?... టీడీపీలో తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. ఇంటా బ యటా ఆయన రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించినట్లుగా చెబుతున్న సర్వే లో గంటాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయన్న సమాచారం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘గంటా పని అయిపోయింది’ అని నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని టీడీపీవర్గాలు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో మంత్రివర్గ పునర్వ్వస్థీకరణ ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో తాజా పరిణామాలు గంటా వర్గంలో గుబులు మొదలైంది. ఇంటా బయటా గడ్డు పరిస్థితి: జిల్లాలో మంత్రి అయ్యన్నవర్గంతో గంటాకి నిత్య కలహమే. అయ్యన్న వర్గానికి బాలకృష్ణ, సీఎం కుమారుడు లోకేష్ మద్దతు ఉందన్న ప్రచారం గంటాను కలవరపరుస్తోంది. మరోవైపు గంటా వ్యవహార శైలిపట్ల సీఎం చంద్రబాబు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. కీలకమైన వ్యవహారాల్లో గంటా స్వతంత్రంగా వ్యవహరించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. తెలంగాణా ప్రభుత్వంతో వివాదాలను రాష్ట్రానికి అనుకూలంగా పరిష్కరించడంలో గంటా తగిన చొరవ చూపించలేదన్న ముద్ర పడింది. ఉన్నత విద్యామండలి, ఎంసెట్, తాజాగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం... ఇలా విద్యా శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ రాష్ట్రం మాట చెల్లుబాటు కావడం లేదు. శాఖపై గంటా పట్టుసాధించలేకపోయారని సీఎం భావిస్తున్నారు. మరోవైపు కౌన్సెలింగ్‌తో నిమిత్తం లేకుండా నేరుగా ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఉపాధ్యాయసంఘాలు ఆందోళన చేశాయి. వరికి సీఎం జోక్యం చేసుకుని కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాలకు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై కూడా గంటా సత్వరం స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ అంశంలో గంటా వ్యవహారాల శైలిపై అయ్యన్నవర్గం నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేసింది. ఇలా ఒక్కోక్క అంశం గంటాకు వ్యతిరేకంగా పరిణమిస్తూ వచ్చింది. సర్వే చంద్రబాబు సంకేతమా!? : సర్వే ఫలితాలు గంటా వర్గంలో గుబులు పుట్టిస్తున్నాయి. రైతు-డ్వాక్రా రుణమాఫి, పింఛన్లు తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై నిర్వహించిన సర్వే ఫలితాలను సీఎం విజయవాడలో ప్రకటించారు. వాటిలో భీమిలి నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని సీఎం పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. సర్వే అన్నదే లేదని... కేవలం గంటాను తప్పించేందుకు దీన్నో అవకాశంగా సీఎం తెరపైకి తెచ్చారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటా పని అయిపోయిందని జిల్లాలో ఆయన వైరివర్గం విసృ్తతంగా ప్రచారం చేస్తోంది. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా కొందరితో మాట్లాడుతూ ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
రిషితేశ్వరి మృతిపై 10న తుది నివేదిక
మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి విశాఖపట్నం: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి నివేదిక సిద్ధం కానున్నట్లు రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక సిద్ధమైందని తెలిపారు. ఏయూలో సోమవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ విషయాలను వివరించారు. రిషితేశ్వరి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఘటనపై గంటన్నర పాటు చర్చించినట్లు తెలిపారు. రిషితేశ్వరి తల్లిదండ్రుల్లో ఎంతో బాధ్యత కనిపించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు వివరించారు. కళాశాలల ప్రవేశ సమయంలో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ర్యాగింగ్‌కు పాల్పడబోననే అఫిడవిట్‌ను తీసుకోనున్నట్లు వివరించారు. -
ర్యాగింగ్‌పై మంత్రివర్గం స్పందించేనా?
* రిషితేశ్వరి మృతి కేసుపై ప్రభుత్వ ఉదాశీనత * క్యాబినెట్లో చర్చిస్తామన్న మంత్రి గంటా మాటలు.. ఒట్టిదేనా? సాక్షి, గుంటూరు: ర్యాగింగ్ కోరలకు బలైన విద్యార్థిని రిషితేశ్వరి కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదు. మొక్కుబడిగా విచారణ కమిటీని ఏర్పాటు చేసి, విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తదుపరి చర్యలపైనా పెద్దగా స్పందిస్తున్న దాఖలాల్లేవు. ఘటన జరిగినప్పుడు దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. విద్యార్థిని మృతిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులెవరూ స్పందించడంలేదు. దీంతో ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. రిషితేశ్వరి మృతి అనంతరం ఈ నెల 18న వర్సిటీకి వచ్చిన ఏపీ మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి హడావుడి చేశారు. ర్యాగింగ్‌పై ఏపీ సీఎం సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిర్భయ కంటే కఠిన చట్టాలు తీసుకొస్తామని, దీనిపై ఈనెల 22న రాజమండ్రిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాలన్నీ విలేకరులకు, ఫోన్లో మాట్లాడి రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణకు చెప్పారు. అయితే ఈ నెల 22న జరిగిన క్యాబినెట్ భేటీలో ర్యాగింగ్‌పై కఠిన చట్టాలు తెచ్చే విషయంలో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో మంత్రి మాటలన్నీ నీటిమూటలేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో జరిగే క్యాబినెట్ సమావేశంలోనైనా రిషితేశ్వరి వ్యవహారంపై చర్చించి, ర్యాగింగ్‌పై కఠిన చట్టాలు చేయాలని నిర్ణయిస్తారా అన్నది అనుమానంగానే ఉంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని మొండి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.గోపీచంద్ ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేశారు. నిందితుల బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగాల్సి ఉండగా.. ఈ కేసుకు సంబంధించిన డైరీ అందనందువల్ల వాయిదా కావాలని ఏపీపీ కె.రామచంద్రరావు కోరారు. దీంతో పిటిషన్‌ను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రిషితేశ్వరి మృతి కేసులో దుంపా హనీషా, దారావత్ జైచరణ్, నరాల శ్రీనివాస్‌లను దోషులుగా పేర్కొంటూ పెదకాకాని పోలీసులు వారిని ఈ నెల 16న అరెస్టుచేశారు. కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈ నెల 31 వరకు వారికి రిమాండ్ విధించారు. -
విశాఖ ఖ్యాతి ఇనుమడించేలా స్వాతంత్య్ర దిన వేడుకలు
మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాట్లు పరిశీలన మహారాణిపేట(విశాఖ) : విశాఖ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేలా ఈసారి స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం తొలిసారిగా స్వాతంత్య్రదిన వేడుకలను విశాఖలో నిర్వహిస్తున్నందున నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లుపై మంత్రి గురువారం బీచ్‌రోడ్‌లో కలెక్టర్ యువరాజ్, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. వేడుకలకు సంబంధించి వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు, పోలీస్ పరేడ్, జెండావందనం, కవాతు, రాష్ట్రప్రగతిని ఇనుమడింప చేసేలా ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసే శకటాలు తిరిగే ఏరియాలను పరిశీలించారు. ‘విశ్వప్రియ’ వద్ద వేదిక విశ్వప్రియా ఫంక్షన్‌హాల్ దగ్గరున్న డైనోసర్ బొమ్మల వద్ద వేదిక ఏర్పాటు చేస్తామని దానికి ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై జాతీయజెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ యువరాజ్ తెలిపారు. వేదికకు ఇరువైపులా ప్రజలు కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బీచ్‌లో బొమ్మలకు ఎలాంటి నష్టం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 16 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 16 విభాగాలవారు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి శకటాలు ప్రదర్శిస్తామన్నారు. పాండురంగస్వామి ఆలయం మీదుగా సీఎం కాన్వాయ్ వచ్చేందుకు రూట్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తెలిపారు. 25 నిమిషాల పాటు పరేడ్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, అధికారులు వస్తున్నందున ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సూచించారు. తీవ్రవాదులు ప్రభావంతో దేశంలో హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అమిత్‌గార్గ్‌కు సూచించారు. ఏసీపీ కె.ప్రభాకర్, జీవీఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
విశ్వవిద్యాలయాల ప్రక్షాళనకు చర్యలు : మంత్రి గంటా
ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూలో సోమవారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల వీసీల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 అంశాలపై తీర్మానాలు చేశారు. ఆ వివరాలను మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ వల్ల మృతిచెందిన రిషితేశ్వరి సంఘటన నేపథ్యంలో ర్యాగింగ్ నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విశ్వవిద్యాలయాల హాస్టల్లో ఉన్న బయటి వ్యక్తులను క్యాంపస్ నుంచి ఖాళీ చేయించి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా విద్యార్థినులు, మహిళా అధ్యాపకులపై వేధింపుల నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు. క్యాంపస్‌లోని భూములను పరిరక్షించేందుకు కమిటీని నియమించాలని నిర్ణయించామన్నారు. క్యాంపస్‌లో బయటి వ్యక్తులను హాస్టల్ నుంచి ఖాళీ చేయించాలని, క్యాంపస్‌లలో వైఫై, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ఆగస్టు చివరికల్లా ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. కుల, మత సంఘాలను నిషేధిస్తున్నామన్నారు. గత ఏడాది డిసెంబర్ 18, 19తేదీల్లో ముఖ్యమంత్రి నిర్వహించిన వీసీల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయాలని, యూనివర్సిటీల్లోని ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి నివేదిక రూపొందించాలని ఆదేశించామన్నారు. మూడు నెలలకొకసారి వీసీల సదస్సు నిర్వహించి సమస్యలపై చర్చించనున్నట్టు తెలిపారు. వచ్చే వీసీల సదస్సు అక్టోబర్ 9న కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని తీర్మానించామన్నారు. -
ముందు సమ్మె ఆపితే తరువాత చూద్దాం
►జీవీఎంసీ ఉద్యోగ జేఏసీ నేతలకు మంత్రుల సూచన ►ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న కార్మిక నేతలు ►నేడు జేఏసీ నేతల ప్రత్యేక సమావేశం ► సమ్మె విరమిస్తారో.. కొనసాగిస్తారో తేలే అవ కాశం విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ సిబ్బంది 13 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూనే మరి కొంత గడువు కావాలన్నారు. ముందుగా సమ్మె విరమిస్తే పూర్తి స్థాయిలో చర్చలు జరిపి 20 రోజుల్లో వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. బుధవారం రాజమండ్రి ఆర్అండ్బి అతిథి గృహంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం అయిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మున్సిపల్ మంత్రి నారాయణ, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావుల వద్దకు విశాఖ నగర ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబులు జీవీఎంసీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.వి.వామనరావు ఇతర నేతలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రులు ముందుగా సమ్మె విరమించండి.. మీ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వామనరావు జీవీఎంసీలో ఉద్యోగుల సమస్యలను మంత్రులకు ఏకరువు పెట్టారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను ఒకలా, జీవీఎంసీని ప్రత్యేకంగా చూస్తుండడం వల్ల ఉద్యోగులు అన్ని విధాలా నష్టపోతున్నారని వివరించారు. జీవీఎంసీ ఉద్యోగుల సంక్షేమంతో పాటు నగర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలతో ఈ సమ్మెకు దిగినట్టు స్పష్టం చేశారు. దీనిపై మంత్రులు మాట్లాడుతూ మీవన్నీ న్యాయమైన డిమాండ్లే.. వాటిని పరిష్కరిస్తాం.. అందుకు కొద్ది రోజులు సమయం ఇవ్వండి... సమ్మె విరమించి విధుల్లో చేరిన 20 రోజుల్లో అందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీనిచ్చారు. అయితే దీనిపై ఆలోచించి నిర్ణయం చెబుతామని జేఏసీ ప్రతినిధులు బయటకొచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు గుర్తింపు కార్మిక సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఎం. పద్మనాభరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నుంచి కె.సత్యనారాయణ, ఐఎన్టీయూసీ నుంచి కనకరాజు, బీఎంఎస్ నుంచి ఎల్.భాస్కర్‌రావు, హెచ్ఎంఎస్ నుంచి కె.రామ్మూర్తి తదితరులు హాజరయ్యారు. నేడు జేఏసీ నిర్ణయం!: మంత్రులు ఇచ్చిన హామీల మేరకు గురువారం ఉదయం జేఏసీ నేతలందరూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మంత్రులు ఇచ్చిన హామీలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి తదుపరి నిర్ణయం ప్రకటించనున్నారు. అనంతరం చర్చల వివరాలు, జేఏసీ నిర్ణయాన్ని మీడియాకు తెలియజేస్తారు. సమ్మె విరమించేది, లేనిది గురువారం మధ్యాహ్నం తేలిపోనుందని జేఏసీలోని ఓ కీలక నేత స్పష్టం చేశారు. -
అయిదో రోజుకు కార్మికుల సమ్మె
- మంత్రి గంటాతో తేలని చర్చలు - సమ్మె విరమించేదిలేదన్న జేఏసీ నేతలు - నేటి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు:కమిషనరు విశాఖపట్నం సిటీ : మహా నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల సమ్మె మంగళవారానికి అయిదో రోజుకు చేరింది. ఔట్సోర్సింగ్,పారిశుధ్య కార్మికుల సమ్మె అయిదు రోజులుగా జరుగుతుంటే వారికి మద్దతుగా చేపట్టిన రెగ్యులర్ ఉద్యోగుల సమ్మె 010 పద్దు జీతాల కోసం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు చెందినదని, జీవీఎంసీలో జరుగుతున్న సమ్మెతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు 010 పద్దులో జీతాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.విశాఖలోనే తమ జీతాలు 010 పద్దులో ఇవ్వడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇస్తున్నారని గుర్తింపు కార్మిక సంఘం స్పష్టంచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమించినా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె విరమించే అవకాశమే లేదంటున్నారు. తూతూ మంత్రంగా మంత్రి గంటా చర్చలు మంత్రి గంటా శ్రీనివాసరావు జేఏసీ నేతలందరితో సమావేశం ఏర్పాటు చేశారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఛాంబర్లో గంట పాటు చర్చలు జరిపారు. ఆశించిన ప్రకటన మంత్రి చేయలేదు. దీంతో చర్చల్లో ఏమీ తేలలేదు. పని చే సే వారికి అడ్డుపడొద్దని మంత్రి గంటా శ్రీనివాసరావు మున్సిపల్ జేఏసీ నేతలకు సూచించారు. కమిషనర్ ఛాంబర్లో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సమ్మె విష యం మున్సిపల్, ఆర్ధిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఎవరూ అడ్డుపడొద్దని సూచించారు. ఆగ్రహంగా కమిషనర్ ప్రవీణ్..! కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహంగా కనిపించారు. సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన పారిశుద్ద్య కార్మికులకు, మున్సిపల్ పారిశుద్ద్య కార్మికులకు మధ్య మంగళవారం పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత వతావరణం ఏర్పడేందుకు కమిషనర్ చర్యలే కారణమంటూ జేఏసీ నేతలు ఆరోపించడంతో కమిషనర్ మరింత ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి గంటా చర్చలప్పుడు కూడా కమిషనర్ ఆగ్రహంతోనే కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఒకటి రెండు చోట్ల కమిషనర్‌కు జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతీ నెలా జీతాలు ఇవ్వలేం..! రూ. 2 వేల కన్నా అదనంగా పారిశుద్ద్య కార్మికులకు జీతాలు పెంచితే జీవీఎంసీ ప్రతీ నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించలేదని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జీవీఎంసీకి వచ్చే ఆ దాయం రూ. 550 కోట్లు అయితే అందులో ప్రతీ ఏటా జీతాలు, పెన్షన్లు కోసం రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నామని జీతాలు పెంచితే రూ. 321 కోట్లకు బడ్జెట్ పెరుగుతుందని వివరించారు. వ్యాధులు ప్రబలకుం డా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్చంద సంస్థల సహకారంతో బుధవారం నుంచి చెత్తలు తొలగించనున్నట్లు ప్రకటించారు. 400 మంది ప్రైవేట్ వర్కర్లు, 25 జేసీబీలు, 52 లారీలు, 36 మంది డ్రైవర్లను రంగంలోకి దించి చెత్తను తొలగిస్తామన్నారు. రెచ్చగొడితే ఊరుకోం పారిశుద్ద్య కార్మికుల పని ఎవరైనా చేయొచ్చని అయితే రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదని జీవీఎంసీ గుర్తింపు కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ వివి వామన రావు స్పష్టం చేశారు. అఖిల పక్ష నేతలందరితో కలిసి ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచీ జీవీఎంసీలో అంతా సమ్మెలోకి వచ్చినట్టయ్యిందని చెప్పారు. తాగునీరు, వీధి లైట్లు తప్పా మిగిలిన అత్యవసర పనుల్లో దేనికీ కార్మికులు హాజరు కావడం లేదన్నారు. 010 పద్దుతో జీతాలు వచ్చే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం
కొనసాగిన మున్సిపల్ కార్మికుల నిరసనలు విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాల వద్ద మంగళవారం మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు. ఇదిలాఉండగా ప్రభుత్వం ఒకవైపు చర్చల పేరుతో బుజ్జగిస్తూనే మరోవైపు సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేస్తోంది. సమ్మెకు దిగిన పర్మినెంట్ ఉద్యోగులకు సర్వీస్ బ్రేక్ అవుతుందని,బెదిరిస్తోంది. కాగా విశాఖలో మున్సిపల్ కార్మికులతో మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.బుధవారం రాజమండ్రిలో జేఏసీతో చర్చలు జరుపుతామని గంటా ప్రకటించారు. -
రెవెన్యూలో అక్రమాల పుట్ట
♦ తీగలాగితే కదులుతున్న డొంక ♦ ప్రస్తుత కలిగిరి తహశీల్దార్ సస్పెన్షన్ ♦ మరో తహశీల్దార్‌పై జరుగుతున్న విచారణ కొండాపురం : ఉదయగిరి నియోజకవర్గంలోని రెవెన్యూలో అక్రమాల పుట్ట పగలింది. తీగలాగితే డొంక కదులుతోంది. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి కొండాపురం.. ఇప్పటి కలిగిరి తహశీల్దార్ లావణ్యపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. కొండాపురంలో తహశీల్దార్‌గా పని చేసిన మరో తహశీల్దార్‌పై కూడా శాఖపరమైన విచారణ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సంబంధించిన భూములకు, అటవీ భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు పలు ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాల సృష్టించిన విషయంలో తహశీల్దార్ లావణ్య పాత్ర ఉన్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై విచారణ చేసిన రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రాథమిక ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది. గతంలో కొండాపురం మండలంలో పనిచేసిన మరో తహశీల్దార్‌పై కూడా శాఖా పరమైన విచారణ ప్రారంభమైనట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి తయా రు చేసిన పట్టాలను బ్యాంకుల్లో పెట్టి సుమారు కోటి రూపాయల వరకు రుణాన్ని తెచ్చుకుంటున్న రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు సమాచారం. వచ్చిన ఆరోపణలు ఇవి.. గానుగపెంట పంచాయతీలోని సర్వే నంబర్ 287లో ఉన్న అనాధీనం 60 ఎకరాల పొరంబోకు భూమి, సర్వే నంబర్లు 244, 45లోని వాగు పొరంబోకు, శ్మశాన భూమి 7 ఎకరాలు, సర్వే నంబర్ 382లోని 12 ఎకరాల అటవీ భూమికి నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించారు. గానుగపెంట ఎస్సీ కాలనీని సాగు భూమిగా చూపుతూ పట్టాలు మంజూరు చేశారు. పొట్టిపల్లిలోని 100,101 సర్వే నంబర్లలో ఉన్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన 60 ఎకరాల భూములను 25 మంది పేరున పట్టాలు మంజూరు చేశారు. సదరు వ్యక్తులు నకిలీ పట్టాలతో వివిధ బ్యాంకులు, సొసైటీల్లో పెట్టి రూ.కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి గంటా భూముల వ్యవహారంపై గతేడాది డిసెంబర్లో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. కలిగిరిలోనూ.. కలిగిరి మండలంలో నకిలీ పట్టాలపై ఆమెను విచారణ అధికారిగా జిల్లా ఉన్నతాధికారులు నియమించారు. తహశీల్దార్‌గా పనిచేస్తున్న కలిగిరి మండలంలోనూ ఆమె పేరున ఉన్న నకిలీ పట్టాలు వెలుగులోకి వచ్చినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవి బయటకు రాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆధార్ కార్డుల అనుసంధానంతోనే ఆధార్ కార్డులను బ్యాంకుల్లో పాస్‌బుక్‌లకు అనుసంధానంతోనే ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ అక్రమాలపై జేసీ కలిగిరి, కొండాపురం మండలాల్లో విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. మరో తహశీల్దార్‌పై కొనసాగుతున్న విచారణ కొండాపురంలో గతంలో పనిచేసిన మరో తహశీల్దార్‌పై శాఖా పరమైన విచారణ జరుగుతున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెపై విచారణ జరుగుతుంది. దీంతో ఆ తహశీల్దార్‌కు పదోన్నతి కూడా ఆగినట్లు సమాచారం. -
ఉన్నత విద్యామండలిలో ఫైళ్ల విభజన
అంగీకరించిన టీ-సర్కారు దీనిపై రెండు రాష్ట్రాల నుంచి 8 మంది అధికారులతో కమిటీ ఇరు రాష్ట్రాల విద్యా మంత్రుల భేటీలో నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధీనంలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చెందిన ఫైళ్ల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఏపీ ఉన్నత విద్యా మండలికి ప్రస్తుత తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్న భవనంలో చోటు కల్పించే విషయంలో మాత్రం అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈనెల 12 నుంచి ఏపీకి చెందిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఫైళ్లు తమకు ఇవ్వడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం గంటా శ్రీనివాసరావుతో కలసి గవర్నర్‌ను కలసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి....నరసింహన్ సూచన మేరకు తన చాంబర్లో గంటా శ్రీనివాసరావుతో భేటీఅయ్యారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సెలింగ్ నిర్వహణకు ఫైళ్లు, సిబ్బంది ఏపీ కౌన్సిల్‌కు అవసరం ఉన్నందున ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఇందుకు రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున అధికారులతో కమిటీ వేయాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు. ఆ కమిటీ ఫైళ్లను పరిశీలించి విభజించనుంది. సమావేశం అనంతరం కడియం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, వారికి కౌన్సెలింగ్ సజావుగా జరిగేందుకు ఈ మేరకు అంగీకరించినట్లు తెలిపారు.ఇందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. పదో షెడ్యూలులోని మిగితా అంశాలపై తరువాత మరోసారి సమావేశం అవుతామని, అవసరమైతే ముఖ్యమంత్రులు, గవర్నర్ సమావేశమై చర్చిస్తారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మరోవైపు వరంగల్ ఎన్ఐటీలో తమకు సీట్ల విషయమై త్వరలో హైదరాబాద్ రానున్న కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చిస్తామని గంటా పేర్కొనగా ఏపీలో మరో ఎన్ఐటీ కావాలని అడగాలంటూ కడియం చమత్కరించారు. -
‘టీడీపీ’లో ‘మాడుగుల’ చిచ్చు
- ఇన్చార్జి బాధ్యతలను ‘గవిరెడ్డి’ని తప్పించే యత్నం - పావులు కదుపుతున్న అనకాపల్లి ఎంపీ - గంటాతో మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీ సాక్షి, విశాఖపట్నం: జిల్లా అధ్యక్షునిగా గవిరెడ్డి రామానాయుడ్ని సాగనంపే వరకు భీష్మించుకొని కూర్చున్న మంత్రిగంటా శ్రీనివాసరావు వర్గం ఇప్పుడు మాడుగుల ఇన్చార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించేందుకు పావులు కదుపుతోంది. శనివారం మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ అవంతి శ్రీనివాసరావు మంత్రి గంటాతో సమావేశమై చర్చించారు. ఏజెన్సీకి చెందిన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీ లతో పాటు పలువురు సర్పంచ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. రూరల్ జిల్లా అధ్యక్షునిగా సీనియర్ నాయకుడైన పప్పల చలపతి రావును ఎంపికచేయడం పట్ల మంత్రిగంటాకు వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాడుగుల ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడ్ని తప్పించి ఆయన స్థానంలో పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వారిని నియమించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి గంటా దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు విశాఖలో శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధ్యక్షునిగా గవిరెడ్డిని కొనసాగించాలని మంత్రి అయ్యన్న వర్గం పట్టుబట్టగా ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించడానికి వీల్లేదంటూ గంటా పట్టుబట్టారు. మధ్యే మార్గంగా పార్టీ అధినాయకత్వం పప్పల చలపతిరావు పేరును తెరపైకి తీసుకు రావడంతో ఇరువర్గాలు ఆయన అభ్యర్థిత్వం పట్ల ఆమోద ముద్ర వేశాయి. తాజాగా గవిరెడ్డిని టార్గెట్ చేసిన గంటా ఆయన్ని మాడుగుల ఇన్చార్జి బాధ్యతలను తప్పించాలన్న పట్టుదలతో ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది. -
కలహాల కాపురం
►టీడీపీలో ముదురుతున్న అంతర్గత కుమ్ములాటలు ► జిల్లా అధ్యక్షుని ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ► ఏడాదవుతున్నా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల నియామకంలో జాప్యం ► నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ► హాజరు కానున్న ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ► సమావేశం సజావుగా సాగేనా? సాక్షి, కడప : తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా....దేశం శ్రేణుల్లో ఉత్సాహం లేదు...పైగా నిస్తేజం అలుముకుంది. అధికార పార్టీలో ఉన్నా పనులు జరగక పోవడం..పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు క్యాడర్‌ను కుంగదీస్తున్నాయి. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కడపలో మాత్రం ప్రతిపక్షంగానే చెప్పుకోవచ్చు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిందిటిని కైవసం చేసుకోగా, టీడీపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా తెలుగుదేశంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య అసమ్మతి సెగలు కమ్ముకుని.. ఎవరికి వారు పార్టీలో వర్గాలను పెంచి పోస్తున్నారు. గతంలో కడపలో జరిగిన సమావేశంలో కడప ఇన్‌ఛార్జి విషయమై గొడవ జరగగా...జిల్లా అధ్యక్షుడు కార్యకర్తపై చేయి చేసుకునే స్థాయికి వెళ్లింది. దీంతో సమావేశం రచ్చరచ్చగా మారి సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టుడికింది. రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్యనే ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నేటి వరకు ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకు ఇన్‌ఛార్జిల నియామకం జరగకపోవడానికి కూడా వర్గాల మధ్య పోరే కారణమన్నది బహిరంగ సత్యం. బద్వేలులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయజ్యోతి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పులివెందులలోనూ ముక్కోణపు పోరు నడుస్తోంది. ఒకవైపు డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, మరోవైపు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, ఇంకోవైపు నియోజకవర్గ టీడీపీ నాయకుడు రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) వర్గాలుఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజంపేటలో కూడా బ్రహ్మయ్య, మేడా మల్లికార్జునరెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ప్రొద్దుటూరులో కూడా లింగారెడ్డి, వరదరాజులురెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కడప నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ కూడా మూడు, నాలుగు వర్గాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల, రాయచోటి, కడప, రాజంపేటలలో నేతల మధ్య వర్గపోరుతో ఇన్‌ఛార్జి నియామకాలు ఇంతవరకు చేపట్టలేదు. అధ్యక్షుని ఎంపికపై ప్రతిష్టంభన వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం లింగారెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఇప్పటికే చంద్రబాబు సర్వే ద్వారా వివరాలు సేకరించినా ఇంతవరకు అధ్యక్షుని పేరు ప్రకటించలేదు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, పార్లమెంటు ఇన్‌ఛార్జి శ్రీనివాసులురెడ్డి (వాసు), ప్రస్తుత అధ్యక్షుడు లింగారెడ్డిలు పోటీ పడుతున్నారు. అధ్యక్షుడి పేరు ప్రకటించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీడీపీ సమావేశానికి ‘గంటా’ కడపలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ సాయి శ్రీనివాస కల్యాణ మండపంలో టీడీపీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు కానున్నారు. ఇప్పటికే జిల్లా టీడీపీలో విభేదాలు ముదరడం....నేతల మధ్య సయోధ్య లేకపోవడం....పార్టీలో నిస్తేజం నెలకొన్న నేపథ్యంలో మంత్రి సమక్షంలో జరగనున్న సమావేశం వాడి వేడిగా జరిగే అవకాశముందని కార్యకర్తలు భావిస్తున్నారు. -
20న పదో తరగతి ఫలితాలు విడుదల
26న ఎంసెట్, జూన్ 1న డీఎస్సీ ఫలితాలు : గంటా విశాఖపట్నం (మహారాణిపేట): టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారమిక్కడ అధికారులతో సమీక్షించారు. పదో తరగతి, ఎంసెట్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిందన్నారు. ఈ నెల 20వ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 26న ఎంసెట్ ఫలితాలను, జూన్ 1న డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ) ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఇంటర్లో బాలికలే బెస్ట్
మొత్తం ఉత్తీర్ణత.. 72.07 శాతం సాక్షి ప్రతినిధి, కర్నూలు: మళ్లీ అమ్మాయిలదే పైచేయి. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు బాగా వెనుకబడ్డారు. ఈ పరీక్షల్లో మొత్తం 72.07 శాతం మంది ఉత్తీర్ణులవగా.. 74.80 శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో నిలిచారు. బాలుర ఉత్తీర్ణత 69.43 శాతమే. మంగళవారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. ఫస్టియర్ ఫలితాల్లో తెలంగాణలో 55 శాతం మంది ఉత్తీర్ణులవగా.. ఏపీలో 61 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ తెలంగాణ(63 శాతం) కంటే ఏపీలో 9 శాతం అధికంగా 72.07 శాతం ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. విద్యారంగంలో ఏపీ నంబర్‌వన్‌గా ఎదుగుతోందని ఆయన చెప్పారు. 72 శాతం మంది ఉత్తీర్ణత! ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,03,496 మంది హాజరవగా.. ఇందులో 2,90,789 మంది ఉత్తీర్ణత(72.07 శాతం) సాధించారని మంత్రి తెలిపారు. కృష్ణా ఫస్ట్... వైఎస్సార్ జిల్లా లాస్ట్! మొదటి సంవత్సరం ఫలితాల మాదిరిగానే కృష్ణా జిల్లా 83 శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. రెండో స్థానంలో 77 శాతంతో నెల్లూరు జిల్లా, 76 శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మూడో స్థానంలో నిలిచాయన్నారు. 2 నుంచి మెమోల జారీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆయా కాలేజీల్లో మే 2వ తేదీ నుంచి మెమోలను తీసుకోవచ్చునని మంత్రి గంటా వివరించారు. ఫెయిలైన విద్యార్థులకోసం మే 1 నుంచి మూడు వారాలపాటు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఇందుకోసం పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 5 ఆఖరు తేదీ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఇంటర్ బోర్డు కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
కర్నూలులో విడుదల చేయనున్న మంత్రి గంటా సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం (జనరల్, ఒకేషనల్) పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ సుసోడియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ ఎంవీ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫలితాలను వివిధ వె బ్సైట్లలో పొందుపర్చనున్నట్లు ఎంవీ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు www.sakshi.com లో కూడా అందుబాటులో ఉంటాయి. -
నేడు ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్సు హాలులో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల సంబంధిత సమాచారాన్ని వివిధ వెబ్సైట్లలో ఉంచనున్నారు. హెచ్‌టీటీపీ://ఎగ్జామ్రిజల్ట్స్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్, హెచ్‌టీటీపీ://రిజల్ట్స్.సీజీజీ.జీఓవీ.ఇన్, డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఇండియారిజల్ట్స్. కామ్, విద్యావిజన్.కామ్, మనబడి.కామ్, మనబడి.కో.ఇన్, గోరిజల్ట్స్.నెట్, 99రిజల్ట్స్.కామ్, స్కూల్స్9.కామ్, ఎగ్జామ్టీసీ.కామ్, భారత్స్టూడెంట్.కామ్, రిజల్ట్స్. ఎడ్యుకేషన్ఆంధ్ర.కామ్ తదితర వెబ్సైట్లతో పాటు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. -
అరకు రైలుకు అద్దాల బోగీలు
► హెరిటేజ్ సిటీగా భీమిలి ► పాడేరులో బటర్‌ఫ్లై పార్కు ► మే రెండో వారంలో అరకు ఉత్సవ్ ► ఆర్ట్ గ్యాలరీగా మార నున్న రాజీవ్ స్మృతి భవన్ ► పర్యాటక ప్రాధాన్యంపై మంత్రి గంటా సమీక్ష విశాఖపట్నం సిటీః విశాఖను పర్యాటక అందాల రాజధానిగా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా వసతుల కల్పనపై దృష్టి సారించింది. ప్రస్తుతమున్న పర్యాటక ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త ప్రాజెక్టులను ఎక్కడెక్కడ చేపట్టాలనే దానిపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానిక అధికారులతో శుక్రవారం వుడా కార్యాలయంలో సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్, టూరిజంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బినయ్‌కుమార్ ప్రసాద్, వుడా వైస్ చైర్మన్ డాక్టర్ బాబూరావు నాయుడు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జే నివాస్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హరినారాయణన్, వివిధ శాఖల ముఖ్య ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మే నెల రెండో వారంలో అరకు ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించాలని అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలని నిర్ణయించారు. సింహాచలం కొండపై రోప్‌వే ఏర్పాటు చేసి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవాలని అందుకు అభ్యంతరాలపై దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కొండపై స్టార్ హోటల్ స్థాయిలో కాటేజీలు నిర్మించి భక్తులు, పర్యాటకులు రాత్రి వేళల్లోనూ బస సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించవచ్చని గుర్తించారు. సముద్రంలో రెండు మూడు రోజుల పాటు విహరిస్తూ ఆనందంగా గడపడానికి అవసరమైన క్రూయిజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటివాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరకు ప్రాంతానికి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు ప్రస్తుతం నడుస్తున్న 1వీకే ప్యాసింజర్‌కు రెండు అద్దాల బోగీలను జత చేసే ప్రయత్నం పై మళ్లీ కదలిక తెచ్చారు. ఈ సారి ఎలాగైనా రెండు బోగీలను జత చేసేలా ప్రయత్నించాలని మంత్రి గంటా అధికారులను ఆదే శించారు. భీమిలి పట్టణాన్ని హెరిటేజ్ ప్రాంతంగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హనుమంతవాక వద్ద నిర్మాణమైన విమ్స్‌కు రూ. 30 కోట్లు మంజూరయ్యాయి. మరో రూ. 30 కోట్లు కేటాయిస్తే ఓ 200 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించవచ్చని సమావేశంలో చెప్పుకున్నారు. అయితే టాటా కేన్సర్ ప్రాజెక్టు వారు ఈ ఆస్పత్రిని కేటాయించాలని కోరుతున్నారని అందుకే ఎటూ నిర్ణయం తీసుకోలేదని మంత్రి గంటా తేల్చిచెప్పారు. -
కనుల పండువగా వైజాగ్ ఫెస్ట్
విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరం మరి కొద్దిరోజుల్లోనే నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లతో అభివృద్ధి చెందనుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎ.గిరిధర్ అన్నారు. నగరంలోని ఓ హోటల్ లో శుక్రవారం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓ చిన్న మత్స్యకార పల్లెగా ఉన్న విశాఖ ఇప్పుడు సకల సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజేసే ఒక బృహత్ ప్రయత్నానికి విశాఖ వేదికైంది. వైజాగ్ ఫెస్ట్-2015కు శుక్రవారం సాయంత్రం తెర లేచింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ భారీ ప్రదర్శనకు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిని ప్రారంభించారు. బుక్స్ బుక్స్ లవ్లీ బుక్స్ వైజాగ్ ఫెస్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన చదువరులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ చరిత్రకారుడు బిపిన్‌చంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 200 వరకూ బుక్ స్టాల్స్ నెలకొల్పారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, కేంద్ర సాహిత్య అకాడమీ, ప్రజాశక్తి బుక్‌హౌస్, వి శాలాంధ్ర ప్రచురణ సంస్థ, పీకాక్ క్లాసిక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఓరియంట్ బ్లా క్స్వాన్, జనవిజ్ఞాన వేదిక, ఎమెస్కో, బుక్స్వాలా, సైన్స్ యూనివర్సల్ వంటి 115 పబ్లిషింగ్ సంస్థల ప్రచురణలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గొల్లపూడి వీరాస్వామి సన్స్, అనల్ప బుక్స్, నీల్కమల్ పబ్లికేషన్స్, జ్యోతి, హిమాంశు, గుప్తా తదితర బుక్ పబ్లిషర్స్ కూడా స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. కంప్రింట్, ఆపిల్ ట్రీ సంస్థలు పిల్లల విజ్ఞానానికి సంబంధించిన రూపొందించిన సీడీలు, డీవీడీలు కూడా ప్రదర్శనలో ఉంచారు. వామపక్ష సాహిత్యం... అరుదైన వామపక్ష సాహిత్యాన్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఇరిక్ హాఫ్జ్బామ్ ‘హౌ టు చేంజ్ ది వరల్డ్’, మార్తా హర్ణేకర్ ‘రీ బిల్డింగ్ ది లెఫ్ట్’, విజయ్ ప్రసాద్ ‘నో ఫ్రీ లెఫ్ట్’, ‘ది పూరర్ నేషన్స్’ వంటివి ఉన్నాయి. ఆకార్, లెఫ్ట్ వరల్డ్, నేషనల్ బుక్ ఏజెన్సీ, వర్షా బుక్స్, సంస్కృతి, పీపుల్స్ పబ్లికేషన్స్ హౌస్ తదితర సంస్థల ప్రచురణలు ఉన్నాయి. అరుంధతి రాయ్ రచన ‘అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’, అమితా కనేకర్ రచన ‘ఎ స్పోక్ ఇన్ ది వీల్’ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల సందడి... సర్ సీవీ రామన్ పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో పలు నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మెడికల్ కాలేజీ విద్యార్థులు 80 వరకూ ఎగ్జిబిట్స్ను ఏర్పాటు చేశారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు తాము రూపొందించిన పలు మోడల్స్‌ను ఇక్కడ ప్రదర్శించారు. ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థలు, హ్యాండీక్రాఫ్ట్, చేనేత సహకార సొసైటీలు తమ ఉత్పత్తులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనకు జవహర్లాల్ నెహ్రూ వేదికగా పేరు పెట్టారు. వాటిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్లాంట్ నమూనా ప్రత్యేకంగా నిలిచింది. ఫుడ్ ఫెస్టివల్... ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ ఆహార పంటల ఆవశ్యకతను వివరించేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. అలాగే ఆత్రేయపురం పూతరేకులు, మాడుగుల హల్వా స్టాల్స్ సందర్శకులకు నోరూరిస్తున్నాయి. ‘నిర్భయ’ కళారూపం వాయిదా ఢిల్లీలో జరిగిన సంచలన ‘నిర్భయ’ ఘటనపై రూపొందించిన భారీ కళారూపం ఆవిష్కరణ వాయిదా పడింది. వైజాగ్ ఫెస్ట్ వేదిక వద్ద దీన్ని గురువారమే ఆవిష్కరించాల్సి ఉంది. అయితే కళాఖండాల ఏర్పాటు ఆలస్యమవడం తో శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే శుక్రవారం ఉదయం క్రేన్‌తో పైకి లేపినప్పుడు బొమ్మ కింద పడిపోయింది. దీన్ని పునఃప్రతిష్టించేందుకు సాయంత్రం వరకూ కళాకారులు ప్రయత్నించారు. శనివారం ఉదయం దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. సాహిత్యం, సంస్కృతి, భాషా వికాసం, వర్తమాన సాహిత్యం-సవాళ్లు, మీడి యా తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలు శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి. -
ఎమ్మెల్సీ ఓట్లు కొనేయండి..!
విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నేతలపై మంత్రుల ఒత్తిడి హోటల్లో రహస్య మంతనాలు ఎంత కావాలో చెప్పాలని బేరసారాలు విజయవాడ : ‘ఏ రూట్లో వెళతారో.. ఎలా వెళ్తారో.. మాకు తెలి యదు.. ఒక్క ఓటు కూడా వేరే వారికి వెళ్లకూడదు.. డబ్బు ఎంత కావాలో అడగండి.. ’ ఇదీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎలాగైనా రాబట్టుకోవాలనే ఆలోచనలో మంత్రులు టీడీపీలోని ముఖ్య నాయకులకు చెప్పిన మాటలు. ‘ఇంతమంది నాయకులం ఇక్కడ ఉన్నాం.. ఒకవేళ మనం గెలవలేకపోతే అవమానంగా ఉంటుంది. సీఎం కూడా మనపై మండిపడే అవకాశం ఉంది. అందుకనే చెబుతున్నాం. ఎలాగైనా గెలవాల్సిందే..’ అం టూ ఉపాధ్యాయ సంఘాల్లోని పలువురు నాయకులకు మంత్రులు, ముఖ్య నాయకులు ఉద్బోధ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి బందరురోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్కులో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నాయకులను పిలిపించి ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటర్లు ఏమడుగుతున్నారు, ఎవరికి ఏం కావాలి.. వంటి విషయాలపై వాకబు చేశారు. ‘రామకృష్ణను మన పార్టీ బలపరిచింది. ఎలాగైనా ఆయనే గెలవాలి..’ అని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల కరస్పాండెంట్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. శుక్రవారం రాత్రి వరకు మంత్రులిద్దరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసేందుకు వెళితే తీయకూడదంటూ కోపం ప్రదర్శించారు. హామీల వల ఈ సందర్భంగా మంత్రులిద్దరూ ఉపాధ్యాయుల వద్ద హామీల వర్షం గుప్పించారు. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు సంబంధించి 2006 నుంచి యూజీసీ స్కేల్ అమలు జరుగుతున్నందున అప్పటి నుంచే ఫిట్మెంట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో లెక్చరర్లు అనే పదాన్ని తొలగించారని, మన రాష్ట్రంలోనూ ఆ పదాన్ని తీసేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా మార్చాలని కొందరు ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఉపాధ్యాయులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న మంత్రులు తమ అభ్యర్థిని గెలిపిస్తే పరిష్కరిస్తామని అభయమిచ్చారు. వ్యూహం మార్చిన మంత్రి ఉమా టీడీపీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. అయితే, ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురిచేసేందుకు బుద్దా వెంకన్న ఇంటికి మంత్రి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న సీపీఎం నగర నాయకులు, కార్యకర్తలు ఆ ఇంటి వద్దకు వచ్చారు. దీంతో మంత్రి వ్యూహం మార్చారు. ప్రాజెక్టులు, అసెంబ్లీ వ్యవహారాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విమర్శలు చేసేందుకు ఒంటిగంటకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి అప్పటికప్పుడు అక్కడ విలేకరులతో మాట్లాడి ఎమ్మెల్సీ హడావుడిని పక్కదోవ పట్టించారు. వీరితో పాటు టీడీపీ రాష్ట్ర నాయకుడు ముద్దుకృష్ణమనాయుడు ఉన్నారు. కాగా, మేయర్ శ్రీధర్, డెప్యూటీ మేయర్ రమణారావు కూడా ఉపాధ్యాయులతో మంతనాలు జరుపుతున్నారు. యూటీఎఫ్ నాయకత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలని, ఎన్నికల్లో వారిని ఓడించి తమ సత్తా ఏంటో చూపించాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. కేవలం ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలు పాఠశాలలు, కాలేజీల కరస్పాండెంట్లనే కాకుండా విద్యాశాఖలోని ముఖ్య అధికారులను కూడా పిలిపించి లోగుట్టు విషయాలు చర్చించినట్లు సమాచారం. -
టీడీపీలో ఎమ్మెల్సీ కాక
{పయత్నాలకు తెరతీసిన ఆశావాహులు తమవర్గీయుడికోసం అయ్యన్న, గంటా వ్యూహాలు అధిష్టానం కటాక్షం పైనే తటస్థుల ఆశలు ఆసక్తికరంగా టీడీపీ వర్గ రాజకీయాలు విశాఖపట్నం: అగ్నికి ఆజ్యం తోడవటమంటే ఇదేనేమో!... మంత్రులు అయ్యన్న, గంటా వర్గాల మ ద్య భగ్గుమంటున్న విభేదాలను మరింత రాజేసేలా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంలో టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందనీ... అదీ జిల్లా నేతకే అవకాశాలు ఎక్కువని అంచనా వేస్తున్నారు. దాంతో తమ వర్గీయుడికే ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేయడానికి ఇరువురు మంత్రులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చెరో జాబితా సిద్దం చేస్తున్నారు. మరోవైపు తటస్థ ముద్రతో ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోవాలని మరికొందరు నేతలు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల పల్లకీలో : జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ పీఠంపై కన్నేసిన ఆశావాహుల జాబితా చాంతాడును తలపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టిక్కెట్లు దక్కని నేతలు అందరూ ఎమ్మెల్సీ స్థానానికి గురిపెట్టారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ. రహమాన్, మాజీ మంత్రి మణికుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, తోట నగేష్, నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు తదితరులు రేసులో ఉన్నట్లు బయటపడ్డారు. వీరిలో కొందరు గంటా మద్దతు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరు అయ్యన్న ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు ఈ గ్రూపులతో సంబంధం లేకుండా నేరుగా సీఎం చంద్రబాబు కటాక్షం కోసం పావులు కదుపుతున్నారు. దూకుడు మీదున్న అయ్యన్నవర్గం - ప్రతిపాదించేది ఎవరి పేరో! ఎమ్మెల్సీ పదవి తమ వర్గీయుడికే దక్కేలా చేయాలని మంత్రి అయ్యన్న వర్గం గట్టి పట్టుదలగా ఉంది. గంటా వర్గంతో కొనసాగుతున్న ఆధిపత్య పోరులో పెచైయ్యి సాధించడానికి ఇదే మార్గమని నమ్ముతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు ముందు పెట్టి గంటా వర్గాన్ని ఢీకొంటోంది అందుకేనని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తననే ప్రతిపాదిస్తారని ఆయన కూడా అయ్యన్నపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ అయ్యన్న లోతుగుండె రాజకీయాలు తెలిసినవారు మాత్రం ఆయన వ్యూహాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. విభేదాలకు కేంద్ర బిందువైన గవిరెడ్డికి అవకాశాలు సన్నగిల్లితే ప్రత్యమ్నాయంగా తమ వర్గం నుంచే మరొకరికి ప్రతిపాదించొచ్చు కూడా. ఎన్నికల ముందు అయ్యన్న టీడీపీలోకి తీసుకువచ్చిన తోట నగేష్ పేరు వినిపిస్తోంది. ఇక ‘కొత్త ముఖాన్ని’ తెరపైకి తెచ్చేందుకు కూడా అయ్యన్న యోచిస్తున్నారన్న సమాచారం టీడీపీలో కాక పుట్టిస్తోంది. తటస్థుల జోరు : ఇరువర్గాలతో నిమిత్తం లేకుండా ప్రయత్నామలు ముమ్మరం చేస్తేనే ఫలితం ఉంటుందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, ఎస్.ఎ. రహమాన్, మణికుమారి తదితరులు ఉన్నారు. సీనియార్టీతోపాటు సామాజికవర్గ ప్రాతిపదికన పప్పల చలపతిరావు ఎమ్మెల్సీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా స్థానిక కాపు సామాజికవర్గానికి చెందిన వారికి జిల్లాలో అవకాశం దక్కలేదన్న వాదనను ఆయన తెరపైకి తెస్తున్నారు. మైనార్టీ కోటాలో ఎస్.ఎ.రహమాన్ ఎమ్మెల్సీ పీఠానికి గురిపెట్టారు. ఎస్టీ కోటాలో మణికుమారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితోపాటు నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు వంటి నేతలు కూడా తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అనూహ్యంగా కొత్త ముఖాలకు సీఎం చంద్రబాబు మొగ్గుచూపినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది టీడీపీ వర్గాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం ఎమ్మెల్సీ పదవే లక్ష్యంగా టీడీపీ రాజకీయాలు ఊపందుకోనున్నాయి. గుంభనంగా గంటా వర్గం ఎమ్మెల్సీ పదవి విషయంలో మంత్రి గంటా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాము నేరుగా ఎవరి పేరును ప్రతిపాదించకుండా అయ్య న్న వర్గం సూచించే నేతను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరి క్షణంలో తమవర్గీయుడి పేరును తెరపైకి తేవాలని భావిస్తున్నారు. అందుకోసం యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేసిన తనకు అవకాశం ఇవ్వాలని ఆయన పట్టుబట్టే అవకాశాలున్నాయి. -
విడిగానే ఎంసెట్!
ఏపీ ప్రభుత్వ నిర్ణయం నేడు మంత్రి గంటా అధికారిక ప్రకటన విశాఖపట్నం: రాష్ట్రంలో ఎంసెట్ నిర్వహణపై ఊగిసలాటకు ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ సర్కారు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విడిగానే ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించింది. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యం ఆధారపడి ఉన్న ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం అధికారిక ప్రకటన చేయనున్నారు. గతంలో ప్రకటించినట్టుగానే మే 10న ఎంసెట్ పరీక్ష జరిగే అవకాశాలున్నాయి. -
అధ్యక్షుడికే పిలుపు లేదు!
పార్టీ జిల్లా అధ్యక్షుడిని బాయ్‌కాట్ చేస్తున్న గంటా వర్గం పతాక స్థాయికి టీడీపీ వర్గ విభేదాలు పిలుపు లేదంటున్న గవిరెడ్డి ‘గంటా’ పర్యటనకు దూరం విశాఖపట్నం: ‘పిలవని పేరంటం’ అవమానం జిల్లా పార్టీ అధ్యక్షుడికే ఎదురైతే!?.. జిల్లా పార్టీ అధ్యక్షుడి ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతే!?... అదీ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇంతటి చేదు అనుభవం ఎదురైతే ఎలా ఉంటుంది... అచ్చు జిల్లా టీడీపీలో పతాక స్థాయికి చేరిన వర్గ విభేదాల మాదిరిగా ఉంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడుకు పొగపెడుతున్న మంత్రి గంటా వర్గం కథను వ్యూహాత్మకంగా క్లైమాక్స్‌కు తీసుకువస్తోంది. ఓ వైపు అధిష్టానం వద్ద గవిరెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న గంటా వర్గం... మరోవైపు మాడుగుల నియోజక వర్గంలోనే ఆయన చాపకిందకు నీళ్లు తెస్తోంది. ఏకంగా గవిరెడ్డినే బాయ్‌కాట్ చేస్తూ ఆయన నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి గంటా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. మాడుగుల నియోజకవర్గం సాగరం పంచాయతీ సురవరం గ్రామంలో రూ.కోటి 25 లక్షలతో నిర్మించిన కస్తూరిబా ఆశ్రమ పాఠశాల భవన సముదాయానికి రాష్ర్ట మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షతో పాటు నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇంతపెద్దఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేసి మాడుగుల నియోజవ ర్గ టీడీపీ ఇన్చార్జి గవిరెడ్డిని పూర్తిగా విస్మరించారు. ఆయనేమి గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే, గ్రామీణజిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతటికీలకమైన నాయకుడిని విస్మరించడం స్థానికంగా ఆయన కేడర్‌కు సైతం మింగుడుపడడం లేదు. కనీసం జిల్లా పార్టీ అధ్యక్షునిగా కాదు... కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా గవిరెడ్డికి ఆహ్వానం అందలేదు. మంత్రి, ఎంపీలిద్దరూ గవిరెడ్డిని పట్టించుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన గవిరెడ్డి అనుచరులు, వివిధ పార్టీల మండలాధ్యక్షులు సైతం మంత్రి పర్యటనకు దూరంగా ఉండిపోయారు. ఒక జెడ్పీటీసీతో పాటు నాలుగు మండలాల ఎంపీలు టీడీపీకి చెందిన వారే అయినప్పటికీ ఈ పర్యటనలోఅటిండెన్స్ వేయించుకోవడానికే పరిమితమయ్యారు. క్యాడర్ జాడపెద్దగా కన్పించలేదు. పరిస్థితిలా ఉంటుందని ముందుగానే గమనించిన గంటా వర్గీయుడైన విశాఖ డైయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు ఆఫీస్ నుంచి రాత్రికి రాత్రే గ్రామాల రైతులకు ఫోన్లు వెళ్లాయి. గంటా పర్యటనలో పాల్గొనాల్సిందిగా ఆ ఫోన్ల సమాచారం. దీంతో ఈ పర్యటనలో రైతులతో పాటు పార్టీనుంచి సస్పెండైన నేతల హల్చల్ ఎక్కువగా కన్పించింది. సొంత నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు హాజరు కాకపోవడం పట్ల పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే తొలిసారికాదు. గతంలో కూడా ఇదేరీతిలో తనకు చెప్పకుండా నియోజకవర్గంలో గంటా పర్యటించడాన్ని గవిరెడ్డి తీవ్రంగా గర్హించడంతో గవిరెడ్డి వ్యతిరేకవర్గీయులు ఆయన దిష్టిబొమ్మల దహనం చేసిన విషయం విధితమే. ఇప్పుడు మరోసారి గవిరెడ్డికి ఆహ్వానం లేకుండా గంటా మాడుగలలో పర్యటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. గంటా విజ్ఞతకే వదిలేస్తున్నా పార్టీ జిల్లా అధ్యక్షునిగా తాను ఎప్పుడు, ఏ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా ఆ నియోజకవర్గ ఇన్చార్జికి చెప్పి వారి అనుమతితోనే నిర్వహించేవాడిని. ఎక్కడైనా ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. నా నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు.. సమీక్షలు.. సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు మంత్రి స్వయంగా నాకు చెప్పాలి. లేదా సమాచారం అందించాలి. కానీ అలా చేయలేదు. నేను ఓడిపోయి ఉండవచ్చు.. కానీ నియోజకవర్గ ఇన్చార్జిగా, మాజీ ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా కనీస గౌరవం ఇవ్వాలి. నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో పర్యటిస్తుండడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. -‘సాక్షి’తో ఫోన్లో గవిరెడ్డి రామానాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు -
సిల్వర్ స్క్రీన్‌పై మరో రవితేజ?
-
గంటా పిలిచారు... వచ్చారు.. వెళ్లారు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మంత్రి గంటా శ్రీనివాసరావు పిలిచారు. వచ్చాం ..వెళ్లాం అన్న చందంగా మంత్రుల పర్యటన జిల్లాలో సాగింది. ఒకేసారి ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు జిల్లాకు వచ్చారంటే ఓ మంచి అభివృద్ధి పథకం ప్రకటనలో, కనీసం హామీ అయినా దక్కుతుందన్న జిల్లా ప్రజలకు నిరాశే ఎదురయింది. దీనికి భిన్నంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారు. ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం స్వైన్‌ఫ్లూపై సమీక్షించి, డీఎంఈతో తనిఖీలు నిర్వహించనున్నట్లు ప్రకటించి వెళ్లారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తన స్వగ్రామమైన కామేపల్లిలో ‘బడిలో బస’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం బుధవారం ఉదయానికల్లా వివిధ మార్గాల్లో ఎనిమిది మంది మంత్రులు ఒంగోలు చేరుకొని ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జాతీయ రహదారిపై ఉన్న వల్లూరమ్మ దేవస్థానంలో గత ప్రభుత్వ కాలంలో మంజూరై నిర్మాణాలు పూర్తి చేసుకున్న రెండు ప్రాకార మండపాలు, షాపింగ్ కాంప్లెక్సులను ప్రారంభించారు. అనంతరం కె బిట్రగుంటలో ఎన్టీఆర్ సుజలస్రవంతి కార్యక్రమంతోపాటు కామేపల్లి గ్రామంలో పోలేరమ్మ గుడికి రూ.40 లక్షలతో మండపం, రూ.25 లక్షలతో ప్రహరీ ముఖ ద్వారం, రూ.23 లక్షలతో గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం, కామేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌ను రూ.2 కోట్ల 36 లక్షలతో మోడల్ స్కూల్‌గా మార్చటానికి శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో రూ.1 కోటి 32 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్లు, రామచంద్రాపురం నల్లవాగు మీద రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి గంటాతోపాటు మంత్రులు ప్రారంభించారు. మంత్రి శిద్దా రాఘవరావు, పల్లె రఘునాధరెడ్డిలు చాగల్లు వద్ద జాతీయ రహదారిపై దగ్ధమైన బస్సును పరిశీలించి విచారణకు ఆదేశించారు. మరోవైపు కందుకూరులో మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి దివి శివరామ్, అతని వ్యతిరేక వర్గం మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దివి శివరామ్ ఇచ్చిన అల్పాహార విందుకు వ్యతిరేక వర్గం దూరంగా ఉంది. -
ప్రజా సహకారంతోనే స్మార్ట్ సిటీ
త్వరలో స్మార్ట్ సిటీ గెడైన్స్ చిన్నాపురం దత్తత తీసుకున్నా.. మంత్రి గంటా శ్రీనివాసరావు పెదవాల్తేరు : ప్రజా సహకారం ఉంటేనే విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దగలమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీచ్ రోడ్డులోని అంబికా సీ గ్రీన్ హోటల్లో ఫియోనిక్స్ సంస్థ నిర్వహించిన లెట్స్ గెట్ స్మార్ట్ కిర్లంపూడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ అంటే అద్దంలాంటి రోడ్లు, విద్యుద్దీపాలు కాదని, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడమేనన్నారు. ఇప్పటికి స్మార్ట్ సిటీపై సరైన ప్రతిపాదనలు లేవని, ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం స్మార్ట్ సిటీ గెడైన్స్ రూపొందించడానికి సమాయత్తమవుతోందన్నారు. వేల కిలో మీటర్లు నడవాలన్నా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. విశాఖ అభివృద్ధికి అడుగులు పడ్డాయని, స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో భాగంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఇంటిగ్రేటెడ్ స్టేడియం, రింగ్ రోడ్లు నగరానికి రానున్నాయన్నారు. పద్మనాభ మండలంలోని చిన్నాపురాన్ని దత్తత తీసుకున్నానని చెప్పారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించి స్మార్ట్ చిన్నాపురంగా తీర్చిదిద్దుతామన్నారు. కిర్లంపూడి లేఅవుట్‌ని స్మార్ట్ సొసైటీగా తయారు చేయడానికి ఫియోనిక్స్ సొల్యూషన్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ సమస్యలు లేని దేశంగా రూపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమం అమలు చేశారన్నారు. మన స్థాయిలో నగరాన్ని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఫియోనిక్స్ ప్రతినిధి మురళి మాట్లాడుతూ కిర్లంపూడి లేఅవుట్‌ను స్మార్ట్ సొసైటీగా మార్చడానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. క్లీన్ వైజాగ్, గ్రీన్ వైజాగ్, హెల్దీ వైజాగ్ థీమ్స్‌తో మూడు ప్రాజెక్టులను అమలు చేస్తామన్నారు. తర్వాత సేఫ్ వైజాగ్, డిజిటల్ వైజాగ్ రూపాంతరానికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. కిర్లంపూడిలో పారిశుద్ధ్యం, తాగునీరు, వైఫే టెక్నాలజీ, గార్డు సిస్టం, రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఠీఠీఠీ.ౌ్ఛ ఠిజ్డ్చీజ.ౌటజ వెబ్సైట్ ప్రారంభించారు. కిర్లంపూడిలో సమస్యలను ఈ వెబ్సైట్లో నమోదు చేస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీకుంటామని తెలిపారు. పోర్టు చైర్మన్ కృష్ణబాబు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీన్‌కుమార్ మాట్లాడుతూ ఫియోనిక్స్ సంస్థ ఒక కాలనీ దత్తతకు తీసుకుని స్మార్ట్ కిర్లంపూడిగా తయారు చేయడానికి సన్నద్ధం కావడం నగరాభివృద్ధికి శుభపరిణామమన్నారు. తమ శాఖపరంగా వారికి పూర్తి సహాయసహకారాలందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఫియోనిక్స్ప్రతినిధులు వాణి, సంధ్య, కిర్లంపూడి అసోసియేషన్ అధ్యక్షుడు సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. -
గంభీరం వెనుక గంటా మౌనం
ఒక్కసారీ చర్చలకు పిలువని ‘గంటా’ మంత్రి తీరుపై గుర్రుగా ఉన్న బాధిత రైతులు వివాదస్పదమవుతున్న ఐఐఎం భూముల సేకరణ సమాన పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ విశాఖపట్నం: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) ఏర్పాటు కోసం తలపెట్టిన భూ సేకరణ వివాదస్పదమవుతోంది. ఈ భూముల వ్యవహారంలో పట్టాదారులతో సమానంగా ఆక్రమితరైతులకు పరిహారం ఇవ్వాలంటూ గత వారం రోజులుగా సాగుతున్న ఆందోళన రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. సొంత నియోజకవర్గంలో నెలకొన్న సమస్య పరిష్కారంలో రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాస రావు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఒక్కసారి కూడా చర్చలకు పిలవకుండా వ్యవహారాన్ని కావాలనే తాత్సారం చేస్తున్నారంటూ మంత్రిపై బాధిత రైతులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల ముందు ఆక్రమిత రైతులందరికీ పట్టాలు ఇస్తామని ఇప్పుడు కనీసం పరిహారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కోవాలని చూస్తేఊరుకోబోమని వీరంతా హెచ్చరిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరంలో సర్వే నెంబర్ 68లో 291.53 ఎకరాలు, సర్వేనెంబర్ 88లో 144.85 ఎకరాలు, సర్వే నెంబర్- 71లో మరో11ఎకరాల భూములున్నాయి. వీటిలో 31.29 ఎకరాలకు 19 మందికి గతంలో డి-ఫారం పట్టాలు ఇచ్చారు. ఈ రెండు సర్వేల్లో సుమారు 150 ఎకరాలకు పైగా భూములను సుమారు వందమంది రైతులు దశాబ్దాలుగా ఆక్రమించుకుని సాగు చేసుకుంటూ జీవనం పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో సర్వే నెంబర్ 68, 88లలో డి.ఫారం పట్టాలిచ్చిన వాటితో రైతుల ఆక్రమణలో ఉన్న భూముల్లో 388.48 ఎకరాలను ఐఐఎం ఏర్పాటు కోసం కేటాయించారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న భూముల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానితో ఈ నెల 5వ తేదీన శంకుస్థాపన చేయాలని తలపెట్టగా చివరి నిముషంలో మంత్రి పర్యటన రద్దవడంతో వాయిదా పడింది. కనీసం భూముల స్వాధీన ప్రక్రియ పూర్తికాకుండా ఏ విధంగా శంఖుస్థాపన చేయడం వలన వివాదం మరింత ముదిరే అవకాశం ఉందనే వాదన వస్తోంది. రైతుల ఆందోళనకు బయపడే వాయిదా వేయించారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి. పట్టాభూముదారులకే పరిహారం డి.ఫారం పట్టా కలిగిన 19 మంది రైతులకు వారి ఆక్రమణలో ఉన్న 31.29 ఎకరాలకు ఎకరాకు రూ.20లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదించారు. కాగా మిగిలిన ఆక్రమణదారులకు మాత్రం రిలీ్ఫ్ అండ్ రిహేబిటేషన్ (ఆర్ అండ్ ఆర్) కింద ఎకరాకు రూ.2.5లక్షలకు మించి ఇవ్వలేమని తెగేసి చెప్పారు. అసలు ఆక్రమిత దారులకు పరిహారం ఇవ్వాలని ఏ చట్టంలోనూ లేదని..అయినా సరే ఏళ్ల తరబడి సాగు చేసిన రైతులు నష్టపోకూడదన్న భావనతోనే నిబంధనలను పక్కన పెట్టి మరీ పరిహారం ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఆక్రమి రైతులు పట్టువీడకపోవడం సరికాదని విశాఖ ఆర్డీఒ నాగవెంకటమురళి చెప్పుకొచ్చారు. ఇప్పటికే తహశీల్దార్, ఆర్డీఒ స్థాయిలో చర్చలకు ఆహ్వానించినా రైతులు రాలేదని ఆయన చెప్పారు. అందరికి ఒకే రీతిలో పరిహారం ఇస్తామంటేనే తాము చర్చలకు వస్తామని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు. అంతవరకు భూముల్లో అడుగుపెట్టనీయబోమని చెబుతున్నారు. ఈ వివాదం మరింత ముదరకముందే రాష్ర్టమంత్రి గంటా బాధిత రైతులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిం చాలని లేకుంటే ఈ ప్రభావం ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుపై పడి మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుందని వివిధ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాత ఆగ్రహం
⇒ రైతు సాధికార సదస్సులో నిరసన సెగలు ⇒ అధికారులను నిలదీసిన రైతులు ⇒ గోపాలపట్నంలో జరిగిన జిల్లా సదస్సుకు జనం కరవు ⇒ మొక్కుబడి ఏర్పాట్లపై మంత్రి గంటా మండిపాటు సాక్షి, విశాఖపట్నం: గోపాలపట్నం హైస్కూల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి రైతు సాధికార సదస్సు మొక్కుబడిగా సాగింది. రైతులు, బాధితులు నిరసన గళమెత్తారు. అధికారులను నిలదీశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్.అయ్యన్న పాత్రుడు, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానితో పాటు ఎమ్మెల్యేలు గణబాబు, గణేష్‌కుమార్, విష్ణుకుమార్ రాజులు మినహా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా సదస్సుకు డుమ్మా కొట్టారు. జనం లేక ప్రాంగణం వెలవెలబోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు సదస్సు ప్రారంభం కాలేదు. సీఎం స్థాయి నాయకులు పాల్గొనే తరహాలో ఏర్పాట్లు చేసినా జన సమీకరణలేక వెలవెలబోయింది. చివరకు బలవంతంగా తరలించిన డ్వాక్రా సంఘ సభ్యులు, పాఠశాల విద్యార్థులతో కానిచ్చేశారు. ఈ సదస్సులను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే మీరిలా మొక్కుబడిగా మార్చేస్తారా అంటూ మంత్రి గంటా తన ప్రసంగం ప్రారంభంలోనే అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరిలా చేస్తారని అనుకోలేదు.. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోండంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. అర్హుల జాబితాలేవి? ..అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఈశ్వరి అర్హుల జాబితాను ప్రదర్శించకుండా రైతు సాధికార సదస్సులు నిర్వహించడం వల్ల ప్రయోజనమేమిటంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికారులపై మండిపడ్డారు. పాడేరు మండలం లగిసిపల్లి గ్రామంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆమె జాబితాను ప్రదర్శించకుండా ఎంతమందికి ఎంత మేర మాఫీ చేశామో ఏ విధంగా చెప్పగలరని ప్రశ్నించారు. బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, లేకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రూ.50వేల లోపు రుణాలను ఒకేసారిమాఫీ చేస్తామని చెప్పినా ఏ ఒక్కరికి ఐదు పదివేల రూపాయలు మించి జమకాలేదని చెబుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే గ్రామంలో హుద్‌హుద్ తుపాను వల్ల తమ పంటలు పూర్తిగా దెబ్బతిన్న అర్హుల జాబితాలో మా పేర్లు లేవంటూ పలువురు బాధిత రైతులు సదస్సులోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హుల జాబితా అవకతవకలమయం! నగర పరిధిలోని 50వ డివిజన్లో జరిగిన రైతు సాధికార సదస్సులో అధికార పార్టీ నేతలే ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. హుద్‌హుద్ సాయం పంపిణీ కోసం ఎంపిక చేసిన అర్హుల జాబితా అవకతవకలమయంగా ఉందంటూ మండిపడ్డారు. డివిజన్లో ఏడు వేల ఇళ్లు దెబ్బతింటే సగం మందికి కూడా అర్హుల జాబితాలో చోటు దక్కలేదని, వీరిలో కూడా సగం మందికి పరిహారం అందలేదని స్థానిక టీడీపీ నేతలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎదుటే అధికారులను నిలదీశారు. డివిజన్లో 5వేల మంది అర్హులైన పింఛన్‌దారులుంటే కేవలం 1300 మందికి మాత్రమే ఇస్తున్నారని, ఇదెక్కడ న్యాయమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తక్షణమే ఈ అవకతవకలను సరి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం, పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చోడవరం మండలం సీమనాపల్లిలో జరిగిన సదస్సులో మాకు రూ.50వేల లోపే రుణాలున్నప్పటికీ తొలి జాబితాలో మా పేర్లు ఎందుకు లేవో చెప్పాలని పలువురు రైతులు అధికారులను నిలదీశారు. తనకు రూ.20వేల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జాబితాలో లేదని అప్పలనాయుడు అనే రైతు అధికారుల ఎదుట వాపోయాడు. అర్హులైన మాకు పరిహారం ఇవ్వడం లేదని, ఒక్కసారి మా ఇళ్లకు, పంటపొలాలకు వచ్చి చూడాలంటూ పలువురు బాధితులు, రైతులు పద్మనాభం సదస్సులో అధికారులను నిలదీశారు. ఇదే రీతిలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. -
ప్రతిష్ట పాతాళానికి..
ఏయూపై మంత్రి గంటా పెత్తనమేంటి? తుపాను నష్టం రూ.230 కోట్లా!? క్లాసులే జరగనప్పుడు పరీక్షలా? కలకలం రేపిన ఏయూ విభాగాధిపతుల వ్యాఖ్యలు ‘ఏయూపై మంత్రి గంటా పెత్తనమేమిటి?...ఆయన క్యాంపస్‌కు పదేపదే వచ్చి అధికారికంగా నిర్ణయాలు ప్రకటించేయడమేమిటి?... వీసీతో సహా ఏయూ అధికారులు అం తా ఆయనకు సాగిలపడటమేమిటి?... ఏయూ చరి త్రలో ఇంతవరకు ఇలాంటి దుస్థితి దాపురించలేదు. ఇ లా అయితే ఏయూ ప్రతిష్ట దిగజారి అదఃపాతాళానికి పడిపోతుంది’ ‘హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్లు నష్టం వచ్చిందని ఏ ప్రాతి పదికన ప్రకటించేశారు?, అంత నష్టం ఎక్కడ జరిగింది?. భవనాలు ఏమీ దెబ్బతినలేదు. ల్యాబ్‌లకు నష్టం జరగలేదు. చెట్లు కూలిపోయిన మాట వాస్తవం. కానీ దాన్ని రూ.230 కోట్లుగా లెక్కించలేం కదా? ఆస్తి నష్టం జరగనప్పుడు అంత నష్టమని ఎ లా ప్రకటిస్తారు. దీని వెను క ఉన్న లోగుట్టు ఏమిటి?. దాతల నుంచి కేవలం ధన రూపంలోనే సహా యం కోరడం వెనుక మర్మమేమిటీ?’ ఏయూ విభాగాధిపతుల ఆవేదన ఇదీ. ప్రశ్న ల శరపరంపర ఇదీ. ఏయూ కేంద్రంగా సాగుతున్న అక్రమాలను సూటిగా నిలదీసిన వైనం ఇదీ. గత కొన్నేళ్లలో ఎన్నడూలేని రీతిలో విభాగాధిపతులు ఏయూ వ్యవహారాలపైన విరుచుకుపడ్డారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం ఇలా సాగింది... విభాగాధిపతుల సమావేశమే వేదికగా... ఏయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవీ విభాగాధిపతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే గాయత్రీదేవీ మాట్లాడుతూ నవంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దాంతో విభాగాధిపతులు అందరూ అవాక్కయ్యారు. తమను కనీసం సంప్రదించకుండా పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణయించేయడమేమిటని విస్తుపోయారు. కొంతకాలంగా ఏయూ వ్యవహారాలలై ఆగ్రహంతో ఉన్న విభాగాధిపతులు దాంతో ఒక్కసారిగా తమ నిరసనను తెలిపారు. ‘తుపాను అనంతరం క్లాస్‌లు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. ఇంకా 10 శాతం మంది విద్యార్థులు కూడా క్లాస్‌లకు రావడం లేదు. సిలబస్‌లు పూర్తికాలేదు. అలాంటిది నవంబర్ 10 నుంచి పరీక్షలు ఎలా నిర్వహిస్తారు?. తేదీలను ఖరారు చేసేముందు మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఏయూలో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలను ప్రస్తావిస్తూ అంశాలవారీగా ఇలా నిలదీశారు. మంత్రి గంటా పెత్తనమేమిటీ?... ఏయూ వ్యవహారాలన్నింటినీ మంత్రి గంటా శ్రీనివాసరావు హైజాక్ చేసేస్తున్న తీరును విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘అసలు యూనివర్సిటీపై విద్యాశాఖ మంత్రి పెత్తనం ఏమిటి? ఏయూ విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం వీసీకి, పాలకమండలికే ఉంది. విభాగాధిపతులను సంప్రదించి వీసీ పాలకమండలిలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వీసీ నేరుగా గవర్నర్‌కే జవాబుదారిగా ఉండాలి. కానీ ఇవేవీ లేకుండా మంత్రి గంటా చీటికిమాటికి క్యాంపస్‌కు వచ్చేసి సమావేశాలు పెట్టడం ఏమిటి?. మన ఇద్దరు ఉన్నతాధికారులు చిత్తందొరా అని వంతపాడటమేమిటి?అని తీవ్రస్థాయిలో నిరసించారు. ఏయూకు రూ.230 కోట్ల నష్టమా?.. హవ్వా! హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్ల నష్టం వచ్చినట్టు వీసీ జి.ఎస్.ఎన్.రాజు ప్రకటించడాన్ని విభాగాధిపతులు తప్పుబట్టారు. ఏ ప్రాతిపదికన లెక్కించి ఇంత భారీ నష్టం వచ్చినట్టు ప్రకటించారని ప్రశ్నించారు. ‘తుపాను వల్ల ఏయూ భవనాలకుగానీ ల్యాబ్‌లకుగానీ ఎలాంటి నష్టం కలగలేదు. కేవలం నాన్‌టీచింగ్ స్టాఫ్ క్వార్టర్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆ నష్టం రూ.50 లక్షల వరకు ఉండొచ్చు. ఇతర చిన్నాచితక నష్టం కలిగింది. అంతకుమించి ఏయూ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగలేదు. మరి రూ.230 కోట్ల నష్టం అని ఎలా ప్రకటించారు? క్యాంపస్‌లో చెట్లు భారీగా కూలిపోయినమాట వాస్తవం. కానీ ఆ నష్టాన్ని డబ్బురూపేణా అంచనా వేయలేం కదా! కానీ రూ.230 కోట్లు నష్టం ఏర్పడినట్టు ప్రకటించడం వెనుక ఉద్దేశమేమిటి?’అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతవరకు నాన్‌టీచింగ్ సిబ్బంది క్వార్ట్ర్స్కు నీరు, విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరించకపోవడాన్నీ ప్రశ్నించారు. ఏయూలో తుపాను నష్టాలను తాము సరిచేస్తామని దాతలు వస్తుంటే మీరు వస్తు రూపేణా ఎలాంటి సహాయం చేయొద్దు... ఆ మొత్తాన్ని ఏయూ అకౌంట్లో వేయమని కోరుతున్నారు?, ఇదెంత వరకు సబబు?.. దాతలే నేరుగా దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేస్తామంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.. దీనివెనుక లోగుట్టు ఏమిటి?’అని కూడా ప్రశ్నించారు. ఇలా విభాగాధిపతులు ఒక్కొక్కరుగా నేరుగా ప్రశ్నల శరపరంపర కురిపించడంతో ఆ సమావేశం ఆద్యంతం వాడిగా వేడిగా సాగింది. విభాగాధిపతులు లేవనెత్తిన అంశాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవి సమావేశాన్ని ముగించారు. మేమే బాధితులం.. మా జీతాల నుంచి కోతా? తుపాను బాధితులకు ఏయూ ఉద్యోగుల రెండురోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించడాన్ని కూడా విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘తుపాను వల్ల విశాఖలో నివసిస్తున్న ఏయూ ఉద్యోగులు నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వడమే...ఇతర ప్రాంతాల ఉద్యోగులు, దాతల నుంచి విరాళాలు సేకరించడమే చేయాలి. అంతేగానీ తుపాను బాధితులు అయిన ఏయూ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తే ఎలా? అసలు ఈ నిర్ణయాన్ని మంత్రి గంటా ఎలా ప్రకటిస్తారు? అందుకు ఏయూ ఉన్నతాధికారులు ఎలా ఆమోదిస్తారు? అని కడిగిపారేశారు. తాము అసలు జీతాల నుంచి కోతను ఆమోదించేది లేదని తేల్చిచెప్పేశారు. -
మంత్రి గంటాకు షోకాజ్ ఇవ్వనున్న కాంగ్రెస్?
హైదరాబాద్: మంత్రి గంటా శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యల రికార్డ్‌ను సేకరిస్తున్నట్టు సమాచారం. రాష్ట విభజనను వ్యతిరేకిస్తూ పలు సందర్భాల్లో ఆయన అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. పార్టీని వీడేందుకు కూడా వెనుకాడబోనని చెప్పారు. ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సోనియాపై వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చారు. కాగా, కేంద్ర మంత్రి చిరంజీవితో నేడు పీఆర్పీ నేతలు సమావేశమయ్యారు. మంత్రి గంటా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే గంటాకు షోకాజ్ నోటీసు ఇవ్వనున్నట్టు వార్తలు రావడం గమనార్హం. తాజా రాజకీయ పరిణామాలపై చిరంజీవితో చర్చించామని భేటీ తర్వాత మంత్రి గంటా తెలిపారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. భవిష్యత్ కార్యాచరణపై మరోసారి భేటీ అవుతామని చెప్పారు. -
రాజీనామా ఆమోదింపజేసుకోవడానికి గంటా రెడీ...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి సోమవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలవనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీరిద్దరు గతంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి వాటిని పక్కనపెట్టడం, అదే సమయంలో రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలంటూ వారిపై తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో నేరుగా గవర్నర్‌ను కలిసి ఆమోదించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా గంటా శ్రీనివాసరావు ఆదివారం రాజ్‌భవన్‌కు ఫోన్ చేసి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. తనతోపాటు మరో ఇద్దరు మంత్రులు కూడా కలుస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆయా నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు గంటా శ్రీనివాసరావు వైజాగ్‌లో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌ను కలిసే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తనతోపాటు ఏరాసు ప్రతాపరెడ్డి, విశ్వరూప్ కూడా గవర్నర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించుకునేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. విశ్వరూప్ మాత్రం గంటా వ్యాఖ్యలతో విభేదించారు. అమలాపురంలో ఉన్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ విభజన విషయంలో హైకమాండ్ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నవంబర్ 2న మంత్రి పదవితోపాటు కాంగ్రెస్‌కు కూడా రాజీనామా చేస్తానని ఇటీవల రావులపాలెంలో ప్రకటించానని, అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. హైకమాండ్ పెద్దలు విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని ఆశిస్తున్నానని, నవంబర్ 1 వరకు వేచి చూసిన తర్వాత మంత్రి పదవికి, పార్టీకి గుడ్‌బై చెబుతానని పేర్కొన్నారు. మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తన రాజీనామా ఆమోదంపై ఇంతవరకు అధికారికంగా మాట్లాడలేదు. రాజీనామాను ఆమోదింపజేసుకుంటారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. రాష్ట్రం విడిపోయినా కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఏరాసు గత కొంతకాలంగా ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. హైకమాండ్ పెద్దలు కూడా ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏరాసు రాజీనామాను ఆమోదించుకుంటారని గంటా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. మరో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా ఆది వారం ఫోన్లో అందుబాటులోకి రాలేదు. హైకమాండ్ తీరు సరికాదు! గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, హైకమాండ్ పెద్దల తీరు, రాజీనామా వంటి అంశాలపై మంతనాలు జరిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నెల రోజులుగా ఉధృతంగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో సమన్వయం లేకుండా పోయిందని, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారే ఉద్యమం చేసుకుపోవడంవల్ల ప్రయోజనం లేకుండా పోతోందని కూడా మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు టీడీపీలోకి వెళతారని, అందులో భాగంగా తొలుత మంత్రి పదవికి, ఆ తర్వాత కొద్దిరోజులకు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారని సీమాంధ్రకు చెందిన ఓ మంత్రి చెప్పారు.