
ఉషారాణి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు
విశాఖ: ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని విదేశీ పర్యటనలో ఉన్న విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్య కార్యదర్శి సుమితాదావ్రాతో మాట్లాడిన ఆయన సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. (చదవండి : ర్యాగింగ్ భూతానికి విద్యార్థిని బలి)
కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఉషారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపైనా, ర్యాగింగ్ జరిగినట్లయితే కళాశాలపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ ఎక్కడ జరిగినా సహించేది లేదని, అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.