ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం ఢిల్లీలో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మరో రెండు కార్యక్రమాల్లో పాల్గొం టారు. వీలునుబట్టి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి అక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. రాత్రికి అక్కడే బస చేసి ఐదో తేదీన అక్కడి నుంచి బెంగుళూరు వెళ్లి భారత పరిశ్రమల సమాఖ్య సమావేశంలో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు.