ఢిల్లీ: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు చర్చలు జరిపారు. ముందుగా ఎన్సిపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత లేదు.
ఇక.. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ ఎల్లుండి( 9వ తేదీ) ప్రమాణస్వీకారం చేయటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరనుంది. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోదీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మోదీ.. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి మోదీ తెలిపారు. ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment