Cabinet allocation
-
మహారాష్ట్రలో కొలువుదీరనున్న కేబినెట్.. శివసేన నుంచి ముగ్గరు ఔట్!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా.. షిండే, పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. కాగా, నేడు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయనే సస్పెన్స్ నెలకొంది.మహారాష్ట్రలోని నాగపూర్‌లో నేడు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలకు ఏయే శాఖలు దక్కుతాయనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. కేబినెట్లో ఎక్కువ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఇక, శివసేన నుంచి 13 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది.ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి పలువురు కొత్త ముఖాలు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. సంజయ్ శిర్సత్, భరత్ గోగావాలే, ప్రకాష్ అబిత్కర్, యోగేష్ కదమ్, ఆశిష్ జైస్వాల్, ప్రతాప్ సర్నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో శివసేన నుంచి మంత్రులుగా ఉన్న దీపక్ కేసర్కర్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్‌తో సహా కొంత మందికి కేబినెట్లో స్థానం లేనట్టుగా సమాచారం.మరోవైపు.. కూటమిలోని ఎన్సీపీకి చెందిన అదితి తట్కరే, బాబాసాహెబ్ పాటిల్, దత్తాత్రే భరణే, హసన్ ముష్రిఫ్, నరహరి జిర్వాల్లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, బీజేపీ నుంచి నితేష్ రాణే, శివేంద్ర రాజే, గిరీష్ మహాజన్, మేఘనా బోర్దికర్, పంకజా ముండే, జయకుమార్ రావల్, మంగళ్ ప్రభాత్ లోధాకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది.ఇక, మహాయుతి ప్రభుత్వంలో కాషాయ పార్టీకి 20 కేబినెట్ బెర్త్‌లు కేటాయించబడినప్పటికీ అన్ని స్థానాలను భర్తీ చేయడంలేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఆయా స్థానాలను వదిలేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీకి హోంశాఖ.. శివసేనకు హౌసింగ్ మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
నేడు మోదీ మూడోసారి
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ లేని నేపథ్యంలో మంత్రిపదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. శనివారం కూడా బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (16 సీట్లు), జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ (12 సీట్లు), శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (7 సీట్లు)లతో మంత్రి పదవులపై చర్చలు జరిపారు. పెద్దశాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతికంగా కీలకమైన విద్య, సాంస్కృతిక శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకుంటుందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయమంత్రి టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. రెండు పారీ్టలు టీడీపీ, జేడీయూలకు ఒక్కో కేబినెట్, ఒక్కో సహాయమంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, సంజయ్ ఝాలలో ఒకరు కేబినెట్ మంత్రిగా, రామ్‌నాథ్ ఠాకూర్ సహాయమంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్ జనశక్తి (రాంవిలాస్) నుంచి ఆ పార్టీ ఆధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు కేబినెట్లో చోటు దక్కనుంది. ఢిల్లీకి చేరుకున్న హసీనా మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్‌కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గేలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో, లాస్ఏంజెలెస్, శాన్ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ– యూఎస్ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ తెలిపారు. భారతీయ రైల్వేస్‌కు చెందిన పది మంది లోకో పైలట్లను ప్రమాణస్వీకారానికి ఆహా్వనించారు. ఇందులో భారత తొలి మహిళా లోకోపైలట్ సురేఖ యాదవ్ ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో వీవీఐపీలకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిశాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అతిథులకు విందు ఇవ్వనున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. ఆది, సోమవారాల్లో దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. మాకింకా ఆహ్వానం రాలేదు: కాంగ్రెస్ మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదని పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి చెప్పారు. ఆహ్వానాలు వస్తే హాజరు కావడంపై ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్‌కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు. -
ఎన్డీయే కూటమి: ముగిసిన మంత్రివర్గ కసరత్తు
ఢిల్లీ: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు చర్చలు జరిపారు. ముందుగా ఎన్సిపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత లేదు.ఇక.. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ ఎల్లుండి( 9వ తేదీ) ప్రమాణస్వీకారం చేయటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరనుంది. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోదీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మోదీ.. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి మోదీ తెలిపారు. ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందజేశారు. -
పెద్ద శాఖలు ఇవ్వలేం!
న్యూఢిల్లీ: ఎన్డీఏ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుపై బీజేపీ దృష్టిసారించింది. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచి్చన నేపథ్యంలో గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచి్చనందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పారీ్టలు నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ స్పీకర్ పదవిని కూడా అడుగుతోంది. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా కోరుతోంది. ఏడుగురు ఏంపీలున్న శివసేన (షిండే), ఐదుగురు ఎంపీలున్న ఎల్జేపీ (ఆర్వీ) కూడా రెండేసి మంత్రిపదవులు అడుగుతున్నాయి. గత రెండు ప్రభుత్వాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటినందువల్ల మిత్రపక్షాలకు ముఖ్యమైన శాఖలు దక్కలేదు. ఎంపీల సంఖ్య ఆధారంగా మంత్రిపదవులు కేటాయించాల్సిన పరిస్థితిని ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటోంది. కాబట్టి ఈసారి మిత్రపక్షాలకు మరింత ఎక్కువగా మంత్రిపదవులు దక్కనున్నాయి. మిత్రపక్షాల నుంచి ఎంత ఒత్తిళ్లు వచి్చనా అత్యంత కీలకమైన శాఖలపై బీజేపీ రాజీపడకపోవచ్చని సమాచారం. రక్షణ, ఆర్థిక, హోంశాఖ, విదేశీ వ్యవహారాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే సంక్షేమం, యువజన వ్యవహారాలు, వ్యవసాయం తదితర శాఖలను అంత సులువుగా వదులుకునేలా లేదు. పేదలు, మహిళలు, యువకులు, రైతుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఈ శాఖలను తామే ఉంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. రైల్వేలు, రహదారుల విషయంలోనూ గడిచిన పదేళ్లలో తాము భారీ సంస్కరణలు తెచ్చామని.. ఈ వేగం మందగించకూడదంటే ఈ శాఖలు తమ వద్దే ఉండాలని పేర్కొంటోంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో రైల్వే శాఖ సాధారణంగా మిత్రపక్షాల చేతుల్లో ఉంటూ వచి్చంది. కానీ బీజేపీ గట్టి ప్రయత్నంలో రైల్వే శాఖను తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంది. జేడీయూకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వజూపుతున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమల శాఖను ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ఆఫర్ చేస్తోంది. అయితే ఆర్థిక, రక్షణ తదితర కీలకశాఖల్లో మిత్రపక్షాలకు సహాయమంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చర్చలకు సంబంధించిన విషయాలపై సమాచారం ఉన్న విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పర్యాటక, ఎంఎస్ఎంఈ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, సామాజిక న్యాయ శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశముందని సమాచారం. చంద్రబాబు నాయుడు లోక్‌సభ స్పీకర్ పదవిపై పట్టుబడితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వజూపి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చునంటున్నారు. బీజేపీ సంఖ్యాబలం లేనందున టీడీపీ, జేడీయూలు తమ డిమాండ్లపై పట్టుబడితే.. బీజేపీ ఎంతవరకు తలొగ్గుతుంది, ఎలా బుజ్జగిస్తుందనేది చూడాలి. -
Jharkhand: మంత్రి పదవుల ముసలం.. హస్తినలో ఎమ్మెల్యేలు బిజీ!
న్యూఢిల్లీ: జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రి పదవుల ముసలం పుట్టింది. చంపయ్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంతో తమకు మంత్రి పదవులు దక్కలేదని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. అక్కడితో ఆగకూండా ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలడానికి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా చంపయ్ సోరేన్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలవడానికి ఢిల్లీ వచ్చాం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ. వేణుగోపాల్, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో మా సమస్యలు చెబుతాం’ అని ఎమ్మెల్యే రాజేష్ కచాప్ తెలిపారు. ఢిల్లీ బయలుదేరే ముందు మరో ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ అలియాస్ అనూప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్లోకి తీసుకున్న నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు. అంత కంటే ముందు.. మంత్రి పదవులపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు జేఎంఎం పార్టీకి చెందిన కొత్త మంత్రి బసంత్ సొరెన్‌ను కలిసి తమ అసంతృప్తి తెలియజేశారు. అయితే సమావేశం అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ... ‘రెండు పార్టీల మధ్య ఎటువంటి అనిశ్చితి లేదు. తామంతా ఐకమత్యంగా ఉన్నాం’ అని చెప్పారు. మరోవైపు.. అసంతృప్త ఎమ్మెల్యేల కంటే ముందే సీఎం చంపయ్ సొరెన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ ఢిల్లీలో చేరుకున్నారు. వీరు కూడా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. కేబినెట్లో నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వకపోతే.. ఫిబ్రవరి 23న జరిగే అసెంబ్లీ సమావేశాలకు అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరుకాకుండా జైపూర్పు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం చంపయ్ సొరెన్ జనవరి 16 కొత్త కెబినెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న హేమంత్ సొరెన్‌ను భూకుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంపయ్ సొరెన్ జార్ఖండ్‌కు కొత్త సీఎం బాధ్యతలు చేపట్టారు. జేఎంఎం-29, కాంగ్రెస్-17, ఆర్జేడీ-1 స్థానంతో జార్ఖండ్‌లో జేఎంఎం సంకీర్ణం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కేబినెట్లో సౌరవ్, అతిషిలకు చోటు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్లో కేజ్రీవాల్ ఇద్దరి చోటు కల్పించారు. సౌరవ్ భరద్వాజ్, అతిషికి సీఎం కేజ్రీవాల్ చోటు కల్పించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశారు. కాగా, 48 గంటల్లో వారితో ప్రమాణ స్వీకారం చేపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సీబీఐ వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. దీంతో వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. కేబినెట్లో సౌరవ్, అతిషికి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా.. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యశాఖతో సహా అనేక ఉన్నత స్థాయి శాఖలను కలిగి ఉన్నారు. సత్యేంద్ర జైన్ ఢిల్లీ ఆరోగ్య, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే, సిసోడియాకు చెందిన ఫైనాన్స్, విద్యతో సహా కొన్ని పోర్ట్‌ఫోలియోలు కైలాష్ గహ్లోట్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు కేటాయించారు. Delhi Chief Minister Arvind Kejriwal sent names of AAP MLAs Saurabh Bhardwaj and Atishi to Delhi LG to be elevated as ministers in the cabinet: Sources pic.twitter.com/IqemD3j19W — ANI (@ANI) March 1, 2023 -
హిమాచల్‌ప్రదేశ్‌లో కేబినేట్ విస్తరణ..7గురు మంత్రుల చేరికతో..
హిమచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖూ, ఉపముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్ని డిసెంబర్ 11న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సుఖ్విందర్ సింగ్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ మంత్రి వర్గం ఆదివారం ఏడుగురు మంత్రుల చేరికతో కేబినేట్ విస్తర్ణ జరిగింది. దీంతో బలం తొమ్మిదికి చేరింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్టేకర్ కొత్తగా చేరిన మంత్రులతో ప్రమాణం చేయించారు. ఇదిలా ఉండగా...కొత్తగా చేరిన మంత్రుల్లో సోలన్ నుంచి పెద్ద ఎమ్మెల్యే ధని రామ్ షాండిల్, కాంగ్రా జిల్లాలోని జవాలి నుంచి చందర్ కుమార్, సిర్మౌర్ జిల్లాలోని షిల్లై నుంచి హర్షవర్థన్ చౌహాన్, గిరిజన కిన్నౌర్ జిల్లా నుంచి జగత్ సింగ్ నేగి, అలాగే రోహిత్ ఠాకూర్, అనిరుధ్ సింగ్, విక్రమాదిత్య సింగ్‌లు సిమ్లా జిల్లాలోని జుబ్బల్ కోట్‌ఖాయ్, కసుంప్టి, సిమ్లా రూరల్ తదితర ప్రాంతాల నుంచి మంత్రులను చేర్చారు. దీంతో ముఖ్యంత్రి సుఖ్వీందర్ సింగ్‌తో సహా మంత్రుల సంఖ్య గరిష్టంగా 12 మందికి మించకుండా.. డిప్యూటీ స్పీకర్ పదవి తోపాటు మూడు సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. (చదవండి: జోష్‌గా సాగుతున్న జోడో యాత్ర..చొక్కా లేకుండా మద్దతుదారులు డ్యాన్సులు) -
మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు!
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమితో బంధం తెంచుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జట్టుకట్టి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువుతీర్చిన సీఎం నితీశ్‌కుమార్ క్రిమినల్ కేసులున్న నేతలతో దాదాపు మొత్తం మంత్రివర్గాన్ని నింపేశారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో 70 శాతానికిపైగా నేతలపై క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ నివేదించింది. రెండేళ్ల క్రితం రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా అభ్యర్థులుగా వీరంతా సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్, బిహార్ ఎలక్షన్ వాచ్ సంస్థ సంయుక్తంగా క్షుణ్ణంగా పరిశీలించాక ఈ నివేదికను బహిర్గతంచేసింది. ఇందుకోసం సీఎం నితీశ్ సహా 33 మంది మంత్రుల్లో 32 మంది అఫిడవిట్లను పరిశీలించారు. మొత్తం మంత్రుల్లో 23 మంది(72 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 17 మంది మంత్రులు(53 శాతం) తమపై తీవ్రమైన నేరమయ కేసులున్నాయి. మొత్తం మంత్రుల్లో 27 మంది(84 శాతం) కోటీశ్వరులుకాగా, మొత్తం 32 మంది మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.5.82 కోట్లు. పాతిక శాతం మంది మంత్రులు తమ విద్యార్హతలు 8వ తరగతి నుంచి ఇంటర్‌లోపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. జేడీ(యూ) నుంచి 11 మంది, ఆర్జేడీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే మంత్రులుగా కొనసాగుతున్నారు. -
షిండే కేబినెట్లో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. శివసేనపై తిరుగుబాటు చేసి భాజపాతో కలిసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు ఏక్నాథ్ షిండే. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వాదనలు వెలువడ్డాయి. ఈ సమయంలోనే సీఎం షిండే ఢిల్లీ పర్యాటన చేపట్టటం ఆ వాదనలకు బలం చేకూర్చింది. ఇదే అదునుగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించారు. షిండే కేబినెట్లో చోటు కల్పిస్తామని, అందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని ఓ ఎమ్మెల్యేకు ఆఫర్ ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ప్లాన్ అడ్డం తిరిగి కటకటాలపాలయ్యారు. మంత్రివర్గంలో చోటు కోసం రూ.100 కోట్లకు బేరం ఆడారంటూ.. భాజపా ఎమ్మెల్యే రాహుల్ కుల్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే పీఏ బాలక్రిష్ణ థోరట్‌కు జులై 16న రియాజ్ షేక్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఎమ్మెల్యే రాహుల్‌తో ఆఫర్ గురించి మాట్లాడాలని చెప్పాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, మీకు సాయం చేయాలనుకుంటున్నాని చెప్పాడు. ఈ క్రమంలో నారిమన్ పాయింట్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఇరువురు కలిశారు. ఈ సందర్భంగా తనకు సీనియర్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని, వారు మీకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని నమ్మించే ప్రయత్నం చేశాడు. అందుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాహుల్ కుల్.. వారితో బేరం ఆడి రూ.90 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల గుట్టు బయటపడింది. ఇదీ చదవండి: లోక్‌సభలో ‘సేన’ నేతగా రాహుల్ షెవాలే: షిండే -
ఆయనకెలా తెలుసు.. చంద్రబాబు ఏమైనా కేబినెట్లో ఉన్నారా..?
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణపై ఇంకా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కేబినెట్ కూర్పుపై స్పందించారు. ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. ‘పాత మంత్రి వర్గంలో తామంతా రాజీనామా చేసిన తరువాతే తనకు అవసరమైన మంత్రి వర్గానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి అవకాశం కల్పించారు. అంతే తప్ప ఇతర కారణాలేవీ లేవు. వైఎస్సార్సీపీ తామంతా వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచిన వాళ్లమే. బాలినేనితో నాకు ఎటువంటి విభేదాలు లేవు. మంత్రి వర్గంలో స్థానం కోల్పోయిన వారికి భావోద్వేగాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి నిదానంగా సర్ధుకుంటాయి’ అని ఆదిమూలపు పేర్కొన్నారు. ‘సీఎం జగన్ ఆలోచన ప్రకారమే మేము నడుచుకుంటాం. అవినీతికి తావుండకూడదు అనేది సీఎం జగన్ నినాదం. కేబినేట్ మొత్తాన్ని మారుస్తామని సీఎం ఎప్పుడూ చెప్పలేదు. మొత్తం కేబినేట్‌ను మారుస్తానని ఆయన చెప్పినట్టు చంద్రబాబు అంటున్నారు.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసు..? చంద్రబాబు ఏమైనా కేబినెట్లో ఉన్నారా..?. వైఎస్సార్సీపీ కేబినేట్ మంత్రులమంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. చంద్రబాబులో అభద్రతాభావం ఏర్పడింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఒక జెండా.. అజెండా అంటూ ఏమీలేదు. పల్లకి మోయడమే ఆయన అజెండా. అందుకే ఆయన వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా వాటిన్నింటిని గుంపగుత్తగా వేరేవారికి అప్పచెబుతామనే సిద్దాంత ధోరణిని అవలంభిస్తున్నారు. దీనిని ఎవరైనా పార్టీ సిధ్దాంతం అంటారా?’ అని మంత్రి ఆది మూలపు సురేష్ ప్రశ్నించారు. ఇది చదవండి: ఏపీలో మరో టూరిస్ట్ స్పాట్.. తప్పక చూడాల్సిందే.. -
డీఎంకే ఘన విజయం.. ‘కేబినెట్’ రేస్ మొదలు
సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తిరువళ్లూరు జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. అందులో సీనియర్లు ఎక్కువమంది గెలుపొందడంతో మంత్రి పదవులపై ఆశావహుల సంఖ్య అధికమైంది. త్వరలోనే కొలువుదీరనున్న స్టాలిన్ కేబినెట్లో బెర్త్ కోసం రేస్ మొదలైంది. సాక్షి, చెన్నై: జిల్లాలో విజయం సాధించిన నలుగురు సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డీఎంకే పార్టీ ముఖ్యులు, స్టాలిన్ కుటుంబ సభ్యులను కలిసి అమాత్యులుగా అవకాశమివ్వాలని కోరుతున్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్టాలిన్ కేబినెట్లో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎవరికి పీఠం దక్కుతుందో అనే చర్చ సర్వత్రా సాగుతోంది. పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి డీఎంకేలో మోస్ట్ సీనీయర్. బలమైన దళిత నేత. రెండు సార్లు శ్రీపెరంబదూరు ఎంపీగా, పార్లమెంట్ విప్‌గా పని చేశారు. గత ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి 60 వేలు, ప్రస్తుతం 93వేల మెజారిటీతో గెలుపొందారు. స్టాలిన్ వద్ద కూడా కృష్ణస్వామికి మంచి పేరుంది. పార్టీ సీనియర్ టీఆర్ బాలుతో పాటు పలువురి ఆశీస్సులు ఉన్నాయి. ఈసారి ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. అలాగే మైనారిటీ నేత నాసర్ కూడా మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. ఆయనకు విశ్వాసపాత్రుడిగా పేరుంది. స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించే మంత్రి పాండ్యరాజన్‌పై భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తిరువళ్లూరు నుంచి రెండోసారి విజయం సాధించిన వీజీ రాజేంద్రన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు స్టాలిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, వీజీ రాజేంద్రన్ భార్య ఇందిర క్లాస్మేట్స్. స్టాలిన్ అల్లుడు శబరీశన్, సీనియర్లు దురైమురుగన్, ఎంపీ జగద్రక్షగన్ ఆశీస్సులు ఉన్నాయి. అలాగే వీజీ రాజేంద్రన్ అల్లుడు పాలిమర్ టీవీ అధినేత. వీరందరితోపాటు ఆంధ్రకు చెందిన పెద్ద నాయకుడి ద్వారా మంత్రి పదవికి సిఫారసు చేయించుకుంటున్నట్లు తెలిసింది. అలాగే మాధవరం ఎమ్మెల్యే సుదర్శనం పేరు కూడా ప్రచారంలో వుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా కన్వీనర్‌గా పని చేసిన సుదర్శనానికి స్టాలిన్ కుటుంబ సభ్యులతో మంచి సంబందాలు వున్నాయి. ఈ క్రమంలో అదృష్టం ఎవరిని వరిస్తుందో శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే. చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
20న యెడ్డీ కేబినెట్ విస్తరణ
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ నెల 20న మంత్రివర్గ విస్తరణ చేపడతామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. ‘విధానసౌధలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఉదయం 10 గంటలకు బీజేపీ శాసన సభాపక్ష భేటీ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ ఉంటుంది’ అని యడియూరప్ప చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను బట్టి మొత్తం 34 మందిని మంత్రులుగా నియమించేందుకు వీలుంది. అయితే యెడ్డీ తన తొలి కేబినెట్లో 13 మంది మంత్రులను మాత్రమే తీసుకునే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మిగతా ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా జూలై 26న ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప ఇప్పటివరకూ కేబినెట్లోకి ఎవ్వరినీ తీసుకోలేదు. -
మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్!
సాక్షి, బెంగళూరు: కొత్త ప్రభుత్వం ఏర్పాటై 20 రోజులు దాటినా మంత్రివర్గం జాడలేదని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప వచ్చే సోమవారం 18 – 20 మంది తో మంత్రిమండలి ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన శనివారం ఢిల్లీ యాత్రలో పార్టీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై మంత్రివర్గం ఏర్పాటు గురించి చర్చించనున్నారు. అన్ని వర్గాలకూ పెద్దపీట వేసేలా లింగాయత్ 5, ఒక్కళిగ 4, ఎస్సీ 3, ఎస్టీ 3, కురుబ, బ్రాహ్మణ, బిల్లవ కులాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. బలమైన నేతలకే చాన్స్ మంత్రివర్గంలో ఎవరికి చోటు ఇవ్వాలనే దానిపై ఢిల్లీ నుంచి డైరెక్షన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. వారి ఆదేశాల మేరకు యడియూరప్ప తరచూ జాబితా సవరించి తీసుకెళ్తున్నారు. శని, ఆదివారాల్లో జాబితాను ఖరారు చేసే అవకాశముంది. ప్రతిపక్షంలో కుమారస్వామి, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి సీనియర్ నేతలు ఉన్నందున వారిని ఢీకొనగలిగే నాయకుకే కేబినెట్లో చోటు దక్కుతుందని సమాచారం. తొలి విడతలో 20 మందికి పోస్టు లు కల్పించినా, ఇంకా 13 ఖాళీగా ఉంటాయి. అనర్హత ఎమ్మెల్యేలకు అవకాశం కోసం వాటిని కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. తొలివిడతలో వీరికేనా? గోవింద కారజోళ, కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక్, జగదీశ్ శెట్టర్, వి.సోమణ్ణ, జేసీ మాధుస్వామి, బి.శ్రీరాములు, ఉమేశ్ కత్తి, డాక్టర్ అశ్వర్థనారా యణ్, శశికళా జొల్లె, రేణుకాచార్య, సీటీ రవి, బాలచంద్ర జార్కిహోళి, శివనేగౌడనాయక్, అంగార, బోపయ్య, కోటా శ్రీనివాసపూజారి, జి.కరుణాకర్‌రెడ్డి తదితరులకు తొలివిడతలో మంత్రులుగా అవకాశం ఇస్తారని సమాచారం. -
గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా కేబినెట్లో ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరికి ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి పదవులు దక్కాయి. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మృదులా సిన్హా.. చంద్రకాంత్ కవ్లేకర్, జెన్నిఫర్ మొన్సర్రెట్, ఫిలిప్ నెరి రొడ్రిగ్స్‌తోపాటు బీజేపీకి చెందిన మైఖేల్ లోబోతో ప్రమాణం చేయించారు. 2017 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి లేని సమయంలో మనోహర్ పారికర్ ప్రభుత్వం ఏర్పాటులో జీఎఫ్‌పీ కీలకంగా నిలిచింది. బీజేపీపై జీఎఫ్‌పీ విమర్శలు కేబినెట్ నుంచి తమను తప్పించడం ద్వారా బీజేపీ మోసానికి పాల్పడిందని జీఎఫ్‌పీ అధ్యక్షుడు, మంత్రివర్గం నుంచి వైదొలగిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ ఆరోపించారు. ఆయన శనివారం దివగంత సీఎం మనోహర్ పారికర్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘పారికర్ రెండుసార్లు చనిపోయారు. భౌతికంగా మార్చి 17వ తేదీన ఒకసారి, రాజకీయ సిద్ధాంతాలను చంపడం ద్వారా నేడు మరోసారి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జీఎఫ్‌పీ విమర్శలను సీఎం తోసిపుచ్చారు. -
అమిత్‌షాతో గోవా సీఎం భేటీ
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. బీజేపీ 17 స్థానాలను, కాంగ్రెస్ 15 స్థానాలను గెలుచుకున్నాయి. గోవా ఫార్వర్డ్ పార్టీ సహా పలు స్వతంత్రుల మద్దతుతో కూటమిగా ఏర్పడి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో కూటమి పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకుంది. అభివృద్ధి కోసమే బీజేపీలోకి.. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామని చంద్రకాంత్ కవ్లేకర్ వెల్లడించారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉంటే తమ ప్రాంతాల అభివృద్ధి అసాధ్యమని ఆరోపించారు. -
నితీష్‌పై బీజేపీ ఎంపీ ఫైర్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ చాలా స్వార్థపరుడని బీజేపీ ఎంపీ గోపాల్ నారాయణ్ సింగ్ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో జేడీయూకు ఒక మంత్రి పదవిని ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని, ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు మంత్రివర్గంలో చేరేందుకు తిరస్కరిస్తున్నట్లు జేడీయూ ప్రకటించిందని తెలిపారు. నితీష్ నిర్ణయంతో తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడైన గోపాల్ నారాయణ్ సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ కేవలం తన ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారన్నారు. ఆయన చాలా స్వార్థపరుడని, తన సొంత ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. బీజేపీ మద్దతుతో ఏడేళ్ళపాటు బిహార్‌లో ప్రభుత్వాన్ని నితీష్ నడిపారని, పార్టీ కష్టకాలంలో బీజేపీని బయటకు తోసేశారని ఆయన విమర్శించారు. మంత్రి పదవుల కోసం మిత్ర పక్షాలేవీ కూడా నిరసనలు తెలియజేయడం లేదన్నారు. నితీష్ కుమార్ చర్యలను బిహార్ ప్రజలు చాలా నష్టపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మోదీ కేబినెట్లో జేడీయూకు కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించగా.. దీని పట్ల నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ మిత్రపక్షంగా బిహార్‌లో 17 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 16 సీట్లను కైవసం చేసుకుంది. ఈసారి మంచి ప్రాధాన్యత ఉన్న పోర్ట్‌ఫోలియో కలిగిన మంత్రి పదవులను జేడీయూ ఆశించింది. అయితే ఒక్క మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆపార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ గత ప్రభుత్వంలో కూడా నితీష్ పార్టీ ఎలాంటి పదవులను చేపట్టిన విషయం తెలిసిందే. -
తప్పులో కాలేసిన ఉమా భారతి!
న్యూఢిల్లీ: ప్రజలకు చేరువ కావాలనే తాపత్రయంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రాజకీయ నాయకులు తొందరపాటులో తెలిసి తెలియక తప్పులో కాలేస్తున్నారు. తాజాగా అలాంటి తప్పిదంలో కేంద్రమంత్రి ఉమాభారతి చిక్కుకున్నారు. మంత్రి పదవుల కేటాయింపులపై అధికార ప్రకటన వెలువడకుండానే ఉమాభారతి అత్యుత్సాహంతో తనకు జలవనరులు, గంగా ప్రక్షాలన మంత్రిత్వ శాఖను కేటాయించారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేసి ప్రోటోకాల్ ను ఉల్లంఘించారు. వెంటనే తప్పు తెలుసుకున్న ఉమాభారతి ట్విట్ ను తొలగించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మంత్రిత్వ శాఖ కేటాయింపుపై అధికార ప్రకటన రాకుండానే తాను ప్రకటన చేయడం తప్పిదమే.. అని ట్విట్ చేసింది. అంతేకాక తన సహాయకుడు రాజేశ్ కటియార్ తన పాస్ వర్డ్ తీసుకుని ట్వీట్ చేశారని కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆతర్వాత పోర్ట్ ఫోలియో గురించి ట్విట్ చేయడం ప్రోటోకాల్ ఉల్లంఘించడమే. అందుకు క్షమాపణలు కోరుతున్నాను అని ఉమా భారతి అకౌంట్ లో రాజేశ్ కటియార్ ట్విట్ చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై 'ఫైర్ బ్రాండ్' రాజకీయవేత్త విమర్శలకు గురయ్యారు. mere vibhag ki mujhe koi jankari nahi. mere sahayak rajesh katiyar ne mere password se galat twitt kiya hai. uske liye vo mafi mangege. — Uma Bharti (@umasribharti) May 26, 2014 मंत्रालय के बारे में मेरी गलती से ग़लत ट्वीट हो गया था, इसके लिए माफी माँगता हूं-राजेश कटियार — Uma Bharti (@umasribharti) May 26, 2014